సినిమాల కౌంట్ ఫుల్.. కలెక్షన్ నిల్ | Ten Movies Released But Box office collections are nil in tollywood | Sakshi
Sakshi News home page

సినిమాల కౌంట్ ఫుల్.. కలెక్షన్ నిల్

Mar 7 2026 11:50 PM | Updated on Mar 8 2026 12:04 AM

Ten Movies Released But Box office collections are nil in tollywood

వీకెండ్‌కి టాలీవుడ్‌లో ఒకేసారి 10 సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఒక్కటీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లు వెలవెలబోతూ, బుక్ మై షోలో టికెట్ల అమ్మకాలు పెద్దగా జరగట్లేదు. ఇటు చూస్తే ప్రచారం మాత్రం హోరెత్తిపోతోంది. ఎక్స్ ఓపెన్ చేస్తే చాలు సినిమాల సందడి. ఇనస్టాగ్రామ్ తెరిస్తే చాలు రీల్స్ రీల్స్ తో ప్రచారం హోరెత్తింది.

గివ్-ఎవే పేరిట ఉచిత పొందిన వారు మాత్రమే మొహమాటానికి ట్వీట్లు వేస్తున్నారు. థియేటర్లలో మాత్రం ప్రేక్షకులు కనిపించడం లేదు. వచ్చిన సినిమాల్లో శ్రీవిష్ణు సినిమా ప్రయత్నమైతే గట్టిదే. నిలబడుతుందని ఊహించారు, కానీ కలెక్షన్ పరంగా ఏ మేరకు చేస్తుందో చూడాలి.  

సరస్వతి సినిమా పెద్దగా చప్పుళ్లు చేయలేదు. ప్రచారం గట్టిగా చేసిన సంప్రదాయిని సుప్పిని.. సినిమా అంతగా పరిస్థితి కూడా అంతే. మిగతా సినిమాల పేర్లు కూడా గుర్తు పెట్టుకోవడం కష్టమే. వీకెండ్‌ అయినప్పటికీ థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. వచ్చే వారం కూడా పెద్దగా మార్పు ఉండదని అంచనా. ఎందుకంటే మరో 11 రోజులు తర్వాత పెద్ద సినిమా విడుదల కానుంది.  

Advertisement
 
Advertisement
Advertisement