ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోలకే కాదు.. కొత్త హీరోలకు కూడా ఓ కొత్త ఇమేజ్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయన సినిమా వస్తుందంటే కథ కంటే ముందు హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? డైలాగులు ఎలా పేలబోతున్నాయి? అనే ఆసక్తి ఉండేది. ‘ఇడియట్’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’, ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’, ‘టెంపర్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మాస్ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు.
ఇదీ చదవండి: ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. కారణం ఇదే..!
పూర్వ వైభవం ఎప్పుడు వస్తుంది?
ముఖ్యంగా మహేశ్‌బాబు కెరీర్‌లో ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ తీసి మరోసారి మాస్ పల్స్ తనకు ఎంత బాగా తెలుసో చూపించారు. అయితే కొన్నేళ్లుగా పరిస్థితి మారిపోయింది. వరుస సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో దీంతో పూరి జగన్నాథ్ తదుపరి సినిమా ఏంటి? మళ్లీ ఆయన పూర్వ వైభవం ఎప్పుడు వస్తుంది? అనే చర్చ మొదలైంది.
మళ్లీ ఆ పూరి కనిపిస్తారా..?
పూరి జగన్నాథ్ కెరీర్‌లో ఎత్తుపల్లాలు కొత్తేమీ కాదు. పూరి సినిమాలు వరుసగా కనిపించకపోవడంతో ఆయన పూర్తిగా సినిమాలకు దూరమయ్యారని చాలామంది అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతితో ‘స్లమ్ డాగ్’ అనే యాక్షన్ డ్రామా చేస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సారైనా పూరి పూర్వ వైభవం చూపిస్తారా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి: తెలుగులో ‘హనుమన్ అంశ్’.. ఎప్పుడంటే..?


