breaking news
Missing Meghana Movie
-
‘మిస్సింగ్ మేఘన’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
చిన్న సినిమా అయినా.. ట్రైలర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న చిత్రం మిస్సింగ్ మేఘన. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సస్పెన్స్ అండ్ మిస్టరీ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బాగానే చేయడంతో ‘మిస్సింగ్ మేఘన’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(సెప్టెంబర్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమ కథంతా విశాఖపట్నంలో జరుగుతుంది. సొంతంగా బేకరీ రన్ చేస్తున్న మేఘన(అమ్ము అభిరామి) రాత్రి పది దాటినా..ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి(గోపరాజు రమణ) పోలీసులను ఆశ్రయిస్తాడు. వాళ్లు పట్టించుకోకపోవడంతో కాబోయే అల్లుడు ఏసీపీ అర్జున్(కౌశిక్) కి చెప్తాడు. అతను రంగంలోకి దిగి విచారణ చేపట్టగా.. బ్యాంకు మేనేజర్‌తో గొడవ జరిగిందనే విషయం తెలుస్తుంది. అతన్ని విచారిస్తే.. మేఘన మిస్సింగ్ తో తనకు సంబంధం లేదని చెబుతాడు. అలా అనుమానితులను ఒక్కొక్కరిని విచారించగా.. చివరగా బైక్ రైడర్ కార్తీక్ (రామ్ కార్తీక్) ఆమెను ఓ చోట డ్రాప్ చేశారనే విషయం తెలుస్తుంది. అతన్ని పిలిచి విచారిస్తే.. మేఘన ఎవరో తెలియదని.. ఆద్య(వైదిక సెంజాలియా)తో ఉన్న బ్రేకప్ స్టోరీ చెప్తాడు. అయితే మేఘన కాల్ లిస్ట్ చూస్తే.. గత కొన్నాళ్లుగా కార్తీక్‌తో మాట్లాడుతున్న విషయం బయటపడుతుంది. వారిద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం కూడా ఏసీపీకి తెలుస్తుంది. అందులో నిజం ఎంత? ఏసీపీతో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కార్తీక్‌తో మేఘన నిజంగా ప్రేమలో పడిందా? మేఘనతో పరిచయం ఉన్నప్పటికీ..తనకు తెలియదని కార్తీక్ ఎందుకు చెప్పాడు? అసలు కార్తీక్-మేఘనల మధ్య ఉన్న సంబంధం ఏంటి? కార్తీక్ -ఆద్యల బ్రేకప్ స్టోరీ ఏంటి? మేఘనను కిడ్నాప్ చేసిందెవరు? ఈ కథలో ఆకాశ్(అంకిత్ కొయ్య) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..సస్పెన్స్ థ్రిల్లర్ కథలన్నీ ఒకేలా ఉంటాయి. ఓ వ్యక్తి మిస్ అవ్వడం.. ఆ కేసును చేధించే క్రమంలో ఊహించని ట్విస్టులు ఎదురవ్వడం.. చివరిలో అసలు నిందుతులను పట్టుకోవడం.. ఈ సినిమా కథనం కూడా అలానే సాగుతుంది. అయితే ఇందులో డిఫరెంట్ లవ్‌స్టోరీ ఉండడం కొత్త పాయింట్. అది కొంతవరకు ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇక మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ అంతా రొటీన్‌గానే సాగుతుంది. అయితే కొన్ని ట్విస్టులు ఊహించేలా ఉన్నా..మరికొన్ని మాత్రం థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. సస్పెన్స్ థ్రిల్లర్ రెగ్యులర్‌గా చూసేవాళ్లకు కీలకమైన ట్విస్టులు ముందుగానే ఊహించలగలరు. కానీ నార్మల్ ఆడియన్స్ మాత్రం వాటిని పసిగట్టలేరు. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేయడంతో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఎలాంటి సాగదీత లేకుండా ఫస్ట్ సీన్‌తో అసలు కథ ప్రారంభించాడు. మేఘన కనిపించడంలేదని ఆమె తండ్రి పోలీసు స్టేషన్‌కి వెళ్లడం..ఏసీపీ రంగంలోకి దిగడం.. విచారణలో ఒక్కో విషయం బయటపడడం..ఇలా ఆసక్తికరంగా కథనం సాగుతుంది. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. అలాగే తండ్రి కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలలో ఎమోషన్ సరిగా పండలేదు. కార్తీక్ బ్రేకప్ స్టోరీ కూడా అంతగా ఆకట్టుకోదు. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉన్నా.. కాసేపటి తర్వాత పరుగులు పెడుతుంది. మిస్సింగ్ కేసు కాస్త డ్రగ్స్ కేసుగా మారడంతో దీని వెనుక ఎవరున్నారనే క్యూరియాసిటీ పెరుగుతుంది. అయితే అతను ఎవరనేది ఈజీగా అర్థమైపోతుంది. కానీ అతన్ని హీరో ఎలా పట్టుకుంటాడు అనేది మాత్రం ఆసక్తికరంగా చూపించారు. నిడివి తక్కువగా ఉండడం ఈ సినిమాకు ప్లస్ అయింది. అయితే స్క్రీన్‌ప్లే, క్యాస్టింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. లవ్ ఫెయిల్యూర్ కుర్రాడు కార్తిక్ పాత్రలో రామ్ కార్తీక్ బాగా నటించాడు. ఇక మేఘన పాత్రకు అమ్ము అభిరామి న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక ఏసీపీ అర్జున్ పాత్రలో కౌశిక్ బాగానే మెప్పించాడు. అంకిత్ కొయ్య పాత్ర నిడివి తక్కువే ఉన్నా.. చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇక మేఘన తండ్రిగా గోపరాజు రమణ రెగ్యులర్ పాత్ర పోషించి.. మెప్పించాడు. వెంప కాశి, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, షాని, పండు.. తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక విషయాలకొస్తే..ఆర్.ఆర్.ధృవన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటింగ్ షార్ప్‌గానే ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గటు ఉన్నతంగా ఉన్నాయి. -
సస్పెన్స్... మిస్టరీగా ‘మిస్సింగ్ మేఘన’
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రధారులుగా నటించిన సస్పెన్స్ అండ్ మిస్టరీ సినిమా ‘మిస్సింగ్ మేఘన’. వాచస్పతి దర్శకత్వంలో పంచుమర్తి నరేష్ బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీమ్ మంచి టాలెంటెడ్. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నేను గతంలో సినిమా చేయడం మిస్ అయిన అందరితో ఈ సినిమాకి పని చేశాను. మా సినిమాను థియేటర్స్‌లో చూడండి’’ అని చెప్పారు రామ్ కార్తీక్. ‘‘వాచస్పతిగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు’’ అన్నారు అంకిత్. ‘‘ప్రేక్షకులు మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు వాచస్పతి. -
ప్రమోషన్స్‌కి దూరంగా హీరోయిన్.. కారణం ఇదేనా?
ఈ రోజుల్లో సినిమా తీయడం ఎంత కష్టమో.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే కష్టం. పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తే కానీ సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం జనాల్లోకి వెళ్లడం లేదు. పెద్ద సినిమాలకు సైతం ప్రమోషన్స్ గట్టిగానే చేయాల్సి వస్తుంది. హీరో హీరోయిన్లతో పాటు చిత్రబృందం అంతా ప్రచారంలో పాల్గొంటున్నాయి. అప్పుడే ఆ సినిమాపై కాస్త బజ్ ఏర్పడి.. జనాల్లో దానిపై చర్చ జరుగుతుంది. ఇక చిన్న సినిమాల పరిస్థితి అయితే మరీ దారణం. పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసినా.. సినిమా టైటిల్ జనాల్లోకి వెళ్లడం లేదు. అందుకే పేరున్న నటీనటులతో ఇంటర్వ్యూలు ఇప్పించడం..హీరో హీరోయిన్లతో మీడియా సమావేశాలు పెట్టి.. వీలైనంత వరకు సినిమాని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా హీరోహీరోయిన్లు ప్రతి ఈవెంట్లోనూ పాల్గొంటున్నారు. అయితే కొన్ని చిన్న సినిమాలో నటించిన నటీనటులు మాత్రం ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటున్నారు. చిన్న చిన్న కారణాలు చెప్పి..ప్రచారానికి డుమ్మా కొడుతున్నారు. తాజాగా మిస్సింగ్ మేఘన అనే సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.(ఇదీ చదవండి: ఓటీటీ తర్వాత థియేటర్లో.. కానీ ఎక్కడ తేడా కొట్టింది?)వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ ఈవెంట్‌కి హీరోతో పాటు మిగతా నటీనటులంతా హాజరయ్యారు. కానీ హీరోయిన్గా నటించిన అమ్ము అభిరామి మాత్రం..ఈవెంట్‌కి రాలేదు. దర్శకుడితో గొడవ జరిగిందని.. అందుకే ఆమె ప్రమోషన్స్‌కి దూరం ఉందనే పుకార్లు కూడా ఉన్నాయి. అయితే దర్శకుడు మాత్రం తనతో ఎలాంటి గొడవ జరగలేదనే క్లారిటీ ఇచ్చాడు. తనకు ఇంకొంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉందని..అందుకే రాలేదని చెప్పాడు. అయితే హీరో మాత్రం మరోలా చెప్పాడు. తను వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉందని.. అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్‌కి హాజరకాలేదని చెప్పాడు. అసలు కారణం ఏదో తెలియదు కానీ..ప్రమోషన్స్‌కి హీరోయిన్ రాకపోవడం మాత్రం సినిమాకు ఎంతో కొంత మైనస్ అనే చెప్పాలి. -
సెప్టెంబర్ 18న థియేటర్లలోకి ‘మిస్సింగ్ మేఘన’
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.ఫస్ట్ కాపీ మూవీస్, కేడీ అండ్ కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ధృవన్ సంగీతం అందిస్తున్నారు. కాగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను డైరెక్టర్ వి.వి. వినాయక్ విడుదల చేశారు. -
‘మిస్సింగ్ మేఘన’నుంచి రెండో సాంగ్ రిలీజ్
వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఈచిత్రం నుంచి సెకండ్ లిరికల్ ‘విన్నావా ప్రేమ’ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ ‘ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన దిల్ రాజు గారి చేతుల మీదుగా నా సాంగ్ లాంచ్ అవ్వడం హ్యాపీ గా ఉంది. ఈ సాంగ్ ప్రేక్షకులకూ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను’ అని అన్నారు.కాగా ఈ సినిమాకి ఆర్.ఆర్ ధృవన్ సంగీతం అందించారు. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా చిత్రీకరిస్తున్న ఈ మూవీలో హీరో రామ్ కార్తీక్‌తో పాటు అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
‘పిల్ల పిల్ల పిల్ల’ సాంగ్ బాగుంది: నిర్మాత సురేష్ బాబు
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ చేతుల మీదుగా జరగగా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘పిల్ల పిల్ల పిల్ల’ని నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ఫస్ట్ సింగిల్ పిల్ల పిల్ల పిల్ల సాంగ్ చాలా బాగుంది. మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ..ఇండియన్ ఫిలిం ఫీల్డ్ లో సురేష్ ప్రొడక్షన్స్ కి ఉన్న పేరు మనందరికీ తెలుసు. సురేష్ బాబుచేతుల మీదుగా మా ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నరేష్ గారికి, కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న బెక్కం వేణుగోపాల్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో అద్భుతమైన పాటలు అందించిన ఆర్. ఆర్. ధృవన్ కి, అలాగే ఈ పాట పాడిన మనందరి ఫేవరెట్ సింగర్ జావేద్ అలీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.నిర్మాత నరేష్ మాట్లాడుతూ..‘మా సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో జరిగింది. రామానాయుడు స్టూడియో అధినేత గోల్డెన్ హ్యాండ్ సురేష్ బాబు చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ధృవన్ తో మాకు ఇది రెండో సినిమా. తంత్ర మ్యూజికల్ గా ఎంత సక్సెస్ అయిందో ఈ సినిమా కూడా అంతే సక్సెస్ అవుతుంది. ధృవన్ గారే రాసి మ్యూజిక్ అందించి, జావేద్ అలీ గారితో పాడించిన ఈ పాట మంచి సక్సెస్ అవుతుంది. అదే విధంగా ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ అందిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం’ అన్నారు. -
‘మిస్సింగ్ మేఘన’ హిట్ కావాలి : వి.వి. వినాయక్
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ని డైరెక్టర్ వి.వి. వినాయక్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ గారు మాట్లాడుతూ .. ‘బెక్కం వేణుగోపాల్ , శ్రీనివాస్ సపోర్ట్ తో వాచస్పతి దర్శకుడిగా వస్తున్న సినిమా మిస్సింగ్ మేఘన. ఈ సినిమా తో హీరో రామ్ కార్తీక్ కి దర్శకుడు వాచస్పతికి మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను. అదేవిధంగా సంగీత దర్శకుడు ధృవన్కి మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాతో ఈ టీం కి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ ..‘ఈ సినిమా ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ప్రేక్షకులు మిచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకొస్తున్నాం. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.‘ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు వాచస్పతి గారికి ప్రొడ్యూసర్ నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది అని ఆశిస్తున్నా’అని హీరో రామ్ కార్తీక్ అన్నారు.‘ఈ సినిమా కి మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి మ్యూజిషియన్ కి మ్యూజిక్ చేయడానికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా నాకు చాలా మంచి అవకాశం. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మా టీం ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని సంగీత దర్శకుడు ఆర్. ఆర్. ధృవన్ అన్నారు.


