వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. నిర్మాత బన్నీ వాస్, డైరెక్టర్ సుకుమార్ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. నాగదుర్గ హీరోయిన్. ఈ సినిమా నుంచి ‘శ్రీలత’ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
'శ్రీలత..' సాంగ్ లో హీరో ప్రియదర్శి, హీరోయిన్ నాగదుర్గ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. సురేశ్ బొబ్బిలి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు అలరాజు సాహిత్యం అందించారు. శంకర్ బాబు కందుకూరి, మోహన్ భోగరాజు ఆలపించారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


