ప్రేమకు పదేళ్లు.. సమంత స్వీట్‌ పోస్ట్‌ | Samantha Shares Pictures With Chaitanya On Their Second Wedding Anniversary | Sakshi
Sakshi News home page

ప్రేమకు పదేళ్లు.. సమంత స్వీట్‌ పోస్ట్‌

Oct 6 2019 4:30 PM | Updated on Oct 6 2019 4:37 PM

Samantha Shares Pictures With Chaitanya On Their Second Wedding Anniversary - Sakshi

టాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ నాగ చైతన్య, సమంతల వివాహం అయి అప్పుడే రెండేళ్లు గడిచిపోయింది. ఆదివారం వీరి వివాహ వార్షికోత్సం సందర్భంగా పలువరు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సమంత కూడా తన వివాహ జీవితానికి సంబంధించి ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ చేశారు. చైతూతో కలిసి గడిపిన కొన్ని అరుదైన చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. చైతుతో కలిసి డ్యాన్స్‌ చేసిన ఓ వీడియోను కూడా షేర్‌ చేశారు. 

అంతేకాకుండా ఈ రెండేళ్లలో తమ మధ్య బంధం మరింత దృఢంగా మారిందని ఆమె పేర్కొన్నారు. అలాగే తమ ప్రేమ ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుందన్నారు. తెలుగులో సమంత నటించిన తొలి చిత్రం ‘ఏం మాయ చేశావే’లో చైతూతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. చివరకు ఇరువైపుల పెద్దల అంగీకారంతో 2017 అక్టోబర్‌ 6న వీరి వివాహం జరిగింది. పెళ్లైనా తరువాత కూడా సమంత సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే చై-సామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన మజిలీ మంచి హిట్‌ అందుకుంది. అలాగే సమంత కీలక పాత్రలో నటించిన ఓ బేబీ చిత్రం బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది.

1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement