భార్యకు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్ | Allu Arjun Gifts Benz Car Wife Sneha Reddy | Sakshi
Sakshi News home page

Allu Arjun: బహుమతిగా బెంజ్ కారు.. ఎ‍న్ని కోట్ల ఖరీదంటే?

Mar 7 2026 8:33 PM | Updated on Mar 7 2026 8:33 PM

Allu Arjun Gifts Benz Car Wife Sneha Reddy

అల్లు అర్జున్.. తన భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. పెళ్లిరోజు సందర్భంగా కారుని గిఫ్ట్‌గా ప్రెజెంట్ చేశాడు. నిన్ననే ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి. అయితే బన్నీ.. తన తమ్ముడు శిరీష్‌కి ఈ కారుని పెళ్లి కానుకగా దీన్ని ఇచ్చాడని చాలామంది అనుకున్నారు. కానీ పెళ్లిరోజు సందర్భంగా భార్యకు దీన్ని ఇచ్చినట్లు తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్)

ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. 2011లో స్నేహని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అయాన్, అర్హ అని పిల్లలు ఉన్నారు. శుక్రవారం(మార్చి 06) వీళ్ల పెళ్లిరోజు. ఈ క్రమంలోనే భార్యకు విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. ఇదే రోజున అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ కూడా నయనికతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడం విశేషం.

అయితే పెళ్లిరోజున అల్లు అర్జున్ తన భార్యకు విషెస్ చెప్పడంతో పాటు బెంజ్ ఏఎమ్‌జీ మోడల్ కారుని బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మోడల్ కారు ధర రూ.4-5 కోట్ల మధ్యనే ఉంది. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఒకటి చేస్తున్నాడు. దీని షూటింగ్ సాగుతోంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్‌తోనూ ఓ మూవీ కమిట్ అయ్యాడు. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఈ ఏడాది ద్వితియార్థంలో షూటింగ్ మొదలుపెట్టొచ్చు.

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!)

Advertisement
 
Advertisement
Advertisement