ఓటీటీల్లో చాలావరకు థ్రిల్లర్ కంటెంట్‌ని ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకు తగ్గట్లే దర్శకనిర్మాతలు కూడా ఇదే జానర్‌లో సినిమాలు, సిరీస్‌లు తీస్తుంటారు. అలా ఇప్పుడు తెలుగు, తమిళంలో రాబోతున్న మర్డర్ మిస్టరీ సిరీస్ 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్'. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. దీంతో స్టోరీ ఏంటో చూచాయిగా తెలిసింది.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన రష్మిక దెయ్యం సినిమా)
తమిళ నటులు అశ్విన్, శ్రీతు కృష్ణన్, గురు ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు చేశారు. జస్విని దర్శకత్వం వహించారు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్.. ఈ శుక్రవారం నుంచి తెలుగు, తమిళంలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అలానే ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది.
ట్రైలర్ బట్టి చూస్తే.. ధూల్ పేట్ అనే ఊరిలో ఓ రోజు రాత్రి మూడు హత్యలు జరుగుతాయి. వీటిని దర్యాప్తు చేసేందుకు ఓ ఏసీపీని అపాయింట్ చేస్తారు. అయినా సరే నిందితుల్ని కనుగొనలేకపోతాడు. దీంతో మరో ఏసీపీని కూడా కేసుని దర్యాప్తు చేసేందుకు నియమిస్తారు. తర్వాత ఏమైంది? ఇంతకీ హత్యలు చేసింది ఎవరనేది పోలీసులు కనుగొన్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: రోజుకు 500 కాల్స్.. తలనొప్పిపడలేక వీడియో చేశా: హేమ)


