విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్‌..! | Vijay and Rashmika Wedding Follows This Trending Policy For Privacy | Sakshi
Sakshi News home page

Vijay and Rashmika: విజయ్- రష్మిక వెడ్డింగ్.. విరాట్- అనుష్క బాటలోనే..!

Feb 25 2026 8:01 PM | Updated on Feb 25 2026 8:05 PM

Vijay and Rashmika Wedding Follows This Trending Policy For Privacy

టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఉదయ్‌పూర్‌లో ఫుల్‌గా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. కొన్నేళ్లుగా ఎక్కడా బయటపడుకుండా రిలేషన్‌లోన్న విజయ్- రష్మిక ఈనెల 26న పెళ్లిబంధంతో ఒక్కటి కాబోతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.

అయితే సెలబ్రిటీల పెళ్లి సందడి మామూలుగా ఉండదు. ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తపడతారు. గతంలో విరాట్- అనుష్క, దీపిక-రణ్‌వీర్ సింగ్‌ సైతం తమ పెళ్లికి అత్యంత సీక్రెట్‌గా జరుపుకున్నారు. దీనికోసం నో మొబైల్ పాలసీని అత్యంత కఠినంగా అమలు చేశారు. ఇప్పుడదే బాటలో రష్మిక- విజయ్ జంట కూడా పెళ్లి వేడుకను జరుపుకుంటోంది.  స్టార్ కపుల్ ఫాలో అవుతోన్న ఈ పద్ధతి ఓ అందమైన పేరు కూడా ఉంది. ఈ నో మొబైల్ పాలసీ సంప్రదాయాన్ని అన్‌ప్లగ్‌డ్‌ వెడ్డింగ్స్‌ అని పిలుస్తారు.

అన్‌ప్లగ్‌డ్‌ వెడ్డింగ్స్‌ అంటే..?

అన్‌ప్లగ్‌డ్‌ వెడ్డింగ్స్‌ అంటే పెళ్లికి వచ్చిన అతిథులందరూ కూడా తమ మొబైల్స్‌ స్విచ్ఛాఫ్ చేసి అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాలి. ఎవరు కూడా ఫోటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు పెట్టడానికి వీలుండదు. అంతే కాకుండా ముందువరుసలో కూర్చొని ఫోన్లలో పెళ్లి ఫోటోలు తీయడానికి కూడా ఛాన్స్ ఉండదు.  పెళ్లికి సంబంధిచిన ఫోటోలు, వీడియోలు ఆ జంట షేర్ చేసేవరకు సోషల్ మీడియాలో కనిపించవు. ఈ పద్ధతినే  అన్‌ప్లగ్‌డ్‌ వెడ్డింగ్స్ అని పిలుస్తున్నారు. లైఫ్‌లో చాలా ముఖ్యమైన ఈ క్షణాలను అత్యంత ప్రైవసీగా నిర్వహించాలనేది సెలబ్రిటీ వధూవరుల కోరిక. వారు మాత్రమే ఫస్ట్ ఈ వేడుక పిక్స్ పంచుకోవాలనే కాన్సెప్ట్ మంచిదే. దీంతో స్టార్ కపుల్ వివాహ వేడుకల్లో ఇదొక ట్రెండ్‌గా మారిపోయింది.

ఈ వెడ్డింగ్ ప్రైవసీ అన్‌ప్లగ్‌డ్‌ ట్రెండ్‌ అనుష్క-విరాట్ కోహ్లీ పెళ్లి సమయంలో మొదటిసారి వైరలైంది. ఆ తర్వాత 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్న దీపిక-రణ్‌వీర్‌ సింగ్ కూడా నో ఫోన్ పాలసీని అమలు చేశారు. అంతేకాకుడా  ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్, కత్రినాకైఫ్‌-విక్కీ కౌశల్‌, ఆలియా భట్‌-రణ్‌బీర్ కపూర్ సైతం ఇదే పద్ధతిని ఫాలో అయ్యారు.  తాజాగా విరోష్ పెళ్లిలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement