ఆస్కార్ రేసులో తెలుగు సినిమాలు
వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్ అవార్డ్స్ కోసం కొన్ని తెలుగు సినిమాలు రేసులో నిలిచాయి. టాలీవుడ్ నుంచి దాదాపు ఐదింటిని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫైనల్ చేసింది. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ తెలుగు మూవీస్ ఏంటి? వాటికి ఏమైనా ఛాన్స్ ఉందా?(ఇదీ చదవండి: మలయాళ బ్లాక్బస్టర్ మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే?)మన దేశం నుంచి ఆస్కార్స్-2026 కోసం 24 సినిమాల్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఎంపిక చేసింది వాటిలో తెలుగు నుంచి పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, కుబేర, గాంధీతాత చెట్టు చిత్రాలు ఉన్నాయి. అలానే హిందీ నుంచి ఐ వాంట్ టూ టాక్, తన్వీ ది గ్రేట్, ద బెంగాల్ ఫైల్స్, హౌమ్ బౌండ్, కేసరి 2, సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్, హ్యుమన్స్ ఇన్ ద లూప్, జగ్నుమా, ఫూలే, పైర్ మూవీస్ ఉన్నాయి.అలానే మరాఠీ నుంచి 6, కన్నడ నుంచి ఒకటి, మణిపురి నుంచి 1, మూకీ సినిమా ఒకదాన్ని ఎంపిక చేశారు. ఇవన్నీ కూడా ఆస్కార్ రేసులో ఉన్నాయి. అయితే వీటి నుంచి ఏమైనా ఎంపిక అవుతుందా లేదా అనేది ఆస్కార్స్ కమిటీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? గతంలో భారత నేపథ్యంగా తీసిన కొన్ని సినిమాలు ఆస్కార్స్ వచ్చాయి. కానీ 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో మన దగ్గర కూడా ఈ అవార్డ్ గురించి అందరికీ తెలిసింది.(ఇదీ చదవండి: ఓజీ.. జగనే కరెక్ట్: నట్టి కుమార్)