సినిమా టికెట్ ధరల స్థిరీకరణ, థియేటర్ల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే జీవో 77 విడుదల చేసింది. అయితే దీనిని పునఃసమీక్షించాలి లేదా రద్దు చేయాలి, సవరించాలని ఎగ్జిబిటర్లు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
తెలంగాణలోని 33 జిల్లాల్లో 400కుపైగా థియేటర్లని సంప్రదించకుండా.. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రమేయం లేకుండా జీవో విడుదల చేశారని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ చెప్పుకొచ్చింది. తెలుగు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, పలువురు నిర్మాతల కోసం ఎలా జీవో ఇస్తారని ప్రశ్నించారు.
తెలంగాణలో 400కుపైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. టైర్ 2, టైర్ 3 నగరాల్లో 99 శాతం ఎయిర్ కూల్డ్ థియేటర్లే ఉన్నాయి. కోవిడ్ తర్వాత భారీగా పెట్టుబడి పెట్టి వాటిని ఆధునికీరించాం. తెలంగాణలో 390కిపైగా ఎయిర్ కూల్డ్ థియేటర్లున్నాయి. 350కిపైగా మల్టీఫ్లెక్స్ స్క్రీన్లున్నాయి. తెలంగాణలోని అన్ని థియేటర్లపై 20 వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తమ లేఖలో విన్నవించుకున్నారు.
(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో 'టాక్సిక్' టికెట్ రేట్లు భారీగా పెంపు)


