మృత్యుంజయ్ సినిమా స్టోరీ లైన్ ఇదే: శ్రీ విష్ణు | Sree Vishnu Revelead Mrithyunjay movie story line | Sakshi
Sakshi News home page

Mrithyunjay Movie: మృత్యుంజయ్ సినిమా స్టోరీ లైన్ ఇదే: శ్రీ విష్ణు

Mar 5 2026 5:00 AM | Updated on Mar 5 2026 12:23 PM

Sree Vishnu Revelead Mrithyunjay movie story line

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్‌ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి ‍అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ మూవీ స్టోరీ లైన్‌ ఏంటో విష్ణు రివీల్ చేశారు. ఓ పాప కోసమే ఈ సినిమా అంతా కొనసాగుతుందని అన్నారు. ఆ పాప ఫాదర్ ప్లేస్‌లో నన్ను తీసుకుని జస్టిస్ కావాలనుకుందో.. ఆ ప్లేస్‌లో నేను పాపకు హీరో అని తెలిపారు. చైల్డ్ సెంటిమెంట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. గతంలో ఇదే సెంటిమెంట్‌లో డాడీ, బింబిసార, హాయ్‌నాన్న సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

కాగా.. ఈ మూవీని లైట్‌ బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement