హెచ్‌పీవీపై అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అవగాహన | Allu Arjun Fans Association Takes HPV Vccine Awareness Drive Across India | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీపై అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అవగాహన

Sep 11 2026 2:26 PM | Updated on Sep 11 2026 2:31 PM

Allu Arjun Fans Association Takes HPV Vccine Awareness Drive Across India

8 రాష్ట్రాల్లోని 820 పాఠశాలల్లో కార్యక్రమాలు

సాక్షి, హైద‌రాబాద్‌: అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ (ఏఏఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వస్థ్‌ నారీ వికసిత్‌ భారత్‌’ కార్యక్రమంలో భాగంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణపై దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 820 స్కూల్‌ అవేర్‌నెస్‌ ఈవెంట్స్‌కు ఏఏఎఫ్‌ఏ మద్దతుగా నిలిచింది.
3 లక్షల మందికి పైగా..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్‌ నికోబార్‌ ఐల్యాండ్స్‌ వంటి రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరుగా స్కూల్స్, కమ్యూనిటీల్లో ఈ అవగాహన కార్యక్రమం ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా యువతులకు చేరువైందని, సామాజిక బాధ్యత ఉన్న అల్లు అర్జున్‌ అభిమానులంతా సమష్టి కృషితో ఈ ఘనతను సాధించామనీ అభిమానులు పేర్కొన్నారు. గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్‌ అభిమానులంతా ఒక్కటవడం చాలా ఆనందంగా ఉందని అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ తెలియజేసింది.
  ఇదీ చదవండి: ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement