OTT: నేటి తరం తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది | Hotspot 2 Much Now Streaming On AHA, Review And Story Details | Sakshi
Sakshi News home page

OTT: నేటి తరం తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది

Mar 5 2026 2:53 PM | Updated on Mar 5 2026 2:58 PM

Hotspot 2 Much Now Streaming On AHA, Review And Story Details

నాడు రాత్రిపూట మేడ మీద మన తాతలు, అవ్వలు చెప్పిన కథలు ఎంతో వినసొంపుగా ఉండేవి. అప్పట్లో విన్న ఆ కథల ముందు ఎంతటి సినిమాలైనా దిగదుడుపే. ఇప్పుటి తరానికి ఆ అదృష్టం లేదు. కాని నేటి దర్శకులు మాత్రం అప్పటి పెద్ద వారు చెప్పిన కథలలాగే తమ సినిమాలను తీర్చిదిద్ది ఇప్పటి తరం ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అదే కోవకు చెందినది ఆహా వేదికగా స్ట్రీమ్ అవుతున్న హిలేరియస్ డ్రామా అయిన హాట్ స్పాట్ 2మచ్ సినిమా. 

ఈ సినిమా తప్పనిసరిగా నేటి తరాన్ని ఉద్దేశించినది. అందుకే వారి పరిభాషలో అర్థవంతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు విఘ్నేష్ కార్తీక్. నిజానికి హాట్ స్పాట్ సిరీస్ లో వచ్చిన రెండో భాగమిది. కాని మొదటిదానికి ఈ భాగానికి అస్సలు సంబంధం ఉండదు. ఇంకా చెప్పాలంటే ఈ హాట్ స్పాట్ 2మచ్ సినిమా మూడు కథల సమాహారం. అభిమానం, పరువుల తో పాటు ప్రేమవంటి మూడు ప్రధానమైన అంశాలతో కూడిన కథలతో మన ముందుకొచ్చిన సినిమానే ఈ హాట్ స్పాట్ 2మచ్.

అంతులేని అభిమానం ఎంతటి దారుణానికి దారి తీస్తుందో ఆపై వ్యక్తిగత స్వేచ్ఛ కుటుంబ పరువుకు ఎంత భారమవుతుందో అలాగే చిగురించని స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఇబ్బంది పెడుతుందో కూడా దర్శకుడు ఎంతో అందంగా ఈ సినిమాలో మలిచాడు. ప్రతి కథ ముగిసే ముందు వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసి స్ఫూర్తినిస్తాయి. మరీ ముఖ్యంగా మూడో కథ ఎక్కువ కల్పితంలా అనిపించినా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టు మాత్రం మతి పోగొడుతుంది. 

అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. ఈ సినిమా ఇప్పటి, రేపటి తరం తప్పనిసరిగా చూడాల్సిన చిత్రమిది. అలా అని సినిమా మొత్తం సందేశాలతో ఉండదు. నేటి, నాటి తరానికి వినోదమనే మసాలతో పసందైన సందేశాన్ని రుచికరమైన విందు రూపంలో వడ్డించాడు దర్శకుడు. మరింకెందుకాలస్యం హ్యావ్ ది డెలీసియస్ ఫన్ ఫీస్ట్ ఫర్ ది వీకెండ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement