సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.
ఫస్ట్ కాపీ మూవీస్, కేడీ అండ్ కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ధృవన్ సంగీతం అందిస్తున్నారు. కాగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను డైరెక్టర్ వి.వి. వినాయక్ విడుదల చేశారు.


