రామ్ చరణ్ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. వ్యూస్ పరంగా రికార్డ్ స్థాయిలో దూసుకెళ్లింది.
తాజాగా రిలీజైన రైరై రారా అంటూ సాగే సాంగ్ సైతం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట రిలీజైన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే 31 మిలియన్ల వ్యూస్, 5లక్షల 30వేల లైక్స్‌ను సొంతం చేసుకుంది. కాగా.. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ పాడారు. ఈ మోటివేషనల్ సాంగ్‌ను రెహమాన్ కంపోజ్ చేశారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.


