శ్రీ విష్ణు మృత్యుంజయ్.. కొత్త రిలీజ్‌ డేట్ ఇదే | Sree Vishnu's MrithyuNjay New Release Date Announced | Sakshi
Sakshi News home page

MrithyuNjay Movie: శ్రీ విష్ణు మృత్యుంజయ్.. రిలీజ్‌ డేట్‌ మారింది

Feb 20 2026 5:41 PM | Updated on Feb 20 2026 5:49 PM

Sree Vishnu's MrithyuNjay New Release Date Announced

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్‌ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ టీజర్‌ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి ‍అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఫిబ్రవరి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

అయితే అదే రోజు విష్ణు హీరోగా నటించిన విష్ణు విన్యాసం కూడా రిలీజ్ కానుంది. దీంతో శ్రీ విష్ణు ఫ్యాన్స్ డైలామాలో పడ్డారు. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేయడమేంటని ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంలో ఫ్యాన్స్‌కు క్రేజీ ‍అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

తాజాగా శ్రీవిష్ణు తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. రెండు సినిమాలు ఓకే రోజు రిలీజ్‌ కావడం లేదంటూ ట్వీట్ చేశారు. మృత్యుంజయ్ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుందని పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో శ్రీ విష్ణు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ మూవీని లైట్‌ బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement