wedding anniversary
-
ముకేశ్ అంబానీ 40వ పెళ్లి రోజు.. బంగారు రంగు కేక్.. దానిపై అన్నీ అవే!
భారతీయ కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ.. ఈ నెలలో తన భార్య నీతా అంబానీతో 40వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీరి ఓ ప్రత్యేకమైన కేక్ తయారు చేశారు. 30 కేజీల బరువున్న ఈ కేక్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ప్రత్యేకమైన కేక్ చూడవచ్చు. ఈ కేక్ మీద సింహాలు, జిరాఫీలు, ఏనుగులు, మొసళ్ళు వంటి వివిధ జంతువుల ఆకారాలు బంగారు రంగులో ఉండటం చూడవచ్చు. జామ్‌నగర్‌లోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమయిన వంతారాను ప్రేరణగా తీసుకుని ఈ కేక్ మీద జంతువుల బొమ్మలు చిత్రించారు.కేక్ మధ్యలో నీతా, ముకేశ్ అంబానీల మొదటి అక్షరాలు ఉన్నాయి. పై భాగంలో వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ఉండటం చూడవచ్చు. దీనిని ముంబైలోని ప్రముఖ బేకరీ డెలిసియాను నడుపుతున్న బంటీ మహాజన్ తయారు చేశారు.వంతారాఅనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Deliciae by Bunty Mahajan (@delcakes.in) -
అల్లు అర్జున్, స్నేహరెడ్డిల బంధానికి 14 ఏళ్లు.. ఈ ఫోటోలు చూశారా..?
-
ప్రతిరోజు నీ ప్రేమలో.. భార్య గురించి మనోజ్ అలా (ఫొటోలు)
-
'ప్రేమలు' నటి భర్త పోలీస్ ఆఫీసరా? పెళ్లిరోజు క్యూట్ పోస్ట్ (ఫొటోలు)
-
అత్త-మామ పెళ్లిరోజు వేడుకల్లో చరణ్-ఉపాసన (ఫొటోలు)
-
విమానంలో వివాహ వేడుక.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి తన వివాహా వార్షికోత్సవాన్ని చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. విమానంలో తన సన్నిహితులు, స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. ఫ్టైట్‌లో దుబాయ్ వెళ్తూ తమ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నామని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఈ వేడుకల్లో అక్కినేని నాగార్జున, అమల దంపతులు కూడా ఉన్నారు. తాజాగా చిరు తమ పెళ్లి రోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..' ప్రియమైన స్నేహితులతో కలిసి విమానంలో మా వివాహ వార్షికోత్సవాన్ని చాలా జరుపుకుంటున్నాం. సురేఖ లాంటి డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఆమె నా బలం, నా యాంకర్ కూడా. ప్రపంచంలోని అద్భుతమైన నాకు తెలియని వాటిని నావిగేట్ చేయడానికి ఎల్లప్పుడూ సహాయం చేస్తుంది. తను నా పక్కన ఉంటే సౌకర్యంతో పాటు అద్భుతమైన ప్రేరణ కూడా. ఈ సందర్భంగా నా సోల్‌మేట్ సురేఖకు ధన్యవాదాలు. నీ పట్ల నాకున్న ప్రేమ, అభిమానాన్ని తెలియజేయడానికి ఇలాంటివీ మరిన్నీ సందర్భాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార్ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. Celebrating our wedding anniversary on a flight with some very dear friends en route Dubai ! 🎉I always feel I am very fortunate to have found a dream life partner in Surekha. She is my strength, my anchor and the wind beneath my wings. Always helps me navigate through the… pic.twitter.com/h4gvNuW1YY— Chiranjeevi Konidela (@KChiruTweets) February 20, 2025 -
బుజ్జి.. ఇక పోట్లాడుకుంది చాలు.. ఇప్పటికైనా..! (ఫోటోలు)
-
తెలుగు బుల్లితెర నటి విష్ణు ప్రియ పెళ్లి రోజు (ఫోటోలు)
-
ఎప్పటికీ నీతోనే.. నమ్రతకు మహేశ్ లవ్ నోట్
సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్. ఇప్పటికే చాలా మంది హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిలో కొంతమంది మాత్రమే ఇప్పటికీ కలిసి సంతోషంగా ఉంటున్నారు. అలాంటి వారిలో మహేశ్-నమ్రత జంట ఒకటి. పెళ్లయి ఏళ్లు గడుస్తున్న ఇప్పటి వరకు ఈ జంటపై చిన్న రూమర్ కూడా రాలేదంటే.. ఎంత అనోన్యంగా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. నేడు(ఫిబ్రవరి 10) ఈ బ్యూటిఫుల్ కపుల్ 20వ పెళ్లి రోజు. ఈ సందర్భంగా తన సతీమణికి సోషల్ మీడియా వేదికగా యానివర్సరీ విషెస్ తెలియజేశాడు మహేశ్. ‘నువ్వు, నేను.. అందమైన 20 వసంతాలు. ఎప్పటికీ నీతోనే నమ్రత..’ అంటూ నమ్రత, తను కలిసి ఉన్న నవ్వుతున్న ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మహేశ్ అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు మహేశ్-నమ్రత జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమా కలిపిందిమహేశ్ బాబు, నమ్రతలను ఒక్కటి చేసింది ఓ సినిమా. వీరిద్దరు జంటగా వంశీ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మనసులు కలిశాయి. ఓసారి ఈ సినిమా అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది.నమ్రత మహేశ్ కంటే నాలుగేళ్లు పెద్ద. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. వంశీ సినిమా షూటింగు తొలిచూపులోనే మహేశ్‌ను ఇష్టపడింది. న్యూజిలాండ్ షెడ్యూల్ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారు. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 2005లో తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా వీరి పెళ్లి జరిగింది. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
రిషబ్ శెట్టి, ప్రగతిల పెళ్లిరోజు.. ప్రత్యేకమైన ఫోటోలు షేర్ చేసిన జోడి
-
శ్రీమంతుడు విలన్ రెండో పెళ్లి.. భార్యకు స్పెషల్ విషెస్ (ఫొటోలు)
-
క్రికెటర్ షోయబ్ మాలిక్ రెండో పెళ్లి.. మ్యారేజ్ డే పిక్స్ షేర్ చేసిన నటి సనా జావెద్ (ఫోటోలు)
-
జైలర్ మూవీ కమెడియన్‌తో నటి పెళ్లి.. అదే నాన్న చివరి కోరిక (ఫోటోలు)
-
వావ్, వావ్..యానివర్సరీ వీక్ అంటే ఇలా, మంచు పూల జల్లుల్లోన (ఫోటోలు)
-
హ్యాపీ 9 బేబీ.. అన్నింటిలోనూ నువ్వు బెస్ట్: రోహిత్ శర్మపై భార్య రితిక పోస్ట్(ఫొటోలు)
-
వెడ్డింగ్ డే మూడ్: మాల్దీవుల్లో హన్సిక మోత్వానీ జిల్జిల్ జిగా (ఫోటోలు)
-
నీలాంటి భర్త దొరకడం చాలా అదృష్టం.. తెగ సంబరపడిపోతున్న హీరోయిన్!
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ. గతేడాది నవంబర్‌లో తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించాడు. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది అమలాపాల్.అయితే తాజాగా తన భర్తతో కలిసి మొదటి వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఏకంగా నది మధ్యలో తన భర్తతో కలిసి వేడుక జరుపుకుంది. ఇది నా జీవితంలో మరిచిపోలేని ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుందని తెలిపింది. నన్ను ఎంతో ప్రేమ, ఆత్మీయతలతో చూసుకునే భర్త దొరకడం నా అదృష్టమని ఇన్‌స్టాలో వీడియోను పోస్ట్ చేసింది. మీరు నాకు ప్రపోజ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు చూపిస్తున్న ప్రేమలో నిజాయితీ కనిపిస్తోందన్నారు. నువ్వు ఇచ్చే సర్ప్రైజ్లు జీవితాంతం గుర్తుంటాయని పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట తెగ వైరలవుతోంది.(ఇది చదవండి: కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్)కాగా.. తమిళ సినిమాలతో హీరోయిన్గా పరిచయమైన అమలాపాల్.. టాలీవుడ్లో అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లో అమలాపాల్ హీరోయిన్గా చేసింది. కానీ ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైపోయింది. ఈ ఏడాది ఆడు జీవితం, లెవెల్ క్రాస్ చిత్రాలతో మెప్పించింది. మొదట తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల బంధం నిలబడలేదు. మూడేళ్లకే విడిపోయారు. అలా 2017 నుంచి ఒంటరిగానే ఉంది. గతేడాది మాత్రం జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జూన్‌లో కొడుకు పుట్టాడు. అతడికి ఇళయ్ అని పేరు పెట్టింది. గతంలో ఓనం సందర్భంగా కొడుకు ఫేస్ రివీల్ చేసింది అమలాపాల్. నదిలో పడవలో కొడుకు-భర్తతో కలిసి క్యూట్ పోజులిచ్చింది. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
పెళ్లి రోజు స్పెషల్.. భర్తతో హన్సిక లవ్లీ పోస్ట్ (ఫొటోలు)
-
అమ్మచీర చుట్టి..వెడ్డింగ్ యానివర్సరీ ఫోటోషూట్
-
పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, తన భార్య సుధామూర్తి నెట్‌ఫ్లిక్స్ షో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో స్టార్ గెస్ట్లుగా పాల్గొన్నారు. అందులో తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నారు. నారాయణ మూర్తి తన 25వ వివాహ వార్షికోత్సవం రోజున సుధామూర్తికి శుభాకాంక్షలు తెలపడం మరిచిపోయానన్నారు.‘ఒకరోజు నేను ఆఫీస్‌కు బయలుదేరుతుండగా సుధ ఉదయం నా దగ్గరకు వచ్చి ఈ రోజు ఏదైనా ప్రత్యేకత ఉందా? అని అడిగింది. ఏమీలేదు అని జవాబిచ్చాను. ఆఫీస్ నుంచి కారులో ఇంటికి వస్తుండగా మళ్లీ ఈరోజు ప్రత్యేకతేంటో ఆలోచించారా? అని అడిగింది. ఏమీలేదని అదే సమాధానం చెప్పాను. నేను ఆ తర్వాతిరోజు ముంబయిలో ఒక సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. నేను ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి విమానం ఎక్కుతుండగా నా కూతురు అక్షత(బ్రిటన్ మాజీ ప్రధాని రిషీసునాక్ భార్య) నుంచి కాల్ వచ్చింది. ఏం చేస్తున్నారు? అని అడిగింది. ఫ్లైట్ ఎక్కుతున్నాను అని సమాధానం ఇచ్చాను. వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. వేరే విమానం ఎక్కి బెంగళూరు వెళ్లండని చెప్పింది. అమ్మకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పండని తెలిపింది. మీరు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశానికి హాజరు అవ్వాల్సి ఉంది. వీలైతే మీరు ప్రైవేట్ విమానాన్ని అద్దెకు తీసుకోండి. కానీ అమ్మకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పాల్సిందేనని పట్టుపట్టింది’ అని నారాయణమూర్తి చెప్పారు.ఇదీ చదవండి: మస్క్ ‘ఫోరమ్ షాపింగ్’! ట్రంప్‌తో దోస్తీ ఇందుకేనా..?సుధామూర్తి నవ్వుతూ ‘అది మా 25వ వివాహ వార్షికోత్సవం. కొంత ప్రత్యేకంగా ఉండాలనుకున్నాను. నా భర్త ఆ విషయాన్ని మరిచిపోయేసరికి ఐదు-పది నిమిషాల పాటు కొంత బాధ అనిపించింది. కానీ ఆయన పనితీరు నేను అర్థం చేసుకుంటాను. కాబట్టి ఇలాంటి విషయాలు అంతగా పట్టించుకోను. కానీ, ఈ విషయంలో నా కూతురు చాలా కలత చెందింది’ అని చెప్పారు. -
మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య
మెగాకపుల్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠికి అప్పుడే పెళ్లయి ఏడాది అయిపోయింది. దీంతో స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి ఆనందంగా గడిపిన క్షణాల్ని అద్భుతంగా క్యాప్చర్ చేశారు. వాటన్నింటిని ఒకటిన్నర నిమిషంలోనే చాలా చక్కగా చూపించారు.(ఇదీ చదవండి: దీపావళికి నాలుగు కొత్త సినిమాలు.. ఏది ఎలా ఉందంటే?)వరుణ్ తేజ్.. లావణ్య గురించి చెప్పడం, అలానే లావణ్య.. వరుణ్ని 'హే మిస్టర్' అని పిలవడం లాంటి విజువల్స్ బాగున్నాయి. ఈ వీడియోలోనే హల్దీ, పెళ్లికి సంబంధించిన అన్నింటినీ చూపించేశారు. అల్లు అర్జున్-రామ్ చరణ్ కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేయడం లాంటివి కూడా భలే అనిపించాయి.రీసెంట్గా వెకేషన్ కోసం ఫ్యామిలీతో కలిసి వరుణ్-లావణ్య స్విట్జర్లాండ్ వెళ్లి వచ్చారు. దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అలానే పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా భార్యకు వరుణ్ విషెస్ కూడా చెప్పాడు. సరే ఇదంతా పక్కనబెడితే వరుణ్ లేటెస్ట్ మూవీ 'మట్కా'. ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది. దీనిపై ఈ మెగా హీరో బోలెడు ఆశలు పెట్టేసుకున్నాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)A love story written in the stars! ✨💖Relive the magical moments of Mega Prince @IAmVarunTej and @Itslavanya's wedding day with a special video 😍Happy Wedding Anniversary to the Lovely Couple and Here’s to a lifetime of happiness together 🫶#VarunTej #LavanyaTripathhi pic.twitter.com/UnVQizu9s6— Filmy Bowl (@FilmyBowl) November 1, 2024 -
భర్తకు ప్రేమగా తినిపించిన కాజల్, అలాగే కలిసి తాగుతూ (ఫోటోలు)
-
నా హృదయంలో చోటిస్తే.. తన జీవితాన్నే ఇచ్చేశాడు: పూర్ణ (ఫోటోలు)
-
మాల్దీవుస్‌లో పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్..!
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను ప్రేమ వివాహం చేసుకుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుగ గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ ఉన్న వీరిద్దరు చివరికీ ఏడడుగులు వేశారు.(ఇది చదవండి: పెళ్లై నెల కాలేదు.. భర్తతో కాకుండా మరొకరితో హనిమూన్ ఎంజాయ్)ఇటీవల తమ మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు ఈ జంట. ఈ సందర్భంగా పరిణితీ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన భర్త రాఘవ్‌తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీరిద్దరూ మాల్దీవుస్‌లో తమ మొదటి పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by @parineetichopra -
ఒకే మాట, ఒకే బాట.. అందమైన జంట
-
భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్- దేవిషా పెళ్లి రోజు నేడు (ఫోటోలు)
-
హీరోయిన్ మొదటి వివాహ వార్షికోత్సవం.. దాదాపు ఐదు నెలల తర్వాత!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేసింది కొద్ది సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది జనవరి 23న టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను పెళ్లాడింది ముద్దుగుమ్మ. వీరిద్దరికీ పెళ్లి జరిగి ఇప్పటికే ఏడాదిన్నర కావొస్తోంది. అయితే ఈ జంట మొదటి వివాహా వార్షికోత్సవానికి సంబంధించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటికి రాలేదు.అయితే దాదాపు ఐదు నెలల తర్వాత అతియా, రాహుల్ మొదటి వివాహా వార్షికోత్సవ ఫోటోలు నెట్టింట లీక్ అయ్యాయి. వేడుక జరిగిన హోటల్ నిర్వాహకులు వీరిద్దరి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ అద్భతమైన క్షణాలను ఇకపై సీక్రెట్‌గా ఉంచడం సాధ్యం కావడం లేదంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అతియా, కేఎల్ రాహుల్ క్యాండిల్‌లైట్ డిన్నర్, చెఫ్ టీమ్‌తో ఫోటోలకు పోజులిచ్చారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే అతియా శెట్టి చివరిసారిగా 2019లో వచ్చిన చిత్రం 'మోతీచూర్ చక్నాచూర్'లో కనిపించింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఆమె మొదట 2015లో 'హీరో' మూవీ ద్వారా సూరజ్ పంచోలి సరసన బాలీవుడ్లో అడుగుపెట్టింది. అర్జున్ కపూర్ నటించిన 'ముబారకన్' సినిమాలో అతియా కీలక పాత్ర పోషించింది. View this post on Instagram A post shared by The Private Chefs Club (@theprivatechefsclub) -
Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్ భార్యను చూశారా? (ఫోటోలు)
-
తండ్రికి విషెస్ చెప్పిన సీతారామం హీరో.. పోస్ట్ వైరల్!
సీతారామం మూవీతో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. అంతేకాదు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రంలో గుంటూరుకారం భామ మీనాక్షి చౌదరి అతనికి జంటగా కనిపించనుంది. తాజాగా దుల్కర్ సల్మాన్ తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఇవాళ తన తల్లిదండ్రులు మమ్ముట్టి, సల్ఫత్ 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా విషెస్ తెలిపారు. వారి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అంతే కాకుండా తన పేరేంట్స్ గురించి ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దుల్కర్ ఇన్స్తాలో రాస్తూ..'మీ ఇద్దరి 45 ఏళ్లబంధం ప్రపంచ లక్ష్యాలను అందిస్తున్నాయి. మీ సొంత మార్గాల్లో మికోసం చిన్న ప్రపంచాన్ని సృష్టించారు. మీలో నేను భాగమై మీ ప్రేమను పొందడం నా అదృష్టం. హ్యాపీ వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మా, నాన్న! మీరిద్దరూ కలిసి అత్యంత అసాధారణమైన వాటిని కూడా సాధిస్తారు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమాల విషయానికొస్తే నందమూరి బాలకృష్ణ, కెఎస్ రవీంద్రతో కాంబోలో వస్తోన్న చిత్రంలో దుల్కర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించనున్నారు. మరోవైపు దుల్కర్ సూరారై పొట్రు దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తోన్న పురాణనూరు చిత్రానికి సంతకం చేసినట్లు కూడా ప్రకటించారు. View this post on Instagram A post shared by Dulquer Salmaan (@dqsalmaan) -
Chinmayi Sripada And Rahul Ravindran: సింగర్ చిన్మయి శ్రీపాద వివాహ వార్షికోత్సవం.. అరుదైన ఫోటోలు
-
అల్లు అర్జున్ పెళ్లి రోజు.. భార్యతో ఈ క్యూట్ ఫొటోలు చూశారా?
-
అల్లు అర్జున్ పెళ్లి రోజు... భార్య గురించి క్యూట్ పోస్ట్
'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా సూపర్‌స్టార్ అయిపోయిన అల్లు అర్జున్.. ఇప్పుడు దీని సీక్వెల్‌తో బిజీగా ఉన్నాడు. ఆగస్టు రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి షూటింగ్ యమ ఫాస్ట్‌గా సాగుతోంది. ఓవైపు మూవీ చేస్తూనే మరోవైపు కుటుంబంతోనూ బన్నీ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన పెళ్లి రోజు సందర్భంగా భార్య స్నేహారెడ్డి గురించి అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. (ఇదీ చదవండి: మళ్లీ థియేటర్లలోకి ఉదయ్ కిరణ్.. కల్ట్ సినిమా రీ రిలీజ్ ఎప్పుడంటే?) నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అర్జున్.. హీరోగా క్రమక్రమంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. డిఫరెంట్ సినిమాలు చేస్తూ తెలుగుతో పాటు మలయాళంలోనూ ఫేమ్ సంపాదించాడు. 'పుష్ప' మూవీతో మాత్రం పాన్ ఇండియా రేంజులో క్రేజ్ దక్కించుకున్నాడు. ఇకపోతే 2011లో స్నేహారెడ్డిని పెళ్లి చేసుకోగా.. వీళ్లకు అయాన్, అర్హ పుట్టారు. ఇకపోతే తన 13వ పెళ్లి రోజు సందర్భంగా భార్యని బన్నీ తెగ పొగిడేశాడు. 'మన పెళ్లయి 13 ఏళ్లయిపోయింది. నేను ఇలా ఉండటానికి నీతో బంధమే కారణం. నీ ప్రశాంతత నుంచి నాకు బోలెడంత శక్తిని ఇచ్చావ్. మరెన్నో వార్షికోత్సవాలు ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ యానివర్సరీ క్యూటీ' అని అల్లు అర్జున్, భార్యతో కలిసున్న ఫొటో పోస్ట్ చేసి క్యూట్ ఇన్ స్టా స్టోరీ పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్..) -
వారి లోటును భర్తీ చేయలేను.. కానీ మాటిస్తున్నా: మంచు మనోజ్ ఎమోషనల్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న మంచులక్ష్మి నివాసంలో జరిగిన వివాహా వేడుకకు మోహన్‌బాబు కూడా హాజరై ఈ జంటను అభినందించారు. తాజాగా తమ మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మనోజ్ తన భార్యకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..'నా ప్రియమైన భార్య భూమా మౌనికకు మొదటి వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రతి రోజు ప్రేమ, ఆనందంతో నిండిన అద్భుతమైన ప్రయాణమిది. ధైరవ్, మనకు పుట్టబోయే బిడ్డ కోసం ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీ ఉనికి నా జీవితాన్ని ప్రేమ, సాంగత్యంతో అసాధారణంగా మార్చేసింది. మీ తల్లిదండ్రుల లోటును ఎన్నటికీ భర్తీ చేయలేనప్పటికీ.. వారి జీవితంలో అత్యంత విలువైన వారిని సంరక్షిస్తానని వాగ్దానం చేస్తున్నా. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మిమ్మల్ని కాపాడతానని మాటిస్తున్నా. ఇక్కడ మాకు, మా కుటుంబానికి అనేక మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా నా భార్యమణికి పెళ్లి రోజు శుభకాంక్షలు. మీరు నా హృదయం, ఆత్మలో అత్యంత విలువైన భాగం. ఇప్పటికీ, ఎప్పటికీ నిన్ను ప్రేమించే మను' అంటూ లవ్ సింబల్‌ను పోస్ట్ చేశారు. కాగా.. ఇటీవలే మౌనిక ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ఏడాదిలోనే మనోజ్- మౌనిక తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు. మౌనిక సైతం పెళ్లి రోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. Happy Anniversary to my beloved wife @bhumamounika . Every day with you is a cherished journey, filled with love and joy. I am deeply grateful to God for you, Dhairav, and our little one on the way this May. 🙌🏽 Your presence has transformed my life into an extraordinary… pic.twitter.com/vQtos5jyTx — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2024 -
న్యూజిలాండ్‌లో భార్య వెరోనికాతో మంచు విష్ణు సందడి (ఫొటోలు)
-
వెడ్డింగ్ యానివర్సరీ : మహేష్‌కు, నమ్రత విషెస్, వైరల్ పోస్ట్
టాలీవుడ్లో మోస్ట్ లవబుల్ అండ్ బెస్ట్ పవర్ కపుల్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ గుర్తొస్తారు. ఈ రోజు వారి 19వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నమ్రతా ఒక అందమైన పప్పీల జంట వీడియోతో అందంగా విషెస్ చెప్పింది. దీంతో ఫ్యాన్స్ అంతా శుభాకాంక్షలతో సందడి చేస్తున్నారు. ఫిబ్రవరి 10, 2005న ఈ లవబర్డ్స్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ముద్దుల తనయ సితార తనదైన స్టయిల్లో దూసుకుపోతూ ఘట్టమనేని కుటుంబ వారసత్వాన్ని నిలబెడుతోంది. అంటు గౌతమ్ కూడా భిన్న రంగంలో తానేంటో నిరూపించుకున్నాడు. కరీయర్ పీక్ స్టేజ్‌లో ఉండగా పెళ్లి చేసుకున్న నమ్రత ప్రస్తుతం నటనకు గుడ్‌బై చెప్పి కుటుంబ జీవితంపై దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికపుడు విశేషాలను పంచుకుంటూ ఉంటుంది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
భార్యను పెళ్లి చేసుకున్న నటుడు.. అసలు కారణం ఇదే!
బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్(58) మరోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. తన భార్య నీలం బోస్ రాయ్‌ను రెండోసారి వివాహాం చేసుకున్నారు. ఈ వేడుక గోవాలోని ఓ ఆలయంలో జరిగింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను నటుడు తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. రెండోసారే కాదు.. వెయ్యి సార్లైనా నిన్నే పెళ్లి చేసుకుంటా అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. అయితే వీరిద్దరికి పెళ్లై ఇప్పటికీ 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా వివాహా వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో రెండోసారి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. మరోసారి తన భార్య నీలం బోస్ రాయ్‌ను పెళ్లి చేసుకుని మధురమైన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. కాగా.. రోనిత్, నీలం పెళ్లికి ముందు మూడేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత 2003లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by Ronit Roy (@ronitboseroy) -
ఒకే రోజున టీమిండియా క్రికెటర్ల వివాహ వార్షికోత్సవం (ఫొటోలు)
-
Yadammaraju-Stella: యాదమ్మరాజు- స్టెల్లా దంపతుల బంధానికి ఏడాది, స్పెషల్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
రోహిత్ శర్మ,రితిక వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)
-
మనసంతా నువ్వే.. నీపై నా ప్రేమ అనంతం.. కోహ్లి పోస్ట్ వైరల్
Virat Kohli- Anushka Sharma Cut Cake On Their 6th Wedding Anniversary: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మపై ప్రేమను చాటుకున్నాడు. ‘‘నా మనసంతా నువ్వే... నీపై నా ప్రేమ అనంతం’’ అన్న చందంగా ఎమోజీలతో భార్య పట్ల తన భావాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా తమ పెళ్లిరోజు ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడీ రన్‌మెషీన్. కాగా రికార్డుల రారాజు విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ 2017లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. చాలా ఏళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట డిసెంబరు 11న ఇటలీలోని టస్కనీలో పెళ్లితో ఒక్కటయ్యారు. నాడు.. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇరు కుటుంబాల అంగీకారంతో అగ్ని సాక్షిగా.. అనుష్క నుదిటిన సింధూరం దిద్ది భార్యగా ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించాడు కోహ్లి. పబ్లిసిటీకి దూరంగా అప్పటి నుంచి విరుష్క జోడీ మరింత పాపులర్ అయింది. ఇక పెళ్లినాటికే విరాట్ టీమిండియా కెప్టెన్‌గా.. అనుష్క కూడా బీ-టౌన్లో హీరోయిన్గా ఉన్నత స్థాయిలో ఉన్నారు. అయినప్పటికీ పబ్లిసిటీకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను సీక్రెట్‌గా ప్లాన్ చేసుకున్నారు. ఇక వివాహ సమయంలో విరుష్క సవ్యసాచి డిజైన్ చేసిన పేస్టల్ కలర్ సంప్రదాయ దుస్తులు ధరించారు. పంజాబీ సంప్రదాయ పద్ధతిలో విరాట్ అనుష్కను పెళ్లాడాడు. వీరి పరిణయం సందర్భంగా పంజాబీ సింగర్ హర్ష్‌దీప్ కౌర్ తన గాత్రంతో అద్భుతమైన పాటను ఆలపించింది. ‘పీర్ వి తూ’(పవిత్రమైన ప్రేమ అన్న అర్థంలో) అంటూ సాగే ఈ గీతం విరుష్క జోడీకి చక్కగా సరిపోయిందంటూ అప్పట్లో ప్రశంసలు కురిశాయి. ఇక విరాట్ -అనుష్క ఆరో పెళ్లి రోజు సందర్భంగా హర్ష్‌దీప్ కౌర్ మరోసారి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. అనుష్క సైతం తమ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా విరుష్క జంటకు కుమార్తె వామిక సంతానం. సౌతాఫ్రికా టూర్‌తో రీఎంట్రీ ఇక వన్డే వరల్డ్‌కప్-2023 టాప్ రన్ స్కోరర్ విరాట్ కోహ్లి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. డిసెంబరు 26 నుంచి టీమిండియా- సౌతాఫ్రికా ఆడబోయే తొలి టెస్టులో అతడు భాగం కానున్నాడు. మరోవైపు అనుష్క రెండోసారి గర్భం దాల్చిందని.. విరుష్క జోడీ రెండోసారి తల్లిదండ్రులు కానున్నానరే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Harshdeep Kaur (@harshdeepkaurmusic) View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
Vicky-Katrina: కత్రినా-విక్కీ పెళ్లి వార్షికోత్సవ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వందేళ్ల పెళ్లి సంబరం
-
ఇవి నా సంతోషకరమైన కన్నీళ్లు అంటూ భార్య ఫోటో షేర్ చేసిన శివకార్తికేయన్
శివకార్తికేయన్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తన భార్య ఆర్తి కోసం ఒక అందమైన సందేశాన్ని పంచుకున్నారు. నటుడు శివకార్తికేయన్-ఆర్తి జంట ఈరోజు 13వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు, ఉదయం నుండి చాలా మంది వారికి శుభాకాంక్షలు తెలిపారు.రెమో, డాక్టర్, డాన్ లాంటి సినిమాలతో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగ ఆయన 13వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. దీంతో ఆయన అభిమానులతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (ఇదీ చదవండి; శేఖర్ మాస్టర్ విషయంలో చాలా బాధపడ్డాను: శ్రీలీల) కోలీవుడ్‌లో విజయ్ టీవీ ద్వారా బుల్లితెరపై తన ప్రయాణాన్ని ప్రారంభించి వెండితెరపై విజయవంతంగా అడుగుపెట్టిన నటుడు శివకార్తికేయన్ తన ఎదుగుదలతో యావత్ సినీ ప్రపంచం వెనక్కి తిరిగి చూసేలా చేశాడు. ఒకవైపు తన డ్రీమ్ వైపు పయనిస్తున్న నటుడు శివకార్తికేయన్ అదే సమయంలో 2010 ఆగస్టు 27న తన బంధువైన ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. శివకార్తికేయన్-ఆర్తి దంపతులకు ఒక కుమార్తెతో పాటు కుమారుడు ఉన్నారు. వారిద్దరూ కూడా తమ ఫ్యామిలీ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 13 సంవత్సరాల వైవాహిక జీవితం తన 13వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న శివకార్తికేయన్ తన భార్య ఆర్తి కోసం తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక అందమైన సందేశాన్ని పంచుకున్నాడు. తన భార్యతో కలిసి దిగిన సంతోషకరమైన ఫోటోను 'ఇవి నా సంతోషకరమైన కన్నీళ్లు... విష్ హ్యాపీ వెడ్డింగ్ డే' అంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంలో, శివకార్తికేయన్ అభిమానులు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తున్నారు శివకార్తికేయన్ ప్రయాణం మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన శివకార్తికేయన్, బుల్లితెరపై పాపులర్ హోస్ట్‌గా ఉంటున్న సమయంలోనే మెరీనా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్లో వచ్చిన '3' సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత కేడి బిల్లా కిల్లాడి రంగా, మనంకోటి పక్షి, ఒప్పో నెచ్చిల వంటి హిట్లతో అంచెలంచెలుగా అభిమానులను సంపాదించుకున్నాడు. 2016లో రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు తదుపరి సినిమా ఏమిటి? సూపర్‌హిట్ చిత్రాలను అందిస్తూ అంచెలంచెలుగా తమిళ చిత్రసీమలో టాప్ స్టార్లలో ఒకరిగా ఎదిగిన శివకార్తికేయన్ తెలుగు పరిశ్రమలో కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం ఎస్కె 23 సినిమాపై దృష్టి సారించాడు. ఇంతకుముందు శివకార్తికేయన్-అదితి శంకర్ నటించిన మావీరన్ సూపర్ హిట్ అయ్యి 100 కోట్లు దాటింది. 'మండేలా' దర్శకుడు మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన మావీరన్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Sivakarthikeyan Doss (@sivakarthikeyan) -
ఆ క్షణాలు అద్భుతం.. ఉపాసన ట్వీట్ వైరల్!
టాలీవుడ్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఈ జంట ఒకరు. అయితే ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలైలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్షణ కోసం మెగా కుటుంబసభ్యులు, ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వీరికి పెళ్లి జూన్ 14 2012న జరిగింది. ఈ జంటకు పెళ్లై దాదాపు 11 ఏళ్లు పూర్తి కాగా.. ఈ సందర్భంగా ఉపాసన ట్వీట్ చేసింది. (ఇది చదవండి: ఉపాసనకు ప్రెగ్నెన్సీ.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్!) ఉపాసన ట్వీట్ చేస్తూ 'గడిచిన 11 ఏళ్లు చాలా అద్భుతమైన క్షణాలు' అంటూ పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌తో పాటు ఉపాసన, రామ్ చరణ్ రొమాంటిక్ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు మెగా జంటకు శుభకాంక్షలు చెబుతున్నారు. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీకి జంటగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. It’s been an awesome 11 years ❤️@AlwaysRamCharan pic.twitter.com/6Y7d7vfwvB — Upasana Konidela (@upasanakonidela) June 14, 2023 -
రామ్ చరణ్, ఉపాసనల పెళ్లిబంధానికి 11 ఏళ్లు, ముచ్చటైన ఫోటోలు
-
నయనతార పెళ్లి వీడియో ఏమైంది ?
-
నా పెళ్లి.. నా ఇష్టం..అప్పుడే ఏడాది!
-
తనను తాను పెళ్లాడిన యువతి ఫస్ట్ యానివర్సరీ, అదిరిపోయే వీడియో వైరల్
గుజరాత్ అమ్మాయి క్షమా బిందు గుర్తుందా. వడోదరకు చెందిన క్షమా బిందు జూన్ 8, 2022 లో తనను తాను పెళ్లి చేసుకున్న యువతిగా సంచలనం రేపింది. పెళ్లి తరువాత సింగిల్‌గానే హనీమూన్ కి కూడా వెళ్లి ఎంజాయ్ చేసింది. ఇపుడు తొలి వార్షికోత్సవం సందర్భంగా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఫస్ట్ యానివర్సరీ సందర్భాన్ని ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఎవరి ఇష్టం వచ్చినట్టువారు, ఎవరి మనస్తత్వానికి తగినట్టు వాళ్లు కమెంట్ చేస్తున్నారు. 1.9 వేలకు పైగా లైక్‌లు, పలు కామెంట్లు వచ్చాయి. చాలా మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అభిమానాన్ని చాటుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ యానివర్సరీ.. కంగ్రాట్స్ .. సో ప్రౌడ్ ఆఫ్ యూ చాలా మంది విషెస్ అందిస్తున్నారు. అదే సమయంలో పంది బురదలో దొర్లి అదే జీవితమని మురిసిపోతుంది.. అర్జంటుగా ఈమెకు చికిత్స అవసరం అంటూ నోరు పారేసుకుంటున్నారు. కానీ ఇవేమీ ఆమెను అస్సలు బాధించడంలేదు. ఈ రకమైన ట్రోలింగ్ గతంలో కూడా ఎదుర్కొంది. మీరేమన్నా అనుకోండిరా బై.. నా జీవితం నా యిష్టం.. నాకు నచ్చినన్ని రోజులు ఇలాగే ఒంటరిగానే హ్యాపీగా గడిపేస్తానంటోంది. తనకు నచ్చినట్టు జీవితాన్ని ఆస్వాదిస్తోంది. మరెవ్వరికీ హాని చేయకుండా.. కుడోస్ మై డియర్ అంటున్నారు నెటిజన్లు. కాగా 25 ఏళ్ల క్షమా బిందు దేశంలో తొలిస్వీయ వివాహం లేదా సోలోగామిగా నిలిచిన సంగతి తెలిసిందే. అంతకు ముందు బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్‌కు 33 ఏళ్ల క్రిస్ గలెరా. తనను తాను పెళ్లి చేసుకున్న ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అంతేకాదు రూ. 4 కోట్లు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటానన్న అరబ్ షేక్‌ను తోసి రాజంది. కొనుక్కోవడానికి, అమ్మడానికి తానేమీ ఆట వస్తువును కాదని తనకు నచ్చినన్ని రోజులు ఇలాగే ఒంటరిగా గడుపుతానంటూ క్రిస్ తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. -
బీచ్‌లో భర్తపై అనసూయ ముద్దుల వర్షం.. ఫోటోలు వైరల్
యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తుంది కూడా. ఇక నేడు అనసూయ పెళ్లి రోజు. ఈ సందర్భంగా భర్త భరద్వాజ్‌తో కలిసి థాయ్‌లాండ్ బీచ్‌లో యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలతో అనసూయ బికినీలో ఉంది. సముద్రం ఒడ్డున భర్తతో కలిసి రొమాన్స్ చేసింది. లిప్‌లాక్ ఇస్తూ భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది. భర్తపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ ఓ స్పెషల్ పోస్ట్‌ని షేర్ చేసింది. ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక అనసూయ కెరీర్ విషయానికొస్తే.. వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో ఈ మధ్య యాంకరింగ్‌కి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇటీవల రంగమార్తాండ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పుష్ప 2 తో పాటు పలు చిన్న సినిమాల్లోనూ అనసూయ నటిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
వెకేషన్లో దిల్ రాజు కుమార్తె
-
ట్రెండింగ్‌లో అల్లు అర్జున్-స్నేహల ఫొటో! స్పెషల్ ఏంటంటే..
పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక అల్లు అర్జున్ ఎక్కడ కనిపించిన ఫ్యాన్స్ ఐకాన్ స్టార్ అంటూ సెల్పీలు తీసుకునేందుకు వెంటపడుతున్నారు. అలాంటి బన్నీ సెల్ఫీ ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే అది ఫ్యాన్‌తో తీసుకుకుంది కాదు. తన భార్య స్నేహతో దిగిన సెల్ఫీ. నిన్న సోమవారం(మార్చి 6) అల్లు అర్జున్-స్నేహల 12వ వివాహ వార్షికోత్సం. ఈ సందర్భంగా ఈ స్పెషల్ డేను సెలబ్రెట్ చేసుకుంటూ భార్యకు విషెస్ తెలిపాడు. చదవండి: కళ్లు చెదిరేలా కమెడియన్ రఘు లగ్జరీ ఇల్లు.. చూశారా? ఇద్దరు కలిసి తీసుకున్న సెల్పీ ఫొటోను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ యానివర్సరీ క్యూటీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. భార్యకు అలా క్యూట్‌గా విషెస్ చెప్పడంతో బన్నీ పోస్ట్‌పై అందరి దృష్టి పడింది. ఇక ఫ్యాన్స్ అయితే వారి సెల్ఫీకి ఫిదా అవుతూ పోస్ట్‌పై రకరకాలుగా స్పందించారు. క్యూట్ కపుల్ అంటూ వారికి వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ తెలిపారు. అలా కుప్పలు కుప్పలుగా బన్నీ-స్నేహలకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దీంతో బన్నీ పోస్ట్ ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. మరోవైపు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ‘అర్జున్ రెడ్డి’ ఫేం సందీప్ వంగతో చేస్తున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన వెలువడింది. చదవండి: బిడ్డ పుట్టిన మూడు నెలలకే వచ్చేశా.. అందరు ప్రశ్నిస్తున్నారు: కాజల్ అగర్వాల్ Happy Anniversary Cutie 🖤 #AlluSnehaReddy pic.twitter.com/lWEJRfuQZH — Allu Arjun (@alluarjun) March 6, 2023 -
నేను, మహేశ్ తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదే : నమ్రతా శిరోద్కర్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మహేశ్ బాబు-నమ్రతా శిరోద్కర్‌ల జంట ఒకరు. వెండితెరపై హీరో,హీరోయిన్లుగా కలిసి నటించిన వీరు నిజజీవితంలోనూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వంశీ సినిమాలో కలిసి నటించిన మహేశ్-నమ్రతలు 2005లో వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా కొనసాగుతున్నారు. టాలీవుడ్లో బెస్ట్ కపుల్స్‌గా వీరికి పేరుంది. ఈ స్టార్కపుల్కి పెళ్లయి నేటితో 18 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు నమ్రతతో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. '18 ఏళ్ల ప్రయాణం ఎంతో క్రేజీగా, ప్రేమగా ముందుకు సాగింది. ఎప్పటికీ ఇలాగే ముందుకు సాగాలి. పెళ్లి రోజు శుభాకాంక్షలు'.. అంటూ పోస్ట్ చేశారు. ఇక నమ్రతా కూడా ఇన్‌స్టాలో క్యూటెస్ట్ పోస్ట్‌ను షేర్చేసింది. 'మా జీవితంలో మేం తీసుకున్న అత్యత్తుమ నిర్ణయం ఇదే' అంటూ మహేశ్‌తో దిగిన అరుదైన ఫోటోను పంచుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నెటిజన్ల నుంచి మహేశ్, నమ్రతలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
కేజీఎఫ్ హీరో యశ్ భార్య ఎమోషనల్ పోస్ట్.. లవ్ యూ అంటూ..!
కేజీఎఫ్ హీరో యశ్ టాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. అంతలా పేరు తీసుకొచ్చింది ఆ సినిమా. రాఖీభాయ్‌గా విపరీతమైన క్రేజ్ వచ్చింది. శాండల్‌వుడ్‌లో అత్యంత అభిమానించే హీరోల్లో యశ్ ముందువరుసలో ఉంటారు. తాజాగా ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా యశ్ భార్య రాధిక పండిట్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్నారు. దీంతో ఆయన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!) రాధిక ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇది మనమే.. మనం చాలా ఉల్లాసభరితంగా, గంభీరంగా ఉండొచ్చు. కానీ ఇది నిజం.. ఈ ఆరేళ్ల వైవాహిక జీవితాన్ని అద్భుతంగా మార్చినందుకు ధన్యవాదాలు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. లవ్ యూ.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. వారిద్దరు ఎలా కలిశారంటే.. యశ్, రాధిక పండిట్ ఓ సినిమా షూటింగ్ సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు స్నేహం మొదలైంది. కొన్నేళ్లకు వారి స్నేహం ప్రేమగా మారి.. డిసెంబర్ 9, 2016న పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక పాప, బాబు జన్మించారు. వారి పిల్లలకు ఐరా, యతర్వ్ అని పేర్లు పెట్టారు. కాగా.. కేజీఎఫ్ 2 భారీ హిట్ తర్వాత సినిమాలకు కొంత విరామం ప్రకటించారు యశ్. సినీ ప్రియులు కేజీఎఫ్ చాప్టర్- 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్ తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు నర్తన్‌తో కలిసి పని చేయనుండగా.. ఆ చిత్రానికి యశ్ -19 అని పేరు పెట్టారు. View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
బ్రిటన్ రాణి చనిపోయే ముందు వాళ్లకు స్పెషల్ గ్రీటింగ్స్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి ముందు వివాహబంధంలో 60 ఏళ్ల పూర్తి చేసుకున్న కొన్ని జంటలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక గ్రీటింగ్స్ పంపారు. వీటిపై ఆమె స్వయంగా సంతకం చేశారు. ఈ అరుదైన కార్డు తమకు కూడా అందిందని ఓ వృద్ధ జంట వెల్లడించింది. రాణి సంతకం చేసిన గ్రీటింగ్ కార్డు అందుకున్న అతికొద్ది మందిలో తామూ ఉండటంపై ఆనందం వ్యక్తం చేసింది. ఈ భార్యాభర్తల పేర్లు ట్రికియా పోంట్, రాయ్. సెప్టెంబర్ 8న వీరి 60వ వివాహ వార్షికోత్సవం. రాణి ఎలిజబెత్ 2 కూడా అదే రోజు మరణించారు. అయితే అంతకుముందే ఆమె ఈ ఏడాది డైమండ్ వెడ్డింగ్ యానివర్సరీ(60వ పెళ్లిరోజు) జరుపుకుంటున్న కొన్ని జంటలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖలు పంపారు. ప్రస్తుత రాజు కింగ్ చార్లెస్ 3 నుంచి కూడా వీరికి లేఖలు అందే అవకాశం ఉంది. సుర్రేకు చెందిన ఈ వృద్ధ దంపతులు రాణి నుంచి అందిన గ్రీటింగ్ కార్డు చూసి మురిసిపోయారు. ఇది తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ లెటర్ ఓపెన్ చేసిన అనంతరం వేడుక చేసుకునేందుకు సెప్టెంబర్ 8న మధ్యాహ్నం బయటకు లంచ్‌కు వెళ్లారు. అయితే ఇంటికి తిరిగివచ్చేసరికి రాణి మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యారు. 80ఏళ్లు పైబడిన ఈ వృద్ధ జంట.. రాణి తమకు పంపిన లేఖను నిధిలా దాచుకుంటామన్నారు. ప్రపంచంలోని అతికొద్ది మందికి మాత్రమే రాణి సంతకం చేసిన లేఖలు అందాయని, అందుకే ఇది తమకు ఎంతో విలువైనదని చెప్పారు. రాణికి తాము పెద్ద అభిమానులమని, దేశానికే ఆమె స్పూర్తిదాయకం అని కొనియాడారు. చదవండి: బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువ తెలుసా? -
సీఎం జగన్ దంపతులకు గవర్నర్ పెళ్లి రోజు శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం వారికి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ దంపతులపై జగన్నాథస్వామి, తిరుమల బాలాజీ ఆశీస్సులు కురిపించాలని ఆకాంక్షించారు. సీఎం దంపతులకు కలకాలం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించి.. సుసంపన్నమైన జీవితాన్ని అందించాలని గవర్నర్ అభిలషించారు. -
పెళ్లిరోజే పోస్టులు డిలీట్.. రానా భార్య ఏం చేసిందంటే..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. అలాంటి రానా ఉన్నట్లుండి ఇన్స్టాగ్రామ్ పోస్టులన్నీ డిలీట్ చేయడం, అది కూడా పెళ్లిరోజే పోస్టులు తొలగించడం పలు అనుమానాలకు తావిచ్చింది. పెళ్లిరోజుకు ఒకరోజు ముందే సోషల్ మీడియా బ్రేక్ కూడా ప్రకటించడంతో రానా పర్సనల్ లైఫ్‌పై నెట్టింట చర్చ మొదలైంది. భార్య మిహికాకు-రానాకు మధ్య ఏమైనా విబేధాలు తలెత్తాయన్న రూమర్స్ కూడా గుప్పుమన్నాయి. చదవండి: నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే.. అయితే తాజాగా రానా భార్య మిహికా ఈ వార్తలకు చెక్ పెట్టింది. సెకండ్ ఆనివర్సరీ సందర్భంగా భర్తతో కలిసి దిగిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో రానా-మిహికాలకు సంబంధించి నెట్టింట వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇక మిహికా పోస్ట్ చూసి వెంకటేశ్ కూతురు ఆశ్రితతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ కపుల్స్‌కి ఆనివర్సరీ విషెస్‌ను తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ‘పని జరుగుతోంది. సోషల్ మీడియా నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అంటూ రానా ట్వీట్ చేసి అభిమానులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Bunty Bajaj (@buntybajaj) -
వెడ్డింగ్ యానివర్సరీ.. భర్తను తలచుకుంటూ మీనా ఎమోషనల్ పోస్ట్
నటి మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్గా, నటిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పెళ్లి అనంతరం కొంతకాలం నటనకు బ్రేక్ ఇచ్చిన ఆమె రీసెంట్గా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సహానటి, క్యారెక్టర్ అర్టిస్ట్‌గా రాణిస్తుంది. ఇదిలా ఉంటే గత నెల మీనా భర్త విద్యాసాగర్ హఠ్మారణం పొందిన సంగతి తెలిసిందే. చదవండి: లలిత్ మోదీ ప్రేమలో సుస్మితా.. ‘లవ్ ఆఫ్ మై లైఫ్’ అంటూ వీడియో.. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నప్పటికి పోస్ట్ కోవిడ్, ఊపరితిత్తుల సమస్యలతో అనారోగ్య బారిన పడ్డారు. ఆయన లంగ్స్‌కు ఇన్ఫెక్షన్ రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందతూ జూన్ 29న తుదిశ్వాస విడిచారు. అయితే మంగళవారం(జూలై 12) మీనా పెళ్లి రోజు. ఈ సందర్భంగా భర్తను గుర్తు చేసుకుంటూ మీనా భావోద్యేగానికి లోనయింది. భర్తను తలచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ పంచుకుంది. చదవండి: ప్రముఖ నటుడు, నటి రాధిక మాజీ భర్త మృతి భర్త విద్యాసాగర్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘మీరు దేవుడు ఇచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం(బహుమతి). కానీ చాలా త్వరగా మిమ్మల్ని నా నుంచి ఆ దేవుడు తీసుకువెళ్లిపోయాడు. మీరు ఎప్పటికీ మా(నా) గుండెల్లో ఉంటారు. ఇలాంటి కఠిన సమయంలో మా పట్ల ప్రేమ, అప్యాయత చూపించిన ప్రపంచంలోని ప్రతి మంచి మనసుకు నేను, నా కుటుంబం ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇలాంటి పరిస్థితిలో మాకు అండగా ఉన్న బంధువులు, స్నేహితులకు కృతజ్ఞతరాలిని. మీలాంటి వారి ఆశ్వీర్వాదాలు మాకు ఎప్పటికీ కావాలి’ అంటూ మీనా రాసుకొచ్చింది. కాగా మీనా, విద్యాసాగర్‌ను 2009 జులై 12న పెళ్లాడింది. వీరికి కూతురు నైనిక జన్మించింది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
వెడ్డింగ్ యానివర్సరీ: వైరల్‌గా చరణ్, ఉపాసన పెళ్లి వీడియో..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వైవాహిక బంధానికి రేపటితో పదేళ్లు నిండనున్నాయి. జూన్ 14, 2012న చరణ్, ఉపాసనలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వారి 10వ వివాహ వార్షికోత్సవ వేడుకలో భాగంగా ఈ మెగా కపుల్ ఇటలీలో వాలిపోయారు. అక్కడి అందాలను ఆస్వాదిస్తున్న ఈ జంట అక్కడి ఫొటోలను షేర్ చేస్తున్నారు. చదవండి: విజయ్, రష్మికల షూటింగ్ ఫొటోలు లీక్.. డైరెక్టర్ అప్సెట్ తాజాగా చరణ్ భార్యతో దిగిన ఓ క్యూట్ ఫొటోను పంచుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మంగళవారం(జూన్ 14) వీరి వివాహ వార్సికోత్సవాన్ని ముందుగానే సెలబ్రెట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సందర్భంగా చరణ్, ఉపాసన వెడ్డింగ్ వీడియోను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ అడ్వాన్స్‌గా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి మీరు కూడా చరణ్, ఉప్సీల పెళ్లి వీడియో చూసేయండి. చదవండి: వెకేషన్లో చరణ్, ఉపాసన.. క్యూట్ పిక్ షేర్ చేసిన మెగా హీరో -
వెకేషన్లో చరణ్, ఉపాసన.. క్యూట్ పిక్ షేర్ చేసిన మెగా హీరో
మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసన ప్రస్తుతం వెకేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. మంగళవారం(జూన్ 14)తో వీరి ఒక్కటై పదేళ్లు పూర్తి కావస్తుంది. వారి టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఈ జంట ఇటీవల ఇటలీ టూర్‌కు వెళ్లారు. అక్కడ అందమైన లోకేషన్స్‌లో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు ఒకే రంగు దుస్తులు ధరించిన ఓ ఫొటోను షేర్ చేశాడు రామ్ చరణ్. చూట్టూ పచ్చిన చెట్లు, గార్డెన్ మధ్యలో ఇద్దరు వైట్ కలర్ దుస్తులు ధరించి ఒకరినొకరు చూసుకుంటు దిగిన ఈ ఫొటోని చెర్రి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. చదవండి: హీరోయిన్ అనుష్క సోదరునికి ప్రాణభయం దీనికి స్మైలీ ఎమోజీని జత చేశాడు. ఈ ఫొటో చూసి మెగా ఫ్యాన్ష్ తెగ మురిసిపోతున్నారు. ఈ జంట అడ్వాన్స్‌గా మ్యారెజ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా రామ్ చరణ్, ఉపాసనలు 2012 జూన్ 14న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం చరణ్ ఆర్సీ 15 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం ఈ సినిమాలో చెర్రికి జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. చదవండి: విరాటపర్వం: ఒళ్లు గగుర్పొడిచే విప్లవ సాంగ్ విన్నారా? View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
నీటి అలల మధ్య భర్తకు అనసూయ లిప్‌లాక్.. వీడియో వైరల్
Anchor Anasuya Celebrating 12th Wedding Anniversary Video Viral: టాలీవుడ్ ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అక్కర్లేదు. అటు యాంకరింగ్.. ఇటు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోంది. యాంకరింగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం దర్జా, వాంటెడ్ పండుగాడ్, గాడ్ ఫాదర్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలు, యాంకరింగ్‌తోపాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది అనసూయ. గ్లామరస్ ఫొటోలతోపాటు కుటుంబంతో ఆడిపాడే క్షణాలు పోస్ట్‌ల రూపంలో అభిమానులతో పంచుకుంటుంది రంగమ్మత్త. తాజాగా తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో బీచ్‌లో సందడి చేసిన వీడియోను షేర్ చేసింది. అనసూయ, సుశాంక్ ఒకరినొకరు ప్రేమగా హత్తుకుని, లిప్‌లాక్, రొమాంటిక్ ఫొజులతో ఈ వీడియో నిండిపోయింది. తమ 12వ వెడ్డింగ్ యాన్నివర్సరీ సందర్భంగా భర్తతో పకృతి ఒడిలో సముద్రం ఒడ్డున నీటి అలల మధ్య గడిపింది అనసూయ. ఈ వీడియో షేర్ చేస్తూ 'ప్రియమైన నిక్కూ.. మనిద్దరం కలిసి ఉండటమే నాకు ఓ అద్భుత ప్రదేశం. నువ్ నా పక్కనే ఉంటే చాలు ఒక్క చేత్తో ఈ ప్రపంచాన్ని జయించగలను. ఇన్నేళ్ల మన లవ్ జర్నీలో ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో మధుర క్షణాలు. అన్నింటిని మించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన 21 ఏళ్ల కలయికలో పెళ్లై 12 ఏళ్లు గడిచాయి. నా వృద్ధాప్యం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.' అని రాసుకొచ్చింది. చదవండి: మగజాతి పరువు తీస్తున్నారు: దిమ్మతిరిగేలా అనసూయ కౌంటర్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అనసూయ, సుశాంక్‌ల మధ్య పరిచయం ఏర్పడి 21 సంవత్సరాలు అయింది. 9 ఏళ్ల డేటింగ్ అనంతరం అనసూయ, సుశాంక్ వివాహం బంధంతో ఒక్కటయ్యారు. -
పెళ్లి రోజే నూరేళ్లు.. పాలకూర కోసం వెళ్లి.. రోడ్డు దాటి వస్తుండగా..
సాక్షి, నల్గొండ: పెళ్లిరోజు నాడే ఓ మహిళకు నిండు నూరేళ్లు నిండాయి. ఈ విషాదకర ఘటన తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తాటిపాముల గ్రామానికి చెందిన రేణుక (28)కు తొండ గ్రామానికి చెందిన లోడె శేఖర్‌తో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు సంతానం. దైవ దర్శనానికి వెళ్లొద్దామనుకుని.. ఆదివారం శేఖర్, రేణుకదంపతుల పెళ్లిరోజు. దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి యాదగిరిగుట్టకు వెళ్లి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నా రు. త్వరగా వంట పని పూర్తి చేసుకోవాలని రేణుక అనుకుంది. అందులో భాగంగానే ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు దాటి పాలకూర కొనుగోలు చేసింది. తిరిగి ఇంట్లోకి వస్తున్న క్రమంలో తొర్రూరు రోడ్డు వైపు నుంచి వేగంగా వచ్చిన సెప్టిక్ ట్యాంకర్ ఢీకొట్టడంతో రేణుకకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. పెళ్లి రోజు వేడుకను ఆనందంగా జరుపుకోవాలని అనుకున్న ఆ కుటుంబంలో రేణుక మృతితో విషాదం అలుముకుంది. సమాచారం మే రకు పోలీసులు ఘటనస్థలాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త శేఖర్ ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఎన్టీఆర్ షేర్ చేసిన స్పెషల్ ఫొటో.. క్షణాల్లో వైరల్
Jr NTR Prashanth Neel Celebrate Wedding Anniversary: 'రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)' సక్సెస్‌తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ పాన్ ఇండియా చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారాడు. మరోవైపు 'కేజీఎఫ్ 2'తో భారీ విజయం సాధించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరి కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సెలబ్రేషన్ సినిమా గురించి అనుకుంటే పొరపాటే. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఎవరికివారి పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాన్ని ఒకే రోజు వేడుక చేసుకున్నారు. మే 5న ఇటు తారక్‌తోపాటు అటు ప్రశాంత్ నీల్ వివాహ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవాన్ని వారిద్దరు తమ ఫ్యామిలీలతో కలిసి జరుపుకున్నారు. ఈ విషయానికి సంబంధించిన ఒక స్పెషల్ ఫొటోను తారక్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి దంపతులతోపాటు ప్రశాంత్ నీల్, ఆయన భార్య లిఖిత ఉన్నారు. ఈ రెండు జంటల వివాహ వార్షికోత్సవం మే 5న కావడంతో ఇరు జంటలు కలిసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఫొటోను షేర్ చేస్తూ 'ఒకే రోజు మా రెండు జంటల వివాహ వార్షికోత్సవం జరుపుకోవడం వేడుకగా ఉంది. ఇదొక కొత్త ఆరంభం.' అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు రిహార్సల్స్‌కు రాలేదు: శేఖర్ మాస్టర్ View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అల్లు అర్జున్-స్నేహ వివాహ బంధానికి పదకొండేళ్లు.. బన్నీ స్వీట్ విషెస్
Allu Arjun Celebrate 11th Marriage Anniversary Wishes To Sneha Reddy: టాలీవుడ్లోకి అందమైన, అనోన్యమైన జంటలో ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు. వీరూ మార్చి 6, 2011న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఒకరిపై ఒకరూ ప్రేమ చూపించడంలో ఎవరికీ వారే సాటి. అయితే ఆదివారం (మార్చి 6) అల్లు అర్జున్, స్నేహ రెడ్డి పెళ్లి రోజు. జీవితాంతం కలిసి ఉంటామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి, ఏడడుగులు నడిచి నేటికి 11 వసంతాలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపాడు బన్నీ. అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తమ పిల్లలతో కేక్ కట్ చేస్తున్న ఫొటో షేర్ చేస్తూ 'పెళ్లి రోజు శుభాకాంక్షలు క్యూటీ. మనిద్దరి ఈ బంధానికి 11 వసంతాలు.' అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ కాగా శ్రుతిహాసన్తోపాటు పలువురు సెలబ్రిటీలు కామెంట్స్ రూపంలో విషెస్ తెలుపుతున్నారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులకు 2014లో కొడుకు అయాన్, 2016లో కూతురు ఆర్హా పుట్టారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప రెండో భాగం సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరిలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లాలి. కానీ పలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పార్ట్ షూటింగ్ ప్రారంభం అవుతుందని టాక్. -
చిరిగిన బట్టలతో తాళి కట్టిన చిరంజీవి.. ఎందుకంటే
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్లో అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. స్వయంకృషితో ఒక్కో మెట్టూ ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు.1978లో పునాదిరాళ్లు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి తనదైన నటన, డ్యాన్సు స్టెప్పులతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. కెరీర్లో ఎదుగుతున్న సమయంలో ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి వివాహం జరిగింది. అయితే అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న చిరుకి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం ఏంటని అల్లు రామలింగయ్య వద్ద చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారట. అయినా ఇవేం పట్టించుకోని ఆయన చిరంజీవి కష్టపడే తత్వాన్ని గుర్తించి ఎప్పటికైనా అతడు స్టార్ హీరో అవుతాడని నమ్మకంతో చెప్పేవారట. ఆ దిశగా చిరును ఎంతగానో ప్రోత్సహించేవారట. ఇక ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి నాటి సంగతులను గుర్తుచేసుకున్న చిరంజీవి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'పెళ్లి సమయానికి తాతయ్య ప్రేమ లీలలు అనే సినిమా చేస్తున్నా. అందులో నూతన్ ప్రసాద్‌కు నాకూ కొన్ని కీలక సీన్లు ఉన్నాయి. అప్పటికి ఆయన ఫుల్ బిజీ ఆర్టిస్టు కావడంతో ఆయన డేట్స్ కోసం పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వస్తుందేమోనని అనుకున్నాం. కానీ నిర్మాత షూటింగ్‌ని వాయిదా వేసి మా పెళ్లికి గ్యాప్ ఇచ్చారు. ఇక పెళ్లి పీటల మీద కూర్చొనేటప్పటికి నా చొక్కా చిరిగిపోయింది. అది చూసి సురేఖ వెళ్లి బట్టలు మార్చుకోవచ్చుగా అని అడిగింది. ఏం బట్టలు చిరిగితే తాళి కట్టలేనా అని చెప్పి అలాగే కట్టేశాను' అంటూ ఆనాటి ఙ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. -
పెళ్లై అప్పుడే 17 ఏళ్లయిందా?: శ్రీమతికి మహేశ్ స్వీట్ విషెస్
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు మహేశ్‌బాబు. నటనాచాతుర్యంతో తక్కువ కాలంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడీ హీరో. టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్న మహేశ్ నమ్రత శిరోద్కర్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 'వంశీ' సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారగా అది కాస్తా పెళ్లి దాకా వెళ్లింది. వీరి వివాహం జరిగి నేటికి 17 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా మహేశ్ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేసి సతీమణికి శుభాకాంక్షలు తెలియజేశాడు. 'అప్పుడే 17 సంవత్సరాలు పూర్తైంది. హ్యాపీ యానివర్సరీ.. ఇలాంటి రోజులు మనం మరెన్నో జరుపుకోవాలి' అని రాసుకొచ్చాడు. ఇక నమ్రత కూడా స్పెషల్ వీడియో ద్వారా భర్తకు శుభాకాంక్షలు తెలిపింది. 'సంతోషం, నమ్మకం, గౌరవం, కరుణ, సరదాతో కొనసాగిన మన ప్రేమను జీవితాంతం ఇంతే మధురంగా కొనసాగిద్దాం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) So easily 17! Happy anniversary NSG!! Many more to us... it’s all about love ♥️♥️♥️ pic.twitter.com/Lw76cY77zu — Mahesh Babu (@urstrulyMahesh) February 10, 2022 -
ఇచ్చిపుచ్చుకోవటంలోనే అసలైన ఆనందం.. అందుకే వందేళ్లు బతికాం!
మనిషి వందేళ్లు జీవిస్తే ఈరోజుల్లో అద్భుతమే! అలాంటిది జీవితాంతం తోడుంటానని చేయి పట్టుకుని నడిచిన తోడుతో సుదీర్ఘకాలం జీవిస్తే?!.. ఆ అన్యోన్య జంట ఆనందం మాటల్లో వర్ణించలేం! ఇటీవల వందేళ్ల వయసున్న ఒక జంట.. ఏకంగా 81వ వివాహ వార్షికోత్సవవేడుకను చేసుకుని వార్తల్లోకెక్కింది. తద్వారా అరుదైన ఓ రికార్డు సృష్టించారు. ఇంగ్లండ్‌కు చెందిన ఈ అరుదైన జంట ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాన్(102), జాయిస్ బాండ్(100).. ఎనిమిది దశాబ్దాలపాటు అన్యోన్యంగా గడిపారు. ఈ కాలంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. ఇంగ్లండ్‌కు సుమారు 15 మంది ప్రధానమంత్రులు మారారు. కానీ, పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నప్పటికీ.. వీళ్ల మనుసులు మాత్రం దూరం కాలేదు. తొలి చూపులోనే ప్రేమలో పడ్డ ఈ జంట.. 1941 నుంచి ‘ఆదర్శ జంట’గా నిలిచింది. అందుకు కారణాలు.. రాన్(21), జాయిస్ బాండ్(18) ఏళ్ల వయసులో న్యూపోర్ట్ పాగ్నెల్ రిజిస్ట్రీ ఆఫీస్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి ఎలీన్, బిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జాయిస్.. ఊల్వర్త్స్ రిటైల్ సూపర్ మార్కెట్లో మాజీ ఉద్యోగి. రాన్.. రెండో ప్రపంచ యుద్దం కంటే ముందు నుంచే స్థానికంగా ఉండే ఓ మోటర్‌సైకిల్ గ్యారేజీలో పనిచేసేవారు. రాన్ స్పందిస్తూ.. జీవితంలో కొన్నిసార్లు కష్టాలు వచ్చాయి. వాటిని మేమిద్దరం సమిష్టిగా ఎదుర్కొన్నాం. ఒకరికొకరం ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచాం’ అని తెలిపారు. జాయిస్ బాండ్ స్పందిస్తూ.. ‘మేము 81వ వివాహవార్షికోత్సం జరుపుకుంటామని అసలు ఊహించలేదు. చాలా అదృష్టంగా భావిస్తున్నాం’ అని చెప్పారు. తమ వివాహబంధంలో బాస్ ఎవరు లేరని, తాము ఎప్పుడూ ఒకరినొకరం గౌరవించుకునేవాళ్లమని తెలిపారు. తాము ఇద్దరం ఇంత ఆరోగ్యంగా, అన్యోన్యంగా ఉండటానికి ఒక్కటే సీక్రెట్ ఉందని.. ‘ఏదైనా ప్రేమగా ఇచ్చిపుచ్చుకునే వాళ్లం’ అని తెలిపారు. వారి కూతురు ఎలీన్ మాట్లాడుతూ.. ‘నా తల్లిదండ్రులు 81వ వివాహ వార్షికోత్సం జరుపుకుంటున్నారని చెబితే ఎవరూ నమ్మలేదు. నా తల్లిదండ్రులు నిజంగా స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు, నాకు, సోదరుడికి మాత్రమే కాదు. వారు.. మా పిల్లలు, వాళ్ల పిల్లలకు కూడా ఎప్పుడూ ప్రేరణ కలిగించేవారే’ అని చెప్పారు. -
పెండ్లి రోజు పార్టీ.. నవ వరుడు హత్య
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): విల్లియనూరులో ప్రజలకు ఇబ్బందికరంగా పెండ్లి రోజు పార్టీని జరుపుకుంటున్న వారిని ప్రశ్నించడంతో.. మద్యం మత్తులో ఉన్నవారు నవ వరుడిని కత్తితో పొడిచి హత్య చేశారు. వివరాలు.. పుదుచ్చేరి రాష్ట్రం విలియనూరు మూర్తినగర్‌కు చెందిన సతీష్ అలియాస్ మణిగండన్ (28). ఇతను ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అతనికి ఇటీవల మదివదన (25)తో వివాహమైంది. శనివారం రాత్రి అతను ఇంటికి ఎదురుగా ఉండే శంకర్ (32) అతని భార్య రమణి (28) వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వీధిలో కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో రమణి తమ్ముడు రాజా, అతని స్నేహితుడైన తెన్నెల్ ప్రాంతానికి చెందిన అజార్ సామియర్ తోపుకు తమిళ్ సెల్వన్ మద్యం మత్తులో వీరంగం సృష్టించినట్లు తెలిసింది. దీంతో వారిని స్థానికులు సతీష్, శబరి, హరి, రాజా ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో రాజా, శంకర్, అజార్, తమిళ్ సెల్వన్, సతీష్‌ను కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సునీత నా పెద్ద కొడుకు: సింగర్ తండ్రి ఎమోషనల్
‘ప్రతి పెళ్లికి ఓ స్టోరీ ఉంటుంది. అది ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది ’అంటుంది సింగర్ సునీత. తన పాటలతో లక్షలాది మంది అభిమానులను సంపాందించుకున్న సునీత గతేడాదిలో రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2021, జనవరి 9న ప్రముఖవ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సునీత వివాహం జరిగింది. నేడు(జనవరి 9) వారి తొలి వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ‘వెడ్డింగ్ మెమోరీస్’అంటూ వివాహ వేడుక జ్ఞాపకాలు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోని యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది సునీత. అందులో తమ గురించి, తమ వివాహం గురించి ఇరు కుటుంబ సభ్యుల అభిప్రాయాలు ఉన్నాయి. సునీత గురించి ఆమె తల్లి మాట్లాడుతూ..‘బరువు, బాధ్యతలన్నీ తీర్చుకుంటూ.. ఎప్పుడూ చిరునవ్వుతో.. అన్ని సహనంతో చేసుకుంటూ ముందడుగు వేసింది. డేరింగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ తనది’అని చెప్పుకొచ్చింది. అలాగే రామ్‌పై సునీతకు ఉన్న ఒపీనియన్ ఏంటో కూడా ఆ వీడియో ఉంది. ‘రామ్ తనుకు ఎనిమిదేళ్లుగా తెలుసు, చాలా నీజాయితీపరుడు, ఏదైనా ముఖంపైనే చెప్పే వ్యక్తిత్వం తనది. అతను మంచి కాఫీ లాంటి అబ్బాయ్’ అని ముసి ముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది సునీత . ‘సునీత జీవితంలో ఎన్నో అటుపోట్లు ఎదుర్కొంది.ఇప్పటికీ మా కుటుంబానికి పెద్ద కొడుకులాగానే ఉంటుంది’అని సునీత తండ్రి అన్నారు. పెళ్లి తర్వాత తన జీవితం చాలా బ్యూటీఫుల్‌గా సాగుతుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సునీత ‘వెడ్డింగ్ మెమోరీస్’నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. -
PuneethRajkumar: పునీత్ పెళ్లికి 22 ఏళ్లు..
సాక్షి, బెంగళూరు: నెల కిందట ఆకస్మికంగా కన్నుమూసిన ప్రముఖ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు వివాహమై 22 ఏళ్లు పూర్తయింది. 1999 డిసెంబరు 1వ తేదీన అశ్వినిని పునీత్ ప్రేమించి పెళ్లాడారు. ఎన్నో ఆశలతో ఇద్దరూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కానీ విధి మరోలా తలచడంతో 22వ వివాహ వార్షికోత్సవానికి పునీత్ లేరు. అల్లు శిరీష్ పరామర్శ పునీత్ అకాల మరణం శాండల్‌వుడ్‌కు తీరని లోటు అని తెలుగు నటుడు అల్లు శిరీష్ అన్నారు. బుధవారం ఆయన బెంగళూరులో పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. మీడియాతో మాట్లాడుతూ పునీత్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉంది, బెంగళూరుకు ఎప్పుడు వచ్చినా పునీత్‌ను కలిసేవాడినని అన్నారు. చదవండి: (పునీత్ మరణం ఒక ప్రశ్న: సోదరుడు రాఘవేంద్ర) -
‘నువ్వు నన్ను పరిపూర్ణం చేశావు’.. కేంద్ర మంత్రి ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు 24/7 బిజీగా ఉంటారు. తమ గురించి ఆలోచించుకోవడానికే వారికి తీరిక ఉండదు. అలాంటిది ఇంట్లోవారి పుట్టిన రోజులు, తమ పెళ్లి రోజు వంటివి గుర్తించుకోవడం అంటే నిజంగా గ్రేటే. శుభాకాంక్షలు చెప్తే.. అదే పెద్ద బహుమతిగా భావిస్తారు అవతలివారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భార్య కూడా ఇలానే ఫీలవుతున్నారు. వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా పీయూష్ గోయల్ శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: అప్పుడే పదేళ్లు.. తాజ్‌మహల్ వద్ద బన్నీ, స్నేహ హల్చల్) కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పెళ్లి రోజు సందర్భంగా భార్య సీమతో కలిసి ఉన్న రెండు ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. ఫోటోలతో పాటు ఆయన పెట్టిన క్యాప్షన్‌కి నెటిజనులు ఫిదా అయ్యారు. ‘‘నువ్వు నన్ను పరిపూర్ణం చేశావు సీమ.. 30వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ పెళ్లి సందర్భంగా తీసిన ఫోటో.. తాజాగా దిగిన ఫోటోలను షేర్ చేశారు పీయూష్ గోయల్. (చదవండి: Jr NTR Marriage Day: వైరలవుతున్న పెళ్లి పత్రిక) ఈ ఫోటో చూసిన నెటిజనుల.. ‘‘పీయూష్ గోయల్ సార్‌కి భార్య అంటే ఎంత అభిమానం.. ఒక్క మాటతో ఆయన జీవితంలో ఆమె స్థానం ఏంటో ప్రపంచానికి తెలిపారు. భార్యను ఇంతలా గౌరవించడం నిజంగా అభినందనీయం’’ అంటూ నెటిజనులు ప్రశంసిస్తున్నారు. కేంద్రం మంత్రి నితిన్ గడ్కరి, భూపేంద్ర యాదవ్ తదితరులు పీయూష్ గోయల్ దంపతులుకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. You complete Me, Seema Happy 30th Wedding Anniversary! pic.twitter.com/SjUG9zQZaV — Piyush Goyal (@PiyushGoyal) December 1, 2021 చదవండి: ‘‘ఎలా మొదలైంది..ఎలా కొనసాగుతోంది’’ భావోద్వేగ పోస్ట్ వైరల్ -
శిల్పా శెట్టి-రాజ్ కుంద్రాల వివాహ వార్షికోత్సవం.. పెళ్లినాటి ఫొటోలు వైరల్
Shilpa Shetty And Raj Kundra Marriage Anniversary: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు ఈ మధ్య ఆరోపణలు ఎదుర్కున్నారు. ఈ ఆరోపణలు, వివాదాల నడుమ వారికి నేడు సంతోషకరమైన రోజు కానుంది. నవంబర్ 22, సోమవారం శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా దంపతుల 12వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా శిల్పాశెట్టి, తన భర్తకు సోషల్ మీడియా వేదికగా విష్ చేసింది. ఆమె తన ఇన్‌స్టా గ్రామ్‌లో వారి వివాహ వేడుక చిత్రాల కొలేజ్‌ను పోస్ట్ చేసింది. తాళి కట్టడం, సింధూరం పెట్టడం వంటి మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఈ అందమైన ఫొటోలతో పాటు '12 ఏళ్ల క్రితం ఈ క్షణం, ఈ రోజు మేము ఒక వాగ్దానం చేశాం. దాన్ని నెరవేరుస్తూనే ఉన్నాం. కష్టసుఖాలను పంచుకుంటూ, ప్రేమను విశ్వసిస్తూ, దేవుడు మనకు మంచి మార్గం చూపిస్తాడని భావిస్తూ, ఒకరికొకరం ప్రతిరోజు నిలబడుతూ 12 సంవత్సరాలు పూర్తి చేశాం. అసలు సమయం తెలియనేలేదు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కుకీ' అని శిల్పా శెట్టి పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇంకా 'ఇక్కడ మరెన్నో అనుభూతులు, నవ్వులు, మైలురాళ్లు, విలువైన ఆస్తులు మా పిల్లలు ఉన్నారు. అన్ని విధాల మాకు సహకరించిన మా శ్రేయోభిలాషుందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.' అని తెలిపారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) ఈ పోస్ట్‌కు అభిమానులు, స్నేహితులు, సినీ పరిశ్రమలోని పలువురు సెలబ్రిటీలు లైక్‌లు, కామెంట్లతో ముంచెత్తారు. ' వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మీ ఇద్దరినీ ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు' అని నటి బిపాసా బసు కామెంట్ చేశారు. అశ్లీల వీడియోల చిత్రీకరణ కేసుకు సంబంధించిన ఆరోపణలపై రాజ్ కుంద్రాను జూలై 19న మరో 11 మందితోపాటు పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఈ దంపతులు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ కేసులో ముంబై కోర్టు రూ. 50,000 పూచీకత్తుపై రాజ్‌కు సెప్టెంబర్ 20న బెయిల్ మంజూరు చేసింది. చదవండి: రాజ్ కుంద్రాతో చేతిలో చేయ్యేసి.. భర్తతో తొలిసారి శిల్పాశెట్టి బయటకు -
సమంత కట్టుకున్న పెళ్లి చీర ఎవరిదో తెలుసా?
Ahead Of 4th Anniversary Chay Sam Make Divorce Official: టాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్ సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇప్పడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడపోవడం ఏంటన్న చర్చ నడుస్తుంది. పెళ్లి రోజుకు సరిగ్గా నాలుగు రోజుల ముందు తాము ఇక కలిసి ఉండలేమని ప్రకటించి అభిమానులకు నిరాశలో ముంచేశారు. చై-సామ్ పెళ్లిరోజు(అక్టోబర్6) నేపథ్యంలో వీరి ప్రేమ, పెళ్లి తదనంతర పరిణామాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. చదవండి: బిగ్‌బాస్ కంటెస్టెంట్: ప్రేమించి పెళ్లాడిన భర్త ఆత్మహత్య, రెండో పెళ్లి ‘ఏమాయ చేసావె’సినిమాతో మొదలైన వీరి స్నేహం పెళ్లి దాకా వెళ్లింది. ఇరు కుటుంబాలను ఒప్పించి మరి 2017, అక్టోబర్6న హిందూ, మరుసటి రోజు క్రిస్టియన్ పద్ధతిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా సమంత ధరించిన పెళ్లి చీరపై అప్పట్లో తెగ చర్చ జరిగింది. పెళ్లి మండపంలో సమంత కట్టుకున్న చీర చైతన్య అమ్మమ్మ, రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. ఆ చీరను రీ మోడలింగ్ చేయించి ఎంతో ముచ్చటగా సమంత దాన్ని ధరించింది. ఇందుకోసం సుమారు రూ. 40 లక్షల వరకు ఖర్చయింది. పెళ్లి నాటికి సమంత స్టార్ హీరోయిన్ అయ్యిండి కూడా అటు సాంప్రదాయం, ఇటు పెద్దల్ని గౌరవించడం విశేషంగా నిలిచింది. అంతేకాదు వారి పెళ్లి ఫోటోలు సైతం ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. చదవండి: ఆ విషయం సమంత-నాగ చైతన్యలకే తెలుసు: ఖుష్బూ ఇక పెళ్లి తర్వాత‘చై-సామ్’జోడీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంతో చూడముచ్చటైన జంట అంటూ ఫ్యాన్స్ సంబర పడిపోయారు. అందుకే పలు యాడ్ కంపెనీలు సైతం సమంత-నాగ చైతన్యలను జంటగానే సంప్రదించేవారు. ఇక సామ్ అయితే చైతో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసుకొని ముచ్చటపడేది. కలిసి సినిమాలు చూడటం, వర్కవుట్స్ చేయడం వంటి విశేషాలతో నెట్టింట సందడి చేసేది. కానీ ఉన్నట్లుండి సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరు మార్చుకొని చర్చకు దారితీసింది. ఇద్దరి మధ్యా ఏదో జరుగుతుందన్న ఊహాగానాలు హల్చల్ చేశాయి. కట్ చేస్తూ ఆ రూమర్స్‌నే నిజం చేస్తూ అక్టోబర్2న విడిపోతున్నట్లు అనూహ్య ప్రకటన చేశారు. విడిపోతున్న క్రమంలో కూడా ఇద్దరూ ఒకే రకమైన పోస్టును షేర్ చేశారు. చదవండి:ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది: నాగ చైతన్య -
‘‘ఎలా మొదలైంది..ఎలా కొనసాగుతోంది’’ భావోద్వేగ పోస్ట్ వైరల్
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్లీ ఒబామా దంపతులు తమ సుదీర్ఘ వైవాహిక జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రతీ వార్షికోత్సవం, వాలెంటైన్స్ డేకి పరస్పరం అభినందిచుకోవడం ఈ దంపతులకు అలవాటు. ఈ క్రమంలో అక్టోబరు 3 ఆదివారం, 29 వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మిచెల్లీ ఒక పోస్ట్ పెట్టారు. తన హబ్బీ కోసం పెట్టిన ఒక స్వీట్ పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో ఈ ఒబామా దంపతులకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ఈ సందర్భంగా ఆమె రెండు ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పటికే 2.7 మిలియన్లకు పైగా లైక్స్‌ను సాధించడం విశేషం. అందమైన జంట..హ్యాపీ యానివర్సరీ కమెంట్ల జోరు కొనసాగుతోంది. తమ పెళ్లి రోజు సందర్భంగా మెచెల్లీ భర్త ఒబామాకు ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్ అందించారు. ఎలా ప్రారంభమైంది.. ఎలా కొనసాగుతోంది అంటూ తమ అపురూపమైన జర్నీని గుర్తు చేసుకున్నారు. లవ్ యూ బరాక్ అంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఒబామాతో కలిసి ఉన్న అప్పటి, ఇప్పటి రెండు ఫోటోలను షేర్ చేశారు. కాగా 1992, అక్టోబర్ 3 న వివాహం చేసుకున్నారు ఒబామా, మిచెల్లీ. వీరికి మలియా (23) సాషా (20) ఇద్దరు సంతానం. గత ఏడాది తమ 28వ వార్షికోత్సవ సందర్భంగా 2020 అధ్యక్షఎన్నికల్లో జోబైడెన్ విజయంకోసం ఓటువేయాల్సిందిగా ప్రజలను ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Michelle Obama (@michelleobama) -
తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి చేసిన బుల్లితెర నటి
'మౌనరాగం' సీరియల్‌తో అమ్ములుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన బుల్లితెర నటి ప్రియాంక జైన్. ఈ సీరియల్‌తో ఎంతో గుర్తింపు పొందిన ఈ భామ ప్రస్తుతం 'జానకి కలగనలేదు' సీరియల్లో మెయిన్ లీడ్ పాత్ర పోషిస్తుంది. ఈ సీరియల్ ఇప్పుడు టీఆర్పీ రేటింగ్‌లో దూసుకుపోతుంది. సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ప్రియాంకకు బాగానే ఫాలోవర్లు ఉన్నారు. తనకు సంబంధించిన అప్డేట్స్ను షేర్చేస్తూ ఎప్పకటిప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన తల్లిదండ్రుల 24వ వార్షికోత్సవం సందర్భంగా వారికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. 'ఈరోజు మా అమ్మానాన్నల పెళ్లిరోజు. అప్పట్లో వారు ఇంట్లో తెలియకుండా పెళ్లిచేసుకున్నారు. కాబట్టి వాళ్లకు ఈ రోజు మళ్లీ పెళ్లి చేస్తున్నాం. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల క్షేమాన్ని, సంతోషాన్నే కోరుకుంటారు. కానీ పిల్లలుగా ఈసారి మేం వాళ్లకు మర్చిపోలేని సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. 24వ వివాహ వార్షికోత్సవాన్ని మరింత స్పెషల్‌గా సెలబ్రేట్ చేయాలనుకున్నాం. అందుకే వాళ్లకు మళ్లీ పెళ్లి చేశాం' అని పేర్కొంది. ఇక ఈ వీడియోలో హల్దీ, మెహందీ సహా అన్ని కార్యక్రమాలను ప్రియాంక దగ్గరుండి సెలబ్రేట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) చదవండి : హీరో శింబుకు ఊరట.. రెడ్‌కార్డు రద్దు అప్పుడే విలన్ పాత్రల గురించి ఆలోచిస్తా : సుధీర్ బాబు -
బిర్యానీ కంటే ఎక్కువ ఇష్టపడతా.. సూర్యను ట్రోల్ చేసిన రషీద్
ముంబై: టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆట ఆరంభం నుంచి దూకుడు స్వభావం కనబరిచే సూర్య.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 ద్వారా అరంగేట్రం చేశాడు. అయితే, ఆ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి, మరో అరంగేట్ర ఆటగాడు ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో సూర్యకుమార్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ క్రమంలో నాలుగో టీ20 ద్వారా టీమిండియాకు ఆడాలన్న తన కల నెరవేర్చుకున్న సూర్య.. సిక్సర్‌తో అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల ఖాతా తెరిచాడు. అంతేగాక, తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ(51) కొట్టిన ఐదో భారత క్రికెటర్‌గా ఘనత సాధించాడు. కాగా జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా రెండో జట్టుకు సూర్యకుమార్ ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఈ విషయం కాసేపు పక్కనపెడితే.. సూర్య ట్రోల్ చేయడంలోనూ ముందుంటాడు. ఇటీవలే శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై ట్రోల్ చేసిన సూర్య.. చహల్‌ను కూడా ఆటపట్టించాడు. తాజాగా తన భార్యకు పెళ్లిరోజు విషెస్ చెబుతూ ఒక పోస్టును షేర్ చేశాడు. ''దేవిశా శెట్టితో నీతో పెళ్లి జరిగి ఐదు సంవత్సరాలు. ఈ ఐదేళ్లలో బిర్యానీ కంటే నా భార్యనే ఎక్కువగా ఇష్టపడ్డా.. ఇకపై ఇష్టపడుతా.. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు మీ అండ్ మై వైఫ్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. అయితే సూర్య పెట్టిన కామెంట్‌పై అప్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ అతన్ని ట్రోల్ చేశాడు. ''భాయ్.. పెళ్లిరోజు శుభాకాంక్షలు.. నీ బ్యాటింగ్ కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నావా'' అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్లో సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహించగా.. రషీద్ ఖాన్ ఎస్ఆర్హెచ్కు ఆడాడు. కాగా కరోనా మహమ్మారితో బీసీసీఐ సీజన్ మధ్యలోనే రద్దు చేసింది. రద్దయ్యే సమయానికి లీగ్‌లో 29 మ్యాచ్‌లు జరగ్గా.. మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఇక సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య యూఏఈ వేదికగా మిగిలిన సీజన్‌ను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది. చదవండి: మాట తప్పావంటూ ట్రోలింగ్.. కోహ్లి కౌంటర్ Suryakumar Yadav: కోహ్లి నన్ను స్లెడ్జ్ చేశాడు.. సంతోషం! View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) -
సచిన్.. నన్ను ఓ జర్నలిస్టులా పరిచయం చేశాడు: భార్య అంజలీ
ముంబై: కెరీర్ ఆసాంతం ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహ స్వప్నంలా నిలిచిన క్రికెట్ గాడ్ సచిన్ రమేష్ టెండూల్కర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను అతని భార్య అంజలీ టెండూల్కర్ వెల్లడించింది. వీరి జోడీ వివాహ బంధంలోకి అడుగుపెట్టి 26 వసంతాలు పూర్తైన సందర్బంగా ఆమె సచిన్ ను గూర్చిన ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది. ఆన్ ఫీల్డ్ బౌలర్లను గడగడలాడించే సచిన్ .. మైదానం వెలుపల మాత్రం మహా సిగ్గరి అని, అతను చాలా సున్నిత మనస్కుడని, అనవసరంగా ఎవరితో మాట కలపడని పేర్కొంది. ఈ సందర్బంగా ఆమె.. సచిన్ తో 26 ఏళ్ల బంధాన్ని నెమరేసుకుంది. తాము మొట్టమొదటిసారి ఎయిర్ పోర్టులో కలిసామని, తమ పరిచయం ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా బలపడిందని చెప్పుకొచ్చింది. అయితే, సచిన్.. తనను మొదటిసారి అతని తల్లిదండ్రులకు ఓ జర్నలిస్టులా పరిచయం చేశాడని, నన్ను అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ చేసేందుకు చాలా కసరత్తులే చేశాడని గుర్తు చేసుకుని నవ్వుకుంది. తమ పరిచయమైనా తొలినాళ్లలో ఇప్పటిలా ఇంటర్నెట్,. సోషల్ మీడియా సదుపాయాలు లేవని, ఫోన్లు ఉన్నప్పటికీ.. అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో తాము ఉత్తరాల ద్వారా సంభాషించుకునేవారిమని తెలిపింది. కాగా సచిన్, అంజలీల వివాహం 1995లో జరిగింది. వీరికి అర్జున్, సారా అనే ఇద్దరు సంతానం. కొడుకు అర్జున్ ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. చదవండి: రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన కోహ్లి దంపతులు .. -
Jr NTR Marriage Day: వైరలవుతున్న పెళ్లి పత్రిక
నందమూరి వారసుడు, నవరసాలు పలికించగల ధీరుడు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్. నటనకు ప్రాణం పెట్టే తారక్ కుటుంబాన్ని కూడా ఎంతో ప్రాణంగా చూసుకుంటాడు. నేడు(మే 5) ఆయన పెళ్లి రోజు. దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్, భార్య లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఫొటోలు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఆనాడు డిజైన్ చేయించిన వివాహ పత్రిక విశేషంగా ఆకట్టుకుంటోంది. పలువురు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్‌కు పెళ్లిరోజు శుభాకాంఓలు తెలియజేస్తున్నారు. A unique Wedding invitation👌😍#KomaramBheemNTR || #NTR || @tarak9999 pic.twitter.com/pVnu93XCas — NTR THE LEADER (@NTR_THE_LEADER) May 5, 2021 కాగా 2011లో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం జరిగింది. 2014లో వీరికి తొలి సంతానంగా అభయ్‌రామ్ జన్మించాడు. 2019లో భార్గవ్ రామ్ పుట్టాడు. ఈ మధ్యే అతడిని బండి మీద ఎక్కించుకుని తారక్ హైదరాబాద్ రోడ్ల మీద చక్కర్లు కొట్టిన ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే ప్రస్తుతం అతడు కొమురం భీమ్‌గా ఆర్ఆర్ఆర్ (రౌధ్రం రణం రుధిరం) సినిమా చేస్తున్నాడు. సుమారు రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు రాజమౌళి, రామ్‌చరణ్, తారక్. ఎట్టకేలకు దీని కథ క్లైమాక్స్‌కు వచ్చింది. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దీంతో త్వరలోనే ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టనున్నారు. (ఎన్టీఆర్ దంపతుల ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Happy Wedding Anniversary in Adv ❤️💐తారకరామ లక్ష్మిప్రణీత💐❤️@tarak9999 #KomaramBheemNTR pic.twitter.com/EGurk069B9 — Faridantr (@faridantr) May 4, 2021 Happy Wedding Anniversary Anna @tarak9999 ❤️#KomaramBheemNTR pic.twitter.com/5t8qlNpviJ — Rock Tollywood (@TeamRockTwood) May 5, 2021 చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వెనకడుగు వేసిన యంగ్ టైగర్! -
మొదటిసారి కూతురి ఫోటోను షేర్ చేసిన హరితేజ
ప్రముఖ నటి, యాంకర్ హరితేజ మొదటి సారి తన చిన్నారిని పరిచయం చేసింది. పెళ్లిరోజు సందర్భంగా తమ కూతురి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..పాప రాకతో తమ వివాహ వార్షికోత్సవం మరింత ప్రత్యేకంగా మారిందని తెలిపింది. భర్త దీపక్‌తో కలిసి బిడ్డను ఎత్తుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా పలవురు బుల్లితెర ప్రముఖులు సహా నెటిజన్లు హరితేజకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఏప్రిల్ 5న హరితేజ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బుల్లితెరపై సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. తర్వాత యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ గుర్తింపుతో బిగ్‌బాస్ 1లోకి వెళ్లి తనదైన నటనతో బుల్లితెర ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది. 2015లో ఆమె వివాహం జరిగింది. రాజా ది గ్రేట్, హిట్, సరిలేరు నీకెవ్వరు, ప్రతిరోజు పండగే, ఎఫ్ 2, అరవింద సమేత, యూటర్న్, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో హరితేజ నటించిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) చదవండి: నటి సీమంతం వేడుక.. బేబీ బంప్‌తో డ్యాన్స్ మన శరీరం కేవలం అందుకోసమే కాదు కదా : రేణు దేశాయ్ -
నన్ను వజ్రాల నెక్లెస్‌తో అలంకరించినందుకు థ్యాంక్స్: సన్నీలియోన్
‘పలాస’ చిత్రంలోని ‘నాదీ నక్కిలీసు గొలుసు’ పాట గుర్తుంది కదా! ఇది సినిమాలోని స్పెషల్ సాంగ్. ఇప్పుడు సన్నీ లియోన్ కూడా నాదీ నక్కిలీసు గొలుసు అంటున్నారు. అయితే ఇది పాట కాదు. ఎంతో ప్రేమగా భర్త డేనియల్ వెబర్ కానుకగా ఇచ్చిన వజ్రాల నెక్లెస్ గురించి చెబుతున్నారు. ఈ ఇద్దరికీ పెళ్లయి, పదేళ్లయింది. ‘‘నన్ను వజ్రాల నెక్లెస్‌తో అలంకరించినందుకు థ్యాంక్స్. పదమూడేళ్ళ అనుబంధంలో పదేళ్ల వివాహ జీవితం మనది(భర్తని ఉద్దేశించి). మన జీవన ప్రయాణం అత్యద్భుతంగా ఉంటుందని ఒకరికొకరం చేసుకున్న ఒక్క ప్రామిస్ వల్ల ఈ రోజు మనం ఈ మనోహరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు సన్నీలియోన్. ప్రస్తుతం మలయాళంలో ‘షీరో’ చిత్రంతో పాటు ఓ టీవీ షోతో సన్నీ ఫుల్ బిజీగా ఉన్నారు. 2017లో నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు డేనియల్ వెబర్, సన్నీ. ఆ తర్వాత సరోగసీ ద్వారా ఇద్దరు బిడ్డలకు వారు తల్లితండ్రులయ్యారు. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
ప్రియమైన శ్రీమతికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు: వార్నర్
చెన్నై: ఆసీస్ స్టార్ ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ సారధి డేవిడ్ వార్నర్.. ఆదివారం తన భార్య క్యాండీస్ వార్నర్‌కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. ఏప్రిల్ 4న తమ ఆరో వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య క్యాండీస్ చేతిపై ముద్దుపెట్టుకుంటున్న ఫొటోను వార్నర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. "6 సంవత్సరాల బలమైన బంధం, నా ప్రియమైన శ్రీమతికి వార్షికోత్సవ శుభాకాంక్షలు, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా" అంటూ క్యాప్షన్‌ను జోడించాడు. భర్త పోస్ట్‌పై భార్య క్యాండీస్ స్పందిస్తూ.. "మన ప్రయాణంలో ఆరేళ్లు హాయిగా గడిచిపోయాయి, మన బంధం జీవితకాలం ఇలాగే సాగిపోవాలని కోరుకుంటూ.. నా ప్రియమైన భర్తకు పెళ్లిరోజు శుభాకాంక్షలు" అంటూ ఇన్‌స్టాలో పేర్కొంది. కాగా, వార్నర్ భారత్‌కు బయలుదేరేముందు కూడా తన భార్యను మిస్సవుతానంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో "తన డార్లింగ్‌తో(భార్య) చివరి పెగ్" అంటూ భార్య క్యాండీస్‌పై ప్రేమను ఒలకబోసాడు. ఇదిలా ఉండగా, మరో ఐదు రోజుల్లో ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ కోసం అన్ని జట్లు తమ సన్నాహకాలను మొదలుపెట్టాయి. ఆయా జట్ల ఆటగాళ్లు ఇప్పటికే తమ ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేసిన హోటల్స్‌కు చేరుకున్నారు. సన్‌రైజర్స్ సారధి డేవిడ్ వార్నర్, స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ శుక్రవారమే చెన్నై చేరుకున్నారు. వీరు ప్రస్తుతం యాజమాన్యం ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉంటున్నారు. ఏప్రిల్ 11న చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. చదవండి: నా డార్లింగ్‌తో చివరి పెగ్: వార్నర్ -
అప్పుడే పదేళ్లు.. తాజ్‌మహల్ వద్ద బన్నీ, స్నేహ హల్చల్
ఆగ్రా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులు నేడు(శనివారం) 10వ వెడ్డింగ్ యానివర్సిరీని జరుపుకుంటున్నారు. మార్చి 6, 2011న అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఈ రోజుతో వీరి వివాహ బంధానికి పది సంవత్సరాలు.టాలీవుడ్ స్టార్ హీరోగా అల్లుఅర్జున్ ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఏం మాత్రం టైం దొరికినా కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్పులకు వెళ్తుంటారు. శనివారం (నేడు) పదవ వార్షికోత్సవం సందర్భంగా అల్లుఅర్జున్ భార్య స్నేహతో కలిసి ప్రేమసౌధం తాజ్‌మహల్‌ను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ..ఈ పదేళ్లు ఎంతో అద్భుతంగా గడిచాయని, ఇంకెన్నో యానివర్సిరీలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా స్టార్ కపుల్ అల్లుఅర్జున్- స్నేహ రెడ్డి దంపతులకు అటు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అల్లు అర్జున్, స్నేహాకు 2014లో అయాన్, 2016లో అర్హ జన్మించారు. ఇక సినిమాల విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కానుంది. చదవండి : శర్వానంద్‌కి సర్ప్రైజ్ ఇచ్చిన మెగా హీరో.. తాప్సీని మరోసారి టార్గెట్ చేసిన కంగనా Happy 10th Anniversary to us Cutie . What a wonderful journey of ten years ... and many more to come ❤️ pic.twitter.com/d4g6X5at6A — Allu Arjun (@alluarjun) March 6, 2021 -
అప్పా.. అమ్మా.. శుభాకాంక్షలు
‘‘ఆమె అందర్నీ తన కుటుంబంలా భావించింది. ఆయన ఆమె కుటుంబాన్ని తన కుటుంబం అనుకున్నాడు. ఇద్దరూ కలసి ఒక మంచి కుటుంబం ఏర్పడటానికి కారణం అయ్యారు’’ అని తన తల్లిదండ్రులు రజనీకాంత్, లత గురించి ఐశ్వర్య అన్నారు. ఫిబ్రవరి 28 రజనీ–లత నలభయ్యో వివాహ వార్షికోత్సవం. 1981లో ఈ ఇద్దరి పెళ్లి జరిగింది. నలభయ్యో వార్షికోత్సవం సందర్భంగా రజనీ–లతల పెద్ద కుమార్తె ఐశ్వర్యా ధనుష్ ఇన్ స్టాగ్రామ్‌లో ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘ఒక విజయవంతమైన వైవాహిక జీవితానికి గల కారణాలను మా అమ్మానాన్న జీవితాలను చూసి తెలుసుకున్నాను. జీవితం అనే ప్రతి మలుపులోనూ మా గ్రాండ్ పేరెంట్స్ దేవదూతల్లా ఈ ఇద్దర్నీ కాపాడుకుంటూ వస్తున్నారని నా నామ్మకం. మ్యారేజ్ అంటే ఒకరి బాధ్యతను ఒకరు మోయడం అనే విషయాన్ని అమ్మానాన్నని చూసి తెలుసుకున్నాను. ఒక బంధం బలపడటానికి భార్యాభర్త మధ్య ఉండే స్నేహం కారణమవుతుందనే విషయం అర్థమైంది. వ్యక్తులుగా ఎదిగే ప్రతి దశలోనూ జీవితం తాలూకు ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ, జీవితానికి అర్థం తెలుసుకుంటూ ఉంటాం’’ అంటూ అప్పా (నాన్న).. అమ్మా... మీ ఇద్దరికీ సూపర్ డూపర్ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’’ అన్నారు ఐశ్వర్య. -
భార్యకు కానుక చంద్రుడిపై స్థలం కొనిచ్చాడు
చంద్ర మండలంపై కాలు మోపిన తొలి మానవుడు నీల్ ఆర్మ్‌స్రాంగ్ అయితే, చంద్ర మండలంపై ప్లాటు కొన్న తొలి రాజస్థానీ.. బహుశా ధర్మేంద్ర అనీజా కావచ్చు. ధర్మేంద్రా? ఎవరాయన? ఒక భర్త! ఈ భూగోళంపై ఆయన ఉండేది రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో. ఆయన భార్య స్వప్న ఉండేది మాత్రం చల్లని జాబిల్లి వంటి ఆయన హృదయంలో. అందుకే కావచ్చు, తమ పెళ్లి కానుకగా చంద్రుడిపై మూడెకరాల స్థలం కొని ఆమెకు కానుకగా ఇచ్చాడు! అయితే ఆ మూడెకరాలూ స్వప్న తలవాల్చే ధర్మేంద్ర ఛాతీ కన్నా విశాలమైనదేమీ కాబోదు. ఆయన ఆమెను ఎంతలా ప్రేమిస్తాడో పైకి చెప్పుకుంటే ఆయన ప్రేమను చిన్నబుచ్చినట్లే. అందుకే ఎవరికీ అందనంత ఎత్తులో తన ప్రేమ కానుకను ఉంచుకున్నాడు. కానుకను ఉంచాడంటే భార్య కోసం తన హృదయ పీఠాన్ని ఉంచాడనే. డిసెంబర్ 14 న ఈ దంపతుల 8 వ పెళ్లి రోజు. ఆ రోజు కోసం ఏడాది ముందే నెలరాజుకు నిచ్చెన వేశాడు ధర్మేంద్ర. అంత పెద్ద ప్రాసెస్ అది. న్యూయార్క్ సిటీలోని ‘లూనా సొసైటీ ఇంటర్నేషనల్’ కు మెయిళ్లు పెట్టి, కొన్ని వందల డాలర్లు పంపి ప్లాట్‌ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ‘ఎంతయ్యింది ధర్మేంద్రా’ అని లోకల్‌గా ఉండే భర్తలు అడుగుతుంటే.. ‘అమూల్యం’ అంటున్నాడు. స్వప్నదీ అదే మాట. ‘‘ఆయన ఏం ఇచ్చారని, ఎంతకు కొన్నారని నేను చూడటం లేదు. స్పెషల్‌గా ఏదైనా ఇవ్వాలన్న ఆయన మనసులోని ప్రేమ అనే వెన్నెలలో తడిసి ముద్ద అవుతున్నాను’’ అంటోంది ధర్మేంద్ర భుజంపై వాలిపోతూ. తగిన భార్యే. -
భార్యకు చిరకాలం గుర్తుండిపోయే గిఫ్ట్
జైపూర్: పెళ్లి కుదిరితే చాలు.. అమ్మాయిలు, అబ్బాయిలు బోలెడు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటూ ఒకరిమీద ఒకరు ఎనలేని ప్రేమ చూపించుకుంటారు. పెళ్లైన కొత్తలో అయితే భార్యను విహార యాత్రలకు, సినిమాలకు, షాపింగ్‌లకు తీసుకెళ్తూ మా ఆయన బంగారం అనిపించుకునేందుకు తెగ తాపత్రయ పడతారు. కానీ రోజులు నెలలు, నెలలు సంవత్సరాలు అయ్యే కొద్దీ పరిస్థితులు తలకిందులుగా మారుతుంటాయి. ఇల్లాలు ఏదైనా కావాలని నోరు తెరిచి అడిగితే భర్త ఒంటికాలిపై లేస్తారు. గిఫ్టులు కాదు కదా కనీసం ఓ మంచి చీర కూడా కొనివ్వడానికి ఆసక్తి చూపరు. కానీ ఇక్కడ చెప్పుకునే ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు చిరకాలం గుర్తుండిపోయే బహుమతినిచ్చాడు. (చదవండి: ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే) రాజస్థాన్‌లోని అజ్మర్ ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర అనీజాకు భార్య అంటే చెప్పలేనంత ప్రేమ. వారి ఎనిమదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య సాప్నా అనీజాకు ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా చంద్రమండలంలో మూడు ఎకరాలను కొనేసి ఆమెకు బహుమతిగా ఇవ్వడంతో ఆమె సంతోషంలో మునిగి తేలుతోంది. ఈ గిఫ్ట్ గురించి ధర్మేంద్ర మాట్లాడుతూ.. 'డిసెంబర్ 24న మా పెళ్లి రోజు. అందరిలా కార్లు, నగలు కాకుండా నా భార్యకు ఏదైనా స్పెషల్ బహుమతి ఇద్దామనుకున్నా. అలా చంద్రుడి మీద ప్లాట్ కొనిచ్చాను. బహుశా చంద్రమండలం మీద స్థలాన్ని కొన్న మొదటి రాజస్థాన్ వ్యక్తిని నేనే అనుకుంటా' అని చెప్పుకొచ్చాడు. 'ప్రపంచం అవతల నుంచి బహుమతి అందుకున్నందుకు సంతోషంగా ఉంది. కొనుగోలు సర్టిఫికెట్ చూస్తుంటే నాకిప్పుడు చంద్రుడి మీదే ఉన్నట్లుగా అనిపిస్తోంది' అని అతని భార్య సాప్నా ఆనందంతో గాల్లో తేలుతోంది. అమెరికాలోని లూనా సొసైటీ ఇంటర్నేషనల్ కంపెనీ ద్వారా అనీజా.. చందమామ మీద స్థలాన్ని కొనుగోలు చేశాడు. (చదవండి: అదృష్టం: చెత్త కుప్పనుంచి మంత్రి ఆఫీసుకు..) -
విరుష్క బంధానికి మూడేళ్లు.. జీవితాంతం తోడుగా
సాక్షి, ముంబై: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ నటి అనుష్క శర్మ నేటితో ( శుక్రవారం, డిసెంబరు 11, 2020) ముచ్చటగా మూడవ వివాహ వార్షికోత్సవంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఈ సెలబ్రిటీ కపుల్‌కి సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ కురుస్తోంది. ముఖ్యంగా త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్న తరుణంలో ఈ ఏడాది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు క్రికెట్ అభిమానులు,ఇటు బాలీవుడ్ ఫ్యాన్స్ విరుష్క జంటకు శుభాకాంక్షలతో సందడి చేస్తున్నారు. దీంతో ట్విటర్లో ట్రెండింగ్‌గా విరుష్కాల పెళ్లిరోజు మారడం విశేషం. ఆల్ ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్ కోసం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్ కోహ్లీ తమ మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య అనుష్కకు ట్విటర్ ద్వారా విషెస్ తెలిపారు. అందమైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. అటు అనుష్క శర్మ కూడా ఇన్‌స్టాలో తన ఫీలింగ్స్‌ను పంచుకున్నారు. మూడేళ్ల బంధం.. త్వరలోనే ముగ్గురం కాబోతున్నాం..మిస్ యూ అంటూ వ్యాఖ్యానించారు. 2017, డిసెంబర్ 11న కోహ్లీ, అనుష్కల పెళ్లి జరిగింది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరిగిన ఈ పెళ్లి అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన సంగతి తెలిసిందే. 3 years and onto a lifetime together ❤️ pic.twitter.com/a30gdU87vS — Virat Kohli (@imVkohli) December 11, 2020 View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) -
థాంక్యూ డియర్ హజ్బెండ్: రాధిక
కన్నడ స్టార్ యశ్ , రాధిక పండిత్‌ల పెళ్లిబంధానికి నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా బుధవారం బెంగుళూరులోని తమ నివాసంలో యానివర్సిరీ వేడుకలను జరుపుకున్నారు. కరోనా కారణంగా చాలా సింపుల్‌గా ఈ సెలబ్రేషన్స్‌ను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను రాధిక పండిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..థ్యాంక్యూ డియర్ హజ్బెంట్ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. వెడ్డింగ్ డే రోజును మరింత స్పెషల్‌గా చేసిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశారు. యశ్ -రాధిక నాలుగో వివాహ వార్షికోత్సవానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 2007లో నందగోకులా అనే టెలివిజన్ సీరియల్లో నటించే సమయంలోనే యశ్- రాధిక ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత డేటింగ్ అనంతరం 2016 డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరికి కొడుకు యాథర్వ్, కూతురు ఐరా ఉన్నారు. (ఐరా, యశ్‌ల ఐస్‌క్రీమ్ వీడియో వైరల్) ఇక సినిమాల విషయానికి వస్తే యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్యాన్ ఇండియన్ చిత్రం ‘కేజీయఫ్’. ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి విజయం సాధించింది. యశ్‌కు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘కేజీయఫ్’ రెండో భాగం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ఇటీవల ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. 'కేజీయఫ్ 2’ టీజర్‌ను యశ్ బర్త్‌డే సందర్భంగా జనవరి 8న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. (కేజీఎఫ్.. ఛాప్టర్: 2: అధీరా రెడీ..) View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) . -
నా రియల్ లైఫ్ బాలీవుడ్ హీరో..
ముంబై: గ్లోబల్ కపుల్ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్‌లు ఈ నెలలో(డిసెంబర్ 2వ తేదీ) వారి సెంకడ్ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియాంక-నిక్‌లు వారి పెళ్లినాటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఒకరికోకరూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రియాంక వారి పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ.. ‘రెండేళ్లు గడిచాయి.. కానీ జీవితాంతం వరకు’ అనే క్యాప్షన్‌తో తన భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా నిక్ జోనస్ కూడా వారి హిందూ వెడ్డింగ్ ఫొటోలను షేర్ చేస్తూ.. ‘రెండు రోజులు.. రెండు సంప్రదాయాలు.. ఇప్పడు రెండేళ్లు. తన దేశంలోనే ప్రియాంకను హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం చాలా గౌరవంగా ఉంది. సమయం ఎంత త్వరగా గడిచిపోయిందో.. నమ్మలేకపోతున్న. హిందూ వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రియాంక’ అంటూ విషెస్ తెలిపాడు. (చదవండి: ప్రియాంకా చోప్రా దూకుడు : బిగ్ న్యూస్) View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) నిక్ పోస్ట్‌కు ప్రియాంక ‘నా నిజ జీవితంలో బాలీవుడ్ హీరో.. ఐ లవ్ యు హ్యాండ్సమ్’ అంటూ కామెంట్ పెట్టారు. కాగా ఆమెరికా పాప్ సింగర్ అయిన నిక్ జోనస్, ప్రియాంకలు కొంతకాలం ప్రేమించుకుని 2018 డిసెంబర్ 2న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ భిన్న సంప్రదాయానికి చెందిన వారు కావడంతో వీరి పెళ్లి హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో జరిగింది. ఇండియాలో జోధ్‌పూర్‌లోని ఉమైడ్ భవన్ ప్యాలెస్‌లో కటుంబ సభ్యులు, సన్నిహితులు, బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖుల మధ్య ప్రియాంక-నిక్‌ల వివాహం రెండు రోజులు, రెండు సంప్రదాయల్లో జరిగింది. (చదవండి: మిస్ వరల్డ్ గెలిచిన తర్వాత అమ్మ నాతో..) -
నిక్-ప్రియాంకల పెళ్లి బంధానికి రెండేళ్లు..
ముంబై : బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌లు రెండవ వివాహ వార్సికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక బెస్ట్ ఫ్రెండ్ తమన్నా దత్తా వీరికి యానివర్సిరీ విషెస్ తెలియజేస్తూ..ఎల్లప్పుడూ ప్రేమతో, సంతోషంగా ఉండండి అంటూ వారి పెళ్లిరోజు ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.ప్రేమ పక్షులుగా ఉన్న నికియాంకలు(నిక్ జోనాస - ప్రియాంక చోప్రా)లు 2018 డిసెంబర్1న పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. క్రైస్తవ సంప్రదాయంతో పాటు భారతీయ సంప్రదాయాన్ని కూడా ఆచరించి రెండు సార్లు వివాహం చేసుకున్నారు. (నా భర్త, గోడ సాయం తీసుకున్నా: అనుష్క) డిసెంబర్1న జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం,ఆ మరుసరి రోజు డిసెంబర్ 2న భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా న్యూఢిల్లీ, ముంబై రెండు చోట్ల వివాహ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా జరుపుకున్నారు.సినిమాల విషయానికి వస్తే.. ప్రియాంక చివరగా స్కై ఈజ్ పింక్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఆమె నటించిన వైట్ టైగర్, రాజ్‌కుమార్ రావు, ఆదర్ష్ గౌరవ్ సినిమాలు విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా బ్రేక్ పడింది. అంతేకాకుండా ప్రియాంక హాలీవుడ్ మూవీలో నటించబోతున్నారు. 2016 జర్మన్ భాషా చిత్రం ఎస్ఎంఎస్ ఫర్ డిచ్ రీమేక్ లో నటించే అవకాశం దక్కించుకున్నారు. (కేజీయఫ్ కాంబినేషన్లో ప్రభాస్ ప్యాన్ ఇండియా) -
అందమైన ప్రయాణం
‘‘మా జీవితంలో మరో అద్భుతమైన ఏడాది ప్రారంభమైన రోజు ఇది (అక్టోబర్ 17). నా కలల రాకుమారుడితో ప్రతిరోజూ నా జీవితం కొత్తగా, సాహసోపేతంగా ఉంటోంది. మా ఇద్దరి మనస్తత్వాలు వేరు. అయినప్పటికీ నా జీవితంలో నువ్వు (భర్త శ్రీరామ్ నేనేని ఉద్దేశించి) ఉండటాన్ని గొప్పగా అనుకుంటాను. నాకూ నీకూ హ్యాపీ యానివర్సరీ.. రామ్’’ అని పెళ్లిరోజు సందర్భంగా మాధురీ దీక్షిత్ తన ఫీలింగ్స్‌ని పంచుకున్నారు. ‘‘21 ఏళ్ల క్రితం నా సోల్‌మెట్‌ను కనుగొన్నాను. అప్పటినుండి మా ప్రయాణాన్ని ప్రారంభించాం. ప్రతిరోజూ మాకు కొత్తగా, అందంగా ఉంటుంది. ఇలాగే మా ప్రయాణాన్ని మేమిద్దరం కలిసి ఎంతో ఎడ్వంచరస్గా కొనసాగిస్తాం. హ్యాపీ ట్వంటీఫస్ట్ యానివర్సరీ’’ అన్నారు శ్రీరామ్ నేనే. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే అమెరికాలో డాక్టర్‌గా చేస్తున్న శ్రీరామ్ నేనేను 21 ఏళ్ల క్రితం అక్టోబర్ 17న వివాహం చేసుకున్నారు మాధురి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
పెళ్లి విషయం దాచాలనుకోలేదు: పూనమ్
పూనమ్ పాండే.. సోషల్ మీడియా నెటిజన్లకు ఈ పేరు సుపరిచితం. అందాల ఆరబోత, వివాదాస్పద కామెంట్లు, వీడియోలతో ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఈ భామ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ప్రేమిస్తున్న తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను ఈ నెల 1న పూనమ్ పాండే పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలను గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. 'నీతో ఏడు జన్మలు కలిసి నడవాలనుకుంటున్నాను' అనే క్యాప్షన్ కూడా జత చేశారు. ఈ ఇద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఏడడుగులు వేసిన వేళ) ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనమ్ తన ప్రేమ ప్రయాణాన్ని,పెళ్లి గురించి మాట్లాడారు. సామ్‌తో పెళ్లి జరిగిన విషయాన్ని దాచి ఉంచడం తన ఉద్ధేశ్యం కాదని అన్నారు. ‘సామ్ నేను చాలా పేరు పొందిన జంట. కరోనా పరిస్థితి కారణంగా మా వివాహం ప్రైవేటుగా ఉంచాలి అనుకున్నాం అంతే. ఒక ప్రాజెక్ట్ షూటింగ్ సందర్భంగా సామ్‌ను కలిశాను. అతని ప్రేమలో పడేందుకు నాకు మూడు నెలలు పట్టింది. అప్పటి నుంచి మా ప్రేమ ఓ రొమాంటిక్ బాలీవుడ్ సినిమా లాగా సాగింది. నా దృష్టిలో సామ్ చాలా తెలివైన వాడు. గొప్పవాడు కూడా. మా ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు దగ్గరగా ఉంటాయి. అతను నా బెస్ట్ ఫ్రెండ్. మా బంధం బలమైనది అందుకే ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నాం. మహమ్మారి కారణంగా హనీమూన్ ట్రిప్ ఆగిపోయింది. పరిస్థితులు చక్కబడ్డాక లాస్‌ఏంజెలెస్‌కు వెళ్లాలి అనుకుంటున్నాం’ అని చెప్పారు. (బాయ్ ఫ్రెండ్‌తో పూనమ్ నిశ్చితార్థం!) ఇక మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ 2013లో నాషాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. దీని కారణంగానే సోషల్ మీడియాలో మంచి ఇమేజ్ సంపాదించారు. జూలై 27న బాయ్‌ప్రెండ్ సామ్‌తో పూనమ్ నిశ్చితార్థం చేసుకున్నారు. సుమారు రెండేళ్లుగా సామ్‌తో సహజీవనం చేసి పూనమ్ బాంద్రాలోని వారి ఇంటిలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నిశ్చితార్థం చేసుకున్న రెండు నెలల్లోనే పెళ్లి పీటలు ఎక్కి అతనితో ఏడడుగులు వేశారు. -
పెళ్లిరోజును జరుపుకున్న ఎస్పీ బాలు దంపతులు
సాక్షి, చెన్నై : కోవిడ్-19తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన 51వ వార్షికోత్సవాన్ని ఆసుపత్రిలో జరుపుకున్నట్లు సమాచారం. వైద్యుల సమక్షంలో, అన్ని జాగ్రత్తల నడుమ బాలు దంపతులు శనివారం సాయంత్రం పెళ్లిరోజును జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్పీ బాలు సతీమణి సావిత్రి ఆసుపత్రికి వెళ్లారని, ఐసీయూలోనే దంపతులు కేక్ కట్ చేసినట్లు అక్కడి తమిళ మీడియా కొన్ని ప్రకటనలు విడుదల చేసింది. దీంతో ఈ పోస్టులు వైరల్‌గా మారాయి. డాక్టర్లు, ఐసీయూ సిబ్బంది నడుమ బాలు 51వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నట్లు సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిని ఆసుపత్రి వర్గాలు కానీ, బాలు కుమారుడు ఎస్పీ చరణ్ కానీ అధికారికంగా ప్రకటించలేదు. (వైద్యం, ఫిజియోథెరపీకి స్పందిస్తున్నారు: ఎంజీఎం) కరోనా సోకడంతో ఎస్పీ బాలు ఈ నెల 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తొలుత ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ మధ్యలో కాస్త విషమించింది. దాంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. బాలు ఆరోగ్య ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆస్పత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేస్తూ వచ్చాయి. అలాగే, ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సైతం వీడియో సందేశాల ద్వారా సమాచారం అందిస్తున్నారు. గత వీడియోలో దేవుని ఆశీర్వాదంతో సోమవారం ఓ శుభవార్త వినబోతున్నారని చరణ్ ప్రకటించాడు. దీంతో ఎస్పీ బాలు ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిందని, సోమవారం డిశ్చార్జి కాబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. (వచ్చే సోమవారం శుభవార్త వింటాం: ఎస్పీ చరణ్) -
చనిపోయిన తండ్రి నుంచి లేఖ
మనుషులు శాశ్వతం కాదేమో.. కానీ వారి మధ్య ఉన్న ప్రేమ శాశ్వతం.. అలైసా మెండోజా... పది నెలల క్రితమే తండ్రిని పోగొట్టుకుంది. అల్లారుముద్దుగా చూసుకునే నాన్న లేడన్న బాధను కొద్దికొద్దిగా దిగమింగుతూ మామూలు మనిషి అవుతోంది. ఇంతలో ఓ రోజు ఆమెకు చనిపోయిన తండ్రి నుంచి మెయిల్ వచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. దాన్ని ఓపెన్ చేయాలంటేనే ఆమెకు వెన్నులో వణుకు పుట్టింది. భయంతో కొద్ది రోజులపాటు దాన్ని పక్కన పెట్టినప్పటికీ ఓ రోజు ధైర్యం చేసి తెరచి చూసింది. అందులో తన భార్య 27వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తల్లిని సర్ప్రైజ్ చేయమంటూ కూతురిని కోరాడు. ఎలా సెలబ్రేట్ చేయాలో క్షుణ్ణంగా వివరించాడు. భార్యకు ఇష్టమైన గులాబీ పూలు భార్యకు ఇష్టమైన పువ్వుల నుంచి బెలూన్ల వరకు ప్రతి అంశాన్ని పొందుపర్చాడు. కూతురిని కూడా ఆ ఒక్కరోజు బుద్ధిగా నడుచుకోమని చెప్పాడు. అంతేకాదు వివాహ వార్షికోత్సవంతోపాటు, తర్వాత రానున్న ప్రేమికుల దినోత్సవం, పుట్టిన రోజు పండుగలకు తన భార్యకు ఇష్టమైన గులాబీ పూలను అందజేసేందుకు దగ్గరలోని పూలవ్యాపారికి ఇప్పటికే సరిపడా డబ్బులు చెల్లించాడని అతడి కూతురు వెల్లడించింది. తండ్రి కోరిక మేరకు కూతురు కూడా తల్లి పెళ్లిరోజును ఘనంగా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకుంది. జూన్ 10న పెళ్లి రోజు కావడంతో అమ్మను సర్ప్రైజ్ చేసేందుకు మెండోజా ముందు రోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు ఎంతగానో కష్టపడింది. ఈ పెళ్లి రోజును తల్లి ఎప్పటికీ మర్చిపోదు ఇల్లును అందంగా డెకరేట్ చేస్తూ, మధ్యమధ్యలో ప్రేమకు జ్ఞాపకాలుగా మిగిలిన ఫొటోలను అతికించే పనిలో నిమగ్నమైంది. తల్లికి ఇష్టమైన వంటకాలు కూడా సిద్ధం చేసి ఉంచింది. అనంతరం ఉదయం ఆరు గంటలకు తల్లిని నిద్ర లేపగా ఆమె తన చుట్టూ ఉన్నది చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయింది. ఈ సర్ప్రైజ్ చూసి కన్నీటి పర్యంతం అయ్యింది. "అమ్మ ముఖంలో ఆనందం కనిపించగానే నా శ్రమ, అసలసటకు ఫలితం లభించింది" అంటూ మెండోజా ఈ విషయాన్నంతటినీ ఫేస్బుక్లో రాసుకొచ్చింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ నిజంగా అద్భుతం, కంటతడి పెట్టించారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
‘ఇప్పుడే కాదు.. ఎప్పటికీ మనం కలిసే ఉంటాం’
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ రోజు(శనివారం) తొమ్మిదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సందర్భంగా భార్య సుప్రీయ మీనన్‌కు పృథ్వీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే పృథ్వీరాజ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ‘ఆదుజీవితం’’ సినిమా షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లిన ఆయన లాక్డౌన్ కారణంగా చిత్ర యూనిట్‌తో సహా అక్కడే చిక్కుకుపోయారు. ఈ ప్రత్యేక రోజున పృథ్వీరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ... ‘9 సంవత్సరాలు. ఇప్పుడే కాదు. ఎప్పటికీ మనం కలిసే ఉంటాం’ అంటూ భార్య మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు. (లాక్డౌన్.. 9.30 గంటలు బెడ్‌పైనే స్టార్ హీరో) View this post on Instagram 9 years ❤️ Apart for now..together forever! #LoveInTheTimeOfCorona A post shared by Prithviraj Sukumaran (@therealprithvi) on Apr 24, 2020 at 11:43am PDT అలాగే సుప్రియ కూడా భర్త పృథ్వీకి పెళ్లి రోజు విషెస్ తెలిపారు. ‘9వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ తొమ్మిదేళ్లలో మొదటిసారి మనం పెళ్లి రోజున వేరువేరుగా ఉన్నాం. త్వరగా వచ్చి విషెస్ చెబుతారని మీ కోసం ఎదురు చూస్తున్నాను’. అంటూ పెళ్లినాటి ఫోటోను షేర్ చేశారు. కాగా పృథ్వీరాజ్ తొమ్మిదేళ్ల క్రితం కేరళలోని పాలక్కాడ్‌లో సుప్రీయను వివాహం చేసుకున్నారు. వీరికి 2014 సెప్టెంబర్ 8న కూతురు అలంకృత జన్మించింది. (కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ? ) View this post on Instagram Happy 9th Anniversary @therealprithvi! First time in 9 years that we are spending the day apart! But what do?! Waiting for you to come back soon and make this up to me! #LoveInTheTimesOfCorona#9DoneForeverToGo 🧿 A post shared by Supriya Menon Prithviraj (@supriyamenonprithviraj) on Apr 24, 2020 at 11:51am PDT -
కేక్ కటింగ్: భర్తకు పాకిన కరోనా
లక్నో: ఆమెకు కరోనా సోకింది. అయినప్పటికీ ఆ విషయాన్ని పక్కనపెట్టి తన పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంది. ఈ తప్పిదం వల్ల ఆమె భర్తకు కూడా కరోనా సోకింది. అంతేకాక లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనల కింద ఆమెతోపాటు వేడుకలో పాల్గొన్న మరో ముగ్గురిపై పోలీసులు బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలు.. ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన బీజేపీ మహిళా నాయకురాలు, బీజేపీ మహిళా మోర్చా మాజీ వైస్ ప్రెసిడెంట్ ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ఆయుర్వేద వైద్యుడిని కలవడంతో ఆమెకు కరోనా సోకింది. దీంతో ఆమెతోపాటు కుటుంబ సభ్యులనందరినీ శిఖర్‌పూర్‌లోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. (కోవిడ్ నెగిటివ్ వస్తేనే లోపలికి అనుమతిస్తాం) అయితే ఈ మధ్యే ఆమె తన 38వ వివాహ వార్షికోత్సవ వేడుకలను క్వారంటైన్ సెంటర్లో వేడుకగా జరుపుకుంది. ఈ సందర్భంగా భర్త, కూతురు, అల్లుడి మధ్య కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ పార్టీ చేసుకున్నారు. దీంతో తాజా పరీక్షలో ఆమె భర్తకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరోవైపు సోషల్ మీడియాలో వీరి పెళ్లి వేడుకలు, కేక్ కటింగ్ ఫొటోలు చక్కర్లు కొట్టాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాక క్వారంటైన్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల తీరుమీదా దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలావుండగా కరోనా సోకిన భార్యాభర్తలనిద్దరినీ ఖుర్జాలోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. (డాక్టర్లను కొట్టారు.. కరోనా సోకింది) -
మధురమైన జ్ఞాపకం
‘‘మా పదో వివాహ వార్షికోత్సవం కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరిగింది’’ అన్నారు రంభ. ఈ వేడుకల గురించి ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారామె ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా క్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నేను, నా భర్త (ఇంద్రకుమార్) మా పిల్లల (కుమార్తెలు లాణ్య, సాషా, కుమారుడు శివన్) సమక్షంలో మా వివాహ వార్షికోత్సవాన్ని ఇంట్లోనే చేసుకున్నాం. ఈ వేడుకలో మా బంధువులు, స్నేహితులు ఎవరూ లేరు. అయినప్పటికీ ఇది మా జీవితాల్లోనే ఒక మధురమైన వేడుక అని చెప్పగలను. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎన్నో అందమైన అనుభూతులు, జ్ఞాపకాలను పంచిందీ వేడుక. ఒకొరికొకరం సాయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లూ మేమే చేసుకున్నాం. ఆర్డర్ చేయకుండా మా కేక్‌ను మేమే సొంతంగా తయారు చేసుకున్నాం. ఈ కేక్‌లోని ప్రతి చిన్న భాగంలోనూ మా పదేళ్ల ప్రేమ దాగి ఉంది. మా కుమార్తెలు లాణ్య, సాషా మాకు ఓ స్పెషల్ సర్ప్రైజ్ గ్రీటింగ్ కార్డ్‌ను బహుమతిగా ఇచ్చి మా ఆనందాన్ని మరింత పెంచారు. ఈ సెల్ఫ్ క్వారంటైన్ సమయంలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబంతో సమయాన్ని గడపండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి’’ అని పేర్కొన్నారు రంభ. 1992 నుంచి 2010 వరకు నటిగా వెండితెరపై సత్తా చాటారు రంభ. ఆ తర్వాత బుల్లితెర షోలకు జడ్జ్‌గా కూడా వ్యవహరించారామె. 2010 ఏప్రిల్ 8న కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను రంభ వివాహం చేసుకున్నారు. ఫ్యామిలీతో రంభ -
నువ్వు లేని జీవితాన్ని ఊహించలేను!
చెన్నై : నువ్వు లేని జీవితాన్ని కలలో కూడా ఊహించుకోలేను అని నటి సాయేషా సైగల్ పేర్కొంది. ఈ అమ్మడు ఎవరి గురించి ఇలా చెప్పిందో ఊహించవచ్చు. ఎస్ తన భర్త ఆర్య గురించే అలా తన భావాన్ని వెల్లడించింది. ఈ ఉత్తరాది బ్యూటీ తొలుత తెలుగులో అఖిల్ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత, తమిళంలోకి దిగుమతి అయిన విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి సాయేషా. ఆ తరువాత నటుడు ఆర్యతో కలిసి గజనీకాంత్ చిత్రంలో జత కట్టింది. ఆ చిత్రమే వారిద్దరిని నిజ జీవితంలో ఆలుమగలను చేసింది. అవును గజనీకాంత్ చిత్రంతో పరిచయం ఆర్య, సాయేషాసైగల్ల మధ్య ప్రేమకు దారి తీయడం,ఆ వెంటనే ఇరుకుటుంబాల సమ్మతంతో పెళ్లి చేసుకోవడం చాలా సైలెంట్‌గా జరిగిపోయాయి. 2019, మార్చి 10 తేదీ ఈ జంట నిజజీవితంలో ఒకటైన రోజు అంటే మంగళవారానికి సరిగ్గా వివాహ తొలి వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. కాగా ఈ సందర్భంగా ఆర్య, సాయేషా తాజాగా కలిసి నటిస్తున్న టెడీ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.ఇదో విశేషం అయితే తొలి వివాహ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్య గురించి సాయేషా తన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసింది. అందులో నన్ను అన్ని విధాలుగా సంపూర్ణం చేసిన మనిషికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నువ్వు లేని జీవితాన్ని ఊహించలేను. ప్రేమ,ఉత్సాహం, స్థిరత్వం, స్నేహం అన్నీ ఒకేసారి లభించాయి. నేను నిన్ను ఇప్పటికీ, ఎప్పటికీ ఇష్టపడతాను అని పేర్కొంది.అందుకు నటుడు ఆర్య బదులిస్తూ ఎప్పటికీ అన్నది భవిష్యత్ కాలం. అయితే దాన్ని నీతో గడపడానికి ఎలాంటి సంకోచంలేదు. నేను నేనుగా ఉండడానికి కారణం నువ్వే. నేను నిన్ను ఎంతగానే ప్రేమిస్తున్నాను. నువ్వు నువ్వుగా ఉండడానికి ధన్యవాదాలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు అని ఆర్య పేర్కొన్నారు. వీరు ఒకరికొకరుఇలా ప్రేమ నిండిన మనసుతో శుభాకాంక్షలు తెలుపుకున్న విషయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
‘నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించలేను’
తమిళ నటుడు ఆర్య, నటి సయేషా సైగల్ ప్రేమ వివాహం చేసుకొని ఈ రోజుతో ఏడాది పూర్తి అవుతోంది. కొంతకాలం ప్రేమించుకున్న ఈ జంట గతేడాది మార్చి 10న వివాహ బంధంతో ఒకటయ్యారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ క్యూట్ కపూల్కి సెలబ్రిటీలు, అభిమానులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ శుభ సందర్భంగా సాయేషా, ఆర్య ఇద్దరూ ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఇద్దరు కలిసి ప్రేమగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ('ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్ టైసన్లా') ఈ మేరకు.. ‘నా జీవితాన్ని పరిపూర్ణం చేసిన వ్యక్తికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నువ్వు లేకుండా నా జీవితాన్ని అస్సలు ఊహించలేను జాన్. అన్ని వేళలా నువ్వు చూపే ప్రేమ అమూల్యమైనది. ఇప్పుడు.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. బెస్ట్ హస్బెండ్’ అంటూ ఆర్య మీద ఉన్న ప్రేమను సయేషా సైగల్ తెలియ జేశారు. అలాగే ఆర్య ‘ఎల్లకాలం అనే పదం చాలా పెద్దది. కానీ నేను నీతో ఉన్నప్పుడు సమయమే గుర్తురాదు. నీవల్ల నేను ఇంకా ఎక్కువ ఆనందంగా ఉన్నాను. నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. లవ్ యూ సోమచ్ మై జాన్. హ్యాపీ యానివర్సరీ’ అంటూ భార్యకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. తమిళ్, హిందీ చిత్రాల్లో నటించిన సాయేషా.. ‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మనువరాలు. గజినీకాంత్ చిత్రంలో కలిసి నటించిన ఆర్య, సయేషా.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనూ ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించి గతేడాది పెళ్లి పీటలెక్కారు. ఆర్య ప్రస్తుతం ‘టెడీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన భార్య సాయేషా సైగల్నే హీరోయిన్గా నటించడం విశేషం. ఈ రోజే సినిమా టీజర్ విడుదలవ్వడం మరో విశేషం. Happy Anniversary to the man who completes me in every way possible! Life without you is unimaginable jaan. Love, excitement, stability and companionship all at the same time! I love you now and forever! ❤️😘😍#besthusband @arya_offl pic.twitter.com/MPUx5HJ3JU — Sayyeshaa (@sayyeshaa) March 10, 2020 Forever is a long time but I don’t mind spending it with you 😉😉🤗🤗😍😘😘🤩🤩 I am more of me because of you .. love u so much my jaan 🤗🤗😘 thanks for being you .. Happy Anniversary 🤗🤗😘😘 https://t.co/Je0LkI5f4k — Arya (@arya_offl) March 10, 2020 -
కరోనా ఎఫెక్ట్: అన్నీ రెడీ అయ్యాక వద్దన్నారు!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 ఎఫెక్ట్ శుభకార్యాలపై కూడా పడింది. వివాహ సిల్వర్ జుబ్లీ ఫంక్షన్ ఘనంగా జరుపుకుందామని భావించిన ఓ జంట కరోనా భయంతో ఫంక్షన్‌ను వాయిదా వేసుకుంది. ఈ సంఘటన చింతల్లో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే గోపాల్ రెడ్డి, భారతీ దంపతులు తమ 25వ పెళ్లిరోజు వేడుక (సిల్వర్ జుబ్లీ)ను గురువారం జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, హైదరాబాద్‌లో కరోనా తొలి కేసు నమోదు కావడంతో వారు అప్రమత్తమయ్యారు. (చదవండి: కరోనా ఎఫెక్ట్.. మాస్క్‌తో ప్రభాస్) ఫంక్షన్‌ను రద్దు చేసుకున్నారు. బంధువులు, స్నేహితులకు ఈ మేరకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఫంక్షన్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, కరోనా భయాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఫంక్షన్‌ను వాయిదా వేసుకున్నామని గోపాల్‌రెడ్డి తెలిపారు. వేడుక నిర్వహణకు ఫంక్షన్ హాల్, కేటరింగ్, షాపింగ్ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నప్పటికీ.. వచ్చిన అతిథులు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో వేడుక రద్దు చేసుకున్నామని చెప్పారు. ‘మిలాన్’పై కోవిడ్ ప్రభావం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న కోవిడ్ 19 ప్రభావం భారత నౌకాదళంపైనా పడింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) తర్వాత నౌకాదళ విన్యాసాల్లో కీలకమైన మిలాన్ –2020ని వాయిదా వేస్తున్నట్లు భారత నౌకాదళం మంగళవారం ప్రకటించింది. మిలాన్–2020 పేరుతో ఈ విన్యాసాల్ని విశాఖపట్నంలో ఈ నెల 18 నుంచి 28 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత నౌకాదళం దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలకు ఆహ్వానాలు పంపించింది. (చదవండి: తూర్పుగోదావరిలో కరోనా కలకలం!) ఇందులో ఇప్పటికే 30 దేశాలు తాము పాల్గొంటున్నట్లు అంగీకారం తెలిపాయి. మిగిలిన దేశాలూ వచ్చే అవకాశముంది. అయితే.. కోవిడ్ వివిధ దేశాలకు వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తుండటంతో మిలాన్‌ని వాయిదా వేస్తే మంచిదని రక్షణ శాఖ నిర్ణయించింది. వివిధ దేశాల సైనిక బృందాలు రాకపోకలు సాగించనున్న కారణంగా కోవిడ్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. (చదవండి: వారికి కరోనా సోకలేదు: పబ్లిక్ హెల్త్ డైరెక్టర్) -
పెళ్లి రోజు.. మంచు విష్ణు ట్వీట్
హీరో మంచు విష్ణు.. తన భార్య విరానికకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా తన ప్రేమను తెలిపేలా విష్ణు ఓ ఫొటోను షేర్ చేశారు. L,O,V,E అక్షరాలతో కూడిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అలాగే కొన్నేళ్ల కిందట ఇదే రోజు.. నా బెస్ట్ ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్నానని తెలిపారు. విరానిక తనకు జీవితంలో ఎంతో సహకరించిందని పేర్కొన్నారు. మరోవైపు విరానిక కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా తన భర్తపై ప్రేమను వెల్లడించారు. ‘ఇప్పుడు, ఎల్లప్పుడు, ఎప్పటికీ.. నువ్వు నా వాడివి. అనంతంగా నిన్ను ప్రేమిస్తున్నాను’ అని పేర్కొన్నారు. 2009లో విష్ణు, విరానికలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే.. మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మోసగాళ్లు’ షూటింగ్ చివరి దశలో ఉంది.కాజల్ అగర్వాల్, రుహాని సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ సిక్కు పోలీసాఫీసర్‌గా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు. వియామార్ ఎంటర్టైన్మెంట్, ఎ.వి.ఎ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై విరానికా మంచు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. View this post on Instagram You are my Now, Always and Forever! Love you infinitely ❤️ A post shared by Viranica Manchu (@viranica) on Mar 1, 2020 at 12:11am PST -
చూపులు కలవని శుభవేళ
అమ్మాయి కాఫీ ఇచ్చింది. అబ్బాయి కాఫీ తాగాడు. కాఫీ ఇస్తున్నప్పుడు.. అమ్మాయి అబ్బాయిని చూళ్లేదు! కాఫీ తాగుతున్నప్పుడైనా.. అబ్బాయి అమ్మాయిని చూళ్లేదు! ఇంకేం కలుస్తాయి చూపులు! చూపులు కలవలేదు కానీ... కాఫీ కలుపుతున్నప్పుడు అమృత ఘడియలేవో ఉన్నట్లున్నాయి. నలభై ఏళ్లయింది చిరంజీవి, సురేఖల పెళ్లయి. కలవని ఆ కాఫీ చూపులే.. వీళ్ల పెళ్లికి శుభలేఖలు. ► మీ ‘శుభలేఖ రాసుకున్న ఎదలో..’ పాట సూపర్ హిట్. మరి.. రియల్ లైఫ్‌లో శుభలేఖ రాసుకున్న విశేషాల గురించి? చిరంజీవి: నాకు నేనుగా బలి పశువును అయిన రోజు గురించేగా (నవ్వుతూ). ఓ సాయంత్రం నేను చైౖన్నై కోడంబాకం బ్రిడ్జ్ మీద నా కారులో వెళుతుంటే, నా బి.కామ్ క్లాస్మేట్ సత్యనారాయణ కనిపించాడు. ఇక్కడ ఉన్నావేంటి? అని అడిగితే, మా పెదనాన్నగారింటికి వచ్చాను అన్నాడు. నా కారులో దింపేస్తాను రమ్మన్నాను. వాళ్ల పెదనాన్న ఎవరో కాదు... అల్లు రామలింగయ్యగారు. అప్పటికే నేను నటించిన ఓ మూడు సినిమాలు విడుదలయ్యాయి. ‘రామలింగయ్యగారు నీతో పాటు ‘మనవూరి పాండవులు’లో యాక్ట్ చేశారుగా.. ఇంట్లోకి రా’ అన్నాడు. అయితే రామలింగయ్యగారు లేరు. కాఫీ తాగి వెళుదువు గాని అన్నాడు. అదే నేను లాక్ అయిన మొదటి స్టెప్. ► ఎలా లాక్ అయ్యారు? చిరంజీవి: ఆ కాఫీ పెట్టింది సురేఖ. తను నన్ను చూళ్లేదు, నేను తనని చూళ్లేదు (భార్యని చూస్తూ.. ‘ఆ కాఫీలో ఏం వశీకరణ మంత్రం కలిపావు’). ఆ తర్వాత ఆ అబ్బాయి ఎవరు? అని తను అతన్ని అడిగితే ‘మా క్లాస్మేట్. ‘మనవూరి పాండవులు’ లో నటించాడు’ అని చెప్పాడు. ‘వాళ్లు ఏమిట్లట. మనిట్లేనట’ (ఇద్దరూ పెద్దగా నవ్వుతూ) అంది. తర్వాత అల్లు అరవింద్ గారు, ఇతర కుటుంబ సభ్యులు నా గురించి డిస్కషన్ మొదలుపెట్టారు. అల్లు రామలింగయ్యగారికేమో వాళ్లమ్మాయిని ఓ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్‌కిచ్చి చెయ్యాలనుండేది. కానీ, ఎందుకు ప్రయత్నం చేయకూడదని అరవింద్‌గారు నా గురించి ఎంక్వయిరీ ప్రారంభించారు. ‘తను ఆంజనేయస్వామి భక్తుడు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, బాగా చదువుకున్నాడు, చాలా కష్టపడతాడు. అతని చేతిలో మంచి సినిమాలు కూడా ఉన్నాయి’ అని నా గురించి గుడ్ సర్టిఫికెట్ ఇచ్చాడు నా ఫ్రెండ్. నాకు ఇప్పుడు పెళ్లేంటి? అన్నాను నేను. మేకప్‌మేన్ జయకృష్ణ ‘మన వూరి పాండవులు’ నిర్మాత. రామలింగయ్యగారి ఫ్యామిలీకి చాలా దగ్గరివారు. ఆయన రామలింగయ్యగారిని కన్విన్స్ చేశారు. ఓకే అనడానికి ముందు ఓ పదిమంది నిర్మాతలను నా గురించి అడిగి సలహా తీసుకున్నారట రామలింగయ్యగారు. అందరూ నా గురించి మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. దాంతో నన్ను లాగి బుట్టలో పడేశారు. నాది పెళ్లి వయసు కాదని కరాఖండీగా చెప్పాను. కానీ, జయకృష్ణగారు మా నాన్నగారితో ‘అబ్బాయి వేరే ఆకర్షణలకి లోనవుతాడేమో’ అని చెప్పారేమో నాన్న భయపడిపోయి ‘నేను అబ్బాయిని ఒప్పిస్తా’ అన్నారు. పెళ్లి చూపులకు రానన్నాను. బలవంతంగా తీసుకెళ్లారు. ► సురేఖగారూ.. మీ నాన్న చెప్పారని మీరు చిరంజీవిగారిని పెళ్లి చేసుకున్నారా? సురేఖ: ‘మన వూరి పాండవులు’ చూసి ‘ఈ కళ్లబ్బాయి ఎవరో బావున్నాడు’ అనుకున్నాను. కళ్లు పెద్దగా, గుండ్రంగా ఉంటాయి కదా. మా అమ్మ యాక్టర్‌ను చేసుకుంది. నేనూ యాక్టర్‌ను చేసుకుం టే బాగుంటుందనుకున్నా. అందుకే సరే అన్నాను. ► మీ ‘అందరివాడు’ సినిమాలో పెళ్లిచూపుల సీన్ చాలా బావుంటుంది. మీ పెళ్లి చూపుల సీన్? చిరంజీవి: మమ్మల్ని మాట్లాడుకోమని పెద్దవాళ్లందరూ బయటకు వెళ్లారు. తను బీఏ చదువుకుందని తెలిసినా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని ఏం చదువుకున్నారు? అని అడిగాను. ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. అంతకుముందు నాకు అమ్మాయిలతో పెద్దగా పరిచయాలు కూడా లేవు. సురేఖ పొందిక చూసి ‘ఈ అమ్మాయినే చేసుకోవాలి’ అనుకున్నాను. మా అమ్మకి కూడా తను నచ్చింది. నాన్నగారైతే ‘ఏం కళరా ఆ అమ్మాయిది. పెళ్లి చేసుకో’ అన్నారు. సురేఖ: మామయ్యగారు చనిపోయేంతవరకు నన్నెప్పుడూ పేరు పెట్టి పిలవలేదు. ‘అమ్మా’ అనేవారు. నన్ను ఒక్క మాట కూడా పడనిచ్చేవారు కాదు. అంత బాగా చూసేవారు. ► అవునూ... మీ పెళ్లి చూపులకు, పెళ్లికి ఎంత గ్యాప్ వచ్చింది? సురేఖ: మూడు నెలలు. ► ఆ మూడు నెలల్లో కలుసుకున్నారా? ఫోన్లు మాట్లాడుకోవడం? చిరంజీవి: పెళ్లి కాకముందు మాట్లాడటం, తిరగటం తప్పని మనసులో పడిపోయింది. తనదీ అలాంటి ఫీలింగే. అయితే ఒకసారి మాట్లాడాలనిపించింది. అప్పుడు ల్యాండ్ ఫోన్లే కదా. ఫోన్ చేస్తే తనే తీసింది. ‘హలో.. నేను చిరంజీవి’ అన్నాను. ‘నేను సురేఖనండీ. ఫోన్ ఎవరికివ్వమంటారు’ అంది. అంతే... నాతో కనీసం రెండు మాటలు కూడా మాట్లాడకుండా ఎవరికివ్వమంటారు అందని నా అహం దెబ్బతింది. ‘మీ అన్నయ్య ఉన్నాడా’ అన్నాను. ‘లేరండీ’ అంది. ‘వచ్చాక నేను ఫోన్ చేశానని చెప్పు’ అని పెట్టేశాను. సురేఖ: అప్పుడప్పుడూ అన్నయ్యతో పెళ్లి తేదీ గురించి మాట్లాడేవాళ్లు. అందుకని అన్నయ్యతో మాట్లాడటం కోసమే ఫోన్ చేశారనుకున్నాను. నా గురించి చేశారనుకోలేదు (నవ్వుతూ). ► సరే.. హనీమూన్ విశేషాలు? చిరంజీవి: హనీమూన్ పక్కన పెట్టండి. పెళ్లికే టైమ్ దొరకలేదు. పెళ్లికి ఫిబ్రవరిలో మంచి ముహూర్తాలున్నాయంటే సరే అనుకున్నాం. అప్పుడు ‘తాతయ్య ప్రేమ లీలలు’ అనే సినిమా చేస్తున్నాను. ఆ చిత్రానికి యం.ఎస్ రెడ్డిగారు నిర్మాత. అందులో నూతన్‌ప్రసాద్ కాంబినేషన్లో నా సీన్లు ఉన్నాయి. ‘ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్, డేట్స్ దొరకవు.. మీరు మే నెలలో పెళ్లి చేసుకోండి’ అని రెడ్డిగారు అన్నారు. ‘మీరు ఓకే అంటే ఫిబ్రవరిలో, లేదంటే తర్వాత చేసుకుంటాను’ అన్నాను. అరవింద్ ఏమో ‘ఓ మూడు రోజులు ఇవ్వండి’ అని పట్టుబట్టాడు. నా సినిమా టైమ్‌లో మా హీరో పెళ్లి చేసుకున్నాడులే అనుకొని ఏ నిర్మాత అయినా ఆనందంగా ఒప్పుకుంటారు. కానీ, రెడ్డిగారు ఒప్పుకోలేదు. అప్పుడు అల్లు అరవింద్ ‘మీ డేట్లు మళ్లీ మీకు ఇప్పిస్తాను. కాంబినేషన్ గురించి మీకేం భయం లేదు. నేనూ ఇండస్ట్రీలోనే ఉన్నాను కదా. మేం చిరంజీవిని తీసుకెళ్లిపోతున్నాం’ అన్నారు. అలా అనుకున్న ముహూర్తానికే పెళ్లయింది. ► మరి పెళ్లి బట్టల షాపింగ్‌కి టైమ్ దొరికిందా? చిరంజీవి: పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు చొక్కా చిరిగిపోయింది. సురేఖ మార్చుకోమంటే ‘ఏం.. బట్టలు చిరిగితే తాళి కట్టలేనా’ అని, అలాగే కట్టేశాను. అయితే అప్పటికే నాకు ఏడెనిమిది పెళ్లిళ్లు చేసుకున్న అనుభవం ఉంది (ఇద్దరూ పెద్దగా నవ్వుతూ). అంటే సినిమాల్లో.. ► పెళ్లయ్యే నాటికే మీకు వంట వచ్చా? సురేఖ: రాదండీ. ఒకరోజు ఉప్మా చేస్తే ఉండలు, ఉండలుగా వచ్చింది. అప్పుడు ఆయనే ఉప్మా చేయడం నేర్పించారు. ఆయన మేనత్త, అమ్మమ్మ మాతోనే ఉండేవారు. వాళ్లు వండేవారు. ► భర్త మేనత్త, అమ్మమ్మ, అమ్మానాన్న, తమ్ముళ్లు (నాగబాబు, పవన్ కల్యాణ్) ఇంతమందితో ఉండాలంటే ప్రైవసీ ఉండదేమో అనిపించిందా? సురేఖ: మా ఇంట్లో ఎప్పుడూ చుట్టాలుండేవారు. అదే సందడి ఈ ఇంట్లోనూ ఉండేది. లేకపోతే ఒంటరితనం అనిపించేది. ఈయన ఉండేవారు కాదు. అందరూ కలిసి ఉండటంతో నాకు సెక్యూరిటీ ఉండేది. వాళ్లే వంటలు చేసి, నాకు, ఆయనకి, అందరికీ పెట్టేవారు. పిల్లలందరూ ఉండటంతో బావుండేది. చిరంజీవి: సురేఖ తమ్ముడు ఉండేవారు. అతను చనిపోయారు. నా తమ్ముళ్లిద్దరిదీ వాళ్ల తమ్ముడి వయసు. వీళ్ల మీద సురేఖకు ఆ ఎఫెక్షన్ ఉండటానికి కారణం అదే. మనం ఎలా ఉంటే అవతలివాళ్లు మనతో అలా ఉంటారు. సురేఖ అందరితో బాగుంటుంది. సురేఖ: వాళ్లు కూడా చాలా బాగుంటారు. ఏ రిలేషనయినా రెండువైపులా ఉండాలి. ఈయన లేకపోయినా కల్యాణ్ (పవన్ కల్యాణ్) ఎప్పుడూ పిల్లలతో ఉండేవాడు. బాగా సరదాగా ఉండేవాడు. అందుకే కల్యాణ్ పిల్లలతోపాటు పెరిగాడు, పిల్లలు కల్యాణ్‌తో పాటు పెరిగారు అంటాం. కల్యాణ్‌తో పాటు, వీళ్ల చెల్లెలు మాతోపాటు ఉండి చదువుకుంది. ► త్రీ షిఫ్ట్స్ చేస్తూ షూటింగ్స్‌తో చిరంజీవిగారు బిజీగా ఉండేవారట. పెళ్లయిన కొత్తలో ఆ బిజీని ఎలా తీసుకున్నారు? సురేఖ: నాన్నగారిని చూస్తూ పెరిగాను కదా. నైట్ షూటింగ్‌లని ఆయన లేటుగా రావటం అన్నీ తెలుసు. మా పెళ్లయిన కొత్తల్లో ఈయన పొద్దున్నే షూటింగ్‌కి వెళ్లి సాయంత్రం 6 గంటలకు వచ్చేవారు. మళ్లీ ఫ్రెష్ అయి నైట్ షూటింగ్‌కి వెళ్లేవారు. ‘పున్నమినాగు’ షూటింగ్ జరుగుతోంది అప్పుడు. నా లైఫ్ అంతా ఇలానే ఉంటుందని ప్రిపేర్ అయిపోయాను కాబట్టి ఏమీ అనిపించలేదు. ► ప్యారిస్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మీ పేరు బదులు ‘జయ’ అని జయప్రదగారి పేరుతో మిమ్మల్ని పిలిచారట? సురేఖ: ఓ రోజు కాదు, రోజూ జరిగేది. నెల రోజులు జయప్రదతో షూటింగ్ చేస్తే ఆ నెల రోజులూ జయ, జయ అని పిలిచేవారు. మా పెళ్లయిన కొత్తల్లో అప్పటికి నన్ను సురేఖా అని పిలవడానికి అలవాటుపడలేదు. అందుకని ఒక్కోసారి జయ అని పిలిచేవారు. ‘ఏమండీ.. నేను రేఖ’ అనేదాన్ని. ‘ఓ.. సారీ, సారీ రేఖ’ అనేవారు. చిరంజీవి: సురేఖలో ఉండే ఆ స్పోర్టివ్‌నెస్ పరాకాష్ట అని చెప్పాలి. మరో గమ్మల్తైన విషయం చెబుతా. మా పెళ్లైన రెండు నెలలకి ప్యారిస్ వెళ్లాం. హోటల్లో రూమ్ తీసుకున్నాం. దానికోసం రిసెప్షన్లో ఫామ్స్ అన్నీ కంప్లీట్ చేసి ఇవ్వాలి కదా. అక్కడ అన్నీ ఫిల్ చేస్తూ భార్య అనే చోట ఆగిపోయాను. వెంటనే పేరు గుర్తు రాలేదు (నవ్వులు). ‘సురేఖ’ అని చెప్పి.. ‘అల్లు అని రాసేరు, కొణిదెల అని రాయండి’ అంది. ► మీరు ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. వాళ్లతో సురేఖగారు ఎలా ఉంటారు? చిరంజీవి: సురేఖ వెరీ ఫ్రెండ్లీ. సుహాసిని, సుమలత, విజయశాంతి, రాధ, రాధిక.. అందరితో ఓ ఫ్యామిలీలా ఉంటుంది. మొన్న నవంబర్‌లో మా 80స్ క్లబ్ (1980లకు చెందిన నటీనటులు) రీయూనియన్ పార్టీ మా ఇంట్లోనే జరిగింది. అన్నీ తనే ఎరేంజ్ చేసింది. వాళ్లందరూ ‘ఇంత ఎరేంజ్ చేశారు, మీరూ పార్టీలో ఉండండి’ అంటే ‘మీరంతా ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయండి’ అంది. సురేఖ: ఎరేంజ్ చేశాం కదా అని ఫ్రెండ్స్ మధ్యలో దూరిపోకూడదు (నవ్వుతూ). ► జనరల్‌గా చిరంజీవిగారి బర్త్‌డే అంటే ఫ్యాన్స్ మరచిపోనివ్వరు. మరి.. మ్యారేజ్ డే, మీ బర్త్‌డేని ఆయన గుర్తుపెట్టుకుంటారా? చిరంజీవి: గుర్తుండేది కాదు, గుర్తు లేకనే ఈ సంవత్సరం ఫైట్ సీక్వెన్స్ కోసం పోలవరం వెళ్లడానికి రెడీ అయ్యాను. ఈ 18న సురేఖ పుట్టినరోజు. 20న మా పెళ్లిరోజు. అది గుర్తు లేక 16 నుండి పోలవరంలో షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం. మా అబ్బాయికి (రామ్‌చరణ్) గుర్తుకొచ్చింది. వాళ్లమ్మ దగ్గరికెళ్లి ‘18 నీ పుట్టినరోజు, 20 మీ పెళ్లిరోజు, డాడీ షూటింగ్‌కి ఎలా ఒప్పుకున్నారు?’ అంటే, ‘పోనీలే డాడీకి గుర్తులేదేమో’ అందట. ‘లేదమ్మా, అది మన షూటింగే కదా, వాళ్లతో మాట్లాడి మారుస్తాను’ అని మార్చేశాడు. సురేఖ: మా మ్యారేజ్ డే అయినా, నా బర్త్‌డే అయినా హడావిడి ఏమీ ఉండదు. ► గిఫ్ట్‌లు ఇస్తుంటారా? సురేఖ: రెండేళ్ల క్రితం నా బర్త్‌డేకి వాచ్ ఇచ్చారు. కరెక్ట్‌గా రాత్రి 12 గంటలకు నన్ను నిద్ర లేపి మరీ ఇచ్చారు. ఆ గిఫ్ట్ నాకివ్వటం కోసం ఎంత కష్టపడ్డారో తర్వాత తెలిసి ఆనందపడ్డాను. చిరంజీవి: ఆ బ్రాండ్ వాచ్ ఇక్కడ దొరకలేదు. బెంగళూర్‌లో ఉంది. ఆ కంపెనీవాళ్లను అడిగితే, ‘మీరు మా ప్రివిలేజ్డ్ కస్టమర్’ అని ఫ్లయిట్‌కి వచ్చి ఇచ్చి వెళ్లారు. ► కలిసి షాపింగ్స్‌కి వెళతారా? చిరంజీవి: షాపింగ్ అంటే ఇద్దరికీ ఇష్టం. ఇక్కడ కష్టం కాబట్టి విదేశాలు వెళ్లినప్పుడు బాగా తిరుగుతాం. లండన్ వెళితే ఓ అపార్ట్మెంట్ అద్దెకి తీసుకుని కొన్ని వారాల పాటు అక్కడే ఉంటాం. నాకు, తనకి కుకింగ్ అంటే సరదా. కుక్ చేసుకుని షాపింగ్‌కి వెళ్లిపోతాం. ► పండగలు బాగా చేస్తుంటారని విన్నాం. ప్లానింగ్ అంతా సురేఖ గారిదేనా? చిరంజీవి: నాగబాబు, పవన్‌కల్యాణ్, అల్లు అరవింద్ ఫ్యామిలీ... ఇలా అన్ని క్లోజ్ ఫ్యామిలీలు మొన్న దీపావళి పండగకి కలిశాం. దాదాపు మేమే ఓ వందమంది దాకా ఉంటాం. అందరికీ తనే మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్‌కే చిన్న పిల్లల దగ్గరనుండి, పెద్దవాళ్లదాకా అందరూ తూచా తప్పకుండా హాజరవుతారు. సంక్రాంతి పండగను మూడు రోజులు చాలా ఘనంగా చేసింది. అప్పుడు పంక్తి భోజనాలు పెట్టి, పెద్ద భోగి మంట ఏర్పాటు చేయించింది. పండగ అనేది వంకే తప్ప, అందరూ కలవాలనుకుంటుంది. అందుకే అందరితోనూ తనకు మంచి బాండింగ్ ఉంటుంది. సురేఖ: ఈయన మొదట్నుంచి వాళ్ల పిల్లలు, వీళ్ల పిల్లలు అని కాదు.. అందరి పిల్లలతో బాగుంటారు. చిన్నప్పుడు అందరి పిల్లలు ఓ పదిహేనుమంది దాకా అయ్యేవారు. అందరినీ షూటింగ్‌లకు తీసుకెళ్లేవారు. మాల్దీవ్స్ వెళ్లినా, స్విస్ వెళ్లినా హాలిడే ఉందంటే చాలు.. అల్లు వెంకటేశ్, బన్నీ, శిరీష్ ఇలా అందరి పిల్లల్ని ఫారిన్ తీసుకెళ్లేవారు. చిరంజీవి: పిల్లలందరికీ వండర్ఫుల్ మెమొరీస్ నాతోనే ఉంటాయి. నేనెన్ని చేసినా దాన్ని ఆర్గనైజ్ చేసి, మేనేజ్ చేసేవాళ్లు కావాలి. అది సురేఖ చేస్తుంది. ► పండగలవీ శ్రద్ధగా చేస్తున్నారంటే పూజలు బాగా చేస్తారా? సురేఖ: మరీ అంత ఎక్కువ కాదు. రోజూ మామూలుగా చేస్తా. స్పెషల్ అకేషన్ అంటే కచ్చితంగా బాగా చేస్తాను. మనం చేస్తుంటేనే పిల్లలు కూడా ఫాలో అవుతారు. మన నెక్ట్స్ జనరేషన్‌కు తెలుస్తుంది. మనం వదిలేస్తే వాళ్లూ వదిలేస్తారు. మా సుస్మిత, శ్రీజ పెళ్లి చేసుకుని వెళ్లిపాయినా ఇక్కడ పూజలు చేసినట్లే అత్తగారింట్లో చేస్తారు. ► మనవళ్లు, మనవరాళ్ల గురించి ? సురేఖ: అదొక లవ్లీ లైఫ్. ఈయనకి అప్పట్లో తీరిక లేక మా పిల్లల ఎదుగుదలను చూడలేదు. ఇప్పుడు చిన్నపిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అందరికీ ఆయనంటే పిచ్చి ఇష్టం. వాళ్లతో ఆయన ఎన్ని ఆటలు ఆడతారో చెప్పలేం. ► మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయా? చిరంజీవి: ఎందుకు జరగవు? తిట్టుకుంటానే ఉంటాం సురేఖ: అలా జరగబట్టే ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాం. ఎప్పుడూ స్వీట్ స్వీట్‌గా ఉంటే బోర్. ► ఇద్దరిలో ఎవరు సీరియస్? ఎవరు కామెడీ? చిరంజీవి: నేను కామెడీగా ఉండను. అలాగని పెద్ద సీరియస్‌గా కూడా ఉండను. కామెడీ అంటే సురేఖనే ఎక్కువ. ఆమె పంచ్‌లను తట్టుకోవటం చాలా కష్టం. ఒక్కోసారి ఆ పంచ్‌లకు గుక్క తిప్పుకోలేం. ► ఫైనల్లీ.. మళ్లీ జన్మంటూ ఉంటే మీరే కపుల్‌గా ఉండాలనుకుంటున్నారా? చిరంజీవి: నేను ఆ మద్రాస్ కోడంబాకం బ్రిడ్జి మీదకి మాత్రం వెళ్లను (పెద్దగా నవ్వుతూ). ఐయామ్ జస్ట్ కిడింగ్. డెఫ్నెట్లీ మేమే ఉండాలనుకుంటున్నాం. సురేఖ: అంతే... ► మీరు కట్టుకునే చీరలు బాగుంటాయి. మీవారు కాంప్లిమెంట్స్ ఇస్తుంటారా? సురేఖ: థ్యాంక్యూ. నాకు అప్డేటెడ్గా ఉండటం ఇష్టం. దానికి కారణం చిరంజీవిగారే. ఆయనకు ఫ్యాషన్ గురించి, కలర్స్ గురించి చాలా అవగాహన ఉంది. ఇంకో విషయం ఏంటంటే.. ఆయన చీర చూడగానే రేటు చెప్పేస్తారు. అది ఏ చీర అయినా కానివ్వండి.. బట్టల గురించి అంత ఐడియా ఉంది. నేను కట్టే చీరలు బాగుంటాయని అందరూ అంటుంటే బాగానే ఉంటుంది. కానీ అదే విషయాన్ని ఆయన నోటి నుంచి వింటే ఆ ఆనందమే వేరు. అంతేకదా.. మనం శ్రద్ధగా డ్రెస్ చేసుకున్నప్పుడు భర్త నుంచి ఓ చిన్ని కాంప్లిమెంట్ వస్తే ఆ ఫీలింగే స్పెషల్. ఆ విషయంలో ఆయన హండ్రెడ్ పర్సంట్ బెస్ట్. అన్నీ పట్టించుకుంటారు. కాంప్లిమెంట్స్ ఇస్తారు. ► సో.. మీ కళ్లబ్బాయి పక్కా ఫ్యామిలీ మ్యాన్ అన్నమాట? సురేఖ: డౌట్ ఏముంది? హండ్రడ్ పర్సంట్ పక్కా ఫ్యామిలీ మ్యాన్. ► 30 ఏళ్లు నటించి ఓ పదేళ్లు పాలిటిక్స్‌కి దగ్గరగా ఉండటంవల్ల సినిమాలకు దూరమయ్యారు. ఆ గ్యాప్ గురించి? సురేఖ: అప్పుడు పీస్‌ఫుల్‌గా ఉండేవారు కాదు. మాకూ అలానే ఉండేది. ఆయనకి మేకప్ వేసుకోగానే హుషారు వస్తుంది. చిరంజీవి: పనులన్నీ ముగించుకుని ఇంటికొచ్చాక కూడా మరుసటి రోజు ఏం మాట్లాడాలి? అనేదాని చుట్టూనే ఆలోచనలు ఉండేవి. ‘సినిమాలు చేయడం మొదలుపెట్టాక మళ్లీ మిమ్మల్ని మా మనిషిలా చూస్తున్నాం’ అంటున్నారు. సురేఖ: ఇప్పుడు ఫుల్ హుషారు. ఉదయం 9కి వెళ్లాలంటే ముందే రెడీ అయి కూర్చుంటారు. షూటింగ్ ఉంటే.. హీ ఈజ్ ఫుల్ యాక్టివ్. చిరంజీవి: ‘సైరా’ సినిమాకి 4.30కి లేచి వర్కవుట్ చేసుకొని 5.30గంటలకల్లా రెడీ అయ్యి 6 గంటలకు లొకేషన్‌కి వెళ్లి 7 గంటలకల్లా మేకప్‌తో రెడీగా ఉండేవాణ్ణి. ఇప్పుడు కొరటాల శివతో చేస్తున్న సినిమా షూటింగ్ షార్ప్ 7కల్లా స్టార్ట్ చేస్తున్నాం. జనవరి 2న షూటింగ్ స్టార్ట్ చేశాం. అప్పుడే ఓ సాంగ్, మూడు ఫైట్స్ కంప్లీట్ అయ్యాయి. ► మీ పెళ్లప్పటికే చిరంజీవిగారు కెరీర్‌వైజ్‌గా మంచి ఫామ్‌లోకొచ్చారు.. ఆ బిజీని ఎలా తీసుకునేవారు? సురేఖ: ఆయన కనబడటమే అపురూపంగా ఉండేది. ఎప్పుడూ షూటింగ్‌లతో దూరం, దూరంగా ఉండటంతో కళ్లారా ఎప్పుడు చూస్తానా అనిపించేది. చిరంజీవి: నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే అవకాశాలు మొదలయ్యాయి. ఆల్బమ్ పట్టుకుని అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాలేదు. అందుకే పెళ్లినాటికే ఫామ్‌లో ఉన్నా. అప్పుడేమో నేను కనబడితే రేఖకి అపురూపం. మనవరాళ్లు వచ్చాక ఎఫెక్షన్ తగ్గింది. పలకరిస్తే ‘ఆ వస్తున్నా’ అంటుంది. వచ్చి చూడదు. అందుకేనేమో లేటు వయసులో చాలామంది సెకండ్ కోసం చూస్తుంటారు (కొంటెగా నవ్వుతూ). అయినా నేనా ధైర్యం చేయలేను. ► చిరంజీవిగారు, చరణ్ కలిసి ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలని ఉందా? సురేఖ: ఇద్దరినీ ఓ సినిమాలో చూడాలని ఉంది. ‘ఖైదీ నంబర్–150’లో ‘అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు’ పాట మధ్యలో చరణ్ వచ్చి డ్యాన్స్ చేస్తాడు. వాళ్లిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఈయన్ని చూడాలా, చరణ్‌ని చూడాలా అనుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో ఆ సినిమా చూస్తూ ఒకసారి ఈయన్ని, మళ్లీ ఆ పాట పెట్టుకుని ఒకసారి చరణ్‌ని చూశాను. ► నటుడిగా చిరంజీవిగారు రిస్కీ ఫైట్స్ చేస్తుంటారు. మీకెలా అనిపిస్తుంది? సురేఖ: లొకేషన్లో ఏం చేసేవారో తెలిసేది కాదు కానీ, చేసొచ్చిన తర్వాత చెబుతుంటే ‘బాబోయ్’ అనిపించేది. ఎప్పుడో పొద్దున వెళితే సాయంత్రానికి వచ్చేవారు. అలా కాకుండా ఏ పదకొండింటికో ఆయన ఇంటికి వచ్చేస్తున్నారు అని ఎవరైనా చెబితే మాత్రం, ఏదో దెబ్బతగిలే ఉంటుందనుకునేదాన్ని. అలాగే ఫైట్ సీన్స్ అంటే మధ్యలో లొకేషన్ నుంచి ఫోన్ రాకూడదని కోరుకుంటా. ఫోన్ వస్తే ఆయనకు ఏదైనా దెబ్బ తగలిందని చెబుతారేమోనని భయం. ఇప్పుడు ఫర్వాలేదు కానీ అప్పట్లో ఇంత కంఫర్టబుల్ షూస్ కానీ, సేఫ్టీ ప్రికాషన్స్ కానీ లేవు కదా. ఈయనేమో డూప్ కూడా వద్దంటారు. – డి.జి. భవాని -
‘ప్రతి అమ్మాయి కలలుగనే ప్రపంచాన్ని అందించావ్’
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు సతీమణి, నటి, నిర్మాత నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. నేడు వారి పెళ్లిరోజు. అన్ని విషయాల్లో సూచనలు, సలహాలు అందిస్తూ మహేశ్‌కు తోడుగా నిలిచే నమ్రత భాగస్వామికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రతి అమ్మాయి కలలుగనే ఓ అద్భుతమైన ప్రపంచాన్ని నాకందించావ్. నా జీవితమంతా నీ స్వచ్ఛమైన ప్రేమతో, ముద్దులొలికే మన ఇద్దరు పిల్లలతో నింపేశావ్. మీ ప్రేమానురాగాలతో మన ఇల్లు ఎప్పుడూ నందనవనమే. మీ సాహచర్యం నాకెప్పుడూ ఉంటేచాలు. ఇంతకన్నా ఏం కావాలి నాకు. నా ప్రియమైన మహేశ్‌కు 15వ పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అని నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇక కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి టైం కేటాయించడంలో సూపర్‌స్టార్ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమాల నుంచి కాస్త విరామం దొరికితే చాలు భార్య, పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తాడు. అంతేకాదు అందుకు సంబంధించిన క్యూట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటాడు. View this post on Instagram U have given me the perfect life any girl could ever dream of... a life filled with unconditional love 💕 2 exquisite babies...a place we can proudly call our home and above all our friendship that I will treasure forever !! What more can I ask for ❤❤happy 15th MB😘😘love u for everything you are to me ❤❤ @urstrulymahesh 🤗 A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Feb 9, 2020 at 6:35pm PST చదవండి : శస్త్ర చికిత్స చేయించుకోనున్న మహేశ్‌బాబు! ఆమె జీవిత మంత్రం అదే -
తీపి జ్ఞాపకాల మాయాబజార్
చిన్ననాటి స్నేహితులైన వీరిద్దరి పేర్లు శృతి, అనూష. ఇద్దరూ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత ఒకరు ఎంబిఎ, ఇంకొకరు ఇంటీరియర్ డిజైనింగ్ చేశారు. రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి ఒకానొక సమయంలో ఈ రొటీన్ ఉద్యోగాలు కాదు మనం చేయాల్సింది అనుకున్నారు. ఏదైనా వినూత్నమైన వ్యాపారాన్ని ప్రారంభిస్తే..? అని ఆలోచించారు. ఆ ఆలోచన నుంచి వీరు సృష్టించినదే.. ‘ది మాయాబజార్.’ పాతికేళ్ల వయసులో కచ్చితమైన ప్రణాళికతో సరికొత్త బిజినెస్‌లో అడుగుపెట్టిన శృతి, అనూషలు ఆ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఇటీవలి కాలంలో.. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత వెడ్డింగ్ షూట్స్ తీయించుకునేవారు ఎక్కువయ్యారు. అలాగే గర్భిణిగా ఉన్నప్పుడు ఆ అందమైన జ్ఞాపకాన్ని పదిలపరుచుకోవడానికి ప్రెగ్నెన్సీ ఫొటో షూట్, చిన్నారుల క్యూట్ ఫొటోలు, కాలేజీ అమ్మాయిలైతే.. ఫ్యాషన్ స్టిల్స్æ.. ఇలా రకరకాలుగా ఫొటోలకు, వీడియో షూట్స్‌కి ప్లాన్ చేసుకుంటున్నారు. దాంతో షూట్స్ తీసుకునే లొకేషన్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ థీమ్‌నే పట్టుకున్నారు శృతి, అనూష. అన్ని రకాలుగా విశ్లేషించుకున్న తర్వాత రీసెర్చ్ ప్రారంభించారు. నెట్ అంతా జల్లెడ పట్టారు. తెలిసిన వారిని, తెలియని వారిని పరిచయం చేసుకొని మరీ సమాచారం సేకరించారు. ‘‘దేశవ్యాప్తంగా ఫొటో షూట్స్‌కి ఢిల్లీలో, ముంబయిలో చక్కటి స్థలాలు ఉన్నాయి. రకరకాల షూట్స్ కోసం చాలా మంది మన దగ్గర నుంచి అక్కడికి వెళుతుంటారు. ఇవన్నీ కూడా చూసి స్టడీ చేయడానికి మాకు ఏడాది సమయం పట్టింది’’ అన్నారు శృతి. ‘‘మా స్నేహితులు, బంధువులతో పాటు మేం కూడా ఫొటో, వీడియో షూట్స్‌కి తగిన ప్లేస్ కోసం చాలా చోట్ల ప్రయత్నం చేశాం. ఫొటో, వీడియో షూట్స్‌కి సరైన ప్లేస్ దొరక్క, ఖర్చు ఎక్కువ పెట్టలేక ప్రాజెక్ట్స్‌ను వదిలేసుకున్నవారెందరో. తెలిసిన ఫొటోగ్రాఫర్లు, వెడ్డింగ్ ప్లానర్లు, షార్ట్ ఫిల్మ్‌లు, యాడ్ ఫిల్మ్‌ల నిర్మాతలను, కెమెరామెన్స్‌ని కలిసి మాట్లాడాం. వీరందరికి అవసరమైన, అందించాల్సిన వసతులను బేరీజు వేసుకుకుని మాయాబజార్‌ని నిర్మించాం’’ అని చెప్పారు అనూష. ఆర్నెళ్లకు ఒకసారి ‘‘దేశంలో ఫొటోషూట్ అవసరాల కోసం ఇప్పుడున్న స్టూడియోలన్నీ చిన్నవే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐదు ఎకరాల స్థలాన్ని ఏడేళ్లపాటు లీజుకు తీసుకున్నాం. ఎకరం స్థలంలో స్టూడియో నిర్మించాం. అందులో మేకప్ రూమ్, ఛేంజింగ్ రూమ్, ఇండోర్, అవుట్ డోర్ వసతులు కాకుండా పదిహేను వరకు భిన్నమైన సెట్స్ వేశాం. వీటిని ప్రతీ ఆర్నెల్లకు ఒకసారి మార్చేలా ప్లాన్ చేశాం. మిగిలిన స్థలంలో గార్డెన్స్‌తో పాటు పలు రకాల ఆకర్షణలు జోడించబోతున్నాం..’’ అని శృతి తెలిపారు. స్టూడియో ఏర్పాటుతో పాటు సెట్స్‌కు అవసరమైన ఇతరత్రా సామగ్రి చాలా అవసరం అవుతుంది. ఆ విషయాన్ని చెబుతూ.. ‘‘అందుకు మేం ఇద్దరం దేశంలో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్.. వంటి చాలా ప్రాంతాలు తిరిగి అపురూపమైన యాంటిక్ పీసులను సేకరించాం. పాతకాలం నాటి తలుపులు, నిజమైన ఎద్దుల బండి.. ఇలా ఏ లొకేషన్ సెట్‌కి ఏది ముఖ్యమో అలా ప్రతీది మేమిద్దరం ఎంపిక చేసి, డిజైన్ చేయించుకున్నాం..’’ అని తెలిపారు అనూష. అమ్మాయిలే బెస్ట్ వ్యాపారం అనేది ఒడిదొడుకులతో కూడినది. ఆర్థిక లావాదేవీల్లో కచ్చితత్త్వం ఉండాలి కదా... మీకేమైనా సమస్యలు వస్తే అనే ప్రశ్నకు..‘‘మా ఇద్దరి మధ్య ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు రాలేదు. ఇక ముందూ రావు. నిజానికి ఇలాంటి సృజనాత్మక భాగస్వామ్యానికి అమ్మాయిలే బెస్ట్’’ అని నవ్వుతూ చెప్పారు శృతి, అనూష. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో శృతి, అనూషలు సృష్టించిన ఈ ‘మాయాబజార్’ ఈ ఇద్దరమ్మాయిల సృజనకు అద్దం పడుతోంది. – నిర్మలారెడ్డి సొంత పెట్టుబడి ఈ ఇద్దరు కలలు కన్న మాయాబజార్ స్టూడియో కిందటేడాదే సాకారం అయింది. వ్యాపారాలు చేయాలంటే పెద్దలు సంపాదించిన ఆస్తులు ఉండాలి అనుకునేవారికి వీళ్లు కాస్త ధైర్యాన్ని ఇచ్చే మాటల్నే చెబుతున్నారు. ‘‘మేం అనుకున్న స్టూడియో రూపకల్పనకు పెద్ద మొత్తంలోనే ఖర్చు అయ్యింది. అయినా వెనకంజ వేయలేదు. మా ఇళ్లలో అమ్మనాన్నలని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాం. మేం ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బు, మిగిలినది రుణాల రూపంలో తీసుకున్నాం. మా తపన చూసిన మా అమ్మానాన్న కొంత పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు’’ అని చెప్పారు అనూష, శృతి. -
‘ప్రేమ అనేది అనుభూతి కంటే ఎక్కువ’
టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల వివాహ బంధానికి రెండేళ్లు పూర్తి అయింది. నేడు (డిసెంబర్ 11) విరాట్-అనుష్క శర్మలు రెండో పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న అత్యంత అందమైన కపుల్స్‌లో ఈ జంట కూడా ఒకటి. ఈ జంట సోషల్ మీడియాలో వారి ప్రేమను సరదా ట్వీట్లు, ఫోటోలు షేర్ చేస్తూ వ్యక్తపరుస్తుంటారు. తాజాగా ఈ జంట తమ రెండో వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ.. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనుష్క శర్మ తను పోస్ట్ చేసిన ఫోటోకు..‘ ‘ఒక వ్యక్తిని ప్రేమించటం అంటే దేవుని ముఖాన్ని చూడటం’ అని చెప్పిన విక్టర్ హ్యూగో కొటేషన్‌ను పెట్టారు. అదేవిధంగా ‘ప్రేమ అనేది ఒక అనుభూతి మాత్రమే కాదు. దాని కంటే ఎక్కువ.. ప్రేమ ఒక గైడ్, సంపూర్ణ సత్యానికి మార్గం ’ అని కామెంట్ చేశారు. తాను అందరి చేత ఆశీర్వదించబడ్డానని అనుష్కశర్మ తెలిపారు. View this post on Instagram "To love another person is to see the face of God" -Victor Hugo The thing about love is that it's not just a feeling , it's much more than that . It's a guide , a propeller, a path to the absolute truth . And I am blessed , truly , wholly blessed, to have found it ❤️ 🙏 A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Dec 10, 2019 at 8:27pm PST దీనికి స్పందించిన విరాట్ కూడా తమ వివాహనికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అదే విధంగా ‘ప్రేమ మాత్రమే వాస్తవం. దాన్ని మించినది మరేది లేదు. మీకు అర్థమయ్యే వ్యక్తితో దేవుడు మిమ్మల్ని జతగా కలిపి ఆశీర్వదించాడు’ అని విరాట్ కామెంట్ చేశారు. అభిమానులు వీరిద్దరి జోడీని ముద్దుగా ‘విరుష్క’ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. View this post on Instagram In reality there is only love and nothing else. And when god blesses you with the person who makes you realise that everyday, you have just one feeling, gratitude❤️ A post shared by Virat Kohli (@virat.kohli) on Dec 10, 2019 at 8:39pm PST వీరు ఇద్దరు మొదటి వివాహ వార్షికోత్సవానికి కూడా తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ‘పెళ్లై ఏడాది గడిచిందంటే నమ్మలేకపోతున్నా... నిన్ననే వివాహమైనట్లు అనిపిస్తుంది. నా ప్రియతమ స్నేహితురాలికి.. నా భాగస్వామికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎప్పటికీ నువ్వు నాదానివే’ అని విరాట్ ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. దానికి స్పందించిన అనుష్క శర్మ ‘కాలం గడిచిపోతుందని తెలియట్లేదంటే అంతకు మించిన స్వర్గం మరొకటి లేదు. ఓ మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోటం కంటే మించిన స్వర్గం మరొకటి లేదు’ అని ట్వీటర్లో కామెంట్ చేశారు. ఈ జంట ట్వీట్లకు క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు.. నెటిజన్లు అందరూ ఫిదా అయిన విషయం తెలిసిందే. ఈ జంట 2017 డిసెంబర్ 11న వివాహబంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. -
నిక్ జొనాస్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన ప్రియాంక
ముంబై : ‘వైట్ టైగర్’ సినిమా షూటింగ్లో బీజీగా ఉన్నారు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా. మరికొన్ని రోజుల్లో ఈ గ్లోబల్ స్టార్ మొదటి పెళ్లి రోజును జరుపుకోబోతున్నారు. 2018 డిసెంబర్ 1న వీరి వివాహం అయిన విషయం తెలిసిందే. తాజాగా సినిమాకు కొన్ని రోజులు విరామం ఇచ్చిన ప్రియాంక అమెరికాకు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా న్యూయార్క్ వెళ్లిన ప్రియాంక భర్త హలీవుడ్ పాప్ సింగర్ నిక్ జొనాస్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. జెర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఓ కుక్కపిల్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి ‘గినో’ గా అప్పుడే పేరు కూడా పెట్టేశారు. ఇందుకు నిక్ నిద్రలేవక ముందే కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చి ప్రియాంక సర్ప్రైజ్ చేశారు. ఇదంతా వీడియో తీసిన ప్రియాంక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి ‘ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరూ క్యూట్‌గా ఉన్నారు. హ్యపీ యానివర్సరీ బేబీ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక దీనిపై స్పందించిన నిక్...‘ఉదయాన్నే నాకు మంచి బహుమతి అందింది. మా గిల్‌కు హాయ్ చెప్పండి. నిద్ర లేచినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాను. థాంక్యూ ప్రియాంక’ అంటూ తెలిపారు. కాగా ఇప్పటికే ప్రియాంక చోప్రా ఇంటిలో డయానా అనే కుక్క ఉంది. దీనిని 2016 నవంబర్‌లో తీసుకొచ్చారు. దీని పేరు మీద ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉందంటే ప్రియాంకు డయానా అంటే ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదు. తాజాగా గినోను ఇంటికి తీసుకువచ్చిన క్రమంలో డయానాను కూడా మేము ప్రేమిస్తున్నాం అని ప్రియాంక చెప్పుకొచ్చారు. ఇక మొదటి పెళ్లిరోజు దగ్గరపడుతుండటంతో ఇటీవల కొనుగోలు చేసిన ఇంటిలో ప్రియాంక, నిక్ కపుల్ ఈ వేడుకలను జరుపుకోబుతున్నారు. View this post on Instagram so much cute in the same frame. 😂🐶❤ happy almost anniversary baby. #repost @nickjonas • Pri came home with the absolute best surprise this morning. Please meet our new pup @ginothegerman I haven’t stopped smiling since I woke up this morning and finally realized what was going on. Thank you @priyankachopra ❤️ 🐕 A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Nov 26, 2019 at 2:28pm PST -
పెళ్లి రోజు సంబరాలకు భర్త ఒప్పుకోలేదని..
గుత్తి: పెళ్లి రోజు సంబరాలు చేయడానికి భర్త ఒప్పుకోలేదని క్షణికావేశానికి లోనైన భార్య బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు.. గుత్తి ఆర్ఎస్లోని బండిమోటు వీధికి చెందిన జరాల్డ్, తేజస్విణి (24) ప్రేమించుకుని ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు జన్మించాడు. జరాల్డ్ బళ్లారిలోని జిందాల్ ఫ్యాక్టరీలో ఇంజినీర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం వీరి పెళ్లిరోజు కావడంతో వేడుక చేసుకుందామని జిందాల్ నుంచి గుత్తి ఆర్ఎస్కు వచ్చాడు. అయితే పెళ్లి రోజు సంబరాలు చేసుకుంటే అరిష్టం జరుగుతుందని ఓ పూజారి చెప్పాడని జరాల్డ్ భార్యకు చెప్పాడు. వేడుక వద్దని తెలపడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. పెద్దలు సర్దిచెప్పి తాత్కాలికంగా గొడవను సద్దుమణిగించారు. బుధవారం ఉదయం మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తానం చెందిన తేజస్వణిని ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ గోపాలుడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, విచారణ నిమిత్తం భర్త జరాల్డ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్రేమకు పదేళ్లు.. సమంత స్వీట్ పోస్ట్
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నాగ చైతన్య, సమంతల వివాహం అయి అప్పుడే రెండేళ్లు గడిచిపోయింది. ఆదివారం వీరి వివాహ వార్షికోత్సం సందర్భంగా పలువరు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సమంత కూడా తన వివాహ జీవితానికి సంబంధించి ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశారు. చైతూతో కలిసి గడిపిన కొన్ని అరుదైన చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. చైతుతో కలిసి డ్యాన్స్ చేసిన ఓ వీడియోను కూడా షేర్ చేశారు. అంతేకాకుండా ఈ రెండేళ్లలో తమ మధ్య బంధం మరింత దృఢంగా మారిందని ఆమె పేర్కొన్నారు. అలాగే తమ ప్రేమ ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుందన్నారు. తెలుగులో సమంత నటించిన తొలి చిత్రం ‘ఏం మాయ చేశావే’లో చైతూతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. చివరకు ఇరువైపుల పెద్దల అంగీకారంతో 2017 అక్టోబర్ 6న వీరి వివాహం జరిగింది. పెళ్లైనా తరువాత కూడా సమంత సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే చై-సామ్ కాంబినేషన్లో వచ్చిన మజిలీ మంచి హిట్ అందుకుంది. అలాగే సమంత కీలక పాత్రలో నటించిన ఓ బేబీ చిత్రం బ్లాక్బాస్టర్గా నిలిచింది. -
ప్రేమకు పదేళ్లు.. సమంత స్వీట్ పోస్ట్
-
పెళ్లి రోజున భార్య ఇంటికి రాలేదని..
బంజారాహిల్స్: పెళ్లి రోజున భార్య తనతో రాకుండా పుట్టింట్లోనే ఉండటమే కాకుండా కుటుంబసభ్యులతో తిట్టించిందని మనస్తాపానికి లోనైన ఓ యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫిలింనగర్, గౌతంనగర్‌లో ఉంటున్న రాపాన రాము(26) కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. అతడికి 2013లో సురేఖతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు. 20 రోజుల క్రితం హఫీజ్‌పేట్‌లోని పుట్టింటికి వెళ్లిన సురేఖ ఎన్నిసార్లు పిలిచినా ఇంటికి రాలేదు. దీనికితోడు ఆమె తల్లిదండ్రులు భీమమ్మ, వెంకయ్య, సోదరుడు చిన్న ఆమెకు మద్దతుగా మాట్లాడారు. గత శుక్రవారం పెళ్లి రోజు కావడంతో ఇంటికి వస్తే పిల్లలతో కలిసి గుడికి వెళ్దామని రాము భార్యను బతిమిలాడాడు. అయితే బామ్మర్ది చిన్న అందుకు అంగీకరించకపోగా అసభ్యంగా దూషించాడు. ఆదివారం కూడా అత్తవారింటికి వెళ్లి భార్యను కాపురానికి రావాలని కోరగా ఆమె నిరాకరించింది. అత్త, బావమరిది అతడిని తిట్టి పంపించారు. సోమవారం ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పుకుని బాధపడిన రాము మంగళవారం రాత్రి భోజనం చేయకుండానే గదిలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు ఉదయం నిద్ర లేచి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. తన చావుకు అత్త భీమమ్మ, మామ వెంకయ్య, బామ్మర్ది చిన్న కారణమని వారిపై చర్యలు తీసుకోవాలంటూ సూసైడ్ నోట్ రాశాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అలా మా పెళ్లయింది
‘‘ఇంకొన్ని గంటల్లో విమానం బయలుదేరుతుందనగా హడావిడిగా మా పెళ్లి జరిగింది. పెళ్లయిన వెంటనే మేం లండన్ వెళ్లాం’’ అన్నారు అమితాబ్ బచ్చన్. సోమవారం అమితాబ్, జయా బచ్చన్ల 46 వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా తమ పెళ్లి నాటి విశేషాలను అమితాబ్ గుర్తు చేసుకున్నారు. 1973 జూన్ 3న వీరి పెళ్లి జరిగింది. అమితాబ్, జయ నటించిన ‘జంజీర్’ విడుదలై అప్పటికి దాదాపు 20 రోజులు. ఆ విషయం గురించి అమితాబ్ చెబుతూ– ‘‘జంజీర్’ విజయం సాధిస్తే లండన్ వెళ్లాలని కొంతమంది స్నేహితులం అనుకున్నాం. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో అందరం లండన్ ప్రయాణం అయ్యాం. మా నాన్న హరివన్ష్ రాయ్ బచ్చన్ దగ్గర లండన్ ట్రిప్ గురించి చెబితే ‘జయ కూడా మీతో వస్తోందా?’ అని అడిగారు. అవునన్నాను. ‘ఒకవేళ మీ ఇద్దరూ కలిసి ట్రిప్ వెళ్లాలనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకుని వెళ్లండి’ అన్నారు. అంతే.. అప్పటికప్పుడు మా పెళ్లి నిశ్చయమైంది. మర్నాడు రాత్రి మా లండన్ ఫ్లయిట్. పెళ్లి అనుకోగానే పురోహితులకు చెప్పారు. మా రెండు కుటుంబాలు, కొందరు సన్నిహితుల మధ్య మేం పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత లండన్ ఫ్లయిట్ ఎక్కాం. నేను లండన్ వెళ్లడం అదే మొదటిసారి. జయాకి కూడా ఫస్ట్ టైమే’’ అన్నారు. పెళ్లి వేదికకు అమితాబ్ వెళ్లే ముందే సన్నగా చినుకులు పడ్డాయట. ఆ విషయం గురించి కూడా అమితాబ్ చెబుతూ – ‘‘పెళ్లికి భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించాను. ముంబైలోని మలబార్ హిల్ దగ్గర మా పెళ్లి కోసం మంగళ్ అనే ఇంటిని అద్దెకు తీసుకున్నాం. మా ఇంటి నుంచి అక్కడికెళ్లడానికి నేను కారు ఎక్కాను. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను. నా డ్రైవర్ నగేశ్ నేను డ్రైవ్ చేస్తానన్నాడు. పెళ్లికి గుర్రానికి బదులుగా ఆ కారు అనుకున్నాను. కరెక్ట్‌గా బయలుదేరే సమయానికి చినుకులు మొదలయ్యాయి. మా పక్కింటివాళ్లు ‘ఇంతకన్నా మంచి శకునం ఉండదు. వెళ్లండి’ అన్నారు. వెళ్లాను. కొన్ని గంటల్లో మా పెళ్లి పూర్తయింది. ‘మిస్టర్ అండ్ మిసెస్’ అని ప్రకటించారు’’ అన్నారు. -
ఏడడుగులకు ఏడేళ్లు
పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి సతీమణి ఉపాసనతో కలిసి రామ్‌చరణ్ సౌత్ఆఫ్రికా వెళ్లారు. అదేంటీ వారి మ్యారేజ్ డే (జూన్ 14)కి ఇంకా టైమ్ ఉంది కదా అంటే నిజమే. ఆ సమయంలో రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్‌తో చరణ్ బిజీగా ఉంటారట. అందుకే ఇలా ప్రీ–మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కోసం ఆఫ్రికా వెళ్లారు చరణ్, ఉపాసన. ‘‘అడ్వాన్స్‌గా మాకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. డైవింగ్, అడ్వెంచర్ స్పోర్ట్, హీలింగ్ టెక్నిక్స్.. ఇలా ప్రతి పెళ్లి రోజుకీ ఇద్దరం ఏవో కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటుంటాం. ఈసారి వైల్డ్‌లైఫ్ గురించి తెలుసుకుంటున్నాం. చాలా బాగుంది’’ అని పేర్కొన్నారు ఉపాసన. అలాగే తమ హ్యాపీ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారామె. ఇంకా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ– ‘‘ఇది వన్‌వీక్ హాలీడే ట్రిప్. టాంజానియా, మౌంట్ కిలిమంజారో వంటి ప్రదేశాలను చూడాలనుకుంటున్నాం. చరణ్ కాలికి గాయం కావడం వల్ల ఎక్కువగా నడవడానికి కుదరదు. అయినప్పటికీ ట్రిప్‌ను బాగానే ఎంజాయ్ చేస్తున్నాం. ప్రేమలో పడటాన్ని చరణ్ అంతగా నమ్మరు. కానీ ప్రేమలో ఎదుగుదలను విశ్వసిస్తారు’’ అని చెప్పుకొచ్చారు ఉపాసన. అన్నట్లు.. ఈ ఏడాదితో చరణ్, ఉపాసనలది సెవెన్త్ మ్యారేజ్ డే. జూన్ 14న ఈ క్యూట్ కపుల్ మ్యారేజ్ డే. -
మరెన్నో జరుపుకోవాలి
మే నెల ఎన్టీఆర్‌కు చాలా స్పెషల్. తన బర్త్‌డే, మ్యారేజ్ డే.. ఇలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ మే నెలలో ఉన్నాయి. 2011 మే 5న ఎన్టీఆర్, ప్రణతిల పెళ్లి రోజు. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా శ్రీమతితో కలిసి దిగిన ఓ సెల్ఫీని తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి, ‘‘8 ఏళ్లు అయింది. మరెన్నో వెడ్డింగ్ యానివర్సరీలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను’’ అని క్యాప్షన్ పెట్టారు ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారాయన. -
పోజు ప్లీజ్!
బాలీవుడ్లో వన్నాఫ్ ది బెస్ట్ కపుల్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ మాల్దీవుల్లో మస్త్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ వెకేషన్‌తో పాటు పెళ్లి రోజు సంబరాల్ని కూడా అక్కడే జరుపుకున్నారీ దంపతులు. అప్పుడు ఆరాధ్య పోజు ప్లీజ్ అంటే, కూతురి కెమెరాకి ఇద్దరూ పోజు ఇచ్చినట్లున్నారు. ‘‘ఈ ఫొటోను మా జీవితాల వెలుగు దివ్వె అయిన ఆరాధ్య తీసింది’’ అంటూ పైన ఉన్న ఫొటోను షేర్ చేశారు ఐశ్వర్యారాయ్. ఇది అభిషేక్ అండ్ ఐశ్వర్యాల 12వ వివాహ వార్షికోత్సవం కావడం విశేషం. న్యూయార్క్‌లో జరిగిన ‘గురు’ ప్రీమియర్ షో సమయంలో ఐశ్వర్యకు ప్రపోజ్ చేశారు అభిషేక్. ఆ తర్వాత 2007 ఏప్రిల్ 20న వీరిద్దరి వివాహం జరిగింది. 2011 నవంబరులో ఆరాధ్యకు జన్మనిచ్చారు ఐశ్వర్య. ‘గురు’ సినిమాకు ముందు ‘టాయి అక్షర్ ప్రేమ్ కే’ (2000), ‘కుచ్ నా కహో’ (2003) చిత్రాల్లో కలిసి నటించారు ఐశ్వర్య అండ్ అభిషేక్. ఇప్పుడు ‘గులాబ్ జామ్’ అనే చిత్రంలో జంటగా నటించనున్నారు. -
హ్యాపీ యానివర్సరీ!
ఫిబ్రవరి 10న మహేశ్ బాబు, నమత్ర వెడ్డింగ్ యానివర్సరీ. ఈ సందర్భంగా ఈ 14ఏళ్ల ప్రేమ ప్రయాణాన్ని ఓ ఫొటో ద్వారా షేర్ చేసుకున్నారు మహేశ్. ‘‘ఆనంద క్షణాలు అద్భుతంగా బంధించిన చిత్రమిది. 14వ వివాహ వార్షికోత్సవం. హ్యాపీ యానివర్సరీ లవ్(నమ్రత)’’ అని ట్వీటర్లో పేర్కొన్నారాయన. పెళ్లిరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని దేవనార్ స్కూల్ ఆఫ్ బ్లైండ్‌లోని 650 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు మహేశ్, నమ్రత దంపతులు. -
థర్మకోల్ కేకు @ 5 లక్షల రూపాయలు
మనీలా : పెళ్లిరోజు అనేది మన జీవితంలో అతి ముఖ్యమైన రోజుల్లో ఒకటి. పెళ్లి రోజును మన జీవితంలో మర్చిపోలేము. మన దేశంతో పాటు చాలా దేశాల్లో పెళ్లిరోజును పండుగలా జరుపుకుంటారు.బంధువులను, స్నేహితులను పిలుస్తారు. వారందరికి విందు ఇస్తారు. ఇలా ఆ రోజును చాలా సంతోషంగా గడుపుతారు. అందరిలాగానే ఓ జంట కూడా తమ పెళ్లి రోజును ఘనంగాజరుపోవాలని భావించింది. దీని కోసం నెల ముందు నుంచే ప్లాన్ చేసుకుంది. బంధువులకు, స్నేహితులకు ఆహ్వానం కూడా పంపారు. విందు కోసం రూ.5లక్షలులతో ఓ ప్రముఖక్యాటరింగ్ సంస్థకు ఆర్డర్ ఇచ్చారు. చివరకు క్యాటరింగ్ సంస్థ చేసిన మోసానికి అందరి ముందు తలదించుకున్నారు. వారు ఆర్డర్ చేసిన పుడ్ సప్లై చేయకపోవడమే కాకుండా, భారీ కూల్ కేకుకు బదులు థర్మకోల్ కేకు పార్శిల్ ఇచ్చి నలుగురి ముందు నవ్వులపాలు చేశారు. వివరాలు.. ఫిలిప్పీన్స్ దేశంలో పాసిగ్ సిటీకి చెందిన షైన్ తమాయో తన పెళ్లి రోజు ఘనంగా జరుపోవాలకున్నారు. నగరానికి చెందిన ప్రముఖ క్యాటరింగ్ సంస్థకు రూ. 5లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వింధు ఏర్పాటు చేశారు. పెళ్లి రోజు బంధువులు, స్నేహితులు అంతా తన ఇంటి వచ్చారు. వింధు కోసమై వెళ్లి చూడగా అక్కడ పుడ్ ఏర్పాటు చేయలేదు. దింతో పక్క వీధిలో ఉన్న హోటల్లో పుడ్ తెప్పించి వారికి వింధు ఇచ్చారు. అనంతరం కేకు కటింగ్ వెళ్లారు. అందరు చూట్టూఉండగా ఆ జంట కేక్ కట్ చేసింది. అది చూసి బంధువుతలతో పాటు, వారు కూడా షాకయ్యారు. అది కేకు కాదు థర్మకోల్. కేకు ఆకారంలో థర్మకోల్ను తయారు చేసి పైన రంగు వేశారు. ఇది చూసి పెళ్లి రోజు ఆ జంట బోరుమంది. క్యాటరింగ్ సంస్థ చేసిన మోసానికి తాము బలైపోయామని వాపోయారు. వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఏదేమైనా పెళ్లి రోజు ఆ జంటకు తీవ్ర నిరాశ ఎదురైంది. -
గోల్డీ... నువ్వు నా ధైర్యానివి
సోనాలీ బింద్రే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం న్యూయార్క్‌లో ఉంటున్నారామె. నవంబర్ 12న సోనాలీ బింద్రే, గోల్డీ బెహల్ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా భర్తతో ఉన్న అనుబంధం గురించి సోనాలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో నిండిన లేఖను రాశారు. అందులోని సారాంశం ఏంటంటే... ‘‘ఈ లేఖ రాయడం మొదలు పెట్టగానే నా ఆలోచనలు, అనుభవాలకు అక్షర రూపం ఇవ్వలేనని నాకు అర్థం అయిపోయింది. కానీ ప్రయత్నిస్తాను. గోల్డీ.. నువ్వు నాకు భర్త మాత్రమే కాదు. నా ఆప్తమిత్రుడివి. నా సహచరుడివి. నా ధైర్యానివి. కష్టసుఖాల్లో, గెలుపోటముల్లో, ఆరోగ్య, అనారోగ్యాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడటమే కదా పెళ్లి అంటే. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే క్యాన్సర్ ఒక్కళ్లు మాత్రమే చేసే యుద్ధం కాదు. ఒక కుటుంబం మొత్తం పడే బాధ. వేదన. నువ్వు అన్ని బాధ్యతలు తీసుకోగలవని, ఇంకొన్ని కూడా తీసుకొని ఇంట్లో ఉండగలవని నాకు తెలుసు. అందుకే ఈ జర్నీని కొనసాగిస్తున్నాను. ఇన్ని రోజులుగా రెండు ఖండాల చుట్టూ తిరుగుతూ ఉన్నావు. థ్యాంక్స్ గోల్డీ... నాకు ధైర్యంగా నిలబడినందుకు. నాకు ప్రేమను పంచుతున్నందుకు. ప్రతి అడుగులో తోడుగా ఉన్నందుకు. థ్యాంక్యూ.. అనేది చాలా చిన్న పదం అవుతుందని నాకు తెలుసు. ఎప్పటికీ నీలో ఒక భాగాన్ని, నీదాన్ని. హ్యాపీ యానివర్శరీ గోల్డీ’’ అంటూ తమ పెళ్లి నాటి ఫొటోను కూడా షేర్ చేశారు సోనాలి. -
సూపరో సూపరు!
రంగమ్మా, మంగమ్మా ... అక్కినేని కోడలు సమంత ఎక్కడమ్మా! మామ నాగార్జున సిల్వర్జూబ్లి వెడ్డింగ్ యానివర్శరీ సెలబ్రేషన్స్‌లో కనిపించలేదమ్మా! ఇదిగో ఇలాగే ఫ్యాన్స్ అందరూ ఫన్నీగా పాడుకుంటున్నారు. కానీ సమంత మాత్రం చెన్నైలో కేక్‌ను ముక్కలు ముక్కలు చేసి పక్కనున్న వాళ్ల నోరు తీపి చేశారు. ఏంటీ? మామయ్య వెడ్డింగ్ యానివర్శరీలో పాల్గొనకుండా చెన్నైలో బర్త్‌డే పార్టీకి వెళ్లారా సమంత! అని ఆశ్చర్యపోకండి. ఆమె కేక్ కట్ చేసింది తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసినందుకు. బిజీ బిజీ షెడ్యూల్ వల్ల మామయ్య పెళ్లి రోజు పార్టీకి సమంత హాజరు కాలేకపోయారని ఇప్పుడు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘అరణ్యకాండం’ ఫేమ్ త్యాగరాజన్ కుమార్‌రాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సమంత ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘సూపర్ డీలక్స్’. ఇందులో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నారని కోలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశారు సమంత. ఆ సందర్భంలో సెట్స్‌లో సరదాగా కేక్ కట్ చేసి, చిత్రబృందంతో సందడి చేశారామె. తమిళ, తెలుగు భాషల్లో ఈ ఏడాది ఆల్రెడీ మూడు సార్లు సిల్వర్‌స్క్రీన్‌పై మెరిసిన సమంత ఈ ఏడాది మరో రెండో సినిమాల్లో కనిపించే అవకాశంఉంది. ఇది తెలిసిన ఫ్యాన్స్ మా సమంత... సూపరో సూపరు అంటున్నారు. -
నీ లోటు తీరనిది
ఈ జూన్ 2న బోనీ కపూర్, శ్రీదేవి తమ 22వ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకోవాల్సింది. కానీ శ్రీదేవి దురదృష్టవశాత్తు బాత్ టబ్‌లో పడి చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ట్వీటర్ అకౌంట్‌ను ఆమె భర్త బోనీ కపూర్ మొయింటేన్ చేస్తున్నారు. పెళ్లి రోజు సందర్భంగా శ్రీదేవి చివరిసారిగా దుబాయ్‌లో అటెండ్ అయిన వెడ్డింగ్ ఈవెంట్ వీడియోను పోస్ట్ చేసి– ‘‘ఈ రోజు మన 22వ వెడ్డింగ్ యానివర్శరీ అయ్యుండేది. జాన్.. నా సోల్‌మేట్, నువ్వు ప్రేమానురాగాలకు నిర్వచనం. నీ ప్రేమను, అనుభూతులను, జ్ఞాపకాలను ఎప్పటికీ నాలోనే దాచుకుంటాను. లెజెండ్ అన్న దాని కంటే కూడా నువ్వు ఎక్కువ. నువ్వు లేని లోటు కచ్చితంగా తీరనిది’’ అని పేర్కొన్నారు బోనీ. తల్లిదండ్రుల వెడ్డింగ్ యానివర్శరీ సందర్భంగా ‘బోనీ శ్రీదేవిని ముద్దాడుతున్న’ ఫొటోను షేర్ చేశారు కుమార్తె జాన్వీ. బీటౌన్‌లో జాన్వీ నటించిన తొలి చిత్రం ‘ధడక్’ వచ్చే నెల 20న రిలీజ్ కానుంది. -
ఆయన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్యూ గాడ్ : అనసూయ
అనసూయ భరద్వాజ్ ఒక పక్క టీవీ షోలలో యాంకర్‌గా చేస్తూనే.. మరో పక్క వెండితెరపై నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అనసూయ సోమవారం తమ పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా తన భర్త స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారని అనసూయ ట్వీట్ చేశారు. ‘ఈ సంవత్సరం కూడా మా ఆయన బెస్ట్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ ఏడాది మాల్దీవులకు తీసుకొచ్చారు. మై బెస్ట్.. హబ్బీ గోల్స్.. హబ్బీ లవ్.. వివాహ వార్షికోత్సవం 2018 ట్రిప్. ఆయనని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు దేవుడా!’ అంటూ మల్దీవుల్లోని బీచ్ తీరంలో భర్తతో కలిసి దిగిన ఫొటోను అనసూయ ట్విటర్లో పోస్ట్ చేసింది. And he does it again!!! My best!!!! Got us to #Maldives this year!!!!! How much more can love get from us!!! Hahahha😍 #touchwood #Bestsurpriseplanner #hubbygoals #hubbylove #MarriageAnniversary2018trip ❤️❤️❤️ #thankyouGodforhim 😍❤️❤️😘 pic.twitter.com/ownRuvPEFF — Anasuya Bharadwaj (@anusuyakhasba) June 3, 2018 -
శ్రీదేవి ట్విటర్లో వీడియో షేర్ చేసిన బోనీకపూర్
-
జాన్ శ్రీదేవీ..బోనీకపూర్ స్పెషల్ ట్వీట్
సాక్షి, ముంబై: అందాలనటి, వెండి తెర జాబిలి శ్రీదేవి నింగికేగి అపుడే మూడు నెలలు గడిచిపోయింది. ఈ రోజు (జూన్ 2) శ్రీదేవీ, బోనీ కపూర్ల వివాహ వార్షికోత్సవం. శ్రీదేవి బతికి వుండి వుంటే ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకునే వారేమో. ఇదే విషయాన్ని ఆమె భర్త బోనీకపూర్ సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నారు. తన భార్య తనతో లేకపోయినా....ఆమె ప్రేమ, స్నేహం ఎప్పటికీ తనతోపాటే నిలిచి వుంటుందంటూ ట్విటర్లో తన ఆవేదనను పంచుకున్నారు. ఈ మేరకు శ్రీదేవి ట్విటర్ ఖాతాలో బోనీకపూర్ శనివారం ఒక ట్వీట్ చేశారు. దీంతోపాటు ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ‘నువ్వు ఉండి వుంటే ఈ రోజు మన 22 వ వివాహ వార్షికోత్సవం అయ్యేది. నా ప్రాణమా.నా అర్థంగీ, నా ఆత్మ, ప్రేమకు ప్రతిరూపమా...నీ ప్రేమా నీ ఉత్సాహం, నీ నవ్వు ఎప్పటికీ నా తోనే..’ అంటూ ట్వీటర్ లో పేర్కొన్నారు. కాగా ప్రముఖ సినీ నటి శ్రీదేవి ఫిబ్రవరి 25న హఠాన్మరణం చెందడం యావత్తు ప్రపంచాన్ని తీవ్ర విభ్రాంతికి గురిచేసింది. సమీప బంధువు పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబసభ్యులతో దుబాయ్‌కు వెళ్లిన ఆమె తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూసినట్టుగా కుటుంబ సభ్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. Today would have been our 22nd wedding anniversary. Jaan... My wife, my soulmate, the epitome of love, grace , warmth and laughter lives within me forever... pic.twitter.com/0XWhFIvOvz — SRIDEVI BONEY KAPOOR (@SrideviBKapoor) June 2, 2018 -
థ్యాంక్యూ సుచిత్రా
... అంటున్నారు మోహన్ లాల్. ఎవరీ సుచిత్రా అంటే.. ఆయన సతీమణి. బుధవారం మోహన్‌లాల్ 30వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ‘‘నాకు అద్భుతమైన బిడ్డలను (కొడుకు ప్రణవ్, కూతురు విస్మయా) ఇచ్చావు. నువ్వు అద్భుతమైన భార్యవి. థ్యాంక్స్’’ అని భార్యను అభినందించారు మోహన్‌లాల్. కుమారుడు ప్రణవ్ సమక్షంలో ఈ జంట తమ వెడ్డింగ్ యానివర్శరీని సెలబ్రేట్ చేసుకున్నారు. ‘‘ఒకవేళ ఇది (తల్లిదండ్రుల పెళ్లిని ఉద్దేశించి) జరగకపోయి ఉంటే నాలాంటి కొడుకు మీకు ఉండేవాడు కాదు. మీ ఇద్దరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు’’ అన్నారు ప్రణవ్. కాగా, ప్రణవ్ హీరోగా నటించిన ‘ఆది’ ఈ ఏడాది జనవరిలో రిలీజైంది. నటుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నారు. -
పెళ్లి రోజు!
ఇవాళ్టితో పదకొండేళ్లు పూర్తయ్యాయి ఐశ్వర్య, అభిషేక్‌ల పెళ్లయి! పదకొండేళ్ల నుంచి కూడా ఈ జంటపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. ఐశ్వర్య ఇగోయిస్ట్ అనీ, అభిషేక్ ఆమెతో వేగలేకపోతున్నారనీ, ‘త్వరలోనే’ ఈ కపుల్ విడిపోయే అవకాశాలున్నాయని ఇప్పటికీ ఏదో ఒక కోడి కూస్తూనే ఉంది. పెళ్లయ్యాక కూడా అభిషేక్ తల్లిదండ్రులతోనే కలిసి ఉండటం లేదని ఐశ్వర్యకు నచ్చడం లేదట. ఐశ్వర్య తన మాజీ కో–స్టార్లతో కలివిడిగా ఉండటం అభిషేక్‌కు చికాకు తెప్పిస్తోందట. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే... ఐశ్వర్య అనుమానపు భార్యట! అభిషేక్ ఫోన్ కాల్స్‌ని చెక్ చేస్తూ ఉంటుందట. ‘నెవర్’ అని ఐశ్వర్య సమాధానం. అయినా పెళ్లిరోజు మాట్లాడుకోవలసిన సంగతులా ఇవీ. భార్యాభర్తలన్నాక ఏదో ఒక టైమ్‌లో జీవిత భాగస్వామిపై చికాకు పడటం, అతి ప్రేమతో (పొసిసివ్‌నెస్) అనుమానించడం ప్రతి ఇంట్లోనూ ఉండేది. అలాగే ఐష్, అభీలు! అసలీ వదంతులన్నిటికీ కారణం.. ఈ హీరోహీరోయిన్లకు పెళ్లికి మునుపున్న వేరే ప్రణయ సంబంధాలే. అవి ఎన్ని ఉన్నా వివాహబంధంతో ఒకటి అయ్యారు కాబట్టి.. గతాన్ని లాక్కొచ్చి, వర్తమానంలో పడేసి, భవిష్యత్తును అశాంతి పరచడం ఈ వదంతివాదులకు భావ్యం కాదు. త్వరలో ఐశ్వర్య నటించిన ‘ఫన్నీ ఖాన్’ రిలీజ్ అవుతోంది. అభిషేక్ నటించిన ‘మన్మర్జియాన్’ పూర్తి కావచ్చింది. ఐశ్వర్యది మ్యూజికల్ కామెడీ. అభిషేక్‌ది రొమాంటిక్ డ్రామా. వీటి కోసం ఎదురుచూడ్డం మానేసి, ఇద్దరూ కలిసి ఎందుకు నటించడం లేదని ఆలోచిస్తే.. మళ్లీ అక్కడో గాసిప్ క్రియేట్ అవుతుంది. అవసరమా?! -
పెళ్లిరోజున రో‘హిట్’.. రితిక హైలెట్!
మొహాలి: పెళ్లిరోజున ఎవరైనా ఏం చేస్తారు. ఆఫీసుకు సెలవుపెట్టి రోజంతా కుటుంబంతో సరదా గడుపుతారు. కానీ రోహిత్ శర్మ బరిలోకి దిగి సరికొత్త రికార్డు లిఖించాడు. చావొరేవో తెల్చుకోవాల్సిన మ్యాచ్‌లో జూలు విధిలించాడు. డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. గత మ్యాచ్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని చెరిపేశాడు. పెళ్లిరోజున తన ఆటను కళ్లారా చూసేందుకు వచ్చిన భార్యకు అపురూపమైన కానుక ఇచ్చాడు. రోహిత్ మైదానంలో ఆడుతున్నంతసేపు అతడి అర్థాంగి రితికా సజ్దేహ్ ఆసక్తికరంగా ఆటను తిలకించింది. సెంచరీకి చేరువైన వేళ ఆమె కాస్త ఆందోళన పడింది. తన భర్త సెంచరీ చేయడం ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆమె ఊపిరి పీల్చుకుంది. రోహిత్ కూడా మైదానం నుంచే తన సతీమణికి గాల్లో ముద్దు విసిరాడు. శతకం బాదిన తర్వాత రోహిత్ సిక్సర్ల మోత ముగించాడు. సిక్స్ కొట్టిన ప్రతిసారి కెమెరామెన్ ఆమె హావభావాలను అభిమానులకు చూపించాడు. డబుల్ సెంచరీ సాధించినప్పడు రోహిత్-రితిక ఆనందం శిఖరాలను తాకింది. రోహిత్ మూడో ద్విశతకంతో ప్రపంచ రికార్డు సృష్టించడంతో రితిక కళ్లు ఆనంద భాష్పాలు వర్షించాయి. స్టేడియంలో ఒక్కసారిగా కరతాళ ధ్వనులు మిన్నంటాయి. పెళ్లిరోజును మరపురాని జ్ఞాపకంగా మలుచుకున్న ఈ జంటపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. RT for Rohit sharma's wife 😁👌 FAV for Rohit Sharma #INDvsSL pic.twitter.com/1xYEPJTn4f — Assassinator (@Android_boy_17) 13 December 2017 Only Person On The Field With A Better Timing Than Rohit Sharma Is The Cameraman Showing Rohit's Wife After Every SIX. 😁💃🙏🇮🇳#INDvSL #INDvsSL #RohitSharma — Sir Ravindra Jadeja (@SirJadeja) 13 December 2017 200 up for "Rohit Sharma" that too on his anniversary. He's not a human,from 100 to 200 in just 38 balls. #RohitSharma #INDvSL pic.twitter.com/uBh85W5Y75 — Mahak Mohan (@MahakMohan) 13 December 2017 Relationship Goals😍😍"Rohit Sharma" #RohitSharma #INDvSL pic.twitter.com/vvlCLd12GX — Varshini Chowdary😎 (@Varshinigaru) 13 December 2017 Rohit Sharma the hitman totally pushed #Virushka trend outside of timeline in a single day and this picture overshadowed everything #RohitSharma208 #INDvsSL pic.twitter.com/w3JAjJRTx3 — Renu Manuja (@RenuManuja) 13 December 2017 పెళ్లిరోజున మరపురాని జ్ఞాపకం -
పెళ్లిరోజున భావోద్వేగం
-
ఈ రోజు మళ్లీ మళ్లీ రావాలి
‘మళ్లి మళ్లి ఇది రాని రోజు..’ అంటూ ‘రాక్షసుడు’ సినిమాలో చిరంజీవి, సుహాసిని పాడుకున్న పాట గుర్తుండే ఉంటుంది. కన్నడ ఇంటి కోడలైన తెలుగు అమ్మాయి సుమలత ఈ పాటను జస్ట్ మార్చి, ‘ఈ రోజు మళ్లీ మళ్లీ రావాలి’ అనుకున్నారు. దానికి కారణం లేకపోలేదు. కన్నడ నటుడు అంబరీష్, సుమలతల వైవాహిక జీవితం సిల్వర్ జూబ్లీ కూడా పూర్తి చేసుకుంది. అదేనండీ పెళ్లై 25 ఏళ్లయింది. ఈ నెల 7న ఈ దంపతుల పెళ్లి రోజు. బెంగళూరులో తమ వెడ్డింగ్ యానివర్శిరీని ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో జయసుధ, జయప్రద, రమ్యకృష్ణ, ఖుష్బూ, సీనియర్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. ‘‘బాధ, సంతోషం.. మంచి, చెడు.. ఇవన్నీ ఏ జంట జీవితంలో అయినా సహజం. ఇవన్నీ ఉంటేనే సంసారం బాగుంటుంది. వీటిని అధిగమించడానికి నాకు తోడుగా ఉన్నారు నా డియర్ హబ్బీ’’ అని ఈ సందర్భంగా సుమలత పేర్కొన్నారు. స్నేహితులందరూ పాల్గొనడంతో ఈ వేడుకకు నిండుదనం చేకూరిందని కూడా ఆమె అన్నారు. ఇలాంటి ఆనందకరమైన రోజులు మళ్లీ మళ్లీ రావాలని ఆమె అభిలషించారు. -
నాగ్, అమల ప్రేమపెళ్లికి 25 ఏళ్లు...
హైదరాబాద్ : నవ మన్మధుడు అక్కినేని నాగార్జున, అమల తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. వీరిద్దరి వివాహం జరిగి పాతిక సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నాగార్జున ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేశారు. నాగార్జున తన పెళ్లి ఫోటోని షేర్ చేస్తూ ‘నేటితో 25 ఏళ్ళు పూర్తైంది. ఈ కపుల్ కి యానివర్సరీ విషెస్ తెలపండి’ అంటూ కామెంట్ పెట్టారు. అలాగే అమలతో పాటు, తమపై ప్రేమ, అభిమానం చూపిన అందరికి కృతజ్ఞతలు అని నాగ్ తెలిపారు. 1992లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు అక్కినేని అఖిల్ కూడా అమ్మా,నాన్నలతో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేశాడు. కాగా ప్రస్తుతం నాగ్... రాజుగారి గది-2లో నటిస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత చాలాఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న అమల... శేఖర్ కమ్మల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. మలయాళ చిత్రం ‘కేరాఫ్ సైరాభాను’లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. -
సూపర్ స్టార్ పెళ్లిరోజు నేడు
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన 28వ పెళ్లి రోజును వియత్నాంలో జరుపుకుంటున్నారు. ఈ రోజు(ఏప్రిల్ 28) తమ పెళ్లి రోజును వియత్నాంలో సన్నిహిత మిత్రుల సమక్షంలో సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు మోహన్ లాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 28 ఏళ్ల తమ దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా సాగిందని పేర్కొన్నారు. భార్య సుచిత్రా బాలాజీతో తాను కలిసివున్న క్లోజప్ ఫొటోను ట్విటర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. వీరిద్దరూ 1988, ఏప్రిల్ 28న వివాహం చేసుకున్నారు. మోహన్ లాల్ తెలుగులో 'జనతా గ్యారేజ్' సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. మలయాళంలో ఆయన తాజా చిత్రం 'పులి మురుగున్' జూలైలో విడుదల కానుంది. Celebrating 28 years of love and togetherness on 28th April at Vietnam in the presence of our amazing friends O:-) pic.twitter.com/UkVLVoAErl — Mohanlal (@Mohanlal) 28 April 2016 -
'పెళ్లిరోజున ఆయన ఇచ్చినదేమిటో తెలుసా'
ముంబై: 'పెళ్లిరోజున మీ ఆయన మీకేం ఇచ్చారు? హా..! ఇచ్చారు ఓ బిత్తరచూపు'.. 'పెళ్లిరోజున మీ ఆయన ఏమైనా ఇచ్చారా? ఔను! తలనొప్పి ఇచ్చారు'.. ఇవీ ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, ప్రస్తుత వ్యాపారవేత్త, యాక్షన్ స్టార్ అక్షయ్‌కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా సంధించిన జోక్స్. ఈ బాలీవుడ్ దంపతులు ఆదివారం 15వ పెళ్లిరోజు వేడుకను జరుపుకొన్నారు. తమ పెళ్లిరోజు గురించి భావోద్వేగానికి గురవుతూ.. ఇప్పటికీ ట్వింకిల్ ఖన్నా నుంచి చూపు మరల్చుకోలేకపోతున్నట్టు వెల్లడిస్తూ.. అక్షయ్‌కుమార్ ఓ పాత ఫొటోను ట్విట్టర్లో పంచుకోగా..ట్వింకిల్ ఖన్నా మాత్రం కాస్తా సరదాగా స్పందించారు. పెళ్లిరోజు గురించి సరదా జోక్స్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత తాము ఆనందంగా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. తమ 15 ఏళ్ల వైవాహిక జీవితంలో అక్షయ్ ఇలాంటి సంతోషకరమైన క్షణాలెన్నింటినో అందించారని పేర్కొన్నారు. Your husband gave you anything for your anniversary ? He gave me 15 years of moments like these... pic.twitter.com/MYLjZwj7R9 — Twinkle Khanna (@mrsfunnybones) January 17, 2016 Found this old pic & nothing's changed,couldn't & still can't take my eyes off her😊Happy anniversary @mrsfunnybones pic.twitter.com/utmkRrnsUV — Akshay Kumar (@akshaykumar) January 17, 2016 -
హాస్పిటల్ పాలైన అజయ్ దేవగన్ మేనల్లుడు
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మేనల్లుడు(18) ఆస్పత్రి పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే... తమ పెళ్లి రోజుకు ముందే సంబరాలు జరుపుకోవడానికి అజయ్ దేవగన్ దంపతులు గోవాకు వెళ్లారు. వారితో పాటు ఆయన ఇద్దరు చెల్లెల్లు వారి కుటుంబసభ్యులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వారిలో ఆయన మేనల్లుడు కూడా ఉన్నారు. అయితే అకస్మాత్తుగా అతడు అనారోగ్యం పాలవడంతో ఆస్పత్రిలో చేర్చారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.