Mrithyunjay Movie
-
ఓటీటీలో శ్రీవిష్ణు థ్రిల్లింగ్ సినిమా.. ప్రకటన వచ్చేసింది
టాలీవుడ్లో హీరో శ్రీవిష్ణు నటించిన కొత్త చిత్రం 'మృత్యుంజయ్' ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తన కామెడీ జానర్‌ని వదిలి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీతో థియేటర్లోకి వచ్చాడు. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 6న విడుదలైంది. ఇందులో రెబా మోనికా జాన్, వీర్ ఆర్యన్, చిన్నా, సుదర్శన్, రచ్చ రవి, బాలాదిత్య తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని సందీప్ గున్నం మరియు వినయ్ చిలకపాటి నిర్మించగా, కాల భైరవ సంగీతం అందించారు.'మృత్యుంజయ్' సినిమా ఏప్రిల్ 3న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్(Netflix) అప్‌కమింగ్ చిత్రాల జాబితాలో అధికారికంగా ప్రకటించింది. క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించంది. అయితే, ఓటీటీలో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. ఈ వీకెండ్లో థ్రిల్ తెప్పించే సినిమాగా 'మృత్యుంజయ్' ఉంటుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.కథేంటంటే.. జయ్ (శ్రీవిష్ణు)..ఓ ప్రముఖ దినపత్రికలో యాడ్ డిపార్ట్మెంట్లో పని చేస్తుంటాడు. ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్‌గా మారాలనేది తన కల. ‘శ్రద్ధాంజలి’ యాడ్స్ కోసం చనిపోయిన వారి ఇంటికి వెళ్లి.. వాళ్ల గురించి గొప్పలు చెబుతూ కుటుంబ సభ్యుల నుంచి ప్రకటనల్ని తీసుకోస్తుంటాడు. అలా ఓ సారి అచ్యుత్‌రావు (బాలాదిత్య) అనే వ్యక్తి చనిపోయాడని తెలుసుకొని.. వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ సైలెంట్‌గా ఉన్న అచ్యుత్‌రావు కూతురు అంజలిని చూడగానే అతని బ్యాల్యం గుర్తొస్తుంది. ఆమె అమాయకంగా ‘మా నాన్నకు అలా ఎందుకైంది’ అని ప్రశ్నించడం చూసి చలించిపోతాడు.చిన్నారి ప్రశ్నకు సమాధానం చెప్పాలకుంటాడు. మూడు రోజుల తర్వాత అచ్యుత్ తరహాలోనే విక్రాంత్ అనే వ్యక్తి కూడా మరణిస్తాడు. అయితే ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగిన మరణాలే అని పోలీసులు నిర్ధారణకు వస్తారు. కానీ ఏసీపీ సీత(రెబా మోనికా జాన్) మాత్రం ఈ మరణాల వెనుక ఏవైనా రహస్యాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ మొదలుపెడుతుంది. అవి ప్రమాదాలు కావని హత్యలని జయ్ తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని ఏసీపీ సీతతోనూ చెబుతాడు. కానీ ఆధారాలు లేకపోవడంతో ఆమె పట్టించుకోదు. జయ్ మాత్రం ఈ హత్యల వెనుక ఉన్నదెవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు.నిజంగానే జయ్ చెప్పినట్టుగా అవి హత్యలేనా? ఎవరు చేసారు? ఎందుకు చేశారు? హంతకుడిని కనిపెట్టే క్రమలో జయ్‌కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. -
'మృత్యుంజయ్' థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
‘మృత్యుంజయ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు హీరో శ్రీవిష్ణు. గతవారమే ‘విష్ణు విన్యాసం’తో ప్రేక్షకులను పలకరించిన ఈ టాలెంటెడ్ హీరో.. ఇప్పుడు ‘మృత్యుంజయ్’తో మరోసారి థియేటర్స్‌లోకి వచ్చాడు. ఈ సారి తన కామెడీ జానర్‌ని వదిలి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌తో వచ్చాడు. మరి ‘మృత్యుంజయ్’ ఏమేరకు థ్రిల్‌ని పంచింది? శ్రీవిష్ణు ప్రయోగం ఫలించిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. జయ్ (శ్రీవిష్ణు)..ఓ ప్రముఖ దినపత్రికలో యాడ్ డిపార్ట్మెంట్లో పని చేస్తుంటాడు. ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్‌గా మారాలనేది తన కల. ‘శ్రద్ధాంజలి’ యాడ్స్ కోసం చనిపోయిన వారి ఇంటికి వెళ్లి.. వాళ్ల గురించి గొప్పలు చెబుతూ కుటుంబ సభ్యుల నుంచి ప్రకటనల్ని తీసుకోస్తుంటాడు. అలా ఓ సారి అచ్యుత్‌రావు (బాలాదిత్య) అనే వ్యక్తి చనిపోయాడని తెలుసుకొని.. వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ సైలెంట్‌గా ఉన్న అచ్యుత్‌రావు కూతురు అంజలిని చూడగానే అతని బ్యాల్యం గుర్తొస్తుంది. ఆమె అమాయకంగా ‘మా నాన్నకు అలా ఎందుకైంది’ అని ప్రశ్నించడం చూసి చలించిపోతాడు. చిన్నారి ప్రశ్నకు సమాధానం చెప్పాలకుంటాడు. మూడు రోజుల తర్వాత అచ్యుత్ తరహాలోనే విక్రాంత్ అనే వ్యక్తి కూడా మరణిస్తాడు. అయితే ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగిన మరణాలే అని పోలీసులు నిర్ధారణకు వస్తారు. కానీ ఏసీపీ సీత(రెబా మోనికా జాన్) మాత్రం ఈ మరణాల వెనుక ఏవైనా రహస్యాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ మొదలుపెడుతుంది. అవి ప్రమాదాలు కావని హత్యలని జయ్ తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని ఏసీపీ సీతతోనూ చెబుతాడు. కానీ ఆధారాలు లేకపోవడంతో ఆమె పట్టించుకోదు. జయ్ మాత్రం ఈ హత్యల వెనుక ఉన్నదెవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు.నిజంగానే జయ్ చెప్పినట్టుగా అవి హత్యలేనా? ఎవరు చేసారు? ఎందుకు చేశారు? హంతకుడిని కనిపెట్టే క్రమలో జయ్‌కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.ఇలాంటి సినిమాలకు తర్వాత ఏం జరుగుతుందో తెలియని విధంగా బలమైన స్క్రీన్‌ప్లేతో పాటు ఆడియన్స్‌ని కట్టిపడేసేలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఈ రెండూ ‘మృత్యుంజయ్’లో ఉన్నాయి.కానీ సినిమా చూస్తున్నంత సేపు కొన్ని ఫారిన్ చిత్రాలతో పాటు ‘అతడు’, ‘జులాయి’లాంటి సినిమాలలోని కొన్ని సన్నివేశాలు మన కళ్ల ముందు కదులుతాయి. ఆ చిత్రాల్లోలాగే ఇందులో కూడా హీరో-విలన్ ఇద్దరూ తెలివైనవాళ్లే. ఎత్తుకుపైఎత్తులు వేస్తూ టామ్ అండ్ జెర్రీ దాగుడు మూతలాటలాగా కథనం సాగుతుంది. హీరో-విలన్ ఇద్దర్ని తెలివైనవాళ్లలాగా చూపించి.. లాజిక్స్‌ని పట్టించకోకుండా కథనాన్ని నడిపించడమే కాస్త సిల్లీగా అనిపిస్తుంది. హీరో పాత్ర ఎంట్రీ మొదలు..ఇన్వెస్టిగేషన్ వరకు ఎక్కడా కూడా నేచురల్‌గా అనిపించదు. శ్రద్ధాంజలి యాడ్స్ కోసం హీరో గెటప్‌లు మారుస్తూ వెళ్లడం.. అది కూడా ఒక ప్రముఖ పత్రికలో పని చేస్తూ.. ఇది వినడానికే కాదు తెరపై చూడడానికి కూడా సిల్లీగానే అనిపిస్తుంది. అలాగే సినిమా ప్రారంభంలో జరిగే రెండు హత్యలకు సంబంధించిన క్లూస్ కోసం హీరో చేసే ప్రయత్నాలు కూడా అంతగా మెప్పించవు. కానీ ఆ క్లూస్‌తో హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కొతవరకు ఆసక్తిని పెంచుతుంది.విలన్ని పట్టుకునేందుకు హీరో వేసే ఎత్తులు సినిమాటిక్‌గా, పేలవంగా ఉన్నాయి. ఆ సీన్లను మరింత బలంగారాసుకొని ఉంటే బాగుండేది. అయితే క్లైమాక్స్‌లో విలన్ని అంతం చేయడానికి హీరో వేసిన ప్లాన్ ఆకట్టుకుంటుంది. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్, సుకుమార్ శిష్యుడు కావడంతో.. స్క్రీన్‌ప్లే కూడా ఆయన సినిమాల్లోలాగే సాగుతుంది. కామెడీ సీన్లు, ఐటెమ్ సాంగులు, లవ్ ట్రాకులను పెట్టకుండా అసలు కథను మాత్రమే చెప్పడం సినిమాకు ప్లస్ అయింది. ఎక్కడ బోర్ కొట్టదు కానీ.. కొత్త సినిమా చూశామనే ఫిలింగ్ మాత్రం కలగలదు. ఎవరెలా చేశారంటే..కామెడీ.. శ్రీవిష్ణు బలం. కానీ ఈ సారి తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేశాడు. సీరియస్ క్యారెక్టర్లోనూ నటించగలనని జయ్ పాత్రతో నిరూపించాడు. ఆయన లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, హావభావాలు అన్నీ కొత్తగా ఉంటాయి. విలన్‌గా వీర్ ఆర్యన్ అదరగొట్టేశాడు. రెబా మోనికాది రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. సుదర్శన్, ఐశ్వర్య, రచ్చ రవి, చిన్నా, బాలాదిత్య తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాలభైరవ నేపథ్య సంగీతం బాగుంది, శ్రీకర్‌ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మృత్యుంజయ్ సినిమా స్టోరీ లైన్ ఇదే: శ్రీ విష్ణు
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటో విష్ణు రివీల్ చేశారు. ఓ పాప కోసమే ఈ సినిమా అంతా కొనసాగుతుందని అన్నారు. ఆ పాప ఫాదర్ ప్లేస్‌లో నన్ను తీసుకుని జస్టిస్ కావాలనుకుందో.. ఆ ప్లేస్‌లో నేను పాపకు హీరో అని తెలిపారు. చైల్డ్ సెంటిమెంట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. గతంలో ఇదే సెంటిమెంట్‌లో డాడీ, బింబిసార, హాయ్‌నాన్న సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.కాగా.. ఈ మూవీని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో సందడి చేయనుంది. #Daddy, #Bimbisara, #HiNanna సినిమాలు చైల్డ్ సెంటిమెంట్‌తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.ఇప్పుడు అదే ఎమోషనల్ టచ్‌తో #Mrithyunjay కూడా వస్తోంది. - #VenkyAtluri - #SreeVishnu pic.twitter.com/05Ygjzrcva— CHITRAMBHALARE (@chitrambhalareI) March 4, 2026 -
ఎన్టీఆర్ విడుదల చేసిన మృత్యుంజయ్ ట్రైలర్
‘సామజవరగమన’ చిత్రం తర్వాత శ్రీవిష్ణు, రెబా జాన్ జంటగా నటించిన చిత్రం మృత్యుంజయ్.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను దర్శకుడు శ్రీ హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించారు. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. కాలభైరవ సంగీతం అందించారు. మార్చి 6న ఈ చిత్రం విడుదల కానుంది. -
శ్రీ విష్ణు మృత్యుంజయ్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ జిందగీ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజైంది. ఈ సందర్భంగా మృత్యుంజయ్ టీమ్‌కు రామ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ పాటకు అభినవ కవి, కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఆదిత్య అయ్యంగారు పాడారు. ఈ పాటను కాల భైరవ కంపోజ్ చేశారు. కాగా.. ఈ మూవీని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో సందడి చేయనుంది. Happy to launch the first single of #Mrithyunjay - #EeZindagi ❤️🔥The trailer also looked intriguing..Looking forward to seeing @sreevishnuoffl in @hussainshakiran ‘s thriller. Wishing them all the very best for Mrithyunjay coming on March 6th! ❤️Check the song out now!… pic.twitter.com/uSjXSaPIfY— RAm POthineni (@ramsayz) February 25, 2026 -
శ్రీ విష్ణు మృత్యుంజయ్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఫిబ్రవరి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.అయితే అదే రోజు విష్ణు హీరోగా నటించిన విష్ణు విన్యాసం కూడా రిలీజ్ కానుంది. దీంతో శ్రీ విష్ణు ఫ్యాన్స్ డైలామాలో పడ్డారు. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేయడమేంటని ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంలో ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా శ్రీవిష్ణు తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. రెండు సినిమాలు ఓకే రోజు రిలీజ్ కావడం లేదంటూ ట్వీట్ చేశారు. మృత్యుంజయ్ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుందని పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో శ్రీ విష్ణు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ మూవీని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు. Release date marindhi, thrillu kaadhu🔥Meet #MrithyuNjay in cinemas from March 6th❤️🔥 pic.twitter.com/vrKKwW0Ijo— Sree Vishnu (@sreevishnuoffl) February 20, 2026 -
శ్రీ విష్ణు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ఆసక్తిగా టీజర్
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని టీజర్లో అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు.


