రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తండ్రీ కూతుళ్ల కాన్సెప్ట్ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ జోరు చూస్తుంటే ఇరుముడి వందకోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తోంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ న్యూస్ వైరల్‌గా మారింది. థియేటర్లలో అదరగొడుతున్న ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఏదనే విషయంపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఎవరనే విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత బుల్లితెరపై సందడి చేయనుంది. త్వరలోనే స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయంపై ప్రకటన రానుంది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.


