తిరుమల గుడిలో అలాంటి అనుభవం: శివానీ నగరం | Actress Shivani Nagaram About Tirumala Temple Visit | Sakshi
Sakshi News home page

Shivani Nagaram: గొప్పలు చెప్పుకున్న హీరోయిన్‌.. నెట్టింట దుమారం!

Feb 20 2026 3:56 PM | Updated on Feb 20 2026 4:20 PM

Actress Shivani Nagaram About Tirumala Temple Visit

హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం తిరుమల. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడినుంచో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు.  రెండు సెకన్ల దర్శనభాగ్యం కోసం కొన్ని గంటల తరబడి లైన్‌లో నిలబడి వేచి చూస్తారు. అయితే తాను మాత్రం 15 నిమిషాలు వెంకటేశ్వరస్వామివారిని తనివితీరా దర్శించుకున్నానంటోంది హీరోయిన్‌ శివానీ నగరం. 

15 నిమిషాల దర్శనం 
కాకపోతే అక్కడ తనను చూసిన కొందరు భక్తులు దేవుడితో పాటు తననూ కీర్తించారని కామెంట్లు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివానీ నగరం మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు తిరుపతి వెళ్లాను. దాదాపు 13 ఏళ్ల తర్వాత.. లిటిల్‌ హార్ట్స్‌ సక్సెస్‌ అనంతరం మళ్లీ తిరుమలకు వెళ్లాను. నన్ను కాసేపు ద్వారం దగ్గర నిల్చోబెడతామని చెప్పారు. ఏకంగా 15 నిమిషాలు గర్భగుడి ఎదుట నిల్చోబెట్టి దర్శనం చేయించారు. 

దేవుని గుడిలో నాగురించి..
ఎవరూ నన్ను వెళ్లిపోమని తొందరపెట్టలేదు. ఒకవైపు నుంచేమో భక్తులు గోవిందా.. గోవిందా అంటూ కీర్తిస్తున్నారు. మరోవైపు నుంచి కాత్యాయని, భోం చేశావా? అంటున్నారు. అది వినగానే నేను షాకయ్యాను. దేవుడా.. ఇంక నాకేం వద్దు అనిపించింది. అదే సమయంలో అమ్మ కూడా.. 'నీవల్ల 15 నిమిషాల దర్శనం దొరికింది. థాంక్యూ బేటా.. నీకు తల్లినయినందుకు గర్వంగా ఉంది' అని కామెంట్‌ చేసింది. ఆ మాట వినగానే జీవితానికి ఇది చాలు అని ఉప్పొంగిపోయానంది. 

హీరోయిన్‌కు అంత ప్రాధాన్యత దేనికి?
ఇది చూసిన నెటిజన్లు.. ఒకటీరెండు సినిమాలు చేసిన హీరోయిన్‌కు అంత ప్రాధాన్యత, అదే సామాన్య భక్తులను మాత్రం తోసేస్తారు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. శివానీ డప్పు కొట్టుకుంటోందని సెటైర్లు వేస్తున్నారు. కాగా శివానీ నగరం.. అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో వెండితెరకు పరిచయమైంది. లిటిల్‌ హార్ట్స్‌ చిత్రంతో క్రేజ్‌ అందుకుంది. తాజాగా మరోసారి సుహాస్‌తో జతకట్టింది. అతడికి జంటగా నటించిన హే బలవంత్‌ మూవీ నేడే (ఫిబ్రవరి 20న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

 

చదవండి: ఎందుకిలా బాధపెడుతున్నారు? కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు: మీనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement