మాస్ మహారాజా రవితేజకు ‘ఇరుముడి’ విజయం మంచి ఊరటనిచ్చింది. వరుస పరాజయాలతో కొంతకాలంగా సతమతమవుతున్న ఆయనకు ఈ సినిమా ఓ విజయాన్ని తెచ్చిపెట్టింది. తొలి వీకెండ్ పూర్తయ్యే సరికి కళ్లు చెదిరే కలెక్షన్లు రాబెట్టింది. ఇప్పుడు రవితేజ తదుపరి సినిమాపై ఆసక్తి నెలకొంది.
త్వరలో హసిత్ గోలీ దర్శకత్వంలో శ్రీ విష్ణుతో కలిసి రవితేజ కనిపించనున్నట్లు సమాచారం. ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తీయబోయే ఈ సినిమాను దిల్‌రాజు నిర్మాతగా ఉండనున్నట్లు టాక్.
ఈ సినిమాను తొలిత ఆగస్టు చివరిలో ప్రారంభించాలని మేకర్స్ భావించారట. కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.


