శ్రీ విష్ణు మృత్యుంజయ్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది | Sree Vishnu Mrithyunjay Ee Zindagi Lyric Video song out now | Sakshi
Sakshi News home page

MrithyuNjay Movie: శ్రీ విష్ణు మృత్యుంజయ్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్

Feb 25 2026 9:16 PM | Updated on Feb 26 2026 8:47 AM

Sree Vishnu Mrithyunjay Ee Zindagi Lyric Video song out now

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్‌ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ టీజర్‌ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి ‍అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఫస్ట్ సింగిల్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ జిందగీ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఎనర్జిటిక్ ‍స్టార్ రామ్ పోతినేని చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజైంది. ఈ సందర్భంగా మృత్యుంజయ్ టీమ్‌కు రామ్ ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. ఈ పాటకు అభినవ కవి, కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఆదిత్య అయ్యంగారు పాడారు. ఈ పాటను కాల భైరవ కంపోజ్ చేశారు. 

కాగా.. ఈ మూవీని లైట్‌ బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement