ది కేరళ స్టోరీ సీక్వెల్ సెన్సార్ పూర్తి.. డైరెక్టర్‌ రియాక్షన్‌ ఇదే | The Kerala Story 2 director explains why U/A certificate for this film | Sakshi
Sakshi News home page

The Kerala Story 2: ది కేరళ స్టోరీ సీక్వెల్ సెన్సార్ పూర్తి.. డైరెక్టర్‌ ఏమన్నారంటే?

Feb 19 2026 5:05 PM | Updated on Feb 19 2026 5:16 PM

The Kerala Story 2 director explains why U/A certificate for this film

సుదీప్తో సేన్ డైరెక్షన్‌లో వచ్చి ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదా శర్మ కీలక పాత్రలో తెరకెక్కంచిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఎన్ని విమర్శలొచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్ చేయగా.. ముగ్గురు హిందూ అమ్మాయిల కథగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్  కామాఖ్య నారాయణ్ సింగ్  సెన్సార్‌ బోర్డ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సెన్సార్‌ ఆమోదించిన కట్స్ ఈ సినిమాను మరింత ఎక్కువమంది ప్రేక్షకులు చూడటానికి మార్గం సుగమం చేశాయని అన్నారు. కుటుంబంతో కలిసి థియేటర్‌కు వచ్చి సినిమా చూడాలని అన్నారు.

కామాఖ్య నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. 'మేము సెన్సార్‌ చెప్పిన కట్స్‌ను ఆమోదం తెలిపాం. అందుకే U/A సర్టిఫికేట్ వచ్చింది. మన టీనేజ్ సోదరీమణులు, మన కుమార్తెలు సినిమా హాళ్లకు వెళ్లి  చూడటానికి వీలుగా సర్టిఫికేట్ ఇచ్చినందు సెన్సార్ బోర్డుకు నా కృతజ్ఞతలు. యువకులు, తల్లిదండ్రులు కూడా థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలి' అని  అన్నారు.

 కాగా.. ది కేరళ స్టోరీ 2 చిత్రంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రలు పోషించారు.  మొదటి చిత్రం ది కేరళ స్టోరీలో ఆదా శర్మ, సోనియా బలానీ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ నటించారు.  ఈ చిత్రానికి సుదీప్తో సేన్ ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకోగా, ప్రశాంతను మోహపాత్ర ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డ్ అందుకున్నారు.
.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement