breaking news
Miss Universe India
-
మిస్ యూనివర్స్‌కు మన తెలుగు తేజాలు
త్వరలో థాయిలాండ్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025 కోసం భారత్ నుంచి మిస్ యూనివర్స్ ఇండియాను ఎంపిక చేయడానికి పోటీలు జరిగాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనలిస్టుల ఎంపికలో మిస్ యూనివర్స్ తెలంగాణగా కశ్వి, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్‌గా ప్రకృతి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు..సుస్మితాసేన్ స్ఫూర్తినేను మెడికల్ స్టూడెంట్‌ని. మోడల్ గా కూడా రాణిస్తున్నాను. శాస్త్రీయ నృత్యమూ నేర్చుకున్నాను. అందాల పోటీలు అంటే కేవలం బ్యూటీ గురించి మాత్రమే కాదు. మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం, సమాజానికి మంచి చేయాలనే ఆలోచన, జీవన నైపుణ్యాల వృద్ధి.. ఇలా అన్నింటిపై ఫోకస్ ఉంటుంది. అందుకే నేను దీనిమీద దృష్టి పెట్టాను. నేను పుట్టి పెరిగింది అమెరికాలో. మా అమ్మానాన్నలు తెలంగాణ వాసులు. మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెలా ఎదగాలన్నది నా డ్రీమ్. అందుకే నన్ను నేను నిరూపించుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. ఈరోజుల్లో ప్రజల్లో మానసిక అనారోగ్యం బాగా పెరుగుతోంది. దీనిపై చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్నాను. అలాగే గృహహింస పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాను. వీటితో పాటు మూగ, చెవిటి వారికి సహాయకారిగా ఉంటూ వారి వృద్ధికి కృషి చేస్తున్నాను. ఈ విషయాలు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి. తెలంగాణకు రావడానికి ముందే మా పేరెంట్స్ నుంచి, బుక్స్ నుంచి తెలంగాణ గొప్పతనం గురించి తెలుసుకున్నాను. ఇక్కడికి రావడం విజేతగా నిలవడం... చాలా సంతోషంగా ఉంది.– కశ్వి, మిస్ యూనివర్స్ తెలంగాణకాన్ఫిడెన్స్ ముఖ్యంకళ్ళు మూసినా, తెరిచినా కిరీటమే కళ్ళ ముందుండేది. ఫైనలిస్ట్‌గా ఎంపికయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. పోటీలో మన మాటల్లో, నడకలో, ప్రవర్తనలో కాన్ఫిడెన్స్ నే ప్రధానంగా చూస్తారు. ఫైనల్ రౌండ్లో... త్యాగం, పాజిటివిటీ, నెగెటివిటీల గురించి అడిగారు. త్యాగం అనేది ఎప్పుడూ గొప్పదే. మన జీవితంలో చిన్న చిన్న త్యాగాలు చేస్తుంటాం. కానీ, త్యాగం వల్ల మన సెల్ఫ్ హ్యాపీగా లేకపోతే చేయకూడదు అని నేను చెప్పడం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. గత ఏడాది ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ నుంచి పోటీ చేసి గెలు పొందాను. ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికయ్యాను. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, భాష.. ఇలా అన్నింటి గురించి తెలిసుండాలి. అమ్మానాన్న బెంగళూరులో ఉంటారు. అమ్మ వర్కింగ్ విమెన్, అక్క ప్రేరణ నాకు బ్యాక్ బోన్ అని చెప్పవచ్చు. అంతగా ఎంకరేజ్ చేస్తారు. బీకామ్‌లో డిగ్రీ చేశాను. డాన్స్ అంటే ఇష్టంతో డాన్స్ కోర్సు చేశాను. బెంగళూరులో డాన్స్ స్టూడియో ఉంది. రియాలిటీ షో చేశాను, నేను నటించిన సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. నన్ను ఆల్ రౌండర్ అని నా ఫ్రెండ్స్ అంటుంటారు. బ్యూటీ అంటే ఫిజికల్‌గా కనిపించేదే కాదు.. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ . దానినే అన్నింటికన్నా భిన్నంగా చూపగలగాలి.–ప్రకృతి కంబం, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్– నిర్మలారెడ్డిఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
స్వతంత్ర భారతి: 1994/2022 సౌందర్య కిరీటాలు
సౌందర్య కిరీటాలు ప్రపంచ వేదిక మీద భారతీయ సౌందర్యం విరాజిల్లింది. సుస్మితాసేన్ విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకోవడం, ఆ వెంటనే ఐశ్వర్యా రాయ్ ప్రపంచ సుందరిగా వన్నెకెక్కడంతో అంతర్జాతీయ అందాల పోటీలలో భారతదేశం విజయ బావుటా రెపరెపలాడటం మొదలైంది. అప్పటికి 28 ఏళ్ల కిందట రీటా ఫారియా ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా అవతరించారు. ఆ సందర్భం దేశ ప్రజల స్మృతిపథంలో చెరిగిపోతున్న దశలో 1994 లో దేశం నుంచి సరికొత్త అందాల రాణులు ప్రపంచ వేదికల మీద రాణించడం మొదలైంది. ఆ ఏడాదితో భారతదేశంలో అందాల తయారీ పరిశ్రమ ఊపందుకుంది. భారతీయ యువతులను ఈత దుస్తుల్లో మెరిసిపోయే సుందరాంగులుగా తీర్చిదిద్దడం మొదలైంది. ఆ పరిశ్రమ ఫలితాలుగా డయానా హైడెన్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, లాలా దత్తా, మానుషీ చిల్లర్ మన ప్రపంచ సుందరీమణులుగా విజేతలౌతూ వస్తున్నారు. ఆ ప్రకంపనలు దేశవ్యాప్తంగా రెండు రకాలైన ప్రతిధ్వనులుగా వినిపించాయి. ఒకటి అనుకూలం. ఇంకోటి ప్రతికూలం. సైన్యంలోకి పృథ్వి పృథ్వి క్షిపణిని భారత సైన్యంలోకి ప్రవేశపెట్టారు. ‘రిపబ్లిక్ డే’ని అందుకు తగిన సందర్భంగా ఎంచుకుని ఢిల్లీ పరేడ్ గ్రౌండ్స్‌లో పృథ్విని ప్రదర్శించారు. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌కి శంకర్ పేరు) -
హర్నాజ్ను విశ్వ సుందరిగా నిలిపిన ప్రశ్న ఇదే...!
Miss Universe 2021 Harnaaz Sandhu Won Crown to This Final Question: ఇజ్రాయేల్ ఇలాట్ వేదికగా జరిగిన 70వ విశ్వ సుందరి వేడుకల్లో భారత యువతి హర్నాజ్ సంధు కిరీటం దక్కించుకుంది. విశ్వ సుందరి పోటీల్లో విజేతగా నిలిచిన మూడో భారత యువతిగా నిలిచింది హర్నాజ్. గతంలో సుస్మితా సేన్, లారా దత్తా ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. తాజాగా జరిగిన పోటీల్లో 80 మందిని వెనక్కి నెట్టి.. కిరీటం గెలుచుకున్నారు హర్నాజ్. హర్నాజ్‌కు కిరీటాన్ని అందించిన ప్రశ్న ఏంటనే ఆసక్తి ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇక ఫైనల్ రౌండ్లో ముగ్గురు ఫైనలిస్ట్‌లు మిగిలారు. వీరిని జడ్జిలు ‘‘ఈ షో చూస్తున్న మహిళలుకు మీరిచ్చే సలహా ఏంటని’’ ప్రశ్నించారు. మిస్ సౌత్ ఆఫ్రికా, మిస్ పరాగ్వేతో పాటు మిస్ ఇండియా హర్నాజ్ చక్కగా సమాధానమిచ్చి పోటీ రౌండ్లను ముగించారు. ముగ్గురిలో అత్యుత్తమ సమాధానం చెప్పిన హర్నాజ్ను కిరీటం వరించింది. ఆమెను విజేతగా ప్రకటించి.. మిస్ మెక్సికో నుంచి కిరీటాన్ని మిస్ ఇండియా హర్నాజ్‌కు అందించారు. (చదవండి: మిస్ యూనివర్స్‌గా భారత యువతి) హర్నాజ్ యువతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు.. తమను తాము నమ్మకపోవడం. మీకు మీరే ప్రత్యేకం అని నమ్మండి.. అదే మిమ్మల్ని అందంగా చేస్తుంది. ఇతరులుతో పోల్చుకోవడం ఆపేసి.. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి మాట్లాడండి. భయాల నుంచి బయటకు రండి.. మీ గురించి మీరే మాట్లాడండి.. ఎందుకంటే మీ జీవితానికి మీరే లీడర్. మీకు మీరే గొంతుక. నన్ను నేను నమ్మాను.. అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నిల్చోగలిగాను’’ అని సమాధానమిచ్చారు హర్నాజ్. (చదవండి: మిలీనియం గర్ల్.. మిస్ యూనివర్స్ అవుతుందా..?) The new Miss Universe is...India!!!! #MISSUNIVERSE pic.twitter.com/DTiOKzTHl4 — Miss Universe (@MissUniverse) December 13, 2021 హర్నాజ్ సమాధానం జడ్జిలతో పాటు ప్రజలకు నచ్చింది. దాంతో మిస్ ఇండియా హర్నాజ్ కౌర్ సంధును విజేతగా స్టీవ్ హార్వే ప్రకటించగానే, స్టేడియం మొత్తం సందడి నెలకొంది. తన పేరును విజేతగా ప్రకటించిన వెంటనే హర్నాజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మిస్ మెక్సికో ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్ 2021గా హర్నాజ్‌కి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీలో మొదటి రన్నరప్‌గా మిస్ పరాగ్వే, రెండో రన్నరప్‌గా మిస్ సౌత్ ఆఫ్రికా నిలిచారు. సోమవారం ఉదయం పోటీ ప్రారంభమైనప్పుడు, హర్నాజ్ మొదట్లో టాప్ 16కి చేరుకుంది. స్విమ్‌సూట్ రౌండ్ తర్వాత, ఆమె టాప్ 10లో నిలిచారు. చదవండి: ఏయ్ నిన్నే..మెషిన్ అరుస్తోంది నిజం చెప్పు -
మిస్ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్ సంధు
-
మిస్ యూనివర్స్‌గా భారత యువతి
సాక్షి, న్యూఢిల్లీ: 130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం చేసి.. విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది భారత యువతి హర్నాజ్ సంధు. ఇజ్రాయేల్‌లోని ఇలాట్ నగరంలో జరిగిన డెబ్బయ్యవ మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది హర్నాజ్ సంధు. 80 మందితో పోటి పడి విజేతగా నిలిచింది హర్నాజ్ సంధు. ఇటీవలే లివా మిస్ దివా యూనివర్స్‌గా నిలిచింది మిలీనియం గర్ల్ హర్నాజ్. (చదవండి: మిలీనియం గర్ల్.. మిస్ యూనివర్స్ అవుతుందా..?) 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. సుస్మితాసేన్, లారాదత్త తర్వాత మిస్ యూనివర్స్‌గా నిలిచిన మూడో భారత యువతి హర్నాజ్. 17 ఏళ్లకే మోడలింగ్ ప్రారంభించని హర్నాజ్.. పలు పంజాబీ చిత్రాల్లో కూడా నటించింది. The new Miss Universe is...India!!!! #MISSUNIVERSE pic.twitter.com/DTiOKzTHl4 — Miss Universe (@MissUniverse) December 13, 2021 చదవండి: దుమ్ము రేపుతున్న ఇజ్రాయెల్ పాప్ సింగర్.. మిలీనియం గర్ల్ హర్నాజ్ కౌర్ సంధు చంఢీఘర్‌లోని పంజాబీ కుటుంబంలో 2000 సంవత్సరంలో జన్మించింది. శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసింది. తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. హర్నాజ్ చిన్నప్పటి నుంచి యోగా ఔత్సాహికురాలేగాక, ఫిట్నెస్ లవర్. గుర్రపు స్వారీ, ఈత, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్ లను అమితంగా ఇష్టపదేది. ఏమాత్రం ఖాళీ దొరికినా వీటిలో ఏదో ఒక దానిలో లీనమైపోయేది. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక తనది.. దీంతో 17 ఏళ్లకే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. కాలేజీలో తొలి స్టేజ్ ప్రదర్శనతో తన మోడలింగ్ జర్నీ ప్రారంభమైంది. ఒకపక్క మోడలింగ్ చేస్తూనే అనేక ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని 2017లో ‘మిస్ చంఢీఘర్’ కిరీటాన్ని గెలుచుకుంది. నటిగానూ.. హిందీ, పంజాబీ, ఇంగ్లిష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలిగిన హర్నాజ్ ఒకపక్క మోడలింగ్ చేస్తూనే సినిమాల్లో నటించే అవకాశాలను పొందింది. ‘బాయి జీ కుట్టాంగే, యారా దియా పూబరన్’ అనే పంజాబీ సినిమాలలో నటించింది, ఇవి వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హార్నాజ్కు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. అందుకే పర్యావరణాన్ని కాపాడండి అని గొంతెత్తి చెబుతోంది. ఇప్పటిదాకా పాల్గొన్న అందాల పోటీల్లో పర్యావరణంపై అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతూ న్యాయ నిర్ణేతల మనసులు గెలుచుకుంది. ‘ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని చెప్పడమే కాక.. ఆ మాటలను నిజం చేసి చూపింది హర్నాజ్. -
తెలుగు తెరపై మరో అందాల సుందరి
అందాల సుందరి టైటిల్ గెల్చుకున్న ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్ వంటివారు సినిమాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అందాల సుందరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. ఈ బ్యూటీ పేరు శిల్పా సింగ్. రెండేళ్ల క్రితం ‘ఐయామ్ షి-మిస్ యూనివర్శ్ ఇండియా టైటిల్ గెల్చుకున్న ఆమె ఓ తెలుగు చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ఎమ్.జి. మరియు ఎమ్.ఎస్. సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనూప్ బండారీ దర్శకుడు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘శిల్పా సింగ్ ప్రధాన పాత్ర చేయనున్న ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో కీలక పాత్ర చేయనున్నారు. నిరూప్, అవంతికా శెట్టి, రాధికా చేతన్ హీరో, హీరోయిన్లు. ‘వర్డ్స్’ అనే షార్ట్ ఫిలింతో పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న అనూప్‌ని మా సంస్థ ద్వారా దర్శకునిగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: మురళి గంధర్వ, సంగీతం: ఆగం రాక్ బ్యాండ్.