సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది మీనా. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, చిరంజీవి, వెంకటేశ్, మోహన్‌లాల్, మమ్ముట్టి.. ఇలా అందరు హీరోలతోనూ యాక్ట్ చేసింది. కొన్నేళ్ల క్రితం మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో ఆమె కొంతకాలంపాటు తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.
రెండో పెళ్లంటూ ప్రచారం
తీరని మనోవేదనతో ఆమె నరకం అనుభవిస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం మీనాకు రెండో పెళ్లి అంటూ అసత్య ప్రచారం ఊపందుకుంది. దయచేసి ఇటువంటి రూమర్స్ వ్యాప్తి చేయకండి అని మీనా కోరడంతో కొంతకాలం ఆ గాసిప్స్ పత్తా లేకుండా పోయాయి. కానీ తర్వాత మళ్లీ అదే తంతు. ఏదో ఒక హీరోతో మీనాకు లింక్ పెట్టడం, త్వరలోనే రెండో పెళ్లంటూ ప్రచారానికి తెర తీయడం సర్వసాధారణమైపోయింది.
ఒంటరి ఆడదాన్ని అనేకదా!
ఈ వ్యవహారంపై మీనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నాకు రెండో పెళ్లి అని చెత్తంతా రాస్తున్నారు. అందులో నిజం ఉంటే మీరు మాట్లాడుకోవడంలో తప్పు లేదు. కానీ మీకు మీరే ఏదో ఊహించుకుని, కల్పించుకుని రాయడం ముమ్మాటికీ తప్పే! నేనొక ఒంటరి మహిళను, అందులోనూ సెలబ్రిటీని అనే కదా మీకు నచ్చినట్లు రూమర్స్ సృష్టిస్తున్నారు. నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. పైగా నాకు ఓ కూతురుంది.
మంచివాటిపై ఫోకస్ చేస్తా..
తను ఇవన్నీ చూస్తే ఏమనుకుంటుంది? ఇదంతా నాకెంతో అసౌకర్యంగా ఉంది, చాలా చిరాకు తెప్పిస్తోంది. దీన్ని భరించడం నావల్ల కావడం లేదు. కానీ కర్మ అనేది ఒకటుంది. అదెవర్నీ వదిలిపెట్టదు. ఈ అనవసర ప్రచారంపై స్పందించి నా సమయం, ఎనర్జీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోదల్చుకోలేదు. నేను చాలా పాజిటివ్ వ్యక్తిని. ఎప్పుడూ సంతోషంగా, పాజిటివ్‌గా ఉండటానికే ప్రయత్నిస్తాను. మంచివిషయాలపైనే ఫోకస్ చేస్తాను అని మీనా చెప్పుకొచ్చింది.
చదవండి: అమ్మ ఉగ్రరూపం.. గొంతు పట్టుకుని చెంప చెళ్లుమనిపించింది: ప్రియాంక


