నటనకు అవకాశం ఉన్నపాత్ర చేశాను | Dharmasthala Niyojakavargam Trailer Launch Event | Sakshi
Sakshi News home page

నటనకు అవకాశం ఉన్నపాత్ర చేశాను

Aug 30 2026 5:11 AM | Updated on Aug 30 2026 5:11 AM

Dharmasthala Niyojakavargam Trailer Launch Event

సుమన్, సాయికుమార్, వరుణ్‌ సందేశ్, వితికా షేరు, నటరాజ్, రాయంచ కొక్కుర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞానప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్‌ నిర్మించారు. ఈ మూవీ పీవీఆర్‌ సినిమాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా సెప్టెంబరు 4న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో జై జ్ఞానప్రభ మాట్లాడుతూ– ‘‘పొలిటికల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ఇది. మహావీర్‌ మ్యూజిక్, చంద్రబోస్‌గారి సాహిత్యం మా సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయి. 

మా సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం నిరాశపరచదు’’ అని చెప్పారు. ‘‘మా మూవీ ఔట్‌పుట్‌ అందరికీ నచ్చేలా వచ్చింది... ప్రేక్షకాదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం’’ అని మేరుం భాస్కర్‌ తెలిపారు. ‘‘ఇటీవల నటనకు విరామం ఇచ్చాను. అయితే ‘ధర్మస్థల నియోజకవర్గం’లో డిఫరెంట్‌ క్యారెక్టర్‌ రావడంతో ఒప్పుకున్నాను. నటనకు మంచి స్కోప్‌ దక్కింది’’ అని వితికా షేరు పేర్కొన్నారు. రచయిత చంద్రబోస్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహావీర్‌ ఏలేందర్, ఆర్ట్‌ డైరెక్టర్‌ భార్గవాచారి నౌండ్ల, నటులు శివకుమార్, నటరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement