వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఈచిత్రం నుంచి సెకండ్ లిరికల్ ‘విన్నావా ప్రేమ’ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ ‘ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన దిల్ రాజు గారి చేతుల మీదుగా నా సాంగ్ లాంచ్ అవ్వడం హ్యాపీ గా ఉంది. ఈ సాంగ్ ప్రేక్షకులకూ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
కాగా ఈ సినిమాకి ఆర్.ఆర్ ధృవన్ సంగీతం అందించారు. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా చిత్రీకరిస్తున్న ఈ మూవీలో హీరో రామ్ కార్తీక్‌తో పాటు అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


