భారతీయ సంస్కృతి, ఇక్కడ ఆచార వ్యవహారాలు ఎందరో విదేశీయులను ఆకర్షించాయి. దాంతో ఈ గడ్డపైనే ఉండిపోవాలని నిర్ణయించుకుని మరి స్థిరపడినవారు కూడా ఉన్నారు. కానీ ఈ జపాన్ అమ్మాయి ఆధ్యాత్మిక అనుభూతి కోసం ఏం చేసిందో తెలిస్తే విస్తుపోతారు.
జపాన్ కంటెంట్ క్రియేటర్ మాయో జపాన్ ఇటీవల భారతదేశ పర్యటనలో భాగంగా హరిద్వార్‌లోని గంగా ఘాట్ వద్ద ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందింది. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ వీడియోలో ఆమె సంప్రదాయ దుస్తులు ధరించి కెమెరా వైపు చూస్తూ..జీవితంలో మొదటిసారి గంగాస్నానం చేస్తున్నాని చెప్పింది. ఆ తర్వాత నదిలో ఏర్పాటు చేసిన భద్రతా గొలుసులు పట్టుకుని నీటిలో మునిగి స్నానం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది.
నదీప్రవాహానికి కొట్టుకుపోకుండా గట్టిగా గొలుసులు పట్టుకుని కనిపిస్తుంది వీడియోలో. ఆ తర్వాత ఆమె స్నానం సరిపోతుందా అని అక్కడే ఉన్న స్థానికుడిని అడుగుతుంది కూడా. మొత్తం మూడుసార్లు హిందూ భక్తుల మునిగినట్లుగానే మునిగి స్నానం చేస్తుందామె. ఒక అపరిచితుడి సాయంతో ఈ వీడియోని తీయగలిగానని, ఆయన చాలా అద్భుతంగా తీశారని ప్రశంసించిందామె. చివరగా ఆమె బాగా స్నానం చేశాను, చాలా సంతోషంగా ఉంది. అని అన్నారామె.
అయితే ఆమెకు హిందీ ఎలా వచ్చు అని సందేహించకండి. ఎందుకంటే..ఆమె హిందీ, భారతీయ సంస్కృతులపై 13 ఏళ్లకు పైగా అధ్యయనం చేసి, ఎట్టకేలకు గంగా నదిలో పవిత్ర స్నానం చేసి, చాలా మంచి అనుభూతి పొందింది. అంతేగాదు చివర్లో ఈ ఊహించని జీవిత ప్రయాణం అందించినందుకు భారత్‌కి సదా ధన్యావాదాలు అని పోస్ట్‌లో పేర్కొంది కూడా. నెటిజన్లు ఈ పుణ్యస్నానం తర్వాత నిజంగానే మీలో మంచి మార్పు వచ్చింది. ఇది గంగా నది అనుగ్రహం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: గూగుల్‌లో రూ. 83 లక్షల వేతనం వదులుకుని..సేంద్రీయ వ్యవసాయం!)


