యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న తాజా పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నాగబంధం డివైన్, యాక్షన్, అద్భుతమైన విజువల్ ఫీస్ట్ తో ఒక మ్యాసీవ్ సినిమాటిక్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం టీం నానక్‌రామగూడలోని రామానాయుడు స్టూడియోలో గూస్‌బంప్స్ పుట్టించే క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తోంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించేందుకు మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారు.
కేవలం క్లైమాక్స్ కోసమే 20 కోట్లు ఖర్చు చేస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా విజువల్ గా అద్భుతంగా చూపించేలా డిజైన్ చేశారు.
అద్భుతమైన యాక్షన్‌కు ప్రసిద్ధిగాంచిన థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్‌డీని టీం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఆయన బెర్త్ టేకింగ్ యాక్షన్ కొరియోగ్రఫీతో సీక్వెన్స్ ని గ్రాండ్ గా తీర్చిదిద్దితున్నారు. ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలతో ఈ సీక్వెన్ అద్భుతంగా, విజువల్‌గా మైండ్ బ్లోయింగ్ ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో నభా నటేష్ , ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ,బి.ఎస్. అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


