సరస్సు పేరునూ మార్చేసిన ట్రంప్.. భగ్గుమన్న కెనడా! | Lake Ontario Renamed Lake America, Canada Hits Back At Trump’s Executive Order, Says Name Will Remain Unchanged | Sakshi
Sakshi News home page

సరస్సు పేరునూ మార్చేసిన ట్రంప్.. భగ్గుమన్న కెనడా!

Aug 28 2026 7:52 AM | Updated on Aug 28 2026 10:54 AM

Lake Ontario Renamed Lake America Canada Hits Back at Trumps Executive Order

వాషింగ్టన్/ఒట్టావా: అమెరికా, కెనడాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇరు దేశాల సరిహద్దులో విస్తరించి ఉన్న ప్రసిద్ధ ‘లేక్ అంటారియో’ సరస్సు పేరును ‘లేక్ అమెరికా’గా మారుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) సంతకం చేశారు. అయితే, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కెనడా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సరస్సు పేరు ఎప్పటికీ లేక్ అంటారియోగానే కొనసాగుతుందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పష్టం చేశారు.

అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ అధికారిక భౌగోళిక రికార్డుల్లో 30 రోజుల్లోగా ఈ మార్పును చేర్చాలని, ఫెడరల్ ఏజెన్సీలన్నీ ‘లేక్ అమెరికా’ అనే పేరునే ఉపయోగించాలని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సరస్సులో అత్యంత లోతైన భాగం అమెరికా వైపే ఉందని, అందువల్ల ఎక్కువ నీటి పరిమాణం తమకే చెందుతుందని ఆయన వాదించారు. గతంలో ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మార్చిన తరహాలోనే తాజా నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల పేర్లను కూడా మార్చవచ్చంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

మరోవైపు కెనడా ప్రధాని కార్నీ స్పందిస్తూ.. అమెరికా, కెనడా దేశాలు ఏర్పడటానికి ముందే, సుమారు 400 ఏళ్ల కిందటే స్థానిక తెగల భాష ఆధారంగా ఈ సరస్సుకు ‘అంటారియో’ (అందమైన లేదా పెద్ద సరస్సు) అనే పేరు వచ్చిందని గుర్తుచేశారు. వాస్తవాలను మార్చలేమని ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆయన తేల్చిచెప్పారు. ఇటీవల ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విఫలమై, పరస్పరం సుంకాలు విధించుకోవడంతో సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ఉత్తర్వులు వివాదాన్ని మరింత పెంచాయి.

ఇది కూడా చదవండి: రైతుల్లో గుబులు: సెప్టెంబర్‌లోనూ వర్షాలు అనుమానమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement