
మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని మణిక విశ్వకర్మ గెలుచుకున్నారు. గత ఏడాది విజేత రియా సింఘా ఆమెకు కిరీటం అలంకరించారు. తాజాగా జైపుర్ వేదికగా జరిగిన ఈ పోటీలో ఆమె గెలుపొందారు. ఈ ఏడాదిలో థాయ్‌లాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మణిక విశ్వకర్మ బరిలొకి దిగనున్నారు. భారత్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు.
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందిన మణిక ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. ఆమె పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఆమె NCC క్యాడెట్ కూడా.. న్యూరోనోవా అనే సంస్థను స్థాపించి ADHD వంటి న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి సహాయం అందిస్తున్నారు. మణిక విశ్వకర్మ అందం, ప్రతిభ, సేవా భావనతో మిస్ యూనివర్స్ వేదికపై భారత్‌కు గర్వకారణంగా నిలవనున్నారు.