టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టాలీవుడ్ ఆడియన్స్‌ను అలరించింది. అయితే సంక్రాంతి వస్తున్నాం హిట్ తర్వాత వెంకీ మామ ఇటీవలే మరో మూవీని ప్రకటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఆయన నటిస్తున్నారు.
మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్లోనూ వెంకీ మామ సందడి చేయనున్నారు. అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీలో ఓ కీలక పాత్రలో వెంకీమామ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు షూటింగ్కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు హీరో వెంకటేశ్. మనశంకర వరప్రసాద్ చిత్రంలో నా పాత్ర షూటింగ్ ముగిసిందని ట్వీట్ చేశారు.
వెంకటేశ్ తన ట్వీట్లో రాస్తూ..'మనశంకరవరప్రసాద్ మూవీ కోసం ఈరోజు నా పాత్రను ముగించా. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం. నాకు ఇష్టమైన మెగాస్టార్తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం నాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను మిగిల్చింది. ఎన్నో రోజులుగా మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పంచుకోవాలనే కోరిక ఉండేది. చివరికీ ఈ ప్రత్యేక చిత్రం కోసం అనిల్ రావిపూడి మమ్మల్ని ఒకచోట చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 2026 సంక్రాంతిని మీ అందరితో థియేటర్లలో చూసేందుకు వేచి ఉండలేకపోతున్నా' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది.
Wrapped up my part today for #ManaShankaraVaraPrasadGaru, and what an incredible experience it has been! Working with my favourite @KChiruTweets was an absolute joy and this film has left me with so many lovely memories. It was long overdue to share the screen with ‘Megastar… pic.twitter.com/KAzWcXGBeK
— Venkatesh Daggubati (@VenkyMama) December 3, 2025


