బుజ్జి అభిమానిని సర్‌ప్రైజ్‌ చేసిన విజయ్ దేవరకొండ | Vijay Deverakonda Invite A Little Fan For Marriage Special Lunch, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

బుజ్జి అభిమానిని సర్‌ప్రైజ్‌ చేసిన విజయ్ దేవరకొండ

Mar 8 2026 7:50 AM | Updated on Mar 8 2026 1:12 PM

Vijay Devarakonda Invite a little fan for lunch

టాలీవుడ్‌ జోడీ  విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల పెళ్లి కొద్దిరోజుల క్రితం జరిగింది. వారి పెళ్లిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా స్వీట్స్‌ పంచడంతో పాటు పలు దేవాలయాల్లో అన్నదానం చేసి నెటిజన్ల చేత ప్రశంసలు అందుకున్నారు. ప్యాన్స్‌ కోసం ఒక స్టార్‌ హోటల్‌లో విందు ఏర్పాటు చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే, ఒక చిన్నారి విరోష్‌ జోడీపై అలిగి వీడియో చేసింది. తాను కూడా విజయ్‌కు పెద్ద అభిమానినే కదా పెళ్లికి పిలవచ్చు కదా.. ఎందుకు పిలువలేదు.  లడ్డూలు ఇవ్వచ్చు కదా అంటూ ఎంతో క్యూట్‌గా వీడియోతో రిక్వెస్ట్‌ చేసింది. 

విజయ్‌ నుంచి పిలుపు
విజయ్‌ దేవరకొండపై అభిమానంతో ఆ చిన్నారి చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అయింది. ఏకంగా పది మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా రౌడీబాయ్‌ విజయ్‌ రియాక్ట్‌ అయ్యారు. తన వీడియో కింద కామెంట్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశారు. 'బుజ్జి తల్లి మా ఇంటికి రండి. మీకు నచ్చిన ఫుడ్‌, స్వీట్స్‌ ఎంటో నాకు చెప్పు. నీ కోసం ప్రత్యేకంగా ఇంట్లోనే చేపిస్తాను. ఇద్దరం కలిసి ఇక్కడే లంచ్‌ చేద్దాం.' అంటూ విజయ్‌ రిప్లై ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement