ఓటీటీలో 'ది కేరళ స్టోరీ 2'.. స్ట్రీమింగ్‌ తేదీ మార్పు | The Kerala Story 2 Movie OTT Streaming Date Change | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'ది కేరళ స్టోరీ 2'.. స్ట్రీమింగ్‌ తేదీ మార్పు

Apr 26 2026 12:46 PM | Updated on Apr 26 2026 1:25 PM

The Kerala Story 2 Movie OTT Streaming Date Change

‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ ఓటీటీ స్ట్రీమింగ్‌ తేది మారింది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ది కేరళ స్టోరీకి కొనసాగింపుగా ఫిబ్రవరి 27న విడుదలైన ఈ చిత్రం కొద్దిరోజుల క్రితమే ఓటీటీ రిలీజ్‌ గురించి ప్రకటించారు. అయితే, తాజాగా మరో తేదిని ప్రకటిస్తూ ఎక్స్‌ పేజీలో షేర్‌ చేశారు. దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్, రచయిత విపుల్ అమృత్ లాల్ షా తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్‌లో  కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. మరి ఓటీటీలో ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.

ది కేరళ స్టోరీ 2 మొదట మే 8  ZEE5లో విడుదల అవుతుందని ప్రకటించినప్పటికీ, స్ట్రీమింగ్ తేదీని మే 1, 2026కి ముందుకు జరిపారు. అయితే, ఈ ముందస్తు విడుదలకు గల సరైన కారణాన్ని చిత్ర నిర్మాతలు గానీ, ప్లాట్‌ఫామ్ గానీ వెల్లడించకపోవడంతో, ఈ మార్పు చాలా మందిని ఆశ్చర్యపరిచింది.  థియేటర్స్‌లో విడుదల సమయంలో అనేక చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కొని, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను పొందింది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement