యంగ్ హీరోకు ఫోన్ నంబర్.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్..! | Prabhas Phone Number Given To Tollywood Young Hero Santosh Shobhan | Sakshi
Sakshi News home page

Prabhas: యంగ్ హీరోకు ఫోన్ నంబర్.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్..!

Feb 20 2026 4:20 PM | Updated on Feb 20 2026 4:37 PM

Prabhas Phone Number Given To Tollywood Young Hero Santosh Shobhan

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్‌గా మెప్పించింది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ మూవీ చూసిన రెబల్ స్టార్ ప్రభాస్ సైతం చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.

ప్రభాస్ అన్న ప్రశంసలు తమ చిత్రానికి రావడంపై సంతోశ్ శోభన్ ఆనందం వ్యక్తం చేశారు. అన్న రివ్యూతో మా మూవీ సక్సెస్ అయినట్లేనని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా కపుల్ ఫ్రెండ్లీ టీమ్‌తో రెబల్ స్టార్ ప్రభాస్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సంతోశ్ శోభన్‌కు ప్రభాస్ తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అన్న ఫోన్ నంబర్ నా వద్ద లేదని.. నీకు నేను అభిమానిని మాత్రమేనని శోభన్ చెప్పగా.. ప్రభాస్‌ తన నంబర్ ఇచ్చాడు. ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే కాల్ చెయ్.. అనవసరంగా చేస్తే తంతా అంటూ ఫన్నీగా మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

చెన్నై నుంచి ఫుడ్‌ ఆర్డర్..

ఈ చిట్‌ చాట్‌లో ప్రభాస్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఓం రౌత్‌ డైరెక్షన్‌లో ఆదిపురుష్‌ షూటింగ్ ముంబయిలో జరుగుతున్న సమయంలో జరిగిన సంఘటనను వివరించారు.  ఆ రోజు ఓం రౌత్‌కు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తానని చెప్పానన్నారు. చెన్నై నుంచి ఆహారం ఆర్డర్‌ చేసి ముంబయికి ఫ్లైట్‌లో తెప్పించినట్లు వెల్లడించారు. మన హైదరాబాద్‌ బిర్యానీ ఓకే కానీ.. చెన్నై ఫ్లేవర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని ప్రభాస్ అన్నారు. ఇది విన్న ఔం రౌత్‌  నీలాంటోడిని ఎక్కడా చూడలేదని అన్నారని గుర్తు చేసుకున్నారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement