breaking news
Bigg Boss
-
బిగ్‌బాస్‌లో నామినేషన్ల రచ్చ.. ‘గేమ్ కోసం ఇంతలా దిగజారాలా..?’
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ హౌస్‌లో మరోసారి రచ్చ రేపింది. నిన్నటి ఎపిసోడ్లో ముకేశ్ గౌడ్, వర్షిణి ప్రధానంగా టార్గెట్ అయ్యారు. నామినేషన్ల సందర్భంగా పాత గొడవలు మళ్లీ తెరపైకి రావడంతో ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..నరేష్‌ను టార్గెట్ చేసిన వర్షిణితొమ్మిదో వారం నామినేషన్లలో వర్షిణి.. నరేష్‌ను టార్గెట్ చేసింది. హోటల్ టాస్క్ సమయంలో ఝాన్సీ డబ్బులు అడిగినా నరేష్ ఇవ్వలేదని ప్రశ్నించింది. దేబ్జానీ చెప్పిన కారణంగానే అతడు డబ్బులు ఇవ్వలేదని ఆరోపించింది. దీనికి నరేష్ గట్టిగా బదులిచ్చాడు. డబ్బులు తనవని, వాటిని ఇచ్చిన తర్వాత ఎలా ఖర్చు చేసుకోవాలనేది తన ఇష్టమని గతంలోనే చెప్పానని గుర్తుచేశాడు. అదే విషయాన్ని పదేపదే ప్రస్తావించాల్సిన అవసరం లేదని ఇది రియాలిజీ షో అని విషయం గుర్తుపెట్టుకోవాలని అసహనం వ్యక్తం చేశాడు.వర్షిణిపై రామ్ ప్రసాద్ ఆరోపణలుఆ తర్వాత రామ్ ప్రసాద్ వర్షిణిని నామినేట్ చేశాడు. బయటకు స్నేహంగా ఉంటూ లోపల మరోలా వ్యవహరిస్తోందని, తన అవసరాల కోసం నరేష్‌ను ఉపయోగించుకోవడం అనడం సరికాదని ఆరోపించాడు. తామిద్దరం పరస్పరం సహాయం చేసుకున్నామని అందులో ఒకరిని మరొకరు ఉపయోగించుకోవడం ఏముందని రామ్ ప్రసాద్ వర్షిణిని ప్రశ్నించాడు.ముకేశ్ వ్యాఖ్యలపై శివ ఆగ్రహంముకేశ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ నామినేషన్లలో మరోసారి చర్చకు వచ్చాయి. దేబ్జానీ వెనుక శివ తిరుగుతున్నాడనే అర్థం వచ్చేలా ముకేశ్ మాట్లాడటంపై శివ తీవ్రంగా స్పందించాడు. ఒక మహిళ గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. గేమ్‌లో మూడు స్టార్ల కోసం ఇంతలా దిగజారాలా అంటూ నిలదీశాడు. ముకేశ్ వ్యాఖ్యలపై త్రిగుణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఝాన్సీ( రైతుబిడ్డ)ని కూడా అన్యాయంగా పంపించేలా చేసింది ముకేశ్నే అని మండిపడ్డాడు. వ్యక్తిత్వం, ప్రవర్తనే ముఖ్యం..దేబ్జానీ కూడా ముకేశ్ ప్రవర్తనను తప్పుబట్టింది. టాస్కుల్లో వేగం, బ్యాలెన్స్ కంటే వ్యక్తిత్వం, ప్రవర్తనే ముఖ్యమని చెప్పింది. ముకేశ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ నామినేట్ చేసింది. అతడి మాటలతో తాను బాధపడ్డానని చెప్పింది. దీంతో నామినేషన్ల ప్రక్రియలో మరోసారి హౌస్ వాతావరణం వేడెక్కింది.(ఇదీ చదవండి: అల్లు అరవింద్‌తో నటించాలని ఉంది: నటి జయసుధ) -
'పోరా మతిమరుపు'.. ఈసారి నామినేషన్లు ఎలా జరిగాయి?
రోహిత్ ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. నామినేషన్ ప్రక్రియతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో 'రివార్డ్ అండ్ రివెంజ్' ఉండనుంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటి సభ్యుడికి ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరి ఫోటోలను ఫైర్ పిట్లో వేసి ప్రక్రియని పూర్తి చేయాలి. కెప్టెన్‌గా ఉన్న త్రిగుణ్‌ని మాత్రం ఎవరూ నామినేట్ చేయకూడదు అని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. ఇంతకీ 57వ రోజైన సోమవారం(నవంబర్ 02) అసలేం జరిగింది?(ఇదీ చదవండి: ‘మెగా’ ఇంట్లో పెళ్లి బాజాలు.. ఈ నెల 5న ఎంగేజ్మెంట్!?)మొదటగా వచ్చిన వంశీ.. ముకేశ్‌ని నామినేట్ చేశాడు. ఝాన్సీ మీ వల్ల చాలా బాధ పడింది. తను ఏడవటానికి మీరే కారణం. ఇలాంటి షోలో మీరు మాట్లాడే మాటలు నేను అస్సలు ఊహించలేదు. ఒక వ్యక్తిని రాడ్ తీసుకుని ఇలా కొట్టాలి, అలా చేయాలి అని మీ అసభ్యకరమైన మాటలు విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మీరు మాట్లాడే మాటలను చూసి బయటివాళ్లు ఏమనుకుంటారు? దయచేసి కళ్లు తాగిన కోతిలా ప్రవర్తించకండి. ప్రతి విషయంలోనూ అందరి మీదకు వెళ్లడం, అవసరం లేని చోట రెచ్చిపోవడం లాంటివి తగ్గించుకోండి అని కారణాలు చెప్పాడు.తర్వాత వర్షిణిని నామినేట్ చేశాడు. మీ వల్ల చాలాసార్లు రాత్రిపూట నిద్రకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు వార్నింగ్స్ ఇచ్చినా మీరు మాత్రం మారడం లేదు. ఇది ఒక పాయింట్. ఇక రెండోది మీ పర్సనాలిటీ గురించి. మీరు పర్సనాలిటీ గురించి ఇంతగా మాట్లాడుతున్నారు కాబట్టి మీ నుంచి నేను ఇలాంటిది ఊహించలేదు. తొలివారంలో రాంప్రసాద్ విషయంలో మీరు హర్ట్ అయ్యారు. ఆ విషయాన్ని ఇంతకాలం మనసులో పెట్టుకుని, నిన్న కార్డుపై రాసి బయటపెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు తప్పులని గుర్తించే వ్యక్తి అయితే, కనీసం ఒక్కసారైనా ఆయన్ని నామినేట్ చేసి ఉండాలి కదా? అని వర్షిణిని ప్రశ్నించాడు.సుధీర్ తన మొదటి నామినేషన్ వంశీకి వేశాడు. మిథిలేష్ సూట్‌కేస్ తీసుకుని వెళ్లినప్పుడు మీరు నా పక్కనే కూర్చున్నారు. ఆ రోజు మనమందరం డబ్బు కోసం రాలేదు, పేరు సంపాదించుకోవడం కోసమే వచ్చామని చెప్పుకున్నాం. కానీ మీరు మాత్రం ఒక 20 లక్షలో, 25 లక్షలో ఇచ్చి ఉంటే నేను కూడా వెళ్లిపోయేవాడిని కదా డార్లింగ్ అని నాతో అన్నారు. అంటే మీకు డబ్బు ముఖ్యమా? పేరు ముఖ్యమా? అని అడిగాడు. తర్వాత సుధీర్ రెండో నామినేషన్ అమన్‌కి వేశాడు. హోటల్ టాస్క్‌లో స్టార్స్ విషయంలో చాలామంది నీ దగ్గరకు వచ్చి నన్ను స్టార్ ఇవ్వమని అడుగుతున్నారని, వెంటనే రోహిత్ దగ్గరకు వెళ్లి ఆ స్టార్ నీ దగ్గరే పెట్టుకో అని ఇచ్చేశావు. ఆ టైంలో నువ్వు నీ ఫ్రెండ్షిప్ నిరూపించుకోవాలని అలా చేశావని అనిపించింది. కానీ నిన్న నువ్వే అతన్ని ఈ హౌస్ నుంచి వెళ్లిపోవాలని చెప్పావ్. ఆ ఒక్కటి ఫ్రెండ్షిప్ పరంగా నాకు నచ్చలేదని కారణాలు చెప్పాడు.(ఇదీ చదవండి: నన్ను ముందుకు నడిపిస్తోంది జ్యోతికనే)శ్వేత ముకేశ్‌ని నామినేట్ చేసింది. బాల్ టాస్క్ రాంప్రసాద్‌ను కన్విన్స్ చేయడానికి బదులుగా తన సపోర్టర్స్ దగ్గరకు వెళ్లి నిజాయితీగా అడిగితే గేమ్ ఫలితం మరోలా ఉండేదేమోనని చెప్పింది. తర్వాత అమన్‌ని నామినేట్ చేసింది. మొదటినుంచి అమన్ తనకు సపోర్ట్ చేస్తున్నాడని, తాను కూడా అమన్‌కు పాజిటివ్, నెగిటివ్ రెండూ చెబుతూ గేమ్ మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపింది. తర్వాత నీతూ మాస్టర్ వర్షిణి, వంశీలని నామినేట్ చేసింది.ముకేశ్ మొదటగా వంశీని నామినేట్ చేశాడు. మీ గేమ్ జీరో.. త్రిగుణ్‌కి పప్పెట్ అయిపోయి ఆడుతున్నారు కానీ మీ గేమ్ ఏం లేదు. టెంపర్ టెంపర్ అని వంశీని ముకేశ్ పిలుస్తుంటే.. పోరా మతి మరుపు అని ముకేశ్‌పై వంశీ సెటైర్ వేశాడు. అలా వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత ముకేశ్.. దేబ్జానీని నామినేట్ చేశాడు. ఇక రామకృష్ణ ముకేశ్, నీతూని నామినేట్ చేశాడు. నరేశ్.. అమన్, వర్షిణిని నామినేట్ చేశాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జంట) -
బిగ్‌బాస్ చరిత్రలో సంచలనం.. ఇలా కూడా జరుగుతుందా?
బిగ్‌బాస్ షోలో పుట్టేది నిజమైనా ప్రేమ? కాదా అంటే ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే షో హైప్ కోసం ప్రేమికుల్లా నటిస్తుంటారు. కొందరు మాత్రం నిజంగానే తోటి కంటెస్టెంట్‌తో ప్రేమలో పడుతుంటారు. మలయాళ బిగ్‌బాస్ లేటెస్ట్ సీజన్లోనూ ఇలాంటిది ఒకటి జరిగింది. అయితే ఈ సీన్లోకి సదరు అమ్మాయి తరఫు తల్లిదండ్రులు రావడం ఇక్కడ పెద్ద ట్విస్ట్. అసలు ఈ ప్రేమకథ సంగతేంటి? చివరకు ఏం జరిగింది?(ఇదీ చదవండి: రోహిత్ 'సైకో' ప్రవర్తన.. నాగ్ ఎందుకు మాట్లాడలేదు?)మలయాళంలో ప్రస్తుతం బిగ్‌బాస్ 8వ సీజన్ ప్రసారమవుతోంది. దీనికి హీరో మోహన్ లాల్ హోస్ట్. ఈ షోలో ప్రస్తుతం ఆడుతున్న నేహా ఫాతిమా అనే అమ్మాయి.. సంతోష్ రాజ్(తషి) అనే మరో కంటెస్టెంట్‌ని షోలోనే ప్రపోజ్ చేసింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుందామని చెప్పుకొచ్చింది. సాధారణంగా ఈ షో అంటేనే ఇలాంటి ట్రాక్స్ కామన్. వాటినే ఎక్కువగా హైలైట్ చేస్తుంటారు. అలా నేహా-సంతోష్ ప్రేమని మలయాళ బిగ్‌బాస్ నిర్వాహకాలు ఆసక్తికరంగా మలుస్తూ షోను నడిపిస్తున్నారు. చెప్పాలంటే షో మొత్తం వీరిద్దరి ప్రేమ వ్యవహారం చుట్టూనే తిరుగుతోంది.అయితే లైవ్‌లో ఇదంతా గమనించిన నేహా ఫాతిమా తల్లిదండ్రులు.. నేరుగా బిగ్‌బాస్ షోకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని మరీ తమ కూతురిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఒకవైపు తల్లిదండ్రులు, మరోవైపు కుమార్తె, మధ్యలో ఆమె ప్రేమించిన వ్యక్తి.. ఇలా మంచి ఎమోషన్లతో సదరు ఎపిసోడ్‌ని మోహన్‌లాల్ నడిపించాడు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఇదంతా నిజంగా జరిగిందా? లేదంటే వైరల్ అయ్యేందుకు చేసిన స్కిప్టా? అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. మరోవైపు సంతోష్ రాజ్ హిందువు కావడం వల్లే నేహా తల్లిదండ్రులు ఈ ప్రేమని వ్యతిరేకించి, ఆమెను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకెళ్లారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.ఇంతవరకు బిగ్‌బాస్ అన్ని భాషల్లోనూ లవ్ స్టోరీస్ ఉన్నప్పటికీ అవి స్క్రిప్టెడ్గానే ఉండేవి. కాబట్టి ఆడియెన్స్ కూడా సదరు జంటల్ని చూసి లైట్ తీసుకునేవారు. కానీ ఇలా తల్లిదండ్రులే వచ్చి స్వయంగా కూతుర్ని తీసుకెళ్లిపోవడం మాత్రం బహుశా ఇదే తొలిసారేమో!(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: రోహిత్ ఎలిమినేషన్‌కి కారణాలేంటి? పారితోషికం ఎంత?) -
బిగ్‌బాస్ 10: ఏవీ లేకుండానే రోహిత్ ఎలిమినేట్
బిగ్‌బాస్ 10లో ఎనిమిదో వీకెండ్ ఊహించని ట్విస్టులు కనిపించాయి. ఝాన్సీ ఎలిమినేట్ అయిందని ప్రేక్షకులు తేరుకునేలోపు మరో ట్విస్ట్ ఇచ్చి రోహిత్‌ని బయటకు పంపించారు. కనీసం ఏవీ కూడా ప్లే చేయలేదు. ఇంతకీ హౌస్‌లో 56 రోజైన ఆదివారం(నవంబర్ 01) ఎపిసోడ్లో అసలేం జరిగింది?(ఇదీ చదవండి: రోహిత్ 'సైకో' ప్రవర్తన.. నాగ్ ఎందుకు మాట్లాడలేదు?)ఎలిమినేట్ అయిన ఝాన్సీ జర్నీ వీడియోతో ఆదివారం ఎపిసోడ్ మొదలైంది. ఓ ఐదు సామెతలు ఎవరికి వర్తిస్తాయి అని ఆమెని అడగ్గా.. కుక్క తోక వంకర రోహిత్‌కి.. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు దేబ్జానీకి.. గోరంతదాన్ని కొండంత చేస్తారు త్రిగుణ్‌కి.. మెరిసేదంతా బంగారం కాదు ముకేశ్‌కి.. ఇంట్లో పులి వీధిలో పిల్లి నరేశ్‌కి ఇచ్చింది. తర్వాత కాసేపటికి దేబ్జానీతో త్రిగుణ్ మాట్లాడుతూ వర్షిణి, ముకేశ్, రోహిత్ తన గురించి అన్న మాటలు చెప్పాడు. నా గురించి వర్షిణి మాట్లాడిన మాటలు విని తనని ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అనిపించింది అని త్రిగుణ్ తన కోపాన్ని బయటపెట్టాడు.తర్వాత పెట్టి హుక్ స్టెప్ డ్యాన్స్ పోటీలో త్రిగుణ్, రాంప్రసాద్ బ్యాచ్ గెలిచింది. ఇక రెడ్ జోన్లో ఉన్న రామకృష్ణ, శ్వేత, రోహిత్‌లతో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పిన నాగ్.. ముగ్గురిలో ఎవరు వెళ్లిపోవాలి అనుకుంటారో వాళ్ల పేరు చెప్పి కుండ పగలగొట్టండి అని మిగతా హౌస్‌మేట్స్‌కి చెప్పాడు. నరేశ్, దేబ్జానీ, రాంప్రసాద్, శివ్, అమన్.. రోహిత్ పేరు చెప్పగా.. వర్షిణి, ముకేశ్, నీతూ, సుధీర్.. రామకృష్ణ పేరు చెప్పారు. వంశీ, త్రిగుణ్ కూడా రోహిత్ పేరే చెబుతారు. రామకృష్ణకి నాలుగు ఓట్లు, రోహిత్‌కి ఏడు ఓట్లు రావడంతో ఇంటి సభ్యుల ఓట్లతో రోహిత్ ఎలిమినేట్ అయిపోయాడని నాగ్ ప్రకటించారు. రోహిత్ ఔట్ కావడంతో నీతూ చాలా ఏడ్చింది.అయితే రోహిత్ ఇలా ఎలిమినేట్ అవుతాడని బిగ్‌బాస్ టీమ్ కూడా ఊహించలేదేమో! ఏవీ కూడా వేయలేదు. అందరితో మాట్లాడిన రోహిత్.. నరేశ్ నిర్ణయం ఆయనది కాదు ఇన్ఫ్లూయెన్స్ అయ్యాడని చెప్పాడు. దేబ్జానీ టార్గెట్ నేనే అని నాకు తెలుసు.. రాంప్రసాద్ నన్ను స్ట్రాంగ్ అని ఇలా చేయడం నచ్చలేదని అన్నాడు. ఈ ట్విస్ట్ ఊహించలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అని చెప్పిన నాగ్.. వచ్చేవారం 'రివార్డ్ అండ్ రివేంజ్' ప్రారంభమవుతుందని చెప్పారు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: రోహిత్ ఎలిమినేషన్‌కి కారణాలేంటి? పారితోషికం ఎంత?) -
బిగ్‌బాస్ 10: రోహిత్ ఎలిమినేషన్‌కి కారణాలేంటి? పారితోషికం ఎంత?
రూమర్స్ వచ్చినట్లే బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. షోలో ఇదంతా ప్రసారం కాకముందే రోహిత్ తన ఇన్ స్టాలో ఈ సంగతి బయటపెట్టాడు. టాప్ కంటెస్టెంట్ అని సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయిన ఇతడు.. ఇలా మధ్యలో ఎలిమినేట్ కావడానికి కారణాలేంటి? రెమ్యునరేషన్ ఎంత సంపాదించాడు?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఝాన్సీకి దక్కిన రెమ్యునరేషన్ ఎంత?)ఈసారి అగ్నిపరీక్ష పోటీలో జడ్జిలని మెప్పించి హౌస్‌లోకి వచ్చిన రోహిత్‌కి ప్రారంభంలో హైప్ లభించింది. సెలబ్రిటీలు కూడా ఇతడినే టార్గెట్ చేస్తూ నామినేషన్లు చేశారు. దీంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నట్లు సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు. తీరా చూస్తే బలమైన కంటెస్టెంట్, విన్నర్ అవుతాడనే కామెంట్స్ సోషల్ మీడియాకే పరిమితమయ్యాయి. హౌస్‌లో గొడవలతో ఎప్పటికప్పుడు బాగానే కనిపించేవాడు గానీ గేమ్స్ పరంగా బాగా నిరాశపరిచాడు.రోహిత్ ఎలిమినేట్ కావడానికి ఒకటి కాదు, చాలా కారణాలే కలిసి పనిచేశాయని ప్రేక్షకుల అభిప్రాయపడుతున్నారు. హౌస్‌లో గేమ్స్‌లో సరిగా ఆడకపోవడం.. ఓవర్ యాటిట్యూడ్ చూపించడం.. నోరు జారడంతో పాటు తోటీ కంటెస్టెంట్స్‌ని దూషించడం.. బిగ్ బాస్-హోస్ట్ నాగార్జున ప్రతి వారం వార్నింగ్ ఇచ్చినా మారకపోవడం.. షాలినితో గేమ్‌కి మించి క్లోజ్ అవ్వడం.. త్రిగుణ్పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి తన గేమ్ మర్చిపోవడం లాంటి కారణాలు ఇలా రోహిత్‌ని మధ్యలోనే బయటకు తీసుకొచ్చేశాయి.అయితే వారానికి రూ.70 వేలు చొప్పున ఎనిమిది వారాలకుగానూ రూ.5.60 లక్షలతో పాటు అగ్నిపరీక్షలో పాల్గొన్నందుకు రూ.50 వేలు మొత్తంగా రూ.6.10 లక్షలు ఇతడికి పారితోషికంగా దక్కినట్లు తెలుస్తోంది. అయితే ఎలిమినేషన్ టైంలో రోహిత్ ఏవీ వేయకపోవడంతో రీఎంట్రీ ఉంటుందని అంటున్నారు. మరి ఇది నిజమా కాదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: రోహిత్ 'సైకో' ప్రవర్తన.. నాగ్ ఎందుకు మాట్లాడలేదు?) -
బిగ్‌బాస్‌లో ఉండగానే త్రిగుణ్ కొత్త సినిమా అప్డేట్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు యువ హీరో త్రిగుణ్. ప్రస్తుతం హౌస్‌లో తన ఆటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన గేమ్ ప్లాన్‌పై కొందరు విమర్శలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే, బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగుతున్న త్రిగుణ్‌కు సంబంధించిన ఓ సినిమా అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఆయన హీరోగా నటిస్తున్న 'జంగా' సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది.శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్కే ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రమ్య కిలారి, జయ చంద్ర నాయుడు కిలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో త్రిగుణ్ సరసన నేహా పఠాన్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్, గగన్ విహారి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కెవిన్ గడ్డం (శ్రీహరి) దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది.( ఇదీ చదవండి: వజ్రాల బటన్లు.. అలియా డ్రెస్ ప్రత్యేకతలివే..!) View this post on Instagram A post shared by Thri gun (@thrigun_aactor) -
బిగ్‌బాస్ 10: ఝాన్సీకి దక్కిన రెమ్యునరేషన్ ఎంత?
పాజిటివో నెగటివో గానీ బిగ్‌బాస్ షో అయితే ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. శనివారం నాటి ఎపిసోడ్లో రోహిత్-వర్షిణి-ముకేశ్ చేసిన కామెంట్స్ షో పరువునే దిగజార్చాయి. ఇదే ఎపిసోడ్లో భాగంగా రైతుబిడ్డ ఝాన్సీ ఎలిమినేట్ కావడం షాకింగ్ అనిపించింది. ఇంతకీ ఈమె ఎందుకు ఎలిమినేట్ అయింది? రెమ్యునరేషన్ ఎంత సంపాదించింది?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావ్.. ఝాన్సీ ఎమోషనల్ ఎలిమినేషన్)ఈసారి అగ్నిపరీక్షలో అందరి దృష్టిని ఆకర్షించిన వాళ్లలో ఫోక్ సింగర్ ఝాన్సీ ఒకరు. అలా జడ్జిలని మెప్పించి బిగ్‌బాస్ 10లో అడుగుపెట్టింది. తొలి రెండు వారాలు బాగానే ఆడుతూ షోలో కనిపించింది. కానీ తర్వాత వారాల్లో గేమ్ పరంగా ఆకట్టుకోలేక వెనకబడిపోయింది. ఈ వారం, గతవారం రోజులుగా జరుగుతున్న అల్టిమేట్ గోట్ టాస్క్‌లోనూ చాలా వెనకబడిపోయి రెడ్ లెవల్లోనే ఉండిపోయింది.లెక్క ప్రకారం ఈసారి సుధీర్ ఎలిమినేట్ అయ్యాడు. కానీ తన పవర్ ఉపయోగించి అతడిని కాపాడాన ఝాన్సీ.. తనని తాను కాపాడుకోలేక ఎలిమినేట్ అయింది. శనివారం ఎపిసోడ్ అంతా ఈమె ఎలిమినేషన్ గురించి ఎమోషనల్‌గా సాగింది. హౌసులో 8 వారాల పాటు ఉన్న ఈమె.. ఒక్కో వారానికి రూ.70,000 నుండి రూ.75,000 వరకు పారితోషికం అందుకుంది. మొత్తంగా దాదాపు రూ.5.60 నుండి 6 లక్షల వరకు రెమ్యునరేషన్ ఈమెకు లభించింది.(ఇదీ చదవండి: రోహిత్ 'సైకో' ప్రవర్తన.. నాగ్ ఎందుకు మాట్లాడలేదు?) -
రోహిత్ 'సైకో' ప్రవర్తన.. నాగ్ ఎందుకు మాట్లాడలేదు?
తెలుగు బిగ్‌బాస్ షో మీద ఎన్ని విమర్శలు వచ్చాయో లెక్కలేదు. అయినా సరే నిర్వహకులు తీరు మార్చుకోవట్లేదు. టీఆర్పీ కోసం రోజురోజుకీ తమ స్థాయి దిగజార్చుకుంటూనే ఉన్నారు. శనివారం ఎపిసోడ్‌లోనూ అలాంటి ఓ సంఘటన కంపరం పుట్టించింది. ప్రధాన సూత్రధారి రోహిత్ కాగా అతడికి వంతపాడుతూ వర్షిణి, ముకేశ్ అలానే ప్రవర్తించారు. ఇదంతా చూసి కూడా హోస్ట్ నాగార్జున ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? అసలు జనాలకు వీళ్లు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావ్.. ఎమోషనల్ ఎలిమినేషన్)ప్రస్తుత బిగ్‌బాస్ సీజన్లో ప్రారంభం నుంచి త్రిగుణ్ vs రోహిత్ అన్నట్లుగానే ఉంది. రోహిత్ ఎన్ని మాటలు అంటున్నా, ఇబ్బందులు పెడుతున్నా త్రిగుణ్ గేమ్స్‌లో గెలుస్తూ వస్తున్నాడు. ఈ వారం అల్టిమేట్ గోట్ కూడా అయిపోయాడు. అదే టైంలో రోహిత్ మాత్రం సోషల్ మీడియాలోనే ఎలివేషన్లు ఇప్పించుకుంటున్నాడు తప్పితే షోలో ఘోరాతిఘోరంగా ఆడుతున్నాడు. అంతకు మించి సైకోలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు.బిగ్‌బాస్ అనేది ఓ గేమ్ షో. ఇందులో గెలిచినా ఓడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. రెండు రోజులు పోతే అందరూ ఈ షో గురించే మర్చిపోతారు. గేమ్ పరంగా ఏదైనా అనుకోవచ్చు గానీ వ్యక్తిగతంగా తిట్టడం, టార్గెట్ చేయడం సరికాదు. అగ్నిపరీక్షలో సెలెక్ట్ అయి సామాన్యుడు అనే ట్యాగ్ లైన్‌తో హౌస్‌లోకి వచ్చిన రోహిత్.. శనివారం(అక్టోబర్ 31) ఎపిసోడ్లో త్రిగుణ్ గురించి మాట్లాడుతూ సన్నని ఊచకు ఆయిల్ రాసి దింపుతానని అనడం షాకింగ్. పక్కనే ఉన్న వర్షిణి మరింత అసహ్యంగా.. 'నేనేతై కనిపించకుండా పోతుంది' అనేసింది. ముఖేశ్ అయితే 'పుష్ అండ్ పుల్' అని సైగలు చేశాడు. ఈ వ్యవహారం మొత్తం గిఫ్ట్ వీడియో రూపంలో త్రిగుణ్‌కి చూపించారు.ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే రోహిత్-వర్షిణి-ముకేశ్ కంపరం పుట్టేంత దారుణంగా మాట్లాడితే వాళ్లని అందరిముందు తిట్టాల్సింది పోయి.. సదరు తతంగాన్ని వీడియో రూపంలో త్రిగుణ్‌కి ఎందుకు చూపించారు? అంటే సదరు మాటల్ని చూపించి పొగపెట్టి, తద్వారా వివాదాన్ని రేపి దాన్ని టీఆర్పీ చేసుకుందామని బిగ్‌బాస్ టీమ్ అనుకుంటోందా?ఒకవేళ ఇవే మాటలు.. ఓ అమ్మాయి గురించి అని ఉంటే షో ఆగిపోయేది. ఆగాలి కూడా. కానీ ఇక్కడ బాధితుడు మగవాడు కాబట్టి.. గిఫ్ట్ వీడియో అని చూపించి ముందుకెళ్లిపోయారు. 'మగాడు కదా తట్టుకుంటాడు' అనే ఆలోచన ఎంతవరకు కరెక్ట్? మగవాళ్ల మీద హింస, లైంగిక బెదిరింపులు కూడా వేధింపులేగా!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా)బిగ్‌బాస్ షోని చాలామంది తమ పిల్లలతో కలిసి చూస్తుంటారు. రోహిత్ లాంటి వ్యక్తులు సైకోల్లా ప్రవర్తించి, మట్లాడే ఇలాంటి మాటల వల్ల ఫ్యామిలీ ప్రేక్షకులకు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో బిగ్‌బాస్ టీమ్ సమాధానం చెప్పాలి. ఇప్పటికే షోని బ్యాన్ చేయాలని కొందరు ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ల వాదనకు రోహిత్ చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. బిగ్‌బాస్ షోపై ఇప్పటికే నెగిటివిటీ ఉంది. ఇలాంటి మాటలు, ప్రవర్తనతో అది మరింత దిగజారిపోతోంది.ఈ వారం ఝాన్సీతో పాటు రోహిత్ కూడా ఎలిమినేట్ అయ్యాడని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం సరైన పనే చేశారు. ఎందుకంటే త్రిగుణ్ గురించే కాదు దేబ్జానీ గురించి ఓ సందర్భంలో మాట్లాడిన రోహిత్.. ఆమె జుట్టు పట్టి లాగుతా అన్నట్లు సైగలు చేశాడు. తనతో పోటీపడే అమ్మాయిని ఈడ్చి కొట్టాలనే మాటలు.. ఇలాంటి వాటి ద్వారా నిర్వాహకులు ఏం చెబుదామనుకుంటున్నారు? మగవాడితో పోటీపడితే అమ్మాయికి దెబ్బలే సమాధానమా? (ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా) -
నల్లగా.. చండాలంగా ఉన్నా పర్లేదు.. పెళ్లి చేసుకుంటా: బిగ్‌బాస్ అశ్విని శ్రీ
బిగ్‌బాస్ షో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అశ్విని శ్రీ. తన అందంతో పాటు ఆటతోనూ రియాలి షోలో అదరగొట్టింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. 2వ వారం వరకు హౌస్‌లో కొనసాగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటోంది. సోషల్ మీడియాలో డబ్స్మాష్, రీల్స్‌తో ఫేమ్ తెచ్చుకున్న అశ్విని శ్రీ తెలుగులో పలు సినిమాల్లోనూ నటించారు. స్టార్ హీరోల చిత్రాల్లోనూ చిన్న చిన్న పాత్రలతో అలరించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయేవాడి గురించి మనసు విప్పి మాట్లాడింది. నిన్ను చేసుకునేవాడు ఎలా ఉండాలని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బిగ్‌బాస్ బ్యూటీ స్పందించింది. తనకు కాబోయే భర్త గ్లామర్ ఎలా ఉన్న పర్లేదని తెలిపింది. వాడు నల్లగా ఉన్నా.. చండాలంగా ఉన్నా నాకు ఓకే.. కానీ మంచి మనసు ఉంటే చాలని తన మనసులో మాట చెప్పింది. నాకు అతని డబ్బులు కూడా అవసరం లేదని వెల్లడించింది.తనకు ప్రస్తుతానికి బాయ్‌ఫ్రెండ్ లేడని.. చాలామంది ట్రై చేస్తున్నారని.. కానీ మనకు కూడా నచ్చాలి కదా అని వెల్లడించింది. ఈ రోజుల్లో అమ్మాయిలను వెంటపడని అబ్బాయిలు ఎవరు ఉంటారని తెలిపింది. నాలాంటి అందమైన అమ్మాయికి ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుందని పేర్కొంది. నన్ను బాగా చూసుకునే వాడు దొరికితే చాలని.. అతన్ని నేనే పోషిస్తానని అశ్విని శ్రీ చెబుతోంది. ఈ వీడియో పాతది కాగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
బిగ్‌బాస్ 10: గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావ్.. ఎమోషనల్ ఎలిమినేషన్
రూమర్స్ వచ్చినట్లే రైతుబిడ్డ ఝాన్సీ ఎలిమినేట్ అయింది. రెడ్ లెవల్లోనే ఉండిపోయిన ఈమె.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా మొదటగా హౌస్ నుంచి బయటకొచ్చేసింది. ఈమె వచ్చేస్తున్నప్పుడు ముకేశ్ తెగ ఎమోషనల్ అయిపోయాడు. ఇంతకీ బిగ్‌బాస్ హౌస్‌లో 55వ రోజైన శనివారం(అక్టోబర్ 31) ఏం జరిగింది?(ఇదీ చదవండి: మరో వివాదంలో 'ఇరుముడి'.. తెలంగాణ కార్మికశాఖ నోటీసులు)నాగ్ ఎంట్రీ తర్వాత శుక్రవారం రాత్రి జరిగింది స్క్రీన్‌పై చూపించారు. మనలో ఎవరు కెప్టెన్ అయినాసరే త్రిగుణ్‌కి చుక్కలు చూపించాలి. స్కేల్‌కి నూనె రాసి చితక్కొట్టాలని దారుణంగా మాట్లాడుకున్నారు. టీవీలోకి వచ్చిన నాగ్.. ఇంటి సభ్యులతో మాట్లాడటం మొదలుపెడతాడు. సుధీర్‌తో మీ వాళ్లు నిన్ను కాపాడారు కంగ్రాట్స్ అని చెప్పి నీ ఆట బాగుపడాలి అని జీరో స్టార్ ఇచ్చాడు. తర్వాత ఝాన్సీని నిలబెట్టి.. ఈ వారం నీ ఆట కనిపించలేదమ్మా, పవర్ వాడావు కదా మనస్ఫూర్తిగా వాడావా అని అంటే మనస్ఫూర్తిగా వాడాను అని చెప్పింది. నరేశ్‌తో ఫౌల్ గేమ్ ఆడావు. ఇలా అయితే రెడ్ నుంచి బయటకు వచ్చేది ఎప్పుడు? అని వీడియో చూపించి మరీ నాగ్ సీరియస్ అయ్యాడు.రామకృష్ణ ఆట కూడా బాగోలేదని చెప్పి జీరో స్టార్ ఇచ్చాడు.నీతూతో ఒక వారం బాగా ఆడావు. ఈ వారం మరేం లేదు. కోచ్ పని మానేసి అంపైర్‌గా తయారయ్యావ్ అని ఈమెకి కూడా నాగ్ జీరో స్టార్ ఇచ్చారు. రాంప్రసాద్ ఆట చాలా బాగుందని చెప్పి ఫైవ్ స్టార్ట్‌లో రాంప్రసాద్‌కి ఇచ్చారు. నరేశ్ నీ ఆట కూడా బాగుంది. నువ్వు స్టార్స్ దక్కించుకున్నా లేకున్నా నువ్వు ఫైవ్ స్టార్‌నే. నువ్వు చెప్పిన వాటిలో 10 శాతం ముకేశ్ ఫాలో అయినా తన గేమ్ ఆ రేంజ్లో ఉండేదని అన్నాడు. వర్షిణికి త్రీ స్టార్ ఇచ్చాడు. ఇక త్రిగుణ్ గురించి మాట్లాడుకున్న సంగతి గుర్తుచేసుకున్న నాగార్జున.. పీ అంటే ఏంటి వర్షిణి? అని అడిగాడు. గుర్తు లేదు అని వర్షిణి అంటే నరేశ్‌కి వర్షిణి చేతి మీద రాయమని చెప్పాడు. సుధీర్‌ని నిలబెట్టి బీ అంటే ఏంటి అని నాగ్ అడిగాడు. జోకర్ అన్నట్లు సార్ అంటే బీ అంటే జోకర్ ఎలా అవుతుంది అని ప్రశ్నించాడు. తర్వాత ఝాన్సీని నిలబెట్టి ఇదే ప్రశ్న అడిగాడు. వీడియో ఇక్కడ ప్లే చేయాలా కన్ఫెషన్ రూంలో వేయాలా అని అడిగితే వర్షిణి సీక్రెట్‌గా ప్లే చేయమని చెప్పింది. కానీ నాగ్ అందరి ముందు ప్లే చేశారు. ఈ వీడియో గురించి చెప్పడానికే మీకు ఇలా ఉంటే చూసేవాళ్లకు ఎలా ఉంటుందని త్రీ స్టార్‌లో ఉన్న వర్షిణిని జీరో స్టార్‌లో పెట్టారు.(ఇదీ చదవండి: ఓటీటీలో కీర్తి సురేశ్ ‘అక్క’ రివ్యూ)శ్వేతకి మూడు స్టార్స్‌లో పెట్టి ఇంకా బాగుండాలి అని.. శివ్‌కి మూడు స్టార్స్ ఇచ్చి గ్రీన్‌లోకి ఎందుకు రాలేదు అంటే నాకు నామినేషన్లోకి రావాలని అనిపించింది.. గోట్ అవ్వడం కంటే జనాలకు శివ్ అనే వాడు ఒకడు ఉన్నాడని అనిపించుకోవాలని చెప్పాడు. దీంతో బాగా ఆడుతున్నావని నాగ్ చెప్పాడు. ఇక బ్రేక్ టైంలో బీ అంటే బఫూన్స్, పీ అంటే పపెట్స్ అని రోహిత్ అండ్ కో మాట్లాడుకున్నారు. నాగ్ వచ్చి బీ, పీ అంటే మీనింగ్స్ ఇవే అయితే ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగారు.వంశీ ఆట బాగుందని చెప్పిన నాగ్.. దేబ్జానీకి నీ ఆటకి ఫైవ్ స్టార్ కానీ అల్టిమేట్ గోట్ కోసం నీ కష్టం సరిపోలేదు అందుకే మూడు స్టార్లు అని అన్నాడు. రోహిత్‌ని మొదటి 5 స్టార్స్‌లో పెట్టి ఈట్ 5 స్టార్ డూ నథింగ్ అని నాగ్ అన్నాడు. తర్వాత 3 స్టార్స్ ఇచ్చాడు. ఆడియన్స్ నిన్ను 5 స్టార్‌లో ఆడుతావ్ అనుకుంటే అంతగా ఆడటం లేదని చెప్పి వీడియో చూపించి వర్షిణి, రోహిత్ మధ్య ఏదో జరిగిందని అన్నాడు. నువ్వు ఎందుకు ఎల్లోలోకి రాలేదు అంటే మా వాళ్లకి గ్రీన్‌లో పెట్టుకోవాలని ప్రయత్నించా అని చెప్పాడు. ఇప్పటికీ నువ్వు రెడ్‌లో ఉన్నావ్ కదా అని నాగ్ అంటే.. మా వాళ్లు నన్ను కాపాడుతారని అన్నాడు. అమన్‌ని 5 స్టార్స్‌లో పెట్టి ఆట చాలా బాగుందని నాగ్ మెచ్చుకున్నాడు. త్రిగుణ్‌ని అల్టిమేట్ గోట్ అని పొగిడి గేమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాగా ఆడుతున్నావ్. అందరూ సపోర్ట్ చేశారు. అనంతరం ఇతడిని సీక్రెట్ గదిలోకి పిలిచి రోహిత్ తనని తిట్టి స్కేల్‌కి ఆయిల్ రాసి కొడతా అన్న విషయం వీడియో చూపిస్తారు. తర్వాత వర్షిణి, ముకేశ్, సుధీర్లతో త్రిగుణ్ వీక్నెస్ నాకు తెలుసు. వాడిని నేను దెబ్బకొడితే లేవలేడు అని చెప్పడం, త్రిగుణ్‌ని ఇబ్బంది పెట్టు అని సుధీర్.. ముకేశ్‌తో చెప్పడం అన్నీ చూపిస్తారు.నాగ్ అందర్నీ గార్డెన్ ఏరియాలోకి పిలిచి నామినేషన్లలో ఉన్న వారితో పాటు రెడ్ జోన్లో ఉన్న ఐదుగురైన ఝాన్సీ, రోహిత్, రాంప్రసాద్, శివ్, వంశీలలో ఒకరు ఓట్ల ప్రకారం మరోకరు బిగ్‌బాస్ ప్రకారం ఎలిమినేట్ అవుతారని చెప్పి మిగతా వాళ్లతో కుండలు పగలగొట్టించి ఎవరికి తక్కువ సేఫ్‌లు వస్తే వాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్పాడు. ఐదుగురికి మూడు మూడు సేఫ్‌లు వస్తాయి. తర్వాత నాగ్.. అల్టిమేట్ గోట్ త్రిగుణ్‌ని యాక్టివిటీ ఏరియాకి పంపి అక్కడున్న నాలుగు కుండలు పగలగొట్టి ఎవరు సేఫ్ చెప్పమన్నాడు. రామకృష్ణ, వంశీ, రోహిత్, శివ్ సేఫ్ అయి ఝాన్సీ ఎలిమినేట్ అయింది. సుధీర్ తాను వెళ్లిపోతా.. ఝాన్సీని ఉంచమని నాగ్ని బ్రతిమలాడాడు. ముకేశ్, ఝాన్సీ కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత ఝాన్సీని పట్టుకొని తనతో క్లోజ్‌గా ఉండే.. త్రిగుణ్, అమన్, రోహిత్ అందరూ ఏడుస్తారు. నీ కల సాధిస్తావ్ మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావ్ ముకేశ్.. ఝాన్సీతో అన్నాడు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: షాకింగ్.. రోహిత్ ఎలిమినేట్) -
బిగ్‌బాస్ 10: షాకింగ్.. రోహిత్ ఎలిమినేట్
బిగ్‌బాస్ 10వ సీజన్ నుంచి రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. గతవారం డబుల్ ఎలిమినేషన్ జరగ్గా షాలిని, దక్షి ఔట్ అయ్యారు. ఈసారి కూడా అలానే ఉండబోతుందని టాక్ వినిపించింది. ఇప్పుడు అదే నిజమైంది. రైతుబిడ్డతో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయిన రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. షోలో ఇది టెలికాస్ట్ కాకముందే ఇతడి టీమ్ ఈ న్యూస్ బయటపెట్టేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. క్రేజీ కాన్సెప్ట్)ఈసారి రైతుబిడ్డ ఝాన్సీ ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. అయితే హౌస్మేట్స్ ఓటింగ్‌తో రెడ్ లెవల్లో ఉన్న రోహిత్‌ని కూడా బయటకు పంపించేశారు. సాధారణంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ని ఎలిమినేట్ చేస్తున్నట్లు చెప్పి సీక్రెట్ రూంలో ఉంచుతుంటారు. రోహిత్‌ని అలానే చేస్తారేమో అనుకున్నారు. కానీ హోస్ట్ నాగార్జున అలాంటి ఆప్షన్ ఇవ్వకుండా డైరెక్ట్ ఎలిమినేట్ చేసి పంపిచేశారని తెలుస్తోంది.రోహిత్ పేరుకే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గానీ గేమ్స్ పరంగా పెద్దగా ఆడింది లేదు. షాలినితో లవ్ ట్రాక్ నడపడం, త్రిగుణ్‌తో ప్రతిదానికి గొడవ పడటం తప్పితే వేరేగా చేసింది అయితే ఏం లేదు. బిగ్‌బాస్ కూడా తనని ఏం చేయలేడన్నట్లు యాటిట్యూడ్ చూపించాడు. ఇప్పుడదే ఇతడికి పెద్ద మైనస్ అయింది. సడన్ షాకిచ్చిన బిగ్‌బాస్.. ఎలిమినేట్ చేసి బయటకు పంపించేశాడు. అయితే ఇది ఊహించని రోహిత్ సోషల్ మీడియా టీమ్.. టెలికాస్ట్ కావడానికి ముందే ట్విటర్లో పోస్ట్ పెట్టేశారు. 'బ్యాన్ బిగ్‌బాస్' అని కూడా రాసుకొచ్చారు. మళ్లీ ఏమైందో ఏమో సదరు ట్వీట్ డిలీట్ చేసి ఇన్ స్టా స్టోరీలో మాత్రం కోపాన్ని బయటపెట్టారు.టాప్-3లో ఉంటాడనుకున్న రోహిత్.. ఇలా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోవడం బిగ్‌బాస్ ప్రేక్షకులకు నిజంగా షాకింగే అని చెప్పొచ్చు. రోహిత్ వెళ్లిపోయాడు కాబట్టి హౌస్‌లో టాప్‌కి ఎవరెళ్తారు? వచ్చే వారం నుంచి ఏం జరుగుతుందనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి కీర్తి సురేశ్ ‘అక్క’ రివ్యూ)💔💔💔💔💔💔 #BiggBossTelugu10— Rohit Naidu Patnam (@RohitNaiduPatnm) October 31, 2026 -
బిగ్‌బాస్‌లో బిగ్ ట్విస్ట్.. రైతుబిడ్డ ఎలిమినేట్..?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎలిమినేషన్ల ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది. సాధారణంగా ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా కంటెస్టెంట్ల ఎలిమినేషన్ జరుగుతుంది. అయితే ఈ సీజన్లో మాత్రం ప్రేక్షకుల ఓట్లతో పాటు హౌస్మేట్స్ ఓటింగ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో ఎలిమినేషన్ ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ వారం కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తూ సుధీర్‌ను ఎలిమినేట్ అయ్యాడు. అయితే అతడు ఇంకా హౌస్‌లోనే కొనసాగుతుండటానికి ముకేష్ కారణమనే చెప్పాలి.ఝాన్సీ పవర్‌ను వదులుకునేలాముకేష్కు లభించిన సూపర్ పవర్ నేరుగా ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇవ్వకపోయినా.. ఝాన్సీ దగ్గర ఉన్న సేవింగ్ పవర్‌ను తీసుకునే అవకాశం కల్పించింది. దీంతో ముకేష్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, సుధీర్ కోసం ఝాన్సీ తన పవర్‌ను వదులుకునేలా చేశాడు. ఆ పవర్ ఝాన్సీ దగ్గరే ఉండి ఉంటే.. ఎలిమినేషన్ నుంచి తనను తాను కాపాడుకోవడంతో పాటు మరో కంటెస్టెంట్‌ను కూడా సేవ్ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.ఇదిలా ఉంటే.. ఈ వారం సడన్ ఎలిమినేషన్‌తో పాటు మరో ఎలిమినేషన్ కూడా ఉంటుందని ముందుగానే చెప్పారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఝాన్సీ ఎలిమినేషన్ అయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు విడుదలైన ప్రోమోలో నాగార్జున ఆమె ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కనిపించింది. స్టార్ పాయింట్స్ విషయంలోనూ ఝాన్సీకి అనుకూలమైన స్పందన రాలేదు. ఝాన్సీ ఎలిమినేషన్మరోవైపు నరేశ్, రాంప్రసాద్ ఐదు స్టార్ పాయింట్స్ అందుకోగా.. స్టార్ పాయింట్స్ లేని కంటెస్టెంట్లలో ఝాన్సీ, సుధీర్, నీతూ మాస్టర్ ఉన్నట్లు ప్రోమోలో చూపించారు. దీంతో ఝాన్సీకి ఈ వారం గండం తప్పదా? ముకేష్ తీసుకున్న నిర్ణయం ఆమెకు శాపంగా మారిందా? అనే చర్చ మొదలైంది. అయితే ఝాన్సీ ఎలిమినేషన్‌పై వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.(ఇదీ చదవండి: భార్య విడాకులిచ్చినా ప్రేమించాడు.. సంజయ్ గుప్తా లవ్‌స్టోరీ..) -
బిగ్‌బాస్ 10: సడన్ ఎలిమినేషన్.. రోహిత్ ఓవరాక్షన్
రెడ్ లెవల్లో ఉన్నోళ్లు సూట్ కేసులు సర్దుకోండి. సడన్ ఎలిమినేషన్ అని చెప్పి బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అలానే అల్టిమేట్ గోట్ అయిన త్రిగుణ్.. అదిరిపోయే అద్భుతమైన అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంతకీ హౌస్‌లో 54వ రోజైన శుక్రవారం(అక్టోబర్ 30) అసలేం జరిగిందనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)గ్రీన్ లెవల్ సభ్యులకు కెప్టెన్సీ టాస్క్ పెట్టారు. గ్రీన్ లెవల్లోనే అమన్ ఉన్నప్పటికీ నాగార్జున పనిష్మెంట్ ఇవ్వడంతో ఇతడికి పోటీలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. దీంతో కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇకపోతే కెప్టెన్సీ టాస్క్‌లో పోటీపడేవాళ్లు ముగ్గుర్ని సపోర్టర్స్‌గా ఎంచుకోవాలి. కంటెండర్స్ ఒక బంతిని స్టిక్‌పై పెట్టుకొని తీసుకెళ్లి సపోర్టర్స్లో ఒకరికి ఇవ్వాలి. అక్కడ బోర్డ్–బాల్ గేమ్‌లో వేయాలి. బంతి పడిన దాంట్లో ఉన్న సూచనలు బట్టి సపోర్టర్స్ కంటెండర్స్ కటౌట్స్ని కదపాలి. ఎవరి కటౌట్ ముందుకు వెళ్తే వాళ్లు గెలిచినట్లు. ఈ పోటీలో గెలిస్తే బిగ్‌బాస్‌లో ఉన్నంతకాలం కెప్టెన్సీ రేసులో నేరుగా పోటీ చేయొచ్చని బిగ్‌బాస్ ప్రకటించాడు.ఇక సపోర్టర్స్ కోసం చాలాసేపు చర్చలు జరిగాయి. అమన్.. త్రిగుణ్ గెలవాలని కోరుకున్నాడు. అమన్ సపోర్టర్‌గా కావాలని త్రిగుణ్ అనగానే రోహిత్, ముకేశ్ వద్దని గొడవ పడ్డారు. నీ అంత కన్నింగ్ అని లేరని అమన్, రోహిత్ కూడా వాదించుకున్నారు. దాంతో అమన్ కూడా ఫైర్ అయ్యాడు. చివరికి ఓటింగ్ ద్వారా అమన్నే ఖరారు చేశారు. అమన్, వంశీ, శివ సపోర్టర్స్‌గా నిలబడ్డారు. రోహిత్ ఈ టాస్క్‌కి సంచాలక్‌గా వ్యవహరించాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా)ఈ పోటీలో చివరకు గెలిచిన త్రిగుణ్.. అల్టిమేట్ గోట్గా నిలిచి కెప్టెన్ అయ్యాడు. ఇదలా ఉండగానే రెడ్ లెవల్లో ఉన్నవాళ్లకు ఎలిమినేషన్ ఉంటుందని బిగ్‌బాస్ సడన్ ట్విస్ట్ ఇచ్చాడు. సూట్ కేసులు పంపించి బట్టలు సర్దుకోమని చెప్పాడు. ఝాన్సీ, శ్వేత, రామకృష్ణ, రోహిత్, సుధీర్.. వీళ్ళలో ఎవర్ని పంపాలనుకుంటున్నారో వాళ్ళ తలపై ఒక బాటిల్ కొట్టి ఎందుకో రీజన్ చెప్పాలని గ్రీన్ వాళ్లకు బిగ్‌బాస్ ఆదేశించాడు. రాంప్రసాద్ – రోహిత్, వర్షిణి – రామకృష్ణ , నీతూ – రామకృష్ణ , దేబ్జానీ – రోహిత్ , అమన్ – సుధీర్, ముకేశ్ – రామకృష్ణ, త్రిగుణ్– రోహిత్ తలపై బాటిల్స్ పగలగొట్టారు. మిగతావాళ్లు ఏం మాట్లాడకపోయినా రోహిత్ మాత్రం త్రిగుణ్‌పై అరవడం మొదలుపెట్టాడు. నిన్ను తొక్కుకుంటూ పైకి వెళ్తాను, నువ్వు లక్కుతో గెలుస్తున్నావు, నిన్ను రానివ్వను అని ఓవరాక్షన్ చేస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు.ఇక గ్రీన్ వాళ్ళు ఓటింగ్‌లో రామకృష్ణకు ఎక్కువ ఓట్లు పడ్డప్పటికీ.. ప్రేక్షకుల ఓటింగ్ కారణంగా సుధీర్ ఎలిమినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఇంతలో ముకేశ్ తన మ్యాజిక్ పవర్ వాడతానని చెప్పడంతో బిగ్‌బాస్ ఆ బాక్స్ ఇచ్చాడు. ఎవరైనా పవర్ వాడేస్తే దాన్ని మరోసారి ఉపయోగించుకునేలా చేయొచ్చనేది ముకేశ్‌కి ఉన్న పవర్. దాంతో ఝాన్సీ ఎలిమినేషన్ ఫ్రీ పవర్ తిరిగి తెప్పించాడు. ఝాన్సీ.. సుధీర్ కోసం తన పవర్ ఉపయోగించి ఎలిమినేషన్ నుంచి తప్పించింది. ఇలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కుటుంబంలో విషాదం) -
బిగ్‌బాస్ 10: వాళ్లిద్దరూ సేవ్ అయిపోయారు
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం హోటల్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగానే మైండ్ గేమ్ కూడా కనిపించింది. అలా చివరకు సాగిన ఈ పోటీలో ఇద్దరు కంటెస్టెంట్స్ నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు. ఇంతకీ ఎవరా ఇద్దరూ? 53వ రోజైన గురువారం(అక్టోబర్ 29) నాడు ఏం జరిగిందనేది చూద్దాం?(ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' ట్విటర్ రివ్యూ)రోహిత్.. ముకేశ్ టీంలో కలిసిపోయాడు. నీకు స్టార్ ఇస్తా, వంశీని బీట్ చేసేలా నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలని వర్షిణితో రోహిత్ అన్నాడు. త్రిగుణ్‌తో డీల్స్ పెట్టుకుంటే నీకు సపోర్ట్ చేయనని కండీషన్ పెట్టాడు. మరోవైపు రెండు వేలకు తన స్టార్‌ని అమన్‌కి రోహిత్ ఇచ్చేశాడు. శివ, రాంప్రసాద్ దగ్గరకు వెళ్లి వర్షిణి గురించి మాట్లాడాడు. ముకేశ్.. వర్షిణిని గ్రీన్‌లోకి తేవాలని రోహిత్‌ని ఎల్లోలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడని శివ్ చెప్పాడు. ఆ రెండూ జరగవని రాంప్రసాద్ అన్నాడు. మీరే గ్రీన్‌లోకి రావాలి, వర్షిణి గ్రీన్‌లోకి రోహిత్ ఎల్లోలోకి రావడానికి వీల్లేదన్నాడు.బీబీ హోటల్ టాస్క్ అలా సాగుతుండగానే బిగ్‌బాస్.. ఒక పాము-నిచ్చెన ఛాలెంజ్ ఇచ్చాడు. ఇది ఆడటానికి ఒక ఓనర్, ఇద్దరు వర్కర్స్ ఉండేలా రెండు టీమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. గెస్టులందరూ డైస్ రోల్ చేసే ప్లేయర్స్‌గా పాల్గొనాలి. డైస్ రోల్ చేసినప్పుడు ఏ నంబర్ వస్తుందో, అదే నంబర్ పెద్ద డైస్పైకి తీసుకురావాలి. అందుకోసం పెద్ద డైస్ లోపల ఉన్న ఓనర్స్ దాన్ని లోపలి నుంచి తోస్తూ సరైన నంబర్ పైకి వచ్చేలా చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. ఈ గేమ్‌లో శివ్ తరఫున పిక్కలలా రామకృష్ణ (బ్లూ), శ్వేత (గ్రీన్) ఆడితే రాంప్రసాద్ తరఫున వంశీ (ఎల్లో), సుధీర్ (రెడ్) కలర్ పిక్కలలా ఆడారు. ఈ టాస్క్‌లో రాంప్రసాద్ గెలిచాడు. ఇతడికి డబ్బులు స్టార్ రావడంతో స్టార్ తీసుకొని శివ్‌కి డబ్బులు ఇచ్చాడు.ఇంటి సభ్యులకు ఫైనల్ డీలింగ్ చేసుకోమని బిగ్‌బాస్ చెప్పగా... నాకు వాళ్ల మీద నెగిటివ్ వస్తుంది అందుకే మీకు స్టార్ ఇస్తున్నాని శివ్, రాంప్రసాద్‌తో అన్నాడు. అమన్ కూడా రాంప్రసాద్‌కి స్టార్ ఇచ్చాడు. చివరగా ఎవరి దగ్గర ఎంత క్యాష్, స్టార్స్ ఉన్నాయో చెప్పమని బిగ్‌బాస్ అడగ్గా.. వంశీ తన దగ్గర రూ.45 వేలు ఉందని చెప్పాడు. శ్వేత దగ్గర జీరో క్యాష్, జీరో స్టార్స్.. రామకృష్ణ దగ్గర రూ.300 క్యాష్.. సుధీర్ దగ్గర జీరో క్యాష్.. రోహిత్ దగ్గర జీరో స్టార్స్ రూ.30,500 క్యాష్.. వర్షిణి దగ్గర మూడు పింక్ స్టార్స్, ఒక గోల్డ్ స్టార్.. శివ్ దగ్గర జీరో స్టార్స్.. రాంప్రసాద్ దగ్గర ఏకంగా ఏడు పింక్ స్టార్స్, ఒక గోల్డ్ స్టార్ ఉన్నాయని చెప్పారు.స్టార్స్ ఉన్న ఇద్దరు సభ్యులు రాంప్రసాద్, వర్షిణి ఎల్లో లెవెల్ నుంచి గ్రీన్ లెవెల్‌కు చేరుకొని గోట్స్ అయ్యారు. తద్వారా నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు. వంశీ రెడ్ నుంచి ఎల్లో లెవల్‌కి వచ్చాడు. అలా గురువారం ఎపిసోడ్ పెద్దగా మెరుపుల్లేకుండానే పూర్తయింది. ఇక రోహిత్ మిగతా గొడవల్లో తప్పితే ఈ గేమ్‌లో పెద్దగా మెప్పించలేకపోయాడు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు) -
వర్షిణి, ముకేశ్ లిప్ సీన్.. రూ.300లకు కొన్న రోహిత్! కానీ..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకీ ఆసక్తికరంగా సాగుతోంది. హౌస్మేట్స్ మధ్య గొడవలు, సరికొత్త టాస్క్‌లు, అనూహ్య పరిణామాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హౌస్‌లో హోటల్ టాస్క్‌ను ప్రారంభించాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా కంటెస్టెంట్లకు వేర్వేరు పాత్రలను అప్పగించాడు. ఈ టాస్క్‌లో ఎవరు ఎలా ఆడారు? ఎవరికి లాభం చేకూరింది? అసలు హౌస్‌లో ఏం జరిగిందంటే..మూడు రకాల బాధ్యతలుబిగ్బాస్ హౌస్‌లో ప్రారంభమైన హోటల్ టాస్క్‌లో కంటెస్టెంట్లను మూడు బృందాలుగా విభజించారు. ఎల్లో లెవల్లో ఉన్నవారు హోటల్ ఓనర్లుగా, రెడ్ లెవల్లో ఉన్నవారు వర్కర్లుగా, గ్రీన్ లెవల్లో ఉన్నవారు అతిథులుగా వ్యవహరించాలి. అతిథులకు డబ్బుతో పాటు స్టార్స్ కూడా అందించారు. హోటల్ సిబ్బంది అందించే సేవలు నచ్చితే వారికి డబ్బులు ఇవ్వొచ్చు. ఓనర్లు ఇచ్చే ఆతిథ్యం నచ్చితే స్టార్స్ అందించవచ్చు.ఓనర్లుగా ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున కేటాయించారు. ఈ డబ్బుతో వర్కర్లను పనుల్లో నియమించుకొని, అతిథులను మెప్పించి ఎక్కువ స్టార్స్ సంపాదించాలి. మరోవైపు వర్కర్లు ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఎల్లో లెవల్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. అలా పైస్థాయికి చేరుకున్నవారికి డబుల్ ఎలిమినేషన్ ముప్పు తప్పుతుంది. ఇక ఓనర్లలో అత్యధిక స్టార్స్ సంపాదించినవారు గ్రీన్ లెవల్‌కు చేరుకొని ఈ వారం ఎలిమినేషన్ నుంచి రక్షణ పొందుతారు.హోటల్లో ఆసక్తికర పాత్రలుఈ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్లకు ప్రత్యేకమైన పాత్రలను ఇచ్చాడు బిగ్‌బాస్. దేబ్జానీని ప్రతిదానిలోనూ పర్ఫెక్షన్ కోరుకునే ధనవంతురాలిగా చూపించారు. హోటల్లో సేవలు తనకు నచ్చినట్లు లేకపోతే ఆమె అస్సలు ఒప్పుకోదు. ఆమె ప్రియుడిగా ముకేశ్ పాత్రను పోషించాడు. అతడొక స్ట్రగ్లింగ్ ఫుడ్ బ్లాగర్. పైగా విపరీతమైన మతిమరుపు ఉన్న వ్యక్తి. వీరిద్దరూ తమ పెళ్లి ఏర్పాట్లలో భాగంగా హోటల్‌కు వచ్చినట్లు టాస్క్‌లో చూపించారు.హోటల్లో ఆతిథ్యం నచ్చితే తమ పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని భావిస్తారు. మరోవైపు నీతూను గాసిప్స్ ఇష్టపడే వ్యక్తిగా, త్రిగుణ్‌ను ఎదగాలని ప్రయత్నించే కొత్త డాన్‌గా పరిచయం చేశారు. అమన్ అతడికి సన్నిహితుడిగా, సహాయకుడిగా వ్యవహరించాలి. ప్రేమ విషయంలో అదృష్టం కలిసిరాని వ్యక్తిగా అమన్ పాత్రను రూపొందించారు. రోహిత్, శ్వేత, సుధీర్ హౌస్‌కీపింగ్, వెయిటర్ బాధ్యతలు చేపట్టగా.. రామకృష్ణ, ఝాన్సీ వంటవాళ్లుగా వ్యవహరించారు. వంశీకి ఇతర కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.(ఇదీ చదవండి: భర్త ముందే బోల్డ్ సీన్స్.. అసలు ఎలా చేశారు?)వర్షిణితో అమన్ లవ్ ట్రాక్..టాస్క్ కొనసాగుతున్న కొద్దీ కంటెస్టెంట్లు తమకు అనుకూలంగా ఆటను మలుచుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వర్షిణి, అమన్ లవ్ ట్రాక్ మొదలుపెట్టడం.. మరోవైపు ముకేశ్‌తో దేబ్జానీ మధ్య గొడవ రావడం వల్ల బ్రేకప్ అవుతుంది.దీంతో దేబ్జానీ భావోద్వేగానికి గురై ఏడ్చింది. దీంతో హౌస్‌లో కొంతసేపు గందరగోళం నెలకొంది.ఇంతలో బిగ్‌బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ముకేశ్, వర్షిణి ముద్దు పెట్టుకున్న ఫొటోను హౌస్‌లోకి పంపించాడు. ఆ ఫొటోను చూసిన రోహిత్.. ముకేశ్‌తో బేరం కుదుర్చుకొని రూ.300 తీసుకుని అతడికి ఫొటో ఇచ్చేశాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ ఆ ఫొటోలను స్క్రీన్‌పై ప్రదర్శించడంతో దేబ్జానీ, అమన్ తీవ్రంగా స్పందించారు. దీంతో హౌస్‌లో మరోసారి వాడివేడి వాతావరణం కనిపించింది.స్టార్స్ కోసం కంటెస్టెంట్ల ఎత్తులుమరోవైపు తమకు అనుకూలంగా స్టార్స్ సంపాదించుకునేందుకు కొందరు కంటెస్టెంట్లు ప్రయత్నించారు. నీతూ, త్రిగుణ్, అమన్ కలిసి రూ.4 వేల డబ్బును తీసుకొని తమ స్టార్స్‌ను రాంప్రసాద్, శివలకు ఇచ్చినట్లు చూపించారు. ఈ క్రమంలో త్రిగుణ్.. నరేశ్‌ను కూడా దేబ్జానీ దగ్గరకు వెళ్లి స్టార్ అడగాలని సూచించాడు. అయితే దేబ్జానీ నరేశ్‌కు స్టార్ ఇచ్చేందుకు అంగీకరించినా.. సుధీర్, ఝాన్సీలకు మాత్రం ఇవ్వొద్దని షరతు పెట్టింది.వర్షిణి, రోహిత్ విజయంఓనర్లు, వర్కర్ల మధ్య సమన్వయం ఎలా ఉందో తెలుసుకునేందుకు బిగ్‌బాస్ మరో ఆటను పెట్టాడు. దీనికి కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ టాస్క్‌గా పేరు పెట్టాడు. ఇందులో ఓనర్ల నుంచి ఒకరు, వర్కర్ల నుంచి మరొకరు జంటగా ఆడాలి. ఒకరు బొమ్మలను చూసి సైగల ద్వారా వివరించాలి. మరొకరు ఆ సంకేతాలను అర్థం చేసుకొని బోర్డుపై వాటిని సరైన క్రమంలో అమర్చాలి.ఈ పోటీలో ఓనర్ల తరఫున వర్షిణి, నరేశ్ పాల్గొన్నారు. నరేశ్ తన జోడీగా ఝాన్సీని ఎంచుకోగా.. వర్షిణి రోహిత్‌ను ఎంపిక చేసుకుంది. ఈ ఆటకు త్రిగుణ్ సంచాలకుడిగా వ్యవహరించాడు. చివరకు వర్షిణి, రోహిత్ జంట విజయం సాధించింది. ఇలా నిన్నటి ఎపిసోడ్ సాగింది.(ఇదీ చదవండి: అనిరుధ్- కావ్య రిసెప్షన్.. ఒక్కో ఇన్విటేషన్కే అన్ని వేలు ఖర్చా?) -
బిగ్‌బాస్ 10: ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?
ఎనిమిదో వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. గతవారం జరిగిన టాస్క్‌ల్లో గెలిచి గ్రీన్‌లోకి వెళ్లిన గోట్స్కి రెండు వారాలు సేవ్ అయ్యే అవకాశం దొరికింది. దీంతో మిగిలిన వాళ్లలో వాళ్లే నామినేట్ చేసుకున్నారు. అలా ఈసారి మొత్తం ఎనిమిది మంది లిస్టులోకి వచ్చారు. ఇంతకీ బిగ్‌బాస్ 10లో 51వ రోజైన మంగళవారం(అక్టోబర్ 27) అసలేం జరిగింది? అనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు)నిన్న గ్రీన్ కేటగిరీలోని గోట్స్ నామినేషన్స్ చేశారు. అయితే త్రిగుణ్.. వర్షిణిని నామినేట్ చేయడం గురించి ఇద్దరూ బాధపడ్డారు. దీని గురించి చర్చించుకున్నారు. వర్షిణి మాట్లాడుతూ ఇదేనా నువ్వు , నాకు తెలిసిన త్రిగుణ్.. నువ్వు కాదు అని చెప్పింది. అర్ధం చేసుకోవా వర్షిణి అని త్రిగుణ్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. త్రిగుణ్ ఏడుస్తుంటే రోహిత్ ఫుల్‌గా నవ్వుకున్నాడు. మరోవైపు గోట్లో జరిగిన వెయిట్స్ గేమ్ గురించి అందులో ఎవరెవరు ఎలా ఆడారో నరేశ్, రాంప్రసాద్ కామెడీ స్కిట్ చేసి అందరినీ చాలా నవ్వించారు. తర్వాత నామినేషన్స్ ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచి మళ్లీ మొదలైంది. గ్రీన్‌లోని గోట్స్ జడ్జిలుగా ఉండగా.. తొలుత ఎల్లో లెవల్లో ఉన్నవాళ్లలో ముగ్గురికి నామినేషన్ వేసే అవకాశం దక్కింది. ఎవరు నామినేషన్ వేయాలి అని గ్రీన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎల్లో వాళ్ళు ఇద్దర్ని నామినేట్ చేయాలి. వాళ్ళు చెప్పిన కారణాలు విని గ్రీన్ జడ్జిలు ఒకటి ఫైనల్ చేయాలి.తొలుత వచ్చిన నరేశ్.. ఝాన్సీ, వర్షిణిలని నామినేట్ చేశాడు. వర్షిణి గేమ్స్ ఆడట్లేదు. తొందరగా గివ్-అప్ ఇచ్చేస్తుందని కారణాలు చెప్పాడు. దీంతో నాకు సర్జరీ అయిందని వర్షిణి వివరణ ఇచ్చుకుంది. ఎక్కువ ఏడుస్తున్నావు, బాగా ఆడాలని అనుకోవట్లేదని చెప్పి నామినేషన్ చేశాడు. జడ్జిలు వర్షిణిని ఫైనల్ చేశారు. తర్వాత వచ్చిన శివ్.. సుధీర్, వంశీలని నామినేట్ చేశాడు. వంశీ గురించి మాట్లాడుతూ ముకేశ్ గతంలో చేసిన నామినేషన్స్ ఉదాహరణగా చెప్తుంటే ముకేశ్ వచ్చి పెద్ద గొడవ పెట్టుకున్నాడు. కట్ చేస్తే సుధీర్ నామినేషన్‌ని జడ్జిలు ఫైనల్ చేశారు. తర్వాత రాంప్రసాద్ వచ్చాడు. ఇతడు శివ్, శ్వేతలని నామినేట్ చేశాడు. వీళ్లని శివ్ని నామినేట్ చేస్తున్నట్లు జడ్జిలు వెల్లడించారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: డబుల్ ఎలిమినేషన్.. రెమ్యునరేషన్ ఎంతిచ్చారు?)అనంతరం రెడ్ టీమ్‌లో ఉన్నవాళ్లకు ఒకరినే నామినేట్ చేసే అవకాశం లభించింది. అందులో ఎవరో ఒకరిని గ్రీన్ జడ్జిలు ఫైనల్ చేయాలి. తొలుత రోహిత్, రామకృష్ణలని పిలిచారు. రోహిత్.. నరేశ్‌ని, రామకృష్ణ.. వర్షిణిని నామినేట్ చేశాడు. రామకృష్ణ వర్షిణిని చేసిన నామినేషన్‌ని జడ్జిలు ఓకే చేశారు. తర్వాత ఝాన్సీ, శ్వేత వచ్చారు. వరసగా శివ్, ఝాన్సీని నామినేట్ చేశారు. వీరిలో శ్వేత.. ఝాన్సీని చేసిన నామినేషన్ ఫైనల్ చేశారు.ఇలా ఈ రెండు రోజులు జరిగిన నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత చివరగా ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్, రాంప్రసాద్, వర్షిణి, శివ్ నామినేషన్స్‌లో నిలిచారు. శ్వేత, నరేశ్, వంశీ ఈ లిస్టులో లేరు. వీరిలో ఎవరో ఒకరిని గ్రీన్‌లోని గోట్స్ నామినేట్ చేయాలని బిగ్‌బాస్ చెప్పడంతో వంశీ పేరు చెప్పారు. మొత్తంగా ఈ వారం ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్, రాంప్రసాద్, వర్షిణి, శివ్, వంశీ నామినేట్ అయ్యారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: రోహిత్‌తో నువ్వు కూడా అదే ఉద్దేశంతో ఉన్నావా? షాలినికి ఇచ్చిపడేసిన శివాజీ)(ఇదీ చదవండి: ఓటీటీలోకి రాజమౌళి కొడుకు సినిమా.. అధికారిక ప్రకటన) -
వెన్నుపోటు పొడిచిన త్రిగుణ్.. ‘నేను చూసింది నిజమేనా’: వర్షిణి
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ వేడివేడిగా సాగింది. నామినేషన్ల సమయంలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. చిన్న చిన్న వివాదాలు కాస్తా పెద్ద వాదనలకు దారితీశాయి. ఒకరిపై మరొకరు తమ అసంతృప్తిని వ్యక్తం చేసుకుంటూ నామినేషన్లు చేయడంతో హౌస్‌లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా త్రిగుణ్.. వర్షిణిని నామినేట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన ప్రొమోలను ఒకసారి పరిశీలిద్దాం..నన్ను అర్థం చేసుకో వర్షిణిబిగ్బాస్ హౌస్‌లో వర్షిణి, త్రిగుణ్ మధ్య మంచి అనుబంధం ఉందని భావిస్తున్న తరుణంలో.. ఆమెను త్రిగుణ్ నామినేట్ చేయడం ఆసక్తికరంగా మారింది. గతవారం జరిగిన ఆటలో వర్షిణి తనను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిందని, ఆమె చేసిన పొరపాటే తన నామినేషన్‌కు కారణమని త్రిగుణ్ వివరించినట్లు ప్రోమోలో కనిపించింది. ఈ క్రమంలో వర్షిణిని ఉద్దేశించి ‘నన్ను అర్థం చేసుకో వర్షిణి’ అంటూ త్రిగుణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మరో పక్క కుటుంబాన్ని వదిలి ఇంత దూరం వచ్చినట్లు చెబుతున్నట్లు ప్రొమోలో కనిపించింది. మరోవైపు, త్రిగుణ్ మాటలకు వర్షిణి భావోద్వేగానికి గురైంది. ‘ఇది నేను చూసిన త్రిగుణేనా?’ అంటూ ఆమె స్పందించడం ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.రాంప్రసాద్, నరేశ్ కామెడీ సందడిమరోవైపు రాంప్రసాద్, నరేశ్ తమదైన శైలిలో నవ్వులు పూయించారు. హౌస్‌లోని పలువురు కంటెస్టెంట్లను ఇమిటేట్ చేస్తూ..సందడి చేశారు. అయితే, నామినేషన్ల ప్రక్రియలో మరెన్ని గొడవలు చోటుచేసుకున్నాయి? ఎవరి మధ్య మాటల యుద్ధం జరిగింది? అన్నది పూర్తి ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది.నామినేషన్లలో ఆరుగురుఇక తాజా సమాచారం ప్రకారం.. ఎనిమిదో వారం నామినేషన్ల జాబితాలో రోహిత్, రామకృష్ణ, వర్షిణి, ఝాన్సీ, రాంప్రసాద్, సుధీర్ ఉన్నారు. దీంతో ఈ ఆరుగురిలో ఎవరు ప్రేక్షకుల ఓట్లను ఎక్కువగా సాధిస్తారు? ఎవరు ఓటింగ్‌లో వెనుకబడి ఎలిమినేషన్ ప్రమాదాన్ని ఎదుర్కొంటారు? అనే చర్చ మొదలైంది. నామినేషన్లతో ఇప్పటికే హౌస్‌లో ఉత్కంఠ నెలకొనగా.. ఈ వారం ఎవరి ప్రయాణం ముగుస్తుందో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.(ఇదీ చదవండి: ఓటీటీలో సీఎం విజయ్ కొడుకు సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
బిగ్‌బాస్ 10: చప్పగా సాగిన 8వ వారం నామినేషన్స్
సాధారణంగా బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్లు అనగానే గొడవలు, అరుచుకోవడాలు, రచ్చ.. ఇలా చాలానే ఉంటుంది. అందుకు తగ్గట్లే ఈ సీజన్లోనూ గతవారాల్లో అలానే జరిగింది. కానీ ఈ సోమవారం(అక్టోబర్ 26) మాత్రం అలాంటివేం లేకుండానే ఈ ప్రక్రియ సాగింది. ఇంతకీ 10వ సీజన్‌లోని 50వ రోజు అసలేం జరిగింది?ఎవరు ఎవరిని నామినేట్ చేశారు?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: డబుల్ ఎలిమినేషన్.. రెమ్యునరేషన్ ఎంతిచ్చారు?)ఆదివారం ఎపిసోడ్ సరదాగా సాగినప్పటికీ డబుల్ ఎలిమినేషన్ కారణంగా ఎమోషనల్గానూ అనిపించింది. ఫుడ్ విషయంలో ముకేశ్ – దేబ్జానీ గొడవ పడ్డారు. శివ్తోనూ ముకేశ్ గొడవ పడ్డాడు. షాలిని వెళ్లిపోవడంతో ఆమె బెడ్.. రోహిత్, అమన్ తీసుకోడానికి ట్రై చేశారు. ఇక ముకేశ్ మారిపోయిన విధానం గురించి దేబ్జానీ, శివ్, శ్వేత డిస్కషన్ పెట్టుకున్నారు. సోమవారం వచ్చిందంటే నామినేషన్స్ హడావుడి ఉంటుంది కదా. అలానే ఈసారి అది మొదలవడానికి ముందు గోట్ నుంచి అల్టిమేట్ గోట్ టాస్క్ ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. ఎల్లో, రెడ్ లెవల్లోని సభ్యుల భవిష్యత్.. గ్రీన్‌లో ఉన్న గోట్స్ డిసైడ్ చేస్తారని పేర్కొన్నారు. మొదటి రౌండ్లో ఎల్లో, రెడ్లోని వాళ్లని గ్రీన్ వాళ్ళు నామినేట్ చేయాలి. గ్రీన్ మెంబర్స్ రెండు వారాలు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారని ఇదివరకే చెప్పారు. గ్రీన్‌లో త్రిగుణ్, అమన్, దేబ్జానీ, నీతూ, ముకేశ్ గోట్స్గా ఉన్నారు.గ్రీన్‌లోని వాళ్లు ఒక్కొక్కరు మూడు నామినేషన్స్ చేసుకోవచ్చు. మొదట ఎవరు ఎంతమందిని నామినేట్ చేస్తారు అనేది డిసైడ్ అవ్వాలి. తర్వాత స్లిప్ మీద రాయాలి. తర్వాత ఎవర్ని నామినేట్ చేస్తున్నారో చెప్పి చేయాలి. గోట్స్ అంతా ఒక్కర్నే నామినేట్ చేస్తామని చెప్పినా త్రిగుణ్ మాత్రం మూడు నామినేషన్స్ చేస్తానని అన్నాడు. నీతూ మొదటగా వచ్చి ఝాన్సీని నామినేట్ చేసింది. త్రిగుణ్, రాంప్రసాద్‌ని నామినేట్ చేసి.. కెప్టెన్సీ సరిగ్గా చేయలేదని అన్నాడు. ముకేశ్, రామకృష్ణని నామినేట్ చేయగా గొడవ పెట్టుకున్నారు. రామకృష్ణ మూర్ఖుడు అని ముకేశ్ అన్నాడు. త్రిగుణ్ తన రెండో నామినేషన్‌గా రోహిత్ అని చెప్పాడు. ఆయన చేసే విషయాలు అని త్రిగుణ్ చెబుతుంటే.. రోహిత్ ఎగతాళిగా నవ్వాడు. రివర్స్‌లో త్రిగుణ్‌ని మూర్ఖుడు అని తిట్టి ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు.దేబ్జానీ.. ఝాన్సీని నామినేట్ చేసింది. అమన్, సుధీర్‌ని నామినేట్ చేశాడు. వీళ్ళిద్దరూ కాసేపు గొడవ పడ్డారు. సుధీర్ మాట్లాడుతున్నది వినకుండానే అమన్ వెళ్ళిపోయాడు. చివరగా త్రిగున్, వర్షిణిని నామినేట్ చేశాడు. వీరిద్దరి మధ్య వీళ్ల స్నేహం గురించి డిస్కషన్ నడిచింది. దీంతో వర్షిణి కూడా ఫ్రెండ్‌గా త్రిగుణ్ సపోర్ట్ చేయలేదని ఏడ్చింది. అలా ఈ ఎపిసోడ్లో గ్రీన్ మెంబర్స్ నామినేషన్స్ పూర్తయ్యాయి. మంగళవారం నాడు మిగిలిన సభ్యుల నామినేషన్స్ జరగనున్నాయి.(ఇదీ చదవండి: హీరోయిన్గా దేవయాని కూతురు) -
బిగ్‌బాస్ 10: డబుల్ ఎలిమినేషన్.. రెమ్యునరేషన్ ఎంతిచ్చారు?
తెలుగులో ప్రస్తుతం బిగ్‌బాస్ 10వ సీజన్ నడుస్తోంది. నిన్న ఆదివారంతో ఏడు వారాలు విజయవంతంగా పూర్తయ్యాయి. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ జరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దక్షితోపాటు హౌస్‌లో రచ్చ రచ్చ చేసిన షాలిని కూడా ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. మరి వీళ్లిద్దరికీ పారితోషికం ఎంతిచ్చారు? ఇంతకీ ఔట్ కావడానికి కారణాలేంటి?(ఇదీ చదవండి: రోహిత్‌తో నువ్వు కూడా అదే ఉద్దేశంతో ఉన్నావా? షాలినికి ఇచ్చిపడేసిన శివాజీ)తొలుత షాలిని విషయానికొస్తే అగ్నిపరీక్ష పోటీలో పాల్గొని హౌస్‌లోకి వచ్చింది. కానీ ప్రారంభం నుంచి ఇప్పటివరకు రోహిత్ అనే కామనర్తో కలిసి రొమాన్స్, లవ్ ట్రాక్ నడపడం తప్పితే మరో పని చేయలేదు. ఏ పని సరిగా చేయక, నోటికి వచ్చినట్లు అందరిపై అరవడం లాంటివి చేయడంతో ఈమెపై విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది. గతవారమే ఎలిమినేట్ అయిపోతే బయటకు పంపించేయకుండా సీక్రెట్ రూంలో ఉంచి తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చారు. అయినా గానీ ఈమె ఆట తీరు మారలేదు.ఫలితంగా ఏడు వారాల తర్వాత షాలిని ఎలిమినేట్ అయింది. అగ్నిపరీక్ష నుంచి ఈమె వచ్చింది కాబట్టి వారానికి రూ.75 వేల చొప్పున రెమ్యునరేషన్ అగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అలా రూ.5.25 లక్షలు ఈమెకు దక్కనున్నట్లు సమాచారం.ఇక దక్షి విషయానికొస్తే.. స్వతహాగా నటి అయిన ఈమె. ఐదోవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలా హౌస్‌లోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అటు గేమ్స్ ఆడక, ఇటు మిగిలిన కంటెస్టెంట్స్‌తోనూ సరిగా కలవలేకపోయింది. ఎలాగోలా రెండు వారాలు ఉంది గానీ ఈసారి తక్కువ ఓట్లు పడటంతో ఈమె ఎలిమినేట్ అయిపోయింది. ఈమెకు వారానికి రూ.2.5 లక్షలకు అగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అలా మొత్తం రూ.5 లక్షల పారితోషికం అందుకున్నట్లు టాక్.(ఇదీ చదవండి: వివాదంలో 'ఫౌజీ'.. దర్శకుడు సారీ చెప్పాలంటున్న బోస్ మనవడు) -
రోహిత్‌తో నువ్వు కూడా అదే ఉద్దేశంతో ఉన్నావా?
బిగ్‌బాస్ లాంటి షోలో అవకాశం కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. అగ్నిపరీక్ష ద్వారా అలాంటి ఛాన్స్ షాలినికి వచ్చింది. హౌస్‌లోకి వచ్చిన తర్వాత గేమ్స్ ఆడి, టాస్క్‌లు గెలిచి నిలబడాల్సింది పోయి రోహిత్‌తో రొమాన్స్ చేసుకోవడానికే టైమ్ అంతా కేటాయించింది. సీక్రెట్ రూంలోకి పంపించి తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చినా సరే ఈమెలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో ఈమెతో ఇక వేస్ట్ అని బిగ్‌బాస్ వదిలించుకున్నాడు.(ఇదీ చదవండి: రాజకీయ ఎంట్రీపై ప్రశ్న.. త్రిష ఏం చెప్పిందంటే?)షాలిని హౌస్‌లో ఉన్నప్పుడు ప్రవర్తించిన తీరు, మాట్లాడిన మాటల పట్ల విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది. ఈమెకి ఓట్లు వేసింది తక్కువ మంది. కానీ తిట్టుకున్న వాళ్లే ఎక్కువ మంది. ఈమె వెళ్లిపోయింది ఇక బిగ్‌బాస్ ప్రశాంతంగా చూడొచ్చనుకునేవాళ్లే చాలామంది ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలిమినేట్ అయిన తర్వాత బజ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులోనే యాంకర్ శివాజీ.. హౌస్‌లో ప్రవర్తించిన విధానం, వదిలిన మాటల గురించి ఎలిమినేట్ అయి వచ్చినవాళ్లని ప్రశ్నలు అడుగుతాడు.ఇలాంటివే షాలినిని కూడా శివాజీ అడిగాడు. ప్రేక్షకులు అడిగిన 28 ప్రశ్నలు ఇవి అని పేపర్ చూపించిన ఇతడు.. ఎక్కడి నుంచి మొదలు పెడదాం. బ్యాక్ బిచింగ్ నుంచి మొదలుపెడదామా? గుసగుసల గురించి అడుగుదామా? రోహిత్ బాబు గురించి అడగాలా? అని అన్నాడు. సీక్రెట్ రూంలోంచి బయటకు వచ్చిన వారిలో ఒకరు విన్నర్, ఇంకొకరు రన్నర్ అయ్యారు. నువ్వు మాత్రం అదే వారంలో బయటకు వచ్చావ్ అని షాలిని పరువంతా శివాజీ తీసేశాడు.వైల్డ్ ఫైర్స్ వచ్చాక రోహిత్‌కి బజ్ ఉంది కాబట్టి భజన చేస్తున్నారని అన్నావ్. నువ్వు కూడా అదే ఉద్దేశం కారణంగా రోహిత్‌తో ఉన్నావా? అని షాలినిని శివాజీ ప్రశ్నించాడు. మీ బాండింగ్‌ని విడగొట్టాలని చూశారాని అన్నావ్. విడగొడితే విడిపోయే బాండా మీది? అని కౌంటర్ వేశాడు. మా నాన్న ఒక మాట చెప్పేవాడు అని శివాజీ ఏదో చెబుతుండగానే.. ఇక చాలు కట్ చేయండి అన్నట్టుగా సైగ చేసిన షాలిని ఏడ్చేస్తుంది. నేను ముందే నా గేమ్ ప్లాన్ మార్చాల్సింది, అనవసరంగా ఇక్కడిదాకా తెచ్చుకున్నా అని వెక్కి వెక్కి ఏడ్చేసింది. అయితే ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు చెప్పాల్సింది పోయి ఇలా ఏడ్చి సింపతీ చూపించడమేంటో? అని నెటిజన్లు అంటున్నారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: షాలిని ఎలిమినేట్.. చివరి నిమిషంలోనూ రొమాన్స్) -
బిగ్‌బాస్ 10: షాలిని ఎలిమినేట్.. చివరి నిమిషంలోనూ రొమాన్స్
చాలామంది అనుకున్నట్లే బిగ్‌బాస్ 10వ సీజన్ నుంచి ఏడోవారం ఇద్దర్ని ఎలిమినేట్ చేసేశారు. వాళ్లే దక్షి, షాలిని. వైల్డ్ కార్డ్‌లా గేమ్ పరంగా మెప్పించలేకపోవడంతో హౌస్ నుంచి బయటకొచ్చేసింది. మరి షాలినిది మాత్రం షాకింగ్ అని చెప్పొచ్చు. ఇంతకీ బిగ్‌బాస్‌లో 49వ రోజైన ఆదివారం(అక్టోబర్ 25) అసలేం జరిగింది? అనేది చూద్దాం.(ఇదీ చదవండి: రాజకీయ ఎంట్రీపై ప్రశ్న.. త్రిష ఏం చెప్పిందంటే?)ఎల్లో, గ్రీన్ జోన్లో ఉన్నా నామినేషన్స్‌లో ఉండటం వల్ల వర్షిణి, శివ్లకు ఆడియెన్స్ ఓట్లు వేశారా? సేఫ్ చేశారా? లేదా? అన్నది నాగ్ తెలిపాడు. ఈ ఇద్దరూ సేఫ్ అయ్యారని నాగ్ ప్రకటించడంతో ఆదివారం ఎపిసోడ్ మొదలైంది. కాసేపటి తర్వాత దక్షి ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. స్టేజీపైకి వచ్చిన తర్వాత ఎక్కువ విను అని నీతూకి, ఎక్కువగా అబ్జర్వ్ చేయ్ అని అమన్‌కి, మాటలు కంట్రోల్లో పెట్టుకో అని త్రిగుణ్‌కి, ఇంకా మాట్లాడు నాలానే ఉంటే బయటకు వస్తావ్ అని శ్వేతకు సలహా ఇచ్చింది.ఇక రెడ్ జోన్‌లోని ఏడుగురిలోంచి ఎల్లో జోన్లో ఉన్న నలుగురు సేవ్ చేస్తారు. శివ్ శ్వేతని, రాంప్రసాద్ ఝాన్సీని, వర్షిణి సుధీర్‌ని, నరేశ్ వంశీని సేఫ్ చేస్తారు. మిగిలిన రోహిత్, షాలిని, ఆర్కేలకు గ్రీన్ జోన్లో ఉన్న ఐదుగురు ఎగ్జిట్ బ్యాడ్జ్ పెట్టాలి. దీంతో నీతూ, దేబ్జానీ షాలినికి... ముకేశ్, అమన్ ఆర్కేకి బ్యాడ్జ్ పెట్టారు. చివరగా త్రిగుణ్.. షాలినికి బ్యాడ్జ్ పెట్టాడు. అలా షాలిని ఎలిమినేట్ అయింది. బయటకొచ్చే ముందు కూడా రోహిత్, షాలిని రొమాన్స్ విషయంలో తగ్గలేదు. గేట్ చివరి వరకు వచ్చినా గానీ మళ్లీ వెనక్కి పిలిచిన రోహిత్, షాలినికి హగ్ ఇచ్చాడు. షాలిని ఏమో చెవిలో ఐ లవ్యూ అని గుసగుసలాడింది.నాకు రోహిత్ విన్ అవ్వాలని ఉందని స్టేజీపైకి వచ్చిన తర్వాత షాలిని చెప్పింది. షాలిని వెళ్తుంటే నాగ్ మళ్లీ పిలిచాడు. దీంతో హౌస్‌లోని కంటెస్టెంట్స్ ఆశ్చర్యపోగా.. ఏంటి రాంప్రసాద్ షాక్ అయ్యావా అని నాగ్ కౌంటర్ వేశాడు. మైక్ కోసమే షాలినిని నాగ్ పిలిచాడు. వచ్చేవారం 'అల్టిమేట్ గోట్' అనే థీమ్‌తో సాగనుందని నాగ్ చెప్పాడు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. షాలినిని ఎలిమినేట్ చేసే ఉద్దేశం బిగ్‌బాస్‌కి ఉన్నప్పుడు ఈమెని సీక్రెట్ రూంలో పెట్టి, తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చి హంగామా ఎందుకు చేశారో ఏంటో?(ఇదీ చదవండి: 3500 మంది మహిళలతో ధనుష్ మీటింగ్.. ఏంటి విషయం?) -
బిగ్‌బాస్‌లో ఊహించని ఎలిమినేషన్.. షాలినీకి బిగ్ షాక్!
బిగ్‌బాస్ తెలుగు 10లో ఏడో వారం ఉత్కంఠ మొదలైంది. ఈ వారం ఆడియెన్స్ ఓటింగ్ ద్వారా దక్షి ఎలిమినేట్ అయినట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె.. స్టేజ్‌పై రోహిత్, షాలినీలకు ఆట తీరుపై కీలక సలహాలు ఇచ్చింది. అయితే మరోవైపు రెడ్ జోన్లో ఉన్న షాలినీ కూడా ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలకు మరింత బలం చేకూరింది.నాలానే నువ్వు ఉంటే బయటకు వస్తావ్స్టేజ్పైకి వచ్చిన దక్షికి నాగార్జున ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులకు సలహాలు ఇవ్వాలని సూచించారు. ముందుగా శ్వేతతో మాట్లాడుతూ.. ‘నాలానే నువ్వు ఉంటే బయటకు వస్తావ్’ అని చెప్పింది. అనంతరం ‘నోరు మూసుకో’ అనే సలహా ఎవరికి ఇస్తావని నాగార్జున ప్రశ్నించగా.. షాలినీ వెంటనే లేచి నిలబడింది. దీంతో నాగార్జున నవ్వుతూ.. చెప్పకముందే ఎలా నిల్చుంటావని సరదాగా వ్యాఖ్యానించారు.ఇక రోహిత్‌కు దక్షి ఇచ్చిన సలహా ఆసక్తికరంగా మారింది. ‘మైండ్‌తో ఆట ఆడు.. హార్ట్‌తో కాదు. అందుకే నీ గేమ్ డౌన్ అవుతోందని అనుకుంటున్నా’ అని చెప్పింది. మరి దక్షి మాటలను రోహిత్ ఎంతవరకు తీసుకుంటాడు? తన ఆట తీరును మార్చుకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దక్షి మాత్రం హౌస్‌లో తనదైన ముద్ర వేయలేకపోయింది. ఈ వారం పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో ఆడియెన్స్ ఓట్లలో వెనుకబడినట్లు తెలుస్తోంది. మరోవైపు శ్వేత, నీతూ, శివ్ తమ ఆటతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రెడ్ జోన్ నుంచి షాలినీ ఎలిమినేట్ఇదిలా ఉంటే.. సీక్రెట్ రూమ్ నుంచి రీ ఎంట్రీ ఇచ్చిన షాలినీ ఆట తీరుపై కూడా చర్చ జరుగుతోంది. ఆమె ప్రవర్తన, మాటతీరు, ఇతర ఇంటి సభ్యులతో గొడవలు ప్రేక్షకుల్లో అసంతృప్తికి కారణమయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్ జోన్ నుంచి షాలినీ ఎలిమినేట్ అయినట్లు వినిపిస్తోంది. అయితే ఆమె ఎలిమినేషన్ నిజమేనా? ఒకవేళ జరిగితే ఎవరి నిర్ణయంతో బయటకు వెళ్లింది? అన్నది పూర్తి ఎపిసోడ్ ప్రసారమైతేనే స్పష్టత రానుంది.(ఇదీ చదవండి: బాలనటిగా అరంగ్రేటం చేసిన ప్రముఖ నిర్మాత కూతురు) -
బిగ్‌బాస్ 10: రోహిత్‌కి బ్లాక్ కార్డ్.. షాలినికి గేట్ చూపించిన నాగ్
శనివారం వచ్చిందంటే హౌస్ట్ నాగార్జున వచ్చేస్తాడు. వారమంతా బిగ్‌బాస్ నడిచిన దానికి తనదైన స్టైల్లో రివ్యూ ఇస్తారు. తప్పు చేసిన హౌస్‌మేట్స్‌ని వాయించేస్తారు. ఈసారి అలా షాలిని-రోహిత్‌ని ఓ రేంజులో ఆడేసుకున్నారు. వీడియోలు చూపించి మరీ వాయించేశారు. ఇంతకీ 48వ రోజైన శనివారం 10వ సీజన్లో అసలేం జరిగింది?నాగ్ ఎంట్రీ తర్వాత ఆడియెన్స్‌లో కొందరు తమకు రోహిత్, షాలిని ఇష్టం అని చెప్పడంతో హౌస్‌లో వీళ్లిద్దరూ ఎలా ప్రవర్తిస్తున్నారో వీడియోలు ప్లే చేసిన నాగార్జున.. వీళ్లేనా మీకు నచ్చింది అని అడిగారు. లేదు సార్ అలా ఉండకూడదు అని వాళ్లతోనే అనిపించారు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ జరగలేదు కాబట్టి వచ్చే వారం కెప్టెన్ ఎవరూ ఉండరని ప్రకటించిన బిగ్‌బాస్.. గ్రీన్ లెవల్లోని నీతూ, త్రిగుణ్, దేబ్జానీ, ముకేశ్ ఇంటి బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు.(ఇదీ చదవండి: 'ఫౌజీ'లో సుభాస్ చంద్రబోస్ పాత్ర చేసింది ఎవరంటే?)నాగ్ టీవీలో కనిపించగానే కంటెస్టెంట్స్ అంతా లేచినిలబడ్డారు కానీ రోహిత్, షాలినిలు లేచినట్టే లేచి వెంటనే కూర్చున్నారు. నరేశ్‌ని తెగ పొగిడేసిన నాగార్జున.. బాగా ఎంటర్టైన్ చేస్తున్నావని ఆకాశానికి ఎత్తేశారు. ఈ క్రమంలోనే కెప్టెన్ రూంకి నరేష్‌కి అనుమతి ఉంటుందని బంపరాఫర్ ఇచ్చారు. అమన్, దేబ్జానీ, నీతూ.. గ్రీన్ లెవల్లోకి వెళ్లినందుకు మెచ్చుకున్నారు. ముకేశ్ గురించి నాగ్ చెబుతూ.. నిన్ను జెంటిల్మెన్ అనుకున్నాను. మాటలు జారవు అనుకున్నా కానీ జారుతున్నావ్. ఎలా ప్రవర్తిస్తున్నావో చూడు అని వీడియో వేసి చూపించారు. ఏమైంది నీ క్యారెక్టర్.. ఎందుకంత దిగజారి మాట్లాడావ్. శివ్ పర్సనల్ లైఫ్ గురించి నీకు ఎందుకు? అని క్లాస్ పీకారు. ఇలానే ఉంటే నీ పతనం మొదలవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇక శివ్ని మెచ్చుకున్న నాగార్జున.. ఆటలో వైల్డ్ ఫైర్ చూపిస్తున్నావ్. నిన్ను నువ్వు ప్రతి విషయంలో నిరూపించుకుంటున్నావ్. నువ్వు కరెక్ట్‌గా ఆడితే నిన్ను కొట్టేవాడు లేడు. ఎందుకంటే నీలో ఫైర్ ఉందని తెగ పొగిడేశాడు.రాంప్రసాద్‌ని సూటిగా ప్రశ్నించిన నాగార్జున.. షాలిని తిరిగి రావడం నీకు నచ్చిందా? లేదా? అని అడిగారు. ‘నాకు నచ్చలేదు సార్. ఈ హౌస్ నుంచి ఓటింగ్ ప్రకారం బయటకు వెళ్లింది కాబట్టి తను బయట ఉంటేనే బెటర్ అనిపించింది. ఆడియెన్స్ ఓట్లు వేసి ఆమెను బయటకు పంపారు. మళ్లీ తీసుకుని రావడం నచ్చలేదు. పోనీ రీ ఎంట్రీ తరువాత ఏదైనా ఇంప్రూమెంట్ ఉంటుంది అనుకుంటే అదీ లేదు. కానీ ఆమె ఏం మారలేదు. అలాగే ఉంది అని రాంప్రసాద్ అన్నాడు. తర్వాత రామకృష్ణ గేమ్ పట్ల నాగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగే ఆడితే జనం బయటకు పంపేస్తారు అని వార్నింగ్ ఇచ్చారు. తర్వాత షాలిని గురించి మాట్లాడిన నాగ్.. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగారు. దాంతో షాలిని.. ‘అందరూ నన్ను ఎలిమినేట్ అయ్యి మళ్లీ వచ్చావ్ అని అంటుంటే చాలా బాధగా ఉంది సార్. నేను నా గేమ్‌ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నా. అది వాళ్లు చూడటం లేదు’ అని ఎమోషనల్ అయిపోయింది. దీంతో వీడియో ప్లే చేయించిన నాగార్జున.. ఎంతలా దిగజారి ప్రవర్తించిందో చూపించారు. బిగ్‌బాస్ నీకు ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చారు? నీ పర్సనాలిటీ ఏం మార్చుకున్నావ్? నీకు మరో వీడియో చూపిస్తా అంటూ మరొకటి ప్లే చేశారు.ఇందులో షాలిని.. పిచ్చెక్కినట్లు ప్రవర్తించింది. దక్షి మీదకు దూసుకెళ్తూ పచ్చి బూతులతో రెచ్చిపోయింది. ఓ పక్క రాంప్రసాద్ ఆపుతున్నా వాట్ వాట్ అంటూ దక్షిని కొట్టడానికి వెళ్లిన వీడియో చూపించి షాలినిని కడిగిపారేశారు. కోపం వస్తే కంట్రోల్లో ఉండవా? ఫిజికల్ ఎందుకు అవుతున్నావ్? మీద మీదకు ఎందుకు వెళ్తున్నావ్. నీతూతో అదే చేశావ్? వర్షిణితో అదే చేశావ్.. దక్షితో అదే చేస్తున్నావ్. ఇవన్నీ పక్కనపెట్టేస్తా.. రూం గురించి చూద్దాం అంటూ మరో వీడియో చూపించారు నాగ్. నువ్వు అందర్నీ పర్సనల్ ఎటాక్ చేస్తావ్. నీ గురించి ఎవరైనా మాట్లాడితే తట్టుకోలేవ్. ఇదేనా మారడం అంటే. ఎలిమినేటై స్టేజ్ మీదికి వచ్చినప్పుడు నువ్వు నాతో ఏమన్నావ్. ఇది నాకు బర్త్ డే గిఫ్ట్ సార్. కంప్లీట్‌గా మారిన షాలిని కనిపిస్తుందని అన్నావ్. నాకు ప్రామిస్ చేసి మళ్లీ వెళ్లావ్ అని రోహిత్‌తో సరసాలు చేస్తున్న వీడియోలని ప్లే చేశారు. ఏం చేస్తున్నారు మీరిద్దరూ. మీరు ముద్దులు పెట్టుకున్నారని త్రిగుణ్ అన్నందుకు ఫీల్ అయిపోయావ్. నేషనల్ టెలివిజన్‌లో అలా అనడం తప్పు అన్నావ్. మరి అదే నేషనల్ టెలివిజన్‌లో చేయడం తప్పు కాదా? అని నాగార్జున ప్రశ్నించారు. దెబ్బకి తలదించేసుకున్న షాలిని.. నేను ఈ బాధ తీసుకోలేను. బయటకు వెళ్లిపోతానని చెప్పింది. ఇదంతా అలా జరుగుతుండగానే పక్కనే ఉన్న రోహిత్ చేయి ఎత్తాడు. ఏంటి రోహిత్ చేయి ఎత్తావ్? అని నాగ్ అడగ్గానే.. తను నాకు మునివేళ్లతో ఏదో రాస్తుందని వీడియో చూపించారు కదా దాని గురించి మాట్లాడతా మీరు పర్మిషన్ ఇస్తే అని అన్నాడు. సరే చెప్పు అంటే షాలిని గురించి మాట్లాడాడు. నువ్వు చేయి ఎత్తింది నీ గురించి మాట్లాడటానికా? లేక షాలిని గురించి మాట్లాడటానికా? అని నాగ్ ఫైర్ అయ్యారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: త్యాగం చేసిన శివ్.. త్రిగుణ్ మామూలోడు కాదు)అది రొమాంటిక్‌గా చేసింది కాదు సార్ అని రోహిత్ అనడంతో.. నేను అలా చెప్పానా? నేను సైన్ లాంగ్వేజ్ ఏంటి? అని అడిగానంతే. నేను ఆమెతో మాట్లాడుతున్నా మధ్యలో ఎందుకు లేస్తున్నావ్? ఇది ఏమన్నా నామినేషన్ అనుకుంటున్నావా? నేను షాలినిని నామినేట్ చేయడం లేదు. కూర్చో అంటూ రోహిత్‌కి నాగ్ ఇచ్చిపడేశారు. తర్వాత షాలిని సారీ సార్ అని అనడంతో ఎన్నిసార్లు చెప్తావ్ సారీ. నీకు వెళ్లిపోవాలని ఉంటే ఈ క్షణమే వెళ్లిపో అని అన్నారు. దాంతో షాలిని క్షణం కూడా ఆలోచించకుండా నేను వెళ్లిపోతా అని అన్నది. వెంటనే నాగార్జున.. డోర్స్ ఓపెన్ చేయండి అని అన్నారు. ఆల్రెడీ నువ్వు రెడ్‌లో ఉన్నావ్, వెళ్లొచ్చు అని నాగార్జున అన్నారు. జనాలు నన్ను వెళ్లిపోవాలని ఓట్లు వేశారు. నేను దానిని గౌరవించాలి. వెళ్లిపోతా అని షాలిని అంటుంటే లేదు నువ్వు ఉండాల్సిందే అని రోహిత్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో నాగార్జున.. నువ్వు వెళ్తున్నావా? ఉంటున్నావా? నేను వెయిట్ చేస్తున్నా నీ నిర్ణయం కోసం అని అన్నారు. నేను వెళ్లను సార్.. నన్ను నేను ఫ్రూవ్ చేసుకొని వెళ్తా అని షాలిని ఏడుస్తూనే చెప్పింది.తర్వాత త్రిగుణ్‌తో మాట్లాడిన నాగార్జున.. ఇంత చీప్‌గా ప్రవర్తిస్తావా. అవతల వ్యక్తి గుడ్ అని నేను చెప్పడం లేదు. సపోర్ట్ చేయడం లేదు. ఏంటి అదంతా నిన్ను, రోహిత్‌ని చూసి ముకేశ్ నేర్చేసుకున్నాడు.. ఇలాగే గేమ్ ఆడాలేమో అని అనుకుంటున్నాడు.. ఇది కరెక్ట్ కాదు ముకేశ్.. వాళ్ల దగ్గర నేర్చుకోకు. ఆడియెన్స్ ఛీ కొడతారు అని నాగ్ అన్నారు. త్రిగుణ్ తను తప్పు చేశానని ఒప్పుకొనేసరికి.. నీకేం పనిష్మెంట్ కావాలి అని నాగ్ అడగ్గానే నా 'గోట్' శివ్‌కి ఇచ్చేస్తా అని త్రిగుణ్ అనగానే అది నువ్వు ఆడి గెలుచుకొని సంపాదించుకుంది అని నాగ్ అన్నాడు. తర్వాత రోహిత్‌తో మాట్లాడిన నాగార్జున.. ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు. నీయమ్మా అనడం ఏంటి? ఇదా నీ క్యారెక్టర్? నామినేషన్ల గురించి మాట్లాడొద్దు అన్నా విన్నావా? ముకేశ్‌ని ఫైల్స్ రాజా అనడం ఏంటి? నీ ఆట చాలా బాగుందని ఇష్టపడ్డవాళ్లు నువ్వు పడిపోతున్నావ్ అని చెప్పారు. వాళ్లతో మాట్లాడు అని ప్రేక్షకులతో మాట్లాడిస్తారు. గేట్ బయట దొరకవా అని అంటావా? నువ్వు వాళ్లకు దొరకవా? కప్పులు కడిగే వాడు కప్పులు కొట్టడా? తప్పులు మీద తప్పులు తప్పుల మీద తప్పులు ఏంటి ఇది? నీకు ఇప్పటికే ఓ ఎల్లో కార్డు వచ్చింది. షాలినిలా నేను క్షమించలేను. నీ మీద చాలా అంచనాలు ఉన్నాయి. మరి ఇంట్లో ఉంటావా? అందరికి ఇవ్వాల్సినవి ఇచ్చేసి వెళ్లిపోతావా? రోహిత్‌కి బ్లాక్ బ్యాడ్జ్. ఇది నీ క్యారెక్టర్ మీద ఒక బ్లాక్ మార్క్. ఏది వద్దు అంటున్నామో అది కంటిన్యూగా చేస్తున్నావ్. ఈ బ్లాక్ బ్యాడ్జ్ నీ మీద ఉంటుంది. డోర్‌కి అడుగు దూరంలో ఉన్నావ్. ఇంకొక్క సారి వీటిలో ఏం జరిగినా ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోతావ్ అని చెప్పి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చిన నాగార్జున.. ఇంటిని రూల్ చేయడానికి నువ్వు అర్హుడివి కాదు. ఈ ఇంట్లో ఉన్నంత కాలం నువ్వు కెప్టెన్ అవ్వవు అని చెప్పారు. రోహిత్ మోకాలి మీద కూర్చొని అలా చేయొద్దు సార్ అది నా గేమ్ మొత్తాన్ని షట్‌డౌన్ చేస్తుంది. ప్లీజ్ మిమల్ని బతిమాలుతున్నా అని అడిగితే.. ఇంట్లో వాళ్లకి నాగ్ ఓటింగ్ వేయమని అంటే పది మంది ఓటు వేస్తారు. రెండు వారాలు నువ్వు కెప్టెన్ అవ్వలేవు. నీ ప్రవర్తన మారితే ఛాన్స్ వస్తుందని అన్నారు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఆమెని ఎలిమినేట్ చేసేశారు!) -
నవ్విస్తూనే క్లాస్ పీకిన నాగ్.. వర్షిణికి దిమ్మతిరిగే కౌంటర్!
బిగ్‌బాస్ తెలుగు 10లో 48వ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగనుంది. ఈ మేరకు తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున తనదైన శైలిలో కంటెస్టెంట్ల ఆటతీరుపై స్పందించారు. ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే ఆయన ఈసారి సరదాగా ఎంట్రీ ఇచ్చి టీమ్ సభ్యులకు షాక్ ఇచ్చారు. మొదట కొందరి ఆటతీరును ప్రశంసించిన నాగ్.. ఆ తర్వాత మరికొందరిపై అసహనం వ్యక్తం చేశారు.గుండెలు పగిలేలా నవ్వుతున్నారనినరేశ్ ఆటను చూసి ప్రేక్షకులు గుండెలు పగిలేలా నవ్వుతున్నారని నాగార్జున ప్రశంసించారు. అనంతరం దేబ్జానీ ఆటతీరును కూడా మెచ్చుకున్నారు. దీంతో మొదట సరదాగా సాగిన ఈ ప్రోమో.. ఆ తర్వాత కంటెస్టెంట్లకు నాగార్జున క్లాస్ తీసుకోవడంతో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ముఖేశ్ మాట్లాడే విధానంపై నాగార్జున అసహనం వ్యక్తం చేసినట్లు ప్రోమోలో కనిపించింది. ఆ తర్వాత వర్షిణి ఆటతీరుపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. ఆటలో ఎవరినైనా ఛాలెంజ్ చేయొచ్చని, అయితే ఆడేటప్పుడు మనలోని కసి కనిపించాలని సూచించారు.నీతూను ఉద్దేశించి నీతూను ఉద్దేశించి వర్షిణి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ నాగార్జున గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘నీతూ.. నువ్వేం పీకుతావ్ అని అన్నావ్ కదా.. గేమ్ ఆడి ఏం పీకిందో చూపించింది కదా’ అంటూ ప్రశ్నించారు. దీంతో వర్షిణి ఆటతీరుపై నాగార్జున చేసిన వ్యాఖ్యలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచాయి. ఇదే సమయంలో వర్షిణి తిరిగి రావడం రాంప్రసాద్‌కు ఇష్టమేనా అని నాగార్జున ప్రశ్నించారు. దీనికి ఆయన లేదని సమాధానం చెప్పడంతో అక్కడ ఏం జరిగిందన్న ఆసక్తి నెలకొంది. కాగా వర్షిణి, నీతూ మధ్య వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదీ చదవండి: స్టార్ హీరోలకు ధీటుగా లేడీ సూపర్‌స్టార్ క్రేజ్ -
బిగ్‌బాస్ 10: ఆమెని ఎలిమినేట్ చేసేశారు!
లెక్కప్రకారం గతవారం షాలిని ఎలిమినేట్ అయింది. కానీ ఆమెని సీక్రెట్ గదికి పంపిన బిగ్‌బాస్.. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చాడు. దీంతో ఈవారం ఈమె సేవ్ అయిపోయింది. మరి షాలిని గతవారం ఔట్ కాలేదు కాబట్టి ఈసారి డబుల్ ఎలిమినేషన్ పక్కా అని తెలుస్తోంది. అందులో భాగంగానే తొలి వికెట్ పడినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'ఫౌజీ'లో సుభాస్ చంద్రబోస్ పాత్ర చేసింది ఎవరంటే?)ఈ వారం రోహిత్, త్రిగుణ్, రామకృష్ణ, అమన్, శ్వేత నాయుడు, వర్షిణి, వంశీ, సుధీర్, ఝాన్సీ, శివ, దక్షి, నీతూ మాస్టర్ నామినేషన్లలో ఉన్నారు. వీళ్లలో గోట్ టాస్క్‌లో గెలిచిన అమన్, త్రిగుణ్, ముకేశ్, దేబ్జానీ, నీతూ.. ఈవారంతో పాటు వచ్చేవారం కూడా నామినేషన్ల నుంచి సేవ్ అయిపోయారు. మిగిలిన వాళ్లలో రోహిత్ ఓటింగ్ పరంగా టాప్‌లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఓటింగ్ పరంగా రోహిత్ తర్వాత త్రిగుణ్, రామకృష్ణ, అమన్, ఝాన్సీ, వర్షిణి, సుధీర్, వంశీ వరస స్థానాల్లో ఉన్నారట. చివరి స్థానాల్లో మాత్రం శ్వేత, నీతూ, దక్షి, శివ్ ఉన్నారు. నీతూ ఇప్పటికే సేవ్ అయిపోయింది. దీంతో శివ్, దక్షి, శ్వేత ప్రస్తుతానికి డేంజర్ జోన్లో ఉండగా వీళ్లలో దక్షి తొలి ఎలిమినేషన్‌గా బయటకొచ్చేసినట్లు సమాచారం. ఈమెతో ఈ వీకెండ్ ముగిస్తారా? లేదంటే మరో ఎలిమినేషన్ కూడా ఉందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: త్యాగం చేసిన శివ్.. త్రిగుణ్ మామూలోడు కాదు) -
బిగ్‌బాస్ 10: త్యాగం చేసిన శివ్.. త్రిగుణ్ మామూలోడు కాదు
త్రిగుణ్ మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే గేమ్ పరంగా అప్పుడప్పుడు ఆశ్చర్యపరుస్తుంటాడు. బిగ్‌బాస్ 10 హౌసులో 47వ రోజైన శుక్రవారం నాటి ఎపిసోడ్‌లోనూ ఇలానే ఆడాడు. శివ్‌తో తొలుత ప్రత్యర్థిగా బరిలో నిలిచి, తర్వాత అతడితోనే కలిసి జట్టు కట్టి విజయం సాధించాడు. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిపోయాడు. ఇంతకీ శుక్రవారం అసలేం జరిగింది?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)గ్రీన్‌లో తన ఫొటో చూసుకుని దేబ్జానీ ఎమోషనల్ అయ్యింది. చివరికి న్యాయం గెలిచిందని కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతలో త్రిగుణ్ వచ్చి.. పోరాడావు గెలిచావు. నీతో పాటు అమన్, నీతూ గ్రీన్‌లో ఉండటం హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీరు గట్టిగా పోరాడారు. మొదటి నుంచి బరువులు మోస్తూ మూడు గంటలు బ్యాలెన్స్ చేశారు అని అన్నాడు. తర్వాత ఎల్లో లెవల్లో ఉన్న సభ్యులకు గ్రీన్ లెవల్లోకి వెళ్లి గోట్గా మారడానికి గోట్ ఆఫ్ కామన్ సెన్స్ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో స్క్రీన్‌లో వివిధ రకాల ప్రశ్నలు ఇవ్వగా, సమాధానం తెలిసిన వాళ్లు ముందు వెళ్లి బెల్ మోగించాలని ఎవరైతే ముందు బెల్ మోగించి సమాధానం చెప్తారో ఎక్కువ పాయింట్లు ఎవరు సాధిస్తారో వాళ్లే విజేతలని బిగ్‌బాస్ చెప్పాడు. తొలి ప్రశ్న తడి దూది, పొడి దూది గురించి అడగ్గా ముకేష్ బెల్ మోగించి తడిగా ఉన్న దూది ఎక్కువ బరువు ఉంటుందని తప్పు సమాధానమిచ్చాడు. రెండూ బరువుగానే ఉంటాయని నరేశ్ చాలా స్మార్ట్‌గా సమాధానమిచ్చాడు.ఈ టాస్క్‌లో మొదటి నుంచి ప్రతి చిన్నదానికి రచ్చ రచ్చ చేసిన ముకేశ్.. చివరకు ఎక్కువ పాయింట్లు సాధించి ‘గోట్ ఆఫ్ కామన్ సెన్స్’గా నిలిచాడు. దీంతో ఎల్లో లెవల్ నుంచి గ్రీన్ లెవల్‌కి చేరుకుని రెండు వారాలు ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిపోయాడు. అనంతరం ఎల్లో లెవల్లోని మిగిలిన పోటీదారులు గ్రీన్ లెవల్లోకి వెళ్లడానికి గోట్ ఆఫ్ స్పీడ్ టాస్క్ ఇచ్చారు. ఇందులో నలుగురు పోటీదారులు రెండు టీంలుగా పాల్గొనాలని ఇద్దరు గాడ్స్‌గా, ఇద్దరు దొంగలుగా మారాలని టాస్క్ ఇచ్చారు. ఎల్లో లెవల్లో మొత్తం ఐదుగురు(రాంప్రసాద్, నరేశ్, త్రిగుణ్, శివ, వర్షిణి) ఉండగా.. ఆడలేకపోతున్నా గానీ వర్షిణిని ఆడించడానికి ముకేశ్ తెగ ప్రయత్నించాడు. కానీ చివరకు అది జరగలేదు. రాంప్రసాద్, నరేశ్ దొంగలుగా.. త్రిగుణ్, శివ్ గాడ్స్‌గా గేమ్‌లోకి దిగారు.ఆటలో భాగంగా శివ్ కాలికి గట్టిగా దెబ్బ తిగిలినా వెనక్కి తగ్గలేదు. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో శివ్-త్రిగుణ్ గెలిచారు. అయితే వీళ్లిద్దరిలో ఒకరే గ్రీన్ లెవల్లోకి వెళ్లగలరని బిగ్‌బాస్ మెలిక పెట్టాడు. దీంతో శివ్ని కన్విన్స్ చేసిన త్రిగుణ్.. ఒక ఛాన్స్ ఇవ్వు శివా. నేను అడుక్కునే టైప్ కాదు కానీ చేతులు చాపి అడుగుతున్నా అని అన్నాడు. చూశారా మీరు నన్ను మోసం చేశారు. మీరే అడుగుతున్నారూ టైమ్ చూశారా’ అని శివ్ వెటకారంతో సెటైర్లు వేశాడు. ఎలాగైతేనేం శివ్ ఒప్పుకొన్నాడు.తర్వాత బిగ్‌బాస్‌తో శివ్ మాట్లాడుతూ.. గతవారం నన్ను కొంతమంది మోసం చేసిన త్రిగుణ్.. మోసపోయిన శివ అని. వైల్డ్ ఫైర్‌గా వచ్చాడు వైల్డ్ ఫూల్ అని అన్నారు. కాలచక్రం ఎలా ఉంటుందంటే అదే త్రిగుణ్‌తో కలిసి ఆడాల్సి వచ్చింది. గెలిచాను కూడా. ఈరోజు ఆయన వచ్చి నన్ను కన్విన్స్ చేశారు. ఆయన నన్ను మోసం చేసినా సరే చాలా కష్టపడి ఆడారు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. అతనే గోట్ బిగ్ బాస్ అని శివ్ అన్నాడు . దీంతో త్రిగుణ్‌ని గోట్ ఆఫ్ స్పీడ్‌గా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ వారంతో పాటు వచ్చేవారం త్రిగుణ్ ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: 'ఫౌజీ'లో సుభాస్ చంద్రబోస్ పాత్ర చేసింది ఎవరంటే?) -
బిగ్‌బాస్ హౌస్ కాదిది.. చేపల మార్కెట్!
బిగ్బాగ్ హౌస్‌లో నామినేషన్లు జరిగినా ప్రతిసారి రచ్చ రచ్చ అవుతోంది. ఈసారి అంతకు ఏం తక్కువ కాదన్నట్లు జరిగింది. చేపల మార్కెట్లా ఒకరిపై ఒకరు అరుచుకుని గోలగోల చేశారు. ఇంతకీ 10వ సీజన్లో 44 రోజైన మంగళవారం(అక్టోబర్ 20) ఎపిసోడ్లో అసలేం జరిగింది? ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఏకంగా ముఖ్యమంత్రికి తెగ నచ్చేసిన మమిత బైజు ప్రేమకథా సినిమా)మంగళవారం ఎపిసోడ్లో భాగంగా.. తొలుత షాలిని వెళ్లిపోడం గురించి వంశీ, త్రిగుణ్ మాట్లాడుకున్నారు. 'నిన్ను బయటకు పంపించేసి, షాలినిని ఇంట్లో ఉంచాలని ఒకడు (రోహిత్) అనుకున్నాడు. అది జరగలేదు. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నువ్వు వెళ్లిపోతావ్. షాలిని ఉంటుందని చాలా కాన్పిడెన్స్‌గా ఉన్నారు. నువ్వు సేవ్ కాగానే వాళ్లకు ఫ్యూజ్‌లు ఔట్ అయ్యాయి' అని వంశీతో త్రిగుణ్ అన్నాడు. దీంతో వంశీ.. నాకంటే ముందు రోహిత్ వెళ్తాడు. ఈ హౌస్‌లో ఉండటానికి అతనికంటే నాకే ఎక్కువ అర్హత' అని అన్నాడు. త్రిగుణ్ దగ్గర కూర్చున్న వర్షిణి.. ‘నేను గేమ్ ఆడటం లేదని నీతూ అంటుంది. మరి ఈమె ఏం పొడిచింది’ అని రుసరుసలాడింది. రోహిత్ దగ్గరకు వెళ్లిన సుధీర్.. షాలిని వెళ్లిపోయింది కాబట్టి నీకు ఇదే రైట్ టైమ్. ఏదైనా చేయగలవు. నీకు వీక్నెస్ ఏం లేదు’ అని అన్నాడు. దీంతో రోహిత్.. నేనూ అదే చెప్తున్నా. నేను కోల్పోవడానికి ఇక్కడేం లేదు. ఫుల్ ఎటాకింగ్ మోడ్‌లోకి దిగుతా. నాకు షాలిని వెళ్లిపోవడం గుడ్ అని నేను అనుకోను. ఎందుకంటే.. తన నా రీచార్జ్ పాయింట్' అని అన్నాడు.తర్వాత నామినేషన్ ప్రక్రియ తిరిగి మొదలైంది. తొలుత అమన్.. శివ్ని నామినేట్ చేశాడు. వైల్డ్ ఫైర్‌లా వచ్చి వైల్డ్ ఫూల్ అయ్యారు. గంట ఎపిసోడ్ చూసి వచ్చేశారు. 24 గంటలు చూసి వస్తే బాగుండేదని అన్నాడు. ఆ మాటతో శివ్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. బయట జనం గంట ఎపిసోడ్ చూసే ఓట్లేస్తారు. 24 గంటలూ చూసి కాదు. ఫూల్ నేను కాదు. మీరూ’ అని మాటలతో ఫటాఫట్ ఇచ్చేశాడు. తర్వాత వచ్చిన శ్వేత.. ఊహించని విధంగా త్రిగుణ్‌ని నామినేట్ చేసింది. ఫ్రంట్ ఫుట్‌లో ఆడతారనే అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక అది నిజం కాదని తెలిసింది. కప్పు కొట్టాల్రా అని అన్నారు. విన్నరే కప్పు కొడతాడు. విన్నర్ అనేవాడు నమ్మక ద్రోహం చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. గేమ్‌లో ఛీటింగ్ చేసి కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి తీసేశారు. అందుకే నామినేట్ చేస్తున్నా అని కారణాలు చెప్పింది. దీంతో త్రిగుణ్.. ఇక్కడికి వచ్చిన వాళ్లలో ఇమేజ్ లాస్ అవుతున్నది నేనే అని నాకు తెలుసు. నేను ఇక్కడికి విలన్ అవ్వడానికో.. హీరో అవ్వడానికో రాలేదు. హౌస్‌లో ఎన్నాళ్లు ఉంటే అన్నాళ్లు ఎంటర్టైన్ చేయడానికే వచ్చాను.. అదే నా గేమ్ స్ట్రాటజీ' అని చెప్పుకొచ్చాడు.అనంతరం వర్షిణి.. నీతూని నామినేట్ చేసింది. ఈ కోచ్ నాపై చేసిన అలిగేషన్స్ చేసే ముందు.. వాటిని ఆమె ఫాలో అవుతున్నారా? బయట విషయాలు ఇక్కడ చెప్పొద్దని అన్నారు. కానీ మీరు చేసేది ఏంటి? రూల్స్ ఫాలో కాను అని నన్ను అన్నారు. కానీ బిగ్‌బాస్ నుంచి అనౌన్స్మెంట్స్ వచ్చింది మీకే కదా. రూల్స్ ఫాలో అవ్వని మీరు, రూల్స్ గురించి మాట్లాడటం బేస్‌లెస్. ముకేష్‌ని పక్కనపెట్టుకుని గేమ్ ఆడుతున్నా అని అన్నావ్. మరి నువ్వేం పీకావ్. నా గేమ్ గురించి నీకెందుకు చెప్పాలి? అసలు నువ్వెవరు? నువ్వు వైల్డ్ ఫైర్ కాదు పెద్ద ఫ్లవర్వి. నువ్వు రావడం రావడమే రోహిత్-షాలినిల మధ్య మంట పెట్టి.. ఆమెని విడదీసి బయటకు పంపావ్’ అని వర్షిణి.. నీతూ పరువంతా తీసేసింది.తర్వాత సుధీర్, రామకృష్ణని నామినేట్ చేశాడు. త్రిగుణ్, సుధీర్‌ని నామినేట్ చేశాడు. అనంతరం రామకృష్ణ, ఝాన్సీని కౌంటర్ నామినేట్ చేశాడు. అగ్నిపరీక్షలో బాగానే ఆడావ్.. ఇక్కడికి వచ్చి ఆడింది ఏం లేదు. సింపతీ గేమ్ ఆడుతున్నావ్.. ఊ అంటే ఏడుస్తావ్ అంతే తప్ప.. నువ్వు చేసిందేం లేదు.. ఏడ్వడం నీకు ఎమోషన్ అయితే.. కాళ్లు మొక్కడం కూడా ఎమోషనే’ అని రామకృష్ణ అన్నాడు. ముకేశ్, వంశీని నామినేట్ చేశాడు. చివరలో కెప్టెన్ రాంప్రసాద్‌కి బిగ్‌బాస్ కెప్టెన్ పవర్ ఇచ్చాడు. నామినేట్ కాని నరేశ్, దేబ్జానీ, అమన్, ముకేశ్లలో నుంచి ఒకర్ని నేరుగా నామినేట్ చేయమని చెప్పడంతో అమన్ పేరు చెప్పాడు. అలా ఈ ఏడో వారంలో దక్షి, వర్షిణి, రోహిత్, సుధీర్, త్రిగుణ్, నీతూ, రామకృష్ణ, శివ్, ఝాన్సీ, శ్వేత, వంశీ, అమన్ నామినేట్ అయ్యారు. దేబ్జానీ, నరేశ్, ముకేష్, రాంప్రసాద్‌లు తప్ప మిగిలిన 12 మంది నామినేషన్లలో ఉన్నారు. (ఇదీ చదవండి: సర్ప్రైజ్ చేసిన దీపిక.. రెండో కూతురికి దేవుడి పేరు) -
బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేషన్లలో ఉన్నది వీళ్లేనా?
ఆదివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిన షాలినిని సర్ప్రైజ్ చేసిన హోస్ట్ నాగార్జున.. ఆమెని సీక్రెట్ రూంలో పెట్టాడు. ఆమె అలా ఉండగా మరోవైపు సోమవారం రావడంతో యధావిధిగా నామినేషన్ల ప్రక్రియ మొదలైపోయింది. నీతూ vs వర్షిణి, శివ్ vs రోహిత్ రచ్చ ప్రోమోల్లో ప్రధానంగా కనిపించింది. ఇంతకీ ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)ప్రోమోల బట్టి చూస్తే ఏడో వారం నామినేషన్లలో ఝాన్సీ, రామకృష్ణ ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. శాలిని కాళ్లు పట్టుకోవడం తనకు నచ్చలేదని ఆర్కేని ఝాన్సీ నామినేట్ చేసింది. అసలు ఇది పాయింటే కాదు, కాళ్ల పట్టుకోవడంలో తప్పు లేదని ఆర్కే వాదించాడు. ఝాన్సీ కూడా సింపతీ కోసం ట్రై చేస్తుందని ఆమెలా నటించి మరీ చూపించాడు. మరోవైపు వర్షిణి టాస్క్‌లు ఆడటం లేదంటూ నీతు ఫైర్ అయింది. ముఖేశ్‌ని అడ్డుపెట్టుకొని హౌస్‌లో ఉంటోందని వర్షిణిపై నీతు సంచలన కామెంట్స్ చేసింది.మరో ప్రోమోలో రోహిత్-సుధీర్ మధ్య వాదులాట నడిచింది. అలానే శివ్-రోహిత్ మధ్య పెద్ద గొడవే జరిగింది. మరోవైపు సీక్రెట్ రూంలోకి వెళ్లిన శాలిని.. అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఈ నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత షాలిని.. తిరిగి హౌస్‌లోకి వచ్చే అవకాశముంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఏడో వారానికిగానూ నీతు, దక్షి, రామకృష్ణ, వంశీ, అమన్, వర్షిణి, రోహిత్, త్రిగుణ్ నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'జైలర్ 2' కారణంగా రచ్చ.. చిరంజీవా? రజనీకాంతా?) -
బిగ్‌బాస్ 10: షాలిని ఎలిమినేట్.. వెక్కివెక్కి ఏడ్చేసిన రోహిత్
ఆదివారం వచ్చిందంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో కచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుంది. ఈసారి అలానే షాలిని ఔట్ అయింది. కాకపోతే చివరలో ట్విస్ట్ ఇచ్చిన హౌస్ట్ నాగార్జున, ఆమెని సీక్రెట్ రూంలోకి పంపించాడు. దీంతో అసలు కథ మొదలైంది. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగింది? హైలైట్స్ ఏంటనేది చూద్దాం.(ఇదీ చదవండి: 7 నిమిషాల్లో 'సినిమా' చూపించేశారు)ఎంట్రీ ఇచ్చిన నాగ్.. నామినేషన్లలో ఉన్న వాళ్లని సేవ్ చేసే ప్రాసెస్ మొదలుపెట్టాడు. ఆరుగురిలో వంశీ, కెప్టెన్ రాంప్రసాద్ సేవ్ అయ్యారు. ఇక హోస్ట్ వచ్చిన తర్వాత అంటే ఆలస్యంగా రావడంతో షాలినిని నామినేషన్ ప్రాసెస్‌లోకి రావొద్దని పక్కనపెట్టాడు. కాసేపటి తర్వాత పిలిచి నాట్ సేఫ్ అని చెప్పాడు.ఇంటి సభ్యులను రెండు టీమ్స్‌గా విడదీసి ప్రాపెర్టీ వాడి డ్యాన్స్ చేయమని నాగ్ డ్యాన్స్ చేయమని చెప్పాడు. కాసేపు పాటలు, డ్యాన్సులతో హౌస్ సందడిగా సాగింది. తర్వాత షాలిని కాళ్లమీద రామకృష్ణ పడటం గురించి డిస్కషన్ మొదలైంది. అన్నిసార్లు సారీ చెప్పడం కరెక్ట్ కాదు, అంత అవసరం లేదని నాగ్ అన్నాడు. అనంతరం నామినేష్లలో ఉన్నవాళ్లలో అమన్ సేఫ్ అయ్యాడు. స్టార్ ఆఫ్ ది వీక్‌గా రాంప్రసాద్ నిలిచాడు.తర్వాత నామినేషన్లలో ఉన్న రోహిత్ సేవ్ అయ్యాడు. చివరగా షాలిని, వర్షిణి మిగలగా వాళ్లలో షాలిని ఎలిమినేట్ అయింది. దీంతో రోహిత్ వెక్కివెక్కి ఏడ్చాడు. గేమ్ బాగా ఆడు.. విన్నర్ ట్రోఫీ తీసుకొని రా అంటూనే లవ్యూ అని రోహిత్‌కి ముద్దుపెట్టి మరీ షాలిని చెప్పింది. షాలిని రోహిత్‌ని హగ్ చేసుకొని చాలాసేపు మాట్లాడింది.అనంతరం స్టేజీ మీదకు వచ్చిన షాలిని.. తన ఏవీ చూసుకుని మురిసిపోయింది. తర్వాత ఇంటిసభ్యులతో నాగ్ మాట్లాడించాడు. నా జర్నీ మొత్తం నువ్వే ఉన్నావ్రా. చాలా బాగుంది మన జర్నీ అని రోహిత్‌తో షాలిని చెప్పింది. నీ ప్లేస్‌లో ఎవరు ఎలిమినేట్ అవాల్సింది, ఓ ముగ్గురు పేర్లు చెప్పు అని నాగ్ అనగానే వంశీ, సుధీర్, వర్షిణిల పేర్లు చెప్పింది. ఇక షాలిని వెళ్లిపోతుంటే నాగ్ పిలిచి నువ్వు ఎవిక్ట్ అవ్వలేదు సీక్రెట్ రూంకి వెళ్తున్నావ్ అని చెప్పి షాకిచ్చాడు. తర్వాతి వారం 'గోట్-గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' అని చెప్పిన నాగ్.. ఆదివారం ఎపిసోడ్ ముగించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్) -
బిగ్‌బాస్‌లో త్రిగుణ్ వెన్నుపోటు.. కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో ఆటలు, వ్యూహాలు, గొడవలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. కెప్టెన్సీ పోటీదారులను నిర్ణయించే టాస్క్‌లో మూడు టీమ్‌ల మధ్య హోరాహోరీ పోరు జరగ్గా.. త్రిగుణ్ వేసిన వ్యూహం ఇంట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒక టీమ్‌తో ఒప్పందం చేసుకుని మరో టీమ్‌కు సాయం చేయడంతో సభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మొత్తానికి రాంప్రసాద్ కెప్టెన్‌గా నిలిచాడు. మరి నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. దక్షికి పసుపు.. దేబ్జానీ అలక!ఎప్పుడూ సరదాగా ఉంటూ ఇంట్లో నవ్వులు పూయించే నరేశ్.. ఈసారి దక్షితో సరదాగా మాట్లాడాడు. ఆమె చేతికి గాయం కావడంతో అందరి ముందే పసుపు పెట్టాడు. ఆ తర్వాత సరదాగా ఆమె నుదుటిపై కూడా పసుపు పెట్టడంతో దేబ్జానీ అలిగిపోయింది. దీంతో నరేశ్ ఆమెను ఆటపట్టిస్తూ మరింత ఏడిపించాడు. అనంతరం ముకేశ్, వర్షిణిల దగ్గర ఈ విషయం ప్రస్తావించగా.. అమ్మాయిలు ఇలాంటి చిన్న విషయాలకే అలుగుతారని వర్షిణి సరదాగా చెప్పింది.‘సమరానికి సై’..మూడు టీమ్‌లకు చివరి టాస్క్‌గా ‘సమరానికి సై’ ఇచ్చారు. ఇందులో భాగంగా ఒక్కో టీమ్ నుంచి ఒక సభ్యుడు మట్టి గుంటలో ఉన్న బంతిని దక్కించుకుని తమకు కేటాయించిన బాక్స్‌లో వేయాలి. అలా చేసిన టీమ్‌కే ఆ రౌండ్లో పాయింట్లు లభిస్తాయి. ప్రతి రౌండ్లో సంచాలకుడు నిర్ణయించిన చోట 20 బోనస్ కాయిన్స్ ఉంచుతారు. వాటిని దక్కించుకున్నవారికి అదనపు ప్రయోజనం ఉంటుంది. అయితే బంతిని బాక్స్‌లో వేయకపోతే ఏ టీమ్‌కూ పాయింట్లు రావు.మొదటి రౌండ్లో వంశీ, రామకృష్ణ, రోహిత్ పోటీపడగా.. నీతూ మాస్టర్ సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ రౌండ్లో ఏ టీమ్‌కూ పాయింట్లు దక్కలేదు.రెండో రౌండ్లో మహిళా సభ్యులను బరిలోకి దించాలని నిర్ణయించుకున్నారు. గ్రీన్ టీమ్ నుంచి ఝాన్సీ, గోల్డ్ టీమ్ నుంచి శ్వేత బరిలోకి దిగగా.. మరో టీమ్ నుంచి సుధీర్ పోటీకి వచ్చాడు. రాంప్రసాద్ సంచాలకుడిగా వ్యవహరించాడు. ఈ రౌండ్లో ఝాన్సీ అద్భుతంగా ఆడి బంతిని బాక్స్‌లో వేసి విజయం సాధించింది. దీంతో గోల్డ్ టీమ్ నుంచి నాలుగు కుర్చీలను తీసుకునే అవకాశం గ్రీన్ టీమ్‌కు దక్కింది.త్రిగుణ్ డబుల్ గేమ్.. ఇంట్లో రచ్చ!మూడో రౌండ్లో శివ్, త్రిగుణ్, అమన్ బరిలోకి దిగారు. ఆటలో శివ్ త్రిగుణ్‌కు సహకరించగా.. త్రిగుణ్ మాత్రం అమన్‌కు సాయం చేసి బంతిని అతడికి అందించాడు. దీంతో అమన్ బంతిని బాక్స్‌లో వేసి తన టీమ్‌కు పాయింట్లు సాధించాడు. త్రిగుణ్ తమతో ఒక ఒప్పందం చేసుకుని ఇప్పుడు మరో టీమ్‌కు సాయం చేశాడని శివ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.‘వెన్నుపోటు పొడవడం మీ దగ్గరే నేర్చుకోవాలా?’త్రిగుణ్, సుధీర్ వ్యవహారంపై రోహిత్, షాలిని తీవ్రంగా స్పందించారు. సొంత టీమ్‌నే మోసం చేస్తారా? వెన్నుపోటు పొడవడం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సుధీర్, త్రిగుణ్లనే అడగాలని షాలిని ఘాటుగా వ్యాఖ్యానించింది. మరోవైపు సుధీర్‌పై రోహిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుటుంబంపై ఒట్టేసి మరీ న్యాయంగా ఆడుతున్నానని చెప్పావు.. కానీ మాట తప్పావంటూ నిలదీశాడు. ఈ పరిణామాలతో ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చివరకు గోల్డ్ టీమ్ నుంచి మూడు కుర్చీలు, బ్లూ టీమ్ నుంచి ఒక కుర్చీ తొలగించడంతో గ్రీన్ టీమ్ సభ్యులందరికీ కెప్టెన్సీ పోటీలో పాల్గొనే అవకాశం లభించింది.కెప్టెన్సీ టాస్క్.. ఏడుగురి మధ్య హోరాహోరీ!గ్రీన్ టీమ్ సభ్యులతో పాటు వైల్డ్‌ఫైర్ టీమ్‌కు చెందిన శివ్ దగ్గర 70 పాయింట్లు ఉండటంతో అతడికి కూడా కెప్టెన్సీ పోటీలో పాల్గొనే అవకాశం దక్కింది. దీంతో ముకేశ్, వంశీ, వర్షిణి, శివ్, రాంప్రసాద్, అమన్, ఝాన్సీ కెప్టెన్సీ రేసులో నిలిచారు. ఏడుగురు గోడకు ఏర్పాటు చేసిన హ్యాండిల్స్‌ను పట్టుకుని వేలాడుతూ తమ పట్టును నిరూపించుకోవాల్సిన టాస్క్ ఇది. రామకృష్ణ సంచాలకుడిగా వ్యవహరించాడు. పోటీదారులు ఒక్కొక్కరుగా తమ ప్రత్యర్థులకు అందుతున్న సహాయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. త్రిగుణ్ శివ్‌ను టార్గెట్ చేయగా.. రోహిత్, షాలిని వంశీని లక్ష్యంగా చేసుకున్నారు. చివరి వరకు ముకేశ్, రాంప్రసాద్ మాత్రమే టాస్క్‌లో మిగిలారు. రాంప్రసాద్ చివరి వరకు పట్టుదలతో నిలిచి విజయం సాధించి ఇంటి కొత్త కెప్టెన్‌గా నిలిచాడు.(ఇదీ చదవండి: నాగార్జున చెప్పిన నిష్ఠూరమైన 'నిజాలు') -
అందుకే షాలినిని ఉంచి నన్ను పంపించేశారు: చరణ్
బిగ్‌బాస్ తెలుగు 10 ఐదో వారం ముగిసింది. ఈ వారం అపూర్వ, చరణ్ మహాదేవ్ ఎలిమినేట్ కాగా.. ఐదుగురు కొత్త కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. శివ్, దక్ష, నీతూ మాస్టర్, శ్వేతా నాయుడు, రామకృష్ణ ఎంట్రీతో ఇంటి వాతావరణం మారిపోయింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన చరణ్.. తన జర్నీ, హౌస్‌లోని పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.హౌస్మేట్స్ ఓటింగ్‌తోనే ఎలిమినేషన్ప్రేక్షకుల ఓట్లతో రెండుసార్లు హౌస్‌లోకి వచ్చా. కానీ రెండు సార్లూ హౌస్మేట్స్ నిర్ణయం వల్లే బయటకు వచ్చా. ఈ సారి టాస్క్‌ల ప్రదర్శన మెరుగుపడిన టైంలోనే ఎలిమినేట్ కావడం బాధగా ఉంది. రీఎంట్రీ అవకాశం చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. నాకు, చైత్రకు ఈ అవకాశం దొరికింది. అగ్నిపరీక్ష నుంచి మొదలైన నా ప్రయాణంలో ప్రేక్షకులు చూపించిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. అప్పటి నుంచి ఇప్పటివరకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు అని తెలిపాడు.కామన్స్ వర్సెస్ సెలబ్రిటీలుహౌస్లో కామన్స్, సెలబ్రిటీల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపించిందని చరణ్ అభిప్రాయపడ్డాడు. అందరూ కలిసిమెలిసి ఉన్నప్పటికీ ఓటింగ్ విషయానికి వచ్చేసరికి సెలబ్రిటీలు తమవారికి, కామన్స్ తమవారికి మద్దతుగా నిలుస్తారని చెప్పాడు. కెప్టెన్సీ సమయంలోనూ ఈ విషయం బయటపడిందని పేర్కొన్నాడు.షాలిని, రోహిత్ మధ్య ఉన్న బంధం గురించి స్పందిస్తూ.. అది వారి వ్యక్తిగత విషయమని, తాను అందులో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశాడు.షాలినిని ఉంచి తనను పంపించారా?నన్ను బయటకి పంపించేందుకు బలమైన కారణాలు చెప్పలేదు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు షాలినిని టార్గెట్ చేయడం చూస్తుంటే.. ఆమెకు బయట నెగటివిటీ ఎక్కువగా ఉందని హౌస్మేట్స్ భావించవచ్చు. అందుకే షాలినిని హౌస్‌లో తనని ఉంచి నన్ను బయటకు పంపించి ఉండవచ్చు’అని అభిప్రాయ పడ్డాడు. (ఇదీ చదవండి: 28 రోజుల తర్వాత ఇంటికి.. యూట్యూబర్ భావోద్వేగ పోస్ట్) -
బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్లే.. డబుల్ ఎలిమినేషన్ ఎవరంటే?
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ ఐదో వారం ముగిసింది. ఈ వారాంతం ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా సాగింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీతో హౌస్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. అదే క్రమంలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా జరిగింది. అపూర్వ ఎలిమినేట్ కాగా.. ఆమెతో పాటు మరో కంటెస్టెంట్ హౌస్‌కు సెండాఫ్ ఇచ్చేశాడు. ఇంతకీ ఆ వివరావేంటో చూసేద్దాం.వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని ముందే ప్రకటించడంతో ఎవరెవరు అనే దానిపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ముందుగా ఊహించనట్లుగానే ప్రియాంక జైన్ ప్రియుడు, బుల్లితెర నటుడు శివ కుమార్ హౌస్‌లో అడుగుపెట్టారు. బైక్‌పై ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిగా అనిపించింది. శివతో పాటు నీతూ నటరాజ్, దక్ష గుత్తికొండ, శ్వేతానాయుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.చివరి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా శ్రీకాకుళంకు చెందిన కామనర్ ఎంట్రీ ఇచ్చాడు. నవరసాలు రామకృష్ణకు హౌస్ మేట్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. హోస్లో వస్తూనే నరేశ్, రోహిత్‌పై అభిమానం చాటుకున్నారు. నాగార్జున బ్యాడ్జెస్‌ను ఒకటి నరేశ్‌కు ఇవ్వగా.. మరొకటి రోహిత్‌కు ఇచ్చిన ఎలిమినేషన్ నుంచి సేవ్ చేశాడు.డబుల్ ఎలిమినేషన్..ఈ వారం ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగా అపూర్వ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. ఆ తర్వాత చివర్లో ఇద్దరు మాత్రమే నామినేషన్స్‌లో మిగిలారు. షాలినితో పాటు చరణ్ మాత్రమే ఎలిమినేషన్లో లిస్ట్‌లో నిలిచారు. వీరిలో ఎవరిని హౌస్‌లో ఉంచాలా? అనే విషయంలో ఓటింగ్ నిర్వహించారు నాగ్. ఇద్దరితో ఎవరైతే హౌస్‌లో ఉండాలని భావిస్తున్నారో వారి పేరు రాసి బాక్స్‌లో వేయాలని సూచించారు. ఈ ఓటింగ్‌లో 11 మంది పార్టిసిపేట్ చేయగా.. షాలినికి 10 ఓట్లు, చరణ్‌కు కేవలం ఒక్క ఓటు మాత్రమే పడింది. దీంతో చరణ్ హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. బయటికి వచ్చే సమయంలో చరణ్ ఎమోషనల్ అయ్యారు. నా వల్ల ఎవరైనా హార్ట్ అయితే క్షమించాలని కంటెస్టెంట్స్‌ను కోరారు. బయటికి వచ్చిన చరణ్‌ను నాగ్ హత్తుకుని సెండాఫ్ ఇచ్చారు. అలా ఈ వారాంతం ఎపిసోడ్ ముగిసింది. ఇక దశవతారం కాన్సెప్ట్‌లో భాగంగా ఈ వారంలో రోడ్ బ్లాక్ అనే కొత్త టాస్క్ పరిచయం చేశారు. -
బిగ్‌బాస్ అపూర్వ ఎలిమినేట్ .. హౌస్మేట్స్ బండారం బట్టబయలు
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఐదో వారం ఉత్కంఠకు తెరపడింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన అపూర్వ ప్రయాణం ముగిసింది. బయట జరుగుతున్న ఆటను చూసి వచ్చినా.. హౌస్‌లో తనదైన ముద్ర వేయడంలో ఆమె విఫలమైంది. ముఖ్యంగా షాలినీ, త్రిగుణ్‌లతో వివాదాలకే పరిమితం కావడంతో ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు పొందలేకపోయింది. దీంతో ఐదో వారం ఓటింగ్‌లో వెనుకబడిన అపూర్వ ఎలిమినేట్ అయింది. అయితే హౌస్ నుంచి బయటకు వెళ్లే ముందు పలువురు కంటెస్టెంట్లకు ఆమె ఇచ్చిన సలహాలు, చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.ఝాన్సీ ఎమోషనల్.. ఐదో వారం ఎలిమినేషన్లో భాగంగా అపూర్వ పేరు ప్రకటించడంతో హౌస్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఆమె బయటకు వెళ్తుందని తెలిసిన ఝాన్సీ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఇంట్లో నీ గురించే ఎక్కువగా బాధపడతానని చెబుతూ అపూర్వకు వీడ్కోలు పలికింది. ఆటను జాగ్రత్తగా ఆడాలని ఝాన్సీకి సూచించిన అపూర్వ.. హౌస్ నుంచి బయటకు వచ్చింది.స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత తన బిగ్‌బాస్ ప్రయాణానికి సంబంధించిన వీడియోను చూసి అపూర్వ భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా ఇంట్లోకి అడుగుపెట్టే ముందు తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంది. ‘మా నాన్న ఇంట్లోకి వచ్చే ముందు పరువు తీయకు.. పరువు నిలబెట్టు చాలు అని చెప్పారు. నేను అదే చేశానని అనుకుంటున్నా’ అని అపూర్వ చెప్పుకొచ్చింది.రోహిత్‌కు హద్దుల్లో ఉండాలని హితవుఅనంతరం నాగార్జున సూచనతో అపూర్వ హౌస్‌మేట్స్‌కు బిట్టర్ షాట్స్ ఇస్తూ వారి ఆటపై తన అభిప్రాయాలను వెల్లడించింది. మొదట రోహిత్‌కు బిట్టర్ షాట్ ఇచ్చింది. పక్కన ఉన్నవారిని తక్కువగా చూడొద్దని, తనను తాను ఎక్కువగా అంచనా వేసుకోవడం తగ్గించుకోవాలని సూచించింది. ఆటలో సమీకరణాలు ఎప్పుడైనా మారవచ్చని హెచ్చరించింది. తన ఆటపై నమ్మకం ఉండటం మంచిదే కానీ, అది హద్దులు దాటకూడదని రోహిత్‌కు హితవు పలికింది.రామ్ ప్రసాద్‌పై అపూర్వ ఘాటు వ్యాఖ్యలుఆ తర్వాత రామ్ ప్రసాద్‌కు బిట్టర్ షాట్ ఇచ్చిన అపూర్వ.. రిలేషన్స్ కారణంగా ఆటలో ఇతరులపై ఆధిపత్యం చెలాయిస్తున్నావంటూ విమర్శించింది. నీ స్వభావంలో స్వార్థం కనిపిస్తోందని, ఒకరి కోసం మరొకరికి అన్యాయం చేస్తున్నావని వ్యాఖ్యానించింది. ఆటలో వ్యక్తిగత సంబంధాల ప్రభావం ఎక్కువ కాకుండా చూసుకోవాలని పరోక్షంగా సూచించింది.షాలినీకి కీలక సలహాషాలినీ ఆట తీరుపైనా అపూర్వ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది. ‘నిన్ను నువ్వు కోల్పోయావ్.. అగ్నిపరీక్షలో ఉన్నది వేరు, ఇక్కడ ఆట వేరు. చెట్టు చాటున ఉంటున్నావ్.. నీ కోసం నువ్వు ఆడు. ఆటలోకి దిగు.. వేరే విషయాల్లోకి వెళ్లిపోయావ్’ అంటూ సూచించింది. ఎదుటివారు చెప్పేది పూర్తిగా విన్న తర్వాతే స్పందించాలని సలహా ఇచ్చింది. తన మాటలు నచ్చితే స్వీకరించాలని, లేదంటే వదిలేయవచ్చని షాలినీకి చెప్పింది. -
ఆమెను టార్గెట్ చేసిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్.. ఎవరెవరో తెలుసా?
బిగ్‌బాస్ రియాలిటీ షో అప్పుడే ఐదోవారం ఎండింగ్‌కు వచ్చేసింది. ఇక వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే చాలు.. నాగార్జున ఎంట్రీతో మామూలుగా ఉండదు. ఇక ఈ వారం ఎలిమిషన్తో పాటు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఉండడంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సారి దాదాపు ఐదుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రోమో రిలీజ్ కాగా.. ఇవాల్టి ఎపిసోడ్‌పై మరింత ఆసక్తి పెరిగింది.వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కన్ఫామ్ కావడంతో ఎవరనే విషయంపై ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. తాజాదా రిలీజైన ప్రోమోలో వారి ఫేస్‌లు చూపించారు. ఇక్కడే కంటెస్టెంట్స్ చిన్నపరీక్ష పెట్టాడు. ఆ మాస్క్ వెనక ఎవరు ఉన్నారో చెప్పాలని అడిగాడు. అయితే దాదాపు గెస్ చేయలేకపోయారు. అయితే వైల్డ కార్డ్ కంటెస్టెంట్స్‌ను హౌస్‌లో ఉన్నవారిపై తమ అభిప్రాయాలు చెప్పాలని నాగ్ కోరాడు. అయితే ఇక్కడ అందరూ ఏకధాటిగా షాలిని టార్గెట్ చేశారు.హౌస్‌లో షాలిని అసలు గేమ్ ఆడటం లేదని అన్నారు. రోహిత్‌ను అడ్డుపెట్టుకుని గేమ్ ఆడుతోందని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లలో ఒకరు అన్నారు. దీనికి షాలిని బదులిస్తూ.. హౌస్‌లోకి వచ్చాకా చూసుకుందాం అంటూ గట్టిగానే స్పందించింది. దీంతో ఈ ప్రోమో చూస్తుంటే ఇవాల్డి ఎపిసోడ్ ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉండనుందని అర్థమవుతోంది. మరోవైపు మనకున్న సమాచాపం ప్రకారం శివ కుమార్, సాక్షి నాయుడు, డాక్షి గుత్తికొండ, నీతూ నటరాజ్, రామకృష్ణ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఈ రోజు క్లారిటీ రానుంది. -
కంటెస్టెంట్స్‌కు నాగ్ మాస్ క్లాస్.. ఈ వారం ఊహించని ఎలిమినేషన్..!
బిగ్‌బాస్ రియాలిటీ షో అప్పుడే ఐదోవారం ఎండింగ్‌కు వచ్చేసింది. ఇక వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే చాలు.. నాగార్జున్ ఎంట్రీ ఇచ్చేస్తాడు. ఈ వారంలో హౌస్‌లో జరిగిన సంఘటనలు, వివాదాలపై క్లాస్ పీకడం జరుగుతుంది. అయితే ఈ వీకెండ్ ఎపిసోడ్లో మరింత ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఈ వీకెండ్లో ఏం జరిగిందో హైలెట్స్‌లో చూసేద్దాం. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రియాలిటీ షో రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. అయితే ఈ వీకెండ్లో జరిగిన పరిణామాలు ప్రేక్షకులను షాక్‌కు గురిచేశాయి. వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ప్రతి ఒక్క కంటెస్టెంట్‌ను నిలబెట్టి క్లాస్ పీకారు.ఐదో వారం ఎలిమినేషన్స్‌లో కెప్టెన్ వర్షిణి, వంశీ, సుధీర్ మినహా మిగిలిన కంటెస్టెంట్లంతా ఉన్నారు. రోడ్ టూ రీలోడ్ టాస్క్‌లో కొందరు సేవ్ కాగా.. చివరకు రోహిత్, షాలిని, అపూర్వ, చరణ్, నరేశ్ మిగిలారు. ఓటింగ్ పరంగా రోహిత్ దూసుకెళ్తుండగా.. చరణ్, షాలినిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు. కానీ ఎవరు ఊహించని విధంగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అపూర్వ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది.అయితే మూడు వారాల క్రితం మరో కంటెస్టెంట్ మిథిలేశ్‌తో కలిసి అపూర్వ హౌస్‌లోకి అడుగుపెట్టింది. మిథిలేష్ రూ.15 లక్షల సూట్‌కేస్ ఆఫర్ తీసుకుని జాక్‌పాట్ కొట్టేశాడు. అపూర్వ రాగానే కెప్టెన్ అయినప్పటికీ దూకుడు, విపరీతమైన అరుపులతో హౌస్‌మేట్స్‌తో విభేదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఓటింగ్‌లో ఆమెకు ఆడియన్స్ నుంచి అనుకున్న స్థాయిలో ఓట్లు పడకపోవడంతోనే ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు ఈ వారంలో ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరిలో శివ కుమార్, సాక్షి నాయుడు, డాక్షి గుత్తికొండ, నీతూ నటరాజ్, రామకృష్ణ ఉన్నారని టాక్ వినిపిస్తోంది. -
బిగ్‌బాస్ 10: ఐదోవారం ఊహించని ఎలిమినేషన్!
బిగ్‌బాస్ 10వ సీజన్లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చే టైం వచ్చేసింది. కొత్తగా మరో ఐదుగురు వస్తున్నారంటే హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ పక్కా. ఈసారి అలానే కెప్టెన్ వర్షిణి, ఇమ్యూనిటీ సొంతం చేసుకున్న వంశీ, సుధీర్ తప్పితే మిగిలిన వాళ్లంతా నామినేట్ అయ్యారు. 'రోడ్ టూ రీలోడ్'లో భాగంగా పలు గేమ్స్ పెట్టి ఇందులో గెలిచిన వాళ్లని సేవ్ చేస్తూ వచ్చారు. అలా చివరకు రోహిత్, షాలిని, అపూర్వ, చరణ్, నరేశ్ నిలిచారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా)అయితే వీళ్లలో రోహిత్ ఓటింగ్ పరంగా దూసుకుపోతుండగా.. చరణ్, షాలిని లాంటి వాళ్లు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్లిద్దరూ లేదంటే ఒకరు హౌస్ నుంచి బయటకెళ్లిపోవచ్చనే అంతా అనుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ట్విస్ట్ అన్నట్లు అపూర్వ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే గనక షాకింగ్ అని చెప్పొచ్చు.ఎందుకంటే ఈమె వచ్చి రెండు వారాలు కూడా కాలేదు. అంటే గత నెల 24వ తేదీన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వచ్చింది. ఈమెతో పాటే వచ్చిన మిథిలేష్.. రెండే రోజులుండి రూ.15 లక్షలు తీసుకుని ఎలిమినేట్ అయిపోయాడు. ఈమె మాత్రం లోపల ఉండిపోయింది. ఇప్పుడేమో ఓటింగ్ తక్కువ వచ్చిన కారణంగా ఎలిమినేట్ అయిపోయింది! ఈమె ఎగ్జిట్ శనివారం ఉండగా.. మరొకరు ఆదివారం ఎలిమినేట్ కావొచ్చు. మరి రెండో దురదృష్టవంతులు ఎవరనేది చూడాలి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఆట మార్చేసిన ఝాన్సీ.. డేంజర్ జోన్లో ప్రేమపక్షులు) -
బిగ్‌బాస్ 10: ఆట మార్చేసిన ఝాన్సీ.. డేంజర్ జోన్లో ప్రేమపక్షులు
గ్రూపులుగా టాస్క్‌లు పెట్టి నామినేషన్స్ నుంచి సేవ్ చేసుకుంటూ వస్తున్న బిగ్‌బాస్.. కెప్టెన్ అయ్యేందుకు కూడా టాస్క్, గేమ్స్ ఆడించాడు. అలా ఈసారి కొత్తగా ఇంకొకరు కెప్టెన్ అయ్యారు. ముందుచూపుతో ఆలోచించిన ఝాన్సీ.. పక్కా ప్లాన్ వేసి నామినేషన్స్ నుంచి సేవ్ అయింది. ఇంతకీ శుక్రవారం(అక్టోబర్ 09) ఎపిసోడ్లో అసలేం జరిగింది?(ఇదీ చదవండి: ఇండస్ట్రీలో నన్ను తొక్కేస్తున్నారు: స్టార్ హీరోయిన్)బిగ్‌బాస్ లీడర్ బోర్డ్‌లో చివరి స్థానాల్లో ఉన్న రోహిత్-షాలిని.. ముకేశ్-ఝాన్సీల గ్రూప్స్‌లో ఇద్దరు డేంజర్ జోన్లో ఉంటారు. మరో ఇద్దరు ఓ టీమ్‌గా మారి అయి ముందుకు వెళ్తారని బిగ్‌బాస్ చెప్తాడు. రోహిత్ డేంజర్ జోన్లో ఉంటే.. ఝాన్సీ ఎలిమినేషన్ నుంచి సేవ్ అయి తన పవర్ వాడుతానని చెప్పి ముకేశ్‌ని ముందుకెళ్లమని చెప్పింది.తర్వాత అపూర్వ, చరణ్, రాంప్రసాద్, నరేశ్, ముకేశ్, షాలినికి 'ఫ్లిప్ చేయ్-ఫేస్ చేయ్' టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో ఏర్పాటుచేసిన టైల్స్‌ని తిరగేయాలి. వాటిలో టాస్క్ వస్తే అది పూర్తి చేయాలి. ఇంటి సభ్యులు ఓటు వేసి ఒకరిని గేమ్ నుంచి అవుట్ చేయాలి అనడంతో అంతా కలిసి అపూర్వని తీసేశారు. తర్వాత డైస్ వేసి ఎవరికి పెద్ద నంబర్ వస్తే వాళ్లు గేమ్ నుంచి ఎలిమినేట్ అవ్వాలి అని వడంతో షాలిని ఎలిమినేట్ అయిపోయింది. 'యూ ఆర్ ఎలిమినేటెడ్' టైల్ రావడంతో ముకేశ్, గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత డ్యాన్స్ వేసి అందులో ఒకరిని ఎలిమినేట్ చేయాలని అనడంతో రాంప్రసాద్, చరణ్‌లలో చరణ్‌ని అందరూ ఎలిమినేట్ చేశారు. చివరగా ఈ గేమ్‌లో రాంప్రసాద్, నరేశ్ గెలిచారు. అనంతరం రోహిత్ అపూర్వ ని తనబ్యాచ్ లో కలుపుకుందామని మాట్లాడటానికి ట్రై చేద్దామంటే షాలిని గొడవ పెట్టుకుంది అపూర్వతో. ఇక లీడర్ బోర్డ్‌లో రాంప్రసాద్, నరేశ్ ముందు ఉండటంతో ఈ ఇద్దరిలో ఒకరిని సేఫ్ జోన్లోకి వెళ్లమని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో రాంప్రసాద్ సేఫ్ అయి నామినేషన్లో నుంచి సేఫ్ అయ్యాడు. తర్వాత ఝాన్సీ తన పవర్ వాడి నామినేషన్ నుంచి సేఫ్ అయింది. తర్వాత దేబ్జానీ, రాంప్రసాద్, త్రిగుణ్, అమన్, వర్షిణి, సుధీర్, వంశీ కెప్టెన్సీ కంటెండర్స్ అవగా... రోహిత్, షాలిని, అపూర్వ, చరణ్, నరేశ్ నామినేషన్స్‌లో ఉన్నారు.అయితే ఎంపికైన ఏడుగురిలో ఐదుగురు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ పోటీలో ఉంటారని, అదెవరో మీరే తేల్చుకోండి అని బిగ్‌బాస్ చెప్పడంతో ఏడుగురు తమ పాయింట్స్ చెప్పుకున్నారు. దాంతో అందరూ ఓటింగ్ పెట్టుకుందామని అంటే అమన్ సరే అని అన్నాడు. వర్షిణి, అమన్‌కి డ్రాప్ అయిపోమని చెప్పింది. అమన్ ముందు సరే అన్నాడు గానీ తర్వాత రోహిత్‌తో మాట్లాడిన తర్వాత వద్దని అన్నాడు. అమన్ కోసం రోహిత్, అపూర్వ గొడవ పడినా చివరకు అమన్, వర్షిణిని లిస్ట్ నుంచి తీసేశారు. ఇక మిగిలిన దేబ్జానీ, సుధీర్, రాంప్రసాద్, త్రిగుణ్, వంశీ గేమ్ ఆడారు. తొలి రౌండ్లో దేబ్జానీ, త్రిగుణ్ అవుట్ అయిపోగా తర్వాత టాప్‌లో నిలిచిన సుధీర్ కెప్టెన్ అయిపోయాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: సూపర్‌స్టార్ అని ఎప్పుడూ అనుకోలేదు: రజనీకాంత్) -
బిగ్‌బాస్‌లో దోమల గోల.. ముకేశ్, నరేశ్ కామెడీ మామూలుగా లేదుగా..!
బిగ్‌బాస్ తెలుగు 10లో ఐదో వారం ఆట ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటికే టాస్కుల్లో అదరగొట్టిన అమన్, త్రిగుణ్ సేఫ్ అయ్యారు. మరోవైపు లీడర్‌బోర్డులో మార్కుల ఆధారంగా మిగిలిన కంటెస్టెంట్ల మధ్య పోటీ నెలకొంది. తాజాగా విడుదలైన ప్రోమోలో ‘ఫ్లిప్ చెయ్.. ఫేస్ చెయ్’ టాస్క్‌లో జరిగిన ఆసక్తికర పరిణామాలు కనిపించాయి. తక్కువ మార్కులతో ఉన్న షాలినీ, రోహిత్ జంట డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది.ముకేశ్ వింత చేష్టలు.. అపూర్వకు షాక్!ఫ్లిప్ చెయ్.. ఫేస్ చెయ్ టాస్కులో భాగంగా మొదట ముకేశ్ డైస్ తీసుకున్నాడు. ఐదు రకాలుగా వివిధ చేష్టలు చేయాలనే టాస్క్ రావడంతో వింతగా నటిస్తూ నవ్వించాడు. ఆ తర్వాత అపూర్వ వంతు వచ్చింది. ఇంట్లోని వారంతా కలిసి ఒకరిని బయటకు పంపించాలనే టాస్క్ ఆమెకు ఎదురైంది. దీంతో కంటెస్టెంట్లంతా చర్చించుకుని అపూర్వ పేరును సూచించడంతో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది.నరేశ్ ఫ్లిప్ చేయగా డైస్ రోల్ చేసి అత్యధిక నంబర్ వచ్చిన వ్యక్తిని ఎలిమినేట్ చేయాలనే టాస్క్ వచ్చింది. ఈ క్రమంలో నరేశ్, చరణ్, రామ్ ప్రసాద్‌లకు ఒకటి చొప్పున రాగా.. ముకేశ్‌కు రెండు, షాలినీకి ఐదు వచ్చాయి. అందరిలోనూ అత్యధిక సంఖ్య షాలినీకే రావడంతో ఆమె ఈ టాస్కులో ఎలిమినేట్ అయింది.నవ్వించిన నరేశ్!మరోవైపు ముకేశ్‌కు దోమలా నటించాలనే టాస్క్ వచ్చింది. దీంతో దేబ్జానీ చుట్టూ తిరుగుతూ ఆమెను ఆటపట్టించాడు. 'ఈమె దగ్గర బ్లడ్ స్మెల్ కంటే బటర్ స్మెల్ వస్తోందేంటి?' అంటూ కామెడీ చేశాడు. తర్వాత షాలినీ దగ్గరకు వెళ్లగా.. 'ఈ దోమ ఏంటి.. మీద వాలుతోంది కానీ ఏం చేయడం లేదు' అని షాలినీ అనడంతో ‘పక్కనే డేంజర్ బెల్ ఉంది’ అని ముకేశ్ అనడంతో నవ్వులు పూశాయి. వర్షిణితోనూ ముకేశ్ సరదాగా ఫ్లర్ట్ చేశాడు. 'ఏ ఊరి సుందరో తెలియడం లేదు కానీ.. రంభ, ఊర్వశి, మేనక వేస్ట్' అంటూ ఆమెను పొగిడాడు. తర్వాత నరేశ్‌ను దోమలా నటించమని బిగ్‌బాస్ కోరగా.. అతడు కూడా దోమలా మారిపోయి.. వర్షిణి దగ్గరకు వెళ్లి మొత్తం రక్తం పీల్చేస్తానంటూ కామెడీ చేశాడు.మరి ఈ టాస్కుల ప్రభావం కంటెస్టెంట్ల తదుపరి ఆటపై ఎలా ఉంటుందో చూడాలి.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌తో తమన్ డ్యాన్స్.. జోష్‌లో మ్యూజిక్ డైరెక్టర్..) -
బిగ్‌బాస్ 10: ఎలిమినేషన్ నుంచి ఆ ఇద్దరు సేఫ్.. పుల్లపెట్టిన రోహిత్
ఈవారం బిగ్‌బాస్ హౌస్‌లో రోడ్ టూ రీలోడ్ అనే టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా కొన్ని గేమ్స్ పెట్టగా.. అందులో గెలిచిన ఓ ఇద్దరు.. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యారు. అలానే తక్కువ పాయింట్ల కారణంగా రోహిత్-షాలిని డేంజర్ జోన్లో పడ్డారు. ఇంతకీ గురువారం(అక్టోబర్ 08) రాత్రి బిగ్‌బాస్ హౌస్‌లో అసలేం జరిగింది? ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకున్నాయనేది హైలైట్స్‌లో చూద్దాం.గత వీకెండ్లో గిఫ్టులు గెలుచుకున్న ఝాన్సీ, ముకేశ్‌కి బిగ్‌బాస్.. హ్యాండ్‌బ్యాగ్, షూ పంపించాడు. తర్వాత చరణ్.. దేబ్జానీని కాసేపు ఫ్లర్ట్ చేశాడు. త్రిగుణ్, రోహిత్, షాలినిల దగ్గరకు వచ్చి అపూర్వ గురించి మాట్లాడాడు. మరోవైపు బిగ్‌బాస్.. నామినేషన్లలో ఉన్నవాళ్లని జంటలుగా విడగొట్టి స్టెప్ రోల్ గోల్ గేమ్ పెట్టాడు. ఇందులో ఆర్డర్ ప్రకారం గెలిచిన వాళ్లకు పాయింట్లు వస్తాయని చెప్పాడు. రాంప్రసాద్ టాస్క్‌ని మొదట పూర్తిచేశాడు. ఓవరాల్‌గా ఆట పూర్తయ్యేసరికి అమన్, రాంప్రసాద్, ముకేశ్, షాలిని, అపూర్వ.. వరసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. దీంతో అమన్ టీంకి 100, రాంప్రసాద్ టీంకి 80, ముకేశ్ టీంకి 60, షాలిని టీంకి 40, అపూర్వ టీంకి 20 పాయింట్లు లభించాయి.గేమ్ మధ్యలో ఉన్నప్పుడు గదిలోకి అపూర్వ రాగానే మేం మాట్లాడుకోవాలి మాకు ప్రైవసీ ఇవ్వండని రోహిత్ అనగానే అపూర్వ వెళ్లిపోయింది. గేమ్ అయిపోయిన తర్వాత రోహిత్ ఈ విషయం గురించి అపూర్వతో మాట్లాడి నేను నిన్ను అనలేదని చెప్పడానికి ప్రయత్నించాడు. ఆ విషయమే నాకు గుర్తు లేదని అపూర్వ చెప్పింది. కానీ అనవసరంగా మధ్యలోకి వచ్చిన షాలిని.. అపూర్వతో గొడవ పెట్టుకుంది. దీంతో అపూర్వ-షాలిని కాసేపు తిట్టుకుని ఒకరిపై ఒకరు అరుచుకున్నారు.లీడర్ బోర్డ్‌లో 180 పాయింట్లతో మొదటి స్థానంలో అమన్-త్రిగుణ్ ఉండటంతో నామినేషన్ల నుంచి సేప్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. మూడో టాస్క్‌గా చిత్రం భళారే విచిత్రం ఇచ్చారు. మిగతా నాలుగు జంటలు ఇందులో పాల్గొన్నాయి. స్క్రీన్ మీద కొన్ని ఆర్డర్‌గా బొమ్మలు వచ్చాయి. సంచాలకులు వర్షిణి, అమన్, త్రిగుణ్ నెంబర్లు చెప్పగానే వాటిని జంటల్లోని ఒకరు ఓ బోర్డు మీద గీయాల్సి ఉంటుంది. తర్వాత చెప్పిన నంబర్ ప్రకారం డార్క్ యార్డ్ గదిలో ఉన్న వస్తువుని తీసుకొచ్చి సర్కిల్లో పెడితే కరెక్ట్‌గా పెట్టిన వాళ్లకు పాయింట్లు వస్తాయి. షాలిని, అపూర్వ, నరేశ్, ఝాన్సీలు బోర్డు మీద డ్రాయింగ్ వేస్తే.. రోహిత్, చరణ్, రాంప్రసాద్, ముకేశ్లు సంచాలకులు చెప్పిన వస్తువులు తీసుకొచ్చి సర్కిల్లో పెట్టాలి.మొదట డ్రాయింగ్ అర్థం కావడం లేదని బిగ్‌బాస్ మళ్లీ డ్రాయింగ్ వేయమని చెప్పాడు. బ్రేక్ టైంలో ఝాన్సీ, ముకేశ్‌కి అన్ని బొమ్మల పేర్లు చెప్పి చీటింగ్ చేసిందని షాలిని గొడవ పెట్టుకుంది. తర్వాత ముకేశ్, రోహిత్, చరణ్‌లని రెండో రౌండ్ బొమ్మ తేవడానికి సంచాలక్.. వాళ్ల ముగ్గురిని ఆపి కేవలం రాంప్రసాద్కే వెళ్లమని చెప్పారు. దాంతో మేం మాట్లాడలేదని రోహిత్, షాలిని గొడవపడ్డారు. రాంప్రసాద్‌కి ఛాన్స్ రావడంతో ఒక పాయింట్ వచ్చింది. మూడో రౌండ్లో ముకేశ్ బొమ్మ తెచ్చినా కౌంట్ చేయమని అన్నారు. నాలుగో రౌండ్ నుంచి అందరూ ఆడారు. ఈ గేమ్‌లో ముకేశ్ ఒకటి కరెక్ట్ చెప్పగా.. రోహిత్ రెండు, చరణ్ రెండు, రాంప్రసాద్ ఐదు బొమ్మలు సరిగ్గా చెప్పాడు. ఎక్కువ కరెక్ట్‌గా చెప్పడంతో రాంప్రసాద్, నరేశ్ మొదటి స్థానంలో నిలిచారు. వీళ్లకి మొత్తం 220 పాయింట్లు వచ్చాయి. అపూర్వ-చరణ్ 200, ముకేశ్-ఝాన్సీ 160, రోహిత్-షాలిని 140కి లభించాయి. అలా గురువారం నాటి ఎపిసోడ్ ముగిసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక బట్టి చూస్తే రోహిత్-షాలిని డేంజర్ జోన్లో ఉన్నారు. -
బిగ్‌బాస్‌లో కొత్త ట్విస్ట్.. నామినేషన్స్‌లో ఉన్నవారికి..
బిగ్‌బాస్ తెలుగు 10లో రోజురోజుకూ ఆట మరింత రసవత్తరంగా మారుతోంది. నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లకు ఎలిమినేషన్ భయం వెంటాడుతుండగా.. తాజాగా బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌తో హౌస్‌లో పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఈసారి కేవలం ప్రేక్షకుల ఓటింగ్ మాత్రమే కాకుండా.. టాస్కుల్లో గెలుపు కూడా కంటెస్టెంట్లను సేఫ్ చేసే తాళంగా మారింది. దీంతో గెలిచి తీరాలనే పట్టుదలతో కంటెస్టెంట్లు బరిలోకి దిగారు. ఈ క్రమంలో అపూర్వ, షాలినీ మధ్య మాటల యుద్ధం జరగడంతో పాటు.. సుధీర్ పెళ్లి టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. మరి నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..బిగ్‌బాస్ కీలక హెచ్చరిక..నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ కీలక హెచ్చరిక చేశాడు. ఇంట్లోకి కొత్త కంటెస్టెంట్లు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే నామినేషన్స్‌లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. దీంతో హౌస్‌లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. నామినేషన్స్‌లో ఉన్న దేబ్జానీ, వంశీ, సుధీర్, వర్షిణి ఫొటోలను ఎండిపోయిన చెట్టుపై ఉంచారు. మరోవైపు వికసించిన చెట్టును ఏర్పాటు చేశారు. ఆటల్లో గెలిచి ఎండిపోయిన చెట్టు నుంచి వికసించిన చెట్టు మీదకు చేరితేనే సేఫ్ అవుతారని బిగ్‌బాస్ ప్రకటించాడు. ఈసారి ఎలిమినేషన్ రెండు తాళాలపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. అందులో ఒక తాళం ప్రేక్షకుల చేతిలో ఉంటే.. మరో తాళం ఈ టాస్కుల చేతిలో ఉంటుందని వివరించాడు.దీంతో కంటెస్టెంట్లను జంటలుగా విడిపోయి ఆట ఆడాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. అమన్-త్రిగుణ్, రోహిత్-షాలినీ, అపూర్వ-చరణ్, నరేష్-రాంప్రసాద్, ముకేశ్-ఝాన్సీ జంటలుగా బరిలోకి దిగారు. ఈ ఆటకు వర్షిణి, సుధీర్ సంచాలకులుగా వ్యవహరించారు.అపూర్వ, షాలినీ మధ్య గొడవఈ టాస్క్‌లో అపూర్వ, చరణ్ జోడీ మొదట విజయం సాధించింది. మరోవైపు రోహిత్, షాలినీ ఓటమి పాలయ్యారు. అయితే అంతకుముందు రోహిత్‌తో కలిసి ఆడాలని అపూర్వ కోరగా.. అందుకు అతడు అంగీకరించలేదు. దీంతో తనను వారి గ్రూపులో సరిగ్గా స్వాగతిస్తున్నట్లు కూడా అనిపించడం లేదని అపూర్వ అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో షాలినీ, అపూర్వ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో త్రిగుణ్ పేరు కూడా చర్చలోకి వచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్తా పెద్ద గొడవగా మారింది. దీంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది.(ఇదీ చదవండి: నానా పటేకర్.. అందుకే ఆయన ఎంతో ప్రత్యేకం: ప్రధాని మోదీ)సుధీర్ పెళ్లి టాపిక్‌తో మరో గొడవఆ తర్వాత సుధీర్‌తో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు గతంలో అపూర్వ చెప్పిన మాటలు చర్చకు వచ్చాయి. రాంప్రసాద్ ఈ విషయాన్ని ప్రస్తావించడంతో.. తాను సరదాగా ఆ మాట చెప్పానని అపూర్వ క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ మాటలపై చర్చ కొనసాగడంతో ఆమె తీవ్రంగా ఎమోషనల్ అయింది. తాను సరదాగా అన్న మాటలను సీరియస్‌గా తీసుకుని తనను ఇబ్బంది పెడుతున్నారని అపూర్వ కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పటి వరకు ఏడ్చానని.. ఇకపై తాను ఏడిపిస్తానంటూ ఘాటుగా స్పందించింది.నరేష్ కామెడీ.. టైటానిక్మరోవైపు నరేష్ తనదైన శైలిలో సామ్రాజ్యం, రాజు అంటూ ఓ కథ చెప్పి ఇంటి సభ్యులను నవ్వించాడు. గొడవల మధ్య కాస్త వినోదం పంచే ప్రయత్నం చేశాడు. షాలినీ, అపూర్వ మధ్య వాగ్వాదం కొనసాగుతున్న సమయంలోనే నరేష్, వర్షిణి కలిసి టైటానిక్ సన్నివేశాన్ని చేసి అందరినీ నవ్వించారు. ఇలా ఓ వైపు నామినేషన్స్ టాస్క్‌తో ఉత్కంఠ.. మరోవైపు అపూర్వ, షాలినీ గొడవతో వేడి.. మధ్యలో నరేష్, వర్షిణి కామెడీతో 31వ రోజు ఎపిసోడ్ సాగింది. (ఇదీ చదవండి: నానా పటేకర్ మృతి.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్) -
బిగ్‌బాస్ 10: ఈ వీకెండ్ వచ్చే 'వైల్డ్ కార్డ్స్' వీళ్లేనా?
ప్రతిసారి బిగ్‌బాస్ షోలో ఐదోవారం వచ్చిందంటే చాలు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. ఈసారి కూడా అలానే ఉండబోతున్నాయి. ప్రస్తుతానికైతే హౌస్‌లో 14 మంది ఆడుతున్నారు. వీళ్లలో అమన్, అపూర్వ, రోహిత్, ఝాన్సీ, చరణ్, షాలిని, నరేశ్, రాంప్రసాద్, త్రిగుణ్, ముకేష్ ఈ వారం నామినేషన్స్‌లోకి వచ్చారు. అయితే ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ గండం ఉండొచ్చని తెలుస్తోంది. అదే టైంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చేవాళ్లు పేర్లు కూడా కొన్ని వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: చిన్నప్పటి నుంచి తిరుమలకు వస్తున్నా.. ఈసారిలా ఎప్పుడూ జరగలేదు:తమన్నా)ఏడో సీజన్లో పాల్గొని ఫినాలే వరకు వచ్చిన సీరియల్ నటి ప్రియాంక ప్రియుడు శివకుమార్.. ఈసారి హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ప్రస్తుతం చేస్తున్న 'నిన్ను కోరి' సీరియల్ నుంచి తప్పుకోవడంతో ఎంట్రీ దాదాపు కన్ఫర్మ్ అని తెలుస్తోంది. చెప్పాలంటే ప్రారంభం నుంచే వస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇలా మధ్యలో వస్తున్నాడనమాట.తెలుగు రియాలిటీ షోలతో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటరాజ్ మాస్టర్.. గతంలో ప్రసారమైన బిగ్‌బాస్ 5, ఓటీటీ సీజన్లో పాల్గొని తనదైన ఆవేశం చూపించాడు. కానీ విజేతగా నిలవలేకపోయాడు. ఇప్పుడు ఇతడి భార్య నీతు.. 10వ సీజన్ కోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుందట. ఈమె పేరు కూడా ఖరారైందని అంటున్నారు.ఈసారి అగ్నిపరీక్ష షోలో పాల్గొన్న శ్రీకాకుళం కుర్రాడు 'నవరసాలు రామకృష్ణ' కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలా సెలెక్ట్ అయ్యాడట. ఇప్పటికే ఒకసారి మిథిలేశ్, అపూర్వతో కలిసి హౌస్‌లోకి వచ్చాడు. కానీ మిథిలేశ్‌తో టాస్క్‌లో ఓడిపోయి వెళ్లిపోయాడు. ఇప్పుడు మాత్రం వైల్డ్ కార్డ్‌లా ఎంట్రీ ఇస్తాడని టాక్.వీళ్లతో పాటు 8వ సీజన్ విజేతగా నిలిచిన నిఖిల్ మాజీ ప్రియురాలు కావ్యశ్రీ, జబర్దస్త్ ఫేమ్ నూకరాజు, రాకింగ్ రాకేశ్ పేర్లు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వినిపిస్తున్నాయి. మరి వీళ్లలో ఎవరెవరు వస్తారనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ) -
బిగ్‌బాస్ 10: అడ్డంగా బుక్కైన అగ్నిపరీక్ష బ్యాచ్.. ఇంకో వికెట్ పక్కా
బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో అగ్నిపరీక్ష బ్యాచ్ చేసే హడావుడి తట్టుకోలేకపోతున్నాం. ఐదోవారానికిగానూ నామినేషన్ల విషయమై పెద్ద ప్లాన్ వేశామని సంబరపడిపోయారు గానీ అది వీళ్ల మెడకే చుట్టుకుబోతుందని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంతకీ హౌస్‌లో 30వ రోజైన మంగళవారం(అక్టోబర్ 06) అసలేం జరిగిందనేది హైలైట్స్‌లో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా 'మండాడి'.. అధికారిక ప్రకటన)ఐదోవారం నామినేషన్లలోకి అగ్నిపరీక్ష బ్యాచ్ అంతా వచ్చేశారు. అంతా మనమే ఉంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని, అందుకే అవతలి వైపు నుంచి వీలైనంత మందిని నామినేషన్లోకి లాగండి అని రోహిత్ తన టీంకి చెప్పాడు. దీంతో పాయింట్స్ ఉన్నా లేకపోయినా అగ్నిపరీక్ష టీం నుంచి షాలిని, రోహిత్ ఇలా అందరూ నామినేషన్స్ చేసేశారు. దీంతో కెప్టెన్ వర్షిణి, ఇమ్యూనిటీ సాధించిన వంశీ, సుధీర్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు.మంగళవారం ఎపిసోడ్లో పండుని కనిపెట్టిన సుధీర్.. రోహిత్, షాలినిని నామినేట్ చేశాడు. మాటలు జారుతున్నావ్, సైగలు చేస్తున్నావ్ అని రోహిత్‌కి చెప్పాడు. రోహిత్ వల్ల నీ చెడిపోతోంది. రాత్రి నాలుగువరకు కూర్చుని మాట్లాడుతున్నారు అని సుధీర్ అన్నాడు. అది పర్సనల్ పాయింట్ నీకు అవసరం లేదు అని సుధీర్‌తో షాలిని వాదించింది. తర్వాత చరణ్ వచ్చి ముకేశ్‌ని నామినేట్ చేశాడు. తర్వాత అపూర్వ వచ్చి.. నక్క, చిన్నదో వైపు, పెద్దదో వైపు, ట్రయాంగిల్ ట్రాక్ అని ఇలా అన్నావ్ అంటూ ముకేశ్‌ని నామినేట్ చేసింది. నువ్వు తోపు అయితే నీకు నేను బాపు అని అపూర్వ అనేసరికి.. నువ్వు నాకు బాపు? తండ్రివా? అని ముకేశ్ కౌంటర్లు వేశాడు.తర్వాత ఝాన్సీని నామినేట్ చేసిన అపూర్వ.. నువ్వు గ్రూపులో ఉండి వారి మాటలకు ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నావ్. నీ డ్యాగర్స్ని ఎందుకు ఇచ్చావ్? అనేసరికి నేను ఆట ఆడాలని ఆ డ్యాగర్స్ ఇచ్చా ఇమ్యూనిటీ నాకు అవసరం లేదు. జనాలు ఉంచాలని అనుకుంటే ఉంచుతారని ఝాన్సీ కౌంటర్ ఇచ్చింది. నరేశ్ వచ్చి చరణ్‌ని నామినేట్ చేశాడు. ఏం కనిపించడం లేదు. హోస్ట్ చెప్తున్నా నువ్వు మారడం లేదని కారణాలు చెప్పాడు. ఆపై ఝాన్సీ వచ్చి రోహిత్‌ని నామినేట్ చేసింది. అగ్నిపరీక్షలో నిన్ను ఇలా చూడలేదు. ఇక్కడ, అక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. మాటలు తూలుతున్నావ్ అని రోహిత్‌కి నామినేషన్ పాయింట్స్ చెప్పింది. సుధీర్‌ని పిల్ల బచ్చా అని ఎలా అన్నావ్. ఆటని ఆటగాడిలా ఆడు పోటుగాడిలా కాదు అని అమన్‌ని నామినేట్ చేసింది .తర్వాతే దేబ్జానీ వచ్చి రోహిత్‌ని నామినేట్ చేసింది. నువ్వు అగ్నిపరీక్షలో ప్రవర్తించిన విధానం నాకు నచ్చింది కానీ ఇక్కడ నచ్చడం లేదు అని తన కారణాలు చెప్పింది. రోహిత్ వచ్చి నరేశ్, రాంప్రసాద్లని నామినేట్ చేశాడు. మా అందరినీ నామినేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు అది నాకు తెలుసు. మీకు పాయింట్స్ లేకపోయినా నామినేట్ చేస్తారని రోహిత్ ప్లాన్‌ని నరేశ్ బట్టబయలు చేశాడు. తర్వాత వంశీ వచ్చి రోహిత్‌ని నామినేట్ చేశాడు. అలా చివరకు అమన్, అపూర్వ, రోహిత్, ఝాన్సీ, చరణ్, షాలినీ, నరేశ్, రాంప్రసాద్, త్రిగుణ్, ముకేష్ నామినేషన్స్‌లోకి వచ్చారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.ఇక్కడ అగ్నిపరీక్షకు అర్థం కాని విషయం ఏంటంటే ఈసారి కూడా వీళ్లలో ఒకరు ఎలిమినేట్ కావడం గ్యారంటీ. అది చరణ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. లేదంటే షాలిని కావొచ్చు. మరి ఈసారి ఎవరెళ్లిపోతారనేది చూడాలి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: సృష్టి ఎలిమినేట్.. నాలుగు వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే?) -
‘పులిచొక్కా వేసుకున్న గుంటనక్కవి నువ్వు’.. బిగ్‌బాస్‌లో రచ్చే రచ్చ..
బిగ్‌బాస్ ఇంట్లో ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియను కాస్త కొత్తగా నిర్వహించారు. ఈసారి అందరికీ ఇద్దరు కంటెస్టెంట్లను నామినేట్ చేసే అవకాశం ఇవ్వలేదు. టాస్క్‌లో గెలిచిన వారికి మాత్రమే ఇద్దరిని నామినేట్ చేసే పవర్ దక్కేలా నామినేషన్స్ ప్రక్రియను రూపొందించారు.ఈ టాస్క్‌లో భాగంగా ఓ కంటెస్టెంట్‌ను పిలిచిన బిగ్‌బాస్.. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన బాక్సుల్లో ఓ పండును దాచిపెట్టాలని సూచించాడు. ఆ పండును ఎవరు ముందుగా కనిపెడితే వారికి ఇద్దరు కంటెస్టెంట్లను నామినేట్ చేసే అవకాశం లభిస్తుంది.రోహిత్ వర్సెస్ సుధీర్..తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం చరణ్, సుధీర్ ఈ టాస్క్‌లో పాల్గొన్నారు. అయితే సుధీర్ పండును కనిపెట్టి ఇద్దరిని నామినేట్ చేసే పవర్ సొంతం చేసుకున్నాడు. తన నామినేషన్స్‌లో భాగంగా సుధీర్ ముందుగా రోహిత్‌ను ఎంపిక చేశాడు. రోహిత్ మాట్లాడే సమయంలో టంగ్ స్లిప్ అయ్యాడని, కొన్ని సందర్భాల్లో మర్యాద తప్పినట్లు అనిపించిందని తన నామినేషన్ కారణాలను చెప్పాడు. అయితే సుధీర్ చేసిన వ్యాఖ్యలపై రోహిత్ వెంటనే స్పందించాడు. ‘కొన్ని మాటలు వదిలాడు’ అని సుధీర్ చెప్పడంతో.. ఆ మాటలు ఏంటో కూడా చెప్పాలని రోహిత్ ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు ప్రోమోలో కనిపించింది.అపూర్వ వర్సెస్ ముకేష్..ఇక మరోవైపు అపూర్వ తన నామినేషన్లో ముకేష్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ముకేష్‌ను ఉద్దేశించి ‘పులిచొక్కా వేసుకున్న గుంటనక్క’ అంటూ అపూర్వ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనికి ముకేష్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చాడు. ‘నక్క అయినప్పుడు నాతో ఎందుకు ఫ్లర్ట్ చేశావు? ఈ గుంటనక్క దగ్గరకు ఎందుకు వచ్చావు?’ అంటూ అపూర్వను ప్రశ్నించాడు. అంతేకాదు.. తన దగ్గర డ్యాగర్స్ పెట్టుకుంటే అపూర్వ తన దగ్గరకు వస్తుందని, తనతో ఫ్లర్ట్ చేస్తుందని ముకేష్ భావించాడని అపూర్వ ఆరోపించింది. దీంతో వీరిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్లు ప్రోమోలో కనిపిస్తోంది.ఇదీ చదవండి: ‘ఎవరికోసమో నేను మారలేను’.. రష్మిక స్ట్రాంగ్ రిప్లైఝాన్సీకి మరోసారి టార్గెట్..ఇక ఝాన్సీ కూడా నామినేషన్స్‌లో తనపై వచ్చిన విమర్శలకు గట్టిగానే బదులిచ్చింది. తన ఆట దెబ్బతిని ఉంటే మూడు సార్లు కెప్టెన్సీ కంటెండర్‌గా ఎలా నిలుస్తానని ప్రశ్నించింది. అంతేకాదు.. అందులో రెండు సార్లు టాప్-2లోకి వచ్చానని గుర్తుచేసింది.చరణ్‌పై నరేష్ కామెంట్స్..మరోవైపు చరణ్‌ను నరేష్ నామినేట్ చేసినట్లు ప్రోమోలో కనిపించింది. ‘హోస్ట్ నీ గురించి చెప్పినప్పుడల్లా ఏదో పొడిచేస్తావ్ అనుకుంటాం. కానీ నువ్వేం పొడవలేకపోతున్నావ్ ’ అంటూ నరేష్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీనికి చరణ్ కూడా గట్టిగానే స్పందించాడు. ‘చరణ్ ఏం చేస్తున్నాడు.. ఏం చేయడం లేదు అనేది నన్ ఆఫ్ యువర్ బిజినెస్’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.మొత్తానికి ఐదో వారం నామినేషన్స్‌లో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగినట్లు తాజా ప్రోమోలు చూస్తే తెలుస్తోంది. పూర్తి ఎపిసోడ్లో ఈ గొడవలు ఏ స్థాయికి చేరతాయో చూడాలి. -
బిగ్‌బాస్ 10: అపూర్వకి ఇచ్చిపడేశారు.. నామినేషన్లలో రచ్చ
బిగ్‌బాస్ తెలుగు 10లో ఐదోవారం వచ్చేసింది. దీంతో ఎప్పటిలానే నామినేషన్ల హడావుడి మొదలైపోయింది. ఓ గుమ్మడికాయని దాచిపెట్టి ఇద్దరిద్దర్ని పిలవగా.. ఇది దొరికినవాళ్లు ఇద్దరు, ఓడిపోయినవాళ్లు ఒకరిని నామినేట్ చేసే అవకాశం దక్కింది. గతవారం ఇమ్యూనిటీ లభించడంతో సుధీర్, వంశీ.. కెప్టెన్ కావడంతో వర్షిణిని నామినేట్ చేసేందుకు వీలులేదు. ఇంతకీ సోమవారం(అక్టోబర్ 05) ఎపిసోడ్లో అసలేం జరిగింది? ఎవరెవరు నామినేట్ అయ్యారు?(ఇదీ చదవండి: సోషల్ మీడియాకు భయపడి 'ఆదర్శ కుటుంబం' వాయిదా)కెప్టెన్ వర్షిణి మొదటగా వెళ్లి గుమ్మడికాయని దాచిపెట్టగా.. రాంప్రసాద్, ముకేశ్ వెతికారు. రాంప్రసాద్‌కి అది దొరికింది. దీంతో అమన్‌ని నామినేట్ చేశాడు. నువ్వు నా హీరోవి, అయినప్పటికి రోహిత్‌ని అలా అనడం నచ్చలేదు.. గేమ్‌లో కోపం చూపించుకో, కానీ బయటకాదని చెబుతూ త్రిగుణ్‌ని నామినేట్ చేశాడు. దీంతో త్రిగుణ్ మాట్లాడుతూ.. తాను డిఫెండ్ చేసుకోనని రోహిత్‌కు సారీ చెప్పాడు. రోహిత్ మాత్రం తాను క్షమించనని చెప్పాడు. ఈ క్రమంలో త్రిగుణ్, రోహిత్‌ల మధ్య గొడవ జరిగింది.తర్వాత అవకాశం దక్కడంతో ముకేశ్.. అపూర్వని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ చేసిన టైంలో ప్రవర్తన నచ్చలేదని కారణం చెప్పాడు. ఈ క్రమంలో అపూర్వ, ముకేశ్ మధ్య మాటల యుద్ధం నడించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, చిన్నదో వైపు పెద్దదో వైపు లాంటి మాటలు మాట్లాడడం పద్దతి కాదని అపూర్వ చెప్పుకొచ్చింది. తర్వాత వంశీ గుమ్మడికాయ దాచిపెట్టగా.. అమన్, త్రిగుణ్ వెతికారు. చివరకు త్రిగుణ్కే దొరికింది. నన్ను రెచ్చగొట్టింది. బిగ్‌బాస్ రూల్స్ బ్రేక్ చేశారు? ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం నచ్చలేదని చెబుతూ అపూర్వని నామినేట్ చేశాడు. తర్వాత అమన్‌ని నామినేట్ చేశాడు. అనంతరం అమన్.. ఒకరిని మోటివేట్ చేయడానికి మరొకరిని కించపరిచాడు. బచ్చాగాడు అన్నాడని చెబుతూ ముకేశ్‌ని అమన్ నామినేట్ చేశాడు.నరేశ్ గుమ్మడికాయ దాచగా.. షాలిని, వర్షిణి వెతికారు. వర్షిణి గెలిచింది. వైల్డ్ కార్డ్‌లా వచ్చి పోస్ట్కార్డులా పనిచేస్తున్నావని కారణం చెప్పి అపూర్వని నామినేట్ చేసింది. తర్వాత రోహిత్‌ని నామినేట్ చేసింది. షాలిని.. త్రిగుణ్‌ని నామినేట్ చేసింది. మాటలు జారుతూ ఉంటారు. డామినేషన్ చేస్తారు? అని తన కారణాలు చెప్పింది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. మొత్తంగా చూస్తే ఈ వారం ఇప్పటివరకు సగం నామినేషన్స్ జరిగాయి. మిగతా ప్రక్రియ మంగళవారం ఉండనుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ సినిమా.. అధికారిక ప్రకటన) -
బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనా?
బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో నాలుగో వారం సృష్టి ఎలిమినేట్ అయింది. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక సోమవారం రావడంతో ఎప్పటిలానే నామినేషన్ల హడావుడి నడిచింది. ఈసారి కామనర్ అపూర్వ రెచ్చిపోయింది. ప్రోమో అంతా దాదాపుగా ఈమెనే కనిపించింది. వర్ణిణి, ముకేశ్‌లతో గొడవలు పెట్టుకుంది. ఇంతకీ ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు? ప్రోమోలో ఏముంది?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: సృష్టి ఎలిమినేట్.. నాలుగు వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే?)ఈసారి నామినేషన్ల ప్రక్రియ కోసం 'రోడ్ టూ రీలోడ్' అనే కాన్సెప్ట్‌ని బిగ్‌బాస్ పెట్టాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్‌లో ఒకరు ఓ పండుని తీసుకుని ఎదురుగా ఉన్న బాక్సుల్లో ఏదో ఒకదాని దిగువన దాస్తారు. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు హౌస్మేట్స్.. దాన్ని వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే అది మొదటగా దొరుకుతుందో వాళ్లకు నామినేట్ చేసే అవకాశం దక్కుతుంది.ప్రోమోలో చూపించినట్లు రాంప్రసాద్.. అమన్‌ని, ముకేశ్.. అపూర్వని, త్రిగుణ్ కూడా అపూర్వనే నామినేట్ చేశాడు. మొత్తంగా చూస్తే ఈసారి నామినేషన్ ప్రక్రియ మంచి హుషారుగా గొడవలు, కొట్లాటలతో రంజుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలా ఐదోవారానికిగానూ త్రిగుణ్, అమన్, రోహిత్, శాలిని, అపూర్వ, రాంప్రసాద్, చరణ్ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. అలానే ఈ వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే అవకాశముంది. దీంతో డబుల్ ఎలిమినేషన్ షాక్ గ్యారంటీ అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఎవరూ నాకు ఏ ఆస్తి బహుమతిగా ఇవ్వలేదు.. రకుల్ ప్రీత్ సీరియస్) -
బిగ్‌బాస్ 10: నాలుగు వారాలకు రెమ్యునరేషన్ ఎన్ని లక్షలు?
అనుకున్నదే జరిగింది. అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన సృష్టి ఎలిమినేట్ అయింది. ఈమెతో పాటు చరణ్ డేంజర్ జోన్లో ఉన్నాడు. కానీ తక్కువ ఓట్లు పడిన కారణంగా సృష్టి బయటకొచ్చేసింది. ఇంతకీ ఈమె ఎలిమినేషన్‌కి కారణాలేంటి? నాలుగు వారాలకుగానూ రెమ్యునరేషన్ ఎన్ని లక్షలు గెలుచుకుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా 'మండాడి'.. అధికారిక ప్రకటన)మోడల్‌గా తెలిసిన సృష్టి.. ఈ ఏడాది అగ్నిపరీక్షలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. జడ్జిల మనసు గెలుచుకుని బిగ్‌బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంది. హౌస్‌లోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో గేమ్ ఆడేందుకు ప్రయత్నించింది. కానీ పెద్దగా మెప్పించలేకపోయింది. ముఖ్యంగా నామినేషన్స్ టైంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆమెకు తక్కువ ఓట్లు పడేలా చేశాయి. అలా ఈ వారం నామినేట్ అయి ఎలిమినేట్ కూడా అయిపోయింది.సుధీర్‌తో ఈమెకు జరిగిన గొడవ ఎలిమినేషన్‌కి ప్రధాన కారణమని చెప్పొచ్చు. నామినేషన్ టైంలో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ సమయంలో సృష్టి అతిగా ప్రవర్తించింది. సుధీర్‌పై చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలు ఈమెపై వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయి. అలా తక్కువ ఓట్లు పడి బయటకొచ్చేసింది. ఇక నాలుగు వారాలుపాటు హౌస్‌లో ఉన్నందుకుగానూ వారానికి రూ.75 వేల చొప్పున రూ.3 లక్షలు.. అలానే అగ్నిపరీక్షలో పాల్గొన్నందుకుగానూ రూ.50 వేలు.. మొత్తంగా రూ.3.5 లక్షలు ఈమె సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి ఆమె ఎలిమినేట్.. మాస్క్ వీరులు వీళ్లే.. సండే హైలెట్స్ ఇవే..!) -
బిగ్‌బాస్ నుంచి ఆమె ఎలిమినేట్.. మాస్క్ వీరులు వీళ్లే.. సండే హైలెట్స్ ఇవే..!
బిగ్‌బాస్ సీజన్ 10 అప్పుడే నాలుగోవారం పూర్తి చేసుకుంది. ఇక వీకెండ్ ఎపిసోడ్‌పై ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉంటారు. హౌస్‌లో నుంచి ఎవరు బయటికొస్తారనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంటుంది. అలా వీకెండ్ సండే బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఏం జరిగింది? ఎవరు ఎలిమినేట్ అయ్యారో హైలెట్స్‌లో చూసేద్దాం. ఈ ఎపిసోడ్లో నాగ్ ఎంట్రీ ఇచ్చాక నామినేషన్లతో ఉన్న తొమ్మిది మందిలో ముకేశ్, దేబ్జానీ మొదట సేవ్ అయ్యారు. అవుతారు. ఆ తర్వాత మిగిలిన ఏడు మంది నామినేషన్స్‌లో ఉంటారు. ఇక వీకెండ్ ఎపిసోడ్లో సరదా ఫన్ గేమ్స్ కూడా ఆడించారు. బాయ్స్, గర్ల్స్ను రెండు టీమ్స్‌గా విడదీసి గేమ్ ఆడుతారు. నాగ్ సినిమా హీరో పేరు చెప్పి వాళ్ల నటించిన క్యారెక్టర్ ఫోట్ చూపిస్తే ఆ సినిమా పేరు చెప్పాలి. అలా ఇందులో గెలిచిన వాళ్లు డ్యాన్స్ చేస్తారు. ఈ గేమ్‌లో బాయ్స్ గెలుస్తారు.ఈ సండే ఎపిసోడ్లో పలు రకాల ఫన్ గేమ్స్ ఆడుతూ సందడి చేస్తారు. ఇంటి సభ్యులు నలుగురిని పిలిచి ఓ ప్రశ్న అడుగుతారు. గెలిచిన వాళ్లకి చాక్లెట్ ఇస్తారు. అయితే ఆ చాక్లెట్ మధ్యలో ఉసిరి కాయలు, కాకరకాయ ఇలా రకరకాలు పెట్టి ఉంటారు. దేబ్జానీ, వంశీ, నరేశ్, వర్షిణి, షాలిని, ముకేశ్, త్రిగుణ్, చరణ్, రాంప్రసాద్ వీరంతా చాక్లెట్స్ తింటారు. ఆ తర్వాత నాగ్ ఇంటి సభ్యులు అందరికీ గత వారంలో బాగా ఆడింది.. ఎవరు.. స్టార్ ఆఫ్ ది వీక్ ఎవరు అని అడుగుతారు. ఇందులో సృష్టి, ఝాన్సీ, వంశీలకు 4 ఓట్లు వస్తాయి.. మళ్లీ ఓటింగ్ పెడితే ఝాన్సీకి 6 ఓట్లు రావడంతో ఆమెనే స్టార్ ఆఫ్‌ది వీక్ అవుతుంది. ఆ తర్వాత ఒక పడవలో ముగ్గురు కంటెస్టెంట్స్‌ను ఉంచి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిని ముంచేస్తారంటూ సరదాగా ఫన్ గేమ్ ఆడిస్తారు నాగ్. ఇందులో నరేశ్ రాంప్రసాద్‌ని ముంచేసి దేబ్జానీని కాపాడుతా.. రాంప్రసాద్‌కి ఈత వచ్చు కదా అనడంతో హౌస్‌లో నవ్వులు పూశాయి.ఇక చివరికీ నామినేషన్స్‌లో ఉన్న సృష్టి, షాలిని, అమన్, రోహిత్‌లలో రోహిత్, అమన్ సేవ్ అవుతారు. ఆ తర్వాత చివరికీ సృష్టి, షాలిని మాత్రమే మిగులుతారు. షాలిని.. రోహిత్ చేయి పట్టుకొని నువ్వు అంటే నాకు చాలా ఇష్టం.. ఒక వేళ నేను వెళ్లిపోతే నువ్వు ఇంకెవరికీ కనెక్ట్ అవ్వవని అనుకుంటున్నా.. బయట కూడా మనం ఇలాగే ఉంటామని అంటుంది. నువ్వు వెళ్లవులే అని రోహిత్ అంటాడు. ఆ తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన సృష్టి ఇంటినుంచి బయటికి వచ్చేస్తుంది. చివర్లో సృష్టి స్టేజ్ మీదకు వెళ్లగానే బిగ్‌బాస్ జర్నీ చూపిస్తారు. హౌస్‌లో ఇంకా మాస్క్ తీయని వాళ్లు ఎవరని సృష్టిని అడగ్గా.. ముకేశ్, రాంప్రసాద్, వర్షిణి పేర్లు చెబుతుంది. దీంతో సండే ఫన్డే ఎపిసోడ్ ముగుస్తుంది. -
‘అతనికి ఈత వచ్చు సార్’ నరేశ్ ఆన్సర్‌కు నవ్వులే...
బిగ్‌బాస్ తెలుగు 10లో ఆదివారం ఎపిసోడ్ ఫుల్ ఫన్‌తో సాగినట్లు తాజా ప్రోమోలను చూస్తే అర్థమవుతోంది. ఎలిమినేషన్ టెన్షన్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. కంటెస్టెంట్లతో సరదా గేమ్స్ ఆడించారు. డ్యాన్స్‌లు చేయిస్తూ, ప్రశ్నలు అడుగుతూ.. మధ్యలో చాక్లెట్లు ఇస్తూ ఇంట్లో నవ్వులు పూయించారు.సినిమా పాటలకు డ్యాన్స్‌లు‘సండే ఫన్డే’ గేమ్‌లో భాగంగా నాగార్జున కొన్ని ప్లేకార్డ్స్ చూపించారు. వాటిని చూసి సినిమా పేరును కంటెస్టెంట్లు గుర్తించాలని చెప్పారు. సరైన సమాధానం చెప్పిన తర్వాత ఆ సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేయించారు. దీంతో కంటెస్టెంట్లు ఉత్సాహంగా స్టెప్పులేయగా.. నాగార్జున కూడా వారితో కలిసి సందడి చేశారు.చాక్లెట్ల కోసం ఝాన్సీ ఎదురుచూపులుమరో ప్రోమోలో నాగార్జున కంటెస్టెంట్లతో మరో సరదా గేమ్ ఆడించారు. ‘ఓ ప్రశ్న అడుగుతా.. దానికి సరైన సమాధానం చెబితే చాక్లెట్ ఇస్తా’ అని చెప్పారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన దేబ్జానీ, నరేశ్‌లకు నాగార్జున చాక్లెట్లు అందించారు. అయితే చాక్లెట్ల కోసం ప్రతిసారీ ముందుకొచ్చిన రైతుబిడ్డ ఝాన్సీకి మాత్రం ఒక్కసారి కూడా చాక్లెట్ దక్కలేదు. దీంతో ‘ఇదేంటి సార్.. నాకు మాత్రం రావడం లేదు’ అంటూ ఝాన్సీ చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి.పడవలో ఎవరిని ముంచుతారు?ఇక మరో సరదా ప్రశ్నతో కంటెస్టెంట్లను ఇరుకున పెట్టారు నాగార్జున. ‘మీ పడవకు ప్రమాదం వచ్చింది. పడవలో ఎవరిని కాపాడతారు? ఎవరిని ముంచేస్తారు?’ అని అడిగారు. దానికి ముకేశ్ స్పందిస్తూ.. వర్షిణిని సేవ్ చేస్తానని, సుదీర్‌ను ముంచేస్తానని చెప్పాడు. ఆ తర్వాత నరేశ్‌ను ఇదే ప్రశ్న అడగ్గా.. రాంప్రసాద్‌ను ముంచేస్తానని, దేబ్జానీని సేవ్ చేస్తానని చెప్పాడు. అందుకు కారణం ఏంటని నాగార్జున అడగ్గా.. ‘అతనికి ఈత వచ్చు సార్’ అంటూ నరేశ్ ఇచ్చిన సమాధానం అందరినీ నవ్వించింది. ఇలా ఆదివారం ఎపిసోడ్లో నాగార్జునతో కలిసి కంటెస్టెంట్లు చేసిన సందడి, సరదా గేమ్స్ ప్రేక్షకులను అలరించేలా కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: షారుక్, అమితాబ్‌లను మించిన సంపన్నుడు.. ఏకంగా 36000 కోట్లు -
హౌస్‌లో కన్నింగ్ నువ్వే.. ఆ ముగ్గురికి ఎల్లో కార్డ్.. వీకెండ్ ఎపిసోడ్ హైలెట్స్ ఇవే..!
బిగ్‌బాస్ సీజన్ 10 మరింత ఆసక్తికరంగా మారుతోంది. వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే చాలు.. ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో ఇంట్రెస్టింగ్ ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో నాలుగో వారం ఎండ్‌కు వచ్చేసింది. గతవారం మిథిలేష్.. రూ.15 లక్షలు తీసుకుని బయటకెళ్లిపోవడంతో ఎలిమినేషన్ జరగలేదు. ఈసారి మాత్రం కచ్చితంగా ఒకరు బయటకెళ్లిపోవడం గ్యారంటీ అని తెలుస్తోంది.అయితే వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున కంటెస్టెంట్ల చేసిన తప్పులను చర్చిస్తుంటారు. హౌస్‌లో ఎవరితో ఎవరు ఎలా ఉన్నారు? అని తేల్చేస్తారు. అలా వార్నింగ్‌లతో పాటు కంటెస్టెంట్లకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తుంటారు. అందుకే ఈ వీకెండ్ ఎపిసోడ్ ఫుల్ హాట్‌హాట్‌గా సాగుతోంది. నాగ్ వచ్చిన ఈ వారం వీకెండ్లో ఏం జరిగిందో హైలెట్స్‌లో చూసేద్దాం.అయితే ఈ వారంలో కెప్టెన్‌గా వ్యవహరించిన అపూర్వకు నాగార్జున షాకిచ్చాడు. కెప్టెన్‌గా రూమ్ వాడిన విధానాన్ని తప్పుపట్టారు. నువ్వు ఒక డిజాస్టర్ కెప్టెన్ అని అపూర్వకు ఝలక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆటో రామ్‌ప్రసాద్‌కు వార్నింగ్ ఇచ్చాడు. నువ్వేమైనా పిస్తావా అంటూ గట్టిగానే ఇచ్చిపడేశాడు. నామినేషన్స్ విషయం డిస్కస్ చేయొద్దని చెప్పాం కదా అన్నాడు. అందుకే నిన్ను కన్నింగ్ అని పిలుస్తారని నాగ్ అన్నారు.ఆ తర్వాత షాలినిని షాలినికి నాగ్ ఇచ్చిపడేశాడు. ఎఫ్ అనే అనే బూతు ఏంటని నిలదీశారు. నీ భాష ఆడియన్స్ వింటే మిమల్ని ఎక్కడికి పంపాలో అక్కడికే పంపేస్తారని చెప్పారు. అంతేకాకుండా అన్నింటికి పెద్ద పెద్దగా అరుస్తున్నావ్.. ముందు నీ ఆట తీరు మార్చుకో అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అమన్‌ని లివింగ్ రూంకి పిలిచి ఈ వారం ఆట ఎలా ఆడావని అడుగుతారు. అమన్ చెప్పగానే.. వెంటనే ఎల్లో కార్డు చూపించి ఇంకోసారి నువ్వు ఒక్క తప్పు చేసినా వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోతావ్.. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ అని నాగ్ చెప్తారు.త్రిగుణ్‌ని పిలిచి నాగ్ వార్నింగ్ ఇస్తాడు. ఇది నీ ఇల్లు కాదు.. నీకు నచ్చినట్లు ఉండటం కాదు.. అని త్రిగుణ్‌కి కూడా నాగ్ పసుపు ఎల్లో కార్డ్ చూపిస్తాడు. ఆ తర్వాత నాగ్ ఇంటి తలుపులు ఓపెన్ చేయిస్తారు. ఆ తర్వాత చరణ్, రోహిత్ మధ్య జరిగిన సంభాషణ వీడియోను చూపిస్తారు. అందులో రోహిత్ చరణ్‌తో సైలెంట్‌గా బూతులు మాట్లాడతాడు. అవి విన్నాక బిగ్‌బాస్ నన్ను ఏం పీకలేడు అదే కదా నీ ఉద్దేశం అని నాగ్ అంటారు. అందరూ రోహిత్‌ది తప్పు అనడంతో.. నువ్వు ఇంటి నుంచి వెళ్లిపో అని నాగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దీంతో రోహిత్ క్షమాపణలు చెప్తాడు. చివరికీ నాగ్ రోహిత్‌కి ఎల్లోకార్డు చూపిస్తారు. ఇది ఫైనల్ వార్నింగ్ అంటూ డోర్స్ క్లోజ్ చేయించి రోహిత్‌ని పిలుస్తారు. ఆ తర్వాత రోహిత్.. సృష్టితో వ్యవహరించిన తీరును నాగ్ ఎత్తిచూపిస్తారు. రోహిత్ డ్రమ్ తన్నేసిన వీడియో చూపించడంతో.. రోహిత్ చాలా తప్పు చేశాడని హౌస్మేట్స్ అంటారు. ఆటలో ఉన్మాదం వద్దు.. ఇలాంటి రోజు మళ్లీ రాకూడదని నాగ్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. -
వర్షిణికి ముద్దు పెడుతూ దొరికిపోయిన ముకేష్..
బిగ్‌బాస్ ఇంట్లో నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది. మరి కొన్ని గంటల్లో వీకెండ్ ఎపిసోడ్ ప్రారంభం కానుంది. నాగార్జున ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఈ వారంలో కంటెస్టెంట్ల మధ్య జరిగిన గొడవలు, మాటల యుద్ధంపై నాగ్ క్లాస్ తీసుకోనున్నట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఇదిలా ఉంటే తాజా ప్రోమోలో హౌస్ మొత్తం కాలేజ్‌గా మారిపోయింది.ర్యాగింగ్ చేస్తూ ‘అగ్నిపరీక్ష కాలేజ్’ పేరుతో సాగిన ఈ సరదా టాస్క్‌లో వంశీ, త్రిగుణ్, సృష్టి, రాంప్రసాద్, నరేశ్ సీనియర్లుగా.. మిగతా సభ్యులు జూనియర్లుగా కనిపించారు. రోహిత్, షాలిని క్లోజ్‌గా కూర్చోవడంపై సీనియర్లు ర్యాగింగ్ చేస్తూ నవ్వులు పూయించారు. షాలిని మీ నాన్న ఏం చేస్తుంటారని రాంప్రసాద్ అడగ్గా.. బొక్కలు ఇరుస్తాడు అని ఆమె సమాధానం చెప్తుంది. పక్కనే ఉన్న నరేశ్ ఏమి మీ నాన్న మటన్ షాప్ పెట్టున్నాడా అని సరదాగా అంటూ నవ్వులు పూయించాడు. ఆ తర్వాత ముకేశ్–వర్షిణి మధ్య సరదా సన్నివేశంలో ముకేశ్ వర్షిణిని ముద్దు పెట్టేందుకు ట్రైచేస్తుండగా దానిని చూసి సీనియర్లు అతడిని ఆటపట్టించారు. శిక్షగా పుష్అప్స్ చేయించగా.. నరేశ్ కూడా రంగంలోకి దిగి తనదైన పంచులతో నవ్వించాడు. రాంప్రసాద్ వేసిన సెటైర్లకు హౌస్మేట్స్ అంతా నవ్వుకున్నారు. మొత్తానికి ఈ ప్రోమోలో సీనియర్ల ర్యాగింగ్, జూనియర్లపై పంచులు, కంటెస్టెంట్ల కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇక వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఏ విషయాలపై కంటెస్టెంట్లను ప్రశ్నిస్తారో చూడాలి.ఇదీ చదవండి: నీచులారా.. ఎవరినీ వదిలిపెట్టను : ఎన్టీఆర్ సంచలన ట్వీట్ -
బిగ్‌బాస్ 10: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?
బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో నాలుగో వారం చివరకొచ్చేసింది. గతవారం మిథిలేష్.. రూ.15 లక్షలు తీసుకుని బయటకెళ్లిపోవడంతో ఎలిమినేషన్ జరగలేదు. ఈసారి మాత్రం కచ్చితంగా ఒకరు బయటకెళ్లిపోవడం గ్యారంటీ. అందుకు తగ్గట్లే డేంజర్ జోన్లో ఇద్దరు కామనర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరు ఎలిమినేట్ అవ్వొచ్చు? చివరి స్థానాల్లో ఎవరున్నారు?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: అమన్‌కి అన్యాయం.. వర్షిణి దెబ్బకు మైండ్ బ్లాక్)ఈ వారం నామినేషన్లలో మొత్తంగా తొమ్మిది మంది ఉన్నారు. త్రిగుణ్, రోహిత్, ముఖేశ్, చరణ్, నరేశ్, షాలిని, దేబ్జానీ, అమన్, సృష్టిలలో ప్రస్తుతం సృష్టి-చరణ్ డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అనధికారిక ఓటింగ్‌లోనూ వీళ్లే చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని అంటున్నారు గానీ అలాంటిదేం జరగకపోవచ్చు. వినిపిస్తున్న టాక్ ప్రకారం సృష్టి.. హౌస్ నుంచి వెళ్లిపోయే అవకాశం ఎక్కువగా ఉందని మాట్లాడుకుంటున్నారు. చరణ్ మెడపై కూడా కత్తి వేలాడుతోంది.ఈ వారం 'టోటల్ డామినేషన్' థీమ్ పెట్టారు కాబట్టి, ఎలిమినేషన్ ప్రక్రియలోనూ ఈ థీమ్‌నే జోడించే అవకాశమైతే ఉంది. మరి చరణ్, సృష్టిలో ఎవరు బయటకెళ్లిపోతారు? ఎవరు బతికిపోతారనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాలి. ఇకపోతే ఈ వారం అపూర్వ కెప్టెన్సీ చేయగా.. తాజాగా అమన్ ఈ అధికారాన్ని దక్కించుకున్నాడు. కానీ తన దగ్గరున్న పవర్ ఉపయోగించుకున్న వర్షిణి కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు అందుకుంది.(ఇదీ చదవండి: కొత్త తెలుగు సినిమాలు ఎలా ఉన్నాయి? కలెక్షన్స్ ఎంత?) -
బిగ్‌బాస్ 10: అమన్‌కి అన్యాయం.. వర్షిణి దెబ్బకు మైండ్ బ్లాక్
నోటివరకు వచ్చిన కూడు అందకుండాపోతే ఆ బాధ వర్ణనాతీతం. బిగ్‌బాస్ హౌస్‌లో అమన్ విషయంలో సరిగ్గా ఇదే సీన్ రిపీటైంది. కష్టపడి కెప్టెన్ అయితే వర్షిణి దాన్ని ఎగరేసుకుపోయింది. మరోవైపు ఆరోవారం ఇమ్యూనిటీ కోసం ఆ ఇద్దరూ గెలిచారు. ఇంతకీ శుక్రవారం(అక్టోబర్ 02) ఎపిసోడ్లో అసలేం జరిగింది? అనేది హైలైట్స్‌లో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)గురువారం నాడు బిగ్‌బాస్ 10 హౌస్‌లోని రెండు టీమ్స్ మధ్య టాస్క్‌లు జరిగి భైరవ టీమ్(రెడ్ టీమ్) కెప్టెన్సీ టాస్క్‌లకు అర్హత సాధించింది. ఆరోవారం వరకు ఎవరి దగ్గర మూడు కత్తులు ఉంటే వాళ్లకు ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి అందరి మధ్య కత్తులు(డాగర్స్) గురించి డిస్కషన్ జరిగింది. మరోవైపు బిగ్‌బాస్ భైరవ టీమ్‌లో ఎవరైనా ఐదుగురు మాత్రమే కెప్టెన్సీ పోరులో పాల్గొనాలని చెప్పాడు. అమన్ కెప్టెన్ అవుతానంటే రోహిత్ వద్దన్నాడు. చాలాసేపు గొడవలు, డిస్కషన్స్ జరిగిన తర్వాత వర్షిణి, ఝాన్సీ, రాంప్రసాద్, అపూర్వ, అమన్.. కెప్టెన్సీ పోటీలకు సిద్ధమయ్యారు.కెప్టెన్సీ కోసం 'పాత్ టూ పవర్' అనే పోటీని మూడు లెవల్స్‌లో పెట్టారు. చివరవరకు ఎవరు నిలిస్తే వాళ్లు కెప్టెన్ అవుతారు. ఒక కర్రతో పోల్స్‌కి వేలాడుతున్న బ్యాగ్స్‌ని కిందకు పడేసి అందులోని తాడులు తీసుకొని ఎదురుగానున్న డబ్బాలపై తాడుతో బ్రిడ్జ్ తయారుచేయాలి. ముందుగా వచ్చే ముగ్గురు తర్వాత దశకి వెళ్తారు. రెండో లెవల్లో తాడుపై బాల్స్ కదిలించి చేసే టాస్క్. అందులో ముందు చేసిన ఇద్దరు తర్వాత దశకి వెళ్తారు. చివరి లెవల్లో బిగ్‌బాస్ ముక్కలతో ఐ లోగో పూర్తిచేయాలి. ఎవరు మొదటగా చేస్తే వాళ్లు కెప్టెన్ అవుతారు.(ఇదీ చదవండి: 'తెల్లకాగితం' సినిమా రివ్యూ)అయితే ఈ గేమ్ అంతా ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగానే సాగింది. మొదటి దశలో అమన్, రాంప్రసాద్, ఝాన్సీ గెలవగా నెక్స్ట్ లెవల్‌కి అమన్, ఝాన్సీ వెళ్లారు. ఫైనల్‌గా అమన్ గెలిచాడు. కెప్టెన్ అయ్యాడు. ఝాన్సీ ఓడిపోయినందుకు ఏడ్చింది. అయితే వర్షిణి తన మ్యాజికల్ పవర్ వాడతానని బిగ్‌బాస్‌ని అడగ్గా ఓకే చెప్పి ఆమె తాళాలు పంపించాడు. వర్షిణి మ్యాజిక్ పవర్ ఏంటంటే ఎవరు గెలిస్తే వాళ్ల దగ్గరున్న శక్తిని తీసేసుకోవచ్చు. దీంతో వర్షిణి అమన్ కెప్టెన్సీ తీసుకుంది. ఇక కెప్టెన్ అయినందుకు ముకేశ్ కాళ్లు పట్టుకొని తనని ఆశీర్వదించమంది. ఇక డాగార్లు(కత్తులు) ఉన్నవాళ్లకే ఇమ్యూనిటీ ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశముందని బిగ్‌బాస్ చెప్పాడు. తర్వాత ఇమ్యూనిటీ గేమ్ పెట్టాడు. డాగార్లు ఉన్నోళ్ల ఫొటోలు ముందు పెట్టి రెండు లేదా ఎక్కువ డాగర్స్ ఉన్నవాళ్లు ఎవరు ఇమ్యూనిటీ ఇవ్వాలో నిర్ణయిస్తారని చెప్పాడు. దానికి ఓ టాస్క్ పెట్టాడు. మొదట సృష్టి.. వంశీ ఫోటో తీసేసి తన ఫొటో పెడతానంది. సుధీర్.. సృష్టి ఫొటో తీసేసాడు. ఝాన్సీ త్రిగున్ ఇమ్యూనిటీ తీసేసుకుంది. వంశీ.. చరణ్ ఇమ్యూనిటీ తీసుకున్నాడు. దీంతో ఫైనల్‌గా వంశీ, సుధీర్.. ఆరో వారానికి ఇమ్యూనిటీ పొందారు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ బుగ్గ గిల్లిన అభిమాని.. వీడియో వైరల్) -
బిగ్‌బాస్‌లో యాక్షన్ సీన్స్.. నువ్వా నేనా అనేలా రగడ
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజు రోజుకీ ఆసక్తికరంగా సాగుతోంది. బిగ్‌బాస్ ప్రేక్షకులకు అయితే టాస్కులు, గొడవలు, వ్యూహాలతో మంచి ఎంటర్టైన్మెంట్ అనే చెప్పాలి. అయితే నిన్న (సెప్టెంబరు 30న) ఎపిసోడ్‌లోనూ ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. డ్యాగర్ల కోసం పోటీ, అమన్-త్రిగుణ్ మధ్య గొడవ, షాలిని-రోహిత్ వాగ్వాదంతో ఎపిసోడ్ మొత్తం హీటెక్కింది. మరి 24వ రోజు ఏం జరిగిందో తెలుసుకుందామా...అమన్-త్రిగుణ్ మధ్య రచ్చ..ఈ వారం పూర్తయ్యేసరికి రెండు కంటే ఎక్కువ డ్యాగర్లు ఉండేలా ప్రయత్నించాలని బిగ్‌బాస్ చెప్పాడు. ఆరో వారంలోకి వెళ్లేందుకు దక్కే ఇమ్యూనిటీకి ఈ డ్యాగర్లు కీలకమని స్పష్టం చేశాడు. దీంతో డ్యాగర్లను సొంతం చేసుకునేందుకు హౌస్మేట్స్ మధ్య పోటీ మొదలైంది. ఇందులో భాగంగా రెండు టీమ్‌లకు మొదట నిప్పుపై ఆధిపత్యం సాధించేందుకు ‘ఫైర్ వర్సెస్ లావా’ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో రెండు టీమ్‌ల నుంచి నలుగురు చొప్పున పాల్గొన్నారు. రెడ్ టీమ్ నుంచి రోహిత్, అమన్, వంశీ, బ్లూ టీమ్ నుంచి దేబ్జానీ, ముకేశ్, త్రిగుణ్, సృష్టి బరిలోకి దిగారు. తమ టీమ్ రంగుకు చెందిన డ్రమ్స్‌ను యాక్టివిటీ రూం నుంచి తీసుకొచ్చి గార్డెన్‌లోని డ్రమ్స్ ఏరియాలో పెట్టాలి. అయితే నేలకు కాలు తగలకుండా డ్రమ్స్పై నడుచుకుంటూ వెళ్లాలనే నిబంధన పెట్టారు. రెడ్ టీమ్‌కు మొదటి బజర్కే గేమ్ ప్రారంభించే అవకాశం లభించగా.. బ్లూ టీమ్ రెండో బజర్ తర్వాత ఆట మొదలు పెట్టింది. ఈ క్రమంలో అమన్, త్రిగుణ్‌ను టార్గెట్ చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టాస్క్ కంటే వీరిద్దరి మధ్య జరిగిన గొడవే ఎక్కువగా హైలైట్ అయింది. దీంతో ఎపిసోడ్ యాక్షన్ సినిమా చేసే ఫీలింగ్ కలిగింది. చివరకు ఈ గేమ్‌లో భైరవ టీమ్ విజయం సాధించింది. దీంతో దేబ్జానీకి దక్కిన డ్యాగర్‌ను అమన్ సొంతం చేసుకున్నాడు.షాలిని-రోహిత్ మధ్య గొడవ..మరోవైపు కెప్టెన్ గదిలో ఉన్న డ్యాగర్లను తీసుకునేందుకు షాలిని ప్రయత్నించడంతో మరో వివాదం మొదలైంది. షాలిని అక్కడికి వెళ్లడాన్ని చూసిన రోహిత్ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తాను ఏమీ తీసుకోలేదని చెప్పడంతో రోహిత్ ఆమెకు మద్దతుగా మాట్లాడాడు. అయితే ఆ తర్వాత షాలిని రోహిత్ దగ్గర ఉన్న డ్యాగర్‌ను తీసుకుంటానని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ విషయంలో రోహిత్ తనను ప్రశ్నించడంతో షాలిని కూడా ఘాటుగానే స్పందించింది. ‘భయపడి మా మీద అరుస్తున్నావ్’ అంటూ షాలిని అనడంతో రోహిత్ కూడా తీవ్రంగా స్పందించాడు. కెప్టెన్ రూంలో డ్యాగర్లు ఉన్నాయని.. ఎవరు తీసుకోవాలనుకుంటే వారు తీసుకోవచ్చని అన్నాడు. ఈ వ్యవహారంలో తనకు మద్దతు ఇచ్చినందుకు రోహిత్ తర్వాత రాంప్రసాద్‌కు సారీ చెప్పాడు. ‘వాళ్లకు సపోర్ట్ చేయడం నాదే తప్పు. మీ వల్ల అందరి ముందు నేను పిచ్చోడిని అయిపోయా’ అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అయితే షాలిని మాత్రం తగ్గలేదు. ‘నా గేమ్ నేను ఆడుకుంటా.. నాకు ఎవరి సపోర్ట్, దయాదాక్షిణ్యాలు అవసరం లేదు’ అంటూ రోహిత్‌కు తేల్చి చెప్పింది.వంశీ-చరణ్ కూడా..ఇక ఈ గొడవలో వంశీ కూడా జోక్యం చేసుకున్నాడు. తమ విషయంలో ఏమైనా ఉంటే తమతోనే మాట్లాడాలని, తమ కోసం రోహిత్, అపూర్వలను అనడం ఎందుకని షాలిని ప్రశ్నించింది. దీంతో పరిస్థితి మరింత వేడెక్కింది. మరోవైపు వంశీ, చరణ్ మధ్య కూడా ఎవరు ఎలాంటి గేమ్ ఆడారనే విషయంపై వాగ్వాదం జరిగింది. ఇలా డ్యాగర్ల కోసం మొదలైన ఆట.. ఒకరి తర్వాత ఒకరిని గొడవల్లోకి లాగింది. మొత్తంగా 24వ రోజు ఎపిసోడ్లో టాస్కుల కంటే గొడవలే ఎక్కువగా కనిపించడంతో బిగ్‌బాస్ హౌస్ హీటెక్కింది.ఇదీ చదవండి: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’పై ఎన్టీఆర్, మహేశ్‌ల మూవీ రివ్యూ -
బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే
బిగ్‌బాస్‌లో ప్రతి సోమవారం నామినేషన్ల హడావుడి ఉంటుంది. ఈసారి రథం టాస్క్ ఆడించిన తర్వాత ఇది జరిగింది. సోమవారం అంతా కంటెస్టెంట్స్ రెండు జట్లుగా విడిపోయి గేమ్స్ ఆడారు. ఇందులో భైరవ టీమ్ గెలిచింది. నామినేషన్లలో చిన్నపాటి ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఇంతకీ మంగళవారం(సెప్టెంబరు 29) నాడు హౌస్‌లో ఏం జరిగింది? ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు?(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'కి పోటీగా కొత్త రియాలిటీ షో.. లాంచింగ్ ప్రోమో)సోమవారం రథం టాస్క్ మధ్యలో ఆపారు. దాన్ని తిరిగి కొనసాగించడంతో మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. రెండోసారీ భైరవ టీమే విజేతగా నిలిచింది. దీంతో వీళ్లకు రథం అమర్చే అవకాశం దక్కింది. ఈ జట్టు గెలవడంతో మరో టీమ్‌లోని ఎవరి దగ్గరైనా రెండు కత్తులు తీసుకోమని బిగ్‌బాస్ చెప్పడంతో వంశీ, సుధీర్.. ముకేశ్, త్రిగుణ్ కత్తుల్ని తీసుకున్నారు.రథం టాస్క్‌లో భైరవ టీమ్ గెలవడంతో వాళ్లకే నామినేషన్స్ చేసే అవకాశమిచ్చాడు బిగ్‌బాస్. సప్తశక్తి టీమ్ ఓడిపోవడంతో అందులో ఉన్నవాళ్లంతా నామినేట్ అయ్యారు. వాళ్లలో ఇద్దరికి మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పడంతో నరేశ్, త్రిగుణ్లకి ఆ అవకాశం దక్కింది. టెంప్టేషన్ టాస్క్ వల్ల ముకేశ్ ముందే నామినేట్ అయ్యాడు. అపూర్వ కెప్టెన్ కాబట్టి ఆమెని నామినేట్ చేయకూడదని బిగ్‌బాస్ చెప్పాడు.తొలుత త్రిగుణ్.. రోహిత్ చేసే పనులని, మ్యానిప్యులేట్ చేసే విధానాన్ని, తన అగ్నిపరీక్ష గ్రూపిజం కారణాలు చెప్పి అతడిని నామినేట్ చేశాడు. పనులు చేయకపోవడం, బద్ధకం కారణాలుగా చెప్పాడు. నరేశ్.. అమన్‌ని నామినేట్ చేశాడు. ప్రతిదానికి గొడవ పడుతున్నాడు. అతడితో ఏమన్నా మాట్లాడాలంటే గొడవ అవుతుందేమో అనిపిస్తుంది. ప్రతి దానికి ట్రిగ్గర్ అయిపోతున్నాడు. సంచాలక్‌గా సరిగ్గా చేయలేదు, పని విషయంలో బద్ధకం అని కారణాలు చెప్పాడు. తర్వాత భైరవ టీమ్ అంతా ఒక్కొక్కరు నామినేషన్స్ చేశారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి!)తొలుత ఝాన్సీ వచ్చి సృష్టిని నామినేట్ చేసింది. ఓ టాస్క్ సందర్భంగా నన్ను నామినేట్ చేయకు అని అడుక్కుంది. అంత వీక్, భయం.. వెళ్లిపోతుందేమో అని అందుకే నామినేట్ చేశానని కారణాలు చెప్పింది. అమన్.. త్రిగుణ్‌ని నామినేట్ చేశాడు. అపూర్వ.. త్రిగుణ్‌ని నామినేట్ చేసింది. చాలా ఇరిటేటింగ్ పర్సన్, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని కారణాలు చెప్పింది. రాంప్రసాద్.. షాలినిని నామినేట్ చేశాడు. బిగ్‌బాస్ ఎన్నిసార్లు చెప్పినా అదే ఆలస్యం, అలానే నిన్న జరిగిన గొడవని కారణాలుగా చూపించాడు. రాంప్రసాద్ చెబుతున్నంతసేపు షాలిని ఎప్పట్లాగే ఓవరాక్షన్ చేస్తూ అరుస్తూ మాట్లాడింది.రోహిత్.. దేబ్జానీని నామినేట్ చేశాడు. వర్షిణి.. సృష్టిని నామినేట్ చేసింది. వంశీ.. చరణ్‌ని నామినేట్ చేశాడు. సుధీర్ కూడా చరణ్‌నే నామినేట్ చేశాడు. మొత్తంగా ఈ వారం ముకేశ్, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేశ్, చరణ్, సృష్టిలు నామినేషన్స్‌లో ఉన్నారు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది.(ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పేసుకున్న బిగ్‌బాస్ తెలుగు జంట పవన్-రీతూ) -
బ్రేకప్ చెప్పేసుకున్న బిగ్‌బాస్ తెలుగు జంట
తెలుగులో ప్రస్తుతం బిగ్‌బాస్ 10వ సీజన్ నడుస్తోంది. అయితే గతేడాది అగ్నిపరీక్ష నుంచి ఈ షోకి వెళ్లి ఫైనల్ వరకు వచ్చిన డిమోన్ పవన్.. రీతూ చౌదరికి బ్రేకప్ చెప్పేశాడు. ఈ మేరకు తన ఇన్ స్టాలో ఎమోషనల్ స్టోరీ పోస్ట్ చేశాడు. తాము విడిపోయామని, ఇకపై తమ బంధం కొనసాగదని రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'కి పోటీగా కొత్త రియాలిటీ షో.. లాంచింగ్ ప్రోమో)'అందరికీ నమస్కారం. #రివాన్ గురించి నాకు వరుసగా మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే దీనిపై మాట్లాడాలని అనుకున్నాను. రీతుని నేను ఉపయోగించుకున్నాను. లేదా రీతు నన్ను ఉపయోగించుకుంది. ఇంకేదో జరిగింది అంటూ వస్తున్న నెగెటివిటీ, పుకార్లతో నేను విసిగిపోయాను. బిగ్‌బాస్‌లో మీరంతా చూసేది, నిజ జీవితంలో జరిగేది ఈ రెండూ పూర్తిగా వేర్వేరు విషయాలు. ఎవరూ ఎవరినీ ఉపయోగించుకోలేదు. ఇది ఒక పరస్పర స్నేహం. మా ఇద్దరికీ వ్యక్తిగత బలాలు, బలహీనతలు ఉన్నాయి. మేం గతంలో కలిసి పనిచేశాం. కానీ ఇకపై రివాన్(రీతూ-పవన్) ఉండదు''మా స్నేహం పూర్తిగా బ్రేకప్ అయిపోయింది. మేం మంచి రిలేషన్ మెంటైన్ చేశాం కానీ ఏ బంధంలోనైనా వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. చాలా నెలలుగా మాకు ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. ప్రతిసారీ నేను అర్థం చేసుకుని, సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాను. కానీ పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ప్రతిసారీ మా గొడవలు మరింత పెద్దవవుతున్నాయి. కాబట్టి ప్రశాంతత కోసం మా ప్రాజెక్టులను విడివిడిగా చేసుకోవాలని అనుకున్నాం. ఆమె నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసి, స్నాప్‌లో తొలగించింది. అది నాకు నచ్చలేదు. అందుకే నేను ఆమెని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేశాను. ఇప్పుడు ఆమె నన్ను ఇన్‌స్టాలోనూ బ్లాక్ చేసింది. నేను ఏ పోస్టులను డిలీట్ చేయలేదు. మీ సపోర్ట్‌కి థ్యాంక్యూ' అని పవన్ భావోద్వేగానికి గురయ్యాడు.బిగ్‌బాస్ షోలో తెగ కెమిస్ట్రీ చూపించిన పవన్-రీతూ.. బయటకొచ్చిన తర్వాత 'బీబీ జోడీ' డ్యాన్స్ షోలో జంటగా పాల్గొన్నారు. గత నెలలోనే వీళ్లిద్దరూ కలిసి చేసిన 'బంగారం' అనే ఆల్బమ్ వీడియో సాంగ్ రిలీజైంది. ఇంతలో ఇప్పుడు బ్రేకప్ చెప్పేసుకోవడంతో వీళ్లిద్దరి అభిమానులు షాకయ్యారు. రీతూ చౌదరి ఈ విషయమై స్పందించాల్సి ఉంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే) -
బిగ్‌బాస్ 10: వెనకాల మాట్లాడే రకం కాదు.. నామినేషన్లలో రచ్చ
సోమవారం వచ్చిందంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల హడావుడి ఉంటుంది. కానీ ఈ వారం రెడ్ టీమ్, బ్లూ టీమ్ అని సభ్యుల్ని విడగొట్టి.. డాగర్స్ సంపాదించుకోవడం, రథం టాస్క్ అని హౌస్మేట్స్ మధ్య బిగ్‌బాస్ పోటీ పెట్టాడు. మంగళవారం నామినేషన్లలో హడావుడి మొదలైంది. అయితే ఇందులో అంతా కలిసి త్రిగుణ్‌ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి!)తాజాగా రిలీజ్ చేసిన తొలి ప్రోమోలో చూస్తే అమన్.. త్రిగుణ్ పేరు చెప్పాడు. అరేయ్ తురేయ్ అని చాలా సార్లు అన్నావ్ అని అమన్ అంటే.. నువ్వు వద్దు అన్నాక ఒక్కసారి కూడా అనలేదని త్రిగుణ్ కౌంటర్ ఇచ్చాడు. అంత వీడియో వచ్చినోడివి చూసినవ్ కదా నీకు కాన్ఫిడెన్స్ లేదా? అని త్రిగుణ్‌ని ఏదో మ్యాటర్‌తో కంపేర్ చేసి అమన్ అనగానే.. నాకు లేదు, నీ అంత లేదని త్రిగుణ్ సమాధానమిచ్చాడు. నీకు లేదు అని వెరైటీగా చిందులు వేస్తూ అమన్ వెక్కిరించాడు.తర్వాత వచ్చిన త్రిగుణ్.. రోహిత్‌ని, నరేశ్.. అమన్‌ని నామినేట్ చేశారు. తమ కారణాలు చెప్పారు. ఇల్లు సరిగ్గా లేకపోతే అమన్ మొహాన్ని అనడం ఎందుకు? అతడ్ని తక్కువ చేసి మాట్లాడటం ఎందుకు అని రోహిత్ అన్నాడు. మరోవైపు ఇంట్లో పది గొడలుంటే అందులో నాలుగు అమన్వే ఉంటున్నాయ్ అని నరేశ్ చెప్పుకొచ్చాడు. నీ మొహం చూస్తుంటే చిరాకేస్తోంది. నిన్ను చూస్తుంటే చిరాకేస్తోంది అని అంటే అలాంటి మాటలు పడటానికి రాలేదు ఎవరిక్కడ అని అమన్ సీరియస్ అయ్యాడు. వెనకాలకు వెళ్లి లాంజ్‌లో కూర్చుని డాక్యుమెంట్లు రాసుకునే టైపు కాదు. ఫ్రంట్ ఫుట్‌లో వచ్చి బ్యాటింగ్ చేసేవాడ్ని అని త్రిగుణ్ అన్నాడు. ప్రోమో చూస్తుంటే ఫుల్ ఫైర్ కనిపించింది.అయితే రెడ్, బ్లూ తమ జట్లలోని సభ్యుల్ని కాకుండా పక్క టీమ్‌లోని నామినేట్ చేయాలని బిగ్‌బాస్ మెలిక పెట్టినట్లు ప్రోమో చూస్తుంటే అనిపించింది. అలానే ఎపిసోడ్లో ఇంకెన్ని గొడవలు అవుతాయోననే సందేహం కూడా కలుగుతోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: అపూర్వ-షాలిని.. ఇలా తయారయ్యారేంటి?) -
బిగ్‌బాస్ 10: అపూర్వ-షాలిని.. ఇలా తయారయ్యారేంటి?
బిగ్‌బాస్ 10లో సెలబ్రిటీల్లో ఒకరిద్దరో హైలైట్ అవుతున్నారు కానీ కామనర్స్ మాత్రం కెమెరాలకు కనిపించేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. గొడవపడుతూ, అరిచి గోల చేస్తూ రచ్చ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అపూర్వ.. వచ్చిన మూడు నాలుగు రోజులకే ఎంత హడావుడి చేయాలో అంతా చేస్తోంది. ఈమెకు తగ్గట్లే షాలిని కూడా రెచ్చిపోతోంది. ఇంతకీ బిగ్‌బాస్ హౌస్‌లో 22వ రోజైన సోమవారం(సెప్టెంబరు 29) ఎపిసోడ్లో అసలేం జరిగింది?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: వర్షిణి కోసం ముకేశ్ త్యాగం.. ఎలిమినేషన్లో ట్విస్టులు)వీకెండ్ ఎపిసోడ్ తర్వాత అపూర్వ కెప్టెన్ అయింది. ఇక సోమవారం ఎపిసోడ్.. కెప్టెన్ అపూర్వ, ముఖేష్ గొడవతో మొదలైంది. గిన్నెలు కడిగే, కెప్టెన్ గది ఖాళీ చేసే విషయమై ఇద్దరూ వాదించుకున్నారు. మీటింగ్ పెట్టి, రూల్స్ పెడితే.. అప్పుడు ఫాలో అవుతానని ముఖేష్ అంటే వెంటనే అపూర్వ మీటింగ్ పెట్టింది. అక్కడ కూడా ముఖేష్, అపూర్వ గొడవపడ్డారు. ఎందుకు ఇలా చులకనగా చూస్తున్నావ్, అగౌరవపర్చుతున్నావ్, కెప్టెన్ అంటే గౌరవం లేదా? నువ్వే అన్నావ్ కదా కెప్టెన్‌కి గౌరవం ఇవ్వాలని మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు అని అపూర్వ లాజిక్ తీసింది. మధ్యలోకి ఎంటరైన త్రిగుణ్.. నేను కెప్టెన్ అని పిలవను, ఏం చేసుకుంటావో చేసుకో అని అన్నాడు.గతవారం టెన్షన్-టెంప్టేషన్ అని అల్లాడించిన బిగ్‌బాస్.. ఈసారి టోటల్ డామినేషన్ అని కొత్త ఆట మొదలుపెట్టాడు. షాలిని, శృష్టి, చరణ్, నరేష్, త్రిగుణ్, ముఖేష్, దేబ్జానీ ఒక జట్టు(సప్తశక్తి) అని.. మిగిలిన వాళ్లంతా మరో టీమ్(భైరవ) అని చెప్పాడు. మొదటి యుద్దంలో గెలిస్తే అదిరిపోయే ఆఫర్ ఉంటుందని బిగ్ బాస్ అన్నాడు. మొదటి ఆయుధం పంపిస్తున్నా అని ఒకరి వద్ద రెండు, అంతకంటే ఎక్కువ డ్యాగర్స్ని సంపాదించుకోవాలని చెప్పాడు. ఎక్కువ డ్యాగర్స్ ఉన్నోళ్లు ఎదుటి వారి ఆటని మార్చొచ్చని అన్నాడు. ఇందులో భాగంగా ప్రాంక్ అని చెప్పి నరేశ్ కత్తిని రాంప్రసాద్ లాక్కున్నాడు. మరోవైపు మూడు దశల్లో రథ నిర్మాణం చేయాలని ఓ టాస్క్ ఇచ్చిన బిగ్‌బాస్.. మధ్యలో బ్రిక్స్(ఇటుకల్ని) కలెక్ట్ చేయాల్సి ఉంటుందని, ఎక్కువ కలెక్ట్ చేసిన వాళ్లకే రథానికి సంబంధించిన భాగాలు దొరుకుతాయని చెప్పాడు.ఈ టాస్క్‌కి రోహిత్, షాలిని సంచాలక్స్గా ఉంటూనే ఆడుకోవచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. రూల్స్ గురించి వీళ్లిద్దరూ మాట్లాడుకుంటే మధ్యలో అపూర్వ వచ్చింది. ప్రతిసారి ఇలానే మధ్యలోకి దూరుతున్నావ్ అని షాలిని అరిచేసింది. దీంతో షాలిని, అపూర్వకు గొడవ జరిగింది. మరోవైపు ఆట ప్రారంభమైన తర్వాత శృష్టి కాలికి గాయమయ్యేసరికి ఆటను ఆపేశారు. మెడికల్ రూంలోకి వెళ్లే ముందు తన కత్తిని శృష్టి.. షాలినికి ఇచ్చింది. దీని తర్వాత అపూర్వ తన టీమ్ అంతటినీ పిలిచి షాలిని దగ్గర కత్తి ఉందని, తీసుకుందామని చెప్పింది. దీంతో రోహిత్, సుధీర్, ఝాన్సీ, అమన్ ఇలా అందరూ షాలిని మీద పడ్డారు. షాలినికి చెందిన బ్లూ టీం.. రెడ్ టీంని అడ్డుకుంది. ఇందులో భాగంగా త్రిగుణ్, రోహిత్ దారుణంగా ప్రవర్తించి మాటలు జారారు.మరోవైపు అపూర్వ, రోహిత్‌ల మీద షాలిని ఫైర్ అయింది. దీంతో అది శృష్టి కత్తి అని తెలీదు. తెలిస్తే ఇలా చేసే వాళ్లం కాదని అన్నారు. నరేష్ విషయంలోనూ మీరు ఇలానే చేశారు. ప్రాంక్ అన్నారు. ఇంత వరకు కత్తి ఇవ్వలేదు అని త్రిగుణ్ అన్నాడు. మళ్లీ ఆట ఆరంభించగానే ముఖేష్ కాలికి గాయమైంది. అమన్ ఫౌల్ గేమ్ ఆడాడని షాలిని అనేసరికి వీళ్లిద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. చివరకు రెడ్ టీం అంటే టీం భైరవ గెలిచింది. రథానికి మొదటి పార్ట్ అమర్చింది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి!) -
22ఏళ్లకే బిగ్‌బాస్‌లోకి.. రెండు రోజుల్లోనే 15లక్షలు.. ఎవరీ కుర్రాడు?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 అభిమానుల అంచనాలకు భిన్నంగా సాగుతోంది. తొలి వారంలోనే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో ఇద్దరు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇదే సమయంలో కామనర్స్ కోటాలో హౌస్‌లోకి అడుగుపెట్టిన మిథిలేష్ రెడ్డి.. అనూహ్య నిర్ణయంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. శనివారం ఎపిసోడ్లో రూ.15 లక్షల నగదు ఆఫర్‌ను స్వీకరించి బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో అసలు మిథిలేష్ రెడ్డి ఎవరు? ఆయన నేపథ్యం ఏంటి? అంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు.మదనపల్లికి చెందిన ఫిట్నెస్ మోడల్ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన మిథిలేష్ రెడ్డి ఫిట్నెస్ మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నతనం నుంచే ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెంచుకున్న ఆయన.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ తన శరీరాకృతిని తీర్చిదిద్దుకున్నాడు. తన వర్కవుట్ వీడియోలు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను సంపాదించుకున్నాడు.తొలిరోజే సిక్స్ ప్యాక్‌తో..బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలిరోజే మిథిలేష్ తన సిక్స్ ప్యాక్ బాడీని చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. షర్ట్ విప్పి తన కండలు చూపించడంతో హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకుల దృష్టిలోనూ ప్రత్యేకంగా నిలిచాడు. ఇక మిథిలేష్ రెడ్డి తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారట.అగ్నిపరీక్షలోనూ సందడిబిగ్బాస్లోకి రాకముందే మిథిలేష్ రెడ్డి ‘అగ్నిపరీక్ష సీజన్ 2’లో కనిపించాడు. అక్కడ కూడా తన ఫిట్నెస్తో ఆకట్టుకున్నాడు. షర్ట్ విప్పి కండలు చూపించిన వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో కామనర్‌గా అవకాశం దక్కించుకున్నాడు.రూ.15 లక్షలు తీసుకుని బయటకు..హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండి టైటిల్ కోసం పోటీ పడటం కంటే.. రూ.15 లక్షల నగదు ఆఫర్‌ను స్వీకరించి బయటకు రావడానికే మిథిలేష్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. దీంతో బిగ్‌బాస్ చరిత్రలోనే భిన్నమైన నిర్ణయం తీసుకున్న కంటెస్టెంట్‌గా నిలిచాడు. 22 ఏళ్ల వయసులోనే బిగ్‌బాస్ వేదికపై కనిపించి.. తనకు వచ్చిన అవకాశాన్ని నగదు బహుమతిగా మార్చుకుని బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: సెహ్వాగ్‌కు కొత్త పంచాయితీ..! దుస్తులు చింపి.. ఆపై.. -
‘అన్నా.. అని పిలిచా కదరా.. చిన్న పిల్లాడ్ని చేసి ఇలా..
బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో రోజురోజుకీ ఆట రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం ‘టోటల్ డామినేషన్’ అనే థీమ్‌తో ఇంట్లో టాస్కులు కొనసాగుతున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోల్లో కంటెస్టెంట్ల మధ్య ఆధిపత్య పోరు, గొడవలు హైలైట్‌గా నిలిచాయి.ముఖేష్ త్యాగంతో అపూర్వకు కెప్టెన్సీముఖేష్, అపూర్వ కలిసి టాస్క్‌లో ఆడి విజయం సాధించారు. దీంతో ముఖేష్‌ను కెప్టెన్‌గా బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే వర్షిణి, వంశీ కోసం ముఖేష్ తన కెప్టెన్సీని త్యాగం చేశాడు. దీంతో అతడితో కలిసి టాస్క్‌లో గెలిచిన అపూర్వను తదుపరి కెప్టెన్‌గా నాగార్జున ప్రకటించాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అపూర్వ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రోమోలో కనిపించింది. ఈ క్రమంలో ముఖేష్, త్రిగుణ్‌లతో అపూర్వకు వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అసలు వీరి మధ్య ఏ విషయంలో గొడవ జరిగింది? అనేది పూర్తి ఎపిసోడ్లో చూడాల్సి ఉంది.కత్తుల కోసం కంటెస్టెంట్ల మధ్య పోటీమరో ప్రోమోలో ‘టోటల్ డామినేషన్’ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ఒక్కో కత్తిని ఒక్కో కంటెస్టెంట్‌కు ఇచ్చాడు. ఒక కంటెస్టెంట్ వద్ద రెండు లేదా అంతకంటే ఎక్కువ కత్తులు ఉంటే వారికి ప్రత్యేక అధికారం లభిస్తుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో కత్తులను సొంతం చేసుకునేందుకు కంటెస్టెంట్లు తమ వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటికే ఇంట్లో రెండు వర్గాలు ఏర్పడినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో నరేశ్ వద్ద ఉన్న కత్తిని రాంప్రసాద్, రోహిత్ కలిసి తీసుకునేందుకు ప్రయత్నించారు. రోహిత్ నరేశ్‌ను ఎత్తుకెళ్లగా.. రాంప్రసాద్ అతడి వద్ద ఉన్న కత్తిని తీసుకున్నాడు. దీంతో నరేశ్ తన కత్తిని తిరిగి ఇవ్వాలని పదేపదే అడిగాడు.నా కత్తి నాకు ఇవ్వండి‘నా కత్తి నాకు ఇవ్వండి’ అంటూ నరేశ్ తన టీమ్ సభ్యులను పిలిచాడు. అయితే తాము ఎలాంటి ఫిజికల్ చేయలేదని సుధీర్ చెప్పాడు. దీనిపై త్రిగుణ్ స్పందిస్తూ.. ఫిజికల్‌గా చేయకుండా కత్తిని ఎలా లాక్కున్నారో చెప్పాలని ప్రశ్నించాడు. దీంతో నరేశ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘చిన్న పిల్లాడ్ని చేసి ఆడుకున్నారు’ అంటూ ఫైర్ అయ్యాడు. అంతేకాకుండా రాంప్రసాద్‌ను ఉద్దేశించి ‘అన్నా అని పిలిచా కదరా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో కత్తుల టాస్క్ బిగ్‌బాస్ ఇంట్లో మరింత వేడిని పెంచినట్లు కనిపిస్తోంది.ఇదీ చదవండి: ‘అమ్మ ఉంది ఆకలి తీర్చడానికి.. బెగ్గింగ్కి కాదు’.. స్లమ్‌డాగ్ గ్లింప్స్ -
బిగ్‌బాస్ 10: రూ.15 లక్షలు.. పరువు.. రెండు పోయాయి!
తెలుగు బిగ్‌బాస్ షో ఇప్పటివరకు 9 సీజన్లు నడిచింది. దీని వల్ల బాగుపడినవాళ్లు మహా అయితే ఒకరో ఇద్దరు ఉంటారంతే! అంతకుమించి లేరు. ప్రైజ్‌మనీ, డబ్బుల గురించి ఎప్పుడో సీజన్ చివరాఖరుకు వచ్చేసరికి మాట్లాడుకుంటారు తప్పితే మిగతా టైంలో అసలు దీని గురించి డిస్కషనే ఉండదు. కానీ మిథిలేష్ అనే కుర్రాడి కారణంగా మొత్తం సీనే మారిపోయింది. షో పరువంతా పోయింది! ఇంతకీ ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఇప్పటివరకు చాలామంది బిగ్‌బాస్‌కి వచ్చారు. కొందరు తమకున్న ఇమేజ్ చెడగొట్టుకోగా.. మరికొందరు మంచి గుర్తింపు తెచ్చుకుని బయటకొచ్చారు. కానీ ఎవరిని అడిగినా కప్పు కొట్టడమే ముఖ్యం. డబ్బులది ఏముంది ఎలా అయినా సంపాదించుకోవచ్చు, పేరు ముఖ్యం లాంటి కబుర్లు చెబుతారు. కానీ వీళ్లలో చాలామందికి తెలుసు నిజంగా వాళ్లు కప్పు కొట్టగలరో లేదో?అంతెందుకు సీజన్ చివరిరోజున కప్ కావాలా? డబ్బులు కావాలా? అని హోస్ట్ నాగార్జున అడిగితే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయి డబ్బులు తీసుకుని వెళ్లిపోవడం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే వాళ్లకు కూడా తెలుసు. తమకు కచ్చితంగా కప్ రాదని, అందుకు ఎంచక్కా సూట్ కేసు తీసుకుని లక్షాధికారులు అయిపోతుంటారు. కానీ ఈ సీజన్లో మిథిలేష్ అనే కామనర్.. కప్ కంటే తనకు డబ్బులే ముఖ్యం అని హౌస్‌లోకి వచ్చిన రెండో రోజే హోస్ట్ నాగార్జునకే ఓపెన్‌గా చెప్పి బయటకొచ్చేశాడు. ఒకటి రెండు కాదు ఏకంగా రూ.15 లక్షలు పట్టుకుపోయాడు. ఈ ట్విస్ట్ నాగార్జున కూడా ఊహించి ఉండడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: వర్షిణి కోసం ముకేశ్ త్యాగం.. ఎలిమినేషన్లో ట్విస్టులు)ఈ షోకి వచ్చేవాళ్లలో దాదాపు అందరూ చివరిరోజున వచ్చే డబ్బుల కోసమే వస్తారు అనేది పచ్చినిజం. కానీ ఎవరూ పైకి చెప్పరు. ఇదో బహిరంగా రహస్యం. అయితే డబ్బుల సూట్ కేసు తీసుకుని స్వయంగా బయటకొచ్చిన విషయంలో గతంలో సొహైల్, ఇప్పుడు ఈ మిథిలేష్ జనానికి బాగా గుర్తుండిపోతారు. హౌస్‌లో మరో మూడు నాలుగు వారాలున్నా సరే మిథిలేష్‌కి ఇంత గుర్తింపు వచ్చి ఉండేది కాదేమో! కేవలం రెండే రోజులు ఉండి.. ఎంచక్కా రూ.15 లక్షలు పట్టుకుపోయాడు. అంతెందుకు ఈ సీజన్లోనే వంద రోజులు ఉండి నెగ్గినా గానీ ఇంతకంటే ఎక్కువ డబ్బయితే రాదుగా! దీంతో సోషల్ మీడియా అంతా కూడా మిథిలేష్ సరైన పనే చేశాడని మెచ్చుకుంటున్నారు.అయితే మిథిలేష్ చాలా పెద్ద తప్పు చేశాడన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడానికి షో ఆర్గనైజర్స్ అష్టకష్టాలు పడుతున్నారు. ఎలిమినేట్ అయి బయటకొచ్చేసిన తర్వాత శివాజీతో చేసిన బజ్ ఇంటర్వ్యూలోనూ ఎందుకొచ్చావ్ బిగ్‌బాస్‌కి? అని ఇబ్బందిపెట్టే ప్రశ్నలు అడిగారు. కానీ మిథిలేష్ మాత్రం కూల్‌గా వచ్చిన పని అయిపోయింది అన్నట్లుగా సమాధానమిచ్చాడు.ఇప్పటివరకు పది సీజన్లు జరిగితే అందులో వైల్డ్‌కార్డ్‌గా వచ్చి ఎంతమంది టాప్-5కి వెళ్లారు? మీరే చెప్పండి అని ఉల్టా శివాజీకే మిథిలేష్ ఎదురుప్రశ్న వేశాడు. టాప్-5లో ప్రతి సీజన్లోనూ ఓ ఫిమేల్(సీరియల్ హీరోయిన్ లేదా సెలబ్రిటీ), ఓ ఎంటర్ టైనర్, మొదటి నుంచి మ్యానిపులేట్ చేసే వ్యక్తి ఉంటారని మిథిలేష్ చెప్పడం.. షో తీరు ఎలా ఉందో చెప్పకనే చెప్పింది. దీనిబట్టి చూస్తే మిథిలేష్ ఇలా చేస్తాడని అస్సలు ఊహించని బిగ్‌బాస్ టీమ్.. డబ్బుతో పాటు పరువు కూడా పోగొట్టుకున్నట్లే!(ఇదీ చదవండి: వినాయక చవితి వల్ల ఇబ్బంది.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అల్లు శిరీష్) -
బిగ్‌బాస్ 10: వర్షిణి కోసం ముకేశ్ త్యాగం.. ఎలిమినేషన్లో ట్విస్టులు
వైల్డ్ కార్డ్ ఎంట్రీలా వచ్చిన మిథిలేష్.. షాక్ ఇచ్చి రూ.15 లక్షలు తీసుకెళ్లిపోవడం హాట్ టాపిక్ అయిపోయింది. అయితే ఇతడు డబ్బులు తీసుకెళ్లిపోవడం మటేమో గానీ హౌస్‌లో రచ్చ రచ్చ అయిపోయింది. ఆదివారం(సెప్టెంబరు 27) ఎపిసోడ్లో అందరి రంగులు బయటపడ్డాయి. అలానే ఎలిమినేషన్ విషయంలో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఇంతకీ బిగ్‌బాస్ 10వ సీజన్లో 21వ రోజు అసలేం జరిగింది?(ఇదీ చదవండి: వినాయక చవితి వల్ల ఇబ్బంది.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అల్లు శిరీష్)మిథిలేష్.. విజేత ప్రైజ్‌మనీలో నుంచి రూ.15 లక్షలు తీసుకుని బయటకెళ్లిపోవడం గురించి డిస్కషన్‌తో ఆదివారం ఎపిసోడ్ మొదలైంది. హౌస్‌లోని సగం మంది ఇది తప్పునగా.. అగ్నిపరీక్ష బ్యాచ్ అది మిథిలేష్ ఇష్టం అని అన్నారు. విన్నర్ ప్రైజ్‌మనీ ఎందుకు ఇవ్వాలి? అని ముకేశ్, వంశీ, త్రిగుణ్, దేబ్జానీ ఫైర్ అయ్యారు. మిథిలేష్‌కి సపోర్ట్ చేసిన వాళ్లందరినీ ముకేశ్, త్రిగుణ్ పిచ్చ తిట్లు తిట్లు తిట్టారు. చివరికి అమన్ కూడా సపోర్ట్ చేయడంతో అందరూ అమన్‌ని తిట్టారు. అమన్ – త్రిగుణ్ కొట్టుకునేంత వరకు వెళ్లారు.రూ.15 లక్షలు తీసుకుని స్టేజీకి పైకి వెళ్లిన మిథిలేష్‌ని.. వెళ్లేముందు ఒక ఐదుగురిని ఎవరి గురించి జాగ్రత్తపడాలో చెప్పమని హోస్ట్ నాగార్జున అడిగాడు. దీంతో అమన్.. రోహిత్‌తో, వర్షిణి.. ముకేశ్‌తో, వంశీ.. త్రిగుణ్‌తో, నరేష్.. రాంప్రసాద్‌తో, చరణ్.. షాలినితో జాగ్రత్త పడాలని మిథిలేష్ చెప్పాడు. తర్వాత జంగిల్ గేమ్ ఆడించారు. ఒక్కో జంతువుకి తగిలించిన గుణాన్ని ఒక్కో కంటెస్టెంట్ ఇచ్చి ఎందుకో కారణం చెప్పాలని టాస్క్ పెట్టారు.(ఇదీ చదవండి: తెలుగు యువ దర్శకుడి భార్య మృతి.. అవయవదానం)ఇందులో భాగంగా ముకేశ్.. చిలుక మెడల్ తీసుకుని అమన్‌కి ఇచ్చాడు. నిర్ణయాలు సరిగ్గా తీసుకోవట్లేదు. వేరేవాళ్లు చెప్పినవి వింటాడు అని కారణాలు చెప్పాడు. రాంప్రసాద్.. నెమలి మెడల్ తీసుకొని షాలినికి ఇచ్చి షో అఫ్, ఓవరాయాక్షన్ చేస్తుందని చెప్పాడు. షాలిని.. పాము మెడల్ తీసుకొని అపూర్వకి ఇచ్చి పాత గొడవలు ఉన్నాయని చెప్పింది. నరేష్.. పాండా మెడల్ తీసుకొని బద్దకం అని దేబ్జానీకి ఇచ్చాడు. అపూర్వ.. పాము మెడల్ తీసుకొని పాయిజన్నెస్ అని త్రిగుణ్‌కి ఇచ్చింది. ఇలా ఈ టాస్క్ సాగింది. తర్వాత 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' మూవీ ప్రమోషన్స్ కోసం ఫహాద్ ఫాజిల్ షోకి వచ్చాడు. ఇక రోహిత్‌కి మేనల్లుడు పుట్టాడని ఆ బాబు ఫోటో చూపించడంతో తెగ ఎమోషనల్ అయిపోయి వెక్కి వెక్కి ఏడ్చాడు.నామినేషన్స్‌లో ఒక్కొక్కరు బతికిపోతూ చివరకు వంశీ, వర్షిణి మిగిలారు. అయితే టెంప్టేషన్ వీక్ కాబట్టి కెప్టెన్ ముకేశ్‌కి హోస్ట్ నాగార్జున ఆఫర్ ఇచ్చారు. ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. నువ్వు వాళ్లని కాపాడొచ్చు కానీ నీ ఇమ్యూనిటీ, కెప్టెన్సీ పోతుంది. వచ్చేవారం నువ్వు డైరెక్ట్ నామినేషన్స్‌లో ఉంటావ్. ఇవి ఒప్పుకుంటే ఇద్దరు ఎలిమినేట్ అవ్వకుండా హౌస్‌లో ఉంటారని కండీషన్ పెట్టడంతో ముకేశ్ వాటన్నింటికీ ఒప్పుకొన్నాడు. దీంతో వర్షిణి, వంశీ ఎలిమినేట్ కాకుండా బతికిపోయారు. ముకేశ్‌తో కలిసి టాస్క్ గెలిచింది కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన అపూర్వ కొత్త కెప్టెన్ అయిపోయింది. వచ్చిన రెండు రోజుల్లోనే కెప్టెన్ అయి రికార్డ్ సృష్టించింది. నాలుగోవారం టోటల్ డామినేషన్ అవతారంలో టాస్క్‌లు జరగనున్నాయని చెప్పి ఆదివారం ఎపిసోడ్ ముగించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా కొత్త సినిమా.. అధికారిక ప్రకటన) -
‘నరేశ్.. రాంప్రసాద్‌తో జాగ్రత్త.. లేదంటే నీ పని అంతే..!’
వైల్డ్ కార్డ్‌గా ఇంట్లోకి వచ్చి రెండు రోజులే అయిన మిథిలేష్ 15 లక్షలు సొంతం చేసుకుని బయటకు వెళ్లాడు. వచ్చిన రెండు రోజులకే 15లక్షలు ఇవ్వడానికి అసలు సిగ్గు లేకుండా ఓట్లు ఎలా వేస్తారు అని త్రిగుణ్అందరిపై ఫైర్ అయ్యాడు. డబ్బులు తీసుకుంటోంది ప్రొడక్షన్ నుంచి విన్నర్ డబ్బుల్లోంచి.. అని అమన్ తో ముఖేష్ అంటాడు. అది నా డబ్బు అని త్రిగుణ్ అంటే. నాది కాదా? అని అమన్ అంటాడు. మరి ఎందుకు ఇచ్చావ్.. అంత ఇవ్వాలనిపిస్తే.. గెలిచిన తర్వాత బయటకు వెళ్లి ఇవ్వాల్సి కదా అంటూ ఫైర్ త్రిగుణ్ ఫైర్ అవుతాడు. ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కోలా ఉంటుంది.. మిథిలేష్‌కి అలా.. నాకు ఇలా చేయాలని అనిపించింది అని అమన్ అన్నాడు. అయితే సరే మూసుకుని ఉండు అని త్రిగుణ్ అనడంతో. నువ్వు కూడా మూసుకుని ఉండు.. చేతకాకపోతే పడుకోపో అని అమన్ అనడంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తీరాస్థాయికి చేరుకుంటుంది. బిగ్ బాస్ ఇంట్లోంచి.. బిగ్ బాస్ ఇంట్లోంచి మిథిలేష్ బయటకు వచ్చేశారు. అయితే తాజాగా వచ్చిన ప్రోమోని చూస్తే ‘మనుషులున్నారు. జాగ్రత్త..’ అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో మిథిలేష్ కంటెస్టెంట్లకు మంచి మంచి సలహాలు ఇచ్చినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. రోహిత్ నుంచి అమన్, త్రిగుణ్ నుంచి వంశీ, ముఖేష్ నుంచి వర్షిణీ, రాంప్రసాద్ నుంచి నరేష్‌లను జాగ్రతగా ఉండమని సూచించాడు. ఇది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. ఎందుకంటే వీళ్లందరి మాట పక్కన పెడితే.. రాంప్రసాద్, నరేశ్‌లు మంచి స్నేహితులు. వీరు ఇప్పుడు ఎలా ఆడుతారనేది ఆసక్తిని పెంచుతోంది.మరో ప్రోమో3,4 ని పరిశీలిస్తే..మరో ప్రోమో3,4 ని పరిశీలిస్తే.. బీబీ జంగల్ టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో కింద ఉన్న మెడల్‌ను ఎవరికిస్తావని త్రిగుణ్‌ని అడగగానే అమన్‌కి ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే టాస్క్‌లో రోహిత్.. త్రిగుణ్‌ని నమ్మే సమస్యేలేదని తేల్చి చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ ఎలా సాగుతుందని ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు రోహిత్ మాటతీరుపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. మరోవైపు ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్ర బృందం బిగ్‌బాస్‌లో సందడి చేసింది. అంతేకాకుండా కంటెస్టెంట్లకు టాస్క్‌లు ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరి ఈ రోజు ఏం జరగబోతోంది అనేది తెలియాలి అంటే మరో కొన్ని గంటలు ఆగాల్సిందే. -
బిగ్‌బాస్ చరిత్రలోనే భారీ రెమ్యునరేషన్..! రోజుకు రూ.7లక్షల పైమాటే..
బిగ్‌బాస్.. రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. హౌస్‌లో ఎవరి ప్లాన్‌తో వాళ్లు కొత్త పంజాలనే విసురుతున్నారు. ఆట శైతం రసవత్తరంగా మారుతోంది. అయితే ఇప్పుడు వాళ్ల రెమ్యునరేషన్‌పై ప్రేక్షకుల కన్ను పడింది. దీంతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో సెలబ్రిటీలతో పాటు కామనర్ల రెమ్యునరేషన్‌పై కూడా ఆసక్తి నెలకొంది. ఈ సీజన్లో కామనర్లకు వారానికి సుమారు రూ.70 వేల వరకు పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా కామనర్ మిథిలేష్ విషయంలో జరిగిన పరిణామం మాత్రం ఈ లెక్కలన్నింటినీ తలకిందులు చేసేసింది. అది ఎలా అంటారా...?ఇదీ చదవండి: ‘రామాయణ’.. తెలుగు ట్రైలర్ వచ్చేసిందివైల్డ్కార్డ్ ఎంట్రీగా..వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన మిథిలేష్.. కేవలం రెండు రోజులకే బయటకు వచ్చేశాడు. బిగ్‌బాస్ ఇచ్చిన క్యాష్ టెంప్టేషన్‌లో భాగంగా తొలుత రూ.5 లక్షలు, ఆ తర్వాత రూ.10 లక్షలు.. చివరకు రూ.15 లక్షలకు ఆఫర్ పెంచారు. మిథిలేష్ చివరకు రూ.15 లక్షలతో బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు.ప్రైజ్ మనీ మాట పక్కన పెడితే..ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మిథిలేష్ రెండు రోజులకే తీసుకున్న భారీ మొత్తం రూ.15 లక్షలుగా కనిపిస్తోంది.మిథిలేష్ కామనర్ కంటెస్టెంట్..మిథిలేష్ కామనర్ కంటెస్టెంట్ కావడంతో వారానికి రూ.70 వేలు చొప్పున ఇవ్వడానికి అంగీకరించారట. ఇలా చూసుకుంటే రెండు రోజులకు రూ.20 వేలతోపాటు ఈ రూ.15 లక్షలూ ఆయన సొంతం. రెండు రోజులకు లెక్కిస్తే.. రోజుకు రూ.7.5 లక్షలు మొత్తంగా. 7.7 లక్షలు అందుకున్నట్లే. ఇలా అనుకుంటే కేవలం రెండు రోజుల్లోనే ఇంత డబ్బును సంపాదించుకున్న మొదటి కామనర్ మిథిలేష్ కావడం విశేషమనే చెప్పాలి. అయితే ఈ రూ.15 లక్షలు మిథిలేష్ రెగ్యులర్ రెమ్యునరేషన్ కాదు. హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు బిగ్‌బాస్ ఇచ్చిన ప్రత్యేక క్యాష్ ఆఫర్. అయితే కేవలం రెండు రోజుల్లోనే మనోడు రూ.15 లక్షల సొంతం చేసుకోవడంతో ప్రేక్షకుల్లో ఇంతటి ఆసక్తి నెలకొంది. ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్’ డే3 కలెక్షన్స్.. టాక్ ఎలా ఉన్నా తగ్గేదేలే! -
బిగ్‌బాస్ 10: కెప్టెన్‌గా ముకేశ్.. వచ్చినరోజే జాక్ పాట్ కొట్టిన అపూర్వ
బిగ్‌బాస్ అంటేనే గొడవలు, కొట్లాటలు. అవి లేకపోతే షోలో మజా ఉండదు. ఈ విషయం నిర్వహకులకు కూడా తెలుసు. అందుకే ఎక్కడ ఇలాంటివి వర్కౌట్ అవుతాయా అని చూస్తుంటారు. అగ్నిపరీక్షలో పాల్గొన్న అపూర్వ, మిథిలేష్లని హౌస్‌లోకి ప్రవేశపెట్టిన బిగ్‌బాస్.. సామాన్యుల మధ్య చిచ్చు పెట్టాడు. ఇంతకీ 19వ రోజైన శుక్రవారం(సెప్టెంబరు 25) అసలేం జరిగింది? అనేది ఎపిసోడ్ హైలైట్స్‌లో చూద్దాం.(ఇదీ చదవండి: తాత–నాన్నలా జేసన్ గొప్ప స్థాయికి వెళ్లాలి: చిరంజీవి)ఇంట్లోని కంటెస్టెంట్స్ అందరూ వద్దనుకుని తక్కువ ఓట్లు వేసిన అపూర్వని బిగ్‌బాస్.. హౌస్‌లోకి తీసుకొచ్చి ట్విస్ట్ ఇచ్చాడు. నీకు, అపూర్వకు ఏదో ప్రాబ్లం ఉంది.. ఆమె రావడం నీకు ఇష్టం లేదని మాట్లాడుకుంటున్నారని షాలినీతో రోహిత్ అంటాడు. నేను మాట్లాడాను కానీ ఆమె మాట్లాడలేదు. అసలు ముఖేష్ అయితే ఆమె రావొద్దు అని కెమెరాల ముందుకు వెళ్లి అన్నాడు. ఇప్పుడేమో ఇలా ఉంటున్నాడు అని షాలినీ అంటుంది. ఇంతలో అక్కడొచ్చిన త్రిగుణ్.. నీకు, ఆమెకు ఏమైనా సమస్య ఉందా? అని అడిగితే.. నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు అని షాలినీ సమాధానమిచ్చింది. మరో వైపు నరేష్ నిద్రపోయాడని బిగ్‌బాస్ హెచ్చరించడంతో.. కెప్టెన్ ఝాన్సీ ఇతడితో గుంజీలు తీయించింది.మిథిలేష్, రామకృష్ణకు సమానంగా ఓట్లు వచ్చాయని, అందుకే ఓ టాస్క్ ఇస్తున్నానని గెలిచిన వాళ్లికే ఇంట్లోకి ప్రవేశం ఉంటుందని బిగ్‌బాస్ చెప్పగా.. ఇచ్చిన టైర్ల టాస్క్‌లో గెలిచిన మిథిలేష్ ఇంట్లో అడుగుపెట్టాడు. ఇంటి పనుల విషయంలో త్రిగుణ్, అమన్ మధ్య చిన్న గొడవ జరిగింది. కెప్టెన్ చెప్తేనే వింటా నువ్వు చెప్తే ఎందుకు వింటా అని అమన్ అంటాడు. చిరాకేస్తుందని త్రిగుణ్ అనేసరికి గొడవ మరింత ముదురుతుంది. చివరకు త్రిగుణ్ వచ్చి అమర్‌కి సారీ చెప్పడంతో సద్దుమణిగింది.ఇక హౌస్‌లోకి వచ్చిన అపూర్వ, మిథిలేష్‌కు ఓ పవర్ ఇచ్చిన బిగ్‌బాస్.. కెప్టెన్సీ కంటెండర్లలో నుంచి ఇద్దరిని తీసేయాలని, దానికి తగిన కారణాలు చెప్పాలని అంటాడు. దీంతో మిథిలేష్.. ఝాన్సీ పేరు చెప్తాడు. శ్రష్టిని తీసేయాలని అపూర్వ ముందే ఫిక్స్ అవుతుంది. ఆమెకు సహనం లేదు. ఆ రోజు సుధీర్‌ని ఇష్టమొచ్చినట్టుగా తిట్టింది. చెత్త వేసి కొట్టిందని.. అపూర్వ, మిథిలేష్ తమ కారణాలు చెప్తారు. మరోవైపు అమన్ గురించి మాట్లాడుతూ.. అనవసరంగా ఫైర్ అయ్యాడు. స్క్రీన్ స్పేస్ కోసం చేసినట్టు అనిపించింది, కన్ఫ్యూజ్ అవుతాడు అని మిథిలేష్, అపూర్వ చెప్పారు. దీంతో కామరన్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. చూస్తుంటే సెలబ్రిటీల కంటే అగ్నిపరీక్ష నుంచి వచ్చిన సామాన్యుల మధ్య పుల్లలు పెట్టాలని బిగ్‌బాస్ ఫిక్స్ అయినట్లు ఉన్నాడనిపించింది.చివరగా అపూర్వ, ముఖేష్ ఒక జట్టుగా.. ఝాన్సీ, మిథిలేష్ మరో జంటగా ఓ గేమ్ ఆడతారు. ఈ టాస్క్‌లో అపూర్వ, ముఖేష్ గెలవగా.. ముఖేష్‌కి కెప్టెన్సీ బాధ్యతలు దక్కగా.. అపూర్వకి ఇమ్యూనిటీ ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ఇంట్లోకి అడుగుపెట్టిన రోజే అపూర్వ జాక్‌పాట్ కొట్టినట్లయింది. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: చిరంజీవి అన్నీ చూస్తున్నారు.. కానీ ఇలా మాట్లాడుతారనుకోలేదు) -
బిగ్‌బాస్‌లోకి మరో ముగ్గురు ఎంట్రీ! ‘నీకు అసలు తెలుగు వచ్చా..?’
బిగ్‌బాస్‌లో గొడవలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. బజర్ విషయంలో త్రిగుణ్ నిర్ణయం గొడవలు దారి తీసింది. మరో పక్క ఝాన్సీ లెటర్ విషయంలో తీసుకున్న ఆలోచన హౌస్‌లో కొత్త టెన్షన్‌ని తీసుకొచ్చింది. ఇంతలోనే ఆడియన్స్‌కి కొత్త ట్విస్ట్ ఎదురైంది. అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది. అసలు ప్రేక్షకులకూ, అటు హౌస్‌మేట్స్‌కు ఎదురైన ఆ ట్విస్ట్ ఏంటి.? ఒకసారి చూద్దాం..ఇదీ చదవండి: పెళ్లైనా .. ఆయనపై క్రష్ తగ్గట్లేదు: రష్మికనరేశ్కు అన్యాయం జరిగిందంటూ..బిగ్‌బాస్ హౌస్‌లో టాస్క్ సందర్భంగా బజర్ విషయంలో మరోసారి రచ్చ జరిగింది. నరేశ్ బజర్ కొట్టేలా అవకాశం ఇవ్వాలని రాంప్రసాద్ తన టీమ్‌తో మాట్లాడతాడు. అయితే సైరన్ మోగిన తర్వాత గార్డెన్ ఏరియాలో ఝాన్సీ బజర్ కొట్టగా.. లివింగ్ ఏరియాలో నరేశ్, వంశీ మధ్య పోటీ నెలకొంది. లివింగ్ ఏరియా సంచాలకుడిగా ఉన్న త్రిగుణ్ తొలుత నరేశ్ బజర్ కొట్టాడని ప్రకటించాడు. దీంతో నరేశ్ టీమ్ సంబరాలు చేసుకుంది. కానీ అమన్, రోహిత్, చరణ్ మాత్రం వంశీ బజర్ కొట్టాడని త్రిగుణ్‌కు చెప్పారు. దీంతో త్రిగుణ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. బిగ్‌బాస్ అడిగినప్పుడు వంశీ బజర్ కొట్టాడని త్రిగుణ్ చెప్పడంతో నరేశ్ మండిపడ్డాడు. తన పేరును ప్రకటించిన తర్వాత సడన్‌గా నిర్ణయం ఎలా మార్చుకుంటావంటూ ప్రశ్నించాడు. నరేశ్‌కు అన్యాయం జరిగిందంటూ సుధీర్, ముకేశ్ కూడా త్రిగుణ్‌తో వాదించారు. దీంతో బజర్ వ్యవహారం హౌస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.లెటర్ కోసం నరేశ్‌ను టార్గెట్ చేసిన ఝాన్సీఆ తర్వాత ఝాన్సీ, వంశీ బజర్ మోగించడంతో ఇద్దరికీ బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఝాన్సీ విజయం సాధించింది. అనంతరం బిగ్‌బాస్ ఝాన్సీకి కాల్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ‘మీ నాన్న రాసిన లెటర్ మీ కోసం వచ్చింది. అది మీకు దక్కాలంటే నరేశ్ ఇంటి నుంచి వచ్చిన లెటర్‌ను దూరం చేయాలి. లేదంటే రాంప్రసాద్‌కు వచ్చిన ఫొటోను వదులుకోవాలి’ అని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ఝాన్సీ నరేశ్ లెటర్‌ను దూరం చేసేందుకు నిర్ణయించుకుంది. ‘నరేశ్‌కు టెన్షన్ ఇస్తా’ అంటూ అతడి లెటర్‌ను వదులుకుంది. మరోవైపు తన తండ్రి రాసిన లెటర్‌ను చదివిన ఝాన్సీ భావోద్వేగానికి గురైంది.ఇదీ చదవండి: ‘ఎందుకింత దురద..? ఏం చూసుకొని సినిమాల్లోకి వచ్చావ్..?’ఆడియన్స్ అనుకునేలోపే.. !ఇక హౌస్‌మేట్స్‌కు ఒక్కొక్కరిగా వారి ఆటతీరుపై మెసేజ్‌లు రావడంతో.. అవి ఆడియన్స్ నుంచి వచ్చినవని అందరూ భావించారు. కానీ బిగ్‌బాస్ అసలు ట్విస్ట్ ఇచ్చాడు. అగ్నిపరీక్షలో పోరాడి బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడానికి ప్రయత్నించిన మిథిలేష్, అపూర్వ, రామకృష్ణలను హౌస్‌మేట్స్‌కు పరిచయం చేశాడు. ముగ్గురినీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా చేశాడు. అయితే వీరిలో ఎవరు హౌస్‌లోకి వెళ్లాలనేది హౌస్‌మేట్సే నిర్ణయించాలి అని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. దీంతో మిథిలేష్, అపూర్వ, రామకృష్ణలు తమను ఎందుకు హౌస్‌లోకి తీసుకోవాలో వివరించారు. ఈ క్రమంలో త్రిగుణ్, రాంప్రసాద్, ముకేశ్‌లతో వారికి వాగ్వాదం జరిగింది. తెలుగు మాట్లాడడంపై త్రిగుణ్‌తో వారితో వార్కి దిగాడు. ఈ తరుణంలో నీకు అసలు తెలుగు వచ్చా వస్తే పద్యం పాడు అంటూ మిథిలేష్‌పై త్రిగుణ్ రెచ్చిపోయాడు. మాటామాటా పెరగడంతో హౌస్‌లో మరోసారి వేడి వాతావరణం కనిపించింది.ఇదీ చదవండి: రజినీకాంత్ ‘జైలర్2’ పాటకు.. డేవిడ్ భాయ్ డ్యాన్స్ మాత్రం..ముగ్గురిలో ఎవరు? హౌస్మేట్స్ ఓటింగ్..వాదనలు ముగిసిన తర్వాత బిగ్‌బాస్ ముగ్గురినీ బయటకు పంపించాడు. అనంతరం హౌస్‌మేట్స్‌కు కీలక నిర్ణయం అప్పగించాడు. మిథిలేష్, అపూర్వ, రామకృష్ణల్లో ఎవరిని హౌస్‌లోకి తీసుకోవాలని అనుకుంటున్నారో వారికి ఓటు వేయాలని చెప్పాడు. బిగ్‌బాస్ సూచనల మేరకు హౌస్మేట్స్ తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి.. ఆ ఓట్లను బిగ్‌బాస్ చెప్పిన బాక్స్‌లో వేశారు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
కుటుంబ బంధాలపై బిగ్‌బాస్ ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టికున్న ఝాన్సీ
బిగ్‌బాస్ ఇంట్లో ఈ వారం టెమ్టేషన్స్, ఎమోషన్స్ రెండూ తారాస్థాయికి చేరినట్లు తాజా ప్రొమో చూస్తే అర్థమవుతోంది. లివింగ్ రూం హౌస్‌లో ముందుగా బజర్ నొక్కింది వంశీ అని త్రిగుణ్ చెప్పగా, నొక్కింది నేనే అని నరేశ్ వాదించాడు. ‘నేను చెప్పినా వినకపోతే నేనేం చేస్తా?’ అంటూ నరేశ్ ప్రశ్నించగా, ‘నేను చూసిన దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటా’ అని త్రిగుణ్ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.ఆమె ఎవరిని ఎంచుకుంటుంది?ఇక కెప్టెన్సీ కంటెండర్‌గా మారేందుకు ఝాన్సీ, వంశీకి ఇచ్చిన టాస్క్ కూడా ఆసక్తికరంగా సాగినట్లు ప్రొమోలో కనిపించింది. అయితే అసలు ట్విస్ట్ తరువాతే వచ్చింది. ఝాన్సీని పిలిచిన బిగ్‌బాస్.. ‘నీ మనసుకు దగ్గరైన టెమ్టేషన్ నీ చేతికి అందే ముందు నీకు రెండు ఆప్షన్లు ఇస్తున్నా’ అని చెప్పాడు. మొదటి ఆప్షన్‌గా నరేశ్‌కు అతని తమ్ముడు రాసిన ఉత్తరాన్ని అందకుండా చేయాలని, రెండో ఆప్షన్‌గా రాంప్రసాద్‌కు వారి కుటుంబంతో దిగిన ఫోటోను దూరం చేయాలని బిగ్‌బాస్ సూచించాడు. ఈ రెండు ఆప్షన్లు విన్న వెంటనే ఝాన్సీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఎవరిని ఎంచుకుంటుంది? నరేశ్ లేఖనా? రాంప్రసాద్ ఫోటోనా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
దేబ్జానీపై హాస్యనటుడు బ్రహ్మానందం ప్రశంసలు..!
బిగ్‌బాస్ సీజన్10లో కంటెస్టెంట్ల ఆట ఒకవైపు ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు కొందరి మాటతీరు.. ప్రవర్తన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అలాంటి వారిలో దేబ్జానీ మోదక్ ఒకరు. బెంగాలీ నేపథ్యంలో నుంచి వచ్చిన ఆమె తెలుగులో మాట్లాడే విధానం.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, తనదైన శైలిలో స్పందించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హౌస్‌లో అందరితో మాట్లాడే మాటలు, తోటి కంటెస్టెంట్లతో కలిసిపోయే విధానం హౌస్‌మేట్స్‌కే కాకుండా బయట ప్రేక్షకులకూ ముచ్చటగా అనిపిస్తోంది. గత నాలుగైదు ఎపిసోడ్ల నుంచి దేబ్జానీ పేరు మార్మోగుతోంది. ఆమె ఆడిన తీరు ఒక ఎత్తు అయితే.. ఆమె మాట్లాడే మాటలు ఒకెత్తు. దీంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో మీమ్స్, పాత వీడియోలు వైరల్ చేస్తున్నారు. అలా ఓ సందర్భంలో టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మనందం ఆమె మాట్లాడే తెలుగుపై ప్రశంసలు కురిపించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.బృహ్మనందం ఆమెని ప్రశంసిస్తూ..ఓ సందర్భంలో.. శ్రీముఖి దేబ్జానీ కోసం చెప్తూ.. ‘ఆమెకు తెలుగు మాట్లాడడం సరిగా రాకపోయినా తెలుగు పాటలు బాగా పడుతుంది సార్’ అని బ్రహ్మనందంకి పరిచయం చేస్తారు. బ్రహ్మనందం ఆమెని ప్రశంసిస్తూ.. ‘దేబ్జానీ నిన్ను చూస్తుంటే జల్సీగా ఉంది. తెలుగు తెలీదు. మేము ఏం మాట్లాడుతున్నాం అసలే అర్థం కాదు. కానీ నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు’ అంటూ ఆమెను పొగడ్తల వర్షం కురిపించారు. అనంతరం దేబ్జానీ తెలుగులో పాడిన పాటను విని అబ్బా.. చాలు.. బాగా పాడావు, చాలా సంతోషం తల్లి అంటూ నవ్వులు పూయించారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.దేబ్జానీ విషయానికి వస్తే..దేబ్జానీ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. తండ్రి అపూర్బా మోదక్ వ్యాపారవేత్త.. తల్లి మితా మోదక్ గృహిణి. ఈమెకు నందిని మోదక్ అనే చెల్లెలు ఉంది. అనుకోకుండా ఓ సీరియల్లో అవకాశం రావడంతో అలా బుల్లితెరపై అడుగుపెట్టి బెంగాలీ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్10లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి తన మాటలతో అటు హౌస్‌మేట్స్‌తో పాటు ఇటు ఇప్పటి ప్రేక్షకులకూ దగ్గరవుతున్నారు.ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: దేబ్జానీకి పెళ్లిచూపులు.. త్రిగుణ్‌ని ఏడిపించేశారు #debjani after bb only I have seeing her , beforely i hv never seen her serial or any other programs,after bb I felt lyk she is genuine,she won't win but I want to be her until finale #BiggBossTelugu10 pic.twitter.com/iZxPw8MBRY— Butterfly 🦋🦋 (@sparkles_jiya) September 22, 2026 -
బిగ్‌బాస్ 10: దేబ్జానీకి పెళ్లిచూపులు.. త్రిగుణ్‌ని ఏడిపించేశారు
సాధారణంగా కొన్ని వారాలు అయిపోయిన తర్వాత బిగ్‌బాస్ షోలో ఫ్యామిలీ ఎమోషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈసారి మూడో వారానికే అదంతా దర్శనమిచ్చింది. హౌస్‌లో 17వ రోజైన బుధవారం(సెప్టెంబరు 24) ఎపిసోడ్లో అసలేం జరిగింది? ఎవరెవరు కన్నీళ్లు పెట్టుకున్నారు?(ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్’ మూవీ రివ్యూ)దేబ్జానీ ఇంటి నుంచి వచ్చిన లెటర్ని ముకేశ్ నాశనం చేయడంతో ఈమె కుమిలి కుమిలి కుమిలి ఏడ్చింది. బాధలో ఉన్న దేబ్జానీని రాంప్రసాద్, నరేశ్ కలిసి కాసేపు నవ్వించారు. తర్వాత చెప్పినట్లు తండ్రితో ఉన్న ఫొటోని ముకేశ్ కోసం బిగ్‌బాస్.. హౌస్‌లోకి పంపించాడు. ఇదలా ఉండగానే దేబ్జానీ, రోహిత్ మధ్య పెళ్లిచూపుల పెట్టిన రాంప్రసాద్, నరేశ్ కాసేపు నవ్వించారు. నీ జీతం ఎంత? మా అమ్మాయికి నెలకు రూ.2 లక్షలు కావాలని జోకులు వేస్తూ ఫన్ జనరేట్ చేశారు. మరోవైపు వంశీ, త్రిగుణ్ వంట చేసేటప్పుడు ఓ రోజంతా వీళ్ల నోటికి ప్లాస్టర్ వేయమని నాగార్జున పనిష్మెంట్ ఇచ్చిన సంగతి కెప్టెన్ ఝాన్సీ గుర్తుచేసింది. దీంతో బిగ్‌బాస్ ప్లాస్టర్స్ పంపగా.. వీళ్లిద్దరి నోటికి అవి అంటించారు.ఇక కెప్టెన్సీ కంటెండర్ కోసం మళ్లీ పోటీ మొదలుపెట్టిన బిగ్‌బాస్.. గెలిచిన ముకేశ్, ఓడిన దేబ్జానీ ఆడేందుకు అర్హులు కాదని చెప్పాడు. వీళ్లిద్దరినే ఈ టాస్క్‌కు సంచాలకులుగా నియమించారు. ఈసారి పోటీలో వర్షిణి, అమన్ గెలవగా.. పూల్‌లో దూకి అందులో ఉన్న బ్యాగుల్లో ఒకసారి ఒకటి మాత్రమే తీసుకోవాలి. తర్వాత వాటిని తీసుకొచ్చి ఎవరి కలర్ ప్లేమ్స్లో వాళ్లు ల్యాండ్ అయ్యేలా విసరాలి. ఈ క్రమంలో ఎవరివైనా కిందపడితే వాళ్లవి కూడా తీసుకోవచ్చుని బిగ్‌బాస్ చెప్పాడు. ఇందులో అమన్ గెలిచాడు.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్)అమన్‌కు ఫోన్ చేసిన బిగ్‌బాస్.. అమ్మ మీకు ఎంతో ఇష్టమైన భోజనాన్ని పంపించారు. అది మీకు కావాలంటే వేరే వాళ్లకు టెన్షన్ ఇవ్వాలి. షాలినీ, రోహిత్‌లలో ఒకరికి టెన్షన్ పెట్టాలని అనగా.. రోహిత్ పేరుని అమన్ చెప్పాడు. దీంతో రోహిత్‌కు లెటర్ని నాశనం చేయగా అతడు కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈసారి బజర్‌ని సుధీర్, సృష్టి మోగించగా.. వీళ్లిద్దరికీ ఓ టాస్క్ ఆడారు. ఇందులో సృష్టి గెలిచింది.టాస్క్‌లో విజయం సాధించిన సృష్టికి ఫోన్ చేసిన బిగ్‌బాస్.. మీ అమ్మ ప్రేమతో ఉత్తరం రాసింది. అది కావాలంటే ఇంటి సభ్యుల్లో ఒకరికి టెన్షన్ ఇవ్వాలి. వంశీ, త్రిగుణ్‌లో ఒకరికి వారి భార్యలు రాసిన ఉత్తరాలని అందకుండా చేయాలని చెప్పడంతో సృష్టి.. త్రిగుణ్‌కు టెన్షన్ ఇస్తానని చెప్పింది. సృష్టి త్రిగుణ్ లెటర్ నాశనం చేయడంతో ఇతడు ఎమోషనల్ అయ్యాడు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: 7 సినిమాలు చేస్తున్నా.. రోజుకు ఎంత సంపాదిస్తానంటే?: కుమారి ఆంటీ) -
'బిగ్‌బాస్' ఫేమ్ వర్షిణి అరెస్ట్
రెండేళ్ల క్రితం తమిళంలో బిగ్‌బాస్ షోలో పాల్గొన్న నటి వర్షిణి వెంకట్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడిని బెదిరించి నగదు, సెల్‌ఫోన్ దోచుకున్న కేసు దీనికి కారణం. షార్ట్ ఫిల్మ్ తీసేందుకు పెట్టుబడి పెట్టాలని చెప్పి తనని మోసం చేసిందని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అయితే తన దగ్గర తీసుకున్న డబ్బు తిరిగివ్వాలని అడగ్గా.. గత నెల 22న తనని పిలిపించుకుని దాడి చేశారని.. అలానే రెండు సెల్ఫోన్లు, రూ.50 వేల నగదు లాక్కున్నట్లు చెప్పాడు. తర్వాత ఫోన్ చేసి బెదిరించి మరో రూ.5 లక్షల తీసుకున్నట్లు పేర్కొన్నాడు.అడిగినట్లు రూ.27 లక్షలు ఇవ్వకపోతే అబద్ధపు కేసు పెడతానని వర్షిణి బెదిరించినట్లు సదరు యువకుడు ఫిర్యాదులో రాసుకొచ్చాడు. ఇదే విషయమై వర్షిణితో పాటు సంజయ్ తదితరులు నలుగురిపై కేసు నమోదు చేశారు. వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు. వర్షిణి కెరీర్ విషయానికొస్తే లారా, సొట్ట సొట్ట ననైతు మూవీస్ చేసింది. -
బిగ్‌బాస్ 10: అన్యాయం చేసిన ముకేశ్.. కుమిలి కుమిలి ఏడ్చిన దేబ్జానీ
ప్రతివారం నామినేషన్స్ అంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో ఎక్కడలేని హడావుడి, గొడవలే. ఈసారి అంతకు మించి అన్నట్లు జరిగింది. సోమవారం సగం నామినేషన్ల ప్రక్రియ పూర్తవగా మంగళవారం మిగతా తంతు ముగిసింది. ఇంతకీ బిగ్‌బాస్ 10వ సీజన్లో 16వ రోజు(సెప్టెంబరు 22) అసలేం జరిగింది? ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారు?(ఇదీ చదవండి: Bigg Boss 10: నేను ఎలిమినేట్ కావాల్సిన వాడినే: కృష్ణుడు)సోమవారం ఎపిసోడ్లో సగం నామినేషన్ల ప్రక్రియ జరిగినప్పటికీ సుధీర్-సృష్టి గొడవ ఎక్కువగా హైలైట్ అయింది. ఇందులో సృష్టి ప్రవర్తన నచ్చని రాంప్రసాద్.. అవకాశం వస్తే ఈమెని నామినేట్ చేయ్ అని నరేశ్‌తో చెప్పాడు. నాకు పాయింట్స్ లేవని నరేశ్ అంటే అంత పెద్ద పాయింట్ ఉంటే లేదు అంటావ్ ఏంటి? బిగ్‌బాస్ హౌస్‌లో ఒకర్ని కొడతా, తంతా అనడం ఎంతపెద్ద తప్పో తెలుసు కదా ఇదే పెద్ద పాయింట్ ఆ పాయింట్ మీద నామినేట్ చేయ్ అని రాంప్రసాద్ సలహా ఇచ్చాడు.త్రిగుణ్ గురించి ఝాన్సీ, సుధీర్, ముకేశ్, రోహిత్ మాట్లాడుతూ.. మొదటి వారం నన్ను చాలా హీనంగా చూశాడు. చాలా ఇబ్బంది పెట్టాడు. ప్రతి చిన్న విషయాన్ని పాయింట్ చేసి కుక్కర్ ముఖం మీద వేశాడు. త్రిగుణ్ నిజంగా శకునినే ముందు ఆడడు వెనక నుంచి ఆడిస్తాడు. వంశీని ఎలా కీలుబొమ్మ చేశాడో ఇప్పుడు సృష్టిని అలాగే తన దారిలోకి తెచ్చుకుంటున్నాడు. సృష్టి కూడా వెళ్లిపోతుంది అని రోహిత్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. దీని తర్వాత గేమ్ గురించి ముకేశ్-చరణ్ గొడవపడ్డారు.చివరి రౌండ్లో నామినేట్ చేయడానికి నరేశ్, షాలిని పోటీపడ్డారు. షాలినికి అవకాశం వచ్చింది. దీంతో వర్షిణిని నామినేట్ చేసింది. ముకేశ్‌ని గైడ్ చేస్తున్నావ్. సంచాలక్‌గా ఫెయిల్ అయ్యావ్. అందరికీ సలహాలు ఇస్తూ గేమ్‌లో కనిపించాలని ప్రయత్నిస్తున్నావ్. అది అంత అవసరం లేదు అనిపిస్తుంది అని షాలిని తన కారణాలు చెప్పింది. తర్వాత షాలిని నామినేట్ చేసే అవకాశం సృష్టికి ఇచ్చింది. సృష్టి సుధీర్‌ని నామినేట్ చేసింది. ఒక్కసారి కూడా నన్ను వాడుకున్నాననిపించలేదా అని సృష్టి అడిగితే.. దానికి బదులిచ్చిన సుధీర్ నేను మొదటి నుంచి అడుగుతూనే ఉన్నా. నా వల్ల ఇబ్బంది ఉంటే చెప్పు అని.. ఎవరైనా ఏమైనా అంటే మనం ఫ్రెండ్స్ అని చెప్పు అని కూడా అన్నాను. ఇక నుంచి ఈ ఇంట్లో సృష్టితో అస్సలు మాట్లాడను అని కుండబద్దలు కొట్టేశాడు. అలా ఈ వారం నామినేషన్స్‌లో సుధీర్, షాలిని, అమన్, ఝాన్సీ, త్రిగుణ్, చరణ్, వర్షిణి నిలిచారు.(ఇదీ చదవండి: కృష్ణుడు ఎలిమినేట్.. ‘నీలో మా నాన్న కళ్లు చూసుకున్నా అన్నా..’)మీ వాళ్ల నుంచి మంచి టెంప్టేషన్ పొందాలంటే ఒకరిని టెన్షలో పెట్టాల్సి వస్తుంది. లివింగ్ ఏరియాలో ఒక బజర్, గార్డెన్ ఏరియాలో ఒక బజర్ ఉంది. రెండింటిని మొదటిసారి నొక్కిన ఇద్దరు సభ్యులకు గేమ్ ఉంటుంది. గెలిచిన వాళ్లు టెంప్టేషన్ తీసుకొని టెన్షన్ ఒకరికి ఇవ్వాలి. టెన్షన్ తీసుకున్న వాళ్లు నెక్ట్ టైం గేమ్ ఆడటానికి వీల్లేదు అని బిగ్‌బాస్ చెప్పాడు. అలా లివింగ్ ఏరియాలో ముకేశ్ బజర్ నొక్కితే.. గార్డెన్ ఏరియాలో రోహిత్ బజర్ నొక్కాడు. ఇద్దరికీ పుష్ యువర్ లిమిట్స్ గేమ్ పెట్టగా.. ఇందులో మూడు పెద్ద బాక్స్‌లను ఇద్దరూ నెట్టుకోవాలి. ఈ గేమ్‌లో ముకేశ్ గెలిచాడు. తద్వారా కెప్టెన్సీ కంటెండర్ అవ్వడంతో పాటు టెంప్టేషన్ సొంతం చేసుకున్నాడు.ముకేశ్‌ని బ్యాక్యార్డ్కు పిలిచిన బిగ్‌బాస్.. ఫోన్ చేసి మాట్లాడాడు. ఇలాంటి గేమ్ కోసమే వెయిట్ చేస్తున్నా బిగ్‌బాస్.. రోహిత్ మీద గెలవడం చాలా హ్యాపీగా ఉందని అన్నాడు. టెంప్టేషన్‌గా మీ నాన్నతో కలిసి ఉన్న ఫొటో మీకు దక్కుతుంది. దీని కోసం మీరు దేబ్జానీ ఇంటి నుంచి వచ్చిన లెటర్ని తనకు దూరం చేయాలి. లేదా వర్షిణికి తన ఫ్యామిలీ ఫొటో దూరం అవుతుంది. ఎవరికి ఏం దూరం చేసి వాళ్లకు టెన్షన్ ఇస్తారు అని బిగ్‌బాస్ అడిగితే ఇద్దరితో నాకు మంచి బాండ్ ఉంది. కానీ వర్షిణితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాను. వర్షిణి నన్ను మంచి ఫ్రెండ్ అనుకుంటుందని చెప్పి దేబ్జానీకి టెన్షన్ ఇస్తా అని ముకేశ్ అన్నాడు.ఇదే విషయం దేబ్జానీకి చెప్పమని బిగ్‌బాస్ అనడంతో ముకేశ్ దేబ్జానీకి చెబుతాడు. నీ కోసం నన్ను టెన్షన్లో పెట్టావా వేరే ఎవరి కోసమైనా అని ఆమె అడగ్గా.. వేరే వాళ్ల కోసం అని ముకేశ్ అన్నాడు. తర్వాత బిగ్‌బాస్ ముకేశ్‌కి ఇచ్చిన ఆప్షన్ గురించి చెప్పడంతో దేబ్జానీ చాలా ఏడ్చింది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: నిజానికి మోసపోయింది నేనే: నటి అంబిక) -
Bigg Boss 10: నేను ఎలిమినేట్ కావాల్సిన వాడినే..!
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి నిష్క్రమించిన ఒక రోజు తర్వాత, నటుడు కృష్ణుడు జియోహాట్‌స్టార్‌లో జరిగిన ఒక లైవ్ ఇంటరాక్షన్‌లో తన ప్రయాణం గురించి మాట్లాడాడు. ఓటింగ్, దురదృష్టం లేదా తోటి కంటెస్టెంట్లను నిందించకుండా, వీక్షకుల తీర్పును హుందాగా కృష్ణుడు అంగీకరించాడు. తాను ఎలిమినేట్ కావాల్సిన వాడినే అని నిష్కపటంగా ఒప్పుకున్న అతను, ఈ విషయంలో తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, హౌస్‌లో గడిపిన సమయం జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అనుభవమని అభివర్ణించాడు. తరచుగా తింటూ, నిద్రపోతూ కనిపించాడనే విమర్శలకు స్పందిస్తూ, హౌస్‌లో ఆహారం పరిమితంగా ఉండేదని, సరైన అల్పాహారం ఉండేది కాదని, కంటెస్టెంట్లు సాధారణ భోజనంతోనే ఉండాల్సి ఉంటుందని వెల్లడించాడు.రోహిత్‌తో తనకు ఏర్పడిన భావోద్వేగ బంధం గురించి కూడా కృష్ణుడు మాట్లాడాడు. తమ మధ్య మొదట్లో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, క్రమంగా ఇద్దరూ స్నేహితులయ్యామన్నాడు. ఎలిమినేషన్ సమయంలో రోహిత్ భావోద్వేగంతో స్పందించిన తీరు తనను ఎంతగానో కదిలించిందని, తమ బంధం ఇంటి బయట కూడా కొనసాగుతుందని నమ్ముతున్నట్లు తెలిపాడు. రోహిత్‌ను ఒక వ్యూహాత్మక ఆటగాడిగా అభివర్ణిస్తూ, కాలంతో పాటు అతను మరింత ప్రశాంతంగా, నిలకడగా మారాడని కృష్ణుడు చెప్పాడు. అయితే, రోహిత్ ఏకాగ్రత కోల్పోకూడదని చెబుతూనే, శాలినితో అతనికి పెరుగుతున్న సంబంధం అతని ఆటను దెబ్బతీస్తుందని కూడా హెచ్చరించాడు.బలమైన పోటీదారులలో త్రిగుణ్, రోహిత్‌ల పేర్లను ప్రస్తావించిన కృష్ణుడు, "పరిపూర్ణ బిగ్ బాస్ ఆటగాడు" గా త్రిగుణ్‌ను ఎంచుకున్నాడు. తన టాప్ 5 కంటెస్టెంట్లుగా త్రిగుణ్, రోహిత్, అమన్, ముఖేష్, ఝాన్సీలను అతను అంచనా వేశాడు. సుధీర్ సృష్టితో ప్రేమాయణం నెరపటానికి ప్రయత్నిస్తున్నాడని కృష్ణుడు ఆరోపించడమే కాకుండా, ముఖేష్‌ను ఈ సీజన్ "ఉమెన్ ట్రాక్ విన్నర్" అని సరదాగా పిలవడం ద్వారా కొత్త చర్చకు ఆజ్యం పోశాడు. -
‘కంటెస్టెంట్‌గా పనికిరావు.. బయటకెళ్లి..’
బిగ్‌బాస్ ఇంట్లో మూడో వారం నామినేషన్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్ల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతుండగా.. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే ఈరోజు ఎపిసోడ్లో నామినేషన్స్ మరింత రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. ‘నువ్వా.. నేనా’ అన్నట్లుగా కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగినట్లు ప్రోమోలో కనిపించింది.అసలు నువ్వు కంటెస్టెంట్‌గానే పనికిరావు..గేమ్‌ను సీరియస్‌గా తీసుకోని వాళ్లే బజర్ మోగిన తర్వాత కూడా బోర్డుపై రాస్తారంటూ ముఖేశ్ వ్యాఖ్యానించాడు. దీనికి స్పందించిన చరణ్.. ‘ఈ విషయాన్ని నేను ఆడియన్‌గా బయట నుంచి చూశా’ అని చెప్పాడు. దీంతో ముఖేశ్ మరింత ఫైర్ అయ్యాడు. ‘అసలు నువ్వు కంటెస్టెంట్‌గానే పనికిరావు.. వెళ్లి ఆడియన్‌గానే ఉండు పో’ అంటూ ఘాటుగా బదులిచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.మాట్లాడే దమ్ము లేదా..మరోవైపు షాలిని, వర్షిణి మధ్య కూడా వివాదం తారస్థాయికి చేరినట్లు ప్రోమోలో కనిపించింది. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ముఖేశ్ మధ్యలో కలగజేసుకోవడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ‘ఏంటి.. ముఖేశ్‌తో మాట్లాడే దమ్ము లేదా?’ అంటూ షాలినిని వర్షిణి ప్రశ్నించింది. దీనికి షాలిని కూడా గట్టిగానే స్పందించింది. ఇలా ఒకవైపు ముఖేశ్-చరణ్ మధ్య మాటల యుద్ధం.. మరోవైపు షాలిని-వర్షిణి మధ్య వివాదంతో మూడో వారం నామినేషన్స్ మరింత హాట్‌గా మారాయి. మరి ఈ గొడవలు ఎక్కడి వరకు వెళ్తాయి? ఎవరు ఎవరిని నామినేట్ చేయబోతున్నారు? నామినేషన్స్‌లో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకోనున్నాయి? అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్‌లో భగ్గుమన్న నామినేషన్స్.. ‘నేను నీ వెంట పడ్డానా..?’
బిగ్‌బాస్ సీజన్ 10లో నామినేషన్స్ ప్రక్రియ మొదలవడంతో హౌస్‌లో మరోసారి వేడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే కంటెస్టెంట్ల మధ్య విభేదాలు ఉండగా.. నామినేషన్స్ ప్రక్రియతో అవన్నీ ఒక్కసారిగా బయటకొచ్చాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పాటు మాటలతో యుద్ధానికి దిగారు. ముఖ్యంగా సృష్టి-సుధీర్ గొడవ ఈ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది. అసలు ఇంత గొడవపడటానికి కారణం ఏంటి? నిన్నటి ఎపిసోడ్లో ఏం జరింగింది. చూద్దాం రండి.!అన్నం పెట్టేవాడికే చెత్త వేయడం ఏంటి?స్టార్ ఆఫ్ ది వీక్‌గా ముకేశ్ ఉండటంతో అతడిని ఎవరూ నామినేట్ చేయకూడదని బిగ్‌బాస్ స్పష్టం చేశారు. అయితే ముకేశ్ కారణంగా ఝాన్సీ టెన్షన్‌కు గురైందని భావిస్తే ఆమెను నామినేట్ చేయవచ్చని తెలిపారు. ఇక నామినేషన్స్‌లో భాగంగా కంటెస్టెంట్లకు ఎన్వలప్స్ ఇచ్చి.. అందులో ఎన్ని ఓట్లు ఉంటే అంతమందిని నామినేట్ చేయాలనే టాస్క్ పెట్టారు. రాంప్రసాద్, చరణ్ ముందుగా పోటీ పడగా ఇద్దరికీ ఎన్వలప్స్ వచ్చాయి. కెప్టెన్‌గా ఉన్న ఝాన్సీ.. రాంప్రసాద్‌కు నామినేషన్ ఛాన్స్ ఇచ్చింది. దీంతో ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం అతడికి వచ్చింది. రాంప్రసాద్ మొదట వంశీని నామినేట్ చేశాడు. ఫుడ్ పెట్టే సమయంలో పెద్దగా అరవడం తనకు నచ్చలేదని కారణం చెప్పాడు.అయితే ఇక్కడే మరో వివాదం మొదలైంది. వర్షిణి ఏడ్చిన విషయాన్ని వంశీ ప్రస్తావించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మానిటర్‌గా ఉన్న దేబ్జానీ కూడా ఈ విషయంలో కలగజేసుకోవడంతో వంశీ-దేబ్జానీ మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో రాంప్రసాద్.. ‘ఇది నా నామినేషన్’ అంటూ గట్టిగా చెప్పి వంశీపై చెత్త వేశాడు. దీనిపై త్రిగుణ్ స్పందిస్తూ.. అన్నం పెట్టిన వాళ్ల మీదే చెత్త వేస్తున్నారంటూ సెటైర్ వేశాడు. అయితే అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రాంప్రసాద్ కౌంటర్ ఇచ్చాడు.ఇదీ చదవండి: 10వేల మందికి అదిరిపోయే ట్రీట్! నాని ఫ్యాన్స్‌కు పండగే..సృష్టి వర్సెస్ సుధీర్.. హౌస్‌లో మరో రచ్చఇక ఎపిసోడ్లో అసలు హీట్ సృష్టి, సుధీర్ మధ్య జరిగిన గొడవతో వచ్చింది. త్రిగుణ్ తనను మానిప్యులేట్ చేశాడని సుధీర్ ఆరోపించాడు. గతంలో జరిగిన గొడవలన్నీ క్లియర్ అయ్యాయని.. ఇక తనకు ఫ్రీడమ్ వచ్చిందని సుధీర్ చెప్పడంతో సృష్టి తీవ్రంగా స్పందించింది. ‘నేను నీ వెంట పడ్డానా?’ అంటూ సుధీర్‌పై సృష్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా కోపంలో కొడతా, పళ్లు రాలగొడతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ గొడవతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆ తర్వాత సృష్టి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.షాలినిని టార్గెట్ చేసిన వర్షిణిఇక మరోవైపు వర్షిణి, దేబ్జానీ మధ్య పోటీ జరిగింది. నామినేషన్ చేసే అవకాశం వర్షిణికి రావడంతో ఆమె షాలినిని టార్గెట్ చేసింది. షో కోసమో లేక ప్రోమోలో కనిపించడం కోసమో ఏదో చేయాలనే ఉద్దేశంతోనే షాలిని వ్యవహరిస్తోందని.. ఆమెది ఫేక్ పర్సనాలిటీ అని వర్షిణి ఆరోపించింది. కేవలం కంటెంట్ కోసమే కొన్ని విషయాలు చేస్తోందని చెప్పింది. దీనిపై షాలిని కూడా గట్టిగానే స్పందించింది. వర్షిణితో వాదనకు దిగింది. అనంతరం వర్షిణి తనకు వచ్చిన మరో నామినేషన్ అవకాశాన్ని సుధీర్‌కు ఇచ్చింది. దీంతో సుధీర్ అమన్‌ను నామినేట్ చేశాడు.ఝాన్సీని టార్గెట్ చేసిన చరణ్చరణ్ తన నామినేషన్లో ఝాన్సీని టార్గెట్ చేశాడు. ఆమె తనతో మనస్ఫూర్తిగా ఉండటం లేదని ఆరోపించాడు. తనతో మాట్లాడుతున్న సమయంలో నిద్ర వస్తోందని చెప్పి వెళ్లిపోయి.. మరో టీమ్‌తో మాత్రం సరదాగా మాట్లాడిందని చెప్పాడు. అంతేకాకుండా గేమ్‌లో ఎవరు తనకు సపోర్ట్ చేశారనే విషయాన్ని ఇతరులకు చెప్పడం కూడా తనకు నచ్చలేదని తెలిపాడు. చివరగా రైతులకు సంబంధించిన కండువా, షర్ట్‌ను నామినేషన్స్ రోజే ధరించడం కూడా తనకు నచ్చలేదని చెప్పడంతో ఝాన్సీపై చరణ్ పెట్టిన నామినేషన్ ఆసక్తికరంగా మారింది.దేబ్జానీ నామినేషన్లో త్రిగుణ్చివరగా దేబ్జానీ.. త్రిగుణ్‌ను నామినేట్ చేసింది. ఇలా ఒక్కో నామినేషన్‌తో హౌస్‌లో ఉన్న పాత గొడవలు, మనస్పర్థలు బయటకు రావడంతో 14వ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా సృష్టి-సుధీర్ మధ్య జరిగిన గొడవ.. వర్షిణి-షాలిని వాగ్వాదం.. రాంప్రసాద్-వంశీ నామినేషన్ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఇదీ చదవండి: కదిలిస్తే.. కన్నీరే.. ఇదే హీరోయిన్ కయాదు జర్నీ -
కృష్ణుడు ఎలిమినేట్.. ‘నీలో మా నాన్న కళ్లు చూసుకున్నా అన్నా..’
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆదివారం ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగింది. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన పాటలతో నాగార్జున స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చారు. ప్రేక్షకులతో ముచ్చటించిన నాగ్.. వారికి ఎవరు నచ్చుతున్నారు? ఎవరి ఆట ఎలా ఉంది? అనే విషయాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయనకు, తనకు ఎంతో ఇష్టమైన చేనేత వస్త్రాలను ధరించినట్లు నాగార్జున తెలిపారు. ప్రతి ఒక్కరూ చేనేతను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ప్రేక్షకులను కోరారు. ఇది ఇలా ఉంటే అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది?. అంతలా ఎమోషనల్ ఎందుకు అయ్యారో ఒకసారి తెలుసుకుందాం.. రండి!ఇదీ చదవండి: ‘పదో తరగతి చదివి.. ఇప్పుడు డైరెక్టర్లు అయ్యాం..’పాటలు.. డ్యాన్సులతో సందడిహౌస్లో వినోదం మొదలైంది. ఝాన్సీ ‘చెమ్కీల అంగీలేసి’ పాట పాడగా.. త్రిగుణ్, అమన్ తమదైన స్టైల్లో బిగ్‌బాస్‌పై పాట పాడి అలరించారు. అనంతరం ముకేశ్, దేబ్జానీ కలిసి ‘ఎవరెవరో’ పాటకు రొమాంటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. వర్షిణి, చరణ్ ‘వస్తున్నాయ్ ఫీలింగ్స్’ పాటకు డ్యాన్స్ చేసి ఎపిసోడ్లో సందడి చేశారు.కృష్ణుడికి ఎండ్ కార్డ్..ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. చివరి రౌండ్లో సృష్టి, కృష్ణుడు మాత్రమే మిగలగా.. వారిలో కృష్ణుడి జర్నీకి ఎండ్ కార్డ్ పడింది. ‘నీ కోసం స్టేజ్‌పై వెయిట్ చేస్తుంటా.. వచ్చేయ్’ అంటూ నాగార్జున చెప్పడంతో కృష్ణుడు ఇంటి సభ్యులకు వీడ్కోలు పలికారు. బయటకు వెళ్తూ కృష్ణుడు మాత్రం తన ఎలిమినేషన్‌పై బాధపడటం లేదని చెప్పారు. గత వారం తాను చాలా లోగా ఉన్నానని, సరిగ్గా ఆడలేకపోయానని అంగీకరించారు. ‘నేను ఆడలేనందుకు బాధపడటం లేదు. నేను వెళ్లిపోతానని మీకు ముందే చెప్పాను. నేను ట్రై చేశా.. కానీ ఆడలేకపోయాను. అందరూ బాగా ఆడండి. స్ట్రాంగ్ గేమ్ ఆడాలంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండాలి. ఇక్కడ చాలా మంది ఉన్నారు’ అని కృష్ణుడు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చారు.ఇదీ చదవండి: నన్ను బతికుండగానే చంపేశారు కదరా.. నటి భావోద్వేగం..కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్కృష్ణుడు బయటకు వెళ్తున్న సమయంలో రోహిత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ‘మీ కళ్లు మా నాన్నలాగే ఉంటాయి అన్నా. మీరు వెళ్లిపోతుంటే ఆ కళ్లను చూసే ఛాన్స్ కూడా నాకు ఉండదు’ అంటూ రోహిత్ ఏడ్చాడు. అది చూసిన కృష్ణుడు కూడా ఎమోషనల్ అయ్యారు. తనకంటే చిన్నవాళ్లను అర్థం చేసుకోవడంలో కొన్నిసార్లు విఫలమయ్యానని కృష్ణుడు చెప్పారు. ‘నేను కూడా అలా రియాక్ట్ అయ్యి ఉండాల్సింది కాదు. నేను కూడా ఫీల్ అవుతున్నా. కోపంలో కంట్రోల్ చేసుకోలేకపోయాను. మీ అందరికంటే పెద్దోడ్ని అయినా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను’ అంటూ కృష్ణుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆరోగ్యం గురించి కృష్ణుడు ఏమన్నాడంటే..ఎలిమినేషన్ అనంతరం స్టేజ్‌పైకి వచ్చిన కృష్ణుడు నాగార్జునతో తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. ‘నేను చేసిన మిస్టేక్ ఏంటంటే.. గత ఎనిమిది రోజులుగా షుగర్ తినడం మానేశాను. ఇలా అయితే హెల్త్‌కు బెనిఫిట్ అవుతుందని అనుకున్నాను. కానీ వీక్ అవుతానని అనుకోలేదు. అది రివర్స్ అయ్యింది. నేను కనీసం పది కేజీల స్వీట్స్ తింటాను. సడెన్‌గా షుగర్ మానేయడంతో వీక్ అయిపోయాను. దాని ఎఫెక్ట్ చాలా చూపించింది’ అని కృష్ణుడు తెలిపారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. బయటకు వెళ్లిన తర్వాత కూడా మెల్లగా షుగర్‌ను తగ్గించుకుంటూ రెండు నెలల్లో పూర్తిగా మానేయాలని సూచించారు.వచ్చే వారం..బిగ్‌బాస్ తెలుగు 10లో వచ్చే వారం కంటెస్టెంట్లకు మరో ఆసక్తికరమైన టాస్క్ ఎదురుకానుంది. ‘Temptation vs Tension’ పేరుతో జరగనున్న ఈ గేమ్‌లో కంటెస్టెంట్లకు ఎలాంటి ఛాలెంజ్‌లు ఎదురవుతాయి? ఎవరెవరు టెంప్టేషన్స్కు లొంగుతారు? ఎవరెవరు ఒత్తిడిని తట్టుకుని నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే వారం ఈ గేమ్ హౌస్‌లో కొత్త గొడవలకు, ట్విస్టులకు కారణమయ్యేలా కనిపిస్తోంది. ఇలా కృష్ణుడి ఎలిమినేషన్‌తో ఒకవైపు భావోద్వేగం.. మరోవైపు పాటలు, డ్యాన్సులతో ఆదివారం ఎపిసోడ్ సాగింది. ఇదీ చదవండి: ‘రామాయణ’ ఈ వెర్షన్లో 30 నిమిషాల నిడివి తగ్గింపు! -
పాండా అంటూ ట్రోలింగ్.. వినాయకుడు ఎలిమినేట్..?
బిగ్‌బాస్ సీజన్ 10లో ఎలిమినేషన్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే చైత్ర హౌస్ నుంచి బయటకు వెళ్లగా.. ఇప్పుడు తదుపరి ఎలిమినేషన్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి కృష్ణుడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో చైత్ర తర్వాత కృష్ణుడే బయటకు వెళ్తాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కృష్ణుడి ఆటపై అసంతృప్తి..నిన్నటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ కృష్ణుడు, సృష్టిల ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత వీకెండ్లో వారు ఎలా ఆడారో ప్రేక్షకుల్లా కూర్చొని చూడాలని చెబుతూ ఇద్దరినీ స్టోర్ రూంలో కూర్చోబెట్టాడు. దీంతో పాటు ప్రేక్షకులు సైతం కృష్ణుడుని అన్ సేఫ్‌లోనే ఉంచారు. దీంతో కృష్ణుడి ఆటతీరుపై బిగ్‌బాస్ కూడా ఫోకస్ పెట్టాడనే చర్చ మొదలైంది.నెటిజన్లు మీమ్ వీడియోలు..మరోవైపు హౌస్‌లో కృష్ణుడి ఆట కూడా పెద్దగా హైలైట్ కావడం లేదనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో దేబ్జానీ.. కృష్ణుడిని పాండాతో పోలుస్తూ చేసిన కామెంట్ కూడా వైరల్‌గా మారింది. ఆ మాటను ఆధారంగా చేసుకుని నెటిజన్లు మీమ్ వీడియోలు రూపొందిస్తున్నారు. దీంతో కృష్ణుడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా కనిపిస్తోంది.వినాయకుడి నిమార్జనానికి వేళైంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.గతంలో చైత్ర విషయంలోనూ..గతంలో చైత్ర విషయంలోనూ ఇలాంటి చర్చే మొదలై.. చివరకు ఆమె ఎలిమినేట్ అయింది. ఇప్పుడు అదే తరహాలో కృష్ణుడి పేరు వినిపిస్తుండటంతో ఈసారి ఏం జరుగుతుందన్న ఆసక్తి పెరిగింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చ నిజమైన ఎలిమినేషన్ ఫలితమా? లేక కేవలం ప్రేక్షకుల అంచనా మాత్రమేనా? అనేది తెలియాలంటే ఎలిమినేషన్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.(ఇదీ చదవండి: ఒకేసారి రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్.. డోంట్ మిస్)#Debjani ee #Krishnudu konchem #Panda laaga unnadu 🤣🤣🤣#BiggBossTelugu10 pic.twitter.com/gOlYGi5I9n— Naresh Bandari (@BiggBossAddict) September 10, 2026 -
ఆ నలుగురు సేఫ్.. ఆ ఇద్దరు వరస్ట్.. వీకెండ్ హైలెట్స్ ఇవే..!
బుల్లితెర రియాలిటీ షో అప్పుడే రెండో వారం చివరికి వచ్చేసింది. ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది. ఈ వారం నేను చాలా ఎంజాయ్ చేశానని నాగ్ అన్నారు. అయితే ఈ వారంలో ఇద్దరు హౌస్‌లో ఉన్నట్లు అనిపించలేదని తెలిపారు.ఆ ఇద్దరు కృష్ణుడు, సృష్టి అని తెలియజేస్తూ ఓ వీడియోను చూపించారు. ఈ వారంలో వాళ్లిద్దరు హౌస్‌లో ఎలా ఉన్నారో కళ్లకు కట్టినట్లు వీడియోలో కనిపించింది. దీంతో వాళ్లద్దరినీ స్టోర్ రూమ్‌కు పంపించారు. అదే క్రమంలో సింగర్ ఝాన్సీపై ప్రశంసలు కురిపించారు. హౌస్‌లో నువ్వే తొలి మహిళ కెప్టెన్ అని కొనియాడారు. ఆటను వందశాతం ఎఫర్ట్‌తో ఆడుతున్నావని అన్నారు.హౌస్‌మేట్స్‌ను తమ లైఫ్‌లో జరిగిన సీక్రెట్ విషయాన్ని చెప్పాలని నాగ్ అడిగారు. దీనికి కంటెస్టెంట్స్ తమ జీవితంలోని జరిగిన సంఘటలను రామ్ ప్రసాద్, త్రిగుణ్, వంశీ తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ తర్వాత హౌస్‌లో మానిపులేటర్, పప్పెట్స్ ఎవరంటూ నాగ్ హౌస్‌మేట్స్‌ను అడిగారు.సుధీర్‌ను వర్షిని మానిపులేట్ చేస్తోందని చరణ్ అన్నారు. ఆ తర్వాత గేమ్‌లో రూల్స్ చదవకుండా గేమ్ ఆడతావా అని చరణ్‌ను నాగ్ ప్రశ్నించారు. ఇది మళ్లీ రిపీట్ చేయొద్దని సూచించారు. ఆ తర్వాత రామ్ ప్రసాద్‌ను మానిపులేటర్ ఎవరని అడగ్గా.. వంశీని త్రిగుణ్ కంట్రోల్ చేస్తున్నారని అన్నారు. దీనికి ఆడియన్స్ పోల్ నిర్వహించగా.. త్రిగుణ్ చేతిలో వంశీ పప్పెట్ అని తేలిపోయింది. రోహిత్ సైతం వంశీ, త్రిగుణ్‌నే ఎన్నుకున్నారు.సంచాలక్‌గా ఇద్దరు ఫెయిల్..సంచాలక్‌గా రామ్ ప్రసాద్ ఫెయిల్ అయ్యావంటూ నాగ్ అన్నారు. దీనికి అవును సార్ అంటూ రామ్ ప్రసాద్ తన తప్పును అంగీకరించారు. ఆ తర్వాత హౌస్‌లో చరణ్‌ను రోహిత్ మానిపులేట్ చేస్తున్నారని వర్షిని చెప్పింది. దీనికి ఆడియన్స్ పోల్ నిర్వహించగా.. అవుననే ఎక్కువమంది ఓటేశారు.ఆ తర్వాత వర్షినిని సంచాలక్‌గా సరిగ్గా వ్యవహరించలేదని నాగ్ అన్నారు. సంచాలక్‌గా మీ నిర్ణయం కరెక్ట్‌గా లేదని.. అందుకే ఈ వారంలో నువ్వు సంచాలక్‌గా ఉండడానికి వీల్లేదని నాగార్జున చెప్పేశారు. గేమ్‌లో భాగంగా షాలిని, వర్షిణి మధ్య జరిగిన ఫైట్‌లో షాలినిదే తప్పని నాగ్ తేల్చేశారు. ఈ వారంలో ముకేశ్, దేబ్జానీ, ఝాన్సీ, శాలిని సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. ఆ తర్వాత త్రిగుణ్, కృష్ణుడు, సృష్టి, సుధీర్, వర్షిణి, రోహిత్ అన్‌సేఫ్‌గా మిగిలారు. -
వీకెండ్ ఎంటర్టైన్మెంట్.. ఆ ఇద్దరిపై నాగ్ సీరియస్..!
ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతోంది. కెప్టెన్సీ రేస్ ముగియడంతో ఎలిమినేషన్ ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఈ వీకెండ్ ఎపిసోడ్లో కొంతైనా క్లారిటీ వచ్చే అవకాశముంది. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో నాగార్జున కంటెస్టెంట్స్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.హౌస్‌లో సృష్టి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వగా.. ఆట బాగా ఆడితే తానే కిస్ ఇస్తానంటూ కౌంటరిచ్చాడు. ఈ వీక్‌లో కృష్ణుడు, సృష్టి ఆటతీరుపై నాగ్ అగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లిద్దరిని వెనకవైపు కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చాడు. మీరిద్దరు కేవలం ప్రేక్షకుల్లాగే వీక్షించాలని నాగ్ అన్నారు. ఈ ప్రోమోలో నాగ్ ఎంట్రీ అదిరిపోయింది. నాని మూవీ ది ప్యారడైజ్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ప్రోమో ఇవాల్టి ఎపిసోడ్‌పై బిగ్‌బాస్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచుతోంది. -
బిగ్‌బాస్ తొలి కెప్టెన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా ప్రకటించిన ప్రముఖ సంస్థ
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ రేసు ఆసక్తికరంగా సాగింది. ఓవైపు కంటెస్టెంట్లు కెప్టెన్ అయ్యేందుకు పోటీపడుతుండగా.. మరోవైపు హౌస్‌లో నవ్వులు పూయించేలా కామెడీ స్కిట్ చేశారు. రాంప్రసాద్, నరేశ్, వంశీ, రోహిత్, అమన్ కలిసి ‘ఛత్రపతి’ సినిమాలోని ‘ఓ సూరీడు’ కామెడీ సీన్‌ను రీక్రియేట్ చేశారు. మరి నిన్నటి ఎపిసోడ్లో ఝాన్సీ కెప్టెన్ ఎలా అయిందో ఒకసారి చూద్దాం రండి!ఓ సూరీడు.. అదిరిపోయిన స్కిట్స్కిట్లో వంశీ ప్రభాస్ పాత్రలో కనిపించగా.. రాంప్రసాద్ చిన్న పిల్లాడు సూరీడుగా అలరించాడు. నరేశ్ రౌడీ కాట్రాజ్ పాత్రలో నటించాడు. అమన్ వంశీ ఫ్రెండ్‌గా కనిపించగా.. ఝాన్సీ సూరీడు తల్లి పాత్రలో నటించింది. సినిమా సీన్‌ను హౌస్మేట్స్ తమదైన శైలిలో రీక్రియేట్ చేయడంతో స్కిట్ మొత్తం నవ్వులు పూయించింది. స్కిట్ పూర్తయ్యాక బిగ్‌బాస్ కూడా మంచి మార్కులే ఇచ్చాడు. స్కిట్ బాగుంది.. కానీ నరేశ్ కాట్రాజ్ పాత్రలో కండలు మరీ ఎక్కువగా చూపించాడంటూ సరదాగా కామెంట్ చేశాడు. అలాగే రాంప్రసాద్‌ను ఉద్దేశించి సూరీడు మరీ పసిపిల్లాడిలా అయిపోయాడంటూ జోక్ చేశాడు.ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘అగధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..‘చిక్కకు దొరకకు’.. కెప్టెన్సీ టాస్క్ఆ తర్వాత కెప్టెన్సీ రేసులో ఉన్న ముకేశ్, షాలిని, ఝాన్సీ, రాంప్రసాద్, త్రిగుణ్‌లకు బిగ్‌బాస్ ‘చిక్కకు దొరకకు’ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో మిగిలిన పది మంది గార్డులుగా వ్యవహరించాలి. ఈ ఐదుగురు పోటీదారులు జైలులో ఉండాలి. గార్డుల నుంచి తప్పించుకుని గోడ దాటి సేఫ్ జోన్లోకి చేరుకోవాల్సి ఉంటుంది. సేఫ్ జోన్లోకి చేరుకోలేని పోటీదారులు కెప్టెన్సీ రేసు నుంచి ఎలిమినేట్ అవుతారు. ఈ టాస్క్‌లో వంశీ, రోహిత్ హెడ్ గార్డులుగా వ్యవహరించారు. టాస్క్ ప్రారంభానికి ముందు ఐదుగురు పోటీదారులు తాము ఎందుకు కెప్టెన్ కావాలనుకుంటున్నారో వివరించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరూ కెప్టెన్ అయితే హౌస్‌లో ఏం చేస్తారో చెప్పారు. ఇదీ చదవండి: మహిళల అభివృద్ధికి సినీ సెలబ్రిటీల సంచలన నిర్ణయంబయట ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు తమ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినట్టుగానే.. హౌస్‌లోని కంటెస్టెంట్లు కూడా తాము కెప్టెన్ అయితే ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ హామీలు ఇచ్చారు. దీంతో వారి చిన్నపాటి ‘కెప్టెన్సీ మేనిఫెస్టో’ ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత గార్డులు తమ నిర్ణయం ప్రకారం చివరికి రాంప్రసాద్, ఝాన్సీలను కెప్టెన్సీ పోటీలో నిలిపారు. దీంతో వీరిద్దరి మధ్య చివరి పోటీ ఆసక్తికరంగా మారింది.ఝాన్సీనే కొత్త కెప్టెన్రాంప్రసాద్, ఝాన్సీలకు బిగ్‌బాస్ ‘పవర్ ఆఫ్ కెప్టెన్సీ’ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌కు త్రిగుణ్ సంచాలకుడిగా వ్యవహరించాడు. ఇద్దరు పోటీదారుల ముందు ఇనుప నెట్‌ను ఏర్పాటు చేశారు. పట్టకర్రతో ఆ నెట్‌ను తొలగిస్తూ లోపలికి వెళ్లాలి. అక్కడ ఉన్న పెట్టెలోని కీని తీసుకుని.. అందులో ఉన్న చిన్న మూటను తీసుకోవాలి. ఆ మూటలో ఉన్న ‘C’ అనే లెటర్‌ను జెండాకు అతికించి.. ఆ తర్వాత కెప్టెన్ జెండాను ఎగరేయాలి. ఈ టాస్క్‌లో రాంప్రసాద్పై ఝాన్సీ విజయం సాధించింది. దీంతో బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా ఝాన్సీ నిలిచింది. కెప్టెన్‌గా ఎంపికైన ఝాన్సీకి వైట్ గోల్డ్ సంస్థ.. లక్ష విలువైన గోల్డ్ కాయిన్ బహుమతిగా అందించింది. అనంతరం ఝాన్సీ కోసం ప్రత్యేకంగా కెప్టెన్సీ గదిని కూడా బిగ్‌బాస్ ఓపెన్ చేశాడు. అయితే ఆ రూంలో కెప్టెన్‌కి మాత్రమే ప్రవేశం ఉంటుందని గుర్తుచేశాడు.ఇదీ చదవండి: ‘ఆయా షేర్’ రీల్స్ కోసం లక్ష జడలు కొన్నారు: నాని -
బిగ్‌బాస్ ఇంట్లో కలకలం.. షాలినీని పట్టుకెళ్లింది ఎవరు?
బిగ్‌బాస్ విడుదల చేసిన తాజా ప్రోమో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రోమోలో కొంతమంది వ్యక్తులు ఒక్కసారిగా హౌస్‌లోకి రావడం.. షాలినీని పట్టుకుని బయటకు తీసుకెళ్లడం కనిపించింది. వారిని చూడగానే ఇంట్లోని సగం మంది కంటెస్టెంట్లు భయపడిపోయారు. దీంతో అసలు ఏం జరుగుతోందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.అయితే ఇదంతా నిజంగా జరిగిన ఘటన కాదని, హౌస్‌మేట్స్‌ను ఆటపట్టించేందుకు చేసిన ప్రాంక్ కావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లాలంటే బిగ్‌బాస్ ఫార్మాట్ ప్రకారం నామినేషన్లు, ఎలిమినేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అలాంటిది ఎలాంటి ప్రక్రియ లేకుండా షాలినీని తీసుకెళ్లడం వెనుక ఏదైనా టాస్క్ లేదా ట్విస్ట్ ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.బిగ్‌బాస్ అసంతృప్తి..ఇదిలా ఉంటే.. షాలినీ విషయంలో బిగ్‌బాస్ ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సమయపాలన పాటించడం లేదంటూ ఆమెను హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా ప్రోమోలో షాలినీని టార్గెట్ చేయడంతో హౌస్‌లో ఏదైనా కీలక పరిణామం చోటుచేసుకోబోతోందా? అనే ఆసక్తి నెలకొంది.చరణ్ ఎంట్రీకి సంబంధించిన వారేనా..మరోవైపు చైత్ర కంటే చరణ్‌కే ప్రేక్షకుల నుంచి ఎక్కువ మద్దతు లభిస్తోందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. చరణ్ త్వరలోనే బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ఈరోజు ఎపిసోడ్లో చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రోమోలో కనిపించిన వ్యక్తులు చరణ్ ఎంట్రీకి సంబంధించినవారేనా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.అసలు షాలినీని పట్టుకెళ్లడం వెనుక ఉన్న ట్విస్ట్ ఏంటి? ఇది ప్రాంక్నా.. టాస్క్‌లో భాగమా? చరణ్ ఎంట్రీకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అన్నది పూర్తి ఎపిసోడ్‌లోనే క్లారిటీ రానుంది.(ఇదీ చదవండి: ‘గబ్బర్ సింగ్’ నటుడికి బ్రైయిన్ స్ట్రోక్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..) -
బిగ్‌బాస్‌లో ఎగిరిపడ్డ కంటెస్టెంట్లు! ఆడపిల్లని కూడా చూడలేదు..!
బిగ్‌బాస్10 హౌస్ కెప్టెన్సీ రేస్ మరింత రసవత్తరంగా మారింది. కెప్టెన్‌గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ మధ్య బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు వరుసగా టాస్క్‌లు ఇచ్చారు. మొదటి లెవల్లో ‘యానిమల్ పార్క్’ టాస్క్ ఇవ్వగా.. రెండో లెవల్లో ఫిజికల్ ఛాలెంజ్ నిర్వహించారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరింది. ఒక దశలో రోహిత్, వంశీ మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం రండి!యానిమల్ పార్క్.. మొదటి లెవల్లో భాగంగా ‘యానిమల్ పార్క్’ టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చారు. ఈ గేమ్‌లో నలుగురు కంటెస్టెంట్లు రెండు జంటలుగా విడిపోయి ఆడాల్సి ఉంటుంది. ప్రతి జంటలో ఒకరు కర్టెన్ వెనుకకు వెళ్లి.. అక్కడ ఇచ్చిన జంతువుల సీక్వెన్స్ ప్రకారం ఒక్కొక్క జంతువులా నటించాలి. మరో కంటెస్టెంట్ రోప్ సహాయంతో కర్టెన్ను లాగుతూ.. తన పార్ట్నర్ ఏ జంతువులా యాక్ట్ చేస్తున్నాడో గుర్తించాలి. సరైన సమాధానం చెబితే పక్కనే ఉన్న ఆయా జంతువుల బ్లాక్స్‌ను తీసుకుని.. తమ పార్ట్నర్ ఉన్న ఫ్రేమ్‌లో జంతువులను సరైన సీక్వెన్స్‌లో అమర్చాలి. అన్ని బ్లాక్స్‌ను సరైన క్రమంలో అమర్చిన తర్వాత ఫ్రేమ్ వెనుక ఉన్న హ్యాండిల్‌ను స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు తీసుకెళ్లాలి. చివర్లో ఉన్న కంటెండర్ బోర్డును ఎవరు ముందుగా తీసి చూపిస్తారో.. ఆ జంట విజేతగా నిలుస్తుంది. అయితే కంటెస్టెంట్లు జంతువుల బ్లాక్స్‌ను ఏ క్రమంలో అమర్చారనేది సరిగ్గా ఉందా? లేదా? అన్నది సంచాలకులు నిర్ణయిస్తారు. ఈ టాస్క్‌లో గెలిచిన ఇద్దరు కంటెస్టెంట్లు కెప్టెన్సీ రేసులో కొనసాగడంతో పాటు.. ఓడిపోయిన ఇద్దరిలో ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించే అవకాశం కూడా పొందుతారు. ఈ టాస్క్‌లో సృష్టి, వంశీలను సంచాలకులుగా బిగ్‌బాస్ నియమించారు.జాన్సీ–ముకేశ్ జోడీ విజయంఈ గేమ్‌లో జంటలుగా ఎవరు ఆడతారనే ప్రశ్న రావడంతో ముకేశ్–ఝాన్సీ ఒక జోడీగా, శాలిని–అమర్ మరో జోడీగా బరిలోకి దిగారు. టాస్క్‌లో మొదటి నుంచి ఇద్దరు జంటలు గట్టిగానే పోటీపడ్డారు. చివరికి ఝాన్సీ,ముకేశ్ జోడీ విజయం సాధించింది. దీంతో ఝాన్సీ, ముకేశ్ కెప్టెన్సీ రేసులో కంటెండర్లుగా నిలిచారు. అంతేకాదు.. ఓడిపోయిన జంటలో నుంచి ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించే అవకాశం వారికి లభించింది. దీంతో వారు అమర్‌ను కెప్టెన్సీ రేసు నుంచి తొలగించారు. (ఇదీ చదవండి: తమన్నా థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్)రెండో లెవల్లో అసలు ఫిజికల్ వార్!ఆ తర్వాత రెండో లెవల్ మొదలైంది. ఈ లెవల్లో ఎలాంటి పోరాటం ఉండాలనేది ప్రేక్షకులు తమ పవర్‌తో నిర్ణయించారు. మానసిక బలాన్ని పరీక్షించాలా? శారీరక దృఢత్వాన్ని పరీక్షించాలా? అనే ప్రశ్నకు ప్రేక్షకులు శారీరక సామర్థ్యాన్ని పరీక్షించే ఛాలెంజ్‌కు మొగ్గుచూపారు. దీంతో లెవల్-2లో ఫిజికల్ ఛాలెంజ్ ఉంటుందని బిగ్‌బాస్ ప్రకటించారు. ఈ టాస్క్‌కు ‘స్నాచ్ ఇట్.. టీమ్ ఇట్.. త్రో ఇట్’ అనే పేరు పెట్టారు. ఇందులో నలుగురు కంటెస్టెంట్లు రెండు జంటలుగా విడిపోయి పోటీపడాలి. సమయానుసారం బజర్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాలోకి బ్యాగ్స్ పడుతుంటాయి. ఆ బ్యాగ్‌లను దక్కించుకునేందుకు రెండు జంటలు పోటీ పడాలి. ఎవరైతే బ్యాగ్‌ను దక్కించుకుంటారో.. అందులో ఉన్న బాల్స్‌తో ఫ్రేమ్‌లో ఏర్పాటు చేసిన డిస్క్‌లను కొట్టాలి. బజర్ పూర్తయ్యే సమయానికి ఎవరు ఎక్కువ డిస్క్‌లను పడగొడతారో వారే విజేతలుగా నిలుస్తారని బిగ్‌బాస్ వివరించారు. ఈ టాస్క్‌కు వంశీని సంచాలకుడిగా నియమించారు.రోహిత్,దేబ్జానీ వర్సెస్ రాంప్రసాద్,త్రిగుణ్రెండో లెవల్లో దేబ్జానీ ,రోహిత్ ఒక జోడీగా, రాంప్రసాద్, త్రిగుణ్ మరో జోడీగా బరిలోకి దిగారు. గేమ్ మొదలైన వెంటనే ఫిజికల్ ఛాలెంజ్ కావడంతో కంటెస్టెంట్లు తమ పూర్తి శక్తిని ఉపయోగించారు. రాంప్రసాద్–త్రిగుణ్ జోడీ ఒక దశలో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు దేబ్జానీకి ఫిజికల్ టాస్క్ కావడంతో చాలా కష్టంగా మారింది. ఆమె పూర్తిస్థాయిలో రాణించలేకపోవడంతో రోహిత్ దాదాపు ఒంటరిగానే పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. గేమ్‌లో ఒత్తిడి పెరగడంతో ఒకానొక సమయంలో దేబ్జానీ భావోద్వేగానికి గురైంది. తాను ఆడలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయినప్పటికీ రోహిత్ తన జోడీని గెలిపించేందుకు చివరి వరకు పోరాడాడు. ఒకానోక సందర్భంలో త్రిగుణ్, రాంప్రసాద్‌లు ఆట తీవ్రస్థాయికి చేరుకోవడంతో గాల్లోకి ఎగిరిపడిపడ్డారు. అలాంటి సన్నివేశాల్లో హౌస్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ టాస్క్‌లో రాంప్రసాద్, తిగ్రణ్లు విజయం సాధించగా రోహిత్ కెప్టెన్సీ రేసు నుంచి తొలగించారు.(ఇదీ చదవండి: రూ.200 కోట్ల సినిమా.. త్రివిక్రమ్ తప్పుకున్నారా?)రోహిత్,వంశీ మధ్య భారీ గొడవఇదే సమయంలో టాస్క్ నిర్వహణ విషయంలో రోహిత్, సంచాలకుడు వంశీ మధ్య వివాదం మొదలైంది. గేమ్‌లో జరిగిన అంశంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా మాట్లాడుకోవడంతో పరిస్థితి అదుపు తప్పే స్థాయికి చేరుకుంది. మాటలు తీవ్రం కావడంతో ఇద్దరి మధ్య గొడవ మరింత ముదిరింది. ఒక దశలో ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లడంతో పరిస్థితి కొట్టుకునే స్థాయికి వెళ్లినట్లు కనిపించింది. ఇలా కెప్టెన్సీ రేసులో భాగంగా ఇచ్చిన రెండో లెవల్ టాస్క్ కేవలం గేమ్‌గా కాకుండా.. కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. దేబ్జానీ కన్నీళ్లు పెట్టుకోవడం, రోహిత్ ఒంటరిగా పోరాడటం, చివర్లో రోహిత్, వంశీ మధ్య గొడవతో ఈ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఇరుముడి సక్సెస్.. చిన్నారి నక్షత్రకు బిగ్ సర్ప్రైజ్) -
బిగ్‌బాస్ లేటేస్ట్ ప్రోమో.. గేమ్‌లో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్..!
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-10 అప్పుడే పదో రోజుకు చేరుకుంది. రెండో వారంలో నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే అయిపోయింది. ఇక కంటెస్టెంట్స్ మధ్య ఆటల పోటీ మొదలైంది. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లతో హౌస్మేట్స్ పోటీ పడుతున్నారు. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ హాట్‌హాట్‌గా సాగుతోంది.తాజాగా పదో రోజుకు సంబంధించిన రెండో ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో బ్యాగ్ కోసం పోటీ పడ్డారు కంటెస్టెంట్స్. ఈ గేమ్‌లో రెండు టీమ్‌ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఈ పోటీలో ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు. ఈ ప్రోమో చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది. హౌస్‌లో అసలేం జరిగిందో తెలియాలంటే ఇవాల్టి ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. -
ఓరి నాయనో ఇదేం 'ప్రేమ'? చైత్ర-చరణ్.. అనుకున్నట్లే ట్విస్ట్
ఈసారి బిగ్‌బాస్ షోలో తొలివారమే ఇద్దరూ ఎలిమినేట్ అయిపోయారు. అది కూడా వారం మధ్యలోనే హౌస్ నుంచి వెళ్లిపోవడంతో అంతా షాకయ్యారు. కానీ వాళ్లిద్దరూ బయటకెళ్లలేదు. అనుకున్నట్లే ఈ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. అలానే దేబ్జానీ, ముకేశ్ అయితే నిజమైన ప్రేమికుల కంటే అతి చేస్తున్నారు. ఇంతకీ బిగ్‌బాస్ 10లో 10వ రోజైన మంగళవారం ఏం జరిగింది? ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి?(ఇదీ చదవండి: పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక)నామినేషన్ల హంగామాతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. దీని గురించి మాట్లాడుకోవడంతో మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇంతలో ముకేశ్, వర్షిణితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో దిగాడు. దీంతో దేబ్జానీ సరదాగానే ముకేశ్‌తో గొడవ పెట్టుకుంది. నా చెల్లికి అన్యాయం చేస్తావా అని రాంప్రసాద్ ఓవైపు నుంచి ముకేశ్‌ని అడుగుతుంటే.. నేను ఉండగా మరొకరితో పూల్‌లోకి ఎలా దిగుతావ్ అని దేబ్జానీ అడిగింది. ఇదంతా చూసిన ప్రేక్షకులు ఓరి నాయనో ఇదేం ప్రేమ అనకుండా ఉండలేరు.ఇక వినాయక చవితి పండగని ఇంట్లోనే అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూజా సామాగ్రిని బిగ్‌బాస్ పంపించాడు. కాసేపటి తర్వాత కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. పవర్ ఆఫ్ పీపుల్‌లో ఉన్న త్రిగుణ్, దేబ్జానీ, అమన్, షాలిని, ముఖేశ్, రోహిత్, ఝాన్సీ, రాంప్రసాద్‌లు కెప్టెన్ అయ్యేందుకు పోటీపడ్డారు. బెలూన్ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్ అందరికీ కొన్ని స్పెల్లింగ్స్ ఇచ్చారు. ఎవరు కరెక్ట్‌గా రాస్తే వాళ్లు మిగతా కంటెస్టెంట్స్‌లలో ఒకరి బెలూన్ పగలగొట్టి కారణాలు చెప్పాలని బిగ్‌బాస్ అన్నాడు.మొదటి రౌండ్లో త్రిగుణ్ బెలూన్లు నాలుగూ వేరే మిగతావాళ్లు పగలగొట్టేయడంతో ఇతడు ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత వరసగా రోహిత్, రాంప్రసాద్, దేబ్జానీ, షాలినీ, ముకేశ్ ఎలిమినేట్ అయ్యారు. చివరగా మిగిలిన ఝాన్సీ, అమన్‌లకు బుధవారం నాడు కెప్టెన్సీ పోటీ ఉండబోతుంది. గతవారం ఎలిమినేట్ అయిన చైత్ర, చరణ్ విషయంలో అనుకున్నట్లే బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్లిద్దరిలో ఒకరిని తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చే బాధ్యత ఆడియెన్స్‌కి ఇచ్చారు. ప్రేక్షకులు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారో వాళ్లు రీఎంట్రీ ఇస్తారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
షాలినీపై నరేశ్ తీవ్ర వ్యాఖ్యలు.. బిగ్‌బాస్ బ్యూటీ స్ట్రాంగ్ కౌంటర్
బిగ్‌బాస్ సీజన్-10లో నామినేషన్ కారణంగా చైత్ర ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమెకు సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా నరేశ్ చేసిన వ్యాఖ్యలపై చైత్ర స్పందించిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది.ఇదీ చదవండి: ది ప్యారడైజ్ క్రేజ్.. ఈసారి ఏకంగా వినాయకుడే వెలిశారుచైత్రను ప్రస్తావిస్తూ.. నిన్నటి ఎపిసోడ్లో నరేశ్.. షాలినీ ఎలిమినేషన్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో చైత్రను ప్రస్తావిస్తూ ఆమెతో జరిగిన గొడవను గుర్తు చేశాడు. ‘ఆ రోజు చైత్రకు సారీ చెప్పాల్సింది పోయి.. తిరిగి ఆమెనే నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పేలా చేశావు. అది సరైనది కాదు’ అన్నట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.మీమ్ రూపంలో.. ఈ క్లిప్‌ను చైత్ర తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మీమ్ రూపంలో షేర్ చేసింది. అంతేకాకుండా నరేశ్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ‘బాగా చెప్పాడు’ అంటూ తన రియాక్షన్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో చైత్ర, షాలినీ మధ్య ఓ విషయంలో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చైత్రనే షాలినీకి సారీ చెప్పింది. ఈ పరిణామంతో ఆమె హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు అదే ఘటనను నరేశ్ ప్రస్తావించడంతో.. చైత్ర ఈ క్లిప్‌ను షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. View this post on Instagram A post shared by ₵Ⱨ₳ł₮ⱧⱤ₳Ɽ₳ł17.ⱧØⱠł₵ (@chaithrarai17.holic) -
శుభవార్త చెప్పేసిన రష్మిక ఫ్రెండ్-సీరియల్ హీరోయిన్
వినాయక చవితి సందర్భంగా సెలబ్రిటీలు చాలామంది తమ ఇంట్లో జరిగిన పండగ ఫొటోలని పంచుకున్నారు. ఇదే టైంలో హీరోయిన్ రష్మిక స్నేహితురాలు, బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ ప్రేరణ మాత్రం తాను తల్లి కాబోతున్న విషయాన్ని పంచుకుంది. భర్తతో కలిసి బేబి బంప్ చూపిస్తూ ఓ వీడియోని పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీ తర్వాత థియేటర్లో.. కానీ ఎక్కడ తేడా కొట్టింది?)స్వతహాగా కన్నడ అయిన ప్రేరణ.. నటి అయ్యే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు రష్మికకు స్నేహితురాలు. తర్వాత కాలంలో రష్మిక హీరోయిన్ అయిపోగా.. ప్రేరణ సీరియల్ హీరోయిన్గా మారింది. 'కృష్ణ ముకుంద మురారీ' అనే సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తర్వాత బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్లో పాల్గొంది. ఫినాలే వరకు వచ్చినప్పటికీ టాప్-4లో మాత్రమే చోటు దక్కించుకుంది. విజేత కాలేకపోయింది.'బిగ్ బాస్'లో కప్పు గెలుచుకోలేకపోయింది గానీ తర్వాత తన భర్త శ్రీపాద్‌తో కలిసి ఓంకార్ హోస్ట్ చేసిన 'ఇస్మార్ట్ జోడీ 3' రియాలిటీ షోలో పాల్గొని విజేతగా నిలిచింది. 2023 నవంబరులో వీళ్లిద్దరికీ పెళ్లి కాగా ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్న శుభవార్తని బయటపెట్టారు. బేబీ బంప్ వీడియోని పంచుకున్నారు. ఈ క్రమంలోనే యష్మి గౌడ, రోహిణి తదితరులు వీళ్లకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'పవి టీచర్'.. ఫొటోలు వైరల్) View this post on Instagram A post shared by प्रेrana kambam (@prerana.kambam) -
నాయకత్వం అంటే ఇది కాదు.. సీఎం విజయ్ గురించేనా ఇదంతా?
ఇదంతా సోషల్ మీడియా జమానా. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడితే ఎవరి మనోభావాలు హర్ట్ అవుతాయో చెప్పలేం. ఒకరి గురించి మాట్లాడితే మరొకరి గురించి మాట్లాడినట్లు అనిపించొచ్చు. ఇప్పుడు ఈ ఉపోధ్ఝాతం అంతా ఎందుకంటే.. తమిళ బిగ్‌బాస్‌లో రాజకీయ రగడ రేగింది. హోస్ట్ విజయ్ సేతుపతి చేసిన కొన్ని కామెంట్స్.. ముఖ్యమంత్రి విజయ్‌ని ఉద్దేశించినవా అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?(ఇదీ చదవండి: త్రిగుణ్‌ని చెడుగుడు ఆడేసుకున్న సుధీర్.. నామినేషన్స్‌లో రచ్చ)తెలుగుతో పాటు తమిళంలోనూ గతవారమే బిగ్‌బాస్ షో మొదలైంది. మన దగ్గర ఇంకా కెప్టెన్సీ పోటీ ప్రారంభం కాలేదు. తమిళ సీజన్లో మాత్రం గతవారం కెప్టెన్సీ పోటీని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల తరహాలో నిర్వహించారు. అంటే కెప్టెన్ కావాలనుకునే హౌస్మేట్స్.. గెలిపేస్తే ఇది చేస్తాం అది చేస్తామని వాగ్దానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే విజేతగా నిలిచిన సతిగా అనే అమ్మాయి ఇలా చాలా ప్రామిస్‌లు చేసింది. కానీ విజేత అయిన తర్వాత వాటిని నెరవేర్చలేకపోయింది. దీంతో వీకెండ్ వచ్చిన హోస్ట్ విజయ్ సేతుపతి ఈమెకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు.సతిగా చేసిన వాటిని విమర్శించే క్రమంలో హోస్ట్ విజయ్ సేతుపతి.. 'హామీలు ఇవ్వడం, బాధ్యతలు స్వీకరించడం, కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడటం నాయకుడి లక్షణాలు. సమస్యలు వచ్చినప్పుడు తప్పించుకోవడం నాయకత్వం కాదు. ప్రతిపక్షాన్ని నిందించడం మాత్రమే నాయకుడి లక్షణం కాదు' అని అన్నాడు. అయితే ఇక్కడ ఏ రాజకీయ పార్టీ, నాయకుడు పేరు గానీ చెప్పలేదు. కానీ సేతుపతి.. సీఎం విజయ్‌ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు ట్రోల్స్ చేశారు.దీంతో విజయ్ అభిమానులు.. విజయ్ సేతుపతి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. మరోవైపు ఈ షో ప్రసారమవుతున్న విజయ్ టీవీ కూడా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది. బిగ్‌బాస్ తమిళ సీజన్ 10.. షో ఫార్మాట్, థీమ్స్, గేమ్ వాతావరణానికి అనుగుణంగా రూపొందించిన వినోద కార్యక్రమం. ఇందులోని పరిస్థితులు, డైలాగ్స్, అభిప్రాయాలు షోలో భాగంగానే చూడాలి. కార్యక్రమంలో కనిపించే వ్యాఖ్యలకు బయట ఉన్న ఏ వ్యక్తి, సంస్థ, వ్యవస్థతో సంబంధం లేదని పేర్కొంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10 తెలుగు: ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారంటే?)#VijaySethupathi Directly attack Someone🙄🤔#BiggBoss10Tamil #BiggBossTamil10 #BiggBossTamil #BiggBoss pic.twitter.com/3Pts1Wonfz— Dinesh Kumar👁 (@DineshKumaaaar) September 12, 2026pic.twitter.com/VQ0MrMZZYN— Vijay Television (@vijaytelevision) September 14, 2026 -
త్రిగుణ్‌ని చెడుగుడు ఆడేసుకున్న సుధీర్.. నామినేషన్స్‌లో రచ్చ
తెలుగు బిగ్‌బాస్ షోలో ఈసారి తొలిసారి నామినేషన్ల సందడి గట్టిగానే వినిపించింది. గతవారం కంటెస్టెంట్స్ మధ్య పోటీలు పెట్టి హౌస్మేట్స్ అయ్యే ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలోనే చైత్ర, చరణ్ ఎలిమినేట్ అయ్యారు. మరో ఎలిమినేషన్ కూడా జరగొచ్చని చాలామంది అనుకున్నారు. కానీ అలాంటిదేం లేకుండానే వీకెండ్ అయిపోయింది. ఇక సోమవారం రాగానే ఎప్పటిలానే నామినేషన్ల హడావుడి మొదలైంది. ఇంతకీ 8వ రోజైన సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి?(ఇదీ చదవండి: 'రంగస్థలం' కోసం చరణ్ అన్నని బాగా టార్చర్ చేశా: శ్రీకాంత్ ఓదెల)నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బిగ్‌బాస్ పిలిచినప్పుడల్లా ఇద్దరు హౌస్మేట్స్.. ఏర్పాటు చేసిన దారిలో నుంచి వెళ్లి ఏదో ఒక పోల్ ఎంచుకుని దానికి చుట్టి ఉన్న తాడు మొత్తాన్ని తీసి అక్కడే ఉన్న రెండు గొడ్డళ్లలో(సిల్వర్, గోల్డ్) ఒకటి ఎంచుకోవాలి. సిల్వర్ పట్టుకుంటే ఒకర్ని నామినేట్ చేసే అర్హత ఉంటుంది. గోల్డ్ ఎంచుకుంటే ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. ఓడిపోయిన వాళ్లకు ఆ రౌండ్లో ఒక నామినేషన్ ఓటు పడుతుంది. గొడ్డలిని అందుకున్న వాళ్లు ఆ రౌండ్లో ఓడిపోయిన వాళ్లతో సహా ఎవరినైనా నామినేట్ చేయొచ్చని బిగ్‌బాస్ చెప్పాడు.తొలుత వచ్చిన ఝాన్సీ, సుధీర్‌లలో గెలిచిన సుధీర్.. గోల్డెన్ గొడ్డలి పట్టుకున్నాడు. మొదట త్రిగుణ్‌ని నామినేట్ చేశాడు. తన దగ్గర ఒక మాట మాట్లాడి రోహిత్ దగ్గర మరొకటి చెప్పాడని.. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో మాట చెబుతున్నాడని కారణం చెప్పాడు. చైత్ర విషయంలోనూ తన ఆట చూడకుండా కత్తితో పొడిచావని చెప్పి నామినేట్ చేశాడు. తర్వాత షాలిని పేరు చెప్పాడు. షాలినికి వాష్‌రూం క్లీనింగ్ ఇస్తే దాన్ని తీసుకోలేక బదులుగా పవర్ వాడుకోవడం నచ్చలేదని కారణం చెప్పాడు. తర్వాత కృష్ణుడు, దేబ్జానీ గేమ్ ఆడగా దేబ్జానీ గెలిచింది. ఈమె సిల్వర్ గొడ్డలి పట్టుకుని త్రిగుణ్‌కి నామినేట్ చేసింది. ఏమైనా ఉంటే నేరుగా చెప్పట్లేదు పక్కవాళ్ల దగ్గరకు వెళ్లి చెప్తున్నావ్. సుధీర్ గురించి నాకు చెప్పడం నచ్చలేదని కారణం చెప్పింది.వర్షిణి, రోహిత్‌లలో రోహిత్ గెలిచి గోల్డెన్ గొడ్డలి పట్టుకున్నాడు. తొలుత త్రిగుణ్ పేరు చెప్పి.. ప్రపంచం తెలిసిన నువ్వు నన్ను స్టెరాయిడ్స్ బాడీ అనడం నచ్చలేదు. అక్కడో మాట ఇక్కడో మాట నాకు గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు. చాలా చెత్త మేటర్ అది. నేను సృష్టిని సుధీర్ మీదకు పంపానని అన్నారు.. ఓ ఆడపిల్ల విషయంలో మీరు అలా అనడం నాకు అస్సలు నచ్చలేదని రోహిత్ అన్నాడు. ఇలా కాసేపు వీళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రోహిత్ తన రెండో నామినేషన్ ఝాన్సీకి వేశాడు. సేఫ్ గేమ్ ఆడటం మానేయ్ అని ఆమెతో చెప్పాడు. దీనికి బదులిచ్చిన ఝాన్సీ.. నాకు నా స్టాటజీ ఉంది. నువ్వే చాలాసార్లు వాళ్లు ఏం అనుకుంటున్నారో చెప్పు అని అడిగావ్? అని రిటర్న్ కౌంటర్ ఇచ్చింది. ఇది జరుగుతున్నప్పుడు మధ్యలోకి త్రిగుణ్ రావడంతో రోహిత్.. అతడికి గట్టిగానే ఇచ్చేశాడు.నరేశ్, షాలినిలో గెలిచిన నరేశ్.. సిల్వర్ గొడ్డలి తీసుకొని షాలినినే నామినేట్ చేశాడు. గేమ్ సీరియస్‌గా తీసుకున్నారు మీరు ఓడిపోతే తీసుకోలేరు. చైత్రని మీరు హర్ట్ చేసి తనతో గొడవపడి చివరకు తనతోనే క్షమాపణ చెప్పించారు. ఎప్పుడూ బిగ్‌బాస్ పిలిచిన వెంటనే రారు. మీకు ఇప్పుడే వార్నింగ్ కూడా వచ్చింది అని కారణాలు చెప్పాడు. షాలిని, త్రిగుణ్ పోటీలో త్రిగుణ్ గెలిచి గోల్డెన్ గొడ్డలి పట్టుకున్నాడు. తనని టార్గెట్ చేసిన సుధీర్‌ని నామినేట్ చేశాడు. ఏమైనా ఒప్పుకుంటా కానీ వెన్నుపోటు పొడిచావ్ అంటే తీసుకోలేను. నువ్వే వచ్చి నాది సృష్టిది హైట్ సరిపోతుంది అని నువ్వే నాతో మాట్లాడావ్ నేను ఎవరికీ ఈ విషయాలు చెప్పలేదు. తోముతున్నారు అన్న విషయంలో నేను ఎప్పుడూ తప్పుడు మీనింగ్‌తో అనలేదు. నాకు ఐదుగురు చెల్లెళ్లు ఉన్నారు అని త్రిగుణ్ తన అభిప్రాయాల్ని చెప్పాడు.చివరిగా నాతో ఫైట్ చేస్తే బాగా కనిపిస్తావ్ అని నాతో పెట్టుకున్నావ్ నాకు తెలుసు అని సుధీర్‌ని రివర్స్ ఎటాక్ చేశాడు త్రిగుణ్. త్రిగుణ్ తన రెండో నామినేషన్ రోహిత్‌కి వేశాడు. నువ్వేదీ తీసుకోవడం లేదు. పనిచేయవు పనిచేసే వాళ్లని చేయనివ్వడం లేదు అని త్రిగుణ్ తన కారణాలు చెప్పాడు. ఇదలా ఉండగానే మరోవైపు వర్షిణి, షాలిని గట్టిగా గొడవపడ్డారు. తర్వాత ముఖేశ్, అమన్ పోటీపడగా.. గెలిచిన అమన్ గోల్డ్ గొడ్డలి పట్టుకొని మొదట రాంప్రసాద్‌ని నామినేట్ చేశాడు. తర్వాత ఝాన్సీకి నామినేట్ చేసి మొదట నా గేమ్ బాగుంది అని చెప్పి అందరి దగ్గర నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావ్ అనడం నచ్చలేదు అని చెప్పాడు.రాంప్రసాద్, వంశీలలో వంశీ గెలిచి గోల్డెన్ గొడ్డలి అందుకున్నాడు. వంశీ మొదటి దేబ్జానీని నామినేట్ చేశాడు . నువ్వు ఓ పదం వాడావు నాకు అది నచ్చలేదు ఆ పదం ఇప్పుడు కూడా నాకు మాట్లాడాలి అని లేదని అన్నాడు. ఈ పదం వాడకూడదు అని నాకు తెలీదు. మేం జిమ్‌లో వాడుతుంటాం. వర్షిణి ఆ పదం వాడకూడదు అని చెప్పడం వల్ల నాకు తెలిసింది అని దేబ్జానీ సమాధానమిచ్చింది. రెండో నామినేషన్ ముఖేశ్‌కి వేశాడు. ముఖేశ్ ఇంట్లో గడ్డం గీసుకోవడం తనకి ఇబ్బందిగా అనిపించిందని అన్నాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. నరేశ్, ముఖేశ్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణి, కృష్ణుడు, సుధీర్, ఝాన్సీ, అమన్, షాలిని, సృష్టి.. నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్.ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే?సుధీర్.. త్రిగుణ్, షాలినిదేబ్జానీ.. త్రిగుణ్, రోహిత్త్రిగుణ్, ఝాన్సీనరేష్.. షాలిని,త్రిగుణ్.. సుధీర్, రోహిత్అమన్.. రాం ప్రసాద్, ఝాన్సీవంశీ.. దేబ్జానీ, ముఖేష్(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా 'హుషార్ పిట్టలు') -
బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం
బిగ్‌బాస్ సీజన్-10లో ఎలిమినేషన్స్ వేడి మొదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్లు తమకు నచ్చని వారి పేర్లు చెబుతూ.. అందుకు కారణాలను వివరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ కాస్తా హౌస్‌లో మాటల యుద్ధానికి దారితీసినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతోంది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేసేందుకు కంటెస్టెంట్లు పోటీపడుతున్నారు. మరోవైపు ఎలిమినేషన్ పాయింట్స్‌లోనూ ఒకరిపై ఒకరు తమ అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది.తాజా ప్రోమోలో నరేశ్.. షాలినీని ఎలిమినేషన్‌కు నామినేట్ చేస్తూ తన కారణాలను చెప్పాడు. దీనికి షాలినీ కూడా గట్టిగానే స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ కనిపించారు. మరోవైపు వర్షిణి, షాలినీ మధ్య కూడా వాగ్వాదం జరిగినట్లు ప్రోమోలో చూపించారు. వీరిద్దరి మధ్య అసలు గొడవకు కారణమేంటి? ఎలిమినేషన్ పాయింట్స్ విషయంలో ఎవరి వాదన సరైనది? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌లో పోటీ రసవత్తరంగా మారగా.. ఎలిమినేషన్ ప్రక్రియతో మరింత వేడి పెరిగినట్లు కనిపిస్తోంది. మరి నేటి ఎపిసోడ్లో ఏం జరిగింది? ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ఎవరి మధ్య మాటల యుద్ధం ఎంతవరకు వెళ్లిందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. -
అడుగుపెట్టగానే ఫేమస్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
బిగ్‌బాస్ సీజన్10లో కంటెస్టెంట్ల ఆట ఒకవైపు ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు కొందరి మాటతీరు.. ప్రవర్తన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అలాంటి వారిలో దేబ్జానీ మోదక్ ఒకరు. బెంగాలీ నేపథ్యంలో నుంచి వచ్చిన ఆమె తెలుగులో మాట్లాడే విధానం.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, తనదైన శైలిలో స్పందించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హౌస్‌లో అందరితో మాట్లాడే మాటలు, తోటి కంటెస్టెంట్లతో కలిసిపోయే విధానం హౌస్‌మేట్స్‌కే కాకుండా బయట ప్రేక్షకులకూ ముచ్చటగా అనిపిస్తోంది. మరి ఆమె కోసం కొన్ని ముచ్చటైన విషయాలు తెలుసుకుందామా..!దేబ్జానీ బెంగాలీ కుటుంబంలో జన్మించింది. తండ్రి అపూర్బా మోదక్ వ్యాపారవేత్త.. తల్లి మితా మోదక్ గృహిణి. ఈమెకు నందిని మోదక్ అనే చెల్లెలు ఉంది. అయితే చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి లేదు. అనుకోకుండా ఓ సీరియల్లో అవకాశం రావడంతో అలా బుల్లితెరపై అడుగుపెట్టి బెంగాలీ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.ఎన్నెన్నో జన్మల బంధంతో గుర్తింపు...తెలుగులో బేబ్జానీకి మంచి గుర్తింపు తెచ్చిన సీరియల్ ‘ఎన్నెన్నో జన్మల బంధం’. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అప్పట్లో ఈమె.. తన నటన, మాటలతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారంటే?బిగ్‌బాస్‌లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా..ఇప్పుడు అదే గుర్తింపుతో బిగ్‌బాస్ సీజన్10లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అప్పటి నుంచి తన మాటలతో అటు హౌస్‌మేట్స్‌తో పాటు ఇటు ఇప్పటి ప్రేక్షకులకూ దగ్గరవుతున్నారు.బిగ్‌బాస్‌లో ప్రపోజల్ హింట్..బిగ్‌బాస్‌లో తొలివారం బేబ్జానీ పేరే హైలెట్‌గా నిలిచింది. ఆమె ఆడే తీరు అలాంటిది మరి. అయితే బిగ్‌బాస్‌లో ఓ కంటెస్టెంట్ అంటే కూడా చాలా ఇష్టమని తన మాటల్లోనే చెప్పింది. ‘ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ముకేశ్ అంటే నాకు చాలా ఇష్టం. ముకేశ్ అందరితో పులహారి కలుపుతాడని కానీ నా దగ్గరకు మాత్రం రావడం లేదు. అందుకే ఈ విషయం అతనితో చెప్పలేకపోయా. నీక కాఫీ అంటే ఎంత ఇష్టమో అతను అంటే కూడా అంతే ఇష్టం. అతని కళ్లు కూడా చాలా బాగుంటాయి’ అని బిగ్‌బాస్ హౌస్‌లో ఓ సందర్భంలో తన మనసులోని మాటను బయటపెట్టింది దేబ్జానీ. ఇదీ చదవండి: బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో పరిస్థితేంటి?అంతే కాకుండా తాను ఆరో తరగతి తొలసారి ఫైయిల్ కావడంతో రెండు సార్లు చదవాల్సి వచ్చిందని తెలిపింది. అయితే నిజంగానే అతనంటే ఇష్టమా లేక గేమ్ కోసం చెప్పిందా అని సందిగ్దత నెలకొంది. ఏదీఏమైనప్పటికీ ఈ బిగ్‌బాస్‌లో దేబ్జానీ జర్నీ ఎంతవరకు సాగుతుంది?. ఈ సారి కప్ ఈమె కొడుతుందో లేదో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారంటే?
బిగ్‌బాస్ పేరు చెప్పగానే చాలామంది నామినేషన్ ప్రక్రియనే గుర్తొస్తుంది. ఎందుకంటే వారం మొత్తంలో ఏదైనా ఆసక్తికరంగా ఉంటుంది అంటే అది ఇదే. గతవారమే షో మొదలైంది కాబట్టి నామినేషన్లని నిర్వహించలేదు. కంటెస్టెంట్స్.. హౌస్మేట్స్ కావడంలో భాగంగా పోటీ జరిగింది. ఈ క్రమంలోనే చరణ్, చైత్ర తొలివారం ఎలిమినేట్ అయ్యారు. మరొకరు కూడా వెళ్లిపోతారని రూమర్స్ వచ్చాయి గానీ అలాంటిదేం జరగకుండానే వీకెండ్ పూర్తయింది.(ఇదీ చదవండి: వినసొంపుగా 'రామాయణ' తొలి పాట.. వీడియో రిలీజ్)ఇక సోమవారం రావడంతో ఈ సీజన్లో తొలిసారి నామినేషన్ల హంగామా మొదలైంది. ఈసారి పెద్ద దిమ్మకు తాడు చుట్టి ఉంటుంది. తలో ఇద్దరూ ఒకకేసారి వెళ్లి ఆ తాడుని విప్పాల్సి ఉంటుంది. ఎవరైతే ముందుగా తాడుని పూర్తిగా తొలగిస్తారో వాళ్లకు నామినేషన్ చేసే అవకాశం లభిస్తుంది. ఇలా ఛాన్స్ దక్కించుకున్న సుధీర్..త్రిగుణ్‌ని నామినేట్ చేశాడు. గేమ్ ఏమేం జరగకుండా చైత్ర పేరుని నువ్వు చెప్పడం నాకు నచ్చలేదని కారణం చెప్పాడు. అలానే వాష్‌రూమ్ క్లీన్ చేయమని పనిఇస్తే.. అది చేయకుండా ఉన్న పవర్ వేస్ట్ చేసుకున్నావ్ అని షాలినిని నామినేట్ చేశాడు.మరోవైపు దేబ్జానీ కూడా త్రిగుణ్‌ని నామినేట్ చేసింది. రోహిత్ కూడా త్రిగుణ్‌తో పాటు ఝాన్సీని నామినేట్ చేశాడు. సేఫ్ గేమ్ ఆడుతోందని, ఏ డిస్కషన్లోనూ తనకు కనబడట్లేదని ఈమె పేరు చెప్పాడు. ఈ సందర్భంగా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కామనర్స్ రోహిత్-ఝాన్సీ మధ్య గట్టిగానే గొడవ జరిగింది. ఇందుకు సంబంధించిన తొలి ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.ప్రస్తుతం హౌస్‌లో 14 మంది ఉండగా.. వీళ్లలో ఈ వారం ఏకంగా 10 మంది నామినేట్ అయినట్లు తెలుస్తోంది. షాలిని, త్రిగుణ్, ఝాన్సీ, కృష్ణుడు, రాంప్రసాద్, వర్షిణి, సుధీర్, రోహిత్, ముకేశ్, దేబ్జానీ.. ఈ లిస్టులో ఉన్నారట. సృష్టి, వంశీ, నరేశ్, అమన్.. ఈ వారం నామినేట్ కాకుండా సేఫ్ జోన్లో ఉన్నారని సమాచారం.(ఇదీ చదవండి: ప్రేక్షకుల చేతికే మొత్తం పవర్స్.. అంచనాలను పెంచేసిన బిగ్‌బాస్) -
ప్రేక్షకుల చేతికే మొత్తం పవర్స్.. అంచనాలను పెంచేసిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ సీజన్-10లో ఆదివారం ఎపిసోడ్ సందడిగా సాగింది. వినాయక చవితి సందర్భంగా హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు పండగ శుభాకాంక్షలు తెలిపి షోను ప్రారంభించారు. ఎప్పటిలాగే తనదైన శైలిలో కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడుతూ.. అవసరమైన చోట క్లాస్ కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో బ్లాక్ కీతో హౌస్‌లో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చారు. ఇక రెండో వీకెండ్ ఎలా ఉండబోతుందో కూడా హింట్ ఇచ్చారు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి ఓ లుక్కేద్దాం..ఇంగ్లీష్‌పై నాగార్జున అసంతృప్తిహౌస్లో కొందరు కంటెస్టెంట్లు ఎక్కువగా ఇంగ్లీష్‌లో మాట్లాడటంపై నాగార్జున స్పందించారు. హౌస్‌లో జరిగే విషయాలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉండాలంటే వీలైనంత వరకు తెలుగులో మాట్లాడాలని సూచించారు. ముఖ్యంగా ఇంగ్లీష్ రాని ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తెలుగు సరిగా మాట్లాడటం రాకపోయినా ప్రయత్నిస్తున్న దేబ్జానీని ఈ సందర్భంగా నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు.దేబ్జానీకి ఫుల్ క్రేజ్.. రోహిత్‌కు వార్నింగ్కంటెస్టెంట్ల మనసులో ఎవరు ఉన్నారు? ఎవరు దూరంగా అనిపిస్తున్నారు? తెలుసుకునేందుకు నాగార్జున ఓ ఆసక్తికరమైన టాస్క్‌ను కంటెస్టెంట్లకు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు కంటెస్టెంట్లు తమ మనసులోని మాటలను బయటపెట్టారు. ఎక్కువమంది దేబ్జానీ పేరును ఇష్టపడుతున్నట్లు చెప్పడంతో నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు. ‘నువ్వు చాలా పాపులర్ అయిపోతున్నావు’ అంటూ ఆమెతో సరదాగా అన్నారు. మరోవైపు రోహిత్ పేరును ద్వేషిస్తున్నట్లు తెలపడంతో రోహిత్‌ను హౌస్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని నాగార్జున సూచించారు.ఎక్కువ మంది చదివింది: అభిమానికి అండగా రామ్.. ఆమె కోసం మరో అడుగుబ్లాక్ కీతో అసలు ట్విస్ట్ఆదివారం ఎపిసోడ్లో బ్లాక్ కీతో బిగ్‌బాస్ మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఇచ్చారు. నాగార్జున తీసుకొచ్చిన బ్లాక్ కీని ఎవరికి ఇస్తే.. ఆ వ్యక్తి దగ్గర ఉన్న కీ పవర్ పనిచేయకుండా పోతుందని తెలిపారు. దీంతో ఆ బ్లాక్ కీ ఎవరికి ఇవ్వాలనే దానిపై కంటెస్టెంట్ల అభిప్రాయాలు తీసుకున్నారు. అందరిలో ఎక్కువమంది సృష్టి పేరు చెప్పారు. చివరికి బ్లాక్ కీని సృష్టికి ఇవ్వాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటనఇదే సమయంలో ఇప్పటివరకు మ్యాజిక్ కీ లేని నలుగురు కంటెస్టెంట్లకు మరో అవకాశం కల్పించారు. ఈ మేరకు బ్లాక్ బాక్స్‌ను సొంతం చేసుకునేందుకు నిర్వహించిన టాస్క్‌లో సుదీర్ విజయం సాధించాడు. దీంతో సృష్టి తన దగ్గర ఉన్న బ్లాక్ కీని సుదీర్‌కు అందించింది. ఇక సుదీర్ చేతికి చేరిన ఈ బ్లాక్ కీతో హౌస్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.ఎలిమినేషన్లో ట్విస్ట్..ఈ ఎపిసోడ్లో హౌస్‌మేట్స్‌గా అమన్, ముకేశ్, సృష్టి, నరేశ్లన ఎంపిక చేశారు. ఇప్పటివరకు హౌస్మేట్స్కానీ సుదీర్, వర్షిణి, కృష్ణుడుని యాక్టివిటీ రూంలోకి పంపించారు. ‘ మీ ముగ్గురులో హౌస్మేట్స్ ఎవరు.. ఎలిమినేట్ ఎవరు అవుతారో అక్కడ ఉన్న డోర్స్ తెరిస్తే తెలుస్తుంది’ అని నాగార్జున వాళ్లకి తెలిపాడు. ఇక్కడ ఓ మ్యాజిక్ జరిగింది అంతా సుదీర్ ఎలిమినేట్ అవుతాడు అనుకున్నారు. కానీ ఈ ముగ్గురూ హౌస్మేట్స్గానే ఎంపికయ్యారు.ముకేశ్ కళ్లపై నాగార్జున కామెంట్ముకేశ్ కళ్లను గమనించిన నాగార్జున.. ‘నీ కళ్లు చాలా బాగున్నాయి’ అంటూ ప్రశంసించారు. దీనికి ముకేశ్ థ్యాంక్యూ చెప్పాడు. ‘మీరు చెబుతుంటే నమ్మాలని అనిపిస్తుంది’ అని అన్నాడు. వెంటనే నాగార్జున సరదాగా ‘ఏంటి.. దేబ్జానీ చెబితే అర్థం కాలేదా?’ అంటూ నవ్వించారు. దీంతో పక్కనే ఉన్న దేబ్జానీ ‘నేను నిజంగానే చెప్పా సార్’ అంటూ బదులివ్వడంతో అక్కడ నవ్వులు పూశాయి.ఇదీ చదవండి: షూటింగ్ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్సినిమా టాస్క్..కంటెస్టెంట్ల కోసం నాగార్జున సినిమా టాస్క్ నిర్వహించారు. నరేశ్‌ను రెండు టీమ్‌లుగా విభజించమని చెప్పడంతో అతడు ఏ, బీ టీమ్‌లుగా విభజించాడు. ఈ పోటీలో కృష్ణుడు టీమ్ విజయం సాధించింది. విజేతలకు స్వీట్ బాక్స్‌లను అందించారు. ఆ సమయంలో దేబ్జానీ రాత్రిపూట తనకు కాఫీ కావాలని నాగార్జునను కోరింది. అయితే కాఫీ కావాలంటే ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ చెప్పాలని నాగార్జున కండిషన్ పెట్టారు.ఇదీ చదవండి: త్రిష రాగానే ముఖం పక్కకు తిప్పుకొన్న విజయ్దేబ్జానీ తన సీక్రెట్ చెబుతూ.. తాను ఆరో తరగతి రెండుసార్లు చదవాల్సి వచ్చిందని, తొలిసారి ఆరో తరగతిలో ఫెయిల్ అయ్యానని చెప్పింది. అయితే ఈ సీక్రెట్‌తో బిగ్‌బాస్ సంతృప్తి చెందలేదని నాగార్జున చెప్పడంతో మరో సీక్రెట్ బయటపెట్టింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ముకేశ్ అంటే తనకు చాలా ఇష్టమని దేబ్జానీ చెప్పింది. ముకేశ్ అందరితో పులహారి కలుపుతాడని కానీ తన దగ్గరకు మాత్రం రావడం లేదని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఈ సీక్రెట్‌తో నాగార్జున ఆమెకు కాఫీని సాంక్షన్ చేశారు.రెండో వీకెండ్.. ప్రేక్షకుల చేతుల్లోనే!ఇక ఎపిసోడ్ చివర్లో వచ్చే వీకెండ్ ఎలా ఉండబోతుందో తెలిపే ఓ క్లిప్‌ను చూపించారు. ‘నెక్ట్స్ వీకెండ్ అంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది’ అంటూ నాగార్జున చెప్పడంతో హౌస్‌లో మరో ఆసక్తికరమైన పరిణామానికి తెరలేచినట్లైంది. అసలు వచ్చే వారం ప్రేక్షకుల చేతుల్లో ఉండబోయేది ఏంటి? ఎవరి గేమ్‌పై ఎలాంటి ప్రభావం పడనుంది? అనేది తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.ఇదీ చదవండి: బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ.. తెలుగులో త్రివిక్రమ్ ప్లానేంటి? -
ముకేశ్ చాలా ఇష్టం.. కానీ చెప్పలేకపోతున్నా: దేబ్జానీ
వీకెండ్ వచ్చిందంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో సందడి మొదలైపోతుంది. ఎందుకంటే హోస్ట్ నాగార్జున వచ్చి హౌస్‌మేట్స్‌తో ఆడుకోవడంతో పాటు వారమంతా జరిగిన సంగతుల గురించి మాట్లాడుతారు. అలా ఈ సీజన్లో తొలివారం జరిగిన చాలా విషయాల గురించి ఆదివారం మాట్లాడుకున్నారు. మిగతా వాటి సంగతేమో గానీ దేబ్జానీ, ముకేశ్ 'కళ్ల' కహానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదలైంది.(ఇదీ చదవండి: తొలివారమే రెండో ఎలిమినేషన్.. 'ఆమె'ని పంపేశారు!)మీ మనసుకు ఎవరు దగ్గరయ్యారు? ఎవరు దూరమయ్యారు? అని చెప్పాలని నాగ్ అడగ్గా.. రామ్ ప్రసాద్, నరేశ్, ముకేశ్ తోటి కంటెస్టెంట్స్ పేర్లు చెప్పారు. అయితే హౌస్‌లో వాతావరణం సీరియస్‌గా ఉండేసరికి ముకేశ్, నీ కళ్లు బాగున్నాయని నాగ్ అనడంతో అందరూ నవ్వేశారు. మీరు అన్నందుకు థ్యాంక్యూ సర్ అని ముకేశ్ అనగానే కౌంటర్ ఇచ్చిన నాగ్.. నేను అంటే ఓకే గానీ దేబ్జానీ అంటే మాత్రం ఒప్పుకోవా అని ప్రశ్నించారు.టాపిక్ తనవైపు డైవర్ట్ అయ్యేసరికి దేబ్జానీ తన మనసులో మాట బయటపెట్టింది. నాకు నిజంగా నీ కళ్లు బాగుందనిపించింది కాబట్టి చెప్పాను అని ముకేశ్‌ని చూస్తూ దేబ్జానీ చెప్పింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ముకేశ్ చాలా ఇష్టం. కానీ చెప్పలేకపోతున్నాను. ఇటు సైడ్ పులిహోర చేస్తున్నాడు. అటు సైడు కూడా చేస్తున్నాడు. నా దగ్గర రావట్లేదు సర్ అని గోముగా అడిగింది. త్వరలో దేబ్జానీ-ముకేశ్ మధ్య బంధం మొదలవుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో తొలి వీకెండ్.. ఒక్కరోజులో ఇన్ని ట్విస్టులా?) -
బిగ్‌బాస్‌లో తొలి వీకెండ్.. ఒక్కరోజులో ఇన్ని ట్విస్టులా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్-10లో తొలి వీకెండ్ ఎపిసోడ్ శనివారం గ్రాండ్‌గా సాగింది. ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చి.. కంటెస్టెంట్ల ఆటతీరును సమీక్షించారు. తప్పులు చేసినవారిని ప్రశ్నిస్తూనే.. బాగా ఆడినవారిని అభినందించారు. తనదైన పంచ్‌లు, సరదా సంభాషణలతో హౌస్‌లో నవ్వులు పూయించారు.ముందుగా కంటెస్టెంట్లతో మాట్లాడేందుకు వచ్చిన నాగార్జున కాసేపు సీరియస్‌గా కనిపించడంతో హౌస్మేట్స్ కాస్త భయపడ్డారు. ఆ తర్వాత నవ్వుతూ వారిని పలకరించారు. దీంతో ‘అలా చూడకండి సార్.. భయంగా ఉంది’ అంటూ కంటెస్టెంట్లు చెప్పగా.. నరేశ్ కూడా అదే మాట అనడంతో ‘నీకు కూడా భయం వేసిందా నరేశ్?’ అంటూ నాగార్జున నవ్వులు పూయించారు.రాంప్రసాద్, నరేశ్ రివ్యూలపై..ఇక రాంప్రసాద్, నరేశ్ కలిసి హౌస్‌లో ఎవరు ఎలా ఆడుతున్నారనే విషయంపై సరదాగా రివ్యూలు ఇచ్చారు. ఈ రివ్యూలను నాగార్జున టీవీలో వీక్షించారు. అనంతరం ఇద్దరినీ అభినందించారు. అయితే రాంప్రసాద్‌తో పోలిస్తే నరేశ్ తన అభిప్రాయాలను మరింత హార్ట్‌ఫుల్‌గా చెప్పాడని పేర్కొన్నారు.‘అసలు ఆట ఇప్పుడే మొదలైంది’అగ్నిపరీక్ష తర్వాత అసలైన మహాపరీక్ష మొదలవుతుందని బిగ్‌బాస్ ముందే చెప్పిన విషయాన్ని నాగార్జున గుర్తుచేశారు. 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా.. వారిలో కొందరు ఇప్పటికే హౌస్‌మేట్స్‌గా మారారని, మరికొందరు ఎలిమినేట్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు రిస్క్‌లో ఉన్నారని చెప్పారు. అదే సమయంలో చరణ్, చైత్రలు ఇంకా సీక్రెట్ రూమ్‌లో ఉన్నారా? అనే అనుమానం కంటెస్టెంట్లలో ఉందని గుర్తించిన నాగార్జున.. వారితో మాట్లాడించారు. దీంతో హౌస్మేట్స్ డౌట్స్‌కు క్లారిటీ ఇచ్చారు.( ఇదీ చదవండి: ప్రముఖ నటుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన రజినీకాంత్)షాలినీకి చరణ్ ధైర్యంచరణ్కు నాగార్జున ఓ ప్రత్యేక అవకాశం ఇచ్చారు. హౌస్‌లో ఉన్న ఒకరితో మాట్లాడొచ్చని చెప్పారు. దీంతో చరణ్ షాలినీతో మాట్లాడాడు. ‘నువ్వు బాగా ఆడుతున్నావు.. అలాగే ఆడు’ అంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత చైత్రకు కూడా ఇదే అవకాశం ఇచ్చారు. ఆమె ముకేశ్‌తో మాట్లాడింది. ‘నువ్వు చెప్పిన మాట విని ఉంటే బాగుండేది’ అంటూ చైత్ర చెప్పింది. అనంతరం రోహిత్ ఆటతీరుపై తన అసహనాన్ని వ్యక్తం చేసింది.ఇదీ చదవండి: ‘స్పిరిట్‘పై విమర్శలు చేసే దమ్ము ఉందా’ముగ్గురికి మిల్క్షేక్లుముగ్గురు హౌస్మేట్స్ రోహిత్, రాంప్రసాద్, టెంపర్ వంశీ బాగా ఆడుతున్నారని మెచ్చుకున్న బిగ్‌బాస్.. వారికి మిల్క్‌షేక్‌లు పంపించా. అయితే వారు తాగిన గ్లాసులను నాగార్జునే కడిగారు. దీనిపై నాగార్జున మాట్లాడుతూ.. ‘ఏ పని చిన్నది కాదు.. ఏ పని తక్కువది కాదు. అలాంటి ఆలోచన ఉంటే ఇక్కడ ఉండొద్దు’ అంటూ క్లాస్ తీసుకున్నారు. అనంతరం మిగిలిన 11 మంది ఇంకా రిస్క్‌లోనే ఉన్నారని నాగార్జున తెలిపారు. వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ప్రేక్షకుల ఓటింగ్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పారు.త్రిగుణ్, రోహిత్ తీరు అసహనం..ఆ తర్వాత ముకేశ్, త్రిగుణ్, వర్షిణిలను గార్డెన్ ఏరియాలోని పసుపు లైన్ దగ్గర నిల్చోమని బిగ్‌బాస్ ఆదేశించారు. వీరిలో ఒకరు ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం హౌస్‌మేట్‌గా మారబోతున్నారని నాగార్జున తెలిపారు. చివరికి నాలుగో హౌస్‌మేట్‌గా త్రిగుణ్ ఎంపికయ్యాడు. రోహిత్, త్రిగుణ్ ప్రవర్తనపై నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. రోహిత్‌కు క్షమాపణ చెప్పాలని త్రిగుణ్‌ను ఆదేశించారు. అంతేకాదు.. స్విమ్మింగ్ పూల్ చుట్టూ టైర్‌ను చేతితో ఎత్తుకుని తిరగాలని పనిష్మెంట్ ఇచ్చారు. ‘ఎంగిలి కప్పులు కడగాలి’ అనే మాట విషయంలోనూ రోహిత్‌కు క్షమాపణలు చెప్పాలని సూచించారు. అలాగే బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేయకపోవడంపై రోహిత్‌ను నాగార్జున ప్రశ్నించారు. ఇకపై బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లను అందరూ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమితదేబ్జానీకి నాగార్జున ప్రశంసలుహౌస్లో తెలుగులో మాట్లాడుతున్న దేబ్జానీని నాగార్జున ప్రత్యేకంగా అభినందించారు. బాగా ఆడుతున్నావంటూ ప్రశంసించారు. మరోవైపు రాంప్రసాద్ నవ్వించాలనే ప్రయత్నంలో కొన్ని పదాలు ఉపయోగిస్తున్న తీరును కంట్రోల్ చేసుకోవాలని సూచించారు. ఇకపై రాంప్రసాద్ అలా మాట్లాడకుండా చూసుకునే బాధ్యతను నరేశ్ తీసుకోవాలని సరదాగా చెప్పారు.షాలినీ చేసిన ఓ కామెంట్ నేపథ్యంలో రాంప్రసాద్‌ను అతడి మొదటి సంపాదన ఎంత అని నాగార్జున అడిగారు. దానికి రాంప్రసాద్ తన మొదటి సంపాదన రూ.500 అని చెప్పాడు. అనంతరం షాలినీకి సారీ చెప్పడం కోసం 500 సార్లు sorry అని రాయాలని రాంప్రసాద్‌కు పనిష్మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా బేబ్జానీ సరదాగా స్పందిస్తూ.. ‘నీ మొదటి సంపాదన రూ.20 అని చెప్పాల్సింది’ అంటూ నవ్వులు పూయించింది.పోటీ మరింత ఆసక్తికరంగా..ఆ తర్వాత కంటెస్టెంట్ల మనసులోని మాట తెలుసుకునేందుకు నాగార్జున ప్రయత్నించారు. మీకు నచ్చిన ఒకరి పేరు, నచ్చని ఒకరి పేరు చెప్పాలంటూ అడగడంతో ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను వెల్లడించారు. చివర్లో మరో కీలక ప్రకటన చేశారు. లాస్ట్ హౌస్‌మేట్‌గా దేబ్జానీ ఎంపికైనట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో తొలి వీకెండ్లోనే బిగ్‌బాస్ హౌస్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో రిస్క్‌లో ఉన్న వారిలో ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారు? అన్నది ఉత్కంఠగా మారింది. -
ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. ఆ ముగ్గురు ఫిదా!
బిగ్‌బాస్ సీజన్-10లో తొలి వీకెండ్ ఎపిసోడ్‌కు రంగం సిద్ధమైంది. వారమంతా హౌస్‌లో కంటెస్టెంట్ల ఆటతీరు, గొడవలు, టాస్కులతో సందడి నెలకొనగా.. వీకెండ్లో హోస్ట్ నాగార్జున ఎంట్రీతో మరింత ఆసక్తి పెరగనుంది. కంటెస్టెంట్లు చేసిన తప్పులను ప్రశ్నించడంతో పాటు.. బాగా ఆడినవారిని అభినందిస్తూ నాగార్జున తనదైన శైలిలో ఎంటర్టైన్ చేయనున్నారు.ఇదీ చదవండి: పెళ్లి ఇద్దరిదీ.. కానీ అమ్మాయిలకే ఎందుకు అలా: నమితఊహించని సర్ప్రైజ్ఈ వారం హౌస్‌లో అన్ని అంశాల్లోనూ తమ ఆటతో ఆకట్టుకున్న కంటెస్టెంట్లుగా రామ్‌ప్రసాద్, రోహిత్, వంశీలు నిలిచారు. వారి ఆటతీరును నాగార్జున ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతేకాదు.. ఈ ముగ్గురికి ఊహించని సర్ప్రైజ్ కూడా ఇచ్చారు.వారు తాగిన మిల్క్‌షేక్ గ్లాసులను స్వయంగా నాగార్జున కడగడం ఆసక్తికరంగా మారింది. కంటెస్టెంట్లను ప్రోత్సహించేలా ఆయన చేసిన ఈ పని చూసి హౌస్మేట్స్ కూడా ఆశ్చర్యపోయారు. దీంతో తొలి వీకెండ్ ఎపిసోడ్లో రామ్‌ప్రసాద్, రోహిత్, వంశీలకు నాగార్జున ఇచ్చిన ఈ ప్రత్యేక గౌరవం హైలైట్‌గా నిలిచింది. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్
బిగ్‌బాస్ సీజన్10లో అగ్ని పరీక్ష తర్వాత మొదలవుతుంది అసలైన మహాపరీక్ష అని ముందే చెప్పినట్టుగానే బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడు అసలు ఆట మొదలైంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా.. కేవలం ముగ్గురు మాత్రమే హౌస్‌మేట్స్‌గా మారారు. మరో ఇద్దరు ఈ వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు రిస్క్‌లో కొనసాగుతున్నారు.ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. వెంకటేశ్ కామెడీ అదిరింది!అయితే ఎలిమినేట్ అయిన ఇద్దరినీ బిగ్‌బాస్ ఇంకా సీక్రెట్ రూమ్‌లోనే ఉంచాడని పలువురు కంటెస్టెంట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జున.. చరణ్, చైత్రలతో ఫోన్లో మాట్లాడి.. వాళ్లు తమ ఇంటి దగ్గరే ఉన్నారని కన్ఫామ్ చేయించారు. దీంతో ఇక ఎలిమినేషన్ విషయంలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని వారికి క్లారిటీ ఇచ్చారు. కంటెస్టెంట్లకు గట్టి వార్నింగ్..ఈ క్రమంలో నాగార్జున కూడాడఇచ్చాడు. ఆటలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా.. దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు. గేమ్‌లో ఎవరు నిర్లక్ష్యం చేసినా హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశాడు. దీంతో 11 మంది రిస్క్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరు తమ గేమ్‌ను మరింత పదును పెడతారో చూడాలి. -
బిగ్‌బాస్ 10: చైత్ర షాకింగ్ ఎలిమినేషన్.. అసలేంటి ట్విస్టులు?
సాధారణంగా బిగ్‌బాస్‌లో ఏ సీజన్ అయినా సరే ప్రారంభంలో కాస్త నిదానంగా ఉంటుంది. ఒకటి రెండు వారాలు పూర్తయిన తర్వాత గొడవలు, ఎలిమినేషన్లతో హీట్ పెరుగుతుంది. కానీ రీసెంట్గా మొదలైన తెలుగు బిగ్‌బాస్ 10లో ఊహించని ట్విస్టులు షాకిస్తున్నాయి. ఇంతకీ ఐదో రోజైన శుక్రవారం(సెప్టెంబరు 11) అసలేం జరిగింది?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు)సింపుల్.. టఫ్ టాస్క్చరణ్ ఎలిమినేట్ కావడంతో గురువారం ఎపిసోడ్ పూర్తయింది. తమ స్నేహితుడు ఇలా అర్థాంతరంగా హౌస్ వీడి బయటకెళ్లిపోయేసరికి సృష్టి బాధపడింది. మరోవైపు ఝాన్సీ గేమ్ గురించి మాట్లాడుకున్న అమన్, రోహిత్, సృష్టి, షాలిని.. మనతో ఉంటే వాళ్లు టార్గెట్ చేస్తారని తెలివిగా ఆమె వాళ్ల వైపు వెళ్లిపోయిందని అనుకున్నారు. కట్ చేస్తే సులభమైన టాస్క్ కోసం ఏడుగురు, కష్టమైన టాస్క్ కోసం ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని బిగ్‌బాస్ చెప్పాడు. త్రిగుణ్, ముఖేశ్, కృష్ణుడు మేం ఆడమని చెప్పేయగా.. హై రిస్క్‌లో ఉన్న కారణంగా చైత్రని ఆడొద్దని ఆదేశించాడు. దీంతో మిగతావాళ్లంతా మాట్లాడుకుని సుధీర్, వర్షిణిని కష్టమైన టాస్క్ కోసం.. రాంప్రసాద్, ఝాన్సీ, నరేశ్, సృష్టి, అమన్, షాలిని, దేబ్జానీ సింపుల్ టాస్క్‌కి సెలక్ట్ అయ్యారు.ట్రయాంగిల్ లవ్ స్టోరీ?రోహిత్ తనతో మాట్లాడటం లేదని సృష్టి, అమన్‌తో చెప్పేసరికి.. ఇతడీ విషయం రోహిత్‌కి చెబుతాడు. దీంతో రోహిత్ వెళ్లి సృష్టితో మాట్లాడతాడు. ఇదంతా చూసిన షాలిని.. తన వల్లే సృష్టికి రోహిత్ దూరమైపోతున్నాడేమోనని తెగ బాధపడిపోయింది. ఇదంతా చూస్తుంటే వీళ్ల ముగ్గురి మధ్య లవ్ స్టోరీ లాంటిది ఏమైనా మొదలవుతుందేమోనని అనిపిస్తోంది. మరోవైపు కర్చీఫ్ వేసి పరుగెత్తి వచ్చి కూర్చునే సింపుల్ టాస్క్‌లో రాంప్రసాద్ విజేతగా నిలిచాడు. గేమ్‌లో గెలిచినందుకు ఒకరిని హై రిస్క్‌లో పెట్టాలని అనగా అమన్ పేరు చెప్పుకొచ్చాడు.సుధీర్-వర్షిణి దొందుకు దొందేకష్టమైన టాస్క్ కోసం ఎంపికైన సుధీర్, వర్షిణిని లోపలికి పిలిచిన బిగ్‌బాస్.. ఓ కేక్ స్మాష్ చేసి దీనిని ఒకరు చేశారంటే మరొకరు చేశారని కంటెస్టెంట్స్ అందరినీ నమ్మించాలని.. ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్లు సేవ్ అవుతారని అన్నాడు. అయితే ఈ టాస్క్ సరిగా ఆడలేక లోపల జరిగిన విషయాన్ని వర్షిణి, ముకేశ్‌కి చెప్పేయడంతో గేమ్ ఆడిన సుధీర్, వర్షిణి ఇద్దరూ కూడా హై రిస్క్ జోన్లోకి వెళ్లారని బిగ్‌బాస్ అల్టిమేటం జారీ చేశాడు.చైత్ర ఎలిమినేట్ఇక మహాపరీక్షలో భాగంగా హై రిస్క్‌లోకి వచ్చిన చైత్ర, వర్షిణి, సుధీర్, అమన్లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పిన బిగ్‌బాస్.. నలుగురూ మిగిలిన వాళ్లలో ఒక్కొక్కరికి ఓటు వేయాలని చెప్పాడు. దీంతో వర్షిణి, చైత్ర పేరు.. అమన్ కూడా చైత్ర పేరు.. సుధీర్ కూడా చైత్ర పేరు చెప్పాడు. ఇక చైత్ర, సుధీర్ ఎలిమినేట్ అవ్వాలని చెప్పింది. చైత్రకు మూడు ఓట్లు వచ్చినందుకు చైత్ర ఎలిమినేట్ అయింది. ఏంటి బిగ్‌బాస్ ఇది నాలుగు రోజుల్లో ఇద్దరినీ తీసుకెళ్లిపోతారా అని రాంప్రసాద్ కామెడీ చేశాడు. ఇలా ఐదోరోజు ఎపిసోడ్ ముగిసింది. వారం కాకుండానే ఇద్దరిని ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్.. వీకెండ్లో ఇంకెలాంటి ట్విస్టులు ఇస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: కృష్ణాష్టమి రోజున శుభవార్త.. బిగ్‌బాస్ జంటకు మరో కూతురు) -
తొలివారమే రెండో ఎలిమినేషన్.. 'ఆమె'ని పంపేశారు!
తెలుగు బిగ్‌బాస్ 10వ సీజన్ మొదలై నాలుగు రోజులే అయింది. ఇంతలోనే ఓవైపు గొడవలతో హౌస్ హీటెక్కిపోతుంటే మరోవైపు వరస ఎలిమినేషన్లు షాకిస్తున్నాయి. సామాన్యుల కోసం పెట్టిన అగ్నిపరీక్ష పోటీలో గెలిచి ఆదివారం హౌస్‌లోకి అడుగుపెట్టిన చరణ్.. గురువారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోయాడు. ఇదలా ఉండగానే లేడీ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయిందనే విషయం హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: వీకెండ్ ధమాకా.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు)ఈసారి 16 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీళ్లలో 10 మంది సెలబ్రిటీలు కాగా మిగిలిన 6గురు అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కామనర్స్. వీళ్లని ప్రస్తుతం బ్లూ, రెడ్ టీమ్స్‌గా విభజించి గేమ్స్ పెడుతున్న బిగ్‌బాస్.. అలా హై రిస్క్ జోన్లోకి వచ్చి తక్కువ ఓట్లు పొందిన చరణ్‌ని బయటకు సాగనంపేశాడు. తాజా ఎపిసోడ్లో భాగంగా హై రిస్క్ జోన్లోకి కామరన్స్ నుంచి అమన్.. సెలబ్రిటీల నుంచి సుధీర్, చైత్ర వచ్చినట్లు తెలుస్తోంది.వీళ్ల ముగ్గురిలో ఈసారి సీరియల్ నటి చైత్రకు తక్కువ మంది సపోర్ట్ చేయడంతో ఈమె ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఇక్కడ ఎలిమినేషన్ అంటే పూర్తిగా బయటకొచ్చేసినట్లు కాదు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఇవ్వబోతున్న బిగ్‌బాస్.. మిడ్ వీక్ బయటకొచ్చిన చరణ్, చైత్రని మళ్లీ హౌస్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. తర్వాత వీళ్లిద్దరి మధ్య పోటీపెట్టి వీళ్లలో ఒకరిని ఈ ఆదివారం నిజంగానే ఎలిమినేట్ చేయనున్నారు. మరి ఆ దురదృష్టవంతులు ఎవరనేది చూడాలి?(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు) -
బిగ్‌బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు
బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ మొదలై నాలుగు రోజులు అయిపోయింది. మహాపరీక్ష పేరుతో ఇప్పటికే హోరాహోరీ పోటీ నడుస్తోంది. మరి నాలుగో రోజైన గురువారం(సెప్టెంబరు 10) ఎపిసోడ్లో అసలేం జరిగింది? ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకున్నాయి. మిడ్ వీక్‌లోనే చరణ్ ఎలిమినేట్ అయిపోవడం, అతడి చివరి మాటలు ఎలా సాగాయనేది ఈ హైలైట్స్‌లో చూద్దాం.బ్లాక్ షీప్ ఎవరు?మహాపరీక్ష పేరుతో జరుగుతున్న పోటీ కోసం కంటెస్టెంట్స్ బ్లూ, రెడీ టీమ్స్‌గా విడిపోయారు. తాజా ఎపిసోడ్లో చెరో బృందం నుంచి ఇద్దరిని నిల్చోమని బిగ్‌బాస్ చెప్పగా బ్లూ టీమ్ నుంచి త్రిగుణ్, ముఖేశ్.. రెడ్ టీమ్ నుంచి రోహిత్, వంశీ వచ్చారు. మీ టీమ్‌లో మీరు ఎవరిని హై రిస్క్‌లో పెట్టాలనుకుంటున్నారో చెప్పమని అడగడంతో.. త్రిగుణ్, ముఖేశ్... కృష్ణుడిని, రోహిత్, వంశీ.. చైత్ర పేరు చెప్పారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని చెప్పిన బిగ్‌బాస్.. ఈ నలుగురు కంటెస్టెంట్స్‌ని బయటకు పంపి 'హూ ఈజ్ ది బ్లాక్ షిప్' గేమ్ ఆడించారు. ఇందులో బ్లూ టీమ్ గెలిచింది.షాలినీ- చైత్ర మాటల వార్అయితే ఈ గేమ్‌లో బ్లూ టీమ్ సరిగా ఆడలేదని రెడ్ టీమ్‌కి చెందిన రోహిత్ ప్రశ్నించగా.. కృష్ణుడి పేరు బ్లూ టీమ్ సరిగా రాయకపోవడంతో ఓడిపోయారు. చైత్ర పేరుని రెడ్ టీమ్ సరిగా రాసి టాస్క్‌లో గెలిచారు. అలా రోహిత్, వంశీ పర్మినెంట్ హౌస్మెట్స్ అయిపోయారు. ఈ సందర్భంగా షాలినీ.. ఏదైనా పాట పెట్టమని బిగ్‌బాస్‌ని అడిగింది. చైత్ర ఓవైపు హై రిస్క్‌లో ఉంటే డ్యాన్సులు కావాలా అని రాంప్రసాద్ అడగడంతో షాలినీ-చైత్ర మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. ఇద్దరూ మాటమాట అనుకున్నారు. చివరకు షాలిని ఏడ్చేసింది. దీంతో అంతా వెళ్లి ఆమెని ఓదార్చారు.త్రిగుణ్ వర్సెస్ రోహిత్కిచెన్లో గిన్నెలు తోమలేదని త్రిగుణ్‌ని రోహిత్ పిలిచి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా ఒకరికిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. అగ్రిపరీక్ష నుంచి చీప్‌గా వచ్చేశారు, నీ బాడీ మొత్తం మత్తు పదార్ధాలతో తయారైంది అని త్రిగుణ్, రోహిత్‌ని తక్కువ చేసి మాట్లాడాడు. రోహిత్‌ని డొల్లరాజా డొల్లరాజా అని పాట కూడా పాడి త్రిగుణ్ ఉడికించాడు.చరణ్ ఎలిమినేట్హై రిస్క్‌లో ఉన్న రాంప్రసాద్, చైత్ర, చరణ్‌ని పిలిచిన బిగ్‌బాస్.. ముగ్గురు మాట్లాడుకొని ఒకరు నామినేట్ అవ్వకుండా హై రిస్క్‌లో ఉంటూనే ఇంట్లో ఉంటారు అది ఎవరో మీరు నిర్ణయించుకోండి అని ఆదేశిస్తాడు. దీంతో చైత్ర లోపల ఉండాలని చరణ్.. రాం ప్రసాద్ లోపల ఉండాలని చైత్ర.. చైత్ర ఉండాలని రాం ప్రసాద్ చెప్పారు. దీంతో చైత్ర ఇంట్లోకి వెళ్లిపోయింది. మిగిలిన రాంప్రసాద్, చరణ్‌లో ఎవరు ఇంట్లో ఉండకూడదో వాళ్ల ముఖంపై పెయింట్ పూసి చెప్పాలని బిగ్‌బాస్.. మిగిలిన కంటెస్టెంట్స్‌ని ఆదేశించాడు. ఈ ప్రొసెస్‌లో తక్కువ ఓట్లు పడిన చరణ్.. మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యాడు.కన్నీళ్లు తెప్పించిన చరణ్ఎలిమినేట్ అయిన తర్వాత మాట్లాడిన చరణ్ తెగ ఎమోషనల్ అయిపోయాడు. నేను వెళ్లిపోతానని కాదు గానీ జరిగింది నాకు నచ్చలేదు. నలుగురు అగ్నిపరీక్ష వాళ్లు నాకు ఓటేశారు. ఝాన్సీ నాకు ఓటు వేయలేదు. థ్యాంక్స్ ఇది గ్రూప్ గేమ్ కాదని నిరూపించినందుకు. నన్ను రాంప్రసాద్ అన్నని కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ అందరికీ నేను కొంచెం తక్కువగా కనిపిస్తా. మా టీమ్ నా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు. వాళ్లు నన్ను బలి పశువుని చేయలేదు అని భావోద్వేగానికి గురయ్యాడు. అలా నాలుగో రోజు ఆట ముగిసింది. -
Bigg Boss 10: రోహిత్ కళ్లు నెత్తికెక్కాయి...అతన్ని కిందకు దింపాలి.. వర్షిణి ఫైర్
బిగ్‌బాస్ 10 రెండో రోజు ఆట రసవత్తరంగా సాగింది. ‘మహాపరీక్ష’లో భాగంగా ఇంటిసభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కూల్‌గా, కామ్‌గా ఉంటాడనుకున్న కృష్ణుడు ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. మరోవైపు రోహిత్‌పై యాంకర్ వర్షిణి చేసిన సంచలన వ్యాఖ్యలు హౌస్‌లో హీట్ పెంచాయి. ఇక సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే బ్యాగ్ టాస్క్ నుంచి నామినేషన్స్, ప్రొటెక్టివ్ బాస్ టాస్క్ వరకు మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.సైన్యం కోసం బ్యాగ్ టాస్క్హౌస్మేట్స్ అంతా కలిసి తమ లీడర్లుగా రామ్‌ప్రసాద్, రోహిత్‌లను ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన 12 మంది ఇంటిసభ్యులకు నాయకులకు సైన్యంగా నిలబడేందుకు బిగ్‌బాస్ ఓ బ్యాగ్ టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో కొన్ని బ్యాగ్‌లను ఉంచి.. వాటిలో ఉన్న బ్యాడ్జ్‌ల ఆధారంగా సైనికులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. బ్యాగ్ అందుకున్న సైనికుడు దాన్ని తన నాయకుడికి ఇవ్వాలి. ఆ బ్యాగ్‌లో ఉన్న బ్యాడ్జ్‌ల ఆధారంగా నాయకులు తమ టీమ్‌లోకి సభ్యులను తీసుకోవాల్సి ఉంటుంది.మొదట ముఖేష్ గౌడ బ్యాగ్ తీసుకుని రామ్‌ప్రసాద్‌కు ఇవ్వగా.. అందులోని తొలి బ్లూ బ్యాడ్జ్‌ను త్రిగుణ్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత రోహిత్ అమన్‌కు రెడ్ బ్యాడ్జ్ ఇచ్చాడు. అనంతరం టెంపర్ వంశీకి మరో రెడ్ బ్యాడ్జ్ ఇచ్చి తన టీమ్‌లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత శాలినిని కూడా తన జట్టులోకి తీసుకున్నాడు. అలా రామ్ ప్రసాద్.. త్రిగుణ్, ముఖేష్, సుధీర్, నరేష్, దేబ్జాని, చరణ్, వర్షిణి, చైత్రతో.. రోహిత్.. వంశీ, శాలిని, వంశీ, సృష్టి, ఝాన్సీ, కృష్ణుడుతో టీమ్స్‌ని ఫామ్ చేసుకున్నారు. అయితే వర్షిణిని రాంప్రసాద్ ముందుగా తన టీమ్‌లోకి తీసుకోలేదు. రోహిత్ తనకున్న ఆప్షన్‌తో ఆమెను రాంప్రసాద్ టీమ్‌లోకి పంపాడు. దీంతో వర్షిణి..రాంప్రసాద్ పై అలక పూనింది. ‘నన్ను ఎందుకు పిక్ చేసుకోలేదు? నాకెందుకు బ్యాడ్జ్ ఇవ్వలేదు?’ అని అతన్ని నిలదీసింది.దీనికి రామ్‌ప్రసాద్ స్పందిస్తూ.. ‘రోహిత్ నిన్ను ఖచ్చితంగా తీసుకోడు అనే నమ్మకం ఉంది. అందుకే నిన్ను చివరి వరకు తీసుకోలేదు’ అని చెప్పాడు.గ్రూప్ గేమ్‌పై వర్షిణి, చరణ్ మధ్య డిస్కషన్ఇక వర్షిణి, ఆర్జే చరణ్ మధ్య గ్రూప్ గేమ్ అంశంపై చర్చ జరిగింది. ‘గ్రూప్’ అని అనడం తనకు నచ్చలేదని చరణ్ చెప్పగా.. ‘గ్రూప్‌గా ఆడుతున్నప్పుడు గ్రూప్ గేమ్ అనకపోతే ఏమంటాం?’ అంటూ వర్షిణి రివర్స్ కౌంటర్ ఇచ్చింది.అంతేకాదు.. ‘మీరంతా కలిసే ఉంటున్నారు. కానీ మీతో ఝాన్సీ ఎందుకు కలవడం లేదు?’ అని చరణ్‌ను ప్రశ్నించింది. దీనికి చరణ్ తనకు అలా అనిపించడం లేదని చెప్పగా.. ‘నాకు కనిపిస్తుంది’ అంటూ వర్షిణి తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది.రోహిత్ తోపులా ఫీలవుతున్నాడుఅనంతరం బిగ్‌బాస్ బ్లూ టీమ్ సభ్యులకు ఓ కీలక టాస్క్ ఇచ్చాడు. ఇంటిసభ్యులుగా ఉండేందుకు అనర్హులు అనిపించే ఒక్కొక్కరి పేరును చెప్పాలని సూచించాడు.ఈ సందర్భంగా వర్షిణి అనూహ్యంగా రోహిత్ పేరును చెప్పింది. అంతేకాదు.. అతని గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అగ్నిపరీక్షలో రోహిత్‌ను చూసినప్పుడు అతనితో మంచి వైబ్ ఉంటుందని అనుకున్నానని చెప్పింది. కానీ హౌస్‌లోకి వచ్చిన తర్వాత అతని యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయిందని విమర్శించింది. రోహిత్ తనను తాను పెద్ద తోపులా ఫీల్ అవుతున్నాడని.. ‘నా అంతటోడు లేడు, నేనే పెద్ద దేవుడ్ని’ అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడని వ్యాఖ్యానించింది. అతను గేమ్‌లో ఓడిపోయినప్పటికీ.. తన తప్పును అంగీకరించకుండా ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేశాడని ఆరోపించింది. అంతేకాదు.. త్రిగుణ్ ‘గ్రూప్’ అని అనగానే రోహిత్ ట్రిగ్గర్ అయ్యాడని వర్షిణి చెప్పింది. ‘దొంగను దొంగ అంటే ఎంత కోపం వస్తుందో.. సార్గారిని గ్రూప్ అనగానే అంత కోపం వచ్చింది. అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చేలోపే రోహిత్ కళ్లు నెత్తికెక్కాయి. అది రియాలిటీ కాదు. అతనికి రియాలిటీ ఏంటో తెలియాలి. అతన్ని కిందకు దింపాలి’ అంటూ కాస్త సీరియస్‌గానే మాట్లాడింది.రోహిత్‌పై కృష్ణుడు ఫైర్..ఆ తర్వాత నామినేషన్ బాధ్యత రెడ్ టీమ్‌కు వచ్చింది. బ్లూ టీమ్ సభ్యుల్లో హౌస్‌మేట్స్‌గా మారేందుకు ఎవరు అనర్హులో చెప్పే బాధ్యతను బిగ్‌బాస్ రోహిత్‌కు అప్పగించాడు.రోహిత్ వరుసగా కృష్ణుడు, రామ్‌ప్రసాద్, వర్షిణి, త్రిగుణ్, దేబ్జానిలను అనర్హులుగా ప్రకటించాడు. దీంతో కృష్ణుడు రోహిత్‌పై ఫైర్ అయ్యాడు. ‘కీ తనకు ఇచ్చారని కుళ్లుబోతుతనం.. సుపీరియారిటీ కాంప్లెక్స్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అయితే రోహిత్ మాత్రం నవ్వుతూ నిలబడిపోయాడు. రామ్‌ప్రసాద్, వర్షిణి సైతం రోహిత్‌పై మండిపడ్డారు.‘ప్రొటెక్టివ్ బాస్’ టాస్క్‌లో ఫౌల్ గేమ్ఆ తర్వాత నామినేట్ అయిన పది మంది సభ్యులకు బిగ్‌బాస్ ‘ప్రొటెక్టివ్ బాస్’ టాస్క్ ఇచ్చాడు. ఇందులో డిఫెండర్లను కిల్ చేస్తూ బాస్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. మొదటి రౌండ్లో బ్లూ టీమ్ అటాకర్స్‌గా, రెడ్ టీమ్ డిఫెండర్స్‌గా టాస్క్ ప్రారంభమైంది. ఈ క్రమంలో త్రిగుణ్ ఫౌల్ గేమ్ ఆడాడని రోహిత్ ఆరోపించాడు. మొత్తంగా చూస్తే బిగ్‌బాస్ 10 రెండో రోజు ఎపిసోడ్లో మాటల యుద్ధం మాత్రం బాగానే కనిపించింది. ముఖ్యంగా రోహిత్‌పై వర్షిణి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కృష్ణుడు కూడా ఊహించని విధంగా ఫైర్ అవుతూ కనిపించాడు.అయితే టాస్క్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎపిసోడ్లో పెద్దగా పస లేదనిపించింది. -
Bigg Boss: సింగిల్ బెడ్ కోసం తౌకీర్ తోలు తీసిన మేరీ కోమ్
బిగ్‌బాస్(హిందీ) 20వ సీజన్ ప్రారంభమైంది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ సీజన్లో నటులు, గాయకులు, ఇన్ఫ్లుయెన్సర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్, గాయకుడు ఖాజీ తౌకీర్ కూడా పోటీదారులుగా ఉన్నారు. తొలి రోజే ఇంట్లో వాదోపవాదాలు మొదలయ్యాయి.సింగిల్ బెడ్ కోసం పోటీరియాలిటీ టీవీలోకి తొలిసారి అడుగుపెట్టిన మేరీ కోమ్.. మొదటి రోజే తన ఉనికిని చాటుకున్నారు. బిగ్‌బాస్ ఇంట్లో సింగిల్, డబుల్ బెడ్లు ఉన్నాయి. ఒక సింగిల్ బెడ్ విషయంలో మేరీ కోమ్, ఖాజీ తౌకీర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వయసు, క్రీడా రంగంలో తనకున్న గుర్తింపు దృష్ట్యా సింగిల్ బెడ్ తనకే ఇవ్వాలని మేరీ వాదించినట్లు సమాచారం. వెన్నునొప్పి ఉందని, ఒంటరిగా పడుకుంటే సౌకర్యంగా ఉంటుందని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది.ఖాజీ మాత్రం వెనక్కి తగ్గలేదుఅయితే ఖాజీ తౌకీర్ ఆ బెడ్‌ను వదులుకోవడానికి నిరాకరించారు. మరో బెడ్‌ను ఎంచుకోవాలని మేరీకి సూచించినట్లు సమాచారం. డబుల్ బెడ్‌ను మరో పోటీదారుతో పంచుకోవడం తనకు ఇబ్బందిగా ఉంటుందని ఆయన వివరించినట్లు తెలుస్తోంది.చర్చలోకి అరిష్ఫా ఖాన్వీరి మధ్య జరిగిన వాగ్వాదం ఇతర హౌస్మేట్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా తనను తాను లెజెండ్‌గా పేర్కొంటూ సింగిల్ బెడ్ ఎందుకు కావాలో మేరీ వివరించినట్లు సమాచారం. అందరికీ సమానంగా వ్యవహరించాల్సిందేనని అరిష్ఫా ఖాన్ స్పందించారు. ఈ చర్చ ప్రీమియర్ ఎపిసోడ్లో ప్రధాన అంశంగా మారింది.‘నువ్వు నా శత్రువు’చివరకు ఖాజీ సింగిల్ బెడ్‌ను వదులుకోలేదు. దీంతో మేరీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్తూ.. ‘నాకు నువ్వంటే ఇష్టం లేదు.. నువ్వు నా శత్రువు’ అని ఖాజీతో చెప్పినట్లు సమాచారం. సరదాగా సాగిన ఈ వాగ్వాదం తొలి ఎపిసోడ్లో మరింత ఆసక్తిని పెంచింది.తొలి రోజే మొదలైన రచ్చబిగ్బాస్ ఇంట్లో క్రమశిక్షణ, పోటీ తత్వాన్ని తీసుకురావాలని మేరీ గతంలో చెప్పిన నేపథ్యంలో తొలి రోజే జరిగిన ఈ ఘటన ఆసక్తి రేపుతోంది. సెప్టెంబరు 6, 2026న ప్రారంభమైన బిగ్‌బాస్ 20లో మేరీ కోమ్, ఖాజీ తౌకీర్, అమ్రపాలి దూబే, మహి విజ్, అరిష్ఫా ఖాన్, ఆసిఫ్ ఖాన్, కనికా మాన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ బెడ్ వివాదం శాశ్వత వైరంగా మారుతుందా? లేక సీజన్ ఆరంభంలో చోటుచేసుకున్న ఓ గుర్తుండిపోయే ఘటనగానే మిగిలిపోతుందా అనేది చూడాలి. ఇది కూడా చదవండి: పేరులో తేడా.. పద్మశ్రీకి గ్రహీతకూ ‘సర్’ నోటీసు! -
కృష్ణాష్టమి రోజున శుభవార్త.. బిగ్‌బాస్ జంటకు మరో కూతురు
బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి షోలో ఎవరెవరు పాల్గొంటారా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే పెద్దగా బజ్ కనిపించట్లేదు. సరే ఈ సంగతి అలా వదిలేస్తే గతంలో ఇదే బిగ్‌బాస్‌లో రియల్ లైఫ్ జోడీ ఇప్పుడు మరోసారి తల్లిదండ్రులయ్యారు. తమకు కృష్ణాష్టమి రోజున మరోసారి కూతురు పుట్టిందనే శుభవార్తని సోషల్ మీడియాలో పంచుకున్నారు.(ఇదీ చదవండి: నడుము గిల్లే సీన్ చేయనంది.. 'బేబి' చూసి షాకయ్యా)'అమెరికా అమ్మాయి' సీరియల్‌తో తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయమైన మెరీనా.. తర్వాత కాలంలో మరో సీరియల్ నటుడు రోహిత్ సాహ్నిని ప్రేమించింది. అలా పెద్దల్ని ఒప్పించి వీళ్లిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నాడు. రోహిత్ కూడా పలు సినిమాలు, సీరియల్స్ చేశాడు. ప్రస్తుతం 'అమ్మోరు' అనే సీరియల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే 2022లో వీళ్లిద్దరూ జంటగా బిగ్‌బాస్ షోలో పాల్గొన్నారు.మెరీనా కొన్ని వారాలు ఉండి ఎలిమినేట్ కాగా రోహిత్ మాత్రం టాప్-5 వరకు వెళ్లాడు. ఇకపోతే 2024 నవంబరులో వీళ్లకు తొలుత ఓ అమ్మాయి పుట్టింది. ఆమెకు తయిరా అని పేరు పెట్టుకున్నారు. గతేడాది జన్మాష్టమి సందర్భంగా పాపని అందరికీ పరిచయం చేశారు. ఇప్పుడు ఏడాది తిరిగేసరికల్లా మరోసారి తమకు కూతురు పుట్టిందనే సంగతిని రోహిత్-మెరీనా బయటపెట్టారు. దీంతో తోటి నటీనటులు, నెటిజన్లు వీళ్లకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: 9 ఏళ్ల వయసులో 'భరతనాట్యం'.. శ్రీలీల చిన్నప్పటి వీడియో వైరల్) View this post on Instagram A post shared by Rohit Sahni (@rohitsahniofficial) -
ప్లీజ్.. దయచేసి నన్ను తీసుకోండి: ఉప్పల్ బాలు రిక్వెస్ట్
బుల్లితెర ప్రియుల రియాలిటీ షో బిగ్‌బాస్ షో కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మెగా రియాలిటీ వచ్చేనెలలో ప్రారంభ కానుంది. ఇప్పటికే ప్రోమోలు రిలీజ్ చేసిన మేకర్స్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉండనుందని క్లారిటీ ఇచ్చేశారు. ఈ షోలో పాల్గొనే వారికోసం అగ్నిపరీక్ష పేరుతో కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేస్తున్నారు. ఈ ఫైనల్ పోటీకి 15మందిని ఎంపిక చేశారు.అయితే అగ్నిపరీక్షలో ఎలిమినేట్ అయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ ఉప్పల్ బాలు జడ్జిలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా నవదీప్ తనను అవమానించాడని వాపోయారు. తన వీడియోలు వల్గర్‌గా ఉంటాయని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎంపిక చేయనందుకు జడ్జిలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశాడు. తాజాగా ఉప్పల్ బాలు మరో వీడియో రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు విమర్శలు చేసిన ఉప్పల్ బాలు.. తాజాగా బిగ్‌బాస్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. దయచేసి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కనీసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయినా తనను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించాలని నాగార్జునతో పాటు మాటీవీని కోరారు. ఇది నా లాస్ట్ వీడియో అని.. తనకు అవకాశమిస్తే తప్పకుండా ఈ షో రేటింగ్ కూడా పెరుగుతుందని అన్నారు. నేను బిగ్‌బాస్ వెళ్లాలని నా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారని విజ్ఞప్తి చేశాడు. ఏ టాస్క్ ఇచ్చినా ఆడతానని.. ఫుల్ కామెడీ చేస్తానని ఉప్పల్ బాలు వేడుకుంటున్నారు. View this post on Instagram A post shared by uppal balu (@uppalbaluofficial) -
అలాంటి వాళ్లు 'బిగ్‌బాస్'కి రావొద్దు: నవదీప్
ప్రస్తుతం 'బిగ్‌బాస్' అగ్నిపరీక్ష షో ప్రసారమవుతోంది. అయితే దీని జడ్జిల్లో ఒకటైన నవదీప్ తనని అవమానించాడని ఉప్పల్ బాలు అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వరస పెట్టి వీడియోలు చేస్తున్నాడు. తన చావుకు నవదీప్ కారణమని చెబుతున్నాడు. సోషల్ మీడియాలో అందరూ బాలుకి సపోర్ట్ చేస్తూ నవదీప్ తీరుని విమర్శిస్తున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు నవదీప్ స్పందించాడు. ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసి అందరి కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' మొదలవకముందే నెగిటివిటీ.. జడ్జిలనే తిడుతూ వీడియోలు)'బిగ్‌బాస్ అనేది సమాజాన్ని ప్రభావితం చేసే ఓ షో. 100 మంది రకరకాల మనస్తతత్వాల మధ్య బ్రతుకుతున్నప్పుడు ఆ మాటలని ఎలా తీసుకుంటాం, ఎలా కంట్రోల్ చేసుకుంటామనేదే పాయింట్. దానిని పరీక్షించడానికే మమ్మల్ని జడ్జిలుగా పెట్టారు. వచ్చిన కంటెస్టెంట్లకు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్‌పై ఎలా స్పందిస్తారు అనేది చూసేందుకే వాళ్ల సహనాన్ని పరీక్షిస్తాం. కంటెస్టెంట్ స్పందన ఎలా అయినా ఉండొచ్చు. జడ్జిగా వెళ్లే ముందే నాకు ఆ విషయం తెలుసు. హారర్ సినిమాకు వచ్చి బయపెట్టొద్దు అంటే ఎలా? ఎవరు ఎన్ని మాటలు అన్నా తట్టుకుని నిలబడాలనేదే ఈ కాన్సెప్ట్. 'అగ్నిపరీక్ష' అంటేనే ట్రిగర్ చేయడం. నా లాంటి వాళ్లు ఎన్ని మాట్లాడినా తట్టుకుని నిలబడే శక్తి ఉందా? ఉంటేనే రండి. అగ్నిపరీక్ష డిజైన్ చేసిందే దానికోసం. అలా తట్టుకుని నిలబడేవాళ్లే షోకు రండి లేదంటే రావొద్దు' అని నవదీప్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ రూ.35 లక్షలు.. కానీ నన్ను మోసం చేశారు: పల్లవి ప్రశాంత్) View this post on Instagram A post shared by Nav Deep 2.0 (@pnavdeep) -
బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ రూ.35 లక్షలు.. కానీ నన్ను మోసం చేశారు!
తెలుగు రియాలిటీ షోల్లో బిగ్‌బాస్ ఒకటి. ఇప్పటివరకు 9 సీజన్లు జరగ్గా 7వ సీజన్ విజేతగా రైతుబిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే తను గెలుచుకున్న డబ్బుని రైతులకు పంచుతానని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చాడు. తీరా చూస్తే అలాంటిదేం చేయలేదు. అసలు ఏమైంది అని లేటెస్ట్ ఇంటర్వ్యూలో అడిగితే షో నిర్వహకులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రైజ్‌మనీ, కారు, నెక్లెస్ అని చెప్పి తనని మోసం చేశారని చెప్పుకొచ్చాడు. సంచలన విషయాలని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: అగ్నిపరీక్షలో రైతుబిడ్డ.. సింగర్ మాత్రమే కాదు అంతకుమించి)'నేను గెలుచుకున్న ప్రైజ్‌మనీ నా దగ్గరకు రావడానికి టైమ్ పట్టింది. కొందరు తెలియక నన్ను తిడుతూనే ఉన్నారు. దీంతో అసలు వీళ్లకు ఏం తెలుసు అని నేను బాధపడ్డా. కొన్నిరోజుల తర్వాత డబ్బు వచ్చింది. రూ.35 లక్షల్లో 40 శాతం జీఎస్టీ కట్ అయింది. కారు గిఫ్ట్ అని చెప్పారు కానీ అక్కడికి వెళ్లగానే రూ.8.5 లక్షలు కట్ చేశారు. డబ్బులిస్తేనే తీస్కో లేదంటే ఇది ఇక్కడే ఉంటదని అన్నారు. మరి కారుకి డబ్బులు ఎందులో నుంచి ఇవ్వాలి? నెక్లెస్ విషయానికొస్తే టీమ్ గిఫ్ట్ అన్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత రూ.5 లక్షల కట్టాలని చెప్పారు. గిఫ్ట్ ట్యాక్స్ ఇలానే ఉంటుందన్నారు. ఏందన్నా ఇదంతా అని అడిగితే.. రూల్స్ రూల్సే అని చెప్పారు' అని పల్లవి ప్రశాంత్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.పల్లవి ప్రశాంత్ పాల్గొన్న ఏడో సీజన్ ప్రైజ్‌మనీ మొత్తం రూ.50 లక్షలు.. కానీ ఇదే సీజన్లో ఫైనల్ వరకు వచ్చిన ప్రిన్స్ యావర్, సూట్ కేసు తీసుకుని స్వచ్ఛందంగా బయటకొచ్చేశాడు. అందులో రూ.15 లక్షలు ఉన్నాయి. ఈ మొత్తం పోగా ప్రశాంత్ రూ.35 లక్షలు గెలుచుకున్నాడు. ఇందులో 40శాతం జీఎస్టీ కటింగ్ అంటే రూ.14 లక్షలు, కారుకి రూ.8.5 లక్షలు, నెక్లెస్‌కి రూ.5 లక్షలు తీసేస్తే ఇక మిగిలింది రూ.7.5 లక్షలు మాత్రమే వచ్చిందన్నట్లు ప్రశాంత్ చెబుతున్నాడు. కానీ ఇతడు చెబుతున్నది నిజమా అబద్ధమా అనేది అర్థం కావట్లేదు. బిగ్‌బాస్ యాజమాన్యం వైపునుంచి ఈ విషయంపై క్లారిటీ రావాలి.ఇకపోతే పల్లవి ప్రశాంత్ గతంలో శివ అనే యూట్యూబర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి భిన్నమైన కామెంట్స్ చేశాడు. 'డబ్బులిస్తానని ఇవ్వకుండా తినేశాడని అందరూ అంటున్నారు. నేను చేసిన సాయం ఎంతో ఏంటో ఇచ్చిన నాకు తెలుసు. తీసుకున్న వాళ్లకు తెలుసు. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన డబ్బే కాదు జీవితాంతం నేను సంపాదించిన దాంట్లో కొంత సాయం చేయాలని అనుకున్నా, చేస్తున్నా. నా దయ వల్ల ఓ చెల్లి కాలేజీ ఫస్ట్ వచ్చానని నాకు ఫోన్ చేసింది. వాళ్లు ముందుకు వచ్చి అన్న సాయం చేశాడని చెప్పడానికి ఇష్టపడటం లేదు. అందుకే అవన్నీ బయటపెట్టలేకపోతున్నా. వాళ్లు చదువుకోవడం నాకు ముఖ్యం. ఆ చెల్లి వీడియో ముందుకొచ్చి చెప్పను అని అన్నది కానీ అవసరం అయితే వస్తానంది. అలా చాలామంది ఉన్నారు. నేను చేస్తానన్న సాయం చేసేశాను ఇంకా చేస్తూనే ఉంటాను తప్ప లెక్కలు అడిగితే చెప్పలేను' అని గతంలో చెప్పాడు. మరి ఈ రెండింటిలో ఏదో నిజమో పల్లవి ప్రశాంతే చెప్పాలి.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' మొదలవకముందే నెగిటివిటీ.. జడ్జిలనే తిడుతూ వీడియోలు) -
అగ్నిపరీక్షలో రైతుబిడ్డ.. సింగర్ మాత్రమే కాదు అంతకుమించి..!
బిగ్‌బాస్ సీజన్-10 మరికొద్ది రోజుల్లోనే బుల్లితెర ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. వచ్చే నెల నుంచే ఈ బిగ్ షో మొదలు కానుంది. ఇప్పటికే ప్రోమోలు రిలీజ్ చేయగా.. ఈ ఏడాది సీజన్‌పై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సీజన్ కోసం కంటెస్టెంట్ల వేట మొదలెట్టిన మేకర్స్ అగ్నిపరీక్ష పెట్టేశారు. ఈ పోటీలో ఫైనల్‌కు 15 మందిని ఎంపిక చేయగా.. వీరిలో హౌస్‌లో ఎవరు అడుగుపెడతారో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.ఇదిలా ఉంటే ఈ అగ్నిపరీక్ష ఫైనల్‌కు చేరుకున్న వారిలో రైతుబిడ్డ, సింగర్ ఝాన్సీ కూడా ఉన్నారు. తమ పొలంలో పంట, రైతుల కష్టాలను వివరిస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. అలాగే తన పాటలతోనూ ఆకట్టుకున్నారు. అలా బిగ్‌బాస్ ఛాన్స్ కోసం అగ్నిపరీక్షలో ఫైనల్‌కు చేరుకున్నారు.ఈ నేపథ్యంలోనే సింగర్ ఝాన్సీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె కేవలం ఓ సింగర్ మాత్రమే కాదు.. చదువుల సరస్వతి కూడా. ఈ అగ్నిపరీక్షలో నవదీప్ ఆమెను చదువు గురించి అడిగారు. తాను పీజీలో ఆర్గానికి కెమిస్ట్రీ పూర్తి చేసినట్లు ఝాన్సీ వెల్లడించింది. తమ పొలంలో పనులు చేస్తూనే.. ఇంటర్లో ఏకంగా 926 మార్కులు సాధించినట్లు తెలిపింది. ఝాన్సీ టాలెంట్ చూసిన నవదీప్, బిందు మాధవి, యాంకర్ శ్రీముఖి ఒక్కసారిగా షాకయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Gundeboina jhansi (@singer_jhansi) -
'గొర్రెలు కాయడానికి కూడా పనికిరాదు'.. యాంకర్ శ్రీముఖిపై ట్రోల్స్
తెలుగువారి బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌కు సమయం ఆసన్నమవుతోంది. ఈ షోలో పాల్గొని వారిని అగ్నిపరీక్ష పేరుతో సెలెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అగ్నిపరీక్ష నడుస్తోంది. పదో సీజన్ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. వచ్చేనెల ప్రారంభం కానున్న ఈ షోకు నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ నేపథ్యంలో అగ్నిపరీక్ష పేరుతో జరుగుతోన్న సెలెక్షన్ ప్రాసెస్‌లో ఎంతోమంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు పాల్గొన్నారు. వీరందరినీ వడపోసి ఫైనల్‌కు ఓ 15 మందిని ఎంపిక చేశారు. మొత్తం 55 మంది ఎలిమినేట్ చేయగా.. వీరిలో ఉప్పల్ బాలు కూడా ఉన్నారు. తనకు అన్యాయం చేశాడంటూ నవదీప్‌పై ఫైరవుతున్నాడు. తాజాగా ఈ షో యాంకర్ శ్రీముఖి తీరుపై విమర్శలొస్తున్నాయి. ఇంతకీ ఆమె ఏ చేసింది? ఎందుకు ట్రోల్ చేస్తున్నారో తెలుసుకుందాం.అయితే ఇదే బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో మరో సోషల్ మీడియా ఇన్ప్లూయన్సర్ రన్నింగ్ రాజా కూడా పాల్గొన్నారు. బిగ్‌బాస్ ఛాన్స్ కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి వచ్చాడు. అయితే టాస్క్‌లో భాగంగా అతను శ్రీముఖిని ఇమిటేట్ చేసేందుకు యత్నించాడు. శ్రీముఖి మేకప్ ఇలా వేసుకుంటుందని తన హావాభావాలతో చూపించాడు. అదే సమయంలో శ్రీముఖి దగ్గరికీ రన్నింగ్ రాజా వెళ్లాడు. దీంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నన్ను టచ్ చేస్తే చెంప పగలగొడతా అంటూ ఆమె దురుసుగా ప్రవర్తించింది.దీంతో శ్రీముఖి తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. మా ఊర్లో గొర్రెలు కాయడానికి కూడా శ్రీముఖి పనికిరాదంటూ ట్రోల్ చేస్తున్నారు. పల్లెటూరి వాళ్లను షోలకు పిలిచి అవమానించడమే వీళ్ల పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనలాంటి పల్లెటూరి వాళ్లను స్టేజీల మీదకు తీసుకెళ్లి బకరాలను చేస్తారని ఆవేదన చెందుతున్నారు. ఏదేమైనా ఇదంతా షోలో భాగమైతే ఓకే కానీ.. గ్రామీణ ప్రాంతాల ప్రజల టాలెంట్‌ను మాత్రం హేళన చేస్తే సరికాదని మరికొందరు అంటున్నారు. View this post on Instagram A post shared by Khadeer Palleturi (@palleturikurrallu2) -
బిగ్‌బాస్ సీజన్-10.. ఈ సారి దశవతారమే..!
తెలుగువారి బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌కు సమయం ఆసన్నమవుతోంది. ఈ షోలో పాల్గొని వారిని అగ్నిపరీక్ష పేరుతో సెలెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అగ్నిపరీక్ష నడుస్తోంది. పదో సీజన్ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. వచ్చేనెల ప్రారంభం కానున్న ఈ షోకు నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సారి సరికొత్తగా.. సవాల్‌గా ఉండనుందని చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ మరో ప్రమోషన్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున విభిన్నంగా కనిపించారు. మీరు ఎంతైనా ఆశించండి. 'బిగ్‌బాస్ సీజన్-10 నెక్ట్స్ లెవల్, వెరైటీ, సర్ప్రైజ్, డ్రామా, ఛాలెంజ్ పదింతలు..వారం వారం సరికొత్త అవతారం.. ఈ సారి దశవతారం' అంటూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అంటూ ఆడియన్స్‌లో మరింత ఆసక్తి క్రియేట్ చేశారు. తాజాగా రిలీజైన ఈ ప్రోమో మీరు కూడా చూసేయండి. -
'బిగ్‌బాస్' మొదలవకముందే నెగిటివిటీ.. జడ్జిలనే తిడుతూ వీడియోలు
ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా బిగ్‌బాస్ షో మొదలవనుంది. వచ్చే నెల నుంచి 10వ సీజన్ షురూ కానుందని లేటెస్ట్గా ప్రోమో వదిలారు. ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం పక్కనబెడితే అగ్నిపరీక్ష కారణంగా సోషల్ మీడియాలో షోపై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడుతోంది. ఇంకా చెప్పాలంటే జడ్జిల్లో ఒకరైన నవదీప్‌ని పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు. ఎందుకీ పరిస్థితి వచ్చింది? దీనికి ఏంటి కారణం?ఈ షో మొదలైన తర్వాత 8 సీజన్ల వరకు పల్లవి ప్రశాంత్ లాంటి సామాన్యులని పలువురిని తీసుకున్నారు గానీ వారిని ఎలా ఎంపిక చేశారు లాంటివి బయటపెట్టలేదు. కానీ గతేడాది అగ్నిపరీక్ష పేరుతో పోటీ పెట్టి, ఆరుగురు సామాన్యులని ఎంపిక చేసి షోలో పాల్గొనే అవకాశం కల్పించారు. అందులో ఒకడైన కల్యాణ్ పడాల ఏకంగా విజేత కూడా అయ్యాడు. ఈసారి అలానే అగ్నిపరీక్ష పోటీ నిర్వహించారు. వేలాది అప్లికేషన్లు రాగా వాటిలో 70 మందిని ఎంచుకుని వాళ్లలో 15 మందిని ఫైనల్ చేశారు.ఆ 15 మంది ఎవరనేది జనాలకు కూడా పెద్దగా తెలీదు కాబట్టి ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం. అయితే రిజెక్ట్ అయిన మిగిలిన 55 మందిలో ఉప్పల్ బాలు, అక్షయ్ లాంటి జనాలకు తెలిసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వీళ్లని ఏ కారణాలతో రిజెక్ట్ చేశారో పక్కనబెడితే వీరిద్దరితో పాటు మరికొందరు ఏకంగా చిన్నాచితకా యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ జడ్జిలైన నవదీప్, బిందుమాధవి, అభిజిత్‌లని ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు.ఓ షో కోసం ఒక వ్యక్తిని తీసుకోవాలా వద్దా అనేది జడ్జిలతో పాటు నిర్వహకులకు ఉండే చాలా లెక్కలపై ఆధారపడి ఉంటుంది. దీని వెనక పెద్ద తతంగం ఉంటుంది. కానీ కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఇష్టరీతినా ఏకంగా జడ్జిలనే తిడుతుండటం షోపై వ్యతిరేకత పెంచుతోంది. పోనీ ఈ ఇన్ఫుయెన్సర్లు ఏమైనా సమాజానికి పనికొచ్చేది చేస్తున్నారా అంటే కాదు. ప్రతిరోజు ఎంటర్టైన్మెంట్ వీడియోలో లేదంటే మోటివేషన్ వీడియోలో చేస్తూ ఫాలోవర్లని సంపాదించుకుంటున్నారు. అలాంటి వీళ్లు.. తమని రిజెక్ట్ చేసేసరికి తట్టుకోలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.షో మొదలుకాకముందే ఇలా ఉందంటే.. ఒకసారి ప్రారంభమైన తర్వాత ఇంకెన్ని విమర్శలు, ట్రోల్స్ వస్తాయోననే సందేహం కలుగుతోంది. గతేడాది కల్యాణ్ పడాలని విజేత చేసినప్పుడే చాలామంది సందేహపడ్డారు. తనూజ విజేత కావాల్సిన కంటెస్టెంటే కానీ కల్యాణ్ ఎలా విన్నర్ అయ్యాడు అని మాట్లాడుకున్నారు. పోని షో అయిపోయిన తర్వాత విజేతలకు వరస ఛాన్సులు వచ్చాయా అంటే అలాంటిదేం జరగలేదు. ఒకటి రెండు అవకాశాలు వచ్చాయంతే! -
మళ్లీ ఆడబిడ్డ పుట్టిందని అమ్మనాన్న ఏడ్చారు
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ రేపటి(ఆగస్టు 15) నుంచి ప్రసారం కానుంది. ఈ పోటీలో 70 మంది సామాన్యులు పాల్గొనగా 15 మంది తుది పోటీ కోసం ఎంపికయ్యారు. వీళ్లలో మిగతా అందరికంటే సూర్యాపేట్కి చెందిన రైతు, సింగర్ ఝాన్సీని ప్రోమోల్లో ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. ఆమె చెప్పిన విషయాలని ఎమోషనల్‌గా చూపిస్తున్నారు. మరి ఈమె ఏం చెప్పింది? ఫైనల్-15కి సెలెక్ట్ అయిందా? లిస్టులో ఎవరెవరున్నారంటే?(ఇదీ చదవండి: నేనూ సైబర్ క్రైమ్ బాధితుడినే.. ఫోన్లో ఫొటోలు తీసుకోను: నాగ్)ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు కష్టాలు ఏముంటాయి? అని జడ్జి నవదీప్ ఈమెని అడగ్గా.. 'పెట్టుబడి పెట్టందే పంట పండదు. చివరకొచ్చేసరికి ఆ పెట్టుబడి పెట్టినంత కూడా రాదు. కానీ వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టలేం. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రకృతితోనే పోటీపడాలి. నేను పుట్టినప్పుడు మళ్లీ ఆడబిడ్డ పుట్టిందని మా అమ్మవాళ్లు ఏడ్చారు. ఈ రోజు నువ్వు కన్నది ఆడపిల్లని కాదు నలుగురికి స్పూర్తిగా ఉండే ఓ మగరాయుడు లాంటి బిడ్డని కన్నావ్ అని అంటున్నారు' అని ఝాన్సీ చెప్పుకొచ్చింది.ఇకపోతే అగ్నిపరీక్ష తుదిపోటీలకు ఎంపికైన వారిలో రాజ కుమారి డయానా, షాలిని పటేల్, ఆర్జే చరణ్, మితిలేష్, శ్రష్టి వ్యాకర్ని, అమన్, హేమంత్, నవరసాలు ఆర్కే, భాగి తుల్లూరి, దీపక్, రోహిత్, యాంకర్ ప్రియ, సింగర్ ఝాన్సీ, గాయత్రి, అపూర్వ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీళ్లలో నుంచి బిగ్ బాస్ 10వ సీజన్లోకి ఎవరు అడుగుపెడతారానేది షో మొదలయ్యే రెండు మూడు రోజుల ముందు తెలిసే అవకాశముంది.వచ్చే నెలలో ప్రారంభమయ్యే బిగ్‌బాస్ కొత్త సీజన్ కోసం ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలని టీం సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆటో రాంప్రసాద్ దాదాపు ఖరారు కాగా యాదమ్మ రాజు, దీపిక రంగరాజు, ఎక్స్‌ప్రెస్ హరి, ఆషిక, నూకరాజు, పల్లవి గౌడ లేదా పల్లవి రామిశెట్టి లాంటి టీవీ సెలబ్రిటీలు ఈసారి షోలోకి రానున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు: ఉప్పల్ బాలు) -
వల్గర్ వీడియోలు.. దేనికి పనికొస్తాయని అడిగారు: ఉప్పల్ బాలు
శనివారం(ఆగస్టు 15) నుంచి బిగ్‌బాస్ తెలుగు అగ్నిపరీక్ష రెండో సీజన్ ప్రసారం కానుంది. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు దీనిని టెలికాస్ట్ చేయనున్నారు. ఇందులో మొత్తం 70 మంది సామాన్యులు పోటీపడగా వాళ్లలో 15 మందిని ఎంపిక చేశారు. వీళ్లకు పోటీలు పెట్టి ఐదారుగురిని బిగ్‌బాస్ 10వ సీజన్లోకి తీసుకోనున్నారు. అయితే తనకెలాంటి పోటీలు పెట్టకుండా అన్యాయంగా బయటకు పంపేశారని, దీనికి నవదీప్ కారణమని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఉప్పల్ బాలు వరస వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు.(ఇదీ చదవండి: సంక్రాంతి బరిలో శ్రీనువైట్ల.. రెండేళ్ల తర్వాత దొరికిన హీరో)'మిడిల్ క్లాస్ వాళ్లంటే మనసుండదా? మేం ఎన్నోరోజుల నుంచి కష్టపడి వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటే ఓ ప్రశ్న అడగకుండా, టాస్క్ పెట్టకుండా.. మీ వీడియోలు దేనికి పనికొస్తాయి? అవి వల్గర్‌గా ఉంటాయి అని అన్నారు. నవదీప్ గారు మీ వీడియోలు దేనికి పనికొస్తాయి? మీరు ఎవరికైనా లక్ష రూపాయలు దానం చేశారా? ఎవరైనా పెళ్లయితే పుస్తె మెట్టలు ఇప్పించారా? మీరెలా మాట్లాడతారు సర్? అంటే మిడిల్ క్లాస్ వాళ్లం ఏం చేయలేం? మా గురించి ఎవరు వీడియోలు పెట్టినా పట్టించుకోరు. మేమే తోపులం అనుకుంటున్నారా? మీకు అవకాశమిస్తే మీరక్కడ కూర్చున్నారు. ఏదో ఒకరోజు మీకు శాపం తగులుతుంది. అగ్నిపరీక్షకు పిలిచి అవమానించడం కాదు. నవదీప్ గారు నేను అస్సలు వదిలిపెట్టను. అక్కడ ఏం జరిగిందనేది ప్రతి ఒక్కటి చెబుతాను. న్యాయం జరగాలి నాకు' ఉప్పల్ బాలు తన వీడియోలో చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: పాత రోజుల్ని గుర్తుచేసుకుంటే భయమేస్తుంది: రష్మిక) View this post on Instagram A post shared by BIGGBOSS10TELUGU (@officialbiggbosstelugu) -
'బిగ్‌బాస్' అగ్నిపరీక్ష.. అభిజిత్ పరువు తీసిన కంటెస్టెంట్!
ప్రతి ఏడాది ప్రసారమయ్యే 'బిగ్‌బాస్' షోకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో కంటెంట్, గొడవలపై విమర్శలు వస్తుంటాయి. అదే టైంలో చూసేవాళ్లు రోజూ చూస్తూనే ఉంటారు. ఎనిమిది సీజన్ల వరకు సెలబ్రిటీలకే ఎక్కువగా అవకాశమిచ్చారు. గతేడాది టెలికాస్ట్ అయిన 9వ సీజన్ నుంచి మాత్రం సామాన్యులకు కూడా హౌస్‌లో అడుగుపెట్టే ఛాన్స్ ఇచ్చారు. దీనికి అగ్నిపరీక్ష పేరుతో పోటీ కూడా నిర్వహించారు. ఈసారి అగ్నిపరీక్షకు రంగం సిద్ధమైంది. ఈ శనివారం నుంచి గేమ్ మొదలవనుంది. ఈ క్రమంలోనే ప్రోమో వదిలారు.(ఇదీ చదవండి: 'డిసి' హీరోయిన్ వామికా ఖరీదైన 'ఐఫోన్' గిఫ్ట్)ఈసారి అమ్మాయిలు, అబ్బాయిలు కలిపి 70 మంది అగ్నిపరీక్షలో పోటీపడబోతున్నారు. రిలీజ్ చేసిన ప్రోమోలో అయితే ముగ్గురు బాగా హైలెట్ అయ్యారు. వీళ్లలో ఒక అమ్మాయి రైతుగా ఊరిలో పనిచేస్తూ పల్లె పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు తొలిదశలో గ్రీన్ సిగ్నల్ లభించింది. అలానే తెలుగుని వెనక నుంచి ముందుకు తిప్పి రాసే మరో అమ్మాయి కూడా ఆకట్టుకుంది.చివరగా ఓ కుర్రాడు.. జడ్జి సీటులో కూర్చున్న 4వ సీజన్ విజేత అభిజిత్‌కే కౌంటర్ వేశాడు. గెలిచిన తర్వాత రెండేళ్లు ఎక్కడా కనిపించకుండా పోయారు అని పరువు తీసేలా మాట్లాడాడు. దీంతో హర్ట్ అయిన అభిజిత్.. ఏం మాట్లాడుతున్నావ్? మాకేం పనిలేదని అనుకుంటున్నావా? అని సీరియస్ అయ్యాడు. ఇకపోతే వచ్చే నెల తొలివారం నుంచి 10వ సీజన్ మొదలయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: మాజీ భర్త రెండో పెళ్లి.. హీరోయిన్ ఊర్మిళా కౌంటర్ పోస్ట్) -
బిగ్‌బాస్ హౌస్‌లోకి మరో జబర్దస్త్ కమెడియన్!
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుంది. ఈసారీ కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మేకర్స్ ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపికపై దృష్టి సారించారు. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష 2’ ద్వారా కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలువురు ఈ సీజన్ 10 ఆడిషన్స్‌కు హాజరవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు షోలోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్ల విషయంలో సోషల్ మీడియాలో రోజుకో పేరు వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో క్రేజీ పేరు చేరినట్లు టాక్ నడుస్తోంది. జబర్దస్త్ నటుడు రామ్ ప్రసాద్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ ప్రసాద్.. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. బుల్లితెరతో పాటు సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తే షోలో కామెడీ మరింత పెరిగే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ టీమ్ రామ్ ప్రసాద్‌ను సంప్రదించిందని, ఆయన కూడా షోలో పాల్గొనేందుకు ఓకే చెప్పారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఈ సారి అలా చేస్తే సహించను: కంటెస్టెంట్లకు నాగ్ వార్నింగ్
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ షోకు అంతా రెడీ అవుతోంది. ఇప్పటికే హిందీ బిగ్‌బాస్ తేదీని కూడా రివీల్ చేశారు. ఇటీవలే ప్రోమో రిలీజ్ చేసి సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానుందని ప్రకటింటచారు. దీంతో టాలీవుడ్ అభిమానులు సైతం తెలుగు సీజన్-10 ఎప్పుడా అని ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జున పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.బిగ్‌బాస్ సీజన్-10 ప్రోమో షూటింగ్ ఇటీవలే పూర్తయిందని నాగ్ వెల్లడించారు. ఈ సారి పదో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సీజన్ మరింత ఉన్నతంగా ప్లాన్ చేస్తున్నారని.. గతం కంటే ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. ఇతరుల ప్రవర్తనను నిర్ణయించడం, సూచనలు చేయడం నాకిష్టం ఉండదన్నారు. అందుకే మొదటి రెండు సీజన్లలో కాస్తా ఇబ్బంది పడ్డానని.. ఆ తర్వాత షో ఫార్మాట్ అలవాటైందని వెల్లడించారు. గత సీజన్ సూపర్ హిట్ కావడంతో ఈసారి ఫిజికల్ టాస్కులు మరింత కఠినంగా ఉండబోతున్నాయని హింట్ ఇచ్చారు. అంతే కాకుండా ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్లు హద్దులు దాటి ప్రవర్తిస్తే అస్సలు సహించననని నాగ్ స్పష్టం చేశారు. -
బిగ్‌బాస్ రియాలిటీ షో.. ముహుర్తం ఫిక్స్
బుల్లితెరపై ఫుల్ క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఏ భాషలోనైనా ఈ షోకు ఆడియన్స్ ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి బుల్లితెర ప్రియులను అలరించేందుకు రియాలిటీ షో వచ్చేస్తోంది. హిందీలో ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా ఈ షో 19 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్- 20కి కౌంట్‌డౌన్ మొదలైంది. రాబోయే సీజన్‌కు సంబంధించి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సారి కూడాహోస్ట్గా సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.ఈ తాజా సీజన్ సెప్టెంబర్ 6 నుంచి మొదలు కానుందని మేకర్స్ రివీల్ చేశారు. ఈ టీజర్లో గుర్రంతో పాటు సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. టీజర్ చూస్తుంటే ఈ సారి సరికొత్తగా సీజన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ టీజర్లో కంటెస్టెంట్ల వివరాలు మాత్రం రివీల్ చేయలేదు. ఈ సీజన్లో కొత్త ట్విస్ట్‌లను ప్రేక్షకులను పరిచయం చేస్తుందని..అంతే కాకుండా సీజన్-20 మధ్యలో ఒక మిస్టరీ ఉంటుందని సల్మాన్ ఖాన్ టీజర్లో ప్రస్తావించారు. ఈ టీజర్ కేవలం ఆరంభం మాత్రమేనన్నారు.బిగ్ బాస్-20 స్ట్రీమింగ్ ఎక్కడంటే?ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్- 20 సెప్టెంబర్ 6న ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ రియాలిటీ షో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా కలర్స్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే ఈ ఏడాది అన్ని భాషల్లోనూ ఓకేసారి ఈ షో ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అదే జరిగితే తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ అదో రోజు నుంచే షో మొదలు కానుంది. View this post on Instagram A post shared by JioHotstar (@jiohotstar) -
బిగ్ బాస్‌పై పుస్తకం... బిగ్ రియాలిటీ...!
ఈ ఏడాది హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం బంగ్లా భాషలలో బిగ్ బాస్ ఆరు ఎడిషన్లను ఒకేసారి ప్రారంభించడానికి జియోస్టార్ సిద్ధమైంది. తద్వారా తొలిసారి దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు బిగ్ బాస్ వినోదాన్ని ఏకకాలంలో అనుభవించబోతున్నారు. ఇది భారతదేశంలో రియాలిటీ ఎంటర్టైన్ మెంట్ రంగంలో ఒక మైలురాయిగా నిలువనుంది. ఈ ఆరు ఎడిషన్లు సెప్టెంబర్ 2026 నుంచి జియోస్టార్ టెలివిజన్ నెట్వర్క్, జియో హాట్‌స్టార్‌లో దేశ వ్యాప్తంగా ప్రసారం కానున్నాయి. బిగ్ బాస్‌కు పర్యాయపదంగా మారిన దిగ్గజ హోస్ట్‌లు సల్మాన్ ఖాన్, విజయ్ సేతుపతి, నాగార్జున, కిచ్చా సుదీప్, మోహన్ లాల్ ఈ సీజన్ లోనూ కొనసాగనున్నారు. ఈ సంవత్సరం బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ రాకతో ఇది మరింత ఆకర్షణీయంగా మారనుంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని, ’ఇండియాస్ బిగ్ రియాలిటీ’ అనే ఒక ప్రత్యేకమైన డేటాతో నిండిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని జియో హాట్‌స్టార్ ఆవిష్కరించింది. రెండు దశాబ్దాల బిగ్ బాస్, అద్భుతమైన ప్రయాణం, సాంస్కృతి ప్రభావం శాశ్వత వారసత్వాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది.గత ఏడాది 500 మిలియన్ వీక్షకులు...భారతదేశపు అతిపెద్ద వినోద ఫ్రాంచైజీలలో ఒకటిగా బ్రాండ్లకు ఎలా వేదికగా నిలిచిందో ’ ఇండియాస్ బిగ్ రియాలిటీ’ వెల్లడించింది. కేవలం 2025లోనే, 500 మిలియన్లకు పైగా వీక్షకులను ఈ షో చేరుకుని 438 బిలియన్లకు పైగా వీక్షణ నిమిషాలను సృష్టించింది ఆరు భాషా ఎడిషన్లనూ కలిపి చూసినప్పుడు ఈ ఎంగేజ్మెంట్లో ఇయర్ ఆన్ ఇయర్ 47% వృద్ధిని సాధించింది. దాదాపు 625 కు పైగా బ్రాండ్లు ఈ షో ని ఉపయోగించుకుని, జాతీయ ప్రాంతీయ మార్కెట్లలో ఉత్పత్తులను విడుదల చేయటం, అవగాహన కల్పించడం, వినియోగదారులతో శాశ్వత సంబంధాలను ఏర్పరచుకోవడం చేశాయి. జియోహాట్‌స్టార్‌లో, ప్రతి 10 మంది వీక్షకులలో ఆరుగురు బిగ్ బాస్ లైవ్ ఫీడ్‌ను చూస్తున్నారు.ఇంటర్నెట్లోనూ ఫుల్ క్రేజ్...బిగ్ బాస్ కేవలం చూసే అనుభవం కంటే ఎంతో ఎక్కువ అని ఈ కాఫీ టేబుల్ పుస్తకం వెల్లడిస్తుంది. జియోహాట్‌స్టార్‌లో 9.32 బిలియన్లకు పైగా ఓట్లు పోలవడం 43 మిలియన్ల లైవ్ చాట్లు నమోదు కావడం ద్వారా ప్రేక్షకులు చురుకుగా వ్యవహరించారు. దాదాపు ప్రతి నలుగురు వీక్షకులలో ముగ్గురు ఈ షోతో భిన్న రకాలుగా మమేకమవుతున్నారు, బిగ్ బాస్ ఇంటర్నెట్లో విపరీతమైన క్రేజ్‌ను సృష్టించింది. కేవలం 2025లోనే 1.7 బిలియన్లకు పైగా సోషల్ ఎంగేజ్మెంట్లను 30 మిలియన్ల యూజర్–జనరేటెడ్ మీమ్స్‌ను బిగ్ బాస్ సృష్టించింది. బిగ్ బాస్ ఇప్పుడు హిందీ మార్కెట్లలో 20 కోట్లకు పైగా వీక్షకులను, దక్షిణ భారతదేశంలో 3 కోట్లకు పైగా వీక్షకులను చేరుకుంది. ఇక్కడ ప్రతి 10 మంది టెలివిజన్ వీక్షకులలో 8 మంది ఈ షోతో మమేకమవుతున్నారు. ఈ ప్రాంతంలోని మిగతా అన్ని రియాలిటీ షోల కంటే దీని రీచ్ 3.5 రెట్లు ఎక్కువ.అదే బిగ్ బలం...గత రెండు దశాబ్దాలుగా, బిగ్ బాస్ ప్రతి సీజన్ తో తన స్థాయిని, ఆదరణను, ప్రాముఖ్యతను పెంచుకుంటూ, నిరంతరం తనను తాను పునరావిష్కరించుకుంది. ప్రేక్షకులను నిరంతరం పాల్గొనేలా చేయడమే బిగ్ బాస్ బలం, ’ఈ కాఫీ టేబుల్ పుస్తకం భారత దేశ వినోద పర్యావరణ వ్యవస్థ పరిణామంలోని కీలకమైన క్షణాలను వెలుగులోకి తెచ్చింది‘ అని పుస్తకావిస్కరణ సందర్భంగా జియోస్టార్ టీవీ, ఎంటర్టైన్ మెంట్ సేల్స్ హెడ్ మహేష్ శెట్టి అన్నారు. ‘ పండుగ సీజన్ లో ప్రేక్షకుల వివిధ అంశాలపై దృష్టి మరల్చే తరుణంలో, బిగ్ బాస్ ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేస్తుంది. 24/7 లైవ్ ఫీడ్లు, బిలియన్ల కొద్దీ ఓట్లు, లైవ్ చాట్ల ద్వారా ఏటా 47% ఎంగేజ్మెంట్ వృద్ధిని సాధిస్తూ, ఈ షో వీక్షకులను సైతం తమ చురుకైన భాగస్వాములుగా మారుస్తుంది. ‘ అని జియోస్టార్ డిజిటల్, ఎంటర్టైన్మెంట్ సేల్స్ హెడ్ భాస్కర్ రమేష్ అన్నారు. -
సామాన్యులకు వెల్కమ్.. బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు రెడీనా?
బుల్లితెర ప్రియుల రియాలిటీ షో బిగ్‌బాస్ మళ్లీ వచ్చేస్తోంది. తొమ్మిది సీజన్స్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో పదో ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రోమో రిలీజ్ చేయగా.. కింగ్ నాగార్జున్ మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ సారి మరింత ఇంట్రెస్టింగ్ ఉండనుందని ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేశారు.అయితే ఈ సారి కూడా సామాన్యులకు ఈ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. గతేడాది మాదిరే అగ్ని పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. జూన్ 12 నుంచి 20వ తేదీ వరకు వరకు ఆడిషన్‌కు వీడియోలు పంపవచ్చని నాగార్జున ప్రకటించారు. ఈ వీడియోలు గరిష్ఠంగా మూడు నిమిషాల వరకు ఉండవచ్చని తెలిపారు. మీ వీడియోలను https://bbtelugu.jiostar.com సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఇంకెందుకు ఆలస్యం మీ టాలెంట్‌ను బయటకు తీసి వీడియోలు పంపి బిగ్‌బాస్ ఛాన్స్ కొట్టేయండి. -
రెండేళ్లుగా ఖాళీ.. పిచ్చిదానిలా ప్రవర్తించినా సరే..: దీప్తి ఎమోషనల్
దీప్తి సునయన.. ఒకప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషన్.. కవర్ సాంగ్స్, డబ్ స్మాష్‌తో పాపులర్ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొంది. అమాయకత్వం, చిలిపితనంతో అభిమానులను సంపాదించుకున్న ఈ నటి అప్పట్లో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్‌తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు కలిసిమెలిసి ఉన్న వీరిద్దరూ 2022లో బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటినుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు.టైంపాస్ చేస్తున్న దీప్తిఇటీవలే షణ్ముఖ్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి కొత్తింట్లో కొత్త జీవితం ప్రారంభించాడు. మరోపక్క ఈ మధ్యే ఓ ప్రైవేట్ సాంగ్ చేశాడు. అలాగే ఓ సినిమా కూడా చేస్తున్నాడు. ఇటు దీప్తి సునయన మాత్రం పనిని పక్కనపెట్టేసి జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తోంది. మధ్యమధ్యలో గుళ్లుగోపురాలు కూడా తిరుగుతోంది. అయితే ఆమె ఏ ప్రాజెక్టులు చేయకపోయినా తనపై ప్రేమను అలాగే కొనసాగిస్తున్న అభిమానులకు తాజాగా కృతజ్ఞతలు తెలిపిందీ బ్యూటీ.ఏం చేశానని ఇంత ప్రేమ?'గత 10 ఏళ్లుగా మీరు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నేను ఎలా ఉన్నా ప్రేమించారు. పిచ్చిగా ప్రవర్తించినా ఇష్టపడ్డారు. ప్రతిదానిలో నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంతటి స్వచ్ఛమైన ప్రేమను పొందేందుకు నేను ఏం చేశానో నాకే తెలీదు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నిజం చెప్పనా.. నాకు పని చేయడానికి ఒంట్లో శక్తి లేదు. రెండేళ్లుగా విశ్రాంతి తీసుకోవడంలోనే గడిపేశాను. అయినా మీరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మళ్లీ వర్క్‌లో బిజీ అవమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరిచ్చే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది.ఆ ప్రయత్నంలోనే ఉన్నా..నేను ఎందుకిలా డీలా పడిపోయానో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. నేను మళ్లీ పూర్తి ఉత్సాహంతో మీ ముందు నిలబడతాను. నేను ఏ పనీ చేయకపోయినా సరే.. నన్ను ప్రేమిస్తున్నందుకు, నాపై నమ్మకం ఉంచినందుకు, నాకోసం నిలబడినందుకు థాంక్యూ సో మచ్' అని దీప్తి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు.చదవండి: వరుస కష్టాలు.. నాకే ఎందుకిలా జరుగుతోంది?: శ్రీజ కొణిదెల -
చెల్లి ఇంటి కోసం డబ్బు సాయం చేసిన కాజోల్
దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ కొంతకాలంగా యూట్యూబ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. తన వంటమనిషి దిలీప్‌తో కలిసి రకరకాల వీడియోలు చేస్తోంది. అతడిని వెంటేసుకుని సెలబ్రిటీల హోంటూర్స్ కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి తనీషా ముఖర్జీ ఇంటిని సందర్శించింది ఫరా. ముంబైలో ఉన్న ఈ ఇంట్లో అడుగుపెడితే కోల్‌కతాకు వెళ్లినట్లుగానే ఉందని అబ్బురపడిపోయింది.14 ఏళ్లుగా ముంబైలో..ఇలాంటి ఇల్లు ముంబైలో ఎక్కడా ఉండదని కితాబిచ్చింది. ఇక తనీషా మాట్లాడుతూ.. ఈ ఇంట్లోని సామాను చాలామటుకు తన తల్లి ఇంటి నుంచి వచ్చినవే అని పేర్కొంది. 14 ఏళ్ల క్రితం ముంబైలో అడుగుపెట్టానని, తర్వాత ఇక్కడే సెటిలైపోయానంది. ఈ ఇంటి కోసం మీ అక్క, హీరోయిన్ కాజోల్ ఏమైనా సాయం చేసిందా? అని ఫరా ఆతృతగా అడిగింది. అందుకు తనీషా అవునని బదులిచ్చింది. తను చెక్‌లపై సంతకం చేసి ఇచ్చేదని, అలా డబ్బు సాయం చేసిందని పేర్కొంది.తెలుగులోనూ..బాలీవుడ్ సెలబ్రిటీలు తనూజ- షోము ముఖర్జీల సంతానమే కాజోల్, తనీషా. తక్కువ కాలంలోనే కాజోల్ స్టార్ హీరోయిన్గా రాణించింది. కానీ, తనీషా ఆ స్టార్డమ్ అందుకోలేకపోయింది. ష్, సర్కార్, వన్ టూ త్రీ, సర్కార్ రాజ్, కోడ్ నేమ్ అబ్దుల్ వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో కంత్రి మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. హిందీ బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.చదవండి: బోల్డ్ వీడియో.. తప్పయిపోయింది, క్షమించండి: నటుడి కూతురు -
తండ్రయిన అవినాష్.. అప్పుడు రోడ్డుపై పిచ్చోడిలా.. ఇప్పుడేమో!
కమెడియన్ ముక్కు అవినాష్ తండ్రయ్యాడు. ఏడాది కిందటే తండ్రయినప్పటికీ చాలా ఆలస్యంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తనకు బాబు పుట్టిన సంగతిని పన్నెండు నెలలుగా దాచి ఇప్పుడు బయటకు ప్రకటించి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. గతేడాది మే 14న తనకు కొడుకు పుట్టాడని, అతడికి అద్వైత్ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. కొడుకు మొదటి పుట్టినరోజును ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయగా.. ఈ వేడుకకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.2021లో పెళ్లిఅయితే అవినాష్ తన కొడుకును వెంటనే పరిచయం చేయకపోవడానికి ఒక పెద్ద కారణమే ఉంది. ఇతడు 2021 నవంబర్‌లో అనూజను పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామంటూ 2023లో గుడ్‌న్యూస్ చెప్పారు. బేబీ బంప్ ఫోటోలు, మెటర్నటీ షూట్, సీమంతం వీడియోలతో తెగ సందడి చేశారు. కానీ, ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. 2024 ప్రారంభంలో అబార్షన్ అయిందని చేదువార్త చెప్పాడు. విషాదంతెల్లవారితే డెలివరీ అనగా అనూజ కడుపులో బిడ్డ కదలికలు ఆగిపోయాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. ఏదో ఒకటి చేసి బిడ్డను బతికించమని డాక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్నాడు అవినాష్. ఒక్కసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయాక తిరిగి బతికించడం ఆ దేవుడి వల్ల కూడా కాదని వైద్యులు చేతులెత్తేశారు. ఊహించని ఈ విషాదానికి పిచ్చోడైపోయాడు. అర్ధరాత్రి ఒంటిగంటకు రోడ్డుపై ఏడ్చుకుంటూ ఉండిపోయాడు. అందుకే ఇంత సీక్రెట్2.75 కిలోల బరువుతో పుట్టిన బిడ్డలో ప్రాణం లేకపోవడం మా ఇద్దర్నీ ఎంతో కుంగదీసిందంటూ ఓ ఇంటర్వ్యూలో అవినాష్ తన బాధను పంచుకున్నాడు. అందుకే అనూజ ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఎవరితోనూ ఆ వార్తను పంచుకోలేదు. కనీసం కొడుకు పుట్టాక కూడా ఎవరికీ చెప్పదల్చుకోలేదు. ఇప్పుడు ఏడాది తర్వాత ఈ శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నాడు. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) చదవండి: చిన్న వయసులోనే పెళ్లి.. గర్భస్రావం.. హీరోను వదిలేస్తున్నా: సింగర్ -
నీ పెళ్లాన్ని సన్నగా చేయ్ అని ట్రోలింగ్.. ఆ వ్యాధి వల్లే..: విశ్వ
నటుడు విశ్వ సీరియల్స్‌లో, సినిమాల్లో యాక్ట్ చేశాడు. తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలం క్రితమే విశ్వ ఫిట్నెస్ క్లబ్ ఓపెన్ చేసి జిమ్ ట్రైనర్‌గానూ మారాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టాడు. విశ్వ మాట్లాడుతూ.. 'నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి 24 ఏళ్లవుతోంది. 10వ తరగతి అయిపోగానే పరిశ్రమలో అడుగుపెట్టాను. పెళ్లికోసం, విద్యార్థి వంటి పలు చిత్రాల్లో నటించాను. తర్వాత సీరియల్స్ చేశాను. తొక్కేశారుకొంతకాలంగా సీరియల్స్‌కు దూరంగా ఉన్నాను. ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్నాను. అయితే ఒకానొక సమయంలో నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా తొక్కేశారు. అప్పుడు నా తమ్ముడి సంపాదనపైనే బతికాను. ఆరునెలలపాటు వాడే ఇంటిని నడిపించాడు. అలాగే నాన్నకు వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాం. ఎప్పుడైనా పనివాళ్లు రాకపోతే నేను గిన్నెలు కడిగేవాడిని. రేషన్ బియ్యం తిన్న రోజులున్నాయి అన్నాడు.నా అభిమానిశ్రద్ధతో తన లవ్‌స్టోరీ గురించి చెప్తూ.. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో శ్రద్ధ నన్ను చూసి ఇష్టపడింది. అప్పటికి నేను బ్రేకప్ బాధలో ఉన్నాను. నిజమైన ప్రేమ లేదని తెగ బాధపడిపోతూ ఉన్నాను. ఆ సమయంలో శ్రద్ధ మెసేజ్ చేయడంతో టైంపాస్ చేద్దామని నా నెంబర్ ఇచ్చాను. తనకు చాలా కనెక్ట్ అయిపోయాను. వారం రోజులకే తను ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పింది. వాళ్లు మొదట ఒప్పుకోలేదు. నా గురించి పూర్తిగా ఆరా తీశాకే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ట్రోల్స్ఆమెను దేవుడు నాకోసం పంపిన ఏంజెల్ అని భావిస్తాను. విశ్వ ఫిట్నెస్ క్లబ్లో శ్రద్ధ డైట్ ప్లాన్, ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటుంది. నేనేమో ఎక్సర్సైజ్ చేయిస్తాను. అయితే మేమిద్దరం కలిసి సోషల్ మీడియాలో ఏదైనా వీడియో పెడితే చాలు.. ముందు నీ పెళ్లాన్ని సన్నగా చేయు, వేరేవాళ్లకు నీతులు చెప్పడం కాదు, ఇంట్లో సక్కగ చూసుకో అని ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్లు అన్నదాంట్లో తప్పు లేదనుకోండి.ఆ వ్యాధి వల్లే..అయితే రెండోసారి కొడుకు పుట్టిన తర్వాత హార్మోన్ల అసమతుల్యత కారణంగా శ్రద్ధ విపరీతంగా బరువు పెరిగిపోయింది. కొన్ని నెలలకు ఎక్సర్సైజ్ మొదలుపెట్టాం. కానీ తనకు కార్పెల్ టన్నెల్ అనే అరుదైన వ్యాధి వచ్చింది. దానివల్ల చేతులు బలహీనంగా మారిపోయాయి. పిల్లాడికి షర్ట్ బటన్ కూడా పెట్టేంత శక్తి లేకపోయింది. అంటే.. తన పనులు తను చేసుకోలేదు. ఆ వ్యాధి వల్ల ఎక్సర్సైజ్ ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ కోలుకుంది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఎక్సర్సైజ్ మొదలుపెట్టింది' అని విశ్వ చెప్పుకొచ్చాడు.చదవండి: లోక సినిమా.. నన్ను మోసం చేశారు: మమ్ముట్టి -
నేను మంచివాళ్లకే మంచివాడిని, నాలోని రాక్షసుడు బయటకు వస్తే..!
డిమాన్ పవన్.. బిగ్‌బాస్ షోలో ఆటతో, మాట తీరుతో ఆకట్టుకున్నాడు. రీతూతో లవ్ ట్రాక్ ఒక్కటే అతడికి మైనస్ అయింది తప్ప టాస్కుల్లో విశ్వరూపం చూపించేవాడు. కానీ, ఎంత చేసినా అండర్రేటెడ్ కంటెస్టెంట్‌గానే మిగిలిపోయాడు. తన తండ్రికి క్యాన్సర్ ఉన్నప్పటికీ ఎప్పుడూ దాని గురించి చెప్పి సింపతీ పొందాలని ప్రయత్నించలేదు. కానీ ఫ్యామిలీ ఎపిసోడ్లో కన్నతండ్రిని స్టేజీపై చూసి మాత్రం కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.ఇటీవలే తండ్రి మరణంబిగ్బాస్ 9 ఫైనల్స్‌లోనూ తండ్రి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని సెకండ్ రన్నరప్ స్థానంలో ఉండగా బయటకు వచ్చేశాడు. అతడొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. కొద్దిరోజుల క్రితమే పవన్ తండ్రి క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ఈ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పవన్.. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. టీవీ షోలలో పాల్గొంటున్నాడు. ట్రోలింగ్‌కు కౌంటర్అయితే కన్నతండ్రిని కోల్పోయిన బాధే కనిపించడం లేదు, సంతోషంగా నవ్వుతూ పోస్టులు పెడుతున్నాడంటూ పవన్‌ను ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్‌పై పవన్ స్పందించాడు. చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అయినా నేను మౌనంగానే ఉన్నాను. నా తప్పు లేకపోయినా సరే కొంతవరకు నెగిటివిటీని, ద్వేషాన్ని నేను భరించగలను. కానీ నావాళ్లను ఇబ్బందిపెడితే మాత్రం నాలోని డిమాన్ (రాక్షసుడు)ని చూస్తారు. వాడిని మీరు తట్టుకోలేరు.మంచివాళ్లకే మంచివాడినిచాలామంది తెలియకుండానే ఏదో ఒక పొరపాటు చేస్తారు. కానీ, తర్వాతైనా తమ తెప్పు తెలుసుకుని మారతారని భావిస్తున్నాను. అందుకే చాలామటుకు అన్నింటినీ క్షమించేసి, నేను ప్రశాంతంగా ఉంటాను. నేను మంచివాళ్లకే మంచివాడిని.. ఇప్పటికైనా ఈ ట్రోలింగ్‌ను ఆపేస్తారని భావిస్తున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన అభిమానులు.. మీరేంటో మాకు తెలుసు.. ట్రోలర్స్‌ను పట్టించుకోవద్దని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Uppala Pavan Kumar (@demon_pavan) చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వస్తున్న సినిమాలివే! -
'నీ ముఖానికి గోల్డ్ చైన్ ఉందా'.. తట్టుకోలేకపోయా: నటి
రంగుల ప్రపంచంలో రాణించాలని ఎంతోమందికి ఉంటుంది. కానీ, కొందరే ఎన్నో కష్టాలను అధిగమించి, ముళ్లదారిపై నడిచి చివరకు అవకాశాలు సాధిస్తారు. నువ్వు యాక్టరేంటి? నీకంత సీన్ లేదు? అని హేళన చేసేవారికి సీరియల్, సినిమా ఛాన్సులతోనే తగిన బుద్ధి చెప్తారు. అలా తాను కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు పడ్డానంటోంది కన్నడ నటి, బిగ్‌బాస్ బ్యూటీ రాశిక శెట్టి.సూటిపోటి మాటలురాశిక మాట్లాడుతూ.. నా జర్నీ ప్రారంభంలో ఆడిషన్స్ చాలా కష్టంగా ఉండేవి. ప్రోత్సహించడం పక్కనపెట్టి సూటిపోటి మాటలతో విమర్శలు ఎక్కుపెట్టేవారు. చాలామాటలనేవారు. అవకాశాలిచ్చేవారు కాదు. ఒకసారైతే.. నీ ముఖానికి నిజమైన బంగారు గొలుసు వేసుకునేంత సీన్ ఉందా? అని ముఖం మీదే అన్నారు. చాలా బాధపడ్డాను, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయాను.ఆ నమ్మకంతోనే..నావల్ల అవుతుందా? అని నాలో నేనే మథనపడ్డాను. అవకాశాలు రాకపోయేవి, వచ్చిన ఒకటీరెండు కూడా చివరి నిమిషంలో చేజారేవి. అప్పుడు మరింత కుంగిపోయాను. అయినా సరే వెనకడుగు వేయాలనుకోలేదు. నాకంటూ ఓ రోజు వస్తుందని ఎదురు చూశాను. ఆ నమ్మకం, ఆశతోనే ఇండస్ట్రీలో అడుగులు వేశాను అని చెప్పుకొచ్చింది. రాశిక శెట్టి.. కన్నడ బిగ్‌బాస్ 12వ సీజన్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో రెండు సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో సందేహం చిత్రంలో యాక్ట్ చేసింది.చదవండి: రామాయణ సినిమా రిజెక్ట్ చేశా: రణ్‌బీర్ కపూర్ -
నేనేదో అనుకున్నా.. పెళ్లి అంత ఈజీగా జరగలేదు: పునర్నవి
జీవితంలో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' అని చెప్పుకునేవి కొన్ని ఉంటాయి. అలాంటి జాబితాలో పెళ్లి మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పెళ్లిని తాను సింపుల్‌గా చేసుకోవాలనుకున్నానని, కానీ రెండు కుటుంబాల కలయికతో ఎంతో ప్రత్యేకంగా జరిగిందంటోంది బిగ్‌బాస్ బ్యూటీ, నటి పునర్నవి భూపాలం. మార్చి 21న ప్రియుడు, ఫోటోగ్రాఫర్ హేమంత్ వర్మను పెళ్లాడింది పునర్నవి. తాజాగా ఆ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.నేనేదో అనుకున్నా..వివాహం అంటే సింపుల్‌గా, సైలెంట్‌గా అయిపోవాలి.. అత్యంత ఆత్మీయుల మధ్యలో ఈ తంతు పూర్తయిపోవాలని ఒకప్పుడు అనుకునేదాన్ని. కానీ, ఇక్కడ మా ప్రేమ మా మనసుల్ని మాత్రమే కాదు, రెండు కుటుంబాల్ని కలిపింది. వారి ఆచారాలు, సాంప్రదాయాలు, ప్రేమానురాగాల మధ్య సాదాసీదాగా కంటే భిన్నంగా, ప్రత్యేకంగా వివాహం జరిగింది.పెళ్లంటే ఏంటి?అయినా కూడా నావరకు ఈ పెళ్లంటే ఏంటి? అని పదేపదే ఆలోచిస్తూనే ఉన్నాను. ఇది కేవలం ఒక ఆర్భాటం కాదు, ప్రపంచమంతా చూసేలా జీవితంలో ఒకసారి చేసుకునే వేడుక మాత్రమే కాదు, ఇది మన అంతర్గతంగా జరిగే ఒక అద్భుత అనుభవం. స్త్రీ, పురుష శక్తుల కలయిక.. శివుడు, శక్తి (అమ్మవారు) మనలోనూ, మన మధ్యలోనూ ఉన్న అనుభూతి. కొన్నిసార్లు బయట శబ్ధాలు నా గొంతుకంటే పెద్దగా అనిపించాయి. తెలియని ప్రశాంతతకానీ, అతడిని చూసిన ప్రతిసారి ఏదో తెలియని ప్రశాంతత. సడన్‌గా ఆ శబ్ధం వినిపించకపోయేది. నేను చేయగలను అనుకున్నాను. అతడిని నా భాగస్వామిగా ఎంచుకుంటున్నాను అని నాకు నేను మరోసారి చెప్పుకున్నప్పుడు మనసు శాంతించింది. ఇద్దరం కలిసి నడుద్దాం.. అలాగే ఒకరికొకరం ఎదగడానికి అవకాశం ఇద్దాం. మన మధ్యలోని అనుబంధాన్ని కొనసాగిద్దాం.. ఇదే నాకు అన్నింటికన్నా ఎంతో ముఖ్యమైనది.పెళ్లి సులభంగా జరగలేదుసమయం వచ్చింది కాబట్టి మా పెళ్లి జరగలేదు, నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టే ఈ వేడుక జరిగింది. నేను ఊహించినంత సులభంగా ఈ పెళ్లి జరగలేదు. కానీ, ఎంతో నిజాయితీగా, అందంగా, అర్థవంతంగా వివాహం జరిగింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్న పునర్నవి.. ఉయ్యాల జంపాల, పిట్టగోడ, సైకిల్ వంటి పలు చిత్రాల్లో నటించింది.చదవండి: డోర్ తీసి చీర మార్చుకో.. స్టార్ నిర్మాత చెంప చెళ్లుమనిపించా: నటి -
నా బిడ్డను ఎవరూ ముద్దుపెట్టుకోవద్దు.. ఇది నా రూల్: మెరీనా
నటి, బిగ్‌బాస్ ఫేం మెరీనా అబ్రహం గతేడాది తల్లిగా ప్రమోషన్ పొందింది. పెళ్లయిన 8 ఏళ్లకు పేరెంట్స్ కావడంతో మెరీనా- రోహిత్ జంట ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఏడాది జనవరిలో పాపకు మొదటి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిపారు. అయితే తన బిడ్డపై ప్రేమను కురిపించడం వరకు ఓకే కానీ అతిగా ముద్దు చేయడం నచ్చడం లేదంటోంది మెరీనా. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ షేర్ చేసింది.ఇదంతా డ్రామా కాదునా పాప కోసం నేను కొన్ని హద్దులు గీసుకున్నాను, దయచేసి వాటిని గౌరవిస్తారనుకుంటున్నాను. తనకు చాక్లెట్లు ఇవ్వొద్దని చెప్పానంటే ఎవరూ ఇవ్వడానికి వీల్లేదు. నా పాపను ముద్దు పెట్టుకోకండి అని చెప్పినప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉండండి. ఇదంతా డ్రామా కాదు, యాటిట్యూడ్ అంతకన్నా కాదు.. ఇది పిల్లల్ని పెంచే పద్ధతి. ఏదో ఒకసారి అలా చేస్తే ఏమవుతుంది? అందులో అంత ప్రమాదకరం ఏముందని మీరు అనుకోవచ్చు. .నేనొకటే చెప్తున్నా..మీరంతవరకే ఆలోచించారు. కానీ నేను దాని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. తను అనారోగ్యానికి గురైతే బెంగపడేది నేను.. జాగ్రత్తగా చూసుకునేది నేను. కాబట్టి నేనొకటే చెప్తున్నా.. నా బిడ్డను మీరంతగా ఇష్టపడితే, నా మాటల్ని గౌరవించండి, నాకు సహకరించండి, నేను పెట్టిన రూల్స్‌ను అతిక్రమించకండి. నా బిడ్డ రక్షణే నాకు అన్నింటికన్నా ముఖ్యం అని రాసుకొచ్చింది.ఎందుకు భయం?పెద్దలు చిన్నపిల్లలకు ప్రేమతో ముద్దుపెడతారు. కొన్నిసార్లు అది ఇన్ఫెక్షన్కు దారి తీసే ప్రమాదం ఉంది. అలాగే పిల్లలు తినే చిరుతిండి వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మెరీనా.. తన కూతురికి అటువంటివి అలవాటు చేయొద్దని కోరుతోంది. మెరీనా- రోహిత్ ఇద్దరూ తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లో జంటగా పాల్గొన్నారు.చదవండి: చిరంజీవి కొత్త సినిమా ప్రారంభమయ్యేది అప్పుడే.. -
ప్రియుడిని పెళ్లాడిన పునర్నవి.. ఫోటోలు వైరల్
బిగ్‌బాస్ ఫేమ్, నటి పునర్నవి భూపాలం పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు, ఫోటోగ్రాఫర్ హేమంత్ వర్మతో ఏడడుగులు వేసింది. తన పెళ్లిలో ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో దిగిన సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు పునర్నవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా గతేడాది డిసెంబర్లోనే తన ప్రియుడిని పరిచయం చేసింది పునర్నవి. హేమంత్ వర్మకు ఎస్ చెప్పానంటూ ఫోటోలు షేర్ చేసింది. సినిమాఫిబ్రవరిలో వీరి ఎంగేజ్మెంట్ జరగ్గా.. నెల తిరిగేలోపు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పునర్నవి.. ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించింది. ఆ తర్వాత కూడా పిట్టగోడ, మనసుకు నచ్చింది, సైకిల్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత పైచదువుల కోసం లండన్ వెళ్లిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉండేది.చదవండి: కోర్ట్ జంట బ్యాండ్ మేళం ట్రైలర్ -
సైలెంట్‌గా వస్తారు.. స్పెషల్‌గా ఉండిపోతారు: రవికృష్ణ
చెన్నైలో ఓ సీరియల్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన రవికృష్ణ తర్వాత నటుడిగా మారాడు. మొగలి రేకులు సీరియల్‌తో నటుడిగా సెన్సేషన్ అయ్యాడు. అనంతరం బిగ్‌బాస్ షోతో గుర్తింపు పొందాడు. ఈ షో తర్వాత సినిమా ఛాన్సులు ట్రై చేశాడు. పలు చిత్రాల్లో నటించాడు. విరూపాక్ష సినిమాతో అతడి కెరీర్ మలుపు తిరిగింది. లవ్ మీ: ఇఫ్ యు డేర్, దండోరా.. ఇలా పలు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.ప్రేమలో..విజయవాడకు చెందిన ఇతడు ఆమె కథ అనే సీరియల్ చేస్తున్న సమయంలో నటి నవ్య స్వామితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఏ షోకి వెళ్లినా జంటగా కలిసే వెళ్లేవారు. అయితే ప్రేమలో ఉన్నామని మాత్రం ఎన్నడూ అధికారికంగా వెల్లడించలేదు. కానీ నవ్య బర్త్‌డే రోజు మాత్రం తనతో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ అందమైన క్యాప్షన్ ఇస్తుంటాడు. మంగళవారం (మార్చి 17న) నవ్య బర్త్‌డే. మనకు తెలియకుండానే స్పెషల్ఈ సందర్భంగా ఆమెతో కలిసి దిగిన రెండు పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఓయ్ స్వామి.. హ్యాపీ బర్త్‌డే. ఇలాగే క్రేజీగా, అందంగా జ్ఞాపకాలను కూడబెట్టుకుంటూ ఉండాలి. కొందరు మన జీవితాల్లోకి అనుకోకుండా వస్తారు. కానీ, మనకు తెలియకుండానే ఎంతో ప్రత్యేకంగా మారిపోతారు. అలాంటి అరుదైనవారి జాబితాలో నువ్వు కూడా ఒకదానివి! అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారని అడుగుతున్నారు. విజయ్-రష్మిక జోడీలాగే మీ జంట కూడా అద్భుతంగా ఉంటుందని, త్వరగా వివాహం చేసుకోమని కోరుతున్నారు. View this post on Instagram A post shared by Ravi krishna (@ravikrishna_official) చదవండి: పీలింగ్స్ చూశారు.. దీనికేమైందని అంత రాద్ధాంతం?: నటి -
నామకరణ ఫంక్షన్.. చెల్లి కోసం వితికా సర్ప్రైజ్
హీరోయిన్, బిగ్‌బాస్ బ్యూటీ వితికా షెరుకు ఎవరైనా నచ్చారంటే వారికోసం ఏమైనా చేస్తుంది. భర్త కోసం ఇల్లు కట్టి గిఫ్ట్ ఇచ్చింది. చెల్లికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఘనంగా సీమంతం చేసింది. స్నేహితురాలు, మెగా డాటర్ నిహారిక ఉండే ఇంట్లో ఆమెకోసం ఓ గదిని ప్రత్యేకంగా అలంకరించి సర్ప్రైజ్ చేసింది. ఇలా ఎప్పుడూ నా అనుకునేవారికోం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది.కృతికాకు పండంటి బాబుఇకపోతే 2025 డిసెంబర్లో వితికా పెద్దమ్మగా ప్రమోషన్ పొందింది. నటి సోదరి కృతికా పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇటీవలే ఆ పిల్లవాడి నామకరణ వేడుక జరిగింది. ఆ విషయాన్ని వితికా సిస్టర్స్ ఆలస్యంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. బాబుకు జైవీర్ కార్తికేయ అని నామకరణం చేసినట్లు కృతిక కొన్ని ఫోటోలు రిలీజ్ చేసింది. వితిక అయితే.. ఊయల ఫంక్షన్ కోసం దగ్గరుండి డెకరేషన్ చేయించింది. నామకరణ వేడుకపూలతో వెంకటేశ్వస్వామిని ఆవిష్కరించింది. అది చూసి కృతిక ఆశ్చర్యపోయింది. తనకోసం ఇంత కష్టపడిందా? అని తెగ సంతోషపడిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. నీలాంటి అక్క దొరికినందుకు కృతిక చాలా అదృష్టవంతురాలు అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వరుణ్ సందేశ్- వతిక 'ధర్మస్థల నియోజకవర్గం', 'డియర్ ఆస్ట్రోనాట్' సినిమాలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Krithika Sheru (@krithikasheru) -
'అవకాశాలు తర్వాత.. బరువు తగ్గు'.. ఏడ్చుకుంటూ వెళ్లా!
నటి సంభావన సేత్.. భోజ్‌పురి సినిమాల్లో ఎన్నో ఐటం సాంగ్స్ చేసింది. హిందీలోనూ నటిగా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్పెషల్ సాంగ్స్‌లో స్టెప్పులేసింది. అటు బుల్లితెరపై బిగ్‌బాస్, రాజ్ పిచ్లే జనం కా, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్కె ఖిలాడీ 4 ఇలా అనేక రియాలిటీ షోలలో పాల్గొంది.రెండో సీజన్లో పార్టిసిపేషన్అయితే తనకు ఓ స్టార్ హీరో అవకాశాలిస్తానని చెప్పి ఆ తర్వాత తన ఆశలపై నీళ్లు చల్లాడంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంభావన సేత్ మాట్లాడుతూ.. నేను హిందీ బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొన్నాను. నాలుగో సీజన్లో స్టేజీపై పర్ఫామెన్స్ చేశాను. అప్పుడు నటుడు రవికిషన్.. నేను భోజ్‌పురిలో మంచి పేరున్న డ్యాన్సర్ అని సల్మాన్ ఖాన్‌కు పరిచయం చేశాడు. ఫోన్ నెంబర్ కూడా..అందుకాయన.. ఇప్పుడే చూశాగా.. డ్యాన్స్ చాలా బాగా చేస్తోందని మెచ్చుకున్నాడు. నేను కొంత ధైర్యం తెచ్చుకుని తన సినిమాల్లో ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని అడిగాను. వెంటనే ఆయన తప్పకుండా ఇస్తానన్నాడు. తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. షో అయిపోయిన కొంతకాలానికి నేను ఆయన్ను కలిసేందుకు వెళ్లాను. అప్పుడతడు కాస్త చిరాకుగా ఉన్నాడు. కానీ బానే మాట్లాడాడు. ఏడ్చుకుంటూ వెళ్లా.సినిమా అవకాశం ఇస్తానన్నారు కదా అని గుర్తు చేశాను. అందుకు సల్మాన్.. నాకు గుర్తు లేదు కానీ మీరు కాస్త బరువు తగ్గాలి.. మరో విషయమేంటంటే ఇండస్ట్రీలో నేనెవర్నీ ప్రమోట్ చేయను అని ముక్కుసూటిగా చెప్పాడు. ఆ మాటలు నన్నెంతో బాధపెట్టాయి. ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. కానీ, ఇప్పటికీ నేను సల్మాన్ ఖాన్ అభిమానినే అని చెప్పుకొచ్చింది.చదవండి: 66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్? నటి ఏమందంటే? -
రూ.50 లక్షల ప్రైజ్‌మనీ.. మూణ్నెళ్లయినా ముట్టలే!
బుల్లితెర నటుడు గౌరవ్ ఖన్నా హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్లో తన ఆటతో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల మనసు గెల్చుకుని ఏకంగా ట్రోఫీ అందుకున్నాడు. విన్నర్‌గా రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెల్చుకున్నాడు. అయితే షో పూర్తయి మూడు నెలలు కావొస్తున్నా ఇంతవరకు ఆ డబ్బు ముట్టలేదట!ఇదెప్పుడూ ఉండేదే..ఈ విషయాన్ని అతడు తాజాగా తన యూట్యూబ్‌లో వెల్లడించాడు. గౌరవ్ ఖన్నా మాట్లాడుతూ.. షోలో ప్రకటించిన ప్రైజ్‌మనీ, కారు.. ఇవన్నీ నా చేతికి రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకు అవసరమైన ప్రక్రియ కొనసాగుతోంది. టీవీ ఇండస్ట్రీలో ఇలాంటి ఆలస్యాలు ఎప్పుడూ ఉండేవే.. రెండు నెలల్లో..కానీ తప్పకుండా నాకు ఇస్తానన్నవి ఇచ్చి తీరతారు. అందుకు కనీసం రెండు నెలలైనా పడుతుంది అని చెప్పుకొచ్చాడు. కాగా గౌరవ్.. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా షో విజేతగా నిలిచి ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. ఆ వెంటనే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా విజయ దుందుభి మోగించాడు.చదవండి: నా పెళ్లికి ముందు అన్న ఇచ్చిన సలహా: అల్లు శిరీష్ -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఇంట తీవ్ర విషాదం
టాప్-3 బిగ్‌బాస్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ ఇంట విషాదం నెలకొంది. ఈ విషయాన్ని పవన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మీ నాన్న నీతో లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని ధైర్యం చెప్పారు. బిగ్‌బాస్ షో సమయంలో కూడా తన తండ్రి ఆరోగ్యం బాగలేదని డీమాన్ పవన్ చెప్పారు. వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇంతలోనే ఆ కుటుంబంలో ఈ విషాదం నెలకొంది. అయితే పవన్ తండ్రి నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.కాగా.. బిగ్‌బాస్ 9 నుంచి డీమాన్ పవన్ టాప్-3లో నిలిచాడు. రీతూతో బంధంపై విమర్శలు వచ్చినప్పటికీ టాస్కుల పరంగా తన టాలెంట్‌తో అదరగొట్టేశాడు. రెండుసార్లు కెప్టెన్ కూడా అవ్వడమే కాకుండా తెలివిగా మాస్ మహారాజ రవితేజ ఆఫర్ చేసిన రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని బయటకు వచ్చేశాడు. సీజన్ అంతా పవన్‌ను తొక్కేసిన బిగ్‌బాస్.. జర్నీ వీడియోలో మాత్రం వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. -
ఆ ఫోన్ రాకపోయుంటే చనిపోయేవాడిని: నాగమణికంఠ
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూసేవాళ్లు చాలామంది! ఆ ఛాన్స్ దొరక్క ఇక జీవితంపై ఆశలు వదిలేసుకుని తనువు చాలించాలనుకున్నాడు నాగమణికంఠ. అలాంటి సమయంలో బిగ్‌బాస్ షో నుంచి పిలుపు వచ్చింది. మళ్లీ గుండె నిండా ఆత్మవిశ్వాసం నింపుకుని షోలో అడుగుపెట్టాడు. ఒక్క పాటతో ఫుల్ ట్రోల్ అయ్యాడు. కానీ, తర్వాత నెమ్మదిగా ప్రేక్షకుల ఆదరణ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బీబీ జోడీ డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాడు.రెండేళ్లపాటు..ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ.. మనలో వచ్చే నెగెటివ్ ఆలోచనలను అక్కడే చంపేయాలి. రెండేళ్లపాటు నేనేం సంపాదించలేదు, ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. ఇక అయిపోయిందిరా భయ్ అనుకున్నాను. ఆ 10 నిమిషాల్లో నాకు ఫోన్‌కాల్ రాకపోయుంటే నా జీవితం ముగిసిపోయేది. సరిగ్గా అదే సమయంలో బిగ్‌బాస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఏడ్చేసిన సదాఅప్పుడు కన్నీళ్లు తుడుచుకుని ఇంటర్వ్యూకి వెళ్లాను అని పేర్కొన్నాడు. నీ వెనక ఇలాంటి గతం ఉందని తెలీదు, నాకు చాలా బాధగా అనిపిస్తోందంటూ నటి సదా కన్నీళ్లు పెట్టుకుంది. కాగా నాగమణికంఠ సీరియల్ నటుడు. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుంది. కానీ, అతడిని తండ్రిగా స్వీకరించలేకపోయాడు. బిగ్‌బాస్ షోతో గుర్తింపుఇంతలో తల్లి క్యాన్సర్‌తో 2019లో మరణించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేసిన అతడు మంచి ఉద్యోగం సంపాదించాడు. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. కూతురు పుట్టడంతో తల్లే తిరిగి వచ్చిందని సంతోషించాడు. కానీ, భార్యాభర్తల మధ్య కలహాలు మొదలవడంతో ఇండియాకు ఒంటరిగా తిరిగొచ్చేశాడు. తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌తో గుర్తింపు పొందాడు. -
నేనెంత లక్కీ.. కన్నీళ్లాగడం లేదు: తనూజ ఎమోషనల్
సెలబ్రిటీలు జనాల అభిమానాన్ని, కోపాన్ని అస్సలు తట్టుకోలేరు. వారి ప్రేమాభిమానాలు చూసి ఆనందభాష్పాలు రాలుస్తారు. కోపంతో దారుణంగా విమర్శించినప్పుడు ఎందుకిలా చేస్తున్నారని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటారు. నటి, తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ రన్నరప్ తనూజ పుట్టస్వామి కూడా ఇప్పుడు సంతోషంతో ఏడ్చేసింది.నేనెంత అదృష్టవంతురాలినో..ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. తనను ఎంతగానో ఇష్టపడే ఓ మహిళా అభిమాని తనకోసం డైరీ రాసిందని, దాన్ని చదువుతున్నానని పేర్కంది. నేనెంత అదృష్టవంతురాలినో కదా.. నాకు పుస్తకాలు చదవడమంటే ఇష్టం. ఈసారి ఎంతో ప్రత్యేకమైన పుస్తకాన్ని చదువుతున్నాను. నా యోగక్షేమాలు కోరుకునే వ్యక్తి నాకోసం స్పెషల్‌గా రాసిన డైరీ చదువుతున్నాను. నాకు మాటలు రావడం లేదు. నన్ను అర్థం చేసుకున్నారునమ్ముతారో, లేదో.. ఇది చదువుతూ ఉంటే కన్నీళ్లు ఆగడం లేదు. మనల్ని లోతుగా అర్థం చేసుకునేది మన కుటుంబసభ్యులు మాత్రమే.. కానీ, నా విషయంలో.. ఎంతోమంది జనం నన్ను అర్థం చేసుకున్నారు, అక్కున చేర్చుకున్నారు.. నా మంచి కోసం ప్రార్థిస్తున్నారు. నా జీవితానికి ఇది చాలు అని తనూజ ఆనందం వ్యక్తం చేసింది. తనకోసం డైరీ రాసిన వందన అనే అమ్మాయికి ఐ లవ్యూ చెప్పింది.చదవండి: ప్రేమలో కోర్ట్ హీరోహీరోయిన్.. వాళ్ల స్పందన ఇదే! -
సెకండ్ హ్యాండ్ బట్టలు కొంటాను: బిగ్‌బాస్ కంటెస్టెంట్
సెలబ్రిటీలు ఏం చేసినా, చేయకపోయినా విమర్శలపాలవుతూనే ఉంటారు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 1 విన్నర్ దివ్య అగర్వాల్ పరిస్థితి కూడా ఇంతే! తరచూ ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంటుంది. ఆస్తి చూసే అపూర్వ పడగోయంకర్ను పెళ్లి చేసుకుందని కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ విమర్శలపై తాజా ఇంటర్వ్యూలో నటి స్పందించింది.ఏమైనా అనుకోండిదివ్య అగర్వాల్ మాట్లాడుతూ.. నన్ను గోల్డ్ డిగ్గర్ (డబ్బు కోసమే సంబంధం పెట్టుకోవడం) అని పిలవాలనుకుంటే పిలుచుకోండి.. అవసరమైతే డైమండ్ డిగ్గర్ అని కూడా పిలవండి. నాకు మాత్రం నా జీవితంలో సరైన భాగస్వామి దొరికాడు. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో నాకు దొరికిన అత్యంత విలువైన బంగారం ఆయనే!అవేం లేవుగాఅయినా జనం కాస్తయినా బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. నేనేమైనా లంబోర్గినిలో తిరుగుతున్నానా? జుహు బీచ్ దగ్గర బంగ్లాలో ఉంటున్నానా? నాకంటూ ఓ ప్రైవేట్ జెట్ ఉందా? ఇవన్నీ లేవే.. నేను ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణిస్తాను. మరెందుకు నాపై అంత కోపం, ద్వేషం? ఆడవాళ్లు కేవలం డబ్బు చూసే పెళ్లి చేసుకుంటారని ఎందుకు తప్పుగా అనుకుంటారు?పెళ్లిఆ పెళ్లికి కారణమైన ప్రేమను చూడరా? నేనెప్పుడూ సింపుల్‌గానే ఉండాలనుకుంటాను, ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాను. అంతెందుకు.. నేను సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా కొంటుంటాను అని చెప్పుకొచ్చింది. దివ్య- అపూర్వ 2024 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.చదవండి: ఓటీటీలో ఫంకీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే? -
అణిగిమణిగి ఉండాలి.. ఓవరాక్షన్ చేస్తే తీసేస్తారు: అషూ
టిక్‌టాక్ ద్వారా జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అషూ రెడ్డి. డబ్ స్మాష్, రీల్స్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. ఓటీటీలో ప్రసారమైన బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లోనూ పాల్గొని మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.ఇప్పటివరకు ఎన్నో చేశా..ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉండే ఈ బ్యూటీ తాజాగా విక్రమ్ ఆన్ డ్యూటీ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విన్నర్ నిఖిల్ మళయక్కల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. తాజాగా విక్రమ్ ఆన్ డ్యూటీ ప్రెస్మీట్లో అషూ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో స్టేజ్ పర్ఫామెన్స్‌లు, క్యారెక్టర్ రోల్స్, హోస్టింగ్.. ఇలా అన్నీ చేశాను. హీరోయిన్ అంటుంటే..తొలిసారి హీరోయిన్గా చేశాను. షూటింగ్లో అందరూ హీరోయిన్‌గారు అని పిలుస్తూ ఉంటే ఏంటి? నన్నేనా? అని ఆశ్చర్యపోయాను అంది. ఈ సమావేశంలో ఓ విలేకరి అషూను ఓ ప్రశ్న అడిగాడు. నిర్మాత ప్రవీణగారి ప్రాజెక్ట్ అంటే బోణీ బాగానే ఉంటుంది. మరి హీరోయిన్గా సినిమాలు కొనసాగిస్తారా? అని ప్రశ్న సంధించాడు.ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా..అందుకు అషూ స్పందిస్తూ.. ఆర్టిస్టులు ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా ప్రొడక్షన్ హౌస్ ఓనర్లు, నిర్మాతలు వారిని తీసేయడానికి వెనుకాడరు. సెట్లో అయినా, ఇంట్లో అయినా కొంచెం అణిగిమణిగి ఉండాలి అంది. దీంతో వెంటనే నిర్మాత మైక్ అందుకుని.. ఎవరూ అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు పని వాళ్లు చేసుకుంటూ పోతే ఎవరూ ఇబ్బందిపెట్టరు. సెట్‌కు వచ్చినప్పటినుంచి, బయటకు వెళ్లేవరకు ఇది నా పని అని అంకితభావంతో పని చేస్తే మిమ్మల్ని ఎవరూ టచ్ కూడా చేయరు అని క్లారిటీ ఇచ్చింది.చదవండి: త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందంటే? -
భార్యను కొట్టిన మాస్క్ మ్యాన్.. కాళ్లు పట్టుకుని క్షమాపణలు
మాస్క్ మ్యాన్.. బిగ్‌బాస్ కంటే ముందే ఈ పేరు బాగా ఫేమస్ అయింది. బిగ్‌బాస్ 9లో అడుగుపెట్టాలంటే అగ్నిపరీక్ష దాటాలని సామాన్యుల కోసం ఓ షో ఏర్పాటు చేశారు. అందులో మాస్క్ మ్యాన్ పాల్గొన్నాడు. తన పేరు హరిత హరీశ్ అని తెలిపాడు. భార్యపై ఉన్న ప్రేమతో ఇల్లాలి పేరునే తన పేరులో చేర్చుకున్నట్లు తెలిపాడు. అది విని భార్యంటే ప్రేమ, గౌరవం బాగానే ఉందని అందరూ అనుకున్నారు.కోపమొస్తే కొట్టేస్తావా?కానీ, అంతలోనే ఒకసారి భార్యపై చేయి చేసుకున్నానని చెప్పడంతో అందరూ షాకయ్యారు. ఎంత కోపం వస్తే మాత్రం కొట్టేస్తావా? ఆడదానిపై చేయెత్తుతావా? అని తిట్టిపోశారు. అలా నెగెటివిటీతోనే బిగ్‌బాస్ 9వ సీజన్లో సామాన్యుడిగా అడుగుపెట్టాడు. తన ముక్కుసూటితనం, మొండితనం, కోపం వల్ల ఎక్కువమందిని ఆకర్షించలేకపోయాడు.కాళ్లు పట్టుకుని క్షమాపణలుఅయితే ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి వస్తున్నాడు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో భార్య హరితతో కలిసి హరీశ్ పాల్గొన్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో మాస్క్ మ్యాన్ మాట్లాడుతూ.. మగాడు ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటాడని చెప్పి ఆడవారిపై చేయత్తడం చాలా తప్పు అంటూ భార్య కాళ్లు నమస్కరించాడు. అలా అప్పటి వివాదానికి ఇలా ఫుల్స్టాప్ పెట్టాడు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కపుల్ రియాలిటీ షో మార్చి 15న ప్రారంభం అవుతోంది. ఇది మా టీవీతో పాటు హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. చదవండి: తండ్రి మరణించిన పదేళ్లకు ఆయన కల నెరవేర్చిన కూతురు -
తనూజ బర్త్‌డే.. బంగారు కానుకిచ్చిన మాధురి
ముద్దమందారం సీరియల్‌తో తెలుగువారికి దగ్గరైంది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి. ఇటీవల తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షోలో ఎంతోమంది స్నేహితులను సైతం సంపాదించుకుంది. వారిలో దివ్వెల మాధురి ఒకరు. బిగ్‌బాస్ షోలో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన మాధురి.. మొదట తనూజపై విరుచుకుపడింది.బిగ్‌బాస్ షోలో క్లోజ్కట్ చేస్తే వారం తిరగకముందే అందరికంటే ఎక్కువ తనూజతో క్లోజ్ అయిపోయింది. మాధురి కటౌట్ చూసి భయపడ్డ తనూజ ఆమెను ముద్దుగా మ్యాడీ అని పిలుస్తూ ప్రేమగా పెత్తనం కూడా చెలాయించింది. అప్పటినుంచి వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇక నేడు (మార్చి 5న) తనూజ 30వ పుట్టినరోజు జరుపుకుంటోంది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరుపుకుంటున్న మొదటి బర్త్‌డే ఇది! మై స్వీట్ హార్ట్ దీంతో దివ్వెల మాధురి తనకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. తనతో కేక్ కట్ చేయించి, చీరగాజులు పెట్టింది. అలాగే బంగారు చెవికమ్మలను బహుమతిగా ఇచ్చింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హ్యాపీ బర్త్‌డే బంగారా.. మై స్వీట్ హార్ట్ తనూజ పుట్టస్వామి. ఇది నువ్వు నాతో జరుపుకుంటున్న తొలి బర్త్‌డే! నువ్వు నేరుగా స్వర్గం నుంచే దిగివచ్చావు. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తాను అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు తనూజ థాంక్యూ మ్యాడీ అని కామెంట్ పెట్టింది. View this post on Instagram A post shared by Divvala Madhuri (@madhuri_srinivasduvvada) చదవండి: గర్భధారణలో కష్టాలు.. తనే నా మిరాకిల్ బేబీ: ప్రియాంక చోప్రా -
కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా!
ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పా? అంతమాత్రానికే ఇలా నాకు నరకం చూపించాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు యూట్యూబర్, హిందీ బిగ్‌బాస్ 17 ఫేమ్ అనురాగ్ దోభల్. కులాంతర వివాహం చేసుకున్న కారణంతో తన కుటుంబం తనను వెలేసిందని, ఇక తనకు చావే దిక్కని వాపోయాడు. ఈ మేరకు యూట్యూబ్‌లో కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.చిన్నప్పటినుంచి కష్టాలు'గత కొన్నినెలలుగా నా జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. జీవితం ఇంత దుర్భరంగా మారుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు. 14 ఏళ్ల వయసులోనే నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఆ తర్వాత నా పేరెంట్స్ వారికి నచ్చిందే చదవాలని నాపై బలవంతం చేశారు. నేనేమో నా కలల్ని నిజం చేసుకోవడం కోసం డబ్బు కూడబెట్టేందుకు కష్టపడ్డాను. ట్యూషన్స్ చెప్పాను. నాకన్నా నా పేరెంట్స్ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను.పెళ్లి ఇష్టం లేదుసోషల్ మీడియా ద్వారా రితిక అనే అమ్మాయిని కలిశాను. తను నా అభిమాని అని పేర్కొంటూ రెండుమూడేళ్లపాటు మెసేజ్‌లు చేసింది. అలా ఒకరోజు ఆమె మెసేజ్‌కు రిప్లై ఇచ్చాను. అలా తనతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరం రెండేళ్లపాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి మా పెద్దలకు ఇష్టం లేదు. వారం రోజుల్లో పెళ్లి అనగా వేడుకకు రామని చెప్పేశారు. ఎంతగానో బతిమాలాను. బంధువులందరి ముందు చేతులెత్తి వేడుకున్నాను. వార్నింగ్కాళ్లు పట్టుకుని క్షమించమని అడిగాను. అయినా వారి మనసు కరగలేదు. మేము సంతోషంగా లేము, మిమ్మల్నీ సంతోషంగా ఉంచము అని వార్నింగ్ ఇచ్చారు. మమ్మల్ని టార్చర్ పెట్టారు. నా దగ్గరున్నదంతా లాక్కున్నారు. పెళ్లయ్యాక ఇంట్లో కూడా అడుగుపెట్టనివ్వలేదు. చచ్చిపోవాలనుకున్నాను. నాకేదైనా అయితే అందుకు నా ఇంట్లోవాళ్లే కారణం.బోరుమని ఏడ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ఇప్పుడు రితిక కూడా నన్ను వదిలేసింది. నేను తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాను. ఈ బాధను ఎలా పోగొట్టుకోవాలో అర్థం కావట్లేదు. బహుశా ఈ వీడియో తర్వాత నేను కనిపించనేమో! ఐదు రోజులుగా ఏమీ తినలేదు. ప్రశాంతంగా నిద్రపోవాలనుంది. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను. కానీ బయటవాళ్లు చెప్పిందే నమ్మారు. నన్ను దూరం పెట్టారు. నేను చనిపోయాక అయినా నా బిడ్డను ఆదరించండి అని బోరుమని ఏడ్చాడు. ఇదే తన చివరి వ్లాగ్ అని అనురాగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. అనురాగ్ భార్య గతేడాది సెప్టెంబర్‌లో గర్భం దాల్చింది.చదవండి: చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నా: బండ్ల గణేశ్ -
ఒంటరితనం భరించలేకపోతున్నా.. తోడు కావాలి!
దాదాపు 40 సినిమాలు చేసిన కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధి 2023లో మరణించాడు. అతడి మరణంతో ఎంతగానో కుంగిపోయింది కమెడియన్ రెండో భార్య, నటి రేణు సుధి. అయితే రానురానూ ఆ బాధ నుంచి తేరుకుంటూ తనకిష్టమైన వ్యాపకాలపై శ్రద్ధ పెట్టింది. రీల్స్ చేయడం, సాంగ్స్‌లో యాక్ట్ చేయడం, రకరకాలుగా ఫోటోషూట్స్ చేయడంతో సోషల్ మీడియాలో తన పేరు మారుమోగిపోయేది. బిగ్‌బాస్ షోతో గుర్తింపుకొందరైతే వితంతువై ఉండి ఈ పిచ్చి చేష్టలేంటి? సుధికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావ్ అని విమర్శించారు కూడా! అలా ట్రోలింగ్ బారిన పడ్డ సమయంలో మలయాళ బిగ్‌బాస్ ఏడో సీజన్లో పార్టిసిపేట్ చేసింది. అక్కడ వచ్చిన క్రేజ్‌తో రెండు, మూడు సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. తాజాగా రేణు సుధికి భాగస్వామి కావాలనిపిస్తోందట. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. తోడు కావాలిఒంటరితనం భరించలేకపోతున్నాను. నాకు ఒక పార్ట్నర్ కావాలనిపిస్తోంది. నన్ను అర్థం చేసుకుని, నా బాగోగులతో పాటు పిల్లల్ని చూసుకునే తోడు కావాలనిపిస్తోంది అని రాసుకొచ్చింది. గతంలో కూడా రేణు మళ్లీ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు నచ్చిన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటానంది. అప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు వదిలేసి అతడితో మరో ఇంట్లో స్థిరపడతానంది. అలాగే తన పేరు పక్కన ఉన్న సుధిని చెరిపేస్తానంది.రెండో పెళ్లిమిమిక్రీ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న కొల్లం సుధిని మొదటి భార్య వదిలేసింది. అప్పటికే వీరికి కుమారుడు రాహుల్ సంతానం. భార్య వదిలేశాక సింగిల్ పేరెంట్‌గా చాలా ఇబ్బందులు పడ్డాడు సుధి. కొన్నేళ్ల తర్వాత అతడికి రేణుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు రితుల్ సంతానం. రేణుకు కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం! -
తండ్రిగా ప్రమోషన్ పొందిన 'పార్కింగ్' హీరో
తమిళ హీరో, పార్కింగ్ ఫేమ్ హరీశ్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించాడు. తనకు కూతురు పుట్టిందన్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. నాకు, నర్మదకు ఈరోజు (మార్చి 2న) పాప పుట్టింది. ఆనందంగా ఉందితల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమఃశివాయ అంటూ ఓ లేఖ షేర్ చేశాడు. కాగా హరీశ్ కల్యాణ్- నర్మద ఉదయకుమార్ 2022 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు.సినిమా2010లో వచ్చిన సింధు సామావెల్లి చిత్రంతో కోలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యాడు. చందమామ, పొరియాలన్, ప్యార్ ప్రేమ కాదల్, లెట్స్ గెట్ మ్యారీడ్, పార్కింగ్, లబ్బర్ పండు, డీజిల్ సినిమాలు చేశాడు. తెలుగులో జై శ్రీరామ్, జెర్సీ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. కెరీర్ తొలినాళ్లలో తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్న హరీశ్ కల్యాణ్ నూరు కోడి వానవిల్ మూవీ చేస్తున్నాడు. Elated to share the most wonderful news with all my dear family ❤️🤗God willing 🙏 pic.twitter.com/11Icq8OMMz— Harish Kalyan (@iamharishkalyan) March 2, 2026 చదవండి: పెళ్లికి ముందు సహజీవనం.. నాకు అవకాశం ఇచ్చుంటే..: లయ -
ఖరీదైన హీల్స్ ధరించిన హీరోయిన్.. చెప్పుల ధర వేలల్లో కాదు!
'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది నిక్కీ తంబోలి. కాంచన 3, తిప్పరా మీసం వంటి చిత్రాల్లో నటించినా తనకు పెద్ద గుర్తింపు రాలేదు. దాంతో ఐటం సాంగ్స్‌పై ఫోకస్ చేసింది. హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. లేటెస్ట్ రియాలిటీ షో ద 50లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసి మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.గోవా ట్రిప్తాజాగా ఆమె ద 50 షోలోని సహకంటెస్టెంట్లతో వెకేషన్‌కు వెళ్లింది. ఈ గోవా ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో నిక్కీ బ్లూ కలర్ పొట్టి డ్రెస్‌లో తళుక్కుమని మెరిసింది. అయితే అందరి దృష్టి మాత్రం తను ధరించిన హీల్స్పైనే పడింది. కారణం ఏంటో తెలుసా? ఆ హీల్స్ డాల్స్ అండ్ గబ్బానా అనే లగ్జరీ బ్రాండ్‌కు చెందిన చెప్పులు.చెప్పుల ధర ఎంతంటే?ఆ హీల్స్ ధర అక్షరాలా లక్ష 46 వేలని తెలుస్తోంది. నిక్కీ తంబోలికి మేకప్ దగ్గరినుంచి అలంకరణ వరకు అన్నీ ఖరీదైనవి వాడటం బాగా అలవాటు. ఈ విషయాన్ని ఆమె ప్రియుడు అర్బాజ్ పటేల్ కూడా ధ్రువీకరించాడు. తను వాడే మాయిశ్చరైజర్ ధర రూ.75 వేలు, సీరమ్ రూ.50 వేలు అని తెలిపాడు. View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) చదవండి: అప్పటిదాకా నా కొడుకు సినిమా చూడను: సునీల్ శెట్టి -
ఉసురు తగులుతుంది.. ఇచ్చిపడేసిన తనూజ
బిగ్‌బాస్ షో వల్ల పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా అంతే వస్తుంది. వాళ్లు ఏం చేసినా, చేయకపోయినా ట్రోలింగ్స్ బారిన పడుతూ ఉంటారు. వారికి సంబంధం లేని విషయాల్లో కూడా బిగ్‌బాస్ కంటెస్టెంట్ల పేరు ఇరికించి విమర్శిస్తుంటారు. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ రన్నరప్, నటి తనూజ విషయంలో ఇదే జరిగింది.తనూజ కోసం నిలబడ్డ పవన్'ముద్ద మందారం' సీరియల్‌తో ఫేమస్ అయిన తనూజకు ఆ సీరియల్ నటీనటులతో మంచి అనుబంధం ఉంది. ముద్ద మందారం సీరియల్ హీరో పవన్ సాయి కూడా తనకు మంచి మిత్రుడు. తనూజ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఆమె కోసం స్టేజీపైకి కూడా వచ్చాడు. అయితే పవన్ విడాకులకు తనూజయే కారణమని కొందరు ఆమెను విమర్శిస్తున్నారు.ఉసురు తగులుతుందితాజాగా తనూజ తన ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేయగా ఓ నెటిజన్ పవన్ సాయి విషయాన్ని ప్రస్తావించాడు. పవన్ సాయి భార్య కర్మ నిన్ను వదిలిపెట్టదు, ఆమె ఉసురు నిన్ను వెంటాడుతుంది అని శాపనార్థాలు పెట్టాడు. అందుకు తనూజ గట్టి కౌంటర్ ఇచ్చింది. నీ కర్మ కూడా నిన్ను వెంటాడకముందే నీపై నువ్వు ఫోకస్ చేసుకోవడం మంచిది. నా గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నేను చాలా బాగున్నాను. నా కర్మఫలం బాగుంది కాబట్టే నా జీవితంలో అంతా మంచే జరుగుతోంది.కౌంటర్ ఇచ్చిన తనూజఅయినా ఇలా ముఖం కూడా చూపించకుండా ఫేక్ ఐడీలతో ఇలాంటి మెసేజ్‌లు పెట్టడానికి కొంచెం కూడా సిగ్గులేదా? నీకు ఎవరి ఉసురు వెంటాడకుండా చూసుకో.. అని ఇచ్చిపడేసింది. చివర్లో తనను విమర్శించేవాళ్లకు కౌంటరిచ్చింది. డియర్ హేటర్స్.. మీరు నా ప్రశాంతతని పాడు చేయలేరు. నన్ను రెచ్చగొట్టేందుకు మీరు చేసిన ప్రయత్నాలు ఫలించవు. అయినా మీరు ప్రశాంతంగా ఉండండి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.చదవండి: విజయ్‌తో విడాకులు... సంగీత ఎవరో తెలుసా? -
ప్రేయసి ముఖం పచ్చబొట్టు! నటుడు ఏమన్నాడంటే?
బాలీవుడ్ నటుడు కరణ్ కుంద్రా గుండె నిండా తేజస్వి ప్రకాశ్ నిండి ఉంది. ఆమె అంటే కరణ్‌కు పంచప్రాణాలు. అందుకే తాజాగా అతడి ఛాతీపై తేజస్వి ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇది చూసిన అభిమానులు ప్రియురాలిపై అతడు చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయ్యారు.టాటూ నిజమైనదా?ఈ క్రమంలో కరణ్ ఇది శాశ్వత పచ్చబొట్టు కాదని వెల్లడించాడు. తేజస్వి నటించిన సైకో సయ్యా.. వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ తాత్కాలిక టాటూ వేయించుకున్నానని వివరణ ఇచ్చాడు. తనకు సపోర్ట్‌గా నిలబడేందుకు ఇలా టాటూతో కనిపించానన్నాడు.బిగ్‌బాస్ షోలో మొదలైన లవ్హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్లో కరణ్- తేజస్వి ప్రకాశ్ పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన ఏడాదికే అంటే 2022లోనే పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడింది. అప్పటినుంచి పెళ్లిని దాటవేస్తూనే ఉన్నారు. మధ్యలో ఈ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చినా అదంతా ఉత్త ప్రచారమే అని తేలిపోయింది. ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడల్లా.. మాది ఫెవికాల్ బంధమని కరణ్-తేజస్వి ఎన్నోసార్లు రుజువు చేశారు.చదవండి: ప్రేయసితో బిగ్‌బాస్ షణ్ను ఎంగేజ్మెంట్ -
ప్రేయసితో బిగ్‌బాస్ షణ్ముఖ్ ఎంగేజ్మెంట్
ఒకప్పుడు కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్ ద్వారా యూట్యూబ్‌లో సెన్సేషన్ అయ్యాడు షణ్ముఖ్ జశ్వంత్. ఆ తర్వాత బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి మరింత పాపులర్ అయ్యాడు. తర్వాత పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన షణ్ను ఈ ఏడాది ప్రారంభంలో ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. తను ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు. అమ్మాయి ముఖం చూపించకుండా, పేరు చెప్పకుండా కేవలం V అనే అక్షరాన్ని మాత్రమే వెల్లడించాడు.ఎంగేజ్మెంట్తాజాగా ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలిపాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు వైష్ణవి చోడిశెట్టి. తనొక ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుస్తోంది. ఫిబ్రవరి 25న అంటే ఈరోజు తన నిశ్చితార్థం జరిగిందని ఫోటోలు షేర్ చేశాడు. దేవుడు ఈ రకంగా ప్లాన్ చేశాడు.. అయిపాయె అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోల్లో షణ్ముఖ్ - వైష్ణవి ఇద్దరూ బంగారు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కెరీర్షణ్ముఖ్ సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉండేది. కానీ ఎప్పుడైతే బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాడో అంతా తలకిందులైంది. ఈ రియాలిటీ షోలో నటి సిరి హన్మంత్‌తో లవ్ ట్రాక్ నడిపాడు. ఇది జనాలకు మింగుడుపడలేదు. ఎందుకంటే అప్పటికే షణ్ను.. దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నాడు. ఆల్రెడీ ప్రేమలో ఉండగా మళ్లీ ఈ పిచ్చిపనులేంటి? అని అందరూ విమర్శించారు.తీరా షో నుంచి బయటకు వచ్చాక దీప్తితో బ్రేకప్ కూడా అయింది. ఇంతలో డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. మరోపక్క అమ్మకు క్యాన్సర్.. చాలాకాలం పాటు డిప్రెషన్‌తో కుంగిపోయాడు. కానీ నెమ్మదిగా దాన్నుంచి బయటపడి తిరిగి కెరీర్‌పై ఫోకస్ పెట్టాడు. అలా ప్రేమకు నమస్కారం అని ఓ సినిమా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) చదవండి: రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి -
ఇంకా అదే బాధలో ఉన్న ఇమ్మాన్యుయేల్
బిగ్‌బాస్ ట్రోఫీ సాధించాలంటే గేమ్స్ గెలవడం కాదు, ప్రేక్షకుల మనసు గెలవాలి. అప్పుడే టైటిల్ కొట్టడం సాధ్యమవుతుంది. అది ఇమ్మాన్యుయేల్‌కు బాగా తెలుసు. అందుకే షోలో అడుగుపెట్టిన మొదటి క్షణం నుంచి అందర్నీ నవ్విస్తూ, అన్ని ఆటల్లోనూ టఫ్ కాంపిటీషన్ ఇస్తూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.గెలుపు తథ్యం అనుకుంటే..అతడి ఆట, మాట, తీరు అన్నీ చూసిన నాగార్జున ప్రతివారం ఇమ్మూపై ప్రశంసల వర్షం కురిపించేవాడు. గోల్డెన్ స్టార్ బ్యాడ్జ్ ఇచ్చేవాడు. ఇంట్లోకి వచ్చినవాళ్లందరూ కూడా ఇమ్మూని ఆకాశానికి ఎత్తేయడంతో తనకు తిరుగులేదనుకున్నాడు. ట్రోఫీ గెలుస్తానని నమ్మకంగా ఉన్నాడు.ఫైనల్స్‌లో నాలుగో స్థానంకానీ అనూహ్యంగా ఇమ్మూ, తనూజ మధ్య ఉన్న పోటీ.. షో చివరాఖరకు వచ్చేసరికి తనూజ వర్సెస్ కల్యాణ్‌గా మారిపోయింది. పవన్ కూడా ఇమ్మూని వెనక్కు నెట్టి రేసులో ముందుకు వచ్చాడు. దాంతో ఫైనల్స్‌లో ఇమ్మూ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కల్యాణ్ ట్రోఫీ గెలవగా తనూజ రన్నరప్, పవన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. అసలు గెలవకపోడమే అనంతమైన బాధ అంటే ఏకంగా నాలుగో స్థానంలో ఉండటంతో ఇమ్మాన్యుయేల్ తట్టుకోలేకపోయాడు. విన్నర్‌గా ఎందుకు చూడరు?తాజాగా బీబీ ఉత్సవం ప్రోమోలో తనకు అన్నింటికన్నా పెద్ద బాధ ఏంటో బయటపెట్టాడు. తల్లితో పాటు స్టేజీపైకి వచ్చిన ఇమ్మూ.. కమెడియన్లను విన్నర్‌గా చూడరనే విషయం నాకు తెలుసు. కానీ ఎందుకు చూడరు? మనం గేమ్స్ ఆడితే చూస్తారుగా అనుకున్నాను. నా నమ్మకం నిలబడలేదు. అలా అని ఓడిపోయినందుకు కొంచెం కూడా బాధపడలేదు. కానీ, అమ్మానాన్న ఇద్దరూ క్యారేజీ కట్టుకుని బైక్‌పై 90 ఊర్లు తిరిగారు. నాకు ఓటేయమని పాంప్లెట్లు పంచారు. హీరో చేతుల మీదుగా సన్మానంఇప్పటికీ నా మైండ్‌లో అదే తిరుగుతోంది అంటూ ఏడ్చేశాడు. అటు ఇమ్మూ తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం హీరో నిఖిల్.. స్టేజీపైకి వచ్చి ఇమ్మూ తల్లికి శాలువా కప్పి సన్మానం చేశాడు. అలాగే ఇమ్మాన్యుయేల్‌కు బిగ్‌బాస్ 9 ఆల్‌రౌండర్ అనే ట్రోఫీని అందించాడు. ఏదేమైనా ఎంత కష్టపడ్డా తనకు విజయం దక్కలేదన్న బాధ ఇమ్మూ మనసులో ఇప్పటికీ అలాగే ఉంది!చదవండి: హీరోయిన్ కళ్లలో కళ్లు పెట్టి చూడాలంటే సిగ్గేసింది: బాలీవుడ్ హీరో -
తొలిసారి కూతురి ఫోటో షేర్ చేసిన అర్జున్
సీరియల్ నటుడు, తెలుగు బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ అర్జున్ అంబటి గతేడాది తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అర్జున్- సురేఖ దంపతులు 2025 జనవరి 9న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కూతురికి అర్ఖ అని నామకరణం చేశారు. తన పేరులోని ఆర్.. సురేఖ పేరులోని ఖ అక్షరాలు తీసుకుని అర్ఖ అని వచ్చేలా పేరు పెట్టామని వెల్లడించాడు.తొలిసారి కూతురి ఫోటోఅయితే పాప ఫోటోలు మాత్రం వీరు సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. తాజాగా అర్జున్- సురేఖ దంపతులు తమ ఏడో పెళ్లిరోజు సందర్భంగా ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు. అందులో వారి కూతురి ముఖాన్ని తొలిసారి చూపించారు. ఇక సురేఖ భర్త గురించి చెప్తూ ఎమోషనలైంది. ఏడేళ్ల క్రితం.. మేము జీవితాంతం కలిసుండాలని, ఒకరి చేయి మరొకరు వడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నాం. మాకెంతో స్పెషల్కష్టాలు, సంతోషాలు, పాఠాలు.. ఇలా అన్నింటిలో ఒకరికొరం తోడుగా నిలిచి బలంగా ఎదిగాము. మా ప్రేమకు ప్రతిరూపం, మా జీవితంలో అత్యంత మధురమైన అధ్యాయం మా కూతురు అర్ఖ. ఇద్దరం నుంచి ముగ్గురంగా మారిన మా ప్రయాణం ఎంతో అపురూపమైనది. ఈ ఫోటో మాకెంతో స్పెషల్. ఎందుకంటే మా చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న తొలి ఫోటో ఇదే!జీవితాంతం కలిసిమెలిసుండాలినాకు భాగస్వామిగా ఉన్నందుకు, అండగా నిలబడినందుకు, నా కూతురికి ప్రేమగల తండ్రిగా ఉన్నందుకు థాంక్యూ అర్జున్. మనం ఇలాగే జీవితాంతం సంతోషంగా, కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మధురమైన పెళ్లిరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని రాసుకొచ్చింది.బిగ్‌బాస్‌తో గుర్తింపుతెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అతడితోపాటు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు వెనువెంటనే ఎలిమినేట్ అయిపోయారు. కానీ, అర్జున్ మాత్రం కడవరకు నిలబడ్డాడు. టాస్కుల బాహుబలిగా పేరు తెచ్చుకున్నాడు. గ్రాండ్ ఫినాలేలో టాప్ 6లో చోటు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by Surekha Reddy🦋 (@ambati_surekha) చదవండి: -
'అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది' రూమర్స్‌కు చెక్ పెట్టిన నటి
హిందీ బిగ్‌బాస్ సీజన్ 1 ఓటీటీ విన్నర్ దివ్య అగర్వాల్, భర్త అపూర్వ పడ్‌గోయంకర్ మధ్య విభేదాలు తలెత్తాయని, వీరు విడిపోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్‌కు ఫుల్స్టాప్ పెట్టింది దివ్య. పెళ్లిరోజు సందర్భంగా భర్తతో కలిసున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.హ్యాపీ యానివర్సరీ మై లవ్నువ్వు నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటావ్.. అందుకేగా నేను నిన్ను పెళ్లి చేసుకుంది. నేనేంటో, ఎలాంటిదాన్నో నీకు బాగా తెలుసు. నన్ను అది మార్చుకో, ఇది మార్చుకో అని నువ్వెప్పుడూ చెప్పలేదు. నన్ను నన్నుగా ఇష్టపడ్డావు. హ్యాపీ యానివర్సరీ మై లవ్.. ఇలాంటి పెళ్లిరోజులు మనమెన్నో జరుపుకోవాలి. నా ప్రతి ఆలోచన తనకు తెలుసు, కాబట్టి తనకు నాగురించి ఎటువంటి భయం లేదు అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ హ్యాపీ యానివర్సరీ అని కామెంట్లు చేస్తున్నారు.అసలేమైంది?దివ్య ఇటీవలే ద 50 అనే రియాలిటీ షోకి హాజరైంది. అయితే ఈ షోలోని మరో కంటెస్టెంట్ భవ్య సింగ్.. దివ్యపై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె భర్తతో కలిసుండటం లేదని ఆరోపించింది. తను షోకి వచ్చినప్పటికీ భార్య కోసం అపూర్వ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదని, ఇక్కడే వారి దాంపత్య జీవితం ఎలా ఉందో తెలిసిపోతుందని విమర్శలు గుప్పించింది. దీంతో దివ్య దంపతులు విడిపోతున్నారంటూ రూమర్స్ రాగా వాటిని నటి టీమ్ కొట్టిపారేసింది. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. View this post on Instagram A post shared by Divyaa Agarwal (@divyaagarwal_official) -
లగ్నపత్రిక షేర్ చేసిన పునర్నవి
'ఉయ్యాల జంపాల' సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించింది పునర్నవి భూపాలం. కొన్ని సినిమాలు చేసినా అవేవీ వర్కవుట్ కాలేదు. అయితే తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. రాహుల్‌తో లవ్ ట్రాక్‌తో బాగా ఫేమస్ అయింది. కానీ షో ముగిసిన తర్వాత రాహుల్- పునర్నవి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎవరి కెరీర్లో వారు బిజీ అయ్యారు.పెళ్లికి వేళాయెకొంతకాలం క్రితం రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలయ్యాడు. ఇప్పుడు పునర్నవి కూడా పెళ్లికి రెడీ అయింది. ఈ మధ్యే తన ప్రియుడిని పరిచయం చేసింది. హేమంత్ వర్మ ప్రపోజల్‌కు ఎస్ చెప్పానంటూ అతడితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. తాజాగా వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. లగ్న పత్రికఈ రోజు పునర్నవి - హేమంత్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల సమక్షంలో లగ్నపత్రిక రాశారు. అందుకు సంబంధించిన ఫోటోలను పునర్నవి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో నీలిరంగు చీరలో పునర్నవి అందంగా మెరిసిపోతోంది. అయితే తను సింగిల్‌గా దిగిన పిక్స్ మాత్రమే అభిమానులతో పంచుకుంది.చదవండి: 6 సార్లు శివాజీగా మెప్పించిన యాక్టర్.. ఒక్క సంఘటనతో సంచలన నిర్ణయం -
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన నటి
కన్నడ సీరియల్ నటి, బిగ్‌బాస్ ఫేమ్ నమ్రత గౌడ పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం ఊపందుకుంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ కార్తీక్ మహేశ్‌తోనే ఏడడుగులు వేయనుందని గాసిప్. రియాలిటీ షో ముగిసిన తర్వాత కూడా ఇద్దరూ తరచూ జంటగా కనిపించడంతో ఇది నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. కానీ, తన పెళ్లి వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటోంది నమ్రత.రహస్యంగా పెళ్లి చేసుకోనుఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. నా రిలేషన్షిప్, పెళ్లి గురించి ఏవేవో ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాబట్టి దానిపై మీ అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుంటే ఆ విషయం అందరికీ చెప్తాను. దాన్ని రహస్యంగా ఉంచాల్సిన పని లేదు. నా పెళ్లి చీర కోసం ఏదో కొత్త రంగు సృష్టిస్తున్నారట. ఇది మరీ విడ్డూరంగా ఉంది. మా మధ్య ఉన్నది స్నేహమేఏదేమైనా ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు అని కుండబద్ధలు కొట్టింది. కాగా కన్నడ బిగ్‌బాస్ పదో సీజన్లో నమ్రత, కార్తీక్ పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య ఉన్న చనువు చూసి ప్రేమాయణం నడుపుతున్నారని అభిమానులు ఫీలయ్యారు. అయితే తమ మధ్య ఉన్నది స్నేహమే అని ఈ జోడీ గతంలోనే క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం వీరి చనువు చూస్తుంటే ఫ్రెండ్‌షిప్‌లా లేదని అభిప్రాయపడ్డారు.చదవండి: తల్లి కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగే హీరో -
ఎన్నిసార్లు అనుకున్నానో.. ఇన్నాళ్లకు కుదిరింది: రీతూ
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో ఇద్దరు ఫైర్‌బ్రాండ్స్ ఉన్నారు. వాళ్లే రీతూ చౌదరి, తనూజ పుట్టస్వామి. తనపై మాటలదాడికి దిగినవారికి కౌంటర్స్ ఇవ్వడంలో రీతూ దిట్ట అయితే టాస్క్స్ ఆడటంలో, మెచ్యూర్డ్‌గా ప్రవర్తించడంలో తనూజ దిట్ట. వీళ్లిద్దరి స్నేహం చూస్తుంటే ప్రేక్షకులకు భలే ముచ్చట వేసేది. ఫ్రెండ్‌తో ఎంజాయ్సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా బిగ్‌బాస్ హౌస్‌లో ఒకరికోసం ఒకరు నిలబడ్డారు. నిజమైన మిత్రులు అనిపించుకున్నారు. ఇకపోతే షో అయిపోయి కొన్ని నెలలు కావొస్తుండగా తాజాగా తొలిసారి ఈ మిత్రులిద్దరూ కలుసుకున్నారు. ఫిబ్రవరి 16 రాత్రి షాపింగ్ చేస్తూ, నచ్చిన ఫుడ్ లాగిస్తూ, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను రీతూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఎన్నిసార్లు అనుకున్నామో!బిగ్‌బాస్ అయిపోయాక ఒకసారి బయటకు వెళ్లి ఇద్దరం కలిసి కాఫీ తాగుతూ కాలక్షేపం చేయాలని షోలో ఉండగానే అనుకున్నాం. చాలాసార్లు ఇలాంటి ప్లాన్స్ వేసుకున్నాం. మొత్తానికి ఆరోజు రానే వచ్చింది. మేమిద్దరం కలుసుకున్నాం. నవ్వుకున్నాం, మనసారా మాట్లాడుకున్నాం, ఆనందంగా గడిపాం. ఇది నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) చదవండి: -
భార్యతో విడాకులు, జైలు జీవితం.. డిప్రెషన్లోకి..: సామ్రాట్
వినాయకుడు, పంచాక్షరి, దేనికైనా రెడీ, ప్రేమకావాలి, దూసుకెళ్తా వంటి పలు సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు సామ్రాట్ రెడ్డి. తర్వాత సడన్‌గా వెండితెరపై కనిపించడం మానేశాడు. తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హర్షితను పెళ్లి చేసుకున్నాక వైవాహిక జీవితంలో ఇబ్బందులతో వార్తల్లో నిలిచిన సామ్రాట్ తన జీవితంలోని అనేక విషయాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.అందుకే బ్రేక్నటుడు సామ్రాట్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకానొక సమయలో హీరోయిన్‌తో పెళ్లిపీటలపై కూర్చోవడం.. తీరా పెళ్లి క్యాన్సిల్ అవడం.. ఇలాంటి పాత్రలే తరచూ వచ్చాయి. దీంతో నాకు బోర్ కొట్టేసి బ్రేక్ తీసుకున్నాను. హర్షితను పెళ్లి చేసుకున్న కొంతకాలానికే నాపై గృహహింస, వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇవన్నీ ఉట్టి ఆరోపణలు మాత్రమే!కావాలనే నా ప్రతిష్ట దిగజార్చిందిపెళ్లి వర్కవుట్ కాలేదంటే దాన్ని చాలారకాలుగా డీల్ చేయొచ్చు. పరస్పర అంగీకారంతో లేదా తనవైపు నుంచి విడాకులు పంపించి విడిపోవచ్చు. కానీ ఆమె తప్పు దారి ఎంచుకుంది. నేను నటుడినన్న కారణంతో నా పరువు తీయాలనుకుంది. ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. అదే సమయంలో నాన్నకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మరింత కుంగిపోయాను. బిగ్‌బాస్ ఆఫర్ఒక్కసారిగా మా కుటుంబం చిన్నాభిన్నమైంది. మా ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నేను రెండురోజులు జైలుకు వెళ్లివచ్చాను. నాపై లేనిపోని అభాండాలన్నీ వేశారు. అది నా కెరీర్‌ను కూడా దెబ్బతీసింది. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. అప్పుడు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. వెళ్లకూడదనుకున్నాను. కానీ నాపై పడ్డ నిందలు తొలగించుకోడానికి బిగ్‌బాస్‌కు వెళ్లాను. చాలా బాధలు అనుభవించి రాటు తేలిపోయాను. మరో పెళ్లి చేసుకోనుమొదటి పెళ్లి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవితంలో మరో పెళ్లి చేసుకోనని ఇంట్లో చెప్పాను. కానీ, బిగ్‌బాస్ తర్వాత అంజనా శ్రీలిఖితను కలిశాను. చూడగానే నచ్చేసింది. పెళ్లి చేసుకుందామని అడిగాను. కానీ, ఆమె ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. వాళ్లను ఒప్పించేందుకు తను చాలాదూరం వెళ్లింది. అలా 2020లో పెళ్లి జరగ్గా 2022లో పాప పుట్టింది. మొదటిది పెద్దలు కుదర్చిన పెళ్లయితే రెండోది ప్రేమ వివాహం. లిఖిత నా జీవితంలోకి వచ్చాక సంతోషంగా ఉన్నాను అని సామ్రాట్ రెడ్డి చెప్పుకొచ్చాడు.చదవండి: 4 రోజుల్లో రిలీజ్.. హే భగవాన్ టైటిల్ ఛేంజ్ -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి
యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ శివజ్యోతి గుడ్‌న్యూస్ చెప్పింది. తనకు పండంటి బిడ్డ పుట్టినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 12న బేబీ జన్మించగా రెండు రోజులు ఆలస్యంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ పోస్ట్‌కు ఓ అందమైన ఫోటో జత చేసింది. అందులో శివజ్యోతి కుర్చీలో కూర్చుని నవ్వులు చిందిస్తుండగా ఆమె భర్త గంగూలీ బిడ్డను ఎత్తుకున్నాడు. ఈరోజు (ఫిబ్రవరి 14న) శివజ్యోతి బర్త్‌డే సందర్భంగా బేబీ రాకను వెల్లడించారు.ఇద్దరి గుండెచప్పుడు ముగ్గురిగా..తనకు ఇంత అందమైన బహుమతిచ్చిన శివజ్యోతికి గంగూలీకి కృతజ్ఞతలు తెలిపాడు. 'హ్యాపీ బర్త్‌డే, చిన్ని. నీ 33వ పుట్టినరోజుకు ఎంతో అందమైన బహుమతిని తీసుకొచ్చావ్. మన ఇద్దరి గుండెచప్పుడు ఇప్పుడు ముగ్గురిగా మారింది. మాకు పుట్టింది పాప? బాబు? అన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు శివజ్యోతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Ganguly Mantri (@ganguly_manthri) చదవండి: కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ


