స్వామి శరణం.. 'ఇరుముడి'పై రామ్ చరణ్ రివ్యూ | Ram Charan Congratulate Irumudi Movie Success | Sakshi
Sakshi News home page

Ram Charan Irumudi: 'ఇరుముడి' సక్సెస్.. చరణ్ ప్రశంసలు

Aug 26 2026 11:36 AM | Updated on Aug 26 2026 11:39 AM

Ram Charan Congratulate Irumudi Movie Success

రవితేజ 'ఇరుముడి' సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ప్రస్తుతం జోరు చూస్తుంటే రూ.200 కోట్ల మార్క్ అందుకుంటాదేమో అనిపిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ చూసిన రష్మిక, విజయ్ దేవరకొండ, నాగార్జున తదితరులు చిత్రం అద్భుతంగా ఉందని చెబుతూ పోస్టులు పెట్టారు. ఇప్పుడీ ఈ లిస్టులోకి మెగాహీరో రామ్ చరణ్ కూడా చేరిపోయాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)

ప్రతి ఏడాది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే చరణ్.. 'ఇరుముడి' చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతూ ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉందని, రవితేజ-మూవీ టీమ్ పడ్డ కష్టానికి ఈ ప్రశంసలు కచ్చితంగా అర్హమైనవి అని రాసుకొచ్చాడు. డైరెక్టర్ శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరిన్ని హిట్స్ కొట్టాలని చరణ్ ఆకాంక్షించాడు. చివరలో స్వామి శరణం అని బుధవారం ఉదయం ట్వీట్ చేశాడు.

తండ్రికూతురు సెంటిమెంట్‌కి 41 రోజుల అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని జోడించి తీసిన సినిమా 'ఇరుముడి'. చాలామంది ఈ చిత్రం, ఇందులోని ఎమోషన్స్ చూసి కన్నీళ్లు పెటుకుంటున్నారు. జీవీ ప్రకాశ్ అందించిన పాటలు, శివ నిర్వాణ దర్శకత్వం కూడా ఈ మూవీకి మేజర్ ప్లస్ అయింది. రవితేజ కూడా గత చిత్రాల్లో కనిపించినట్లు కాకుండా సహజంగా నటించడం ప్రేక్షకులకు నచ్చింది.

(ఇదీ చదవండి: రవితేజకు కూడా తెలుసు.. వ్యాపారం వ్యాపారమే అని)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement