డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంత ఫుల్ బిజీ అయిపోయింది. ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూనే ఉంటోంది. ఇటీవలే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న సామ్.. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తాను కలలో ఇక్కడికి వస్తానని ఊహించలేదని రాసుకొచ్చింది.
అయితే ప్రస్తుతం సామ్- రాజ్ నిడిమోరుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పికిల్ బాల్ మ్యాచ్ వీక్షిస్తున్న నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో సమంత ఫుల్ హ్యాపీగా మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. క్యూట్ కపుల్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
కాగా.. సామ్- రాజ్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ -2, సిటాడెల్: హనీ బన్నీ వంటి ప్రాజెక్టుల్లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. ఆ రూమర్స్‌ను నిజం చేస్తూ గతేడాది డిసెంబర్ 1న వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో వీరిద్దరి పెళ్లి జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం చిత్రంలో కనిపించనుంది.


