ఓటీటీ ప్రేక్షకులపై నటుడు శ్రీకాంత్ చిల్లర వ్యాఖ్యలు | Srikanth Iyengar Comments On OTT Audience Latest | Sakshi
Sakshi News home page

Srikanth Iyengar: మళ్లీ నోరు జారిన శ్రీకాంత్ అయ్యంగర్

Aug 25 2026 3:13 PM | Updated on Aug 25 2026 3:22 PM

Srikanth Iyengar Comments On OTT Audience Latest

తెలుగులో కొందరు నటులు అదే పనిగా నోరు జారుతుంటారు. రీసెంట్ టైంలో రాజేంద్ర ప్రసాద్ ఇలా పలుమార్లు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ కూడా మైక్ పట్టుకుంటే చాలు నోటికొచ్చింది మాట్లాడేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఓటీటీ ప్రేక్షకుల్ని ఉద్దేశిస్తూ చిల్లర వ్యాఖ్యలు చేశాడు!

(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో 'టాక్సిక్' టికెట్ రేట్లు పెంపు)

'కికు చిరంజీవి' అనే తెలుగు సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీకాంత్ అయ్యంగర్.. 'మూవీ ఓటీటీలోకి వచ్చాక చూస్తామని అనేవాళ్లు.. పెళ్లి, హనీమూన్ కూడా ఆన్‌లైన్‌లోనే చూసుకుంటారా?' అని అన్నాడు. ఈయన ఉద్దేశంలో ఓటీటీలో చూసేవాళ్లు అసలు ప్రేక్షకులే కాదన్నట్లు ఉంది.

తెలుగు ప్రేక్షకులు సినిమా చూసే విధానం గత కొన్నేళ్లుగా మారుతూ వస్తోంది. పెద్ద సినిమాలు థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. చిన్న, మిడ్ రేంజ్ మూవీస్ మరీ బాగుంటే తప్పితే థియేటర్లకు వెళ్లట్లేదు. బహుశా ఈ విషయంలోనే ఫ్రస్టేట్ అయిన శ్రీకాంత్ అయ్యంగర్ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో జర్నలిస్టులపైనా దారుణమైన కామెంట్స్ చేసి ఈ నటుడు విమర్శలు ఎదుర్కొన్నాడు.

(ఇదీ చదవండి: థియేటర్లలో హిట్.. ఓటీటీకి వచ్చాక ఘోరంగా ట్రోల్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement