కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆదివారం జైపూర్‌లో జరిగిన అందాల పోటీల ఫైనల్‌లో 52 మంది అందగత్తెలను ఓడించి జాతీయ టైటిల్‌ను గెలుచుకున్నారు. కజియా లిజ్ మెజో కొత్త మిస్ యూనివర్స్ ఇండియా 2026గా నిలిచారు.
అయితే ఆమె గెలుపుకి కారణమైన సన్నివేశంకి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అదేంటంటే అందులో కజియాకే కిరీటాన్ని కట్టబెట్టేలా చేసిన ఆసక్తికర ప్రశ్న అందర్నీ ఈమితంగా ఆకర్షించింది. నిజానికి మిస్ యూనివర్స్ ఇండియా ప్రకారం, ఈ ఏడాది ఫైనలిస్టులకు 20 ప్రశ్నలు ఇచ్చి..వారికి సమాధానాలు రాయడానికి 90 నిమిషాల సమయం ఇచ్చారు. అయితే కజియా రెండుప్రశ్నలకు ఇచ్చిన సమాధానం న్యాయనిర్థేతల మనసునే గెలుచుకుంది. అవేంటో చూసేద్దామా.
యాక్ట్ నౌ వ్యవస్థాపకుడు, గ్లామనంద్ గ్రూప్‌లో సోషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ అయిన రాజీవ్ కె. శ్రీవాస్తవ మీ జీవితంలో నిశ్శబ్దం ధ్వనిని వర్ణించగలరా అని అడగగా..అందుకు కజియా ఇలా సమాధానం ఇచ్చింది. "నాకు, నిశ్శబ్దం అంటే, నేను కొద్ది నిమిషాల క్రితం ఈ వేదికపైకి ప్రవేశించే ముందు అనుభవించిన ప్రశాంతతనే నిశబ్దంగా విశ్వసిస్తా. ఎందుకంటే నేను ఒక శాస్త్రీయ నృత్యకారిణిగా, ఒక నటిగా, అందాల పోటీల ప్రేమికురాలిగా వేదికపైనే పుట్టి పెరిగాను.
అందువల్ల ఈ వేదికపైకి అడుగు పెట్టే ముందు నిశ్శబ్దాన్ని, ప్రశాంతతను, అత్యంత ప్రశాంతమైన స్థితిని అనుభవిస్తాను. ఎందుకంటే అది నాకు నా సొంత ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. నా దృష్టిలో, అదే నిశ్శబ్దం. అని ఆమె చాలా అద్భుతంగా చెప్పారామె.
అలాగే కజియా తన తన దృష్టిలో అందం అంటే ఏంటో కూడా పంచుకున్నారు. ఆమె ఇలా అన్నారు, "నా దృష్టిలో, నిజమైన అందం అంటే దృఢ సంకల్పం; ధైర్యం, పదే పదే పైకి లేవాలనే నిశ్శబ్ద నిర్ణయం, ఏదైనా సాధించడానికి ముందే నమ్మకం ఉంచడం. అలాగే నా దృష్టిలో, అందమైన ఆత్మవిశ్వాసంతో ఉండటం అంటే సాహసంతో ఉండటమని అర్థం." అని సగర్వంగా చెప్పారామె.
(చదవండి: ట్రావెల్ వీడియోల్లో ఇంత కిక్ ఉందా? ఏడాదికి రూ.85 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్నే..)


