లగ్నపత్రిక షేర్‌ చేసిన పునర్నవి | Actress Punarnavi Bhupalam Shares Lagna Patrika | Sakshi
Sakshi News home page

Punarnavi Bhupalam: పెళ్లికూతురిగా ముస్తాబైన పునర్నవి

Feb 19 2026 7:18 PM | Updated on Feb 19 2026 7:33 PM

Actress Punarnavi Bhupalam Shares Lagna Patrika

'ఉయ్యాల జంపాల' సినిమాలో హీరోయిన్‌ స్నేహితురాలిగా కనిపించింది పునర్నవి భూపాలం. కొన్ని సినిమాలు చేసినా అవేవీ వర్కవుట్‌ కాలేదు. అయితే తెలుగు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. రాహుల్‌తో లవ్‌ ట్రాక్‌తో బాగా ఫేమస్‌ అయింది. కానీ షో ముగిసిన తర్వాత రాహుల్‌- పునర్నవి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయ్యారు.

పెళ్లికి వేళాయె
కొంతకాలం క్రితం రాహుల్‌ సిప్లిగంజ్‌ పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలయ్యాడు. ఇప్పుడు పునర్నవి కూడా పెళ్లికి రెడీ అయింది. ఈ మధ్యే తన ప్రియుడిని పరిచయం చేసింది. హేమంత్‌ వర్మ ప్రపోజల్‌కు ఎస్‌ చెప్పానంటూ అతడితో కలిసి దిగిన ఫోటోలు షేర్‌ చేసింది. తాజాగా వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. 

లగ్న పత్రిక
ఈ రోజు పునర్నవి - హేమంత్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల సమక్షంలో లగ్నపత్రిక రాశారు. అందుకు సంబంధించిన ఫోటోలను పునర్నవి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో నీలిరంగు చీరలో పునర్నవి అందంగా మెరిసిపోతోంది. అయితే తను సింగిల్‌గా దిగిన పిక్స్‌ మాత్రమే అభిమానులతో పంచుకుంది.

చదవండి: 6 సార్లు శివాజీగా మెప్పించిన యాక్టర్‌.. ఒక్క సంఘటనతో సంచలన నిర్ణయం

Advertisement
 
Advertisement
Advertisement