Vrushakarma Glimpse: గ్లింప్స్‌తోనే భయపెట్టిన నాగచైతన్య | Actor Naga Chaitanya And Karthik Dandu Vrushakarma Movie Glimpse Out, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

Vrushakarma Glimpse: గ్లింప్స్‌తోనే భయపెట్టిన నాగచైతన్య

Mar 5 2026 12:58 PM | Updated on Mar 5 2026 1:07 PM

Vrushakarma Glimpse Out

‘అతీంద్రియ శక్తి మేల్కోన్నప్పుడు..సృష్టి ధర్మం తప్పినప్పుడు..విధి ఒక వృషకర్మను ఎంచుకుంటుంది’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో ‘వృషకర్మ’ గ్లింప్స్‌ రిలీజ్‌ అయింది. ‘విరూపాక్ష’ఫేం కార్తిక్‌ దండు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘వృషకర్మ’. ఇందులో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య  కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

తాజాగా రిలీజ్‌ అయిన ఈ మూవీ గ్లింప్స్‌లో  నాగ చైతన్య లుక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. గత చిత్రాలతో పోలిస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ గ్రేడ్ చాలా కొత్తగా ఉంది. గ్లింప్స్‌తోనే భయపెట్టేశారు. అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు ప్రాణం పోసింది. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement