breaking news
Leonardo Di Caprio
-
రెండో ఆస్కార్‌కి ఆస్కారం ఉందా?
ఆస్కార్ అవార్డు వేడుకలో ఎవరెవరు అవార్డులు అందుకుంటారు? అనే చర్చ జరగడంతో పాటు ఎలాంటి ప్రత్యేకతలు జరగనున్నాయి? సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా ఎవరు నిలుస్తారు? అనేవి హాట్ టాపిక్స్ అయ్యాయి. ప్రధానంగా చాలామంది దృష్టి ‘టైటానిక్’ ఫేమ్ లియోనార్డో డికాప్రియో, ఇటాలియన్ మోడల్ విట్టోరియా సెరెట్టిపై ఉంది. 51 ఏళ్ల లియోనార్డో, 27 ఏళ్ల విట్టోరియా మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు 98వ ఆస్కార్ అవార్డు వేడుకలో జంటగా పాల్గొననున్నారనే ప్రచారం జరుగుతోంది.అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆరంభమయ్యే (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16 సోమవారం వేకువ జామున 4.30 గంటలకు) ఆస్కార్ అవార్డ్స్ వేడుకను వీక్షించడానికి సినీ ప్రియులు రెడీ అయిపోయారు. స్టార్ మూవీస్, జియో హాట్‌స్టార్ యాప్‌లోనూ ఈ వేడుక ప్రసారం కానుంది.ఈ వేడుకలో విట్టోరియాతో కలిసి లియోనార్డో రెడ్ కార్పెట్‌పై సందడి చేసి, ఆ విధంగా తమ ప్రేమను అధికారికంగా వెల్లడించనున్నారని టాక్. ఈ సంగతి పక్కన పెడితే... ఈసారి ఉత్తమ నటుడి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు లియోనార్డో. కాగా అతనికి ఉత్తమ నటుడిగా తొలి ఆస్కార్ అవార్డు దక్కేలా చేసిన చిత్రం ‘ది రెవెనెంట్’ (2015). 2016 ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ఆ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికిగానూ ఉత్తమ నటుడి విభాగంలో రేసులో ఉన్నారు. మరి... మరో ఆస్కార్ అవార్డు సాధిస్తారా? అనేది ఇవాళ తెలుసుకుందాం. -
ఆమెకు అవార్డుతో బిత్తరపోయిన హాలీవుడ్ స్టార్!
గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు ఆన్లైన్లో హాట్ టాపిగ్గా మారింది. 'అమెరికన్ హర్రర్ స్టోరీ: 'హోటల్'లో నటనకుగాను టీవీ మూవీ కేటగిరీలో ఉత్తమ నటి అవార్డును పాప్ సింగర్ లేడి గాగాకు ప్రకటించారు. స్టేజ్‌కి దూరంగా కూచున్న గాగా ఆదరాబాదరాగా నడుచుకుంటూ.. తన చుట్టూ కూచున్న నటుల మధ్య నుంచి వెళ్లింది. ఈ క్రమంలో కూర్చిపై కూర్చొని ఉన్న లియోనార్డో డీకాప్రియో మోచేతిని గాగా బలంగా తోసుకుంటూ పోయింది. అతని మోచేయి తనకు తాకిందన్న విషయాన్ని కూడా ఆమె పట్టించుకోలేదు. కానీ లియోనార్డో మాత్రం బిత్తరపోయి ఆమె వంక చూశాడు. ఆ చూపు కెమెరాకు చిక్కి.. అభిమానులకు హాట్ టాపిక్ గా మారింది. అసలు 'రెవెనంట్' సినిమాలో నటించినందుకు కాదు అలా బిత్తరపోయి చిత్రంగా గాగా వంక చూసినందుకు లియోనార్డోకు 'గోల్డెన్ గ్లోబ్' అవార్డు ఇవ్వాలంటూ ఆన్లైన్లో జోకులు పేలుతున్నాయి. హర్రర్ టీవీ షోలో రక్తాన్ని పీల్చే గబ్బిలంలా గాగా నటనకు 'గోల్డెన్ గ్లోబ్' రావడంపై బెస్ట్ రియాక్షన్ అవార్డు లియోకే ఇవ్వాలంటూ నెటిజన్లు వ్యంగ్య పోస్టులతో హోరెత్తిస్తున్నారు. scuse u https://t.co/dNlwVvHkCN — LW (@lindseyweber) January 11, 2016


