క్రేజీ కాంబో ఫిక్స్‌.. సూర్యతో పూరి జగన్నాధ్..! | Actor Suriya To Team Up With Director Puri Jagannadh For Upcoming Mass Entertainer, Deets Inside | Sakshi
Sakshi News home page

క్రేజీ కాంబో ఫిక్స్‌.. సూర్యతో పూరి జగన్నాధ్..!

Mar 4 2026 10:59 PM | Updated on Mar 5 2026 1:20 PM

Puri Jagannadh Next Movie with Suriya finalized

తమిళ స్టార్ హీరో సూర్యతో దర్శకుడు పూరి జగన్నాధ్ కొత్త సినిమా ఫైనల్ అయింది. ప్రస్తుతం సూర్య సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే పూరి దర్శకత్వంలో సూర్య చేయబోయే సినిమా ఉండే అవకాశం ఉంది. అసలు ముందుగా వెంకీ అట్లూరి సినిమా తరువాత సూర్య మరో ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. దాంతో ఆ స్థానంలో పూరి జగన్నాధ్‌కు అవకాశం దక్కింది.  

అయితే సూర్యతో సినిమా చేయడానికి దర్శకుడు చందు మొండేటి కూడా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తండేల్ సినిమా ముందు నుంచే ఆయన ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. దాంతో ప్రస్తుతం ఆయన కార్తికేయ 3 ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం.  

హీరోల డేట్స్ సంపాదించడం పూరి జగన్నాధ్ కు పెద్ద సమస్య కాదు. పూరి-విజయ్ సేతుపతితో చేసిన సినిమా చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. దానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కానీ దానికి సంబంధించిన గ్లింప్స్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటివరకు విడుదల కాలేదు. సూర్య – పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఫైనల్ కావడం సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పూరి స్టైల్ లో సూర్యను ఎలా చూపిస్తారో, ఎలాంటి మాస్ ఎంటర్‌టైనర్ వస్తుందో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement