మరాఠి సినిమా దశావతార్ (2025) అరుదైన ఘనత సాధించింది. ఆస్కార్ అవార్డుల పోటీలో నిలిచిన తొలి మరాఠి చిత్రంగా నిలిచింది. దిలీప్ ప్రభావాల్కర్, మహేశ్ మంజ్రేకర్, సిద్దార్థ్ మీనన్, ప్రియదర్శిని ఇందాల్కర్, భరత్ జాదవ్ లీడ్ రోల్స్‌లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ దశావతార్.
కలెక్షన్స్
సుబోద్ ఖనోల్కర్ దర్శకత్వంలో ఓషన్ ఫిలిం కంపెనీ, ఓషన్ ఆర్ట్ హౌస్ సంస్థలు నిర్మించిన ఈ మూవీ గతేడాది సెప్టెంబరులో విడుదలైంది. థియేటర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం దాదాపు రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. తాజాగా దశావతార్ 98వ ఆస్కార్ అవార్డ్స్‌లోని మెయిన్ ఓపెన్ ఫిలిం విభాగంలో పోటీలో నిలిచింది.
మరికొద్ది రోజుల్లో తుది జాబితా
ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సుబోద్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో హిందీ నామినేషన్‌లో పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే! ఇకపోతే జనవరి 22న ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్న చిత్రాల జాబితా ఫైనల్ లిస్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తారు. మార్చి 15న అమెరికాలో ఈ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
Today, we received an email informing us that Dashavatar has been selected for the Oscars, contention list. It brings immense satisfaction that the years of hard work put in by all of us have been acknowledged. pic.twitter.com/FtGjvgdtjc
— Subodh Khanolkar (@subodhkhanolkar) January 3, 2026


