పెళ్లిలో అనూహ్య పరిణామం : పెళ్లి దుస్తుల్లోనే వధువు చికిత్స | Kerala bride in wedding attire attends to catering workers who fell ill | Sakshi
Sakshi News home page

పెళ్లిలో అనూహ్య పరిణామం : పెళ్లి దుస్తుల్లోనే వధువు చికిత్స

Aug 22 2026 2:54 PM | Updated on Aug 22 2026 3:29 PM

Kerala bride in wedding attire attends to catering workers who fell ill

వివాహ వేడుకలో ఇద్దరికి అస్వస్థత 

పెళ్లి దుస్తుల్లోనే వధువు చికిత్స 

కేరళలోని పనూర్‌లో డా. షిరీన్, డా. రిజాజ్‌ల వివాహ వేడుకలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. తన వివాహ వేడుకలో అనారోగ్యానికి గురైన ఇద్దరు కేటరింగ్‌ సిబ్బందికి ప్రథమ చికిత్స అందించేందుకు పెళ్లి వేడుకలను కాసేపు నిలిపివేయడం విశేషంగా నిలిచింది. పెళ్లి దుస్తుల్లోనే ఉన్న వధువు డా. షిరీన్ సకాలంలో వైద్యం అందించి అందరి మన్ననలు అందుకున్నారు. అంతేకాదు కొత్త పెళ్లికొడుకు, భర్త రిజాజ్‌ కూడా ఆమెనుకొనియాడారు కేరళమ్‌లోని కన్నూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

కన్నూర్‌ జిల్లా పనూర్‌కు చెందిన డాక్టర్‌ షిరిన్‌ సుబాయిర్‌కు డాక్టర్‌ రియాజ్‌తో పెళ్లి జరుగుతోంది. ఆ సమయంలో విందు వడ్డించే బృందంలో ఉన్న ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది తెలిసిన వెంటనే పెళ్లి దుస్తుల్లో ఉన్న డాక్టర్‌ షిరిన్‌ అక్కడికి చేరుకున్నారు. ఇద్దరిలో ఒకరికి ముక్కు నుంచి రక్తం వస్తుండగా మరొకరు స్పృహతప్పి పడిపోయారు. ముక్కు నుంచి రక్రస్రావం ఆగేందుకు ముందుకు వంగి ముక్కులోని మెత్తడి భాగాన్ని 15 నిమిషాలు గట్టిగా పట్టుకోవాలని, ఆ సమయంలో నోటి ద్వారా శ్వాస పీల్చుకోవాలని సూచించారు. మరో మహిళను వెల్లకిలా కాళ్లు కాస్తంత ఎత్తులో ఉంచి పడుకోవాలని సూచించారు. వారిద్దరికీ కాస్త స్వస్తత చేకూరాక, ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వారికి పురమాయించారు.

ఇదీ చదవండి: 16 ఏళ్లకే 275 కిలోలు బరువు : రెండు నెలల్లో 50 కిలోలు తగ్గాడు
 

 ఇదంతా కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘ఆ సమయంలో వారికి అక్కడ ఏది అత్యవసరమో అదే చేశా. ఇందులో నా గొప్పతనమేదీ లేదు. ఎవరికైనా ఇలా చేస్తా. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడం కంటే ముందుగా ఇలాంటి చిన్నచిన్న పనులు చేస్తే, వారికి ప్రమాదం చాలా వరకు తప్పుతుంది’అని డాక్టర్‌ షిరీన్‌ అంటున్నారు. ప్రస్తుతం ఈమె ఒట్టపాలెంలోని వల్లువనాడ్‌ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ మెడిసిన్‌ విభాగంలో ఎండీ ఫస్టియర్‌ చేస్తున్నారు. భర్త డాక్టర్‌ రియాజ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఆస్పత్రిలో మెడిసిన్‌ పీజీ చేస్తున్నారు.  

ఇదీ చదవండి: మూడేళ్ల నుంచే వేధింపులు, చివరికి 70 కిలోలు తగ్గింది కానీ నరకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement