బిగ్‌బాస్ సీజన్10లో అగ్ని పరీక్ష తర్వాత మొదలవుతుంది అసలైన మహాపరీక్ష అని ముందే చెప్పినట్టుగానే బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడు అసలు ఆట మొదలైంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా.. కేవలం ముగ్గురు మాత్రమే హౌస్‌మేట్స్‌గా మారారు. మరో ఇద్దరు ఈ వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లు రిస్క్‌లో కొనసాగుతున్నారు.
ఇదీ చదవండి: 'ఆదర్శ కుటుంబం' టీజర్ రిలీజ్.. వెంకటేశ్ కామెడీ అదిరింది!
అయితే ఎలిమినేట్ అయిన ఇద్దరినీ బిగ్‌బాస్ ఇంకా సీక్రెట్ రూమ్‌లోనే ఉంచాడని పలువురు కంటెస్టెంట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జున.. చరణ్, చైత్రలతో ఫోన్‌లో మాట్లాడి.. వాళ్లు తమ ఇంటి దగ్గరే ఉన్నారని కన్‌ఫామ్ చేయించారు. దీంతో ఇక ఎలిమినేషన్ విషయంలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని వారికి క్లారిటీ ఇచ్చారు.
కంటెస్టెంట్లకు గట్టి వార్నింగ్..
ఈ క్రమంలో నాగార్జున కూడాడఇచ్చాడు. ఆటలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా.. దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు. గేమ్‌లో ఎవరు నిర్లక్ష్యం చేసినా హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశాడు. దీంతో 11 మంది రిస్క్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరు తమ గేమ్‌ను మరింత పదును పెడతారో చూడాలి.


