ప్రభాస్ 'రాజాసాబ్' రిలీజ్ టైమ్ ఫిక్స్ అయింది. లెక్క ప్రకారం ఈ వారమే థియేటర్లలోకి రావాలి. కానీ సంక్రాంతికి రావాలని నిర్ణయించుకుని.. విడుదల తేదీని జనవరి 9కి మార్చారు. ఇప్పటికే ఓ ట్రైలర్ రాగా బాగానే రెస్పాన్స్ వచ్చింది. కానీ కొన్నిరోజుల క్రితం రిలీజైన తొలి పాట మాత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సరే ఇవన్నీ పక్కనబెడితే తాజాగా యూఎస్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో ఓ విషయంలో ఫ్యాన్స్‌కి క్లారిటీ వచ్చేసింది.
'రాజాసాబ్' ఓవర్సీస్‌కి సంబంధించిన టికెట్లని తాజాగా ఆన్‌లైన్‌లో పెట్టేశారు. ఈ క్రమంలోనే మూవీ రన్ టైమ్ ఎంతో బయటపడింది. 3 గంటల 10 నిమిషాల నిడివితో సినిమా రాబోతుందని క్లారిటీ వచ్చింది. గతంలో మూడున్నర గంటలకు పైనే ఉండొచ్చని అన్నారు. ఇప్పుడు ఫైనల్‌గా ఈ టైమ్‌కి ఫిక్సయ్యారనమాట.
(ఇదీ చదవండి: నేనంటే చిన్నచూపు.. స్టేజీపై ఏడ్చేసిన నందు)

గత కొన్నేళ్లలో అర్జున్ రెడ్డి, పుష్ప 2, యానిమల్ తదితర చిత్రాలు 3 గంటలకు పైగా రన్ టైమ్‌తోనే థియేటర్లలోకి వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి. అవన్నీ డిఫరెంట్ జానర్స్. 'రాజాసాబ్' కూడా 3 గంటలకు పైనే ఉన్న పెద్ద మూవీ. కంటెంట్ పరంగా మెప్పిస్తే పర్లేదు లేదంటే మాత్రం చూసే ప్రేక్షకులు ఇబ్బంది పడే అవకాశముంది. ఈ ఒక్క విషయంలో మాత్రం కాస్త టెన్షన్. మరి 3 గంటల పాటు టీమ్ ఏ రేంజులో మెప్పిస్తారో తెలియాలంటే మరో నెల ఆగాల్సిందే.
'రాజాసాబ్'లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా చేశారు. తమన్ సంగీతమందించగా.. మారుతి దర్శకత్వం వహించారు. హారర్ ఫాంటసీ కామెడీ కథతో దీన్ని తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ పెట్టింది. సంక్రాంతి బరిలో తొలుత రాబోతున్న సినిమా ఇదే. తర్వాత మిగతా చిత్రాలు థియేటర్లలోకి వస్తాయి.
(ఇదీ చదవండి: అత్తారింట్లోకి సామ్.. రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్)


