రెండో ఆస్కార్‌కి ఆస్కారం ఉందా? | Leonardo DiCaprio may finally debut with Vittoria Ceretti at 2026 Oscars | Sakshi
Sakshi News home page

రెండో ఆస్కార్‌కి ఆస్కారం ఉందా?

Mar 16 2026 3:21 AM | Updated on Mar 16 2026 3:21 AM

Leonardo DiCaprio may finally debut with Vittoria Ceretti at 2026 Oscars

రెడ్‌ కార్పెట్‌ సాక్షిగా ప్రేమను ప్రకటిస్తారా?

ఆస్కార్‌ అవార్డు వేడుకలో ఎవరెవరు అవార్డులు అందుకుంటారు? అనే చర్చ జరగడంతో పాటు ఎలాంటి ప్రత్యేకతలు జరగనున్నాయి? సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా ఎవరు నిలుస్తారు? అనేవి హాట్‌ టాపిక్స్‌ అయ్యాయి. ప్రధానంగా చాలామంది దృష్టి ‘టైటానిక్‌’ ఫేమ్‌ లియోనార్డో డికాప్రియో, ఇటాలియన్‌ మోడల్‌ విట్టోరియా సెరెట్టిపై ఉంది. 51 ఏళ్ల లియోనార్డో, 27 ఏళ్ల విట్టోరియా మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు 98వ ఆస్కార్‌ అవార్డు వేడుకలో జంటగా పాల్గొననున్నారనే ప్రచారం జరుగుతోంది.

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా ఆదివారం సాయంత్రం 7 గంటల  ప్రాంతంలో ఆరంభమయ్యే (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16 సోమవారం వేకువ జామున 4.30 గంటలకు) ఆస్కార్‌ అవార్డ్స్‌ వేడుకను వీక్షించడానికి సినీ ప్రియులు రెడీ అయిపోయారు. స్టార్‌ మూవీస్, జియో హాట్‌స్టార్‌ యాప్‌లోనూ ఈ వేడుక ప్రసారం కానుంది.

ఈ వేడుకలో విట్టోరియాతో కలిసి లియోనార్డో రెడ్‌ కార్పెట్‌పై సందడి చేసి, ఆ విధంగా తమ ప్రేమను అధికారికంగా వెల్లడించనున్నారని టాక్‌. ఈ సంగతి పక్కన పెడితే... ఈసారి ఉత్తమ నటుడి విభాగంలో నామినేషన్‌ దక్కించుకున్నారు లియోనార్డో. కాగా అతనికి ఉత్తమ నటుడిగా తొలి ఆస్కార్‌ అవార్డు దక్కేలా చేసిన చిత్రం ‘ది రెవెనెంట్‌’ (2015). 2016 ఆస్కార్‌ అవార్డ్స్‌ వేడుకలో ఆ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ చిత్రానికిగానూ ఉత్తమ నటుడి విభాగంలో రేసులో ఉన్నారు.  మరి... మరో ఆస్కార్‌ అవార్డు సాధిస్తారా? అనేది ఇవాళ తెలుసుకుందాం.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement