The Kerala Story 2 Movie
-
'ది కేరళ స్టోరీ 2' కలెక్షన్స్.. దేశవ్యాప్తంగా ఎవరూ పట్టించుకోలేదా?
‘ది కేరళ స్టోరీ’కి కొనసాగింపుగా ‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ ఫిబ్రవరి 27న విడుదలైంది. దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్, రచయిత విపుల్ అమృత్ లాల్ షా తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్లో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కేరళ హైకోర్టు ఈ చిత్రాన్ని ఆపివేయాలని ఆదేశించినప్పటికీ డివిజన్ బెంచ్ ద్వారా అనుమతి పొంది విడుదలైంది. అయితే రంజాన్ మాసంలో ఈ మూవీ విడుదల కావడంతో ముస్లిమ్స్ నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కేరళ రాష్ట్రం అన్ని మతాల ఐఖ్యతకు మూలం అని ఈ చిత్రం ఒక కల్పితం మాత్రమే అంటూ పలు వీడియోలను నెటిజన్లు షేర్ చేశారు.'ది కేరళ స్టోరీ 2' మొదటి రెండురోజుల్లో కేవలం రూ. 5.4 కోట్లు మాత్రమే రాబట్టింది. అత్యధికంగా ముంబైలో సుమారు 800 స్క్రీన్స్‌లలో ఈ మూవీని ప్రదర్శించగా కేవలం 12 శాతం మాత్రమే టికెట్ల అమ్మకాలు జరిగాయి. దేశ వ్యాప్తంగా చాలా థియేటర్లలో సీట్లు ఖాళీగా కనిపించడంతో మేకర్స్ నిరాశ చెందినట్లు తెలుస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో 836 షోలకు గాను 14% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. హైదరాబాద్ 11.75%, బెంగళూరు 12%, చెన్నై 15 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేశాయి. 2023లో వచ్చిన 'ది కేరళ స్టోరీ' ఏకంగా రూ. 300 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, సీక్వెల్ కలెక్షన్స్ ఆ రేంజ్ మార్క్‌ను అందుకోవడం అసాధ్యమైన పని అంటూ ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. -
కేరళ స్టోరీ–2 విడుదలకు హైకోర్టు పచ్చజెండా
కొచ్చి: కేరళ స్టోరీ–2 సినిమా విడుదలకు ఎట్టకేలకు అడ్డంకి తొలగించింది. షెడ్యూల్ ప్రకారం విడుదల చేసేందుకు కేరళ హైకోర్టు అనుమతించింది. గురువారం ఈ సినిమా విడుదలపై 15 రోజులపాటు స్టే విధిస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలివ్వడం తెల్సిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ సినిమా నిర్మాత విపుల్ అమృత్లాల్ షా గురువారం రాత్రి అప్పీల్ చేశారు. అన్ని నిబంధనలను అనుసరిస్తూ సినిమాను విడుదలకు సిద్ధం చేశామని, మత ఉద్రేకాలను రెచ్చగొట్టే అంశాలేవీ లేవని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన దేశంలోని 1,500 థియేటర్లతోపాటు విదేశాల్లోని 300 థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. విడుదల ఆగిపోతే ఆర్థికంగా దివాళాతీయడం తప్పదని తెలిపారు. పిటిషన్‌ను శుక్రవారం విచారించిన జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ పీవీ బాలకృష్ణన్‌ల ధర్మాసనం ఏకసభ్య ధర్మాసనం తీర్పుపై స్టే ఇచి్చంది. సినిమా విడుదల చేసుకునేందుకు నిర్మాతకు అనుమతి ఇచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సరి్టఫికేషన్ (సీబీఎఫ్సీ) సినిమా సర్టిఫికేషన్ మార్గదర్శకాలను పాటించలేదని సింగిల్ జడ్జి భావించడం కేవలం కొన్ని క్లిప్పింగ్‌ల ఆధారంగానే జరిగిందని భావిస్తున్నాం. మొత్తం సినిమాను చూడకుండా వెలువరించిన ఆ తీర్పును సమరి్థంచలేం, అంగీకరించలేం’అని తీర్పులో పేర్కొంది. సీబీఎఫ్సీ సూచనల మేరకు నిర్మాత షా సినిమాలో మార్పులు, చేర్పులతోపాటు, కొన్ని దృశ్యాలను తొలగించారు. సరి్టఫికెట్ ఇచ్చే సమయంలో బోర్డు తన విచక్షణను పూర్తిగా ఉపయోగించిందనే వాస్తవం దీనివల్ల స్పష్టమవుతోందని ధర్మాసనం తెలిపింది. సంబంధిత అధికారులు శాంతిభద్రతలు సహా అన్ని మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్నారని పరిగణలోని తీసుకున్నారని ప్రాథమికంగా భావిస్తున్నామని ధర్మాసనం అభిప్రాయపడింది. సినిమా విడుదల వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే, తగు చర్యలు చేపట్టడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
ది కేరళ స్టోరీ-2 మేకర్స్‌కు బిగ్ రిలీఫ్
ది కేరళ స్టోరీ-2 మూవీకి బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ సినిమాపై విధించిన స్టేను కేరళ హైకోర్టు తొలగించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టేసింది. దీంతో ఈ సినిమాకు రిలీజ్‌కు మార్గం సుగమమైంది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా స్టే వల్ల విడుదల కాలేదు. తాజాగా స్టే ఎత్తివేయడంతో ఈ మూవీ రిలీజ్ కానుంది. కాగా.. గతంలో రిలీజైన 'కేరళ స్టోరీ' చిత్రానికి సీక్వెల్‌గా 'కేరళ స్టోరీ 2' ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాపై సింగిల్ బెంచ్ న్యాయస్థానం స్టే విధించింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డుపై కూడా హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సమాజంలో విద్వేషాలను ప్రేరేపించే విధంగా, ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న దృశ్యాలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని ధర్మాసనం ప్రశ్నించింది.సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ తెరకెక్కించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. -
హైకోర్టులో ‘ది కేరళ 2’ చిత్రానికి భారీ షాక్
సంచలనం సృష్టించిన 'కేరళ స్టోరీ' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'కేరళ స్టోరీ 2' విడుదలకు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. రేపు (ఫిబ్రవరి 26) విడుదల కావాల్సిన ఈ సినిమాపై న్యాయస్థానం స్టే విధించింది. సినిమాలో వివాదస్పద అంశాలు ఉన్నాయన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సమాజంలో విద్వేషాలను ప్రేరేపించే విధంగా, ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న దృశ్యాలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని ధర్మాసనం ప్రశ్నించింది.అసలేం జరిగింది?2023లో వివాదాల మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరి’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ది కేరళ స్టోరీ 2. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్టు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమాలో కేరళను తప్పుగా చూపించారని ఆరోపణలు చేస్తూ పలువురు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో ఫిబ్రవరి 25న ముందుగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని, ఆ తర్వాతే సెన్సార్ విషయంలో జోక్యం చేసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. ఈ రోజు సినిమాను వీక్షించిన హైకోర్టు.. సినిమాలో వివాదస్పద అంశాలు ఉన్నాయని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. -
‘ది కేరళ స్టోరీ 2’పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
‘ది కేరళ స్టోరీ2’ సినిమాపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విడుదలకు ముందే ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని చిత్రబృందాన్ని ఆదేశించింది. ఈ సినిమా సెన్సార్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. సాధారణంగా కోర్టులు సినిమాలకు సంబంధించి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో అంతగా కల్పించుకోదు. కానీ ఈ సినిమా టైటిల్లో రాష్ట్రం పేరు ఉపయోగించారని, అందుకే ఈ కేసును విచారణకు అంగీకరించినట్లు కోర్టు తెలిపింది. ఈ నెల 25న ముందుగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని, ఆ తర్వాతే సెన్సార్ విషయంలో జోక్యం చేసుకుంటామని ధర్మాసనం తేల్చి చెప్పింది. 2023లో వివాదాల మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరి’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్టు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమాలో కేరళను తప్పుగా చూపించారని ఆరోపణలు చేస్తూ పలువురు కోర్టు మెట్లు ఎక్కారు. ఫిబ్రవరి 25 తర్వాత హైకోర్టు తన తీర్పుని వెలువరించనుంది. ఫిబ్రవరి 27న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
'అతన్ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు'.. డైరెక్టర్‌కు స్ట్రాంగ్ కౌంటర్
సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ తెరకెక్కించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సైతం ఈ మూవీపై విమర్శలు చేశారు. కేవలం డబ్బుల కోసమే ఇలాంటి సినిమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల సందర్భంగా కొచ్చిలో ఆయన మాట్లాడారు. దీంతో ఆయన కామెంట్స్ కాస్తా బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ది కేరళ స్టోరీ-2 డైరెక్టర్ కామాఖ్య నారాయణ్ స్పందించారు. అనురాగ్‌కు అన్నింటితో సమస్యలేనని కామాఖ్య నారాయణ ఎద్దేవా చేశారు. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదేమోనని అన్నారు.కామాఖ్య నారాయణ్ మాట్లాడుతూ..'బహుశా అనురాగ్ మానసిక పరిస్థితి బాగాలేదనుకుంటున్నా. ఆయనకు అన్నింటితో సమస్యే. సమాజంలో ఒక వర్గం ప్రజలతో.. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీతోనూ ఆయనకు ఇబ్బందులే. అనురాగ్ తాను తీసిన సినిమాల్లో ఇంతకు మించిన సన్నివేశాలను చూపించారు. ఈ ఆధునిక సమాజంలో ఊహకు కూడా అందని వాటిని కూడా చిత్రీకరించారు. ప్రేక్షకులు ఆయన మాటలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారని' అన్నారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'ది కేరళ స్టోరీ-2' డబ్బు కోసం చిచ్చు పెడుతున్నారు: ప్రముఖ దర్శకుడు
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ది కేరళ స్టోరీ-2 చిత్రంపై మండిపడ్డారు. రెండేళ్ల క్రితం విడుదలైన ది కేరళ స్టోరీ మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ తెరకెక్కించారు. సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్లాల్ షా ‘ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్’ను నిర్మించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ వివాదస్పదంగా మారింది. ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై దర్వకుడు అనురాగ్ కశ్యప్ రియాక్ట్ అయ్యారు.ఫిల్మ్‌ఫేర్ అవార్డుల సందర్భంగా కొచ్చిలో కనిపించిన అనురాగ్ కశ్యప్‌ను కేరళ స్టోరీ-2పై మాట్లాడమని మీడియా ప్రతినిధులు కోరడంతో ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఈ మూవీ కేవలం డబ్బు సంపాదించుకోవడానికి చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని శక్తులు ప్రజల మధ్య చిచ్చు పెట్టి విభజించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలను కూడా కల్పితంగా తెరకెక్కించి కొందరు లాభపడాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు మరీ దారుణంగా ఉన్నాయని చెప్పారు. అందులో చూపినట్లు ఎవరైనా బీఫ్ తినిపిస్తారా.. కనీసం కిచిడీని కూడా అలా తినిపించరు కదా అంటూ భగ్గున్నారు. ఈ సినిమా మేకర్స్ అత్యాశపరులుగా కనిపిస్తున్నారు. వాళ్లు కేవలం డబ్బు కోసం మాత్రమే ఇలాంటి కథలు తీస్తున్నారని ఫైర్ అయ్యారు. 'ది కేరళ స్టోరీ-2' సినిమా ‘విద్వేషపూరిత ప్రోపగాండా’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
ది కేరళ స్టోరీ-2 మేకర్స్‌కు షాక్..!
ది కేరళ స్టోరీ నిర్మాతలకు షాక్ తగిలింది. ఈ సినిమా రిలీజ్ నిలిపేయాలంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర సమాచారశాఖతో పాటు సెన్సార్ బోర్డ్, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా ట్రైలర్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని.. కేరళ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ శ్రీదేవ్ అనే బయాలజిస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.సుదీప్తో సేన్ డైరెక్షన్లో వచ్చి ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదా శర్మ కీలక పాత్రలో తెరకెక్కంచిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఎన్ని విమర్శలొచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ముగ్గురు హిందూ అమ్మాయిల కథగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహంచారు. -
ది కేరళ స్టోరీ సీక్వెల్ సెన్సార్ పూర్తి.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే
సుదీప్తో సేన్ డైరెక్షన్లో వచ్చి ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదా శర్మ కీలక పాత్రలో తెరకెక్కంచిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఎన్ని విమర్శలొచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ముగ్గురు హిందూ అమ్మాయిల కథగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ కామాఖ్య నారాయణ్ సింగ్ సెన్సార్ బోర్డ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సెన్సార్ ఆమోదించిన కట్స్ ఈ సినిమాను మరింత ఎక్కువమంది ప్రేక్షకులు చూడటానికి మార్గం సుగమం చేశాయని అన్నారు. కుటుంబంతో కలిసి థియేటర్‌కు వచ్చి సినిమా చూడాలని అన్నారు.కామాఖ్య నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. 'మేము సెన్సార్ చెప్పిన కట్స్‌ను ఆమోదం తెలిపాం. అందుకే U/A సర్టిఫికేట్ వచ్చింది. మన టీనేజ్ సోదరీమణులు, మన కుమార్తెలు సినిమా హాళ్లకు వెళ్లి చూడటానికి వీలుగా సర్టిఫికేట్ ఇచ్చినందు సెన్సార్ బోర్డుకు నా కృతజ్ఞతలు. యువకులు, తల్లిదండ్రులు కూడా థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలి' అని అన్నారు. కాగా.. ది కేరళ స్టోరీ 2 చిత్రంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రలు పోషించారు. మొదటి చిత్రం ది కేరళ స్టోరీలో ఆదా శర్మ, సోనియా బలానీ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ నటించారు. ఈ చిత్రానికి సుదీప్తో సేన్ ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకోగా, ప్రశాంతను మోహపాత్ర ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డ్ అందుకున్నారు.. -
'ది కేరళ స్టోరీ-2'పై సీఎం పినరయి విజయన్ ఆగ్రహం
ది కేరళ స్టోరీ మూవీ విడుదల సమయంలో ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పడు 'ది కేరళ స్టోరీ-2' చిత్రంపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రంలో మతపరమైన విభజనతో పాటు ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు అర్థమవుతుందన్నారు. ‘లవ్ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినప్పటికీ.. ఇదే అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చి మతపరమైన విభజన సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని విజయన్ మండిపడ్డారు. కేరళ రాష్ట్రాన్ని ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి ఈ మూవీని తెరపైకి తీసుకొచ్చారన్నారు. అక్షరాస్యతలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తమ రాష్ట్రాన్ని ఇలా అప్రతిష్టపాలు చేసేందుకు సినిమాల పేరుతో కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని వాటిని ఐక్యంగా ప్రజలు తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. 'ది కేరళ స్టోరీ-2' సినిమా ‘విద్వేషపూరిత ప్రోపగాండా’ అంటూనే రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆయన అన్నారు. శాంతియుత వాతావరణంతో అందరూ కలిసిమెలసి ఉన్న కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించేందుకు ఈ మూవీని వాడుకుంటున్నారని ఆయన అన్నారు. ఫిబ్రవరి 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అధికార ఎల్.డి.ఎఫ్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది.


